Naganna
-
మాయమాటలు చెప్పి.. మోసం చేశాడు..!
ఆదిలాబాద్: ఘరానా మోసగాడు దంపతులకు మాయమాటలు చెప్పి బంగారు గొలుసు కాజేసిన సంఘటన మండలంలోని కన్కపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై సాయికుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోపు నాగన్న అనే రైతు ఇంటికి బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి పల్సర్ బైక్‌పై వచ్చాడు. నాగన్న–లక్ష్మి దంపతులతో నేను బ్యాంకు నుంచి వచ్చాను. మీరు ఇంతకు ముందు బ్యాంకులో గోల్డ్‌లోన్ తీసుకున్నారుగా, మీకు లోన్ మాఫీ వచ్చిందని, మరింతగా రెట్టింపు లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. నమ్మిన ఆ దంపతులు లక్ష్మి మెడలోని రెండు తులాల బంగారు గొలుసును భర్త నాగన్నకు ఇచ్చింది. నాగన్నను అతడి బైక్‌పై ఎక్కించుకుని అబ్దుల్లాపూర్ గ్రామ పరిధిలోని సబ్‌స్టేషన్ వరకు తీసుకెళ్లి అతడి వద్ద నుంచి గొలుసును లాక్కుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు. -
ఐక్యంగా ముందుకు సాగుదాం
సాక్షి, హైదరాబాద్: ఐక్యమత్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలని నాయీ బ్రాహ్మణ నాయకులు అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆబిడ్స్‌లోని జయ ఇంటర్నేషనల్ హోటల్లో జరిగిన దసరా ఆత్మీయ సమ్మేళనంలో నాయీ బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయీ బ్రాహ్మణులు ఇప్పటికీ ఎంతో వెనుకబడి ఉన్నారని, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికల్లో తమకు సరైన అవకాశాలు దక్కడం లేదని, తమ వాటా తమకు ఇవ్వడం లేదని వాపోయారు. ఎన్నికల్లోనూ బీసీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గీకరణ కోసం న్యాయ పోరాటం చేస్తూనే, రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకోస్తామన్నారు. నాయీ బ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని కోరారు. తమను అత్యంత వెనుకబడిన బలహీన వర్గాల జాబితాలో చేర్చాలని జస్టిస్ రోహిణి కమిషన్‌కు వినతులు ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు నాయీ బ్రాహ్మణులు తమ సంఘీభావం తెలిపారు. 25న ధన్వంతరి జయంతి వేడుకలు వైద్య వృత్తికి ఆదిదేవుడు, నాయీ బ్రాహ్మణుల కులదైవమైన ధన్వంతరి జయంతి వేడుకలను ఈ నెల 25న నిర్వహించనున్నామని డాక్టర్ బీర్ఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సారంగపాణి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసి నాయీ బ్రాహ్మణుల ఐక్యతను చాటిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ధన్వంతరి స్ఫూర్తితో అన్ని రంగాల్లో ముందుడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు. తమ సంఘీయుల మధ్య సృహృద్భావ సంబంధాలు ఏర్పాలడాలన్న ఉద్దేశంతో దసరా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు న్యాయవాది ఎం. రమేశ్, ఎం. గోపాలకృష్ణ. ఎ. సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేంద్రచంద్ర, కె. వెంకటేశ్వరరావు, జి. అశోక్, గంగాధర్, సీఎల్ఎన్ గాంధీ, రామానందస్వామి, నాగన్న, మద్దికుంట లింగం, సీనియర్ కార్టూనిస్ట్ నారూ, రాపోలు సుదర్శన్, వెంకట్రాయుడు, సూర్యనారాయణ, బాలరాజు, ధనరాజ్, శ్రీధర్, రాజేశ్, పసుపుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం
‘‘మా ‘కురుక్షేత్రం’ చిత్రాన్ని కొందరు ‘దానవీరశూరకర్ణ’ చిత్రంతో పోలుస్తున్నారు. ఆ సినిమా ఒకేసారి పుట్టింది. ఇక రాదు. కానీ ‘బాహుబలి’ లాంటి సినిమాలు చేయొచ్చు’’ అన్నారు నిర్మాత మునిరత్న. మహాభారతాన్ని తొలిసారి ఇండియన్ స్క్రీన్ మీద త్రీడీలో ‘కురుక్షేత్రం’ పేరుతో తెరకెక్కించారు. ఇందులో దుర్యోధనుడిగా కన్నడ హీరో దర్శన్, కర్ణుడిగా అర్జున్, అర్జునుడిగా సోనూ సూద్, అభిమన్యుడిగా నిఖిల్ గౌడ, భీష్ముడిగా అంబరీష్ నటించారు. రాక్‌లైన్ వెంకటేశ్ సమర్పణలో కథను అందించడంతో పాటు మునిరత్న ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగన్న దర్శకుడు. ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు ట్రైలర్ రిలీజ్ వేడుకలో నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘భారతాన్ని త్రీడీలో తీయాలనుకున్నాను. ఈ సినిమా రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రస్తుత తరానికి మహాభారతాన్ని తెలియజేయడానికి ఈ సినిమా చేశాం’’ అన్నారు మునిరత్న. ‘‘ఈ చిత్రాన్ని త్రీడీలో తెరకెక్కించినందుకు నిర్మాతలకు కృతజ్ఙతలు’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘దేశంలో మొట్టమొదటి త్రీడీ మైథాలజీ సినిమా ఇది. ‘కురుక్షేత్రం’ పండగలా ఉంటుంది’’ అన్నారు నాగన్న. ‘‘1970–2019 వరకూ ఉన్న గొప్ప యాక్టర్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. ఈ చిత్రం తప్పకుండా భారతంలోని పాత్రలన్నీ పరిచయం చేస్తుంది’’ అన్నారు దర్శన్. ‘‘చారిత్రాత్మక చిత్రంలో నటించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు అర్జున్. ‘‘ఇలాంటి సినిమాకు సమర్పకుడిగా ఉండటం సంతోషం. తెలుగులో రిలీజ్ చేయడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు రాక్‌లైన్ వెంకటేశ్. ‘‘ఈ సినిమాలో మాటలు, పాట లు రాసే అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు వెన్నెలకంటి. ‘‘నటుడిగా ఈ సినిమా ఓ మంచి అనుభూతి’’ అన్నారు సోనూ సూద్. -
మట్టిపాట
మట్టి వాసనలో ఒక మాధుర్యం ఉంటుంది. గాలిలో.. ఆకుల సవ్వడిలో.. రాలే చినుకులో... ప్రకృతిలోని ప్రతి ధ్వనిలో.. వినిపించే సహజమైన మ్యూజిక్ అది. ఇప్పుడు ఇదే మట్టిలోంచి... మంత్రముగ్ధం చేసే ఒక పాట వినిపిస్తోంది. మట్టిలోంచి అధాటుగా మొలకెత్తిన ఆ పాట గుండెకు హత్తుకుంటోంది. నిన్న.. ‘బేబీ’.. నేడు శాంతాబాబు మరికొన్ని స..రి..గ..మ..ల మధురిమలు. బేబీ ఇటీవలి సెన్సేషన్ బేబీ. తూర్పుగోదావరి జిల్లా వడిసలేరుకి చెందిన బేబీ, మొదట తన ఇంటి పక్కనే ఉంటున్న రాణి అనే అమ్మాయి పాడిన పాటలో దోషాలు చెప్పింది. అక్కడే నీళ్ల బకెట్ పెట్టుకుని, ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’ అంటూ పాట మొత్తం పాడేసింది. ఆ పాటను అక్కడే ఉన్న వీరబాబు అనే స్థానిక గాయకుడు తన ఫోన్లో షూట్ చేసి, యూ ట్యూబ్‌లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. ఆ పాట వైరల్ అయ్యింది. వెంటనే బేబీని ‘సాక్షి’ పలకరించింది. సాక్షిలో బేబీతో ఇచ్చిన ఇంటర్వ్యూ బేబీ జీవితాన్ని మార్చేసింది. సంగీత దర్శకులు కోటి ‘బోల్ బేబీ బోల్’లో పాడిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ బేబీని స్వయంగా కలవాలనుకున్నారు. అంతే. తనంత తానుగా బేబీని ఇంటికి పిలిపించుకున్నారు చిరంజీవి. తను స్వరపరచిన ‘ఓ చెలియా నా ప్రియ చెలియా’ పాట పాడిన బేబీని తాను చూడాలని ఎ.ఆర్.రెహమాన్ సైతం అన్నారని ఆమె చెబుతున్నారు. వాయిస్ టెస్ట్‌కి చెన్నై రమ్మని కూడా రెహమాన్ అన్నారట. ఇక ఆర్పి పట్నాయక్ కూడా ఆమెకు అవకాశం ఇస్తానన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా బేబీ నిన్న జానకిని కూడా కలిశారు. వెంకట లక్ష్మి విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో చిన్న చిల్లరకొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటారు వెంకటలక్ష్షి్మ. దానికి తోడుగా బుర్రకథలు కూడా చెప్పేవారు. ఆ వీడియోలను యూట్యూబ్‌లో కూడా అప్లోడ్ చేసేవారు. అలా దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దృష్టిలో పడ్డారు. ‘రంగస్థలం’ సినిమాలో ‘జిల్ జిల్ జిల్ జిగేల్ రాణి..’కి పాడటానికి ఓ డిఫరెంట్ వాయిస్ కోసం ఆ ఇద్దరూ వెతుకుతున్న సమయంలో వెంకటలక్ష్షి్మ బుర్రక£ý వీడియోను యూట్యూబ్‌లో చూశారు. ఆ పాటకు ఆమె వాయిస్ అయితే బావుంటుందని భావించారు. పాట రికార్డ్ చేయడం కోసం వెంకటలక్ష్షి్మకి విశాఖ నుంచి చెన్నైకు టిక్కెట్ వేశారు చిత్రబృందం. చెన్నైలో రెండు రోజుల పాటు రికార్డ్ చేసిన ఈ పాట రెండు తెలుగురాష్ట్రాలను ఎంత ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. వెంకటలక్ష్షి్మకి బోల్డంత పాపులార్టీ వచ్చేసింది. శివనాగులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జానపదాల ద్వారా శివ నాగులు ఫేమస్. ‘రేలారే రేలా..’ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత ఐడియా సూపర్ సింగర్ కార్యక్రమంలో ఒక సింగర్స్ గ్రూప్‌కు మెంటర్‌గా ఉండేవారు శివనాగులు. చంద్రబోస్ ఆ షో జడ్జిగా వ్యవహరించేవారు. అలా శివనాగులుకు చంద్రబోస్‌తో పరిచయం ఏర్పడింది. కొత్త కొత్త వాయిస్‌లను, వాళ్లు పాడే వీడియోలన్నీ దేవిశ్రీప్రసాద్‌కు చూపించడం చంద్రబోస్ అలవాటు. అలా సూపర్ సింగర్ సమయంలో శివనాగులు గొంతును దేవిశ్రీ ప్రసాద్‌కు వినిపించారు. ‘రంగస్థలం’ సినిమాకి ఓ ఫోక్ వాయిస్ కోసం వెతుకుతుంటే శివ నాగులు వాయిస్ నచ్చడంతో, ‘ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా...’ పాడే అవకాశం లభించింది. ఆ పాట సూపర్ హిట్. ఈ సినిమా తర్వాత నాలుగైదు సినిమాల్లో పాడే అవశాలు వచ్చాయి. ‘సిల్లీ ఫెల్లోస్’ సినిమాలో పాడే అవకాశం వచ్చినప్పటికీ ఆ సమయంలో అమెరికా వెళ్లడంతో ఛాన్స్ మిస్ అయిందట. రీసెంట్గా ‘యాత్ర’ సినిమాలో పాడిన పాటకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తారట ఆయన. ఆ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాశారు. పెంచల్దాస్ ‘దారిచూడు దుమ్మూ చూడు మామ.. దున్నపోతుల బైరే చూడు...’ పాట తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. నాని హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలోని ఆ పాట విడుదలయ్యాక అందరి మదిలో ఒక్కటే ప్రశ్న.. ఆ పాట రాసిందెవరు? అంత చక్కగా పాడిందెవరు?. జానపదం పాటని అంత అద్భుతంగా రాసి, మహాద్భుతంగా పాడారు పెంచల్దాస్. ఆ పాట విడుదల వరకూ ఆయనెవరో తెలియదు. కడప జిల్లా చిట్వేలి మండలం దేవమాచుపల్లికి చెందిన పుట్టా పెంచల్‌దాస్‌కి రంగస్థల కళాకారుడిగా, బాతిక్ చిత్రకారుడిగా పేరుంది. పెనగలూరు మండలం చక్రంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తుండే ఆయనకి ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో తొలి అవకాశం ఎలా వచ్చింది? తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ఆర్ట్స్ ఆడిటోరియంలో జరిగే రచయితల సభలో పాటలు పాడినప్పుడు దర్శకుడు మేర్లపాక గాంధీ తండ్రి మురళీ దృష్టిలో పడ్డారు పెంచల్దాస్. సినిమా పాటలకు అవకాశం ఇప్పిస్తానని మేర్లపాక గాంధీకి పరిచయం చేశారు. దాస్ పాట విని, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాకి అవకాశం ఇచ్చారు గాంధీ. కానీ, అనారోగ్య కారణాల వల్ల పాడలేకపోయారు. ఆ తర్వాత ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చేస్తున్నప్పుడు 20నిమిషాల్లో పాట రాసి, పాడతావా అని పెంచల్‌దాస్‌ని మేర్లపాక గాంధీ అడిగితే, ‘దారిచూడు దుమ్మూచూడు మామ..’ పాట రాశారు. ఆ పాట రెండు లైన్లు విని ఓకే చేసి దాస్‌ని మద్రాసుకు తీసుకెళ్లారు. సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళకు గొ నచ్చడంతో ‘దారి చూడు..’కి అవకాశం ఇచ్చారు. అలా పెంచల్‌దాస్‌కి సినిమా దారిలో తొలి అడుగు పడింది. చంద్రలేఖ చంద్రలేఖ ప్రస్తుతం మలయాళంలో చాలా బిజీగా ఉన్న గాయని. కేరళలోని ఆదూర్కి చెందిన చంద్రలేఖ ఒక సాధారణ గృహిణి. ఏ మాత్రం సంగీత పరిజ్ఞానం లేని అతి సామాన్యురాలు. ఒకసారి తన రెండు సంవత్సరాల బాబుని ఎత్తుకుని, ‘రాజహంసమే’ పాట తన్మయంగా పాడింది. అలా పాడుతున్నప్పుడు బంధువుల అబ్బాయి ఒకరు ఆమె పాటను సెల్ ఫోన్లో రికార్డు చేసి, యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. ఆ పాట వైరల్ అయ్యింది. ఆమె గొప్పదనాన్ని నెటిజన్లు గుర్తించారు. ఎంతటి మధురగళం అనుకున్నారు. ఆమె పాటను యూ ట్యూబ్‌లో విరగబడి చూశారు. ఆమె సన్నిహితులకు మాత్రమే ఆమె పాడుతుందని తెలుసు. ఈ పాటతో మలయాళీలకు దగ్గర అయిపోయింది. బిజిపాల్, రతీష్ వేగా వంటి ప్రముఖులు కూడా ఆమెకు అవకాశం ఇచ్చారు. కిందటి సంవత్సరం ఆమెకు ‘అవలుక్కెన్న అలగియా ముగం’ చిత్రంలో ‘ఎన్నడ కన్నా’ అనే మొదటి తమిళ పాట పాడే అవకాశం వచ్చింది. ఈ పాటను వైరముత్తు రచించారు. డేవిడ్ షోన్ స్వరపరిచారు. ఇది జరిగి ఐదేళ్లు. పెద్ద పెద్ద సంగీత దర్శకుల నుంచి వచ్చిన అవకాశాలు వినియోగించుకుంది చంద్రలేఖ. శాంతాబాబు కాసరగోడ్ జిల్లా నీలేశ్వరం పంచాయతీ పరిధిలోని నవోదయపురం శాంతాబాబు స్వస్థలం. మేకులు తయారుచేసే ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తోంది. ఆమె భర్త కూడా కూలీనే. శాంతాబాబుకు ఒక కూతురు, కొడుకు. కూతురు పీజీ చదువుతోంది. కొడుకు ప్లంబర్. శాంతా పదవ తరగతి వరకు చదువుకుంది. రెండేళ్ల కిందట పూర్వవిద్యార్థుల సమ్మేళనం సందర్భంగా నజీమ్ అర్షద్ అనే గాయకుడి కచేరి పెట్టారు. బృందగానంలో శాంతాబాబూ కూడా గొంతు కలిపింది. ఆ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు సమ్మేళనానికి హాజరైన కొందరు పూర్వ విద్యార్థులు. వైరల్ అయింది. ఆ తర్వాత శాంతాబాబుతో ఆల్బమ్స్ చేయడానికి చాలా మంది ముందుకొచ్చారు. అలా నాలుగు ఆల్బమ్స్‌లో పాడింది. అయితే మణి అప్లోడ్ చేసిన పాటను రీసెంట్గా మలయాళ నట, గాయక, దర్శకుడు నదీర్షా చూశాడు. శాంతాబాబు స్వరం ఆయనెంతగానో నచ్చింది. ఆమె ఆల్బమ్స్‌లో పాడినట్టుకూడా తెలుసుకొని వాళ్ల ద్వారా శాంతా ఫోన్ నంబర్ తీసుకుని ఆమెను సంప్రదించాడు. ‘‘నా సినిమాలో పాట పాడతారా?’’ అని అడిగాడు. ఆశ్చర్య పోవడం శాంతా వంతయింది. మొత్తానికి నదీర్షా విన్నపాన్ని మన్నించి ఆయన సినిమాలో పాడేందుకు ఒప్పుకుంది శాంతా. ఇప్పుడు ఆమె శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుంటోంది. వినసొంపుగా కొత్త గొంతులు ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతోంది. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ఇలాంటి కొత్త గొంతులతో సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కళకళలాడుతోంది. విషయం ఉన్నవాళ్లను ఎవరూ ఆపలేరు. ఏ మూల ఉన్నా వెలుగులోకి వస్తారు. కొత్తనీరు ఎప్పుడూ రుచిగా ఉన్నట్టే కొత్త గొంతులు కూడా వినసొంపుగా ఉంటాయి. – సింహా, గాయకుడు ముగ్గురు మాణిక్యాలు ‘రంగస్థలం’ సినిమాకి అన్ని పాటలూ నేనే రాశాను. నేను, దర్శకుడు సుకుమార్, సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ రెడీ అవ్వగానే.. ముఖ్యంగా రెండు పాటలకు ఇప్పటివరకూ పరిచయం లేని గొంతు, అది కూడా పల్లె గొంతుతో పాడిస్తే బాగుంటుందనుకున్నాం. అవి ‘జిల్ జిల్ జిల్ జిగేలురాణి...’, ‘ఆ గట్టునుంటావా నాగన్న..’. ఈ పాటలకు తగ్గ గొంతుని వెతకడం మొదలుపెట్టాం. ఏటూరి నాగారంకి చెందిన రేలా కుమార్‌ని, మహబూబ్‌నగర్‌కి చెందిన శివ నాగులుని సుకుమార్, దేవీకి పరిచయం చేశాను. ఈ ఇద్దరూ టీవీ షోస్‌కి పాడుతుంటారు. అలా వాళ్లు నాకు పరిచయమయ్యారు. ఈ ఇద్దరితో పాటు సుకుమార్‌గారు కూడా ఒక ఫీమేల్ వాయిస్‌ని గుర్తించారు. ఆమె గురించి వాకబు చేసి, పిలిపించాం. ఆమె విజయనగరం జిల్లాకి చెందిన వెంకటలక్ష్మి. ‘జిల్ జిల్ జిల్ జిల్ జిగేలురాణి..’ పాటలోని ఫీమేల్ వాయిస్ ఈమెదే. మేల్ వాయిస్ రేలా కుమార్‌ది. ‘ఆ గట్టునుంటావా..’ పాడినది శివనాగులు. ఈ ముగ్గురి వాయిస్‌లను టెస్ట్ చేసి, దేవి ఓకే అన్నారు. మామూలుగా మన మధ్య తిరుగుతున్నవారిని పరిచయం చేయడం కామన్. అయితే ఇలాంటి పాటలకు మట్టిలో మాణిక్యాల గొంతులు న్యాయం చేస్తాయి. – చంద్రబోస్, సినీ గేయ రచయిత -
తొలితరం నక్సలైట్ నేత నాగన్న మృతి
-విప్లవ బీజాలు నాటిన ఉప్పల మోహన్‌రెడ్డి మిరుదొడ్డి(మెదక్ జిల్లా): మెతుకుసీమలో తొలిసారిగా విప్లవ బీజాలు నాటిన తొలితరం నక్సలైట్ నేత నాగన్న అలియాస్ ఉప్పల మోహన్‌రెడ్డి (56) అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపెల్లిలో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1984 మధ్య కాలంలో దళ కమాండర్‌గా మెదక్ జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో నాగన్న నక్సలైట్ల ఉద్యమానికి బీజాలు వేశారు. నిరుపేదలను పీల్చి పిప్పిచేసే దొరల ఆగడాలను అరికట్టి పట్టణాలకు తరిమి కొట్టడంలో నాగన్న కీలక పాత్ర పోషించారు. ఉద్యమకాలంలో ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి నాగన్నతో అప్పుడే సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పట్లోనే సోలిపేట రామలింగారెడ్డి నక్సలైట్ల ఉద్యమానికి ఆకర్శితులు కావడానికి కారణంగా చెప్పవచ్చు. తన దళంలో పనిచేస్తున్న చిట్టాపూర్‌కు చెందిన వెంకటలక్ష్మి అనే దళిత మహిళను నాగన్న కులాంతర వివాహం చేసుకున్నారు. నక్సలైట్ ఉద్యమంలో ఆరోగ్యం సహకరించకపోవడంతో నాగన్న దంపతులు 1989లో అప్పటి జిల్లా ఎస్పీ సురేందర్ ఎదుట లొంగిపోయారు. పోలీసులకు లొంగిపోయే ముందు తన స్వలాభం కోసం ఆకాంక్షించకుండా నక్సలైట్ కార్యకలాపాలకు సంబంధించిన డబ్బు, తుపాకులు పార్టీకే అప్పగించారు. దీంతో నాగన్న నిజాయితీకి జిల్లా ప్రజలు హర్షించారు. లొంగిపోయిన నాగన్నకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయన సొంత గ్రామమైన కొత్తపెల్లిలో పునరావాసం కల్పించింది. అనంతరకాలంలో ఆర్థికంగా చితికిపోయిన నాగన్న కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం సాయంత్రం ఆయన స్వగృహంలోనే తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. నాగన్న మృతితో ఆయన శ్రేయోభిలాషులు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు. -
తాను విషం తాగి.. కుమారుడిని చంపి..
అప్పుల బాధతో ఓ యువ రైతు తన ఐదేళ్ల కుమారునికి పురుగుల మందుతో కలిపిన అన్నం తినిపించి తానూ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారకర సంఘటన అనంతపురం జిల్లా కుందర్పిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...ఏడాది క్రితం తండ్రి చెన్నరాయప్పతో విడిపోయిన సజ్జన నాగన్న (36) భార్య, కుమారుడు ముఖేష్(5), హిమాచల్ (7)తో కలిసి వేరుకాపురం పెట్టాడు. తన వాటాగా వచ్చిన 4 ఎకరాలు వచ్చింది. అయితే అంతా మెట్టభూమి కావడంతో కాస్త సాగునీరందింతే బిందుసేద్యంతో పంటలు సాగుచేయాలని భావించాడు. దీంతో వెంటనే స్థానికుల వద్ద అప్పులు చేసి ఒకటి తర్వాత ఒకటి ఐదు బోర్లు వేశాడు. అయినా చుక్కనీరు పడకపోగా, 4 లక్షల అప్పులు మిగిలాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించక , కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక నిత్యం సతమయ్యాడు. ఈ పరిస్థితుల్లోనే ఏడు నెలల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఓ వైపు అప్పుల కుప్పలు, మరోవైపు భార్య దూరం కావడంతో పాటు పిల్లల ఆలనా, పాలానా చూసే వారు కరువవడంతో నాగన్న జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున తన చిన్న కుమారుడు ముఖేష్ (5)కు పురుగు మందు కలిపిన అన్నం తినిపించించాడు. అనంతరం తానూ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం కుటుంబీకులు గమనించేలోగానే తండ్రీకొడుకు విగతజీవులుగా కనిపించారు. కాగా నాగన్న పెద్ద కుమారుడు హిమాచల్ పక్కింట్లో నిద్రిస్తుండడంతో బతికి బయట పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుందుర్పి పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుధ్ఘాతానికి అన్నదమ్ములు బలి
వ్యవసాయ బావిలో నుంచి చెడిపోయిన మోటర్ తీయడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు అన్నదమ్ములు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కుందుప్రి మండలం రుద్రంపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగన్న(41), నాగన్న(35)లు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ బావిలో ఉన్న మోటర్ చె డిపోవడంతో.. దాన్ని బాగు చేయించడానికి బయటకు తీసే ప్రయత్నంలో పైన ఉన్న హైటెన్షన్ వైర్లకు ఇనుప పైపులు తాకడంతో.. విద్యుధ్ఘాతానికి గురై అన్నదమ్ములిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ధర పతనంతో ఆగిన ఊపిరి
కంబదూరు(చిత్తూరు జిల్లా): పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో టమాట రైతు గుండె ఆగిపోయింది. పంటచేలోనే ఆ రైతు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం జెక్కిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. గొల్ల నాగన్నకు 20 ఎకరాలు పొలం ఉంది. పెళ్లి సమయంలో కుమార్తెకు నాలుగెకరాలు పంచి ఇచ్చారు. 12 ఎకరాలు వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేస్తూ మూడేళ్లుగా చాలా నష్టపోయారు. నాలుగెకరాలలో ఐదు బోర్లు వేయించగా ఒక బోరులో మాత్రమే నీరు పడింది. బోర్ల కోసం రూ. 1.20 లక్షలు ఖర్చు చేశారు. నాలుగెకరాల తోటలో రెండెకరాలలో 448 రకం టమాటను ట్రెల్లీస్ (కర్రల ఏర్పాటు విధానం)తో సాగు చేశాడు. ఇందు కోసం రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. గురువారం ఉదయం భార్య తో కలిసి పదిమంది కూలీలతో తోటకు వెళ్లారు. పంట తొలగించి 15 కిలోల సామర్థ్యం గల 150 బాక్సులు నింపుతున్నారు. 15 కిలోల టమాట బాక్సు రూ. 30ల ప్రకారం ఓ వ్యాపారితో ధర కుదుర్చుకున్నాడు. ఈ ప్రకారం 150 బాక్సులకు రూ. 4500 మాత్రమే వస్తుంది. ఇందులో 10 మంది కూలీలకు రూ. 2 వేల దాకా కూలీ చెల్లించారు. ఇక మిగిలేది రూ. 2500 అని నిర్ధారించుకున్న రైతు మనోవేదనకు గురై కుంగిపోయాడు. పంటచేలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఆయనకు తిమ్మాపురం ఏపీజీపీలో రూ. 1.08 లక్ష పంట రుణం, రూ. 1977 రీషెడ్యుల్ రుణం ఉండగా రుణమాఫీ కింద రెండింటికి కలిపి రూ. 25,583 మాఫీ అయ్యింది.