Monkeygate
-
‘మంకీ గేట్ వివాదంతో తాగుబోతునయ్యా’
సిడ్నీ : మంకీ గేట్ వివాదం గురించి తెలియని క్రికెట్ ప్రేమికులుండరు. భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్, ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌ల మధ్య చోటుచేసుకున్న ఈ వివాదం అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. 2008 సిడ్నీ టెస్ట్‌లో చోటు చేసుకున్న ఈ వివాదాన్ని తాజాగా ఆండ్రూ సైమండ్స్ మరోసారి ప్రస్తావించాడు. ఈ వివాదం తనను ఓ తాగుబోతుని చేసిందని, దీంతోనే తన జీవితం నాశనమైందని నాటి సంఘటనను గుర్తుచేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఆ వివాదంతో నేను ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోడం మొదలు పెట్టాను. దీంతో నా కెరీర్ కూడా నాశనమవడం ప్రారంభమైంది. ఆ ఘటనతోనే నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. ఈ వివాదంపై నేను డీల్ చేసిన విదానం కూడా సరైది కాదు. చాలా గిల్టీగా ఫిలయ్యాను. ఇక చాలా సార్లు హర్భజన్ నన్ను దూషించాడు. భారత్‌లోనే నన్ను మంకీ అని పిలిచాడు. ఈ విషయంపై నేను అతని డ్రెస్సింగ్ రూం వెళ్లి మరి మాట్లాడాను. అలా పిలవడం ఆపకపోతే పెద్ద సమస్య అవుతోందని చెప్పాను’ అని నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ బాధపడ్డాడు. అయితే 2009లో చివరి మ్యాచ్ ఆడిన సైమండ్స్.. చాలా సార్లు జట్టు నిబంధనలు బ్రేక్ చేయడంతో క్రికెట్ ఆస్ట్రేలియా అతని కాంట్రాక్టును రద్దు చేసింది. ఇక సిడ్నీ టెస్ట్‌లో హర్భజన్ తనను మంకీ అని జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో వివాదస్పదమైంది. దీంతో రిఫరీ హర్భజన్‌పై మూడు టెస్ట్‌ల నిషేధం విధించాడు. అయితే ఈ వివాదంలో భజ్జీ తప్పులేదని అప్పటి భారత్ ఆటగాళ్లు స్పష్టం చేశారు. నిషేధం ఎత్తేయకపోతే సిరీస్ నుంచి తప్పుకుంటామని కూడా హెచ్చరించారు. దీంతో వెనక్కి తగ్గిన అప్పీల్స్ కమిషనర్ జాన్ హనెసన్ భజ్జీ శిక్షను రద్దు చేశారు. చదవండి: మంకీగేట్ : మర్చిపోలేని వివాదం -
మంకీగేట్ : మర్చిపోలేని వివాదం
జోహాన్స్‌బర్గ్ : క్రికెట్ ప్రేమికులందరికీ మంకీగేట్ వివాదం బాగా గుర్తుండే ఉంటుంది. హర్భజన్ సింగ్, ఆండ్రూ సైమండ్స్ మధ్య వివాదాన్ని దశాబ్దం తరువాత నాటి మ్యాచ్ రెఫరీ మైక్ ప్రోక్టర్ మరోసారి తెరమీదకు తెచ్చాడు. ఈ ఘటనపై మైక్ ప్రొక్టర్ సచిన్ పాత్రపై సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించాడు. రెఫరీగా తన అనుభవాలను పొందుపరుస్తూ మైక్ ప్రోక్టర్ తన ఆత్మకథను రచించాడు. అందులో 2008 సిడ్నీటెస్ట్ మంకీగేట్ ఉదంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. సిడ్నీలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ తన దగ్గరికి వచ్చి.. హర్భజన్ సింగ్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదు చేశాడు. బౌలింగ్ ఎండ్‌కు సమీపంలో ఉన్న ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ని మంకీ అని సంబోధించినట్లు పాంటింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పాంటింగ్ ఫిర్యాదుపై సచిన్ టెండూల్కర్ తీవ్రంగా స్పందించాడు. హర్భజన్ మంకీ అనలేదని.. హిందీలో ‘తేరి మా.. కి...’ అని అన్నట్లు సచిన్ విచారణ కమిటీ ముందు స్పష్టం చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న నేను హర్భజన్‌పై మూడు టెస్టుల నిషేధాన్ని విధించినట్లు మైక్ ప్రోక్టర్ ఆత్మకథలో గుర్తు చేసుకున్నారు. అయితే, అప్పీల్స్ కమిషనర్ జాన్ హనెసన్ ముందు హర్భజన్‌కు సచిన్ మద్దతుగా నిలవడంతో, అతను ఈ శిక్షను రద్దు చేశారు. హర్భజన్‌కు శిక్ష రద్దు చేయడం నన్ను చాలా నిరుత్సాహ పరిచిందని ప్రోక్టర్ ఆత్మకథలో పేర్కొన్నారు. మాకు 22 గజాల దూరంలో ఉన్న సచిన్ టెండూల్కర్‌కు ‘మంకీ’ ‘మా..కీ’ అనే పదాల మధ్య వ్యత్యాసం అంత స్పష్టంగా ఎలా వినిపించిందన్నదే నాకు అంతుచిక్కలేదని అందులో తెలిపారు. విచారణ కమిటీ ముందు తనకు ఇంగ్లీషు పెద్దగా రాదని హర్భజన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. హర్భజన్‌కు ఇంగ్లీష్ బాగా వస్తుందని.. అయితే వివాదం నుంచి బయటపడేందుకే అతను అలా చెప్పివుంటాడని ఆత్మకథలో ప్రోక్టర్ రాసుకున్నారు. అత్యున్నత స్థాయి వ్యక్తులు, శక్తుల జోక్యంతో వివాదం సద్దుమణిగిందని పుస్తకంలో ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంలో హర్భజన్‌కు సచిన్ టెండూల్కర్‌తో పాటు, జట్టు మేనేజర్ చేతన్ చౌహాన్, బీసీసీఐ కూడా మద్దతు తెలిపిందని అందులో చెప్పుకొచ్చారు. భారత్ క్రికెట్ జట్టు 2007-08 సీజన్లో ఆస్ట్రేలియాలో పర్యటిచింది. భారత జట్టు సిడ్నీలో రెండో టెస్టు ఆడుతోంది. ఆడుతున్న భారత్ భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ని మంకీ అని సంబోధించినట్లు వివాదం చెలరేగింది. -
మంకీగేట్: భజ్జీ ఏం తిట్టాడో 'ఆయన'కే తెలుసట!
కోల్‌కతా: 2007-08లో భారత్-ఆస్ట్రేలియా సిరీస్ రెండో టెస్టు సందర్భంగా చోటుచేసుకున్న 'మంకీగేట్' వివాదం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో తనను ఉద్దేశించి భారత బౌలర్ హర్భజన్ సింగ్ 'మంకీ' (కోతి) అన్నాడని, ఇవి జాతివిద్వేషపూరితమైన వ్యాఖ్యలని ఆసీస్ బ్యాట్స్‌మన్ ఆండ్రూ సిమండ్స్ అప్పట్లో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం చినికిచినికి ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై ప్రభావం చూపించేంతగా దుమారం రేపింది. అయితే, ఈ వివాదానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆస్ట్రేలియా క్రికెటర్ మైఖేల్ క్లార్ తాజాగా స్పందించారు. క్లార్క్ ఆత్మకథ 'మై స్టోరీ' పుస్తకాన్ని కోల్‌కతాలో ఆవిష్కరించిన సందర్భంగా 'మంకీగేట్' వివాదాన్ని సరదాగా గంగూలీ ప్రస్తావించారు. 'కొన్నిసార్లు అసలైన నిజమేమిటో ప్రపంచానికి తెలియజేయాల్సి ఉంటుంది. కానీ, ఈ పుస్తకంలో 'మంకీగేట్' అధ్యాయం గురించి పూర్తి వాస్తవాలు మీకు లభించకపోవచ్చు' అని పేర్కొన్నారు. ఇంతకూ సిమండ్స్‌ను భజ్జీ 'మంకీ' అన్నాడా? లేక ఇంకా ఏదైనా తిట్టాడా? అన్నది ఇప్పటికీ మిస్టరీనే.. దీనిపై స్పందిస్తూ.. అప్పుడు హర్భజన్ ఏం అనాలనుకున్నాడో కేవలం 'సర్దార్జీ'కి మాత్రమే తెలుసునని గంగూలీ చమత్కరించారు. ఈ వివాదాన్ని మీరు 'మంకీగేట్' లేదా, 'హనుమాన్ గేట్' అని ఎలాగైనా పిలుచుకోవచ్చునని సలహా ఇచ్చారు. సిమండ్స్ ఈ వివాదాన్ని మరీ ఇంతదూరం లాగి ఉండాల్సింది కాదని క్లార్క్ పేర్కొన్నారు. -
మాకంటే భారత్ ముఖ్యమనుకున్నారు
మెల్బోర్న్: ఐదేళ్ల నాటి ‘మంకీ గేట్’ వివాదాన్ని ఇటీవలే మళ్లీ రేపిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్... ఈ సారి తన సొంత బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పైనే విమర్శలు గుప్పించాడు. 2008లో జరిగిన ఆ వివాదం సమయంలో తనకు, జట్టు ఆటగాళ్లకు మద్దతు పలకకుండా సీఏ తమను తీవ్రంగా నిరాశ పరిచిందని అతను అన్నాడు. ‘ఎట్ ద క్లోజ్ ఆఫ్ ప్లే’ పేరిట రాసిన తన పుస్తకంలో పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఆ ఉదంతంలో మా బోర్డు స్పందనపై కూడా మాట్లాడాల్సి వస్తోంది. నాతో పాటు మా జట్టు ఆటగాళ్లకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, మమ్మల్ని పట్టించుకోకుండా భారత్‌తో సంబంధాలే ముఖ్యం అనే తీరుగా సీఏ వ్యవహరించింది. దానిని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను’ అని పాంటింగ్ విమర్శించాడు. మరో వైపు సచిన్ 200వ టెస్టు ఆడనున్న నేపథ్యంలో... అతడిని సాంకేతికంగా అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పాంటింగ్ ప్రశంసించాడు.