MRR
-
రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ58 రాకెట్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నూతన సంవత్సరం 2024, జనవరి ఒకటో తేదీ ఉదయం 9.10 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ58 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. నాలుగు దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి.. ఎంఎస్టీ నుంచి ప్రయోగ వేదికకు అనుసంధానం చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. అనంతరం లాంచ్ ఆ«థరైజేషన్ సమావేశం నిర్వహించి రిహార్సల్స్ చేసి ప్రయోగసమయాన్ని, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆదివారం ఉదయం 8.10 గంటలకు.. అంటే ప్రయోగానికి 25 గంటల ముందు కౌంట్‌డౌన్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో ఈ ప్రయోగం 60వది కావడం విశేషం. 260 టన్నుల బరువు.. పీఎస్ఎల్వీ సీ58 రాకెట్ 44.4 మీటర్లు పొడవు కలిగి ప్రయోగ సమయంలో 260 టన్నుల బరువుంటుంది. ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తి చేస్తారు. రాకెట్ మొదటి దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 24.4 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138 టన్నుల ఘన ఇంధనంతో 109.40 సెకెండ్లను పూర్తి చేస్తారు. రాకెట్ దూసుకెళుతున్న తరుణంలోనే 175 సెకెండ్లకు శాటిలైట్‌కు రక్షణ కవచంగా ఉన్న హీట్ షీల్డ్ విడిపోతుంది. అనంతరం 41.9 టన్నుల ద్రవ ఇంధనంతో 261.50 సెకెండ్లకు రెండో దశ, 7.66 టన్నుల ఘన ఇంధనంతో 586.26 సెకెండ్లకు మూడో దశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 1258.92 సెకెండ్లకు నాలుగో దశను పూర్తిచేస్తారు. అనంతరం నాలుగో దశలో ద్రవ ఇంధన మోటార్ 1315.92 సెకెండ్లకు(21.55 నిమిషాల్లో) ఎక్స్‌ఫోశాట్ అనే ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రయోగాన్ని పూర్తి చేస్తారు. ఈ ప్రయోగంలో 469 కిలోల బరువు గల ఎక్స్‌పోశాట్ అనే ఖగోళ పరిశోధనలకు ఉపయోగపడే ఉపగ్రహాన్ని భూమికి 350 నుంచి 450 కి.మీ. ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. -
మంజూరిచ్చారు... చేతులెత్తేశారు!
నల్లగొండ ఎంఆర్ఆర్ (మెయింటెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్) గ్రాంట్ కింద మంజూరు కావాల్సిన నిధులకు రాజకీయ గ్రహణం పట్టింది. నిధుల లేమితో సతమతమవుతున్న ప్రభుత్వానికి కొత్తగా రాజకీయ చిక్కులు కూడా తోడయ్యాయి. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ శ్రేణులను సంతృప్తి పర్చేందుకు కోట్ల రూపాయల పనులు నామినేషన్ మీద కట్టబెట్టాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...జిల్లావ్యాప్తంగా 59 మండలాల్లో 2,399 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు మరమ్మతు చేసేందుకు 1562 పనులకు ఏప్రిల్‌లో మంజూరిచ్చారు. ఈ నిధులతో రహదారులు లేని ప్రాంతాల్లో మట్టిరోడ్ల నిర్మాణం, కంకర రోడ్ల మీద మట్టిపోయడం వంటి పనులు చేయాల్సి ఉంది. కానీ ఈ పనులకు సంబంధించి ఇప్పటివరకు అడుగు కూడా ముందుకు కదల్లేదు. వేసవి కాలంలోనే పనులు ప్రారంభించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ జిల్లాలో ఎక్కడా కూడా చేపట్టలేదు. ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు పనులు ఆమోదించి నిధులు మంజూరు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు నయాపైసా విడుదల చేయలేదు. అదీగాక ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు నామినేషన్ మీద పనులు చేయాలంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ల తీర్మానాలు తప్పనిసరి చేశారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లే ఎక్కువ మంది ఉన్నందున తీర్మానాలు ఇచ్చేందుకు వారినుంచి అభ్యంతరాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకే అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యత్యాసం లేకుండా నిధుల పంపకాలు చేశారు. కానీ పనులు ప్రతిపాదనలు పంపడంలో మండల ప్రజాప్రతినిధులు, సర్పంచ్ల ప్రమేయం లేకుండా చే యడంతో వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పనులు రద్దుకు మొగ్గుచూపు..! జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలకు కలిపి మొత్తం రూ.49 కోట్లు మంజూరు చేశారు. అయితే దీంట్లో కోదాడ, మిర్యాలగూడ నియోజకవర్గాలకు నిధుల పంపకాల్లో రూ.2 కోట్లు కోత పెట్టారు. ఈ మేరకు కోత పెట్టిన నిధులను జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సొంత నియోజకవర్గానికి రూ.6 కోట్లు, మాజీ పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తుంగతుర్తి నియోజకవర్గానికి రూ.5 కోట్లు అదనంగా ఇచ్చారు. మిగిలిన నియోజక వర్గాలకు ఒక్కోదానికి రూ.4 కోట్లు చొప్పున మంజూరు చేశారు. నిధుల మంజూరీ వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత తలెత్తిన ‘తీర్మానం’ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక ప్రజా ప్రతినిధులు ఇరకాటంలో పడినట్లు సమాచారం. ఈ సమస్య అపరిష్కృతంగా ఉండగానే ప్రభుత్వానికి నిధుల జాడ్యం పట్టుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతకాలంగా ఆర్థికశాఖ అన్ని రకాల చెల్లింపులు నిలిపేసింది. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపట్టిన వివిధ రకాల పనులకు సంబంధించిన బిల్లులకే ఇప్పటి వరకు నయాపైసా విడుదల కాలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంఆర్ఆర్ గ్రాంట్‌కు నిధులు వస్తాయన్న నమ్మకం అధికార వర్గాల్లో లేకుండా పోయింది. ఇప్పుడున్న తాజా ఆర్థిక ఇబ్బందులను బట్టి చూస్తే మంజూరు చేసిన పనులను ప్రభుత్వం రద్ధు చేసే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బందీ లేదు - ఉమామహేశ్వర్‌రెడ్డి, పీఆర్ ఎస్ఈ ఎంఆర్ఆర్ పనులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. జిల్లా మంత్రి ఆమోదం పొందేందుకు ఫైల్ పంపాం. వర్షాలకు పనులు ప్రారంభిస్తే బయటి వైపు నుంచి విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో మొదలు పెట్టలేదు. మంత్రి ఆమోదం పొందగానే పనులు ప్రా రంభించేందుకు చర్యలు చేపడతాం. -
పీఎస్ఎల్వీ సీ24 ప్రయోగానికి సర్వం సిద్ధం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం-1బీ అనే ఉపగ్రహాన్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ సీ24) ద్వారా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 4న అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు సర్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ బ్రహ్మప్రకాశ్ హాల్లో ఎంఆర్ఆర్ సమావేశాన్ని చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేశారు. రాకెట్ అనుసంధానం పూర్తిచేసి, అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) వారికి ఈ సందర్భంగా అప్పగించారు. శాస్త్రవేత్తలు ల్యాబ్ చైర్మన్ డాక్టర్ ఎం.వై.ఎస్.ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశమై... కౌంట్‌డౌన్ ప్రక్రియను బుధవారం ఉదయం 6.44 గంటలకు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ప్రయోగాన్ని 1,188.4 సెకెన్లలో పూర్తి చేయనున్నారు. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో ఇది 26వ ప్రయోగం కావడం విశేషం. ఇప్పటిదాకా నిర్వహించిన 25 ప్రయోగాల్లో మొదటి ప్రయోగం తప్ప మిగిలినవన్నీ విజయవంతమయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో ఆరోసారి చేస్తున్న ప్రయోగం ఇది. అంతేకాదు ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రెండోసారి తయారుచేసిన 1,432 కిలోల బరువైన ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించి వాణిజ్యపరంగా మరో అడుగు ముందుకేసింది. -
రేపు పీఎస్ఎల్వీ సీ-24 కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్‌సెంటర్ నుంచి ప్రయోగించే పీఎస్ఎల్వీ సీ24 రాకెట్‌కు సంబంధించి చివరి మిషన్ సంసిద్ధతా (ఎంఆర్ఆర్) సమావేశం మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నారు. అనంతరం రాకెట్‌ను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగిస్తారు. ఆ తర్వాత వారు ప్రయోగం, కౌంట్‌డౌన్ ప్రక్రియలపై తుదినిర్ణయం తీసుకుంటారు. ప్రయోగానికి 58.30 గంటల ముందు అంటే బుధవారం ఉదయం 6.44 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా మిషన్ కంట్రోల్ రూం నుంచి మంగళ, బుధవారాల్లో లాంచ్ రిహార్సల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రయోగంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన 1,432 కిలోల ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ) ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపుతున్న విషయం తెలిసిందే. కౌంట్‌డౌన్ ప్రారంభమైన తర్వాత రాకెట్లో దశల వారీగా ఇంధనం నింపుతారు. ప్రయోగానికి సంబంధించి పనుల పరిశీలనకు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ ఈ నెల 3న షార్కు వస్తున్నారు.