mobile connections
-
55.5 లక్షల ఫేక్ మొబైల్ కనెక్షన్లు.. ప్రభుత్వం ఏం చేసింది?
దేశవ్యాప్తంగా 55.5 లక్షల ఫేక్ మొబైల్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించి తొలగించింది. టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నకొద్దీ దాని దుర్వినియోగం, సైబర్ మోసాలు సైతం అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పడు చర్యలు తీసుకుంటోంది. టెలికాం వినియోగదారుల భద్రతకు సంబంధించి తీసుకున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటుకు తెలియజేసింది. నకిలీ, ఫోర్జరీ ధ్రువపత్రాలతో పొందిన మోసపూరిత మొబైల్ కనెక్షన్లను గుర్తించి తొలగించడానికి ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ అడిగిన ప్రశ్నకు కేంద్ర టెలికాం, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ వినియోగదారులు తమ పేరుతో జారీ అయిన అన్ని మొబైల్ కనెక్షన్లను సరిచూసుకుని మోసపూరితమైన, అవసరం లేని కనెక్షన్లను నివేదించడానికి అనుమతించే సంచార్ సాథీ పోర్టల్‌ను రూపొందించినట్లు వివరించారు. మొబైల్ కనెక్షన్లను విక్రయించేందుకు ఇప్పటికే ఉన్న కేవైసీ మార్గదర్శకాలను మరింత బలోపేతం చేస్తూ టెలికాం కంపెనీలకు సూచనలిచ్చినట్లు చెప్పారు. 55.5 లక్షల మొబైల్ కనెక్షన్ల తొలగింపు అంతేకాకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ మధ్య కాలంలో ఎస్సెమ్మెస్ ఆధారిత సైబర్ మోసాలను 36 శాతం కట్టడి చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభుత్వ తీసుకున్న చర్యల ఫలితంగా సుమారు 4 లక్షల మంది పౌరులు సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోకుండా రూ. 1,000 కోట్లకు పైగా రక్షణ కల్పించినట్లు పేర్కొన్నారు. ఇక నకిలీ గుర్తింపు పత్రాలతో పొందిన అలాగే 55.5 లక్షల మొబైల్ కనెక్షన్లు తొలగించినట్లు వివరించారు. వీటిలో బ్యాంక్‌లు, పేమెంట్ వాలెట్లకు లింక్ అయిన మొబైల్ కనెక్షన్లు 9.8 లక్షలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే వినియోగదారులు నివేదించిన 13.4 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్లు రీ వెరిఫికేషన్‌లో విఫలమవడంతో డిస్కనెక్ట్ చేసినట్లు చెప్పింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నివేదించిన ప్రకారం సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు మొత్తం 2.8 లక్షల మొబైల్ కనెక్షన్లు తొలగించడంతోపాటు 1.3 లక్షల మొబైల్ ఫోన్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు. -
70 లక్షల మొబైల్ కనెక్షన్లు రద్దు.. అసలు కారణం అదే..
మొబైల్ వాడకం రోజురోజుకు పెరుగుతోంది. దీంతోపాటే ఆన్లైన్ మోసాలు అదే స్థాయిలో హెచ్చవుతున్నాయి. హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు సామాన్యుల కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. వీళ్లు ప్రజలను మోసగించడానికి కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. ఆన్లైన్లో ఆర్థిక మోసాల్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం 70 లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దు చేసినట్లు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. ఆయా మొబైల్ నంబర్ల నుంచి అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నందునే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక సైబర్ భద్రత, పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలపై చర్చించిన సమావేశంలో బ్యాంకులు తమ వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలని జోషి సూచించారు. ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహిస్తూ, మోసాలకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. తదుపరి సమావేశం జనవరిలో ఉంటుందని చెప్పారు. ఆధార్ ఎనెబుల్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్) ద్వారా జరుగుతున్న మోసాలపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి, నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు వివిధ ఏజెన్సీలు సమన్వయంతో ఎలా ముందుకెళ్లాలలో ఈ సమావేశంలో చర్చించారు. ఇదీ చదవండి: అద్దెకు ఆమె సగం మంచం.. నెలకు రెంట్ ఎంతంటే..? ఈ సమావేశంలో భాగంగా డిజిటల్ చెల్లింపుల మోసాలపై జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) నమోదు చేసిన తాజా గణాంకాలను ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ వివరించింది. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల విభాగం, రెవెన్యూ విభాగం, టెలికాం విభాగం, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాల్లో డిజిటల్ మోసాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. -
Telangana: మొబైల్ కనెక్షన్లు 100కి 105..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టెలీ సాంద్రత నానాటికీ పెరిగిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలోనే తొమ్మిదో టెలీ సాంద్రత గల రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ లెక్కల ప్రకారం నవంబర్ 2022 నాటికి తెలంగాణలో మొత్తం 4.08 కోట్ల మంది టెలిఫోన్ వినియోగదారులున్నారు. అందులో 98 శాతం మంది వైర్లెస్ (మొబైల్) వినియోగదారులే. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 2.37 కోట్ల మంది టెలిఫోన్ వినియోగదారులుండగా, అందులో 96 శాతం మంది వైర్లెస్ ఫోన్లు వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే 1.70 కోట్ల మంది టెలిఫోన్ వాడుతుంటే అందులో 99.8 శాతం మందివి వైర్లెస్ ఫోన్లే. విశేషమేమిటంటే పట్టణ ప్రాంతాలతో పోలిస్తే సగటున మొబైల్ ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండడం విశేషం. ఇక, మొబైల్ కనెక్షన్ల విషయంలో తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలవగా, దేశంలో 9వ స్థానంలో నిలిచింది. ప్రతి 100 మంది జనాభాకు తెలంగాణలో 105 మొబైల్ కనెక్షన్లుండడం విశేషం. దక్షిణాదిన కేరళ తర్వాత దక్షిణ భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో టెలీ సాంద్రత ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. కేరళలో ప్రతి 100 మంది జనాభాకు 120 మొబైల్ ఫోన్లుండగా, తెలంగాణలో 105 మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. తమిళనాడులో 102, కర్ణాటక 97, ఆంధ్రప్రదేశ్‌లో 82 కనెక్షన్లు ఉన్నాయి. ఇక, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా మొబైల్ టెలీ సాంద్రత మనకంటే తక్కువగా ఉంది. మహారాష్ట్రలో ప్రతి 100 మంది జనాభాకు ఉన్న మొబైల్ కనెక్షన్లు 99 మాత్రమే. ఇక దేశంలో అత్యల్ప మొబైల్ సాంద్రత ఉన్న రాష్ట్రాల్లో బీహార్ (53), జార్ఖండ్ (58), మధ్యప్రదేశ్ (66), ఛత్తీస్‌గఢ్ (67), అసోం (69)లు నిలిచాయి. -
మొబైల్ ప్రీపెయిడ్ సేవలు మళ్లీ ప్రారంభం..!
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం 72 రోజుల తర్వాత రాష్ట్రంలో మొబైల్ ప్రీపెయిడ్ సర్వీసులు పునరుద్ధరించారు. దీనిప్రకారం సోమవారం నుంచి 40 లక్షల మొబైల్ ప్రీపెయిడ్ సేవలు తిరిగి వాడుకలోకి వచ్చాయి. అయితే, ఇంకా 20 లక్షల ఇంటర్నెట్ సేవలు, ప్రీపెయిడ్ కనెక్షన్లు మాత్రం పునరుద్దరించటానికి మరికాస్తా సమయం పట్టేలా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసే ముందు రోజు అనగా ఆగష్టు 4న జమ్మూకశ్మీర్ అంతటా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ రోజు నుంచి కశ్మీరీలు మొబైల్ కనెక్టీవిటీ లేకుండానే 72 రోజులు గడిపారు. తాజాగా ప్రభుత్వం రాష్టంలోని పరిస్థితిని సమీక్షించిన అనంతరం మొబైల్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియ కాస్తా భిన్నంగా ఉంటుందని, మొదట కేవలం బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలను మాత్రమే పునరుద్దరించినట్లు, అనంతరం ఇతర ప్రైవేట్ టెలికాం నెట్వర్క్ సేవలను పునఃప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సల్ తెలిపారు. అయితే ఆగష్టు 17వ తేదీనే జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొన్నిలైన్ల టెలిఫోన్ సేవలను, సెప్టెబర్ 4నాటికి 50 వేల ల్యాండ్‌లైన్ కనెక్షన్లను పునరుద్ధరించబడ్డాయి. కశ్మీర్లో ఆంక్షలు ఎత్తివేయడం, విద్యాసంస్థలు యథావిధిగా నడవడంతో రాష్ట్రంలోని పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. -
‘ఆధార్’ సవరణకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ఆధార్, రెండు అనుబంధ చట్టాల సవరణ బిల్లుకు లోక్‌సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ కనెక్షన్ పొందేందుకు పౌరులు ఆధార్ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదు. మొబైల్, బ్యాంకు సేవలకు ఆధార్ తప్పనిసరి కాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా చట్టంలో ఈ సవరణ చేశారు. ఆధార్‌తో పాటు టెలిగ్రాఫ్, మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టాల్లో సవరణలు చేశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తన ఆధార్ కార్డు చూపుతూ ‘ నా ఆధార్ కార్డులో నా పేరు, చిరునామా, నా తండ్రి పేరు మాత్రమే ఉన్నాయి. నా కులం, మతం, ఆరోగ్య పరిస్థితి ఇందులో లేవు. భారతీయులందరి ఆధార్ సురక్షితం. కోర్టు ఆదేశాలను పాటిస్తున్నాం’ అని భావోద్వేగంతో మాట్లాడారు. సవరణ చట్టంలో ఏముందంటే.. ► 18 ఏళ్లు నిండిన తరువాత ఆధార్‌ను రద్దుచేసుకునేందుకు మైనర్లకు అవకాశం. ► ఆధార్ వినియోగంలో నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు ► పౌరులు స్వచ్ఛందంగా సమకూర్చిన బయోమెట్రిక్ వివరాలు, ఆధార్ సంఖ్యను సర్వీస్ ప్రొవైడర్లు భద్రపరచరాదు ► ఆధార్ లేని కారణంగా బ్యాంక్, మొబైల్ సేవల్ని నిరాకరించరాదు ► వినియోగదారుల ఐడీ ధ్రువీకరణ కోసం మొబైల్ కంపెనీలు ఆధార్‌తో పాటు పాస్‌పోర్ట్ లేదా కేంద్రం జారీచేసే ఇతర పత్రాల్ని కూడా పరిశీలించొచ్చు -
కొత్త మొబైల్ కనెక్షన్లకు ఆధారే అవసరం లేదు..
న్యూఢిల్లీ: ఆధార్ కోసం పట్టుబట్టకుండా ఇతరత్రా ఏ గుర్తింపు ధృవీకరణ పత్రం ఆధారంగానైనా టెలికం ఆపరేటర్లు కొత్త మొబైల్ కనెక్షన్లు ఇవ్వొచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకోసం ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. ఆధార్‌ను ఉపయోగించి ఆయా యూజర్లను రీ–వెరిఫికేషన్ చేసే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చేదాకా కేంద్రం వేచి చూడనున్నట్లు ఆమె వివరించారు. మరోవైపు, సిమ్‌తో ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న విధానం ఇంకా అమల్లోనే ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆధార్ లేకుండా కొత్త సిమ్‌లు జారీచేసినప్పటికీ, తర్వాత దశలోనైనా వాటిని రీ–వెరిఫై చేయాల్సి ఉండొచ్చని పేర్కొన్నాయి. ఒకవేళ కనెక్షన్ తీసుకునేటప్పుడే సబ్స్క్రయిబర్.. ఆధార్ వివరాలు ఇచ్చిన పక్షంలో మళ్లీ రీ–వెరిఫికేషన్ అవసరం ఉండబోదని వివరించాయి. -
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన మొబైల్ కనెక్షన్లు
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ కనెక్షన్లు తగ్గిపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత మార్చి నుంచి జనవరి మధ్య 10 నెలల కాలంలో దాదాపు ఏడున్నర లక్షల మొబైల్ కనెక్షన్లు, 1.34 లక్షల ల్యాండ్‌లైన్ కనెక్షన్లు తగ్గిపోయాయని కేంద్ర కమ్యునికేషన్ల శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బుధవారం అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 31 మార్చి 2017న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తంగా 8,49,42,695 మొబైల్ కనెక్షన్లు ఉండగా 31 జనవరి 2018 నాటికి ఈ సంఖ్య 8,41,95,340 కి తగ్గాయని వెల్లడించారు. అత్యధిక మొబైల్ ఖాతాదారులు కలిగి ఉన్న సంస్థగా 2.72 కోట్ల కనెక్షన్లతో ఎయిర్టెల్ ప్రథమ స్థానంలో నిలువగా ఆ తదుపరి స్థానాల్లో ఐడియా, జియో, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ సంస్థలు నిలిచాయి. ఈ పది నెలల కాలంలో ఎయిర్టెల్, జియో, బీఎస్ఎన్ఎల్ సంస్థలకు ఖాతాదారులు పెరగ్గా ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌సెల్, టెలినార్, రిలయన్స్, టాటా సంస్థల ఖాతాదారులు తగ్గారు. అయితే అంతకుముందు ఏడాది కాలానికి మొత్తంగా 1.02 కోట్ల మేర కనెక్షన్లు పెరగడం విశేషం. ఇందులో జియో వాటానే 93.71 లక్షలుగా ఉంది. ఇక ల్యాండ్లైన్ల విషయంలో రెండు రాష్ట్రాల్లో కలిపి ఇదే కాలంలో 16,37,790 ల్యాండ్లైన్ల సంఖ్య నుంచి 15,03,028కి తగ్గింది. అంటే దాదాపు 1.34 లక్షల కనెక్షన్లు తగ్గాయి. 31 మార్చి 2015 నుంచి 31 జనవరి 2018 మధ్య కాలంలో దాదాపు 3.65 లక్షల కనెక్షన్లు తగ్గిపోయాయని మంత్రి తెలిపారు. ఇందులో ప్రధానంగా బీఎస్ఎన్ఎల్ సంస్థ ఖాతాదారులు తగ్గిపోయారు. -
ఇతరుల ఆధార్‌తో మొబైల్ కనెక్షన్లు
విశిష్ట గుర్తింపు సంఖ్య భద్రత ప్రశ్నార్థకం ► వివరాలు తస్కరిస్తున్న అక్రమార్కులు ► ఇష్టారాజ్యంగా దుర్వినియోగం ► ఇతరుల ఆధార్‌తో మొబైల్ కనెక్షన్లు ► ఢిల్లీలో ఓ మహిళ ఆధార్ నంబర్‌తో ► 9 బోగస్ మొబైల్ కనెక్షన్లు ► ట్వీటర్లో పోస్టు చేయడంతో కలకలం ► వేలాదిగా స్పందించిన నెటిజన్లు ► అలా జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయండి: యూఐడీఏఐ సాక్షి, హైదరాబాద్ : ఆర్.డి.ప్రియా.. ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ఉంటారామె.. తన మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు కొద్దిరోజుల కిందట ఎయిర్టెల్ స్టోర్‌కు వెళ్లింది.. కానీ అప్పటికే ఆమె ఆధార్‌తో ఏకంగా 9 మొబైల్ కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయని అక్కడి సిబ్బంది చెప్పడంతో ప్రియా షాక్‌కు గురైంది! ఆధార్ వివరాలు ఏమాత్రం బయటకు వెళ్లే అవకాశం లేదని, అత్యంత పకడ్బందీగా పరిరక్షిస్తున్నామని కేంద్రం చెబుతున్న మాటల్లోని డొల్లతనం ఈ ఉదంతంతో మరోసారి బయటపడింది! ఆధార్ గోప్యతపై అనేక అనుమానాలను రేకెత్తించింది. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని వివరిస్తూ ప్రియా తాజాగా ట్వీటర్లో చేసిన పోస్టు కలకలం రేపుతోంది. వాస్తవానికి ఆమె గత 18 ఏళ్ల నుంచి ఒకే మొబైల్ నంబర్‌ను వినియోగిస్తోంది. ఇప్పటివరకు ఆ నంబర్‌తో సహా ఏ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయలేదు. తీరా ఇప్పుడు అనుసంధానం చేసేందుకు వెళ్లగా 9 కనెక్షన్లు లింక్ అయి ఉన్నాయని చెప్పడంతో ఆశ్చర్యపోయింది. ‘ఇది నా జీవితంలో అతిపెద్ద షాక్’అంటూ ఐదు రోజుల కింద ఆమె ట్వీటర్లో పేర్కొంది. వేలాది మంది ఆమె ట్వీట్‌ను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు తెరదీసింది. ఆధార్‌తో పౌరుల వ్యక్తిగత సమాచారానికి భంగం వాటిల్లుతోందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సిమ్ కార్డు జారీ లేదా ఇప్పటికే వినియోగిస్తున్న మొబైల్ నంబర్లను ఆధార్‌తో అనుసంధానం చేసే సమయంలో టెలికం కంపెనీలు వినియోగదారుల వేలి ముద్రల(బయోమెట్రిక్)ను స్కాన్ చేసి ఆధార్ డేటాతో సరిపోల్చి చూసుకుంటాయి. అయితే తాజా ఘటనలో బాధితురాలికి సంబంధించిన బయోమెట్రిక్ డేటాతో నిర్ధారించుకోకుండానే టెలికం కంపెనీలు ఆమె ఆధార్ నంబర్‌తో 9 మొబైల్ కనెక్షన్లు ఎలా జారీ చేశాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒక ఆధార్ నంబర్‌పై గరిష్టంగా 6 మొబైల్ కనెక్షన్లు మాత్రమే జారీ చేయాలని ట్రాయ్, డీఓటీ నిబంధనలు చెబుతుండగా.. 9 కనెక్షన్లు ఎలా జారీ అయ్యాయన్నది అర్థం కాని ప్రశ్నగా మారింది. అలా చేస్తే ఫిర్యాదు చేయండి ఈ వివాదం తీవ్రం కావడంతో ఆధార్ కార్డులను జారీ చేస్తున్న భారతీయ విశిష్ట గుర్తింపు యాజమాన్య సంస్థ (యూఐడీఏఐ)తోపాటు ఎయిర్టెల్ స్పందించింది. బాధితురాలు ప్రియాతో ట్వీటర్లో సంప్రదింపులు జరిపాయి. తమ ఆధార్ నంబర్‌తో ఎన్ని మొబైల్ కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయో తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని యూఐడీఏఐ పేర్కొంది. తమ ఆధార్ నంబర్‌తో మొబైల్ కంపెనీలు మోసపూరితంగా సిమ్‌కార్డులు జారీ చేస్తే ట్రాయ్, లేదా డీఓటీలకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. మరోవైపు బాధితురాలిని ‘సాక్షి’ట్వీటర్లో పలకరించగా.. ఈ ఘటనపై ఇంకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని వివరించింది. తనకు పూర్తి సమాచారం ఇస్తానని ఎయిర్టెల్ హామీ ఇచ్చిందని, కొద్దిరోజులు వేచి చూసి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది. భద్రతకు ఏదీ భరోసా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు, కార్యక్రమాలకు ఆధార్‌ను తప్పనిసరి చేశాయి. రేషన్ కార్డులు, బ్యాంక్ ఖాతా, గ్యాస్ కనెక్షన్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపకార వేతనాలు, స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఎరువులు, పాస్‌పోర్టు, సామాజిక పింఛన్లు, సంక్షేమ పథకాలు.. ఇలా ప్రతి అవసరానికి ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని తీసుకుంటున్నారు. అయితే వాటిని పకడ్బందీగా సంరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కార్యాలయాల్లో పని చేసే కొంతమంది సిబ్బంది లబ్ధిదారుల ఆధార్ జిరాక్స్ ప్రతులను తస్కరించి తమ సొంత అవసరాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని చాలాకాలంగా ఆరోపణలున్నాయి. ప్రధానంగా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల లబ్ధి కోసం రాష్ట్రంలో ఏటా లక్షల మంది విద్యార్థులు తమ దరఖాస్తులతో పాటు ఆధార్ ప్రతిని జత చేస్తున్నారు. స్కాలర్షిప్లు జారీ చేసే సంక్షేమ శాఖలు, విద్యా సంస్థల కార్యాలయాల్లో విద్యార్థుల దరఖాస్తులను కుప్పలు తెప్పలుగా పడేస్తుండడంతో వారి ఆధార్ గుర్తింపు ప్రమాదంలో పడింది. లింక్‌కు మార్చి 31 వరకు గడువు ప్రతి మొబైల్ ఫోన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను కేంద్రం చేపట్టింది. టెలికం సర్వీస్ ప్రొవైడర్లు తమ వినియోగదారుల మొబైల్ ఫోన్ నంబర్లను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు వచ్చే మార్చి 31 వరకు గడువు పొడిగిస్తూ టెలికం శాఖ ట్రాయ్ నోటిఫికేషన్ జారీ చేశాయి. వినియోగదారులు టెలికాం కంపెనీ స్టోర్‌కు వెళ్లినప్పుడు తమ ఆధార్ నంబర్‌తో ఇంకా ఏమైనా మొబైల్ కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయా? అన్న విషయాన్ని అడిగి తెలుసుకోవచ్చు. ఒకవేళ తమకు సంబంధం లేని మొబైల్ కనెక్షన్లు లింక్ అయి ఉంటే తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ట్రాయ్ అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ఆధార్ వినియోగాన్నిఇలా తెలుసుకోవచ్చు https://resident.uidai.gov.in/notification-aadhaar వెబ్సైట్ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ.. ఇప్పటివరకు ఎక్కడెక్కడ తమ ఆధార్ నంబర్ వినియోగమైందన్న సమాచారం తెలుసుకోవచ్చు. 12 అంకెల ఆధార్ గుర్తింపు నంబర్, సెక్యూరిటీ కోడ్(వెబ్సైట్లోనే ఉంటుంది)ను ఎంటర్ చేయగానే, ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్‌కు వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే ఆధార్ వినియోగ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. -
దీదీలా మీకు అనిపిస్తోందా..?
తన మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో లింకు చేసుకోనని, కావాలంటే తన ఫోన్‌ను డిస్కనెక్ట్ చేసుకోవచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీలాగానే మీకు అనిపిస్తోందా? మీ మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడంపై అసంతృప్తితో ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. దీనిపై ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలను అన్వేషిస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసింది. రేషన్ కార్డు లేదా డ్రైవర్స్ లైసెన్సును మొబైల్ కనెక్షన్లను ధృవీకరించడం కోసం వాడుకోవచ్చని అధికారిక వర్గాలు పేర్కొన్నట్టు ఈ న్యూస్‌పేపర్ పేర్కొంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఆధార్-మొబైల్ లింకింగ్‌కు వ్యతిరేకంగా నమోదైన ఫిర్యాదులపై ప్రస్తుతం సుప్రీంకోర్టు స్పందించాల్సి ఉంది. ఫిబ్రవరి 6న అయితే 100 కోట్లకు పైగా ఉన్న టెలిఫోన్ కస్టమర్లందరి దగ్గర్నుంచి తమ గుర్తింపు వివరాలు తీసుకోవాలని టెలికాం కంపెనీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఆధార్‌తో మొబైల్ నెంబర్‌ను లింక్ చేసుకోవాలని, లేదంటే తమ నెంబర్‌ను డీయాక్టివేట్ చేస్తామంటూ కంపెనీ మెసేజ్‌లు కూడా పంపుతున్నాయి. దీని కోసం 2018 ఫిబ్రవరి 6ను డెడ్‌లైన్‌గా విధించాయి. అయితే ఆధార్‌ను మొబైల్‌తో లింక్ చేసుకోవడం ప్రైవసీకి విరుద్దమని పశ్చిమ బెంగాల్ సీఎం తెలిపారు. అంతేకాక ప్రైవసీ ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు కూడా తెలిపింది. -
పది కోట్ల ప్రీపెయిడ్ కనెక్షన్లు ఫట్!!
ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు పదికోట్ల వరకు ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్లు పాకిస్థాన్‌లో ఆగిపోనున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన 28 రోజుల గడువు లోగా వినియోగదారుల వివరాలను పరిశీలించడం తమ వల్ల కాదని ఆపరేటర్లు చేతులు ఎత్తేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది. మొత్తం పరిశీలించాలంటే కనీసం 150-200 రోజుల గడువు కావాలని ఆపరేటర్లు కోరారు. లేనిపక్షంలో ప్రస్తుతమున్న ప్రీపెయిడ్ సిమ్ కార్డులను బ్లాక్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. పాకిస్థాన్‌లో మొత్తం 14 కోట్ల మొబైల్ కనెక్షన్లున్నాయి. వాటిలో కేవలం 10 శాతం మాత్రమే పోస్ట్ పెయిడ్. డిసెంబర్ 16 నాటి పెషావర్ స్కూలు దాడి తర్వాత మొత్తం ప్రీపెయిడ్ కనెక్షన్లన్నింటినీ మళ్లీ వినియోగదారుల వివరాలు పరిశీలించాలని పాక్ హోం శాఖ ఆదేశించింది. అక్కడున్న ఐదుగురు ఆపరేటర్లు... మొబిలింక్, యుఫోన్, టెలినార్, వారిద్, జాంగ్ సంస్థల ప్రతినిధులు హోంశాఖ మంత్రి నిస్సార్ అలీఖాన్‌తో భేటీకానున్నారు. అప్పుడు దీనికో పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు.