money transfer scheme
-
అర్హులందరికీ రైతుబంధు అందాలి
మెదక్‌జోన్: జిల్లాలో అర్హులైన రైతులందరికీ రైతుబంధు పథకం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే అప్లోడ్ కాని రైతుల ఖాతాల వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పెండిం గ్లో ఉన్న ప్రతిరైతు వివరాలను సేకరించాలని సూచించారు. ప్రతి రైతుకు రైతుబంధు చేరాలన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఏరైతూ నష్టపోకుండా చూడాలన్నారు. ప్రతిఅధికారి అప్రమత్తంగా ఉండి రైతుబంధును విజయవంతం చే యాలన్నారు. ప్రతిఐదువేల ఎకరాలకో ఏఈ వోను ప్రభుత్వం నియమించిందని, వారు ప్రతి రోజు రైతులకు అందుబాటులో ఉండి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలి పారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖ అదికా రులు రైతులను కూరగాయల సాగు వైపునకు మళ్లించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాకు హైదరాబాద్ నుంచి కూరగాయల దిగుమతి అవుతోందని, మన జిల్లాకు డిమాండ్ మేర కూరగాయలను మన జిల్లాలోనే సాగయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకోసం అవసరమయ్యే మార్కెట్ సౌకర్యాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలను పం డించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నిగ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో సీతాఫల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తిగల రైతులకు వాటిని అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతిఇంటికి మునగ, బొప్పాయి మొక్కలను అందించాలన్నారు. ఈ సారి హరితహారంలో ప్రజలకు ఇష్టమైన మొక్కలనే పంపిణీ చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పంచయతీ కార్యదర్శులు ఊరూరా సర్వే చేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జిల్లా అధికారి పరశురాం, ఉద్యానవనశాఖ అధికారి నర్సయ్య, మత్స్యశాఖ ఏడీ శ్రీనివాస్‌తో పాటు ఏడీఏలు, ఏవోలు, ఉద్యానవనశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. -
గ్యాస్ సబ్సిడీ సమస్యకు తెర!
వీరఘట్టం, న్యూస్‌లైన్ : వంట గ్యాస్‌పై సబ్సిడీని పొందటానికి వినియోగదారులు పడుతున్న కష్టాలు మరో మూడు రోజు ల్లో తీరనున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి పాత విధానంలోనే సబ్సిడీ గ్యాస్ సిలిం డర్ అందనుంది. ఈ మేరకు గ్యాస్ కంపెనీల నుంచి జిల్లాలోని ఏజెన్సీలకు గురువారం సర్క్యులర్ అందింది. ఇప్పటివరకు గ్యాస్ కనెక్షన్‌తో బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లను అనుసంధానం చేసుకుంటేనే సబ్సిడీ వర్తిస్తుండటంతో వేలాది మంది వినియోగదారులు నష్టపోతున్నారు. జిల్లాలో చాలామందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు రాకపోవటం, వినియోగదారులిచ్చిన వివరాలను గ్యాస్ ఏజెన్సీ లు, బ్యాంకుల సిబ్బంది సరిగా నమోదు చేయకపోవటమే ఈ పరిస్థితికి కారణం. దీనివల్ల సిలిండర్ మొత్తం ధరను వినియోగదారుడే భరించాల్సి వస్తోంది. ఈ భారాన్ని భరించలేక పలు ప్రాంతాల్లో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకుల సిబ్బందితో వాగ్వాదాలకు దిగుతున్నారు కూడా. ఈ నగదు బదిలీ విధానంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పాత విధానంలోనే సబ్సిడీ సిలిండర్లను అందించాలని గ్యాస్ సంస్థలను ఆదేశించింది. జిల్లాలో 2,99,341 మంది గ్యాస్ వినియోగదారులున్నారు. వీరికి హెచ్‌పీ, భారత్, ఇండేన్ సంస్థలకు చెందిన 20 ఏజెన్సీలు సిలిండర్లను పంపిణీ చేస్తున్నాయి. కేంద్రం ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి 430-440 రూపాయలకే సిలిండర్ అందనుండటం వినియోగదారులకు ఊరట కలిగించనుంది. కాగా ప్రభుత్వ నిర్ణయంతో దళారులు మళ్లీ విజృంభించి అక్రమాలకు పాల్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల అధికారి సీహెచ్.ఆనంద్‌కుమార్‌ను ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా గ్యాస్ సబ్సిడీ చెల్లింపునకు ఆధార్, బ్యాంకు లింకేజీని రద్దు చేస్తూ జారీ చేసిన సర్క్యులర్ గురువారం తమకు అందిందని, ఈ నెల 10వ తేదీ నుంచి పాత విధానంలోనే సబ్సిడీ సిలిండర్లు పంపిణీ చేస్తారని వివరించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. -
ఒకటి నుంచి ‘నగదు బదిలీ’
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : నగదు బదిలీ పథకం అమలుకు జిల్లాలో సన్నాహాలు ప్రారంభమయ్యాయి. వంట గ్యాస్‌తో ఈ పథకానికి కేంద్రం శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో మెదక్, నెల్లూరు జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలో కూడా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో 9,44,694 మంది వంట గ్యాస్ వినియోగదారులకు ఈ నగదు బదిలీ పథకం వర్తించనుంది. ఫలితంగా గ్యాస్ సబ్సిడీ డబ్బులు నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకే జమకానున్నాయి. ఈ పథకం వర్తించాలంటే ఆధార్ కార్డు తప్పని సరి. లేనిపక్షంలో నాన్ సబ్సిడీలో రూ.992కు గ్యాస్ సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు డీఎస్ఓ జ్వాలాప్రకాష్ ఈ పథకం అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 93 శాతం ఆధార్ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 42,88,113 మంది జనాభా ఉండగా, వీరిలో 39,99,142 మంది ఆధార్ కోసం వివరాలు నమోదు చేసుకున్నారు. ఇందులో వివిధ కారణాల వల్ల 2,90,883 మందివి తిరస్కరించారు. ఇప్పటికే 28,72,127 మందికి సంబంధించి బెంగళూరు యూఐడీఏఐ నుంచి కార్డులు మంజూరు కాగా, ఇంకా 8,36,132 మందివి మంజూరు కావాల్సి ఉంది. ఇవి పోస్టు ద్వారా సంబంధిత వ్యక్తులకు అందడానికి కొంత సమయం పడుతుంది. జనాభా గణాంకాల ప్రకారం ఇంకా 5,79,854 మంది ఆధార్ తీసుకోవాల్సి ఉంది. వీరు అక్టోబర్ ఒకటో తేదీలోగా ఆధార్ కోసం వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంది. ఒకవేళ ఆధార్ నమోదు చేసుకున్నప్పటికీ కార్డులు రానివారు దగ్గరలో ఉన్న మీసేవా కేంద్రానికి వెళ్లి నిర్ణీత రుసుము చెల్లిస్తే కార్డు వివరాలు తెలియజేస్తారు. ఇంటర్నెట్ ద్వారా ఠీఠీఠీ.ఠజీఛ్చీజీ.జౌఠి.జీ వెబ్సైట్లో ఆధార్ కార్డు స్థితిగతులను తెలుసుకోవచ్చు. కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
నగదు బదిలీకేదీ ‘ఆధార’ం..?
నల్లగొండ న్యూస్‌లైన్ అర్హులైన పేదలు ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్ గుర్తింపు కార్డు కావాల్సిందే. ప్రతి వ్యక్తికీ యూనిక్ సంఖ్యతో ఆధార్‌కార్డు జారీ చేయడం ద్వారానే ఇకపై అన్ని రకాల సేవలందించాలని కేంద్రం ముందుకొచ్చిన విషయం విదితమే. ఈ కార్డుతో ప్రధానంగా అనుసంధానమయ్యే పథకం నగదు బదిలీ. అయితే జిల్లాలో అక్టోబర్ నెల నుంచి ఆరంభం కానున్న నగదు బదిలీ పథకం అమలుపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో జారీ చేసిన ఆధార్ కార్డులతో పాటు, సమాచారం సేకరించి జారీ చేయని కార్డులు, తాజాగా ఏర్పాటు చేసిన 52 ఆధార్ నమోదు కేంద్రాల ద్వారా సేకరిస్తున్న సమాచారంతో కార్డులు ఎప్పుడు జారీ చేస్తారో తెలియడం లేదు. దీంతో ఆధార్ నమోదు పొందని వారిలో గుబులు రేపుతోంది. జిల్లాలో మొత్తం 43లక్షల జనాభా ఉండగా ఇప్పటి వరకు కేవలం 29లక్షల 42వేల 420మంది మాత్రమే ఆధార్ కార్డులు నమోదు చేయించుకున్నారు. అక్టోబర్ నుంచే నగదు బదిలీ పథకం అమలు కానుండడంతో మిగతా వారికి ఈ పథకం అమలు గగనకుసుమంగా మారింది. నగదు బదిలీ పథకం అమలు ఇలా.. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో కోట్లాది రూపాయలు భరిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలన్న కోణంపై దృష్టి కేంద్రీకరించింది. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదని, ఈ నేపథ్యంలో నగదు బదిలీ పథకం తెరపైకి తీసుకొచ్చి క్రమంగా దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగంలోకి దిగింది. అంతకుముందు పలు దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న విషయాన్ని గుర్తించిన కేంద్రం మన దేశంలో కూడా అమలు చేయాలని సంకల్పించింది. ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలనే కోణంలో దేశంలోనే విశిష్ట గుర్తింపు పొందిన ఓ సంస్థ ద్వారా అధ్యయనం చేయించింది. కిరోసిన్, వంటగ్యాస్, ఎరువులకు చెందిన రాయితీలను ఏవిధంగా వినియోగదారుల ఖాతాలోకి జమచేయాలో సిఫార్సు చేసింది. అందులో భాగంగా రూ.వెయ్యి సబ్సిడీ దాటితే నగదు బదిలీ లబ్ధిదారుని ఖాతాలో జమచేయాలని తీర్మానించారు. ఇదిలా ఉండగా నగదు బదిలీకి ఆధార్‌కార్డును అనుసంధానం చేస్తుండగా, గ్యాస్, ఫించన్లు, ఎరువులు, పంట రుణాలు, జననీ సంరక్షణ యోజన పథకాలన్నీ నగదు బదిలీ పథకానికి వర్తింపజేయనున్నారు. తక్షణమే గ్యాస్ సబ్సిడీకి అవకాశం వంట గ్యాస్ నగదు బదిలీ పొందడానికి తక్షణమే ఇలా చేయాల్సి ఉంది. ఆధార్‌కార్డు, గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరిట ఉందో వారికి సంబంధించిన ఆధార్‌నంబరు, బ్యాంక్ అకౌంట్, రేషన్‌కార్డు జీరాక్స్ కాపీలను గ్యాస్ డీలర్లకు అందజేయాలి. ఏడాదికి తొమ్మిది సిలిండర్లు ఇవ్వనుండగా, సిలిండర్ బుక్ చేసుకోగానే రూ.1022 పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. సిలిండర్ పొందగానే రూ.535 వినియోగదారుని బ్యాంక్ ఖాతాలో జమవుతాయి. వాస్తవానికి నగదు బదిలీ పథకాన్ని సెప్టెంబర్‌లోనే ప్రారంభించాల్సి ఉన్నా ఆ గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 30వరకు గడువు పొడిగించింది. ఈ లోపు ప్రతి ఒక్కరూ ఆధార్‌కార్డు, గ్యాస్ కనెక్షన్, బుక్‌నంబర్, రేషన్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పకుండా డీలర్లకు అందజేయాలి. లేకుంటే నగదు బదిలీ పథకానికి అర్హత పొందలేరు. అక్టోబరు నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ : జేసీ హరిజవహర్‌లాల్ కలెక్టరేట్ : వచ్చే నెల 1వ తేదీ నుంచి ఎల్పీజీ గ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమలు అవుతున్నందున గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ నంబర్‌ను బ్యాంక్‌లో తెలియజేయాలని జేసీ హరిజవహర్‌లాల్ కోరారు. గురువారం తన ఛాంబర్లో గ్యాస్ ఏజేస్సీలు, బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యాస్ వినియోగదారులు ప్రతి ఒక్కరూ సంబంధిత గ్యాస్ ఏజెన్సీల దగ్గర ఉన్న ఆధార్ లింకేజీ అప్లికేషన్ ఫామ్‌ను తీసుకుని పూర్తి చేసిన వివరాలను, సంబంధిత బ్యాంకులలో అందజేసే విధంగా చర్యలు తీసుకోవాల న్నారు. సమావేశంలో సహాయ పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, ఇండియన్ అయిల్ కార్పొరేషన్ సీనియర్ మేనేజర్ ిచంద్రశేఖర్, ఎల్పీజీ సేల్స్ ఆఫీసర్ ఉపేందర్, ఐఓసీ డిస్ట్రిబ్యూటర్ వెంకటరమణ, జేమ్స్ పాల్గొన్నారు. -
ముగిసిన ఆధార్ సీడింగ్ గడువు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్యాస్ సిలిండర్ రాయితీ ఇకపై బ్యాంకు ఖాతాలోనే జమ కానుంది. నేటినుంచి జిల్లాలో నగదు బదిలీ పథకం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా ఆగస్టు 31నాటికి గ్యాస్ సిలిండర్ వినియోగదారుల ఆధార్ వివరాలను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు చెబుతూ వచ్చింది. అయితే ఈ ఆదేశాలపై యంత్రాంగం అలసత్వంగా వ్యవహరించిందో.. లేక అమలు ప్రక్రియ భారమైందో గానీ జిల్లాలో కేవలం 41.2 శాతం వినియోగదారుల ఆధార్ వివరాలు మాత్రమే బ్యాంకు ఖాతాతో అనుసంధానమయ్యాయి. జిల్లాలో 55 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో మొత్తం 13,15,157 గ్యాస్ కనెక్షన్లున్నాయి. శనివారం గడువు ముగిసే నాటికి కేవలం 5,41,263 మంది వినియోగదారుల ఆధార్ కార్డు వివరాలు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయ్యాయి. దీంతో వీరికి మాత్రమే నగదు బదిలీ వర్తించనుంది. అడుగడుగునా నిర్లక్ష్యమే..! జిల్లాలో ఆధార్ నమోదుపై యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాదాపు ఏడాదిన్నరగా జిల్లాలో ఆధార్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 105శాతం నమోదు ప్రక్రియ పూర్తిచేసినట్లు ఓవైపు అధికారుల గణాంకాలు చెబుతుండగా.. మరోవైపు జిల్లాలో కొనసాగుతున్న 200 ఆధార్ కేంద్రాల వద్ద నమోదు కోసం జనాలు బారులు తీరుతున్నారు. అంటే నమోదు ప్రక్రియ ఎంత అస్తవ్యస్తంగా సాగిందో స్పష్టమవుతోంది. మరోవైపు ఆధార్ వివరాలను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసేందుకు అధికారులు దాదాపు ఆర్నెల్ల క్రితం చర్యలకు ఉపక్రమించారు. అయితే ఇప్పటివరకు కేవలం 41.2శాతం మాత్రమే పూర్తిచేశారు. ఈ ప్రక్రియలో గ్యాస్ ఏజెన్సీలను భాగస్వామ్యం చేసినప్పటికీ.. నత్తనడకన సాగుతోంది. అలసత్వం వహించే ఏజెన్సీలను రద్దు చేస్తామంటూ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన యంత్రాంగం.. కేవలం ఇలాంటి ప్రకటనలకే పరిమితమైంది. వారికి మార్కెట్ ధరకే సిలిండర్... ఆధార్ వివరాలు బ్యాంకు ఖాతాతో అనుసంధానం (సీడింగ్) కానివారికి ఈ రోజు నుంచి గ్యాస్ సిలిండర్ మార్కెట్ ధరకే విక్రయించనున్నారు. సీడింగ్ ప్రక్రియ పూర్తి చేసిన వారికి రాయితీ నిధులు నేరుగా బ్యాంకు ఖాతాకు జమచేస్తారు. మిగిలిన వినియోగదారులకు సీడింగ్ ప్రక్రియ పూర్తిచేసిన తర్వాతే ఈ రాయితీ ఇస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ.. ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యేది అనుమానమేనని తెలుస్తోంది. దీంతో వారి రాయితీ నిధులు ఎప్పుడందుతాయనే అంశంపై సందిగ్ధం నెలకొంది. బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానమైన వినియోగదారుల సంఖ్య ఆయిల్ కంపెనీ మొత్తం వినియోగదారులు సీడింగ్ అయినవి బీపీసీ 163292 67452 హెచ్పీసీ 510099 225976 ఐఓసీ 641766 247835 నేడూ పనిచేయనున్న బ్యాంకులు గ్యాస్ వినియోగదారులు తమ ఆధార్ వివరాలను సమర్పించడానికి వీలుగా ఈ ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. శ్రీధర్ తెలిపారు. ఇప్పటికీ ఆధార్ వివరాలను బ్యాంకు ఖాతాలకు లింక్ చేసుకోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లేకపోతే సబ్సిడీ వర్తించదని, పూర్తి డబ్బులు చెల్లించి సిలిండర్ పొందాల్సి ఉంటుందని, శనివారంతోనే గడువు ముగిసిందని గుర్తుచేశారు. ఇప్పటివరకూ బ్యాంకు ఖాతా లేని వినియోగదారులు కొత్త ఖాతాలు తెరుచుకోవాలని సూచించారు.