Mouth Alser
-
చిన్నారుల నోట్లో పుండ్లు?
కొంతమంది పిల్లల్లో నోట్లో, నాలుక మీద, గొంతు లోపల తరచూ పుండ్లలా వస్తుంటాయి. చిన్నారుల్లో ఈ సమస్య కనిపించినప్పుడు నొప్పితో బాధపడటం, నోరూ, గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పటిలా ఎర్రబారడమూ జరుగుతుంది. ఏమీ తినలేక సన్నబడతారు. ఇలా వచ్చే పుండ్లను వైద్యపరిభాషలో ఆఫ్తస్ అల్సర్స్ అంటారు. కారణాలు: ఈ సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. ఉదా... నోట్లో గాయాలు కావడం (బ్రషింగ్ వల్ల, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని అబ్రేసివ్ ఆహారపదార్థాల వల్ల గాయాలవుతుంటాయి) విటమిన్లు, పోషకాల లోపం... (ముఖ్యంగా విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) అనేక కారణాలతో నీరసించిపోవడం (ఫెటీగ్) వైరల్ ఇన్ఫెక్షన్లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి) పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం సరిపడకపోవడం, తరచూ జ్వరాలు... వంటి అనేక శారీరక సమస్యలతోపాటు మానసికంగా ఉద్వేగ పరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్) వల్ల కూడా పిల్లల్లో ఈ తరహా పుండ్లు (మౌత్ అల్సర్స్) కనిపించవచ్చు.చికిత్స / మేనేజ్మెంట్: నోట్లో పుండ్లు పడ్డ పిల్లలకు బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌లు; పోషకాహార లోపం వల్ల సమస్య వస్తే వాళ్లలో విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలా మౌత్ అల్సర్స్ కనిపించినప్పుడు పీడియాట్రీషియన్ లేదా డెంటల్ నిపుణులను సంప్రదించాలి. -
నోటి దుర్వాసన.. ఈ వ్యాధులకు సంకేతమని తెలుసా?
ఎవరైనా సరే, నోటిని సరిగా శుభ్రం చేయకపోతే దుర్వాసన రావడం సహజం.. అయితే చిగుళ్ల వాపు లేదా దంత సంబంధమైన వ్యాధులు ఏమీ లేకుండా... సక్రమంగా బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి నుంచి వాసన వస్తుంటే, దానిని అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదని, కొన్ని రకాల ఇతర వ్యాధులకు సంకేతంగా భావించి దాని గురించి శ్రద్ధ వహించమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.నోటి దుర్వాసన అనేది ఆహారపు అలవాట్లు, నోటి పరిశుభ్రతపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, దంతవైద్యులు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలని, భోజనం తర్వాత నోటిలో నీళ్లు పోసుకుని పుక్కిలించి నోటిని శుభ్రం చేయమని చెబుతుంటారు. ఇవి పాటించిన తర్వాత కూడా మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటే, అది శరీరంలో ఇప్పుడిప్పుడే తొంగి చూస్తున్న కొన్ని వ్యాధులకు సంకేతం కావచ్చు.కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు..సైనసైటిస్, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. దీనితోపాటు, ఈ ఇన్ఫెక్షన్లు సంభవించినప్పుడు, శ్వాసకోశంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని కారణంగా వాసన కలిగించే మూలకాలు ఏర్పడి ఇవి గాలి వదిలినప్పుడు దుర్వాసన వచ్చేలా చేస్తాయి.జీర్ణ సమస్యలు..కడుపులో ఉండే ఆమ్లాలు అన్నవాహికలోకి ప్రవహించినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ సంభవిస్తుంది. దీనివల్ల నోటిలో పుల్లని తేన్పులతోపాటు వాసన కూడా వస్తుంటుంది.కిడ్నీవ్యాధులు..మూత్రపిండాలనేవి శరీరంలోని మలినాలను వడపోసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి. మూత్రపిండాల పనితీరు మందగించినప్పుడు అవి వాటి పని సక్రమంగా చేయలేక శరీరంలో వ్యర్థాలు పేరుకుని పోతాయి. ఈ విధంగా రక్తంలో చేరిన వ్యర్థాల వల్ల వారు ఊపిరి పీల్చి వదిలేటప్పుడు ఒక విధమైన దుర్వాసన వెలువడుతుంటుంది.బీపీ, షుగర్..మధుమేహం ఉన్నవారిలో ఇది చాలా సాధారణ సమస్య.. ఎందుకంటే వారి శ్వాసలో ఎక్కువ కీటోన్లు ఉంటాయి. ఇవి ఒకవిధమైన చెడు శ్వాసను వెలువరిస్తుంటాయి. అదేవిధంగా దీర్ఘకాలికంగా బీపీ ఉన్న వారు వాడే కొన్ని రకాల మందులు కూడా నోటి దుర్వాసనకు కారణం కావచ్చు.కాలేయ సంబంధ వ్యాధులు..లివర్ సిర్రోసిస్ లేదా ఫ్యాటీ లివర్ వంటి కాలేయ సమస్యల వల్ల శరీరంలోని వ్యర్థాల నిర్వహణ సరిగా జరగదు. అందువల్ల కాలేయంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది.అందువల్ల నోటి దుర్వాసన ఉన్నప్పుడు దంత వైద్యుని సంప్రదించి, వారు సూచించిన మౌత్వాష్లను, ఇతర విధాలైన మౌత్ ఫ్రెష్నర్లను ఉపయోగించినా కూడా నోటి దుర్వాసన వదలకపోతుంటే మాత్రం అది ఇతర వ్యాధులకు సూచనగా భావించి ఫ్యామిలీ వైద్యుని సంప్రదించి వారి సూచన మేరకు తగిన పరీక్షలు చేయించుకుని మందులు వాడాల్సి ఉంటుంది.ఇవి చదవండి: ఇంటి శుభ్రతకై.. ఇలా చేస్తున్నారా? జాగ్రత్త! -
కరోనా: ఈ వ్యాధి ఉన్నోళ్లు జర జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: చిగుళ్ల వ్యాధితో కరోనా వైరస్ త్వరగా శరీరంలోకి ప్రవేశిస్తుందని డాక్టర్ గౌడ్స్ డెంటల్ పరిశోధనా బృందం అధిపతి డాక్టర్ వికాస్‌గౌడ్ వెల్లడించారు. చిగుళ్లు చెడిపోయినప్పుడు వైరస్ సులువుగా ఊపిరితిత్తుల్లోకి లేదా నేరుగా రక్తంలోకి వెళ్తుందని తెలిపారు. అంతర్జాతీయ జర్నల్స్‌లో గత కొన్నాళ్లుగా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ వివరాలు తెలిపారు. నోటి పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వల్ల, చిగుళ్ల వాపు ద్వారా వైరస్ తీవ్రతను పెంచుతాయని ఓ ప్రకటనలో వివరించారు. చిగుళ్ల వద్ద ఉండే వాహకాలు (ఏసీఈ–2) వైరస్‌ను శరీరంలోకి తీసుకెళ్తాయని పేర్కొన్నారు. మధుమేహం, విటమిన్–సి కొరత, కేన్సర్, పొగాకు, గుట్కా వినియోగించే వారికి చిగుళ్ల సమస్యలు ఎక్కువగా వస్తాయని, వీరికి మరింత ఎక్కువ ప్రమాదం ఉంటుందని తెలిపారు. అందుకే 6 నెలలకో సారి వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలో దంతాలను శుభ్రం చేయించుకోవాలని సూచించారు. ఉబ్బిన చిగుళ్లతో వైరస్ లోడ్ పెరుగుతుందని, నోటి పరిశుభ్రతను పాటించడం ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్ రేటు తగ్గుతుందని వివరించారు. (చదవండి: తెలంగాణ మాజీ మంత్రి చందూలాల్ కన్నుమూత) -
పాపకు పదే పదే చెవి నొప్పి...తగ్గేదెలా?
మా పాప వయస్సు ఐదేళ్లు. రెండు నెలల క్రితం మా పాపకు జలుబు వస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయన ముక్కు నుంచి చెవికి ఉండే ఎడినాయిడ్ గ్రంథి బ్లాక్ అయిందన్నారు. తగ్గిపోయాక ఇప్పుడు మళ్లీ మరో పక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. మళ్లీ ఇలా వచ్చే అవకాశం ఉందా? మీరు చెబుతున్న అంశాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్‌ను ‘అడినాయిడైటిస్ విత్ యూస్టేషియన్ కెటార్’ అని చెప్పవచ్చు. ఎడినాయిడ్స్ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్ పైన ఉంటాయి. ఈ గ్రంథులకు టాన్సిల్స్ తరహాలో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇది కొన్ని వారాలు, నెలలు ఉండవచ్చు. చిన్న పిల్లల్లో ఈ కండిషన్‌ను తరచూ చూస్తుంటాం. ఇలాంటిది జరిగినప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనుసైటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం (బ్లాక్ కావడం), నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది (రెస్ట్‌లెస్ స్లీప్) వంటి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీబయాటిక్ కోర్సులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే పెయిన్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు చాలా దీర్ఘకాలం కొనసాగితూ ఉంటే కొందరిలో చాలా అరుదుగా ఎడినాయిడ్స్‌ను తొలగించాల్సి రావచ్చు. మీరు మీ పీడియాట్రీషియన్ లేదా ఈఎన్టీ సర్జన్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. బాబుకు ఛాతీలో నెమ్ముఏంచేయాలి? మా బాబు వయసు రెండేళ్లు. వాడు ఛాతీలో నెమ్ము సమస్యతో బాధపడుతున్నాడు. యాంటీబయాటిక్స్ ఇప్పించాం. నెమ్ము రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చెప్పండి. మీ బాబుకు ఉన్న కండిషన్‌ను వైద్య పరిభాషలో నిమోనియా అంటారు. పిల్లల్లో అత్యంత ప్రమాదకరంగా మారేందుకు కారణమయ్యే వ్యాధుల్లో నిమోనియా ఒకటి. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నిమోనియాకు అత్యంత ప్రధాన కారణాలు. కొన్ని సందర్భాల్లో కొన్ని శరీర నిర్మాణపరమైన లోపాల (అనటామికల్ ప్రాబ్లమ్స్) వల్ల, రోగనిరోధక శక్తి లోపాల (ఇమ్యునిటీ ప్రాబ్లమ్స్) వల్ల కూడా నిమోనియా కనిపించవచ్చు. కేవలం ఒక ఏడాదిలో వ్యవధిలోనే రెండు మూడు సార్లు నిమోనియా వస్తే అలాంటి పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగని మొదటిసారి వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించడం సరికాదు. నిమోనియా వచ్చినప్పుడు వారం నుంచి పది రోజుల పాటు యాంటీబయాటిక్స్‌తో పిల్లలకు సరైన వైద్య చికిత్స అందించడం ఎంతైనా ముఖ్యం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ∙ఇలాంటి పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగానే పరిగణించవచ్చు. అయితే సమూహాలుగా జనం (క్రౌడ్స్) ఉన్న ప్రాంతాలకు పిల్లలను పంపకూడదు. అలాగే తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో బాధపడేవారి నుంచి దూరంగా ఉంచాలి ∙పిల్లలందరికీ టీకాలు వేయించడం (ఇమ్యూనైజేషన్) చాలా ప్రధానం. హెచ్ఐబీ, నిమోకోకల్ వ్యాక్సిన్లు, ఫ్లూ వైరస్ వ్యాక్సిన్లతో నిమోనియాను చాలా వరకు నివారించవచ్చు. మీ బాబుకు ఈ వ్యాక్సిన్లు వేయించడం తప్పనిసరి. నిమోనియా వచ్చిన పిల్లలకు యాంటీబయాటిక్స్‌తో పాటు వాళ్లలో కనిపించే లక్షణాలకు చికిత్స చేయడం (సపోర్టివ్ కేర్) అవసరం. పాప నోట్లో ఏమిటీ మచ్చలు? మా పాప వయసు పదేళ్లు. ఆమెకు తరచూ నాలుక మీద, పెదవుల మీద, దవడ భాగాల్లో పుండ్లు వస్తున్నాయి.ఆమె నాలుకపైన ఎర్రటి మచ్చల్లా వచ్చి తాను ఏమీ తినలేకపోతోంది. ఇవి రావడానికి కారణం ఏమిటి? ఇది ఏమైనా తీవ్రమైన వ్యాధికి సూచనా? సరైన సలహా ఇవ్వండి. మీ పాపకు ఉన్న సమస్యను ఏఫ్తస్ అల్సర్స్ అంటారు. ఇవి కొందరిలో పదే పదే వస్తూ ఉండవచ్చు. ఇది చాలా సాధారణంగా, తరచూ చూసే నోటి సమస్యల్లో ఒకటి. ఈ అల్సర్స్‌కు నిర్దిష్టంగా ఇదే కారణమని చెప్పలేకపోయినా... అలర్జీ, ఇమ్యూనలాజికల్ సమస్యలు, హెర్పిస్, రసాయనాల వల్ల నోరు కాలడం, వేడి వేడి ఆహారం తీసుకోవడంతో నోరు కాలడం, నోటిలోని మృదువైన కణజాలంలో అయ్యే గాయాల వల్ల, కొన్నిసార్లు ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ వల్ల కూడా ఈ రకమైన నోటి అల్సర్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ పుండ్లు 5 నుంచి 10 రోజుల పాటు ఉండి, వాటికవే నిదానంగా తగ్గుతుంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు బెంజోకైన్ లేదా లిడోకైన్ వంటి ద్రావకాలను స్థానికంగా పూయడం, సమస్య తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే పుండ్లపై పూతమందుల రూపంలో లభ్యమయ్యే స్టెరాయిడ్స్ పూయడం, కొన్ని సందర్భాల్లో సరైన యాంటీబయాటిక్స్ వాడటం కూడా జరుగుతుంది. అలాగే వ్యక్తిగత నోటి పరిశుభ్రత పాటించడం కూడా చాలా ప్రధానం. ఇక మీ పాపకు సంబంధించిన మరో సమస్య విషయానికి వస్తే... నాలుక మీద మచ్చలు మచ్చలుగా రావడాన్ని ‘జియోగ్రాఫికల్ టంగ్’ అని అంటారు. ఇది కొందరిలో అకస్మాత్తుగా వస్తూ... కొన్ని గంటలు లేదా రోజుల్లో మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ సమస్య ఒత్తిడి వల్ల, కారంగా ఉండే ఘాటైన ఆహారాల వల్ల మరింత తీవ్రమవుతుంది. అయితే ఈ సమస్యకు నిర్దిష్టమైన చికిత్స ఏదీ అవసరం లేదు. కాకపోతే ఘాటైన కారంతో ఉన్నవీ, మసాలాలతో కూడిన ఆహారాలకు దూరంగా ఉండి, నోటి పరిశుభ్రత పాటించాలి. సమస్య మరీ తీవ్రమైతే ఒకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియా ట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
పిల్లల నోట్లో పొక్కులా?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబు వయస్సు ఎనిమిదేళ్లు. ఈ మధ్య వాడికి నోట్లో పొక్కులు వస్తున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది. వాడి సమస్యకు పరిష్కారం చెప్పండి. – సునంద, హైదరాబాద్ మీ బాబుకు ఉన్న కండిషన్‌ను యాఫ్తస్ అల్సర్స్ లేదా యాఫ్తస్ స్టొమటైటిస్ అంటారు. ఈ పొక్కులు ముఖ్యంగా నోట్లో, పెదవులు, గొంతుపై భాగం (అప్పర్ థ్రోట్)లో ఎక్కువగా వస్తుంటాయి. ఓరల్ క్యావిటీలో ఇవి ఎక్కడైనా రావచ్చు. నోటిలో ఉండే పొర (మ్యూకస్ మెంబ్రేన్)లో పగుళ్లు రావడం వల్ల ఈ అల్సర్ వస్తాయి. వీటికి ఫలానా అంశమే కారణమని నిర్దిష్టంగా చెప్పడానికి ఉండదు. కాని నిమ్మజాతి (సిట్రస్) ఫ్రూట్స్, పులుపు పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు, బాగా కారంగా ఎక్కువ మసాలాలతో ఉండే ఆహారం తీసుకున్నప్పుడు ఇవి రావచ్చు. కొందరిలో ఇవి విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ లోపాలతోనూ రావచ్చు. అత్యధిక సాంద్రత ఉన్న టూత్‌పేస్టులు వాడేవారిలో, ఎక్కువ మానసిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఇవి కనిపిస్తాయి. కొందరిలో ఇవి బాగా అలసిపోయిన (ఫెటిగ్) సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మరికొందరిలో జబ్బుపడ్డప్పుడు కనిపిస్తాయి. కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల, జీర్ణకోశవ్యాధులు ఉన్న సందర్భాల్లోనూ ఇవి కనిపించవచ్చు. ఇవి రాకుండా నివారించడానికి కొన్ని చర్యలు... ∙నోటికి బాధ కలిగించే పదార్థాలు తీసుకోకపోవడం ∙పుల్లని పదార్థాలు అవాయిడ్ చేయడం. ∙నోరు ఒరుసుకుపోయే ఆహారపదార్థాలు (అబ్రేసివ్ ఫుడ్స్) తీçసుకోకపోవడం. నోటి పరిశుభ్రత (ఓరల్ హైజీన్) పాటించడం వంటివి చేయాలి. ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు లోకల్ అనస్థిటిక్ జెల్స్‌తో పాటు కార్టికోస్టెరాయిడ్స్, సిల్వర్ నైట్రేట్‌తో పాటు ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాలి. సమస్య మాటిమాటికీ వస్తుంటే నాన్ ఆల్కహాలిక్ మౌత్‌వాష్, లో కాన్సంట్రేటెడ్ మౌత్ వాష్ వాడవచ్చు.ఇక మీ బాబు విషయానికి వస్తే నోటి పరిశుభ్రత (గుడ్ ఓరల్ హైజీన్) పాటించడంతో పాటు అతడికి విటమిన్ బి12, జింక్ సప్లిమెంట్స్ ఇవ్వండి. లోకల్ అనస్థిటిక్ జెల్స్ కూడా వాడవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మీ పిల్లల వైద్య నిపుణుడిని కలిసి చికిత్స తీసుకోండి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బాబు స్కూల్ ప్రేయర్లో కళ్లు తిరిగి పడిపోయాడు... మా బాబుకు పదేళ్లు. వాడు ప్రేయర్ సమయంలో కళ్లు తిరిగిపడిపోయాడు. రెండుసార్లు ఇలా జరిగింది. మొదటిసారి ఏమీ భయపడలేదు గానీ రెండోసారి జరగడం వల్ల ఆందోళనగా ఉంది. దయచేసి మా అబ్బాయి విషయంలో తగిన సలహా ఇవ్వండి. – హేమలత, నెల్లూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ బాబుకు ఉన్న సమస్యను సింకోప్ లేదా సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌గా చెప్పవచ్చు. ఇది చాలా మంది పిల్లల్లో కనిపించేదే. పిల్లల్లో ఈ సమస్య కనిపించడానికి కారణాలనేకం. అందులో ప్రధానమైనది ఆర్థోస్టాకిక్ హైపోటెన్షన్. అంటే పిల్లల పొజిషన్స్‌లో మార్పుల వల్ల వాళ్లలో రక్తపోటు తగ్గి ఇలా జరగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యూరో కార్డియోజెనిక్ మార్పులు, గుండె సమస్యలు కూడా కారణం కావచ్చు. కొందరు పిల్లల్లో రక్తంలో గ్లూకోజ్ పాళ్లు తగ్గడం, ఫిట్స్, మైగ్రేన్, ఊపిరి బిగబట్టడం (బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్) వంటివి ఇందుకు కారణమవుతాయి. అయితే పిల్లాడు మాటిమాటికీ పడిపోతుంటే డాక్టర్ సలహా తీసుకోవాలి. గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుండెకు సంబంధించిన సమస్య లేదని నిర్ధారణ అయితే కాస్త నిశ్చింతగా ఉండవచ్చు. ఇక పైన పేర్కొన్న ఇతర కారణాలు ఏమైనా కావచ్చేమో అని తెలుసుకోవడం కూడా అవసరం. అరుదుగా ఫిట్స్‌కూడా ఈ రకంగానే కనిపించవచ్చు. సాధారణంగా చాలా ఎక్కువగా భయం కలగడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల, భయానక దృశ్యాలు చూడటం వల్ల లేదా డీహైడ్రేషన్ వల్ల అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే కొబ్బరినీళ్ల వంటివి తాగించటం, పిల్లలు కింద కూర్చుని పైకి లేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటివి ఈ సమస్య నివారణకు బాగా తోడ్పడే జాగ్రత్తలు. మీ బాబుకి పైన పేర్కొన్న కొద్దిపాటి జాగ్రత్తలతో అంతా సర్దుకుంటుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు మరొకసారి మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
అల్సర్‌ని నివారించవచ్చు...
మహాభాగ్యం నోటిలో వచ్చే అల్సర్లలో చాలా రకాలు అపరిశుభ్రత కారణంగా వచ్చేవే ఉంటాయి. శుభ్రత పాటించని వాళ్లలో అల్సర్లు రావడంతోపాటు అల్సర్ కారణంగా వచ్చే సమస్యలు కూడా తీవ్రంగా ఉంటాయి. ఏ కారణాలతో మౌత్అల్సర్ వచ్చినా సరే... నోటి శుభ్రత పాటించడం వల్ల అల్సర్లను, అల్సర్ కారణంగా ఎదురయ్యే ఇతర సమస్యలను కూడా నివారించవచ్చు. దంతాలను డెంటిస్టులు సూచించే విధంగా సరైన పద్ధతిలో శుభ్రం చేసుకోవాలి. పొగాకు వాడే అలవాటును పూర్తిగా మానేయాలి. కాఫీ, పుల్లటి పదార్థాల వాడకాన్ని పరిమితం చేయాలి. దంతాలు వంకర ఉండడం, మొనదేలి వాడిగా ఉండడం వల్ల అవి నోటి లోపలి భాగాలకు గుచ్చుకుంటాయి. ఆ గాయాలు క్రమంగా అల్సర్‌కు దారి తీస్తుంటాయి. కాబట్టి వాటిని గుర్తించిన వెంటనే డెంటిస్టుని సంప్రదించి సరి చేయించుకోవాలి. సీలియాక్ డిసీజ్ కారణంగా ఏర్పడిన అల్సర్‌కు డైటీషియన్ సలహా మేరకు ఆహారంలో మార్పులు చేయడం ద్వారా పరిస్థితి అదుపులోకి వస్తుంది. తరచుగా నొప్పితో కూడిన అల్సర్ వస్తున్న సందర్భాలలో దీర్ఘకాలంగా స్టిరాయిడ్స్ వాడకం, ఇమ్యునో సప్రెసెంట్స్ వాడకం ఉపయుక్తంగా ఉంటుంది. అన్నింటికంటే ముందు రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. ఆహారం తిన్న తర్వాత నీటిని నోటిని పుక్కిలించాలి. కాఫీ, టీల వంటివి తాగిన తరవాత కూడా నోటిని పుక్కిలించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మౌత్ అల్సర్లను నివారించవచ్చు.