బోస్‌ను పరామర్శించిన జగన్ | Jagan met to the Bose | Sakshi
Sakshi News home page

బోస్‌ను పరామర్శించిన జగన్

Published Thu, Apr 21 2016 4:17 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

బోస్‌ను పరామర్శించిన జగన్ - Sakshi

బోస్‌ను పరామర్శించిన జగన్

హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరి స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

గుండె రక్తనాళాల్లో సమస్య ఉండడంతో బోస్‌కు మంగళవారం నిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శేషగిరిరావు బృందం శస్త్ర చికిత్స నిర్వహించి రెండు స్టెంట్‌లు వేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జగన్ వెంట పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి,  అప్పిరెడ్డి, సునీల్‌లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement