morals
-
మనోబలమే మహౌషధం
దేశ రక్షణకు ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడే వీర సైనికులలో వున్నది ఈ మనోబలమే! శత్రువులు మూకుమ్మడిగా చుట్టూముట్టినా, శరీరాన్ని ఛిద్రం చేస్తున్నా ప్రతిఘటించాలన్న కాంక్షవారికుండటానికి కారణం అబ్బురపరిచే వారి మానసిక స్థైర్యమే. కష్టాలు ఒక్కసారిగా చుట్టిముట్టినప్పుడు మనిషి నిబ్బరంగా ఉండగలగటమే ధీరత్వం అంటే! క్లిష్ట పరిస్థితులలో నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. ఆశ సన్నగిల్లుతుంది. మనసు నిలకడను కోల్పోతుంది. ఏదో తెలియని భీతి మనసులో తిష్ఠ వేస్తుంది. దాంతో కుంగిపోతాడు. మానసిక ప్రశాంతతకు దూరమవుతాడు. ఆశాæకిరణం కనుచూపు మేరలో లేదని, తను ఈ గడ్డుకాలం నుంచి బైట పడలేననే భయం ఏర్పడుతుంది. తన జీవితాన్ని అర్ధంతరం గా ముగించే ప్రయత్నం కూడా చేస్తాడు. ఈ కరోనా కష్ట కాలంలో మనలో చాలామంది ఈ స్థితిలోనే ఉన్నాం. శారీరక వ్యాయామం వల్ల శరీరం మాత్రమే దృఢమవుతుంది. కాని ప్రశాంతతకు దూరమైన మనసు బలహీనమవుతుంది. అది మన లోని శక్తిని నీరుకారుస్తుంది. అసహనంతో అకారణమైన, అసమంజసమైన కోపాన్ని కుటుంబ సభ్యుల మీద చూపి, వారి ప్రేమకు దూరమయేలా చేస్తుంది. వారిది కూడ తనలాంటి మానసిక స్థితేనా? అన్న ఆలోచన, విచక్షణ వివేచనలు కోల్పోయిన మనసుకు తోచదు. అది తన కుటుంబానికే కాక సమాజానికి, దేశానికి చేటు చేస్తుంది. మరెలా దీన్ని అధిగమించాలి? ఓర్పుతో మాత్రమే దీన్ని అలవరుచుకోవాలి. ఓర్పే నేటి గడ్డు కాలంలో గొప్ప రక్షణ కవచం. ‘దుర్దశే మనిషి వ్యక్తిత్వానికి గీటురాయి ‘ అన్నాడు ప్రపంచ విఖ్యాత నాటకకర్త షేక్సి్పయర్. అదే మనిషిలోని ధీ శక్తిని వెలికి తీసే అవసరాన్ని, అవకాశాన్ని కల్పిస్తుంది. మనిషి వ్యక్తిత్వానికి పరీక్ష పెట్టే కష్టాలు, అననుకూలతలు ఏర్పడినప్పుడు మనిషి కి మనోబలం అవసరం. మనోబలమున్న ధీరులలో స్వీయ క్రమశిక్షణ, స్వీయ ఆదేశాలు, ఆచరణ అంతర్వాహినిగా ఉంటాయి. మనోబలం వల్ల ఈ కష్టాల ఊబి నుండి బైట పడగలిగే శక్తి చేకూరుతుంది. సాధారణంగా మనోబలం కలవారు తక్కువ మాట్లాడతారు. ఎక్కువ పని చేస్తారు. కొందరయితే మౌనంగా, గంభీరంగా వుంటారు. నిరంతరం కార్యనిర్వహణలో నిమగ్నమై వుంటారు. ఎంత మనోబలం వున్నా బాగా శ్రమించి పనిచేస్తేనే ఆశించిన ఫలితం దక్కుతుంది. మనం కూడా మంచి ఆలోచనలతో, పట్టుదలతో కృషి చేయాలి. మానసికంగా బలంగా వున్నప్పుడు, శారీరకంగా శక్తిమంతుడు కాకపోయినా ఏమైనా చేయగలనన్న ధీమా ఉంటుంది. ఎవరినైనా, దేన్నైనా ఎదుర్కొనే సంసిద్ధత వస్తుంది. ఆ మానసిక సంసిద్ధతే నేడు కావలసింది. దానిని అందరూ అలవరచుకుంటూ, పెంచుకుంటూ మానసికంగా బలోపేతులు కావాలి. ఎవరు కాలం కంటే ముందు పరుగులు తీయగలరో, ఎవరు సంకల్పంతో కాల పరిధుల్ని, అవధుల్ని అధిగమించగలరో వారే విజేతలు. పరిమిత జీవిత కాలంలో అపరిమిత కృషితో అద్భుత ఫలితాలు సొంతం చేసుకున్నవారే కాలాతీతవ్యక్తులు. వారే శాస్త్రజ్ఞులు, సంస్కర్తలు, దేశభక్తులు, త్యాగమూర్తులు, దేశరక్షణలో ప్రాణత్యాగాలు చేసే పరమ యోధులు. మన కృషి తీవ్రతను బట్టి గమ్యం సమీపమో, సుదూరమో నిర్ణయమవుతుంది. సమీప గమ్యమే మన లక్ష్యమైనపుడు సంకల్పబలం దాన్ని తప్పకుండా సుసాధ్యం చేస్తుంది. మనోబలం అందుకు దన్నుగా నిలుస్తుంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను రూపుమాపటానికి, అభ్యుదయ మార్గంలో సమాజాన్ని నడిపించటానికి రాజా రామమోహన రాయ్, కందుకూరి వీరేశలింగం, జ్యోతి రావు ఫూలే వంటి అనేక మంది సంస్కర్తలు తమ జీవితాన్ని సమాజం కోసం ధార పోశారు. సమాజం నుంచి ఎన్నో ప్రతికూలతలు, అవమానాలు, బెదిరింపులు ఎదుర్కొన్నారు. అయినా, మొక్కవోని మనోబలంతో అనుకున్న లక్ష్యాలను సాధించారు. ఈ తరం న్యూటన్‌గా ప్రపంచం కొనియాడిన స్టీఫెన్ విలియం హాకింగ్స్ నరాలకు సంబంధించిన వ్యాధి పీడితుడై, శరీరం చచ్చుబడినా, తన అమోఘమైన మేధస్సుతో అనేక పరిశోధనలు, ఆవిష్కరణలు చేసాడు. మనోబలానికి ఇంతకన్నా నిలువెత్తు నిదర్శనం ఏముంటుంది? దేశ రక్షణకు ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడే వీర సైనికులలో వున్నది ఈ మనోబలమే! శత్రువులు మూకుమ్మడిగా చుట్టూముట్టినా, శరీరాన్ని ఛిద్రం చేస్తున్నా ప్రతిఘటించాలన్న కాంక్ష వారికుండటానికి కారణం అబ్బురపరిచే వారి మానసిక స్థైర్యమే. అనేక ప్రకృతి వెపరీత్యాలకు, మానవ ప్రేరిత విధ్వంసాలకు, ప్రజ అతలాకుతలమైంది. కాని, గుండె దిటవు చేసుకుంటూ తునాతునకలైన ఆశను మనోబలంతో ప్రోది చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూనే ఉంది. ఇన్ని విపత్తులను దాటటానికి మనోబలమే కారణం. మనోబలమే మనిషికి నిజమైన శక్తి! ప్రస్తుత కాలంలో జనాన్ని వణికిస్తూ, భయభ్రాంతులను చేస్తున్న కరోనాను సులభంగా జయించటానికి అవసరమైనది ఈ మనోబలమే! కాబట్టి మనోబలాన్ని రక్షణ కవచంగా చేసుకుని ధైర్యంగా ముందుకు వెళదాం. కరోనా మహమ్మారి బారిన పడకుండా కాపాడుకుందాం. – బొడ్డపాటి చంద్రశేఖర్ -
అమిత్ షా నీతులు చెప్పాల్సిన అవసరం లేదు
మంత్రి హరీశ్‌రావు భూపాలపల్లి: నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రెండేళ్లలో కేంద్రం చేసిందేమీ లేదని, బీజేపీ నేత అమిత్‌షా నీతులు చెప్పాల్సిన అవసరం లేదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. స్పీకర్ సి.మధుసూదనాచారి శాసన సభాపతిగా ప్రమాణ స్వీకారం చేసి శుక్రవారంతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని అంబేడ్కర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణపై కేంద్రానికి ఏ మాత్రం ప్రేమ లేదన్నారు. ఈ ప్రాంతంలోని ఆరు మండలాలను ఆంధ్రాలో కలిపి తెలంగాణ వచ్చిన సంతోషం కూడా లేకుండా చేసిందన్నారు. 365 రోజులు ఉచితంగా కరెంటును అందించే లోయర్ సీలేర్ కరెంటును ఆంధ్రాకు అప్పగించి అన్యాయం చేసిందని ఆరోపించారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి.. తెలంగాణలోని కాళేశ్వరం, ప్రాణహితను పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శించారు. దేశ విదేశాల్లో తిరుగుతున్న ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో ఒక్కసారి కూడా పర్యటించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రాలు విడిపోయినా హైకోర్టును ఎందుకు విభజించడం లేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందే నిజమైతే.. ఢిల్లీ, బిహార్, తమిళనాడులో ఆ పార్టీ ఎందుకు పరాజయం పాలైందని ప్రశ్నించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరెంటు విషయమై అమిత్‌షా సూర్యాపేట ప్రజలను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని, తమ ప్రభుత్వం గిరిజన గూడాల్లో సైతం 24 గంటల కరెంట్ అందిస్తుందన్నారు. సీఎం చంద్రశేఖరరావు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్రమోదీ మన్‌కీ బాత్‌లో మెచ్చుకుంటుంటే అమిత్‌షా ఇక్కడికి వచ్చి ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ సభలో మంత్రులు పోచారం, చందూలాల్ పాల్గొన్నారు. -
సోషల్ మీడియాతో మోరల్స్ దెబ్బతింటాయి
వాషింగ్టన్: ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాను ఎక్కువ ఉపయోగించే వారిలో జ్ఞానశక్తి తగ్గిపోతుందని, నైతిక శూక్యత కూడా ఏర్పడుతుందని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంకు చెందిన దాదాపు రెండువేల మంది విద్యార్థులపై జరిపిన ఓ అధ్యయనం వెల్లడించింది. ‘రిఫ్లెక్టివ్ థాట్’...అంటే స్వీయానుభవాలకు ఆలోచనలు ముడిపెట్టి ఆలోచనా పరిధిని విస్తరించుకోవడం కూడా తగ్గిపోతుందని తేలింది. నైతిక విలువల లక్ష్యాలను నిర్దేశించుకోకపోవడమే కాకుండా సుఖలాలసత పెరుగుతుందని అధ్యయనం పేర్కొంది. సోషల్ మీడియాలో పంచుకునే ఆలోచనలు, అభిప్రాయాలు, వ్యాఖ్యాన్యాలు, సందేశాలు సంక్షిప్తంగా ఉండడమే కాకుండా వేగంగా స్పందించాల్సిన అవసరం ఉండడం వల్ల రిఫ్లెక్టివ్ థాట్ క్షీణించి పోతోందని ప్రముఖ టెక్ రైటర్ నికోలస్ జీ. కార్ తన ‘ది షాలోస్’ అనే పుస్తకంలో కూడా పేర్కొన్నారు. నైతిక విలువల లక్ష్యాలకు అంతగా ప్రాధాన్యత కూడా ఇవ్వరని ఆయన తెలిపారు. సమాచార మార్పిడి కోసం సోషల్ మీడియాను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తుంటే అంత ఎక్కువగా రిఫ్లెక్టివ్ థాట్ ప్రక్రియ దెబ్బతింటూ వస్తుందని ఆయన చెప్పారు. విస్కాన్సిన్ యూనివర్శిటీ విద్యార్థులపై జరిపిన అధ్యయనంలో కూడా ఇవే విషయాలు వెలుగు చూశాయి. ‘జీవితంలో నైతికంగా నేను ఈ విలువలను సాధించాలనుకుంటున్నాను. నైతికతంగా నేను ఇలా జీవించాలనుకుంటున్నాను’ అనే అంశాలు అస్సలు ఆలోచించడం లేదని అధ్యయనంలో పాల్గొన్న మెజారిటీ విద్యార్థులు తెలిపారు. జీవితంలో సుఖంగా బతకాలని, ప్రతిష్ట కలిగిన పదవులను కోరు కుంటున్నట్లుగా కూడా వారు చెప్పారు. -
‘న్యాక్’ వివాదం కొత్త మలుపు
సీఎం చైర్మన్‌గా కొత్త పాలక మండలి ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం రెండ్రోజుల క్రితం ఇదే తరహా ఉత్తర్వులిచ్చిన ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇరు రాష్ట్రాల మధ్య మరింత ముదిరిన లొల్లి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య నలుగుతున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) వివాదం కొత్త మలుపు తిరిగింది. న్యాక్‌కు ఆంధప్రదే శ్ సీఎం చైర్మన్‌గా పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసిన 48 గంటల్లోనే... తెలంగాణ ప్రభుత్వం పాలక మం డలిని నియమించింది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా, రోడ్లు భవనాల శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా, న్యాక్ డీజీ సభ్య కార్యదర్శిగా, మరో 23 మందిని సభ్యులుగా పేర్కొంటూ తెలంగాణ సర్కారు బుధవారం ఉత్తర్వు జారీ చేసింది. దీంతో న్యాక్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య అంతరం మరింత పెరిగింది. ఇప్పటికే పలు సమావేశాల పేరుతో తెలంగాణ సీఎం తరచూ న్యాక్‌కు వెళ్తున్నారు. ఏపీ సీఎం అక్కడికి వెళ్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారటం ఖాయమని అధికారులు పేర్కొంటున్నా రు. సొసైటీ జాబితాలో ఉన్నందున న్యాక్ విభజన జరగలేదు. సొసైటీల చట్టాన్ని మార్చనందున న్యాక్ తమకే దక్కుతుందని ఏపీ వాదిస్తుండగా, తెలంగాణలో ఉన్నం దున మాకే చెందుతుందని ఈ ప్రభుత్వం పేర్కొంటోంది. పాలక మండలిలో సభ్యులు వీరే... తెలంగాణ ప్రభుత్వం న్యాక్‌కు ఏర్పాటు చేసిన పాలక మండలి సభ్యులు వీరే.. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ డీజీ, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఢిల్లీ) అధ్యక్షుడు, ఆ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ చైర్మన్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఢిల్లీ) చైర్మన్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ రీసెర్చ్ కౌన్సిల్ (ఢిల్లీ) డెరైక్టర్, నేషనల్ కౌన్సిల్ ఫర్ క న్‌స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ డెరైక్టర్, జేఎన్టీయూ వీసీ, ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ డెరైక్టర్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డీజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ చాప్టర్ చైర్మన్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీ, గృహ నిర్మాణం, ఆర్అండ్బీ, పురపాలక, నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వీసీఎండీ, గృహ నిర్మాణ సంస్థ, పోలీసు గృహ నిర్మాణ సంస్థల ఎండీలు, ఆర్అండ్బీ ఈఎన్సీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్, డీఆర్డీవో అడిషనల్ డీజీలు. చంద్రబాబు నోట నీతులు.. చేతల్లో రోతలు: మంత్రి హరీశ్‌రావు ఏపీ సీఎం చంద్రబాబు నోటితో నీతు లు చెబుతూ రోత పనులకు దిగజారుతున్నారని మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి శాసనసభాపక్ష కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ‘న్యాక్’ కేంద్ర గవర్నింగ్ బాడీకి చంద్రబాబే చైర్మన్‌గా నియమించుకోవడం దుర్మార్గానికి పరాకాష్ట అన్నారు. ఫిబ్రవరి దాకా గవర్నింగ్ బాడీకి కాలపరిమితి ఉన్నా ఇప్పటికిప్పుడే చంద్రబాబు స్వయంగా చైర్మన్‌గా నియమించుకోవడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. కేవలం తెలంగాణతో వివాదాలు, గొడవలు పెట్టుకోవడానికే ఈ గవర్నింగ్ బాడీని ఏర్పాటుచేశారని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి చంద్రబాబు కుట్రలకు పాల్పడుతూనే ఉన్నాడన్నారు. ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరును సమర్థించిన టీటీడీపీ నేతలు హైదరాబాద్ న్యాక్‌కు చంద్రబాబు ఉండాలని సమర్థిస్తరా.. వ్యతిరేకిస్తరా? అని హరీష్‌రావు ప్రశ్నించారు.