mlc pilli subhash chandra bose
-
బోస్‌ను పరామర్శించిన జగన్
హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరి స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గుండె రక్తనాళాల్లో సమస్య ఉండడంతో బోస్‌కు మంగళవారం నిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శేషగిరిరావు బృందం శస్త్ర చికిత్స నిర్వహించి రెండు స్టెంట్లు వేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జగన్ వెంట పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పిరెడ్డి, సునీల్‌లు ఉన్నారు. -
సబ్‌ప్లాన్ నిధులు మళ్లించడమేంటి?
మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బోస్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీల సంక్షేమానికి మాత్రమే పూర్తిగా ఖర్చు పెట్టాల్సిన సబ్‌ప్లాన్ నిధులను మండల కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ గదుల ఏర్పాటుకు మళ్లించడం ఏమిటని శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జరిగిన చర్చలో బోస్ మాట్లాడుతూ.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సబ్‌ప్లాన్‌కు కేటాయించిన నిధుల్లో రూ.30.79 కోట్లను మండల కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఏర్పాటుకు ఖర్చు పెట్టారని సభ దృష్టికి తీసుకొచ్చారు. మరో రూ.15.82 కోట్ల సబ్‌ప్లాన్ నిధులను ప్రభుత్వ కాలేజీ భవనాల నిర్మాణాలకు వినియోగించారన్నారు. 2016-17 బడ్జెట్ ప్రతిపాదనలో సబ్‌ప్లాన్ నిధుల్లో రూ.612 కోట్లు తోటపల్లి రిజార్వాయర్‌కు, మరో రూ. 2,000 కోట్లు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించారన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల ఖర్చు తీరిదేనా? అని ప్రశ్నించారు. దీనికి మంత్రి రావెల జవాబిస్తూ, సభ్యులు సాంఘిక సంక్షేమశాఖ గురించి ప్రశ్న అడిగి సబ్‌ప్లాన్ గురించి మాట్లాడుతున్నారని, దానిపై ఇంకోసారి చర్చిద్దామన్నారు. స్కాలర్షిప్ చార్జీలు పెంచుతాం..: పెరిగిన ధరల నేపథ్యంలో హాస్టల్ విద్యార్థులకు స్కాలర్షిప్ చార్జీలను 10-15% పెంచనున్నట్లు మంత్రి రావెల మండలిలో చెప్పారు. -
ఇక సమరమే..
రామచంద్రపురం :విభిన్న అంశాలకు వేదికగా ఉండే రామచంద్రపురం నియోజకవర్గంలో మరోసారి భిన్న పరిస్థితులు నెలకుంటున్నాయి. నియోజకవర్గంలో 30 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ మొట్టమొదటిగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇంత వరకు ఏకపక్షంగా సాగిన పాలనకు బోస్ ఎమ్మెల్సీగా రావటంతో తెరపడనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన సత్కార సభలో ఇక సమరమే అన్నట్టుగా సాగిన బోస్ ప్రసంగం మరింత బలం చేకూరుస్తుందంటున్నారు. సాధారణ ఎన్నికలు జరిగిన ఏడాదికి ఎమ్మెల్సీ పదవిని పొందిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత బోస్ తన సాధారణ శైలికి భిన్నంగా ప్రసంగించిన తీరు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. గత నెల 30న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సుభాష్‌బోస్ ఈ నెల 2న నియోజకవర్గానికి విచ్చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గం నలుమూలల నుంచి ఊహించని విధంగా, అభిమానులు ప్రజలు తరలివచ్చిన తీరు టీడీపీ ప్రభుత్వంపైనా, స్థానిక నేత పైనా పెరుగుతున్న అసంతృప్తిని తెలియజేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అధికార పార్టీ నేతలు నివ్వెరపోయేలా జరిగింది బోస్ స్వాగత సత్కార ర్యాలీ. ఈ నెల 2న ద్రాక్షారామలో జరిగిన సత్కార సభలో బోస్ ఎన్నడూ లేని విధంగా మాట్లాడడం అటు అధికార పార్టీ నాయకుల్లోను, అధికారుల్లోనూ గుబులు రేపుతోంది. నిబద్ధతకల నేతగా ఉండే బోస్ ఒక్కసారిగా హెచ్చరికలు జారీ చేయటంతో అధికార పార్టీ నేతలకు, వారికి వంత పాడుతున్న అధికారులకు రాబోయే కాలంలో జరిగే పరిణమాలను ముందుగానే ఎలాగుంటాయోననే భయం ఏర్పడుతుందని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. చట్ట ప్రకారం పనిచేయండని ఎప్పుడూ అధికారులకు చెప్పే ఎమ్మెల్సీ బోస్‌కు..... నేను చెప్పిందే చేయాలనే స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు మధ్య అధికారులు నలిగిపోక తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. గత ఏడాది కాలంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో పరిస్థిలు అధ్వానంగా మారిపోయాయి. స్థానిక అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదంగా మారింది. వైఎస్సార్సీపీ నాయకులపైనా, కార్యకర్తలపైనా కేసులు పెట్టి వేధింపులకు గురిచేయటం షరా మామూలుగా మారింది. వైఎస్సార్సీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులను వేధింపులకు గురిచేస్తు వారి చెక్ పవర్లను కూడా రద్దు చేయటం, రేషన్‌షాపు లెసైన్సులను రద్దు చేయటం వంటి కార్యక్రమాలు అధికార పార్టీ నేతలు చేపట్టారనే విమర్శలుకూడా ఉన్నాయి. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన సమయంలో పట్టంచుకోకుండా ఉన్న అధికారుల తీరు బోస్‌ను మారే విధంగా చేశాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తన కార్యకర్తలకు గానీ, ప్రజలకు గానీ అధికారులను అడ్డం పెట్టుకుని అన్యాయం చేస్తే ఊరుకునే స్థితిలో లేననే సంకేతాలను బోస్ పంపించినట్టు స్పష్టమైందని స్థానిక నేతలు అంటున్నారు. నిబంధనల ప్రకారం పనిచేయకపోతే శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసి తాట తీస్తానని హెచ్చరించిన బోస్ మాటలు ఆ పార్టీ నేతల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపిందనే చెప్పాలి.ఎమ్మెల్సీ బోస్ నాయకత్వంలో పార్టీ నాయకులు ఇక అధికార పార్టీపై పోరాటానికి సిద్దమవుతున్నారనే చెప్పాలని పలువురు అంటున్నారు. -
రాజకీయంగా పునర్జన్మ
ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం సాక్షి, హైదరాబాద్ :రాజకీయంగా తనకు పునర్జన్మ లభించిందని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని శాసనమండలి చైర్మన్ చక్రపాణి చాంబర్లో బోస్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, పార్టీ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తప్పుడువాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు వాటిని విస్మరించి ఇష్టానుసారం పరిపాలిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తూ సమయం కోసం వేచి చూస్తున్నారని చెప్పారు. ఉభయగోదావరి జిల్లాల రైతుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించే పట్టిసీమ ప్రాజెక్టు వద్దని అందరూ చెబుతున్నా పెడచెవిన బెట్టి నిర్మాణానికి పూనుకోవడం దారుణమన్నారు. డెల్టా రైతులకు నష్టం కలిగించే ఈ ప్రాజెక్టును అవకాశం ఉన్న అన్ని వేదికలపైనా ప్రశ్నిస్తామన్నారు. గత ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లోనే టీడీపీకి ఎక్కువ స్థానాలు లభించాయని, అలాంటప్పుడు ఆ ప్రాంత ప్రయోజనాలకే నష్టం కలిగించడం ఏమిటని ప్రశ్నించారు.