money distributing
-
రూ.1500 @ పోస్టాఫీస్
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ కాలంలో నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వం అందించే రూ.1500ల కోసం నిరుపేద కుటుంబాలు పడరాని పాట్లు పడుతున్నారు. ఆహార భద్రత(రేషన్ కార్డు) కలిగి బ్యాంక్ అకౌంట్ లేని లబ్ధిదారులు మండుటెండల్లో పోస్టాఫీసుల ముందు నగదు కోసం గంటల కొద్ది కిలో మీటర్ల పొడవునా బారులు తీరుతున్నారు. రెండు రోజుల నుంచి నగరంలోని పలు పోస్టాఫీసుల వద్ద ఈ దృశ్యం కనిపిస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో ఆహార భద్రత కార్డులు కలిగిన నిరుపేద కుటుంబాలకు ఉచిత బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వం.. నిత్యావసర సరుకుల కోసం వారి బ్యాంక్ అకౌంట్లలో రూ.1500ల నగదు జమ చేసింది. బ్యాంక్ అకౌంట్ లేని సుమారు లక్షన్నర కుటుంబాలను గుర్తించి వారి నగదు పోస్టాఫీసుల్లో జమ చేసింది. బ్యాంక్ అకౌంట్ లేని నిరుపేదలకు రేషన్ కార్డు నంబర్ ఆధారంగా నగదు చెల్లించాలని పోస్టల్‌శాఖను ఆదేశించింది. ఇందుకు పోస్టల్ శాఖ నగరంలోని జనరల్ పోస్టాఫీసు(జీపీవో)తో కలిపి సుమారు 24 పోస్టాఫీసులను ఎంపిక చేసి నగదు పంపిణీ ప్రక్రియకు ఐదు రోజుల క్రితం శ్రీకారం చుట్టింది. పంపిణీ చేసే పోస్టాఫీసులు ఇవే.. నగరంలోని జనరల్ పోస్టాఫీస్(జీపీవో), జూబ్లీహిల్స్, ఫలక్‌నుమా, బహదుర్‌పురా, సైదాబాద్, కాచిగూడ, యాకుత్‌పురా, రామకృష్ణపూర్, ఖైరతాబాద్, హుమాయున్‌నగర్, హిమాయత్‌నగర్, అంబర్‌పేట, ఉప్పల్, కేశగిరి, మోతీనగర్, ఎస్ఆర్నగర్, లింగంపల్లి, సింగారెడ్డి కాలనీ, కొత్తగూడ, స్నియోసో, మణికొండ, కార్వాన్సాహు, సికింద్రాబాద్, తిరుమలగిరి తదితర పోస్టాఫీసుల ద్వారా ఆహార భద్రత కార్డు కలిగి బ్యాంక్ అకౌంట్లు లేని లబ్ధిదారులు రూ.1500 నగదు పొందవచ్చు. నగదు ఇలా.. నగరంలో ఎంపిక చేసిన పోస్టాఫీసుకు వెళ్లి ఆహార భద్రత(రేషన్) కార్డు చూపించినా.. లేదా రేషన్ కార్డు కొత్త నెంబర్ తెలియజేసినా చాలు.. పోస్టల్ శాఖ సిబ్బంది వెంటనే బయోమెట్రిక్(వెలిముద్ర) తీసుకొని రూ.1500ల నగదు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే రేషన్ షాపుల్లో సైతం లబ్ధిదారుల జాబితా అందుబాటులో ఉంచినట్లు సాక్షాత్తు సంబంధిత మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. వాస్తవంగా ఆహార భద్రత నిబంధన ప్రకారం కార్డులోని హెడ్ ఆఫ్ ఫ్యామిలీ(కుటుంబ పెద్ద) మహిళా మాత్రమే నగదు తీసుకునే వెసులుబాటు కల్పించారు. -
పూర్తయిన పచ్చనోట్ల పంపిణీ
చిత్తూరు అర్బన్: హోరెత్తిన ప్రచారపు మైకులు మూగబోయాయి. ఇక మిగిలింది 24 గంటలు గడవడమే. మరోవైపు ఓటర్లకు పంపిణీ చేసే తాయిలాలను అధికార పార్టీ దిగ్విజయంగా పూర్తి చేసింది. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించడానికి పోలీసులు అన్ని ముందస్తు చర్యలు పూర్తిచేశారు. చిత్తూరు, తిరుపతి ఎస్పీలు విక్రాంత్‌పాటిల్, అన్బురాజన్‌ల నేతృత్వంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్కు చెందిన 18 బెటాలి యన్లు ఇప్పటికే జిల్లాలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే 38 చోట్ల ఏర్పాటుచేసిన చెక్‌పోస్టుల్లో క్షుణ్ణంగా తనిఖీలు జరుగుతున్నాయి. వీటిల్లో 26 అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాలున్నాయి. సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం, డబ్బును అరికట్టడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మద్యం బంద్.. మరోవైపు జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకే మద్యం దుకాణాలు, మద్యం బార్లు మూతపడ్డాయి. 50 గంటల పాటు వీటిని తెరవడానికి వీల్లేదని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డెప్యూటీ కమిషనర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. ఈనెల 11 రాత్రి 8 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసేయాల్సిందే. దుకాణా ల్లో, గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరిగినా, మద్యం పంపకాలు చేపట్టినా ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తామని నాగలక్ష్మి హెచ్చరించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు 13.88 లక్షల లీటర్ల మద్యం, లక్ష లీటర్ల బీర్లను స్వాధీనం చేసుకున్నారు. 1, 053 మంది పాతనేరస్తులను బైండోవర్ చేసుకున్నారు. మొత్తం రూ.2.71 కోట్ల విలువ చేసే మద్యం, వాహనాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. వీరికి ఫిర్యాదు చేయొచ్చు... స్వారత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు ఎన్నికల పరిశీలకులను నియమించిన విషయం తెలిసిందే. జిల్లాలోని 14 నియోజకవర్గాలతోపాటు రెండు పార్లమెంట్ స్థానాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించింది. ఎక్కడైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే నేరుగా అధికారులను సంప్రదించవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. -
ఓటుకు ‘పచ్చ’ నోటు!
పోలింగ్ సమయం దగ్గరపడే కొద్దీ అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటుకు ‘పచ్చ’నోటు ఎర వేస్తున్నారు. చిత్తూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మోప్మా, వెలుగు సిబ్బంది ద్వారా ఓటర్లకు నగదు పంపిణీ చేయాలని భావించారు. ఇందుకోసం సంబంధిత సిబ్బందికి మామూళ్లు ముట్టజెప్పారు. కొందరు తమవల్ల కాదంటూ చేతులెత్తేయడంతో సంబంధిత అధికారుల ద్వారా ఫోన్లుచేసి వారిపై ఒత్తిడి తెప్పించారు. సాక్షి, తిరుపతి/చిత్తూరు అర్బన్: ఓటర్లకు డబ్బుల పంపిణీకి అధికార పార్టీ కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల తరహాలో కొందరు మెప్మా సిబ్బంది, సేవా మిత్రలను రంగంలోకి దింపింది. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు, పలమనేరు, పుంగనూరు,మదనపల్లి మున్సిపాలిటీల పరిధిలో పట్టణ దారిద్య్ర నిర్మూలనా విభాగం (మెప్మా) ద్వారా కొందరు అధికారులకు, రిసోర్సు పర్సన్లకు, సేవా మిత్రలకు భారీగా నగదు ముట్టజెప్పారు. పట్టణాల్లో పంపకాలు జరిగితే తమకు చెడ్డపేరు వస్తుందని, నగదు పంపిణీని ఊరి శివారుల్లో పెట్టుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. అందులో భాగంగా చిత్తూరులోని ఓ డీఎస్పీ సలహా మేరకు టీడీపీ నేతలు కోడిగుట్టలో ఈ వ్యవహారాన్ని ముగించారు. భయపెట్టి గుప్పెట్లో పెట్టుకున్న తమ్ముళ్లు జిల్లా వ్యాప్తంగా మెప్మా వెలుగు గ్రూపుల్లోని సభ్యులను పర్యవేక్షించేందుకు సుమారు 450 మంది కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లు, ఆర్పీ, ఎస్ఎల్ఎఫ్లు ఉన్నారు. వీరు కాకుండా గ్రూపు లీడర్లు ఉన్నారు. కార్పొరేషన్లు, పట్ట ణాల్లో టౌన్ మిషన్ మేనేజ్మెంట్ మేనేజర్, కమ్యూనిటీ ఆఫీసర్లు, తాత్కాలిక ఆర్పీలు, స్లమ్ లెవల్ ఫెడరేషన్ సభ్యులు, రీసోర్స్ పర్సన్లు ఉన్నారు. క్షేత్రస్థాయిలో మహిళల్ని ప్రభావితం చేయడానికి వీరిలో కొందర్ని అధికార పార్టీ నాయకులు భయపెట్టి వారి గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. వీళ్లు చెబితే మహిళలు వింటారని భ్రమించి తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీల్లో పనిచేసే ఒక్కో అధికారికి రూ.40 వేలు, కొందరు సీవోలకు రూ.20 వేలు, పదుల సంఖ్యలో ఆర్పీలు, ఎస్ఎల్ఎఫ్లకు రూ.10 వేలు చొప్పున పంపిణీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బయటపడిందిలా.. చిత్తూరు నగరంలో ఆర్పీలు తీసుకున్న రూ.10 వేలులో ఒక్కొక్కరూ రూ.500 చొప్పున పైఅధికారికి ఇవ్వాలని కొందరు సీవోలు ఒత్తిడి తీసుకొచ్చారు. ‘ఎలాగో ఉచితంగా వచ్చిన డబ్బే కదా.. రూ.500 ఇవ్వండి’ అంటూ వసూళ్లకు తెరతీశారు. ఇలా రూ.44 వేల వరకు వసూలు చేసి ఓ అధికారిణికి ఇచ్చారు. పలువురు ఆర్పీలు ఈ మొత్తం ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో చిత్తూరు నగరం కోడిగుట్టలో పంచాయితీ పెట్టారు. జిల్లావ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కొందరు ఇదే తరహాలో వసూళ్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంలో రాష్ట్రస్థాయి మెప్మా అధికారి హస్తం ఉన్నట్లు చిత్తూరు మెప్మాలోని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. చంద్రబాబునాయుడు చెప్పినట్లు వింటే ఆ అధికారికి ఐఏఎస్ హోదా కచ్చితంగా ఇస్తామని చెప్పడంతో మున్సిపాలిటీల్లో మహిళలకు నజరానాలు ఆశచూపి ప్రలోభాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. నంద్యాల తరహాలో.. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల తరహాలో టీడీపీ నేతలు నగదు పంపిణీకి మెప్మా, వెలుగు సిబ్బందిని వినియోగించుకుంటున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది తాము చేయలేమని చేతులెత్తేయడంతో అధికారుల ద్వారా ఫోన్లుచేసి బెదిరింపులకు దిగినట్లు ఓ అధికారిణి కన్నీరు పెట్టుకున్నారు. ఇష్టం లేకపోయినా టీడీపీ నేతలు, ఉన్నతాధికారులు చెప్పినట్లు నడుకోకతప్పడం లేదని వెల్ల డించారు. టీడీపీ అభ్యర్థుల నుంచి తమకు నగదు చేరిందని, ఆ నగదును నేటి రాత్రిలోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. వీలైతే ఓటింగ్ ముందు రోజు రాత్రి మరో విడత కూడా పంపిణీ చేయటానికి సిద్ధంగా ఉండాలని హుకుం జారీ చేసినట్లు స్పష్టం చేశారు. ఈ విషయం కొందరు మెప్మా సిబ్బంది కుటుంబీకుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు కోడ్‌ను ఉల్లంఘించి మెప్మా, వెలుగు సిబ్బందిని డబ్బుల పంపిణీకి వినియోగించుకుంటున్నారని వివరించారు. అయితే పోలీసు అధికారులు కేసు నమోదు చేయడానికి సమయం కావాలని చెప్పినట్లు మెప్మా సిబ్బంది కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో కూడా కొందరు వెలుగు సిబ్బంది ద్వారా పంపిణీకి రంగం సిద్ధం చేశారు. వెలుగు సిబ్బందిలోని కొందరి నివాసాల్లో నగదు, మద్యం నిల్వ ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఈసీ స్పందించాల్సి ఉంది. -
క్లైమాక్స్..ఆకర్ష్!
సాక్షి, సిటీబ్యూరో: ఎలక్షన్ సీన్ క్లైమాక్స్‌కు చేరింది. ఇప్పటివరకు హోరాహోరీగా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు హామీల వర్షం కురిపించిన ఆయా పార్టీల అభ్యర్థులు... ఇప్పుడు ‘ఆపరేషన్ ఆకర్ష్’కు శ్రీకారం చుట్టారు. ఆయా వర్గాలఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు తాయిలాల పర్వానికి తెరతీశారు. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో కాకపోయినా గ్రేటర్‌లోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లలోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, ద్వితీయశ్రేణి నాయకుల చేతుల మీదుగా వీటిని పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మహిళలకు కుట్టు మెషిన్లు, కుక్కర్లు, యువతకు క్రికెట్ కిట్లు, జిమ్ పరికరాలు, టీషర్టులు, మందుబాబులకు చీర్స్ చెబుతూ మద్యం పంచేందుకు ప్రణాళికలు రూపొందించారు. వృద్ధులు, కూలీల కు నగదు పంపిణీ, అవసరమైన వారికి పనులు చేస్తామంటూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఓటు.. నోటు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఓటరు స్లిప్పులతో పాటే ‘మీ ఓటుకు.. మా నోటు’ అంటూ నగదు పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ప్రాంతం, ఓటరు స్థాయిని బట్టి ఓటుకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు పంచేందుకు సిద్ధమయ్యారు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి నాయకులు ఈ పనులు చేసేందుకు ఎక్కడకక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, వారికి ఇప్పటికే అధినేతలు, అభ్యర్థుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే వారి ప్రాంతంలోని పోలింగ్‌బూత్‌లు, ఓటర్ల సంఖ్యను బట్టి నగదు నిల్వలు అందినట్లు తెలుస్తోంది. ‘ఫుల్లు’గా డంపింగ్... ఇక పోల్ మేనేజ్మెంట్లో లిక్కర్ కిక్కుకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందన్నది మన నేతలకు తెలిసిందే. అసలే పోలింగ్ సందర్భంగా మంగళవారం సాయంత్రం 6గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు బంద్ కానున్నాయి. దీంతో అభ్యర్థులు ముందుజాగ్రత్తగా లిక్కర్‌ను పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నారు. ఐఎంఎల్ మద్యాన్ని పెద్ద ఎత్తున ఓటర్లకు పంపిణీ చేసేందుకు వేలాది కాటన్లను ఎక్కడికక్కడే నిల్వ చేశారు. నేడు, రేపు నగరంలో మద్యాన్ని ఏరులుగా పారించేందుకు ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్నీ ఏర్పాట్లు చేసుకోవడం గమనార్హం. ఇక కాలనీల్లో నేరుగా మద్యం పంపిణీ చేస్తే ఎవరూ స్వీకరించరనే కారణంతో ఆయా కాలనీ సంక్షేమ సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో మందు పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. పంపిణీ.. నయా పంథా ఎన్నికల తాయిలాల పంపిణీకి రాజకీయ పార్టీలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. నగరంలో కొందరు అభ్యర్థులు తమ చేతికి మట్టి అంటకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆన్లైన్ షాపింగ్‌లో అగ్రగామిగా ప్రాచుర్యం పొందిన ఓ బహుళ జాతీయ సంస్థను సంప్రదించి బహుమతులు పంచిపెట్టడం చర్చనీయాంశమవుతోంది. నగరంలో ఓ ప్రధాన పార్టీ తరఫున తిరిగి పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు తొలుత దీనికి తెరతీశారు. నియోజకవర్గ ఓటర్లకు పెద్ద సంఖ్యలో గృహోపకరణ వస్తువులైన కుక్కర్లు, మిక్సీలు, ఇస్త్రీపెట్టెలు తదితర బుక్ చేయడం గమనార్హం. అయితే తమ తాయిలాల వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లిందని తెలిసి అభ్యర్థులే కాదు... సదరు ఆన్లైన్ సంస్థ అప్రమత్తమవడం గమనార్హం. తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు నగరంలోని ఆ సంస్థకు చెందిన నిల్వ కేంద్రాల వద్ద సిబ్బందిని పహారా ఉంచాలని యోచిస్తున్నారు. -
నంద్యాలలోని పలు వార్డుల్లో డబ్బు ప్రవాహం
-
ఈ నోట్లు మీకు.. మీ ఓట్లు నాకు
విశాఖసిటీ: పనితీరే ప్రజాప్రతినిధి నిబద్ధతకు గీటురాయి.. చేసిన సేవలే ప్రతిఫలాన్నిస్తాయి.. వాటినే గుర్తు చేస్తూ ఓట్లు అభ్యర్థించాలి. కానీ ఆయనగారికి ఈ అర్హతలేవీ మచ్చుకైనా లేదుమరి.. అందుకే ఆ అభ్యర్థి బరితెగించారు. ఆయనే నేరుగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. అదీ.. ప్రచారంలోనే అందరి సమక్షంలోనే నిబంధనలకు నీళ్లొదిలి.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ నోట్లు పంచిపెట్టారు. ఆయన మరెవరో కాదు.. నిత్యం వివాదాలు, దందాల్లో మునిగితేలే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలుగుదేశం అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్. ఐదేళ్ల పదవీకాలమంతా దందాల్లో మునిగితేలుతూ, ప్రజాలను గాలికొదిలేసిన ఆయన.. ఎన్నికల్లో ఓట్ల కోసం నోట్ల పంపిణీకి తెగబడ్డారు. తిరిగిన ప్రతి చోటా.. ప్రచారానికి వెళ్లే ప్రతి గడపలోనూ ప్రజల చేతిలో నోట్లు పెడుతూ.. ఓటు తనకే వెయ్యాలంటూ నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారు. దక్షిణ నియోజకవర్గంలోని నేరెళ్ల కోనేరు ప్రాంతంలో వాసుపల్లి బుధవారం ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లడం.. ఓటు అడగడం.. జేబులోని నోట్లు తీసి వారి ఆ ఇంటివారి చేతిలో పెట్టడం.. ఇలా ఆ ప్రాంతంలో డబ్బులు వెదజల్లి ఓటర్లను ప్రత్యక్షంగా ప్రలోభాలకు గురిచేస్తున్న వాసుపల్లి తీరును చూసి స్థానికులు విస్మయానికి గురయ్యారు. ఒక్కొక్కరి చేతిలో నాలుగు నుంచి పది వరకు రూ.500 నోట్లు పెట్టారు. వాసుపల్లి బరితెగింపుపై ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. -
సౌండ్ పార్టీలు
ఇది ఓట్లు కొనే కాలం.. నోట్లకు ఓట్లు విసిరే గాలం.. మద్యం ఏరులై పారే సీజన్.. కానుకలు వరదై పోటెత్తే టైమ్.. అదే ఎన్నికల కాలం.. రాజకీయాలంటే డబ్బుదే అసలు ‘పవర్’. ధనబలం, కండబలం ఇవే ఎన్నికల్ని శాసించేవి. ఉత్తరాదిన కండబలానిదే మొదటి స్థానమైతే, దక్షిణాది రాష్ట్రాల్లో డబ్బున్నవాడిదే రాజ్యం. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా అభ్యర్థుల చేతుల్లో కాసులు గలగలమంటేనే ఓట్లు జలజల రాలతాయి. కేవలం నోట్ల కట్టలే కాదు, మద్యం, బిర్యానీతో పాటు నిత్య జీవితంలో ఉపయోగపడే వస్తువులు కావేవీ కానుకకి అనర్హం. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు డబ్బుని వెదజల్లుతున్నారు. కానుకల్ని పంచుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని పరిమితులు విధించినా పట్టించుకునే వారే లేరు. హెలికాప్టర్ ప్రయాణాలు, కార్ల కాన్వాయ్‌లు, ప్రచార ఆర్భాటాలు.. ఇలా ఈసారి మన ఎన్నికల ఖర్చు తడిసి మోపెడు కానుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యయాన్ని తలదన్నేలా ఈసారి ఎన్నికల వ్యయం రూ.50 వేల కోట్లు దాటిపోతుందని న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనా వేసింది. ఖర్చు చూస్తే గుండె గుభేల్ ♦ ప్రచారం, వాణిజ్య ప్రకటనలు, ప్రయాణాలు.. ఎన్నికల్లో వీటికే అత్యంత ప్రాధాన్యం. ఎన్నికలకయ్యే మొత్తం వ్యయంలో అత్యధికంగా ఖర్చు పెట్టేది ప్రచారానికే. మొత్తం ఖర్చులో 59 శాతం ప్రచారానికే అవుతోంటే, ప్రయాణాలకి 21 శాతం ఖర్చు చేస్తున్నట్టు ఎన్నికల సంస్కరణ కోసం కృషి చేస్తున్న ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ♦ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రాజకీయ ప్రకటనలకయ్యే ఖర్చు తడిసి మోపెడవుతున్నట్టుగా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్ ఎన్.భాస్కర్‌రావు వెల్లడించారు. 2014లో సోషల్ మీడియాలో వివిధ రాజకీయ పార్టీలు పెట్టిన ఖర్చు రూ.250 కోట్లయితే, ఈసారి అది రూ.5 వేల కోట్లు దాటిపోతుందని అంచనా. ♦ పేపర్ తెరిస్తే చాలు ఫలానా అభ్యర్థికి ఓటు వెయ్యండి అన్న అభ్యర్థనలే. టీవీ చానల్ తిప్పినా.. రాజకీయ పార్టీల ప్రకటనలే. దీనికయ్యే ఖర్చు ఈసారి చుక్కల్ని తాకనుంది. పార్టీల ఎన్నికల ఖర్చులో ఈ మొత్తమే అత్యధికం కానుంది. జెనిత్ ఇండియా అనే అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ లెక్కల ప్రకారం ఈ ఖర్చు ఈసారి రూ.2,600 కోట్ల పై మాటేనని అంచనా. ♦ ఫిబ్రవరిలో కేవలం ఫేస్బుక్ ప్రచారానికే రాజకీయ పార్టీలు రూ.4 కోట్లు ఖర్చు చేశాయి. ♦ ఎన్నికల్లో ఫలితాల్ని తారుమారు చేయడానికి, ఓటర్లను గందరగోళ పరచడానికి ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థి పేరుతో డమ్మీ అభ్యర్థుల్ని బరిలోకి దింపే దిగజారుడు రాజకీయాలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి. ఇండియా టుడే మ్యాగజైన్ అంచనాల ప్రకారం డమ్మీ అభ్యర్థుల్ని బరిలోకి దింపడానికి రూ.12 కోట్లు ఖర్చుచేస్తున్నాయట పార్టీలు. ♦ ఎన్నికల ప్రచారంలో కానుకలే ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షిస్తున్నాయని కాలిఫోర్ని యా యూనివర్సిటీ సర్వేలో వెల్లడైంది. కానుకలు పంచితే ఓటు కచ్చితంగా తమకే పడుతుందని 90 శాతం మంది రాజకీయ నాయకులు బలంగా నమ్ముతున్నట్టు ఆ సర్వే తెలిపింది. ఒకప్పుడు గొర్రెలు, బర్రెలు కూడా పంచేవారు. ఆ తర్వాత మిక్సీలు, ♦ సైకిళ్లు ఇస్తామని హామీలు ఇస్తే, ఇప్పుడు కానుకలు కూడా హైటెక్కుగా మారాయి. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు.. ఇలా ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ఏమివ్వడానికైనా సిద్ధమైపోతున్నాయి. ♦ కేవలం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మాత్రమే కాదు ఈసారి ఎన్నికల సంఘం చేస్తున్న ఖర్చు కూడా భారీగానే ఉంటోంది. ఉత్తరాన హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సముద్ర మట్టానికి 15 వేల అడుగులఎత్తులోనూ, పశ్చిమాన దట్టమైన అడవుల్లోని ఏజెన్సీ వాసుల కోసం, ఈశాన్య రాష్ట్రాల్లో నదులు, కొండలు, గుట్టలు దాటి పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయడం ఎన్నికల సంఘానికి శక్తికి మించిన పనైపోతోంది. ఈసారి ఎన్నికల కోసం బడ్జెట్లోనే రూ.262 కోట్లు కేటాయించింది. పరి‘మితి’ అంతంతే.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచారం కోసం పెట్టే ఖర్చుపై కొన్ని పరిమితులున్నాయి. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై నిఘా కోసం ఎన్నికల సంఘం అనేక చర్యలు తీసుకుంటోంది. కానీ ఏ అభ్యర్థి పరిమితికి లోబడి ఖర్చు చేస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. తొలిసారి ఎన్నికల వ్యయ పర్యవేక్షకుల నియామకం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న 120 నియోజకవర్గాలను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఆయా నియోజకవర్గాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించే పనిలో పడింది. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడులో కొన్ని నియోజకవర్గాల్లో డబ్బుల్ని వెదజల్లుతూ ఉండడంతో ఆదాయ పన్ను శాఖకు చెందిన ఇద్దరు రిటైర్డ్ అధికారుల్ని ఎన్నికల వ్యయపరిశీలకులుగా ఆ రాష్ట్రాలకు పంపింది. ఇలా ఎన్నికల ఖర్చుని పర్యవేక్షించడానికి ఏకంగా పరిశీలకుల్ని నియమించడం ఎన్నికల చరిత్రలో ఇదే మొదటిసారి. అక్రమ మార్గాల్లో ఓటర్లపై మనీ, మద్యం, కానుకలు ఇచ్చేవారిపై ఓ కన్నేసి ఉంచడానికి 800 బృందాలను ఏర్పాటు చేయనుంది. మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అత్యధికంగా పార్టీలు ఖర్చు చేస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు.. ♦ ఎన్నికలు, రాజకీయ వ్యవస్థలో సంస్కరణల కోసంకృషి చేసే అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అంచనాల ప్రకారం ఆయా పార్టీలు చేస్తున్న ఎన్నికల ఖర్చు వివరాలు ఇలా ఉన్నాయి.. ♦ 2016–17లో బీజేపీ ఎన్నికల ప్రచారానికి రూ.606 కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ పార్టీ రూ.149 కోట్లు ఖర్చు చేసింది. ♦ భారత్‌లో అత్యంత ధనిక పార్టీ బీజేపీయే. గత మూడేళ్లలోనే ఆ పార్టీ ఆదాయం ఏకంగా 81 శాతం పెరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆదాయం 14 శాతం తగ్గింది. ♦ కార్పొరేట్ సంస్థలే ఎన్నికల విరాళాలు ఎక్కువిస్తాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం 2017–2018 మధ్య వీటి నుంచి బీజేపీకి రూ.400 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.19 కోట్లు వచ్చాయి. ♦ వివిధ పార్టీలకు వ్యక్తిగతంగా వచ్చే విరాళాలే 10 శాతంగా ఉన్నాయి. 2017–18లో 2,772 మంది రూ.47 కోట్లు విరాళంగా ఇచ్చారు. తడిసిమోపెడు.. రూ.50 వేల కోట్లు్లప్రస్తుత ఎన్నికల వ్యయం (అంచనా) రూ. 262 కోట్లు్ల ఈసారి ఎన్నికల నిర్వహణకు కేటాయించిన బడ్జెట్ రూ.1,200 కోట్లు2014 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ వాణిజ్య ప్రకటనలకు చేసిన ఖర్చు రూ. 2,600 కోట్లుప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన పార్టీల వాణిజ్య ప్రకటనల ఖర్చు (అంచనా) రూ.70 లక్షలుఈసారి ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లోపోటీచేసే అభ్యర్థులఖర్చు పరిమితి రూ.54 లక్షలుచిన్న రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితి రూ.1,034 కోట్లు2016–17 ఆర్థిక సంవత్సరానికిబీజేపీ ఆదాయం రూ.225 కోట్లు్ల2016–17 ఆర్థిక సంవత్సరంలోకాంగ్రెస్ పార్టీ ఆదాయం 120ఈసారి ఎన్నికల్లో ధన ప్రవాహం ఎక్కువగా ఉంటాయని ఈసీ గుర్తించిన నియోజకవర్గాల సంఖ్య -
అనకాపల్లిలో గ్రామున్నర బంగారం?
షెడ్యూల్ వెలువడకముందే మంత్రి అయ్యన్నపాత్రుడు నియోజకవర్గంలో రూ.3 కోట్ల విలువైన చీరలు, గొడుగుల సంతర్పణ.. దర్జాగా డీఆర్డీఏ సిబ్బంది ద్వారానే పంపిణీ..అదే ఊపులో.. అదే డీఆర్డీఏ ద్వారా పశసంవర్థక శాఖ సహకారంతో రూ.కోటి విలువైన పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ.. ఇందుకోసం ప్రత్యేకించి నియోజకవర్గంలో 60 మంది సీఆర్పీల కేటాయింపు.. మంత్రి నియోజకవర్గంలోనే ఇలా బరితెగిస్తుంటే.. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ విచ్చలవిడిగా సాగుతున్న పంపిణీ పర్వం.మరోవైపు షెడ్యూలు వచ్చి.. నామినేషన్ల ఘట్టం కూడా ప్రారంభమైన ఈ మూడు రోజుల్లోనే రూ. 1.20 కోట్ల నగదు కట్టలు స్వాధీనం.. వీటిలో 80 వరకు టీడీపీ నేతలకు చెందిన వాహనాల్లో తరలిస్తున్నవే..ఓట్ల వేటకు పచ్చనేతలు కట్టల పాములను వదులుతున్నారన్న దాన్ని ఈ ఉదంతాలు బలపరుస్తున్నాయి. విశృంఖలంగా సాగుతున్న ఈ కోడ్ ఉల్లంఘనకు అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం ఆ పని చేయకపోగా.. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: అధికార పార్టీ నేతలు అప్పుడే ప్రలోభాలకు తెరతీశారు. ఎక్కడికక్కడ డబ్బులు, బంగారం, దుస్తులు పంపిణీకి శ్రీకారం చుట్టేశారు. కేవలం మూడురోజుల వ్యవధిలో రూ.1.2 కోట్లు పట్టుబడిందంటేనే అర్థమవుతోంది.. ఆయా ప్రాంతాలకు నగదును ఎలా సర్దుబాటు చేస్తున్నారో. డబ్బు తరలిస్తున్న 14 వాహనాలను సీజ్ చేస్తే, అందులో దాదాపు 80 శాతం వాహనాలు టీడీపీ, జనసేన నేతలకు చెందినవేనని అధికారులు సైతం పరోక్షంగా అంగీకరిస్తున్నారు. మంగళవారం సబ్బవరంలో పట్టుబడిన రూ.కోటి నగదు మంత్రి, టీడీపీ కీలక నేత అయిన వ్యక్తి నుంచి పెందుర్తి నియోజకవర్గానికి వచ్చినట్లు తెలుస్తోంది. నగదు తరలించే వాహనంపై తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ కూడా ఉంది. మొత్తానికి ఓటమి భయంతో వణుకుతున్న టీడీపీ డబ్బుతో గట్టెక్కాలన్న తాపత్రయం ఈ ఘటనతో బట్టబయలైంది. గత ఐదేళ్లలో సంపాదించిన అక్రమార్జనలో ఒక్కో నియోజకవర్గంలో రూ.50 కోట్ల వరకు లిక్విడ్ క్యాష్ అధికార టీడీపీ అందుబాటులో ఉంచిందని ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఇంకా నామినేషన్ల పర్వం ముగియకముందే «డబ్బు ప్రవాహం మొదలైంది. షె డ్యూల్ వెలువడక ముందే చీరలు, పంచెలు, గొడుగులు పంచేసిన అధికార పార్టీ నేతలు.. తమ అభ్యర్థిత్వాలు ఖరారు కాగానే డబ్బుల పంపిణీకి కూడా శ్రీకారం చుట్టేశారు. గత మూడు రోజుల్లో అక్షరాల రూ.కోటి 19 లక్షల 88 వేలు పట్టుబడ్డాయి. లెక్కలు చూపని ఈ సొమ్మంతా టీడీపీ, జనసేన నేతలకు చెందినదేనని ప్రాథమిక ఆధారాలను బట్టి పోలీసులు సైతం నిర్ధారణకు వచ్చారు. ఇంకా నామినేషన్ వేయకుండానే ఏజెన్సీ లో రాష్ట్ర మంత్రి కిడారి సర్వేశ్వరరావు టీడీపీ తరపున బరిలోకి దిగుతున్న అరకు నియోజకవర్గంలో ఒక్కో ఓటరుకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేయడమే కాకుండా వారితో ప్రమాణాలు కూడా చేయించుకున్న ఘటనలు వెలుగుచూశాయి. అనకాపల్లిలో గ్రామున్నర బంగారం? అనకాపల్లిలో అయితే అధికార టీడీపీ నేతలు అప్పుడే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గ్రామున్నర బంగారం కూడా పంపిణీ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇక్కడ గతంలో టీడీపీలో చెట్టాపట్టాలేసుకు తిరిగిన నేతలే టీడీపీ, జనసేన పార్టీల తరపున బరిలో నిలవడం, ఆర్థికంగా బలమైన అభ్యర్థులు కావడంతో ఇ రువురు దొడ్డిదారిన పంపిణీలకు శ్రీకారం చుట్టారని తెలు స్తోంది. ఇక నామినేషన్ల పర్వం ముగియగానే పంపిణీల పర్వం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నర్సీపట్నంలో చీరలు, పంచెల పంపిణీ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. షెడ్యూల్ విడుదలకు నెల రోజుల ముందే డ్వాక్రా సభ్యులు, పింఛన్‌దారులకు దాదాపు రూ.3 కోట్ల విలువైన చీరలు, పంచెలు పంపిణీ చేశారు. మంత్రి అయ్యన్న సతీమణి, కుమారులే స్వయంగా ఈ పంపిణీ చేపట్టడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. సంఘాల వారీగా సభ్యులను గుర్తించి డీఆర్డీఏ సిబ్బంది ద్వారానే పంపిణీ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. అలాగే షెడ్యూల్‌కు ముందు పశుసంవర్ధక శాఖ సమన్వయంతో డీఆర్డీఏ ద్వారా మరే ఇతర నియోజకవర్గంలోనూ లేని విధంగా మంత్రి నియోజకవర్గంలో రూ.కోటి విలువైన పశువులు, మేకలు, గొర్రెలు పంపిణీ చేశారు. డబ్బుల పంపిణీ కోసంఅదనపు సిబ్బంది తాజాగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నియోజకవర్గంలో మండలానికి 10–12 మంది సీఆర్పీలతోపాటు ఇతర సిబ్బంది కలిపి మూడు మండలాల్లో 60 మంది సిబ్బందిని అదనంగా నియమించారని తెలియవచ్చింది. వీరిని ఎందుకు డెప్యూట్ చేశారో కూడా తెలియని పరిస్థితి. వీరికి డీఆర్డీఏ తరపున రూ.3 లక్షల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. ఎన్నికల్లో వీరి సేవలను వినియోగించుకునేందుకు వీలుగా వీరికి అదనంగా నెలకు రూ.15వేల వరకు ముట్టజెబుతున్నట్టుగా తెలియవచ్చింది. వీరి ద్వారా రానున్న మూడు వారాలు డబ్బుల పంపిణీ లోపాయి కారిగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలియవచ్చింది. ఇక్కడ ఓటుకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు పంపిణీ చేయబోతున్నారంటున్నారు. మంత్రి ఒక్కరికే కాదు.. పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అనుకూలంగా వెలుగుసిబ్బందిని వినియోగించుకునేలా డీఆర్డీఏలో ఐదేళ్ల పాటు పాతుకుపోయిన ఓ కీలక అధికారి పరోక్షంగా సహకారం అందిస్తున్నట్టుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. జిల్లా ఎన్నికల అబ్జర్వర్స్, వ్యయ పరిశీలకులు అధికార టీడీపీ నేతల ప్రలోభాలపై ప్రత్యేక నిఘాపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
నీ రేటు ఎంత..?
సాక్షి, కందుకూరు (ప్రకాశం): నీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి.. నువ్వు ఎన్ని ఓట్లు వేయిస్తావు.. దాని ప్రతి ఫలంగా నీ రేటు ఎంతో చెప్పు.. ఇదీ ప్రస్తుతం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న రాజకీయం. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల్లో ఉన్న సానుభూతిని అడ్డుకునేందుకు సానుకూలతను అడ్డుకునేందుకు అధికార పార్టీ భారీ తాయిలాలు ప్రకటిస్తోంది. గ్రామాల వారీగా, పల్లెల వారీగా, నాయకుల వారీగా కొనుగోలుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓ నాయకుడి స్థాయిని బట్టి ప్యాకేజీ ఆఫర్ చేస్తూ తమవైపు తిప్పుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. దీంతో నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రలోభాలు, తాయిలాలకు అడ్డే లేకుండా పోతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న అధికార పార్టీ నేతలు బరితెగించి మరీ ఇలా డబ్బులు పంపకం చేయడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నేతల డబ్బుల ప్రవాహాన్ని ఎన్నికల అధికారులు అడ్డుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రలోభాలకు తెరతీసిన టీడీపీ.. నియోజకవర్గంలో ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అటు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థుల ప్రకటన పూర్తి అయింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి బరిలో ఉంటే, తెలుగుదేశం పార్టీ తరుపున ఎమ్మెల్యే పోతుల రామారావు బరిలో ఉన్నారు. దీంతో గెలుపుకోసం ఇరువురు తీవ్రస్థాయిలోనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అత్యంత బలంగా ఉండడం, కచ్చితంగా విజయం సాధిస్తుందనే ప్రచారంతో అధికార పార్టీ అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. అదే సందర్భంలో అధికార పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు, నాయకుల మధ్య కుమ్ములాలటు, అసంతృప్తులతో పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. అభ్యర్థి ప్రకటన పూర్తయితే, ఎన్నికలు సమీపిస్తున్నా టీడీపీలో నెలకొన్న పరిస్థితిలో మాత్రం మార్పురావడం లేదు. దీంతో నియోజకవర్గంలో ఎలాగైనా పట్టునిల్పుకునేందుకు అధికార పార్టీ ప్రలోభ రాజకీయాలకు తెరలేపింది. భారీగా డబ్బులు ఎరవేసి పార్టీలోని అసంతృప్తులకు సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఈ తరహా రాజకీయాలు నియోజకవర్గంలో ఊపందుకున్నాయి. మొదట పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులను గుర్తించి వారికి ఏం కావాలో అడడగం, వారి డిమాండ్ చేసిన మేరకు డబ్బులు ముట్టజెప్పడం చేస్తున్నట్లు సమాచారం. నాయకుడి స్థాయిని బట్టి.. తరువాత గ్రామాల్లో కాస్త ఓటర్లను ప్రభావితం చేసే నాయకులను గుర్తించి వారిని తమవైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా నాయకుడి స్థాయిని బట్టి రూ. 20వేల నుంచి రూ.50వేల వరకు ఒక్కొక్క నాయకుడికి ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయినా సరే కొందరు నాయకులు ఈ డబ్బులు తీసుకునేందుకు కూడా నిరాకరిస్తున్నట్లు సమాచారం. గత ఐదు సంవత్సరాలుగా తమను పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయనే కారణంతో, ఎన్నికల్లో గెలిచేందుకు భారీగా డబ్బులు ఆశ చూపడం ఎంతవరకు కరెక్టు అని ఆ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదే తరహాలో గ్రామాల్లోను భారీగా ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు అధికార పార్టీ నాయకులు ప్రారంభించారు. గ్రామాలు, పల్లెల లెక్కన బేరాలు పెడుతూ మీకు ఎంత కావాలో చెప్పండి అనే తరహాలో విచ్చలవిడి ప్రలోభాలకు తెరలేపారు. దీంతో ప్రస్తుతం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఈ ధర రాజకీయాలపైనే చర్చ జరుగుతుంది. అధికార పార్టీ నాయకుల ప్రలోభాలు, ప్రకటిస్తున్న తాయిలాల గురించి ముచ్చటించుకుంటున్నారు. ఓటమి భయంతోనే... నియోజకవర్గంలో ఓడిపోతామనే భయంతోనే అధికార పార్టీ ఇటువంటి తాయిలాలకు, ధన రాజకీయాలకు తెరలేపింది. వైఎస్సార్సీపీ తరుపున గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే పోతుల రామారావు రెండు సంవత్సరాల తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో అప్పటి వరకు నియోజకవర్గంలో పెత్తనం చేసిన దివి శివరాం వర్గానికి, పోతుల వర్గానికి మధ్య విబేధాలు తలెత్తాయి. ఇవి తారాస్థాయికి చేరి నియోజకవర్గంలో పార్టీ బలహీన పడేలా చేశాయి. కొందరు ముఖ్య నాయకులు సైతం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందర పార్టీలోనే ఉన్న బహిరంగంగానే పోతుల రామారావుకు సహకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇలా దివి శివరాంకు సొంత సొదరులైన మాజీ మున్సిపల్ చైర్మన్ దివి లింగయ్యనాయుడు, ప్రసాద్ వంటి వారు ఉన్నారు. గ్రామాల్లో రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరక పార్టీలో అంతర్గత విబేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో నియోజకవర్గంలో పార్టీలో గెలుపుపై ఆ పార్టీ కార్యకర్తలు, నాయకలు ఆశలు వదులుకున్నారు. దీంతో అధికార పార్టీ నాయకులు దీన్ని కప్పి పుచ్చుకునేందుకు భారీ స్థాయిలో తాయిలాలకు తెరలేపారు. ఉత్సాహంతో వైఎస్సార్సీపీ.... అదే సందర్బంలో నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అత్యంత పటిష్టంగా ఉండడంతో ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అధికార పార్టీ ఎన్ని తాయిలాలు ఇచ్చిన వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేస్తున్నారు. అలాగే అధికార పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటల నేపధ్యంలో ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీ బాట పట్టేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అధికార పార్టీ నుంచి వలసలు భారీగా కొనసాగుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ గెలుపుపై ధీమాతో ముందుకు సాగుతోంది. -
లెక్క తేలుతోంది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వెలువడ్డాయి. మరి జిల్లావ్యాప్తంగా తనిఖీల్లో పట్టుబడిన సొమ్మంతా ఎక్కడికి పోతుంది? ఎవరి అధీనంలో ఉంటుంది? తిరిగి బాధితులకు అందజేస్తారా? లేక ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారా? సామాన్యుల్లో ఈ తరహా ప్రశ్నలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ లెక్కలు తేలుతున్నాయి. తాజాగా ముగిసిన శాసనసభ ఎన్నికల్లో నోట్ల కట్టలు స్వైర విహారం చేసిన విషయం తెలిసిందే. ఓట్లు దండుకోవడానికి ఆయా పార్టీల నేతలు పోటీపడి మరీ కోట్ల రూపాయలు గుమ్మరించారు. ఇందుకోసం ఎన్నికల సంఘం సూచించిన నిర్దేశిత మొత్తానికి మించి ఎటువంటి ఆధారాలు లేకుండా వివిధ మార్గాల్లో.. పలు రూపాల్లో డబ్బును రాజకీయ నాయకులు తరలించారు. విస్తృతంగా తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు, స్టాటిక్ సర్వీలేన్స్ బృందాలు (ఎస్ఎస్టీ) పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నాయి. కొన్ని కేసులు వీగిపోగా.. మరికొన్నింటిపై విచారణ జరగాల్సి ఉంది. ఇంకొన్ని కేసులు ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వెళ్లాయి. వీగిన కేసులు 13 రూ.10 లక్షలు లోబడి స్వాధీనం చేసుకున్న సొమ్మును జిల్లా ట్రెజరీ అధికారి (డీటీఓ) వద్ద భద్రపరిచారు. ఇటువంటి కేసులు జిల్లావ్యాప్తంగా 26 నమోదయ్యాయి. రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) ఎండార్స్ చేసిన పత్రం, పంచనామా, ఎన్నికల సంఘానికి వివరాలు అప్లోడ్ చేసిన ధ్రువపత్రాన్ని కూడా డీటీఓకు అందజేశారు. డబ్బు వ్యవహారంపై డీఆర్ఓ అధ్యక్షతన ఏర్పడిన ప్రత్యేక కమిటీ చర్చించనుంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికే తరలిస్తున్నారా? ఇతర అవసరాలకు తీసుకెళ్తున్నారా? అని ఆరా తీస్తుంది. వ్యక్తిగత సొమ్మే అని తేలితే.. సదరు కేసులను అక్కడితో మూసేస్తారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 13 కేసులు వీగిపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇవన్నీ వ్యక్తగత, వ్యాపార లావాదేవీల నిమిత్తం నగదు తరలిస్తున్నట్లు అధికారుల విచారణలో స్పష్టమైంది. మిగిలిన కేసులపై త్వరలో విచారణ జరగనుంది. రూ.పది లక్షలకు పైబడి పట్టుబడిన కేసులన్నీ ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వెళ్తాయి. పదుల సంఖ్యలో నమోదైన ఈ తరహా కేసులను ఆ శాఖ అధికారులకు అప్పగించడంతో విచారణ చేపడుతున్నారు. ఆ నగదుకు సంబంధించి గతంలో పన్ను చెల్లించారా? లేదా హవాలా మార్గంలో వచ్చిందా? అనే విషయాలపై కూపీ లాగుతున్నారు. నిబంధనల ప్రకారం ఉంటే డబ్బును యజమాని తీసుకోవచ్చు. లేకపోతే సర్కారు ఖజానాలో జమచేస్తారు. భారీగా నగదు స్వాధీనం.. ఎన్నికలు పూర్తయ్యే నాటికి జిల్లావ్యాప్తంగా రూ.3.84 కోట్లను సీజ్ చేసినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలు చేయడంతోపాటు ఎస్ఎస్టీ, ఫ్లయింగ్ స్క్వాడ్లు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. సివిల్ పోలీసులూ ఎక్కడికక్కడ సోదాలు చేసి పెద్దమొత్తంలో డబ్బులను సీజ్ చేశారు. ఎన్నికల సమయంలో రూ. 40 వేలు, ఆపైబడి మొత్తం ఎవరి వద్దనైనా లభ్యమైతే అందుకు సంబంధించిన లెక్కలు చూపడంతోపాటు తగిన ఆధారాలను సైతం అందజేయాలి. ఈ ఉల్లంఘనను అతిక్రమించి నగదు తరలిస్తున్న వారిని అదుపులోకి డబ్బును సీజ్ చేశారు. -
చివరిరోజు తనిఖీ ముమ్మరం
సాక్షి,మహబూబ్‌నగర్, నెట్వర్క్: ఓటర్లను ప్రభావితం చేయడానికి చివరిరోజు నగదు చేతులు మారవచ్చని, మద్యం విరివిగా పంపిణీ కావచ్చనే అనుమానంతో పోలీసు, ఎక్సైజ్‌శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా అడుగడుగునా సోదాలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, జాతీయ, అంతరాష్ట్ర రహదారి, సరిహద్దుల వద్ద పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మక్తల్‌లో హల్చల్ మక్తల్ స్వంత్య్ర అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి తరఫున మాజీ జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మారెడ్డి డబ్బు పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో గురువారం సాయంత్రం పోలీసులు ఆయన సోదాలు చేశారు. ఆ సమయంలో లక్ష్మారెడ్డి లేకపోవడంతో తాళం పగులగొట్టి మరీ తనిఖీ చేశారు. అంతలోనే లక్ష్మారెడ్డికి అక్కడకు చేరకోగా ఆయనను సైతం తనిఖీ చేసిన పోలీసులు ఆయన వద్ద నుంచి రూ.40 వేలు, ఇంట్లో లభించిన రూ.4 వేలను స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారికి అప్పగించారు. విషయం తెలుసుకున్న నాయకులు అప్పటికే తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపించడంతో తిరిగి లక్ష్మారెడ్డికి అందజేశారు. ఇదిలాఉండగా ఈ విషయంపై స్వతంత్ర అభ్యర్థి మాదిరెడ్డి జలందర్‌రెడ్డి తనిఖీలను తప్పుపట్టారు. కేవలం లక్ష్మారెడ్డి ఇంటికే వచ్చి తనిఖీ చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రూ.5లక్షల మద్యం పట్టివేత కల్వకుర్తి రూరల్: ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కల్వకుర్తి రేంజ్ పరిధిలో ఇటీవల జరిపిన దాడుల్లో మొత్తం రూ.5లక్షల విలువచేసే మద్యం పట్టుబడిందని ఎక్సైజ్ సీఐ శంకర్ గురువారం విలేకరులకు తెలిపారు. ఐదు ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేశామని తెలిపారు. పోలీసు, ఎక్సైజ్‌శాఖ సంయుక్తంగా దాడులు, తనిఖీలు చేపట్టాయని తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురించేయడానికి ప్రయత్నిస్తుండగా ప్రజలు చైతన్యమై సమాచారం అందించడంతోనే మద్యం, నగదు పట్టుబడిందని తెలిపారు. రూ.1.46 లక్షలు స్వాధీనం మన్ననూర్ (అచ్చంపేట): అక్రమంగా తరలుతున్న డబ్బును ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి అమ్రాబాద్ మండలం దోమలపెంటకు చెందిన శివారెడ్డి తన వాహనంతో పాటు మరో రెండు వాహనాల్లో డబ్బులు తీసుకువెళ్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు వాహనాన్ని నిలిపి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందానికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వాహనం తనిఖీ చేయగా రూ.1,46,500 లభించాయి. లేబర్‌కు ఇవ్వాల్సిన డబ్బులు బ్యాంకు నుంచి నాలుగు రోజుల కిందట డ్రా చేశానని, వాటిని కూలీలకు ఇవ్వడం మరిచిపోయానని, అవి నా వాహనంలోనే ఉండిపోయాయని పొంతన లేని మాటలు చెప్పడంతోపాటు ఎలాంటి ఆధారాలు చూపించపోవడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఓ రమేష్ స్వాధీనం చేసుకున్నారు. ఇదిలాఉండగా డబ్బులు తరలిస్తున్న సమాచారం తెలియగానే ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. తనిఖీలో ఎస్ఐలు రామన్‌గౌడ్, బద్యానాయక్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నగదు, ముక్కుపుడకలు పట్టివేత గద్వాల క్రైం: మండలంలోని గోనుపాడు, వీరాపురం, బీరోలు, కుర్వపల్లి, గద్వాల పట్టణంలోని పలు కాలనీలో ఓటర్లకు డబ్బులతోపాటు బంగారు ముక్కుపుడుకలు పంపిణీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలింగ్‌కు కేవలం ఒకేరోజు ఉండటంతో గురువారం పలు కాలనీలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేపట్టగా రూ.85,900 నగదు, 4 ముక్కుపుడకలను పట్టుకున్నారు. అనంతరం 9 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐలు సత్యనారాయణ, నాగశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎవరైనా మద్యం, డబ్బులు, ముక్కుపుడకలు లాంటివి పంపిణీ చేస్తుంటే పోలీసులకు సమాచారం అందించాలని వారు ప్రజలను కోరారు. -
మద్యం, నోట్ల కట్టల కలకలం
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలో ఈదులగూడ వద్ద రోడ్డు పక్కన గురువారం రూ.4లక్షల రూపాయలు దొరకడం కలకలం సృష్టించింది. శుక్రవారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వివిధ పార్టీల నాయకులు డబ్బులు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఎన్నికల విధుల్లో భాగంగా పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద వన్‌టౌన్ సీఐ సదానాగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన సురేందర్‌రెడ్డి వద్ద రూ.40వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను చూసిన సదరు వ్యక్తులు మరో రూ.4లక్షల రూపాయలను రోడ్డు పక్కన పడవేయడంతో గమనించిన పోలీసులు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా డబ్బులను పంపిణీ చేస్తున్న సురేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అదేవిదంగా బంగారుగడ్డలో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్కు చెందిన కోటిరెడ్డి అనే వ్యక్తిని కూడా టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.30వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఏడుకోట్లతండా వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా కె. నరేష్ వద్ద నుంచి 60వేల రూపాయలను స్వాధీనం చేస్తున్నారు. రూ.6.90లక్షలు నగదు పట్టివేత యాదగిరిగుట్ట : ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి అక్రమంగా తీసుకెళ్తున్న నగదును రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎస్ఓటీ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్ఓటీ సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల నేపథ్యంలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని గగన్పాడ్లో గల రాజేంద్రనగర్‌కు చెందిన బూత్కూర్ ఆనంద్ అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై కనిపించాడు. దీంతో ఆనంద్‌ను అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా అతనివద్ద రూ.6.90లక్షలు ఉన్నట్లు గు ర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని డబ్బును సీజ్ చేశారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు.. ఎవరు పంపించారు.. ఎందుకు తీసుకెళ్తున్నాయనే విషయాలపై డబ్బుతో పట్టుబడిన ఆనంద్‌ను విచారిస్తున్నట్లు ఎస్ఓటీ సీఐ రాజు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి పట్టణ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు వెల్లడించారు. ఆలేరులో రూ. 13లక్షలు.. ఆలేరు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు నిర్వహించిన తనిఖీలో ఆలేరు చెక్‌పోస్టు వద్ద గురువారం తెల్లవారుజామున రూ. 13.03లక్షలు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి తొర్రూర్‌కు వెళ్తున్న టాటాఏస్ వాహనంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, కొన్ని కాటన్ డబ్బాలలో కప్పుసాసర్లు ఉన్నాయి. అనుమానం వచ్చిన పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించగా ఓ చిన్న అట్టడబ్బలో డబ్బుల కట్టలు లభ్యమయ్యాయి. దీంతో వాహనంతో పాటు డ్రైవర్ సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై డ్రైవరన్ను విచారించగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆలేరు సాయిబాబా గుడి వద్ద తన వాహనాన్ని ఆపి అట్టడబ్బాల్లో నగదును పెట్టారని ఆ డబ్బును తరలిస్తే రూ. 5వేలు కిరాయి ఇస్తామని మాట్లాడుకున్నారని పోలీసుల విచారణలో తెలిపారు. ఈ తనిఖీ సర్వైవల్ అధికారి జ్ఞానప్రకాశ్ ఆద్వర్యంలో కొనసాగాయి. తన వాహనంలో ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దఅడిశర్లపల్లి : ఎన్నికల దృష్ట్యా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో బుధవారం రాత్రి రూ.లక్ష నగదును పోలీసులు పట్టుకున్నారు. గుడిపల్లి ఎస్ఐ వీరరాఘవులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల విధుల్లో భాగంగా చేపడుతున్న తనిఖీల్లో పీఏపల్లి మండల కేంద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.లక్ష నగదు పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ముమ్మర తనిఖీలు
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అడుగడుగునా తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నగదు, మద్యం తరలిస్తూ పట్టుబడుతున్నారు. ఎన్నికల బందోబస్తుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన పోలీసులతో పాటు కేంద్ర సాయుధబలగాలను వినియోగిస్తున్నారు. పాతబస్తీ,నేరెడ్మెట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో బందోబస్తు విధుల్లో పాల్గొన్న సిబ్బందికి కమిషనర్లు అంజనీకుమార్, మహేష్‌భగవత్, సజ్జనార్ దిశానిర్దేశం చేశారు. సాక్షి, సిటీబ్యూరో ,చాంద్రాయణగుట్ట: హైదరాబాద్ నగరంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. పురానీహవేళీలోని పాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి తనిఖీలను విస్తృతం చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా 4587 లైసెన్స్డ్ తుపాకులను డిపాజిట్ చేసుకున్నామన్నారు. ఆధారాలు చూపని రూ.27 కోట్ల నగదు, రూ.2.5 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఎస్సై స్థాయి అధికారి ఘటనా స్థలంలోనే ఇ–పెట్టి కేసు నమోదు చేసేలా ఎలక్ట్రానిక్ ప్యాడ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 4275 మందిని బైండోవర్ చేశామన్నారు. 165 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు కాగా, అందులో 146 ఎఫ్ఐఆర్లు చేసినట్లు ఆయన వివరిచారు. రౌడీలు బెదిరింపులకు పాల్పడడం, తుపాకుల వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజలు భయం లేకుండా, ప్రశాంతంగా తమ ఓటు వినియోగించుకోవాలని సూచించారు. బందోబస్తు సిబ్బందికి అన్ని సౌకర్యాలు గచ్చిబౌలి: ఎన్నికల పోలింగ్ బందోబస్తును క్రమశిక్షణతో నిర్వహించాలని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బందోబస్తుకు వెళ్లే సిబ్బందిని స్వయంగా కలిసి కరచాలనం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... బందోబస్తులో సౌకర్యాల కోసం రాజకీయ పార్టీల సహకారం తీసుకోరాదని, ప్రభుత్వమే అన్ని సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు పాల్గొన్నారు. రూ.40 లక్షల నగదు పట్టివేత గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీసులు బుధవారం రాత్రి రూ.40 లక్షలు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఐడీబీఐ బ్యాంకు ఆవరణలో కేబీ వేణుగోపాల్‌రాజు, ఎం.అశోక్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తులు రూ. 40 లక్షల నగదు తీసుకెళుతుండగా ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. వీరు కొండాపూర్‌లోని జయశ్రీదేవి హోమ్స్ ప్రైవేటు లిమిటెడ్ యాజమాని వెంకటేశ్వర్రావు వద్ద పని చేస్తున్నట్లు తెలిపారు. నగదుకు సంబందించి ఆధారాలు చూపక పోవడంతో ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాద్‌నగర్‌కు చెందిన ఓ పార్టీ నేతకు చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిలకలగూడలో రూ. 4 లక్షలు స్వాధీనం చిలకలగూడ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు రూ. 4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బొంగుళూరు గేట్‌కు చెందిన కర్నాటి సునీల్ బుధవారం అర్ధరాత్రి ఇన్నోవాలో వెళుతుండగా చిలకలగూడ గాంధీ చౌక్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐ వరుణ్‌కాంత్‌రెడ్డి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా పాలిథిన్ బ్యాగులో రూ. 4 లక్షల నగదును గుర్తించారు. నగదు సంబందించి ఆధారాలు లేకపోవడంతో కారు డ్రైవర్ సునీల్‌ను అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. సదరు వాహనం చంపాపేటకు చెందిన ప్రకాశ్ముదిరాజ్దిగా గుర్తించారు. కోర్టు అనుమతితో సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. మద్యం బాటిళ్లు స్వాధీనం చైతన్యపురి: కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను సరూర్‌నగర్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ రంగస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సరూర్‌నగర్ ఓల్డ్ పోస్టాఫీస్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు కారులో 144 క్వార్టర్ బాటిళ్లు గుర్తించారు.మద్యాన్ని తరలిస్తున్న బైరామల్‌గూడకు చెందిన రాఘవేందర్‌గౌడ్, సరూర్‌నగర్‌కు చెందిన మాచగోని కృష్ణలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మద్యం బాటిళ్లతో పాటు కారును సీజ్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఆర్టీసీ బస్సులో... ఘట్కేసర్: ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు మండలంలోని కేపాల్ చెక్‌పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సులో గురువారం రూ.3,04,000 స్వాధీనం చేసుకున్నారు. కేపాల్ జాతీయ రహదారిపై తనిఖీ చేస్తుండగా భువనగిరి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సులో దత్తాద్రి అనే వ్యక్తి నుంచి నగదు స్వాధీనం చేసుకొని ఎస్ఎస్టీ బృందానికి అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘవీర్‌రెడ్డి తెలిపారు. -
ఓటర్లకు డబ్బులు పంపిణీ అంటూ ఆందోళన
రంగారెడ్డి జిల్లా: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కుత్బుల్లాపూర్ మండలం బాల్‌రెడ్డినగర్ కాలనీలో డబ్బుల పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్ధి ఇందుకూరి సూర్యప్రభ నాయకులతో కలసి ఆందోళనకు దిగారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందన్న భయంతో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తోందని ఆమె ఆరోపించారు. ఒక్కో ఓటరుకు రూ.200 పంపిణీ చేస్తున్నారని.. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సూర్యప్రభ పోలీసులను కోరారు.