nalanda university
-
నలంద వర్సిటీకి పునర్వైభవం (ఫొటోలు)
-
Narendra Modi: ప్రపంచ వైజ్ఞానిక కేంద్రంగా భారత్
రాజ్‌గిర్: అత్యాధునిక, పరిశోధనల ఆధారిత ఉన్నత విద్యా వ్యవస్థతో ప్రపంచంలోనే అతిముఖ్యమైన వైజ్ఞానిక కేంద్రంగా ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఎల్లప్పుడూ జిజ్ఞాస, ధైర్యసాహసాలు కలిగి ఉండాలని విద్యార్థులకు ఉద్బోధించారు. బిహార్‌లోని రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 10 రోజుల వ్యవధిలోనే ఇక్కడికి వచ్చే అవకాశం దక్కడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందన్నారు. విజ్ఞానాన్ని అగి్నకీలలతో కాల్చి బూడిద చెయ్యలేమని, ఇందుకు నలంద విశ్వవిద్యాలయమే ఒక ఉదాహరణ అని చెప్పారు. 21వ శతాబ్దంలో భారత్ కీలక పాత్ర పోషించనుందని, ఆ శతాబ్దం ఆసియాదేనని, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని పునరుద్ఘాటించారు. విద్యా రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిన దేశాలే ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అగ్రరాజ్యాలుగా ఎదుగుతాయని, ఇది చరిత్ర చెబుతున్న సత్యం అని పేర్కొన్నారు. ప్రాచీన కాలంలో మన దేశం ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అగ్రరాజ్య హోదాను అనుభవించిందని గుర్తుచేశారు. అప్పట్లో నలంద, విక్రమశిల వంటి విద్యాసంస్థలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయన్నారు. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో మన వర్సిటీలు భారత్‌ను ప్రపంచ వైజ్ఞానిక కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగా చిన్నారుల్లో నవీన ఆలోచనలను ప్రోది చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’ల ద్వారా కోటి మందికిపైగా బాలలకు అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు. చంద్రయాన్, గగన్‌యాన్ వంటి ప్రయోగాలు మన బాలబాలికల్లో సైన్స్ పట్ల ఉత్సకతను కలిగిస్తున్నాయని చెప్పారు. పదేళ్ల క్రితం మన దేశంలో కేవలం 100 స్టార్టప్ కంపెనీలు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 1.30 లక్షలు దాటేసిందని హర్షం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పేటెంట్లు మనకు లభిస్తున్నాయని, రీసెర్చ్ పేపర్ల ప్రచురణలో ముందంజలో ఉన్నామని పేర్కొన్నారు. పరిశోధన, నవీన ఆవిష్కరణలకు మరింత ఊతం ఇవ్వడానికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధిని ప్రకటించామన్నారు. గత పదేళ్లుగా చూస్తే మన దేశంలో సగటున ప్రతి వారానికొక యూనివర్సిటీని నెలకొల్పినట్లు, ప్రతి పది రోజులకొక ఐటీఐని స్థాపించినట్లు తెలుస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. రెండు రొజులకొక అటల్ టింకరింగ్ ల్యాబ్, ప్రతిరోజూ రెండు కొత్త కాలేజీలు ఏర్పాటయ్యాయని స్పష్టంచేశారు. ప్రస్తుతం 23 ఐఐటీలు, 21 ఐఐఎంలు, 22 ఎయిమ్స్‌లు ఉన్నాయన్నారు. గత పదేళ్లలో మెడికల్ కాలేజీ సంఖ్య రెండింతలు అయ్యిందన్నారు. నలంద మహా విహార సందర్శనబిహార్ రాష్ట్రం నలంద జిల్లా రాజ్‌గిర్‌లోని ప్రాచీన నలంద విశ్వవిద్యాలయ శిథిలాలలో కూడిన నలంద మహా విహారను ప్రధాని మోదీ బుధవారం సందర్శించారు. ఈ కట్టడం విశేషాలను అధికారులు ఆయనకు వివరించారు. ఈ మహా విహార యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది.మోదీ వేలిపై సిరా గుర్తు ఉందా? నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ ప్రారం¿ోత్సవంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని మోదీ ఎడమ చేతిని కొద్దిసేపు పట్టుకొని చూశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసిన మోదీ చూపుడు వేలిపై సిరా గుర్తు ఇంకా ఉందా? అని పరిశీలించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నితీశ్ ఆకస్మిక చర్యకు మోదీ కూడా కొంత ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించారు. అంతేకాదు ఆయన వెనుక ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. -
బీహార్ లో నలంద యూనివర్సిటీని ప్రారంభించిన ప్రధాని మోదీ
-
బీహార్ లో పురాతన నలంద యూనివర్సిటీని పరిశీలిస్తున్న మోదీ
-
ఆసుపత్రిలో చేరిన దలైలామా
ధర్మశాల: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఛాతి సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ధర్మశాల నుంచి ఢిల్లీకి వచ్చిన దలైలామా మ్యాక్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఛాతిలో ఇన్ఫెక్షన్ ఉన్నందువల్ల కొన్ని రోజులు చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. దీంతో బుధవారం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం దలైలామా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత దలైలామాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఢిల్లీలోనే ఏప్రిల్ 6న ముగిసిన గ్లోబల్ లెర్నింగ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న దలైలామా, సోమవారం ధర్మశాలకు వెళ్లారు. కానీ అనారోగ్యం కారణంగా మరుసటి రోజు తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. మొదటిసారిగా 1959లో దలైలామా భారత్‌కు వచ్చారు. టిబెట్, చైనా ఆక్రమణకు గురికావడంతో, తప్పించుకొని భారత్ చేరుకున్న దలైలామా అప్పటి నుంచి హిమచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో నివాసం ఉంటున్నారు. బిహార్‌లోని నలంద విశ్వవిద్యాలయ సాంప్రదాయానికి తనను తాను వారసుడిగా దలైలామా గతంలో ప్రకటించుకున్నారు. -
కొత్త సీసాలో పాత సారానా?
ఏ విశ్వవిద్యాలయమైనా రాజకీయ ఒత్తిడుల నుంచి బయటపడి స్వేచ్ఛగా, స్వయం ప్రతిపత్తితో మనుగడ సాగించినప్పుడే ఉత్తమ ఫలితాలను సాధించగ లదు. ఒకప్పుడు భారతీయ చరిత్రలో పేరు మోసిన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలుగా వెలుగొందాయంటే ఆర్థికంగా వాటికి కావలసిన నిధులను ఆ కాలంలోని రాజులు సమకూర్చడం, వాటి పరిపాలనా వ్యవహారాల్లో ఏనాడూ వారు వేలుపెట్టకపోవడమే. కానీ నేటి ఆధునిక విశ్వవిద్యాలయాలు పేరుకు స్వయం ప్రతిపత్తి కలవే గానీ ప్రతివిషయంలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది. అధ్యాపకుల నియామకాల దగ్గర్నుంచి, నిధుల కేటాయింపు వరకు అన్నిటిలోనూ అవినీతి, అక్రమాలకు తెరలేపుతూ రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు, అధికారులు వీటిని అయినవారి ఆవాసులుగా మార్చుతున్నారు. ఇలాంటి దుష్పరిణామాలను అడ్డుకోవడానికే యూజీసీ వంటి స్వతంత్ర సంస్థలు వెలిశాయి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యూజీసీని రద్దు చేసి కొత్తగా భారతీయ ఉన్నత విద్యా కమిషన్ అనే సంస్థను దాని స్థానంలో ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. సంస్థ పేరు మార్చినంత మాత్రాన దాని అవలక్షణాలు చెరిగిపోవు. మన దేశంలో ఉన్నత విద్య కష్టాల బారినపడటానికి కారణం సరైన నియంత్రణా సంస్థలను రూపొందించకపోవడం కాదు. ప్రస్తుత సంస్థల ఆశ్రిత పక్షపాతంతోపాటు, పాలక మండలుల ఆలోచనాధోరణి కూడా కారణమే. ఏ ఉన్నత విద్యాసంస్థనైనా రాజకీయ ప్రయోజనాలకోసం పనిముట్టుగా వాడుకోవాలని చూసినప్పుడే దాని పతనం ప్రారంభం అవుతుందని యూజీసీ ఉదంతం చెబుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటికనుగుణంగా దాన్ని తోలుబొమ్మను చేసి ఆడించారు కాబట్టే యూజీసీ ఇప్పుడు పాలకులకు ఖాయిలా పడ్డ పరిశ్రమలా, నిర్వీర్యమైన వ్యవస్థలా కనిపిస్తోంది. అంతమాత్రాన యూజీసీని నిర్వహించిన పాత్రను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఇప్పుడు యూజీసీ స్థానంలో కొత్తగా హెచ్.ఇ.సి.ఐ. ఏర్పాటు కూడా కొంత వివాదాస్పదంగానే మారింది. ఇప్పుడు యూజీసీ స్థానంలో హెచ్.ఇ.సి.ఐ.ని తీసుకురావటంలో కూడా ముఖ్యోద్దేశం విధులను నియంత్రణ నుండి వేరు చెయ్యటమే. అసలు నిజం.. వర్సిటీలపై ఆర్థిక ఆంక్షలు విధించటమే. హెచ్.ఇ.సి.ఐ.ని స్థాపించటానికి రూపొందిం చిన చట్టంలో, విద్యా ప్రమాణాలను అత్యున్నత స్థాయిలో నిలపటానికి, విద్యా బోధనలో నాణ్యతను తీసుకురావటానికి ఈ కొత్త నియంత్రణా సంస్థ పనిచేస్తుందని పేర్కొన్నా, నాణ్యత అనే దానికి నిర్వచనాన్ని మాత్రం ఇవ్వలేకపోతోంది. ఎన్ని రకాలైన ప్రమాణాలను నిర్వచించినా వాటికి నానార్థాలు చెబుతూ, వాటిలోని లోపాలను ఆసరాగా చేసుకుని పబ్బం గడుపుకోవటం మన విద్యా సంస్థలకు అలవాటుగా మారింది. ప్రతి ప్రామాణికానికి నకిలీ ప్రామాణికాన్ని రూపొందించటం పరిపాటైంది. నిజానికి వాసిపరంగా విద్యా సంబంధమైన సామర్థ్యాన్ని అంచనా వెయ్యటం అంత సులభమేమీ కాదు. ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నా నాణ్యత మాత్రం వీసమెత్తు కూడా పెరగలేదు. ఇక్కడ విచిత్రం ఏమింటంటే.. వందలోపు జాతీయ ర్యాంకులు సాధించిన సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోంది. సహజంగానే దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలైన ఐఐటీలు, ఎన్ఈటీలు, ఐఐ ఎమ్‌లు వందలోపు నిలబడతాయి. వీటికి ఇప్పటికే నిధులు ఇబ్బడిముబ్బడిగా అందుతున్నాయి. మళ్లీ వీటికే నిధుల వరద పారించటంలో ఆంతర్యమేమిటో ఏలినవారే చెప్పాలి. నిధులు లేక, సరైన మౌలిక వసతులు లేక, రాష్ట్ర ప్రభుత్వాల కనికరం లేక ర్యాంకుల్లో వెనుకబడిన రాష్ట్ర విశ్వ విద్యాలయాలకు ఏ మాత్రం ఆర్థిక సహాయం లేక ఇంకా వెనుకబడుతున్నాయి. కొత్తగా ఈ మధ్య ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అంటూ ఇప్పటికే దేశంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంస్థలలో మొదటి 20 వాటిని ఎన్నుకుని వాటికి ఎటువంటి నిబంధనలు నియంత్రణలూ లేకుండా పూర్తి స్వేచ్ఛని చ్చారు. మిగతా వాటిని మాత్రం యూజీసీ ఉక్కు పిడికిళ్లలోనే నలగమని ఆదేశాలిచ్చారు. అదేమంటే వాటిలో ప్రమాణాలు దిగువ స్థాయిలో ఉన్నాయంటున్నారు. అసలు విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు దిగజారటానికి కారకులు రాజకీయ నాయకులు, విద్యా సంస్థల ఏలికలు, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలే. గ్రేడింగ్ విధానం ద్వారా పరిమిత స్వయంప్రతిపత్తి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ, మోడల్ పాఠ్యాంశ వృత్తి విద్యా కోర్సులు, ఐసీటీ వినియోగం వంటి ఎన్నో మార్గాల ద్వారా ఉన్నత విద్యా సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించాలని చూస్తున్న ఈ తరుణంలో వాటి ఫలితాలు రాకముందే, యూజీసీ స్థానంలో మరో కొత్త సంస్థ హెచ్ఇసీఐను తీసుకురావల్సిన అవసరం లేదు. రాజకీయ క్రీడలో ప్రత్యర్థులను ఓడించటానికి విద్యా సంస్థలను ఫణంగా పెట్టడం దిగజారుడుతనం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికే ఈ జూద క్రీడలో క్షతగాత్రులుగా హైదరాబాద్, వారణాసి, ఢిల్లీ, పూణే, అలహాబాద్ తదితర విశ్వవిద్యాలయాలు మిగిలాయి. మరింతగా వీటిని ఫణంగా పెట్టడానికి హెచ్.ఇ.సి.ఐ.ని ఒక ఆయుధంగా తయారుచేస్తే అంతకన్నా ఆత్మహత్యాసదృశ్యం ఇంకొకటి ఉండదు. ప్రొ‘‘ ఇ. శ్రీనివాసరెడ్డి ,వ్యాసకర్త ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ‘ మొబైల్ : 789361 11985 -
కేంద్రానికి నితీశ్ ఘాటు లేఖ
పట్నా: కేంద్ర ప్రభుత్వానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఘాటు పదాలతో లేఖ రాశారు. నలంద విశ్వవిద్యాలయం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని, దాని నిబంధనల్లో మార్పులు చేయవద్దని అన్నారు. అలా చేయడమంటే వర్సిటీకి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని తగ్గించడమేనని ఆ లేఖలో పేర్కొన్నారు. వర్సిటీలోని పాలక కమిటీ విషయంలో తనను సంప్రదించకుండానే మార్పులు చేశారని, కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుందని పేర్కొంటూ వైస్ ఛాన్సలర్ జార్జ్ యో తన బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌కు నితీశ్ లేఖ రాశారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో వర్సిటీ వీసీని కచ్చితంగా సంప్రదించాలని, కానీ అలా జరగలేదని, ఈ చర్య వర్సిటీ స్వతంత్ర ప్రతిపత్తి హోదాను సంకటంలో పడేసే పరిస్థితి అని అందులో ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీ నిబంధనల ప్రకారం కేంద్రం జోక్యం చేసుకోకూడదని, దీని వెనుక ప్రధాని నరేంద్రమోదీ హస్తం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. వర్సిటీ గౌరవాన్ని కాపాడాలని, ఇలాంటివి జరగకుండా చూడాలంటూ నితీశ్ విజ్ఞప్తి చేశారు. -
’నలంద’లో పాక్ విద్యార్థులకు అడ్మిషన్!
రాజ్ గిరి: దేశంలోనే ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం ఇద్దరు పాకిస్తానీ విద్యార్ధులకు అడ్మిషన్ ఇచ్చింది. భారత్-పాకిస్తాన్ ల మధ్య రాజకీయంగా యుద్ధవాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో పాక్ విద్యార్థులకు నలంద వర్సిటీ వారికి సీట్లు కేటాయించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. విదేశీ విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫర్ చేసిన 83 సీట్లలో రెండు పాకిస్తాన్ విద్యార్ధులకు కేటాయించినట్లు అడ్మిషన్స్ అధికారి తెలిపారు. మొత్తం పదమూడు దేశాల నుంచి 80 మంది విద్యార్థులు ఇప్పటికే యూనివర్సిటీలో రిపోర్ట్ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన మూడు సీట్లను మయన్మార్ నుంచి ఒకరికి, పాకిస్తాన్ నుంచి ఇద్దరికి కేటాయించామని చెప్పారు. అయితే, వారు ఇంకా యూనివర్సిటీలో రిపోర్ట్ చేయలేదన్నారు. భూటాన్, వియత్నాం, లావోస్, పెరూ, చైనా, దక్షిణ కొరియా, దక్షిణ ఆఫ్రికా, నైజీరియా, మయన్మార్, జపాన్ తదితర దేశాల నుంచి విద్యార్ధులు అడ్మిషన్ తీసుకున్నారని వివరించారు. వీసా జారీలో జాప్యం కారణంగానే యూనివర్సిటీలో రిపోర్టు చేయడం ఆలస్యం అవుతోందని పాక్ కు చెందిన విద్యార్ధులు చెప్పారని పేర్కొన్నారు. ఇరువురు విద్యార్థులు స్కూల్ ఆఫ్ ఎన్విరాన్ మెంట్ అండ్ ఎకాలజీలో చేరతారని నలంద డైరెక్టర్ స్మితా తెలిపారు. యూనివర్సిటీలో అడ్మిషన్ కొరకు ప్రపంచంలోని 50 దేశాల నుంచి మొత్తం ఆరు వేల అప్లికేషన్లు వచ్చానట్లు వివరించారు. -
‘నలందా’ రాజకీయం
ఎనిమిది వందల ఏళ్ల నాటి విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించడం, తద్వారా ఆసియా దేశాల మధ్య సాంస్కృతిక వారధిని పునర్ నిర్మించడం వంటి మహ దాశయాలతో ఆరంభమైన పథకం వివాదాలలో చిక్కుకోవడం పెద్ద విషాదమే. గడచిన సెప్టెంబర్ 1 నుంచి బోధన ప్రారంభించిన నలందా విశ్వవిద్యాలయం అప్పుడే పెద్ద కుదుపునకు గురైంది. ఆ విశ్వవిద్యాలయం చాన్సలర్, నోబెల్ బహు మతి గ్రహీత ఆచార్య అమర్త్యసేన్ రెండు రోజుల క్రితం ఆ పదవి నుంచి నిష్ర్కమి స్తున్నట్టు ప్రకటించడం సరికొత్త వివాదం మాత్రమే. మరోసారి తను కొనసాగడం ప్రభుత్వానికి సమ్మతం కాదని అనిపిస్తున్నందున పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించినట్టు సేన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ జూలైతో ముగుస్తున్న ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పెంచుతూ విశ్వవిద్యాలయం పాలక మండలి తీర్మా నం చేసి పంపిన ఫైలు మీద రాష్ట్రపతి సంతకం చేయలేదు. ఇదే డాక్టర్ సేన్‌ను మన స్తాపానికి గురి చేసింది. నిజానికి ‘అర్థశాస్త్రం’ వంటి అసాధారణ రాజనీతిశాస్త్రాన్ని భారతదేశానికి అందించిన చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో పనిచేశాడు. ఆ గ్రంథమంతా వ్యూహప్రతివ్యూహాలకు ప్రతీతి. కానీ 21వ శతాబ్దంలో పునః ప్రారంభమైన నలందా విశ్వవిద్యాలయంలో అంతకు మించిన రాజకీయ వ్యూహాలు చోటు చేసుకుంటున్నాయి. థాయ్‌లాండ్‌లో జరిగిన తూర్పు ఆసియా దేశాల సదస్సులో (2009) నలంద పునరుద్ధరణ ప్రతిపాదన వచ్చింది. సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి జార్జి ఎవో ఇందులో కీలకంగా వ్యవహరించారు. ఇంగ్లండ్, చైనా, సింగపూర్ దేశాల నుంచి నిపుణులను ఇక్కడ బోధనకు నియమిం చాలని కూడా భావించారు. 2010 ఆగస్ట్‌లో భారత పార్లమెంట్ నలందా విశ్వవిద్యాలయం పునరుద్ధరణకు సంబం ధించిన బిల్లును ఆమో దించింది. ప్రస్తుతం పట్నాకు సమీపంలోని రాజగృహ అనే బౌద్ధకేంద్రం పరిసరాలలో, 800 ఏళ్ల నాటి పురాతన నలందా విశ్వవిద్యాలయం శిథిలాల దగ్గర 500 ఎకరాలలో కొత్త విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్మించాలని నిర్ణయించారు. పది బిలియన్ రూపాయలతో, 2020 కల్లా దీనికి ఒక రూపు తేవాలని పథక రచన కూడా జరిగింది. నాటి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఇందుకోసం విశేష కృషి చేశారు. నిజానికి యూపీఏ-2 ప్రభుత్వమే ఈ పథకం పట్ల పెద్దగా శ్రద్ధ చూపలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ పనికీ సకాలంలో నిధులు కేటాయించలేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సెప్టెంబర్ 19, 2014న మన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ 15 మంది విద్యార్థులతో, ఆరుగురు ఆచార్యులతో విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. భారతీయ పురాతన విజ్ఞానశాస్త్రాలు, పర్యావరణ అధ్యయనాలు మొదట ఆరంభమైనాయి. సామాజిక శాస్త్రాలు, తత్వం వంటి అంశాలను తరువాత ప్రవేశపెట్టాలని అనుకున్నారు. అయితే ఈ ప్రారంభోత్సవానికి అప్పటికి బిహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన నితీశ్‌కుమార్‌కు ఆహ్వానం వెళ్లలేదు. అధికారంలో ఉన్న జీతన్ రామ్ మాంఝీ మాత్రం హాజరయ్యారు. ఇది కూడా వివాదమైంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత విశ్వవిద్యాలయం వ్యవహారంలో రాజ కీయ జోక్యం మితిమీరిందని డాక్టర్ సేన్ ఆరోపణ. తనకు మరో సంవత్సరం అవ కాశం ఇవ్వకూడదని అనుకోవడంతో పాటు, విశ్వవిద్యాలయం పాలక మండలిని పునర్ నిర్మించాలని కూడా మోదీ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, ఇది చట్ట వ్యతిరేక మని కూడా డాక్టర్ సేన్ చెబుతున్నారు. నిజానికి మోదీ అధికారంలోకి రాగానే డాక్టర్ సేన్ చాన్సలర్ పదవి మీద నీలినీడలు ప్రసరించాయని అనిపిస్తుంది. గడచిన మే మాసంలో లోక్‌సభ ఎన్నికల సమయంలోనే మోదీ ప్రచారంలో ఉన్నపుడు ఆయన ప్రధాని కావడం సరికాదని డాక్టర్ సేన్ ప్రకటించి సంచలనం సృష్టించారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల విషయంలో కూడా డాక్టర్ సేన్ చిరకాలంగా మోదీని తప్పు పడుతున్నారు. అయినా పునరుద్ధరించిన నలందా విశ్వవిద్యాలయానికి నాయకత్వం వహించడానికీ, దాని ఏర్పాటు ద్వారా సాధించ దలచిన ఫలితాల సాధనకూ డాక్టర్ సేన్ వంటి అంతర్జాతీయ విద్యావేత్త అవసర మని ఎందరో భావించారు. హార్వర్డ్‌లో పనిచేయడం, అర్థశాస్త్రంలో నోబెల్ పుర స్కారం తీసుకోవడం డాక్టర్ సేన్ నాయకత్వానికి బలాన్ని ఇచ్చాయి. పురాతన నలందా విశ్వవిద్యాలయం (క్రీస్తుశకం 413-1193) పరిపూర్ణమైన రూపు తెచ్చు కోవడానికి రెండు వందల సంవత్సరాలు పట్టింది. కానీ కొత్త విశ్వవిద్యాలయం పునాదులలోనే రాజకీయాలు చోటు చేసుకోవడం విషాదమే. రాజకీయాల కార ణంగా గొప్ప ఆశయం మీద నీలినీడలు ప్రసరించడం అందరినీ కలవరపరుస్తోంది. -
భారత 15వ ప్రధానిగా నరేంద్ర మోదీ..
ప్రపంచంలోనే తొట్టతొలి విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా, పలు దేశాల విద్యార్థులను ఆకర్షించిన ప్రాచీన నలందా వర్సీటిలో 821 ఏళ్ల తర్వాత మళ్లీ లాంఛనంగా సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ వర్సిటీని పునరుద్ధరించాలని 2006 లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం బీహార్ అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా ప్రతిపాదించారు. - 12వ ప్రవాసీ భారతీయ దివస్ న్యూఢిల్లీలో జనవరి 7నుంచి 9 వరకు జరిగింది. కార్యక్రమం ముగింపు సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వివిధ రంగాల్లో సేవలందించిన 13 మంది ప్రవాస భారతీయులకు ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డులు ప్రదానం చేశారు. - ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్లో నిర్మించిన ప్లాట్‌ఫామ్ నెంబర్-1 ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌గా రికార్డుల్లోకెక్కింది. దీని పొడవు 1,355.40 మీటర్లు. - కౌమారదశలో ఆరోగ్య, ఆహార, ఇతర సాంఘిక సమస్యలను అధిగమించేందుకు 10-19 ఏళ్ల లోపు వారికోసం కేంద్రం కొత్తపథకాన్ని ఆరంభించింది. దీనికి రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్కేఎస్కే)గా పేరుపెట్టింది. - ఒడిశాలోని చిలక సరస్సును సుస్థిర పర్యాటక రంగం, జీవనోపాధి వనరుల అభివృద్ధి, పక్షుల వలస కొనసాగింపునకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) ఎంపిక చేసింది. చిలక సరస్సుతో కలిపి ఎనిమిది ప్రాంతాలను ఈ సంస్థ ఎంపిక చేసింది. ఆసియాలో చిలక ప్రాంతం ఒక్కటే యూఎన్ ప్రాజెక్టుకు ఎంపికవడం విశేషం. - జైనులకు మైనారిటీ హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్ జనవరి 20న నిర్ణయం తీసుకుంది. దేశంలో వీరి జనాభా 50 లక్షల వరకు ఉంటుంది. ఇప్పటివరకు ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు మైనారిటీ హోదాను కలిగి ఉన్నారు. - జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్- ఎన్యూహెచ్ఎం) పథకాన్ని అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్ బెంగళూర్‌లో జనవరి 20న ప్రారంభించారు. పట్టణ పేద ప్రజలకు సమర్థంగా ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. 2015 మార్చి నాటికి 50 వేలకు పైగా జనాభా ఉండే 779 పట్టణాలకు పథకాన్ని వర్తింపజేస్తారు. ఈ పథకం ద్వారా మొత్తం 220 మిలియన్ల మందికి ఆరోగ్య సేవలు అందుతాయి. - దేశంలోనే మొట్టమొదటి మోనోరైలు సేవలు ముంబైలో ప్రారంభమయ్యాయి. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ మొదటిదశను ఫిబ్రవరి 1న ప్రారంభించారు. వడాలా-చెంబూర్‌ల మధ్య 8.93 కిలోమీటర్ల మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. - పత్రికా స్వేచ్ఛకు సంబంధించి పారిస్‌కు చెందిన రిపోర్టర్స విత్ ఔట్ బోర్డర్స ఫిబ్రవరి 12న విడుదల చేసిన నివేదికలో భారత్‌కు 140వ స్థానం దక్కింది. 180 దేశాల జాబితాలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. - ఒడియా భాషకు ప్రాచీన హోదా కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 20న ఆమోదం తెలిపింది. దీంతో ఈ హోదా ఉన్న భాషల సంఖ్య ఆరుకు చేరింది. సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలకు ఈ హోదా ఉంది. - దేశంలో తొలి పోస్టాఫీస్ ఏటీఎంను చెన్నైలో ఫిబ్రవరి 27న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రారంభించారు. - లోక్‌సభ, శాసనసభ ఎన్నికల వ్యయపరిమితిని పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 28న ఆమోదం తెలిపింది. లోక్‌సభ వ్యయపరిమితిని పెద్ద రాష్ట్రాల్లో రూ.70 లక్షలకు, చిన్న రాష్ట్రాల్లో రూ.54 లక్షలకు పెంచారు. ఇది గతంలో పెద్ద రాష్ట్రాల్లో రూ.40 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.22 లక్షలుగా ఉంది. - దేశంలో అత్యంత ఎత్తయిన జెండా స్తంభాన్ని ఢిల్లీలోని సెంట్రల్ పార్కలో మార్చి 7న ఆవిష్కరించారు. ఈ స్తంభం ఎత్తు 207 అడుగులు. స్తంభంపై ఎగురవేసిన జెండా పొడవు 90 అడుగులు, వెడల్పు 60 అడుగులు, బరువు 35 కిలోలు. దేశంలో అత్యంత పెద్దదైన జాతీయ పతాకంగా ఇది రికార్డుకెక్కింది. - హిజ్రాలను మూడో లింగ వర్గంగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఏప్రిల్ 15న తీర్పు ఇచ్చింది. వారిని సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా పరిగణించాలని, సాధారణ జనజీవన స్రవంతిలో కలిసేందుకు తోడ్పడే చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. - భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మార్చి 27న అధికారికంగా ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌వో.. భారత్‌తో కలిపి మొత్తం 11 దేశాలను పోలియో వైరస్ రహిత దేశాలుగా ప్రకటించింది. - దేశంలో తొలిసారిగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ముంబైలో ఏప్రిల్ 18న ప్రారంభమైంది. శాంతాక్రజ్- చెంబూర్ లింక్‌రోడ్ (ఎస్‌సీఎల్‌ఆర్) ప్రాజెక్టు ముంబై తూర్పు-పశ్చిమ ప్రాంతాలను కలుపుతుంది. - ప్రజావేగుల రక్షణ బిల్లు-2011కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మే 13న ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. - దేశంలో తొలి పొగాకు రహిత గ్రామంగా నాగాలాండ్‌లోని గరిపెమ అనే పల్లె రికార్డులకెక్కింది. మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గరిపెమను పొగాకు రహిత గ్రామంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. - 16వ లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ 282 స్థానాల్లో విజయం సాధించింది. మే 16న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 సీట్ల కంటే 10 స్థానాలను అదనంగా సాధించింది. ఆ పార్టీ నేత నరేంద్రమోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి 3,71,784 ఓట్ల మెజారిటీతోనూ, వడోదర నుంచి 5,70,128 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిసి 336 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్, మిత్రపక్షాలు ఘోరపరాజయం చవిచూశాయి. దేశ 15వ ప్రధానిగా మోదీ మే 26న ప్రమాణం చేశారు. - ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో 70 అంతస్తులతో 213 మీటర్ల ఎత్తయిన చంద్రోదయ మందిర నిర్మాణ పనులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ ఆగస్టు 18న ప్రారంభించారు. ఆలయనిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తై గుడిగా చంద్రోదయ మందిరం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. - అంతర్జాతీయ నివాసయోగ్య ప్రాంతాల్లో దేశ రాజధాని ఢిల్లీ111వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు గ్లోబల్ లివబులిటి సంస్థ సర్వే పేర్కొంది. మొదటి స్థానాన్ని వరుసగా నాలుగోసారి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం సొంతం చేసుకొంది. - నేషనల్ ఆయుష్ మిషన్ (ఎన్ఏఎమ్)ను ప్రారంభించేందుకు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 15న ఆమోదించింది. అ్గ్ఖఏ అనే ఈ పదం ఆయుర్వేదం, యోగా అండ్ నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతిలను సూచిస్తుంది. ఆయుష్‌ను ప్రత్యేక మంత్రిత్వశాఖగా మోదీ ప్రభుత్వం గుర్తించింది. ఆ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా)గా శ్రీపాద యశోనాయక్ నవంబరు 11న బాధ్యతలు స్వీకరించారు. - శిశు మరణాల విషయంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. 2013లో ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన అయిదేళ్లలోపు శిశుమరణాలపై ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్ 16న నివేదికను విడుదల చేసింది. 2013లో దేశంలో ప్రతి వెయ్యిమంది శిశువుల్లో 41 మరణాలు నమోదైనట్లు తెలిపింది. - స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 2న న్యూఢిల్లీలో ప్రారంభించారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ పేరుతో ఐదేళ్లపాటు ఈ కార్యక్రమం అమల్లో ఉంటుంది. ఇందులో భాగంగా ఆరుబయట మలవిసర్జన నిర్మూలించడం, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం తదితర కార్యక్రమాలు చేపడతారు. - దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్) విద్యా మంత్రుల, అధికారుల రెండో సదస్సు న్యూఢిల్లీలో అక్టోబరు 31న జరిగింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, విద్యా నాణ్యతను మెరుగుపరచుకోవడంలో పరస్పరం సహకరించుకోవాలని సదస్సు నిర్ణయించింది. - పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్రమయేవ జయతే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ అక్టోబరు 16న న్యూఢిల్లీలో ప్రారంభించారు. దీని కింద ఐదు పథకాలను ప్రారంభించారు. అవి.. శ్రమ సువిధ పోర్టల్, ర్యాండమ్ ఇన్స్పెక్షన్ పథకం, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్), అప్రెంటీస్ షిప్ ప్రోత్సాహన యోజన, సవరించిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా. - గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద ల జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న ప్రకటించింది. దీనికోసం రూ. 500 కోట్లు కేటాయించింది. - భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31ని జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివాస్)గా కేంద్రం ప్రకటించింది. - స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్‌ను తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోకపోతే అలాంటి వారికి శిక్ష తప్పదన్నది ఈ బిల్లులోని సారాంశం. - పట్టణాల్లో కొత్తగా ఇళ్ల నిర్మాణాల కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ గృహ పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు నవంబరు 13న ప్రకటించారు. - దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజన కార్యక్రమాన్ని కేంద్ర కేబినెట్ నవంబరు 20న ఆమోదించింది. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన (ఆర్‌జీజీవీవై) స్థానంలో దీన్ని చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ప్రసార, పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడమే పథకం ప్రధాన లక్ష్యం. - పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు భారత్ 43 దేశాలకు చెందిన ప్రజలకు ఈ-వీసా సౌకర్యాన్ని కల్పించింది. దీన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నవంబరు 27న న్యూఢిల్లీలో ప్రారంభించారు. - మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినమైన డిసెంబరు 25ను జాతీయ సుపరిపాలనా దినంగా నిర్ణయిస్తూ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. - ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి ఖాతా పథకాన్ని కేంద్రం డిసెంబరు 4న ప్రారంభించింది. ఈ ఖాతాను బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో తెరవొచ్చు. పదేళ్లలోపు ఆడపిల్లలకు వర్తిస్తుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 ఏళ్లు పూర్తయ్యాక పథకం ముగుస్తుంది. 14 ఏళ్లు పూర్తయేంత వరకే డబ్బు జమ చేయాల్సి ఉంటుంది. - ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించవద్దని, దీనికి సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (ఐపీసీ)లోని 309వ సెక్షన్‌ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని డిసెంబర్ 10న రాజ్యసభలో వెల్లడించింది. - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య డిసెంబర్ 11న ఢిల్లీలో సద స్సు జరిగింది. పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ సదస్సులో రక్షణ, చమురు, గ్యాస్, వైద్యం, గనులు, కమ్యూనికేషన్లు తదితర కీలక రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య 20 ఒప్పందాలు కుదిరాయి. - భూసేకరణ చట్టం(2013)లో కొత్త సవరణలతో కూడిన ఆర్డినెన్సుకు డిసెంబర్ 29న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) ఉన్న ప్రాజెక్టుల కోసం భూసేకరణ జరిపే సమయంలో.. ప్రభావిత రైతుల్లో కనీసం 70% మంది, ప్రైవేటు ప్రాజెక్టుల విషయంలో కనీసం 80% మంది అంగీకారం తప్పనిసరిగా అవసరమన్న నిబంధనను తొలగిస్తూ భూసేకరణ చట్టంలో సవరణలు చేసింది. ఆయా ప్రాజెక్టులకు సామాజిక ప్రభావ అంచనా(ఎస్ఐఏ) నిబంధనను కూడా తొలగించింది. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతిని పురస్కరించుకొని ఎంపీ ఆదర్శగ్రామ పథకాన్ని ప్రధాని మోదీ అక్టోబర్ 11న న్యూఢిల్లీలో ప్రారంభించారు. పథకం కింద ప్రతీ ఎంపీ తన నియోజకవర్గంలోని ఏవైనా మూడు గ్రామాల్లో సదుపాయాలను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకోవాలి. ఈ పథకం కింద వారణాసికి సమీపంలోని జయపూర్ గ్రామాన్ని మోదీ దత్తత తీసుకున్నారు.. -
నలంద నవశకం
నలంద విశ్వవిద్యాలయం.. శతాబ్దాల కిందటే ప్రపంచం దృష్టి భారత్‌పై నిలిచేలా చేసిన అత్యుత్తమ విద్యా సంస్థ. భారతీయ విద్యా విధానాన్ని, సంస్కృతీ, సాంప్రదాయాలను, శాస్త్ర విజ్ఞానాన్ని వ్యాపింపచేసి దేశవిదేశాల విద్యార్థులను ఆకర్షించిన ఈ యూనివర్సిటీ తర్వాతి కాలంలో దండయాత్రలకు ధ్వంసమైంది. తాజాగా నాటి వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా నవశకానికి నాంది పలుకుతూ ప్రాచీన నలంద యూనివర్సిటీ మళ్లీ మన ముందుకు వచ్చింది. బీహార్ రాజధాని పాట్నా సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ యూనివర్సిటీ.. గత నెల ఒకటి నుంచి తరగతులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. నలంద యూనివర్సిటీతోపాటు దేశ స్వాతంత్య్రానికి ముందు నుంచీ ఉన్న విశ్వవిద్యాలయాలపై ప్రత్యేక కథనం.. గుప్తుల కాలంలో.. భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణ యుగంగా పిలుస్తారు. వీరికాలంలోనే క్రీ.శ 427 (ఐదో శతాబ్దం)లో పాటలీపుత్రం (ప్రస్తుతం బీహార్ రాజధాని పాట్నా) సమీపంలోని రాజ్‌గిర్‌లో నలంద యూనివర్సిటీ ఏర్పాటైంది. ప్రారంభించిన కొన్నేళ్లకే ప్రపంచంలోనే గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా భాసిల్లింది. ఆ కాలంలోనే వివిధ పుస్తకాలతో కూడిన గొప్ప గ్రంథాలయం ఉండేది. ఇందులో చిత్రలేఖనం, వైద్యశాస్త్రం, ఖగోళ శాస్త్రం, సాహిత్యం, బౌద్ధం.. జైనమతాల సాహిత్యానికి సంబంధించిన వేలాది గ్రంథాలు విద్యార్థులకు అందుబాటులో ఉండేవి. దేశవిదేశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు విద్యనభ్యసించడానికి నలందకు వచ్చేవారు. మూడు రౌండల్లో జరిగే పరీక్ష ద్వారా ప్రవేశం కల్పించేవారు. ఆ రోజుల్లోనే 10 వేల మంది విద్యార్థులు, 2 వేల మంది ఫ్యాకల్టీ క్యాంపస్‌లోనే నివాసం ఉండేవారు. ఇలా ప్రపంచంలోని అన్ని దేశాల విద్యార్థులతో కొన్ని వందల ఏళ్లపాటు వైభవంగా వర్ధిల్లిన ఈ యూనివర్సిటీ.. భక్తియార్ ఖిల్జీ 12వ శతాబ్దంలో జరిపిన దాడిలో.. తీవ్రంగా నష్టపోయింది. తొంభై ల క్షలకుపైగా లిఖితప్రతులు అగ్నికి ఆహుతి అయ్యాయి. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎక్కువ భాగం ఈ దాడిలో ధ్వంసమైంది. ప్రపంచదేశాల విశ్వగురువుగా భారత్‌ను నిలిపిన నాటి నలంద విశ్వవిద్యాలయం అలా చరిత్రలో కలిసిపోయింది. నలంద పునరుద్ధరణ నాటి నలంద యూనివర్సిటీని మళ్లీ పునరుద్ధరించాలని 2006లో మొదట ప్రతిపాదించింది.. ప్రముఖ శాస్త్రవేత్త, దేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్. 2010లో నలంద యూనివర్సిటీ ఏర్పాటు బిల్లు.. లోక్‌సభ, రాజ్యసభల ఆమోదాన్ని పొందింది. తర్వాత రాష్ట్రపతి కూడా ఆ బిల్లును ఆమోదించారు. 2010 నవంబర్‌లో పార్లమెంటు చట్టం ద్వారా నలంద యూనివర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇక ప్రవేశాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన విద్యార్థుల నుంచి 1000 దరఖాస్తులు వచ్చాయి. యూఎస్, రష్యా, ఇంగ్లండ్, యూరోపియన్ దేశాలు, ఆగ్నేయ ఆసియా, ఆసియా దేశాల నుంచి కూడా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈ వేయిమంది నుంచి చివరకు 15 మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేశారు. వీరిలో ఐదుగురు మహిళలు. అంతేకాకుండా భూటాన్ యూనివర్సిటీ డీన్, బుద్ధిస్ట్ స్టడీస్‌పై పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తున్న జపనీస్ విద్యార్థి కూడా ఈ 15మందిలో ఉన్నారు. ప్రాచీన నలంద యూనివర్సిటీ ప్రమాణాలకు తగినట్లుగా ఎంపిక ప్రక్రియ అత్యంత కఠినంగా ఉంది. ఇందుకు నిదర్శనం వేయిమంది దరఖాస్తు చేసుకుంటే 15 మంది ఎంపిక కావడమే. ఎంపికైన విద్యార్థులకు పాట్నా సమీపంలోని రాజ్‌గిర్‌లో సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభమయ్యాయి. రీసెర్చ్ బేస్డ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకువచ్చే క్రమంలో అకడమిక్ ఎక్స్‌లెన్స్‌కు పెద్దపీట వేయనున్నారు. విద్యార్థులకు ఆయా అంశాలపై లోతైన పరిజ్ఞానం అందిస్తూ.. పరిశోధనపరమైన అధ్యయనాన్ని ప్రోత్సహించాలనే ల క్ష్యంతో ఉన్నారు. తద్వారా విద్యార్థులకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అందుతుందని యూనివర్సిటీ వర్గాల భావన. ఈ క్రమంలో అంతర్జాతీయ అవ సరాలకనుగుణంగా కరిక్యులం, బోధన పద్ధతులను ప్రవేశపెట్టారు. ప్రధానంగా రీసెర్చ్ ఓరియెంటెడ్ యూనివర్సిటీగా నలందను తీర్చిదిద్దనున్నారు. ముందుగా రెండు స్కూళ్లు నలంద యూనివర్సిటీలో ముందుగా రెండు స్కూళ్లను ఏర్పాటు చేశారు. అవి.. 1. స్కూల్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్: ఇది నేచురల్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్ విభాగాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. 2. స్కూల్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్: ఇది ప్రపంచ చరిత్ర, మధ్య ఆసియా సంబంధాలు, ఆర్కియాలజీ, ఆర్ట్ హిస్టరీ అండ్ ఎకనమిక్ హిస్టరీ వంటివాటిలో విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దుతుంది. 2020 నాటికి పరిశోధన, పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్టడీస్ కోసం మరో ఏడు స్కూళ్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో యూనివర్సిటీ ఉంది. ఈ క్రమంలో 2016 నాటికి రెండు స్కూళ్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నలంద యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా.. అత్యుత్తమ విద్యను అందించాలని కంకణం కట్టుకుంది. వివిధ సంస్థలతో ఒప్పందాలు ప్రాచీన కాలం నాటి వైభవాన్ని మరోమారు అందుకునే నేపథ్యంలో.. యూనివర్సిటీ.. దేశవిదేశాలకు చెందిన ప్రఖ్యాత విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. యేల్ యూనివర్సిటీ, పెకింగ్ యూనివర్సిటీ, యూరోపియన్ కన్సోర్టియం ఫర్ ఏషియన్ ఫీల్డ్ స్టడీ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటివాటి సహకారంతో ముందడుగు వేస్తోంది. యూనివర్సిటీ పాలనలో కూడా నిష్ణాతులైన నిపుణులు ఉన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ అమర్త్యసేన్.. యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు. గవర్నింగ్ బాడీ సభ్యులుగా వివిధ అంశాల్లో నిష్ణాతులైన నిపుణులు ఉన్నారు. నిపుణులైన ఫ్యాకల్టీ నలంద యూనివర్సిటీని ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే క్రమంలో.. దేశవిదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన విద్యావేత్తలు ఇక్కడ పాఠాలు బోధిస్తున్నారు. బోధనలోనూ సంప్రదాయ విధానాలకు దూరంగా.. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ వంటి ఆధునిక పద్ధతులను ప్రవేశపెడుతున్నారు. అంతేకాకుండా వివిధ అంశాలపై అధ్యయనం చేసే విద్యార్థులకు మరింత సమగ్ర సమాచారం అందించేలా బోధన ఉంటోంది. ఫ్యాకల్టీ, విద్యార్థుల నిష్పత్తి కూడా 1:8 (ప్రతి ఎనిమిది మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ)గా ఉంటుంది. తద్వారా విద్యార్థులకు వీలైనంత ఎక్కువమంది ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారు. వీరివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఇలా మంచి ఫ్యాకల్టీ లభించడం వల్ల ఎక్కువమంది విద్యార్థులు నలంద యూనివర్సిటీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. అత్యాధునిక సదుపాయాలతో క్యాంపస్ ప్రాచీన నలంద యూనివర్సిటీ ఏర్పాటైన ప్రదేశం దగ్గరలోనే ప్రస్తుత నలంద యూనివర్సిటీ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇందుకోసం మొత్తం 455 ఎకరాలు కేటాయించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి నిర్మాణాలు పూర్తవుతాయి. అత్యాధునిక లైబ్రరీ, ల్యాబ్‌లు, తరగతి గదులను నిర్మిస్తున్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 2700 కోట్లను కేటాయించింది. వీటిని రానున్న పదేళ్లలో విశ్వవిద్యాలయ అవసరాలకు ఖర్చు చేస్తారు. గత నాలుగేళ్లుగా రూ.46 కోట్లను మంజూరు చేశారు. యూఎస్, చైనా, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన ప్రభుత్వ విభాగాలు కూడా ఈ క్రతువులో తమ వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. వెబ్సైట్: www.nalandauniv.edu.in స్వాతంత్య్రానికి ముందే ఏర్పడిన ప్రముఖ యూనివర్సిటీలు నలంద యూనివర్సిటీతోపాటు మరికొన్ని యూనివర్సిటీలు మనదేశానికి స్వాతంత్య్రం రాకముందే ఏర్పడ్డాయి. కొన్ని సిపాయిల తిరుగుబాటు (1857) కాలం నాటికే ప్రారంభమై తమ విద్యా వెలుగులను నలుదిశలా ప్రసరింపచేశాయి. దేశంలో కొన్ని లక్షల మంది విద్యార్థులను భావి భారతాన్ని తీర్చిదిద్దే అత్యుత్తమ పౌరులుగా రూపుదిద్దుతున్నాయి. అలాంటివాటిలో కొన్ని.. ఐఐటీ - రూర్కీ: 1847లోనే ఏర్పాటైంది. థామసన్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అని మొదట్లో పిలిచేవారు. 1949లో యూనివర్సిటీ ఆఫ్ రూర్కీగా మారింది. 2001లో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఒకటిగా రూపుదాల్చింది. వెబ్సైట్: www.iitr.ac.in బాంబే యూనివర్సిటీ: 1857లో డాక్టర్ జాన్ విల్సన్ స్థాపించారు. ఆయనే యూనివర్సిటీ మొదటి వైస్ ఛాన్సలర్. వెబ్సైట్: www.mu.ac.in యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా (1857): దక్షిణాసియాలో పాశ్చాత్య శైలిలో ఏర్పడిన మొట్టమొదటి మల్టీడిసిప్లినరీ యూనివర్సిటీ. వెబ్సైట్: www.caluniv.ac.in మద్రాస్ యూనివర్సిటీ (1857): దక్షిణభారతదేశంలో తొలిగా ప్రారంభమైన మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ. తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతంలో ఏర్పడిన ఎన్నో విద్యా సంస్థలకు ఆదర్శంగా నిలిచిన సంస్థ. వెబ్సైట్: www.unom.ac.in అలహాబాద్ యూనివర్సిటీ: ఇంగ్లిష్ మాధ్యమంలో కోర్సులు అందించిన ఈ యూనివర్సిటీ 1887లో ఏర్పాటైంది. ‘ఆక్స్ఫర్డ్ ఆఫ్ ద ఈస్ట్’ అని ప్రశంసలు పొందిన విద్యా సంస్థ. సెంట్రల్ యూనివర్సిటీల్లో ఒకటి. వెబ్సైట్: www.allduniv.ac.in బెనారస్ హిందూ యూనివర్సిటీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, న్యాయ కోవిదుడు.. పండిట్ మదన్ మోహన్ మాలవ్య అకుంఠిత కృషితో పవిత్ర పుణ్యధామం.. కాశీ (వారణాసి)లో 1916లో ఏర్పడిన ఈ యూనివర్సిటీ.. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. అంతేకాకుండా రెసిడెన్షియల్ విధానంలో ఏర్పాటైన మొదటి విశ్వవిద్యాలయం. -
‘నలందా’లో అన్ని దేశాల వారికీ అవకాశం: సుష్మ
రాజ్‌గిర్: నలందా విశ్వవిద్యాలయానికి వస్తున్న అద్భుత స్పందన దృష్ట్యా దీనిని కేవలం తూర్పు ఆసియా దేశాల విద్యార్థులకే పరిమితం చేయకుండా, ఇతర దేశాల వారికీ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. బీహార్‌లో పునరుద్ధరించిన ఈ విశ్వవిద్యాలయాన్ని సుష్మాస్వరాజ్ శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు మధ్య ఇది వారధి వంటిదన్నారు. గతంలో విదేశీ విద్యార్థులను ఆకర్షించి దేశాన్ని ప్రపంచంతో అనుసంధానం చేసినట్లు చెప్పారు. నలంద విశ్వవిద్యాలయం మాత్రమే కాదని, అది సంస్కృతిలో భాగమని చెప్పారు. కేంద్రం ఇప్పటికే రూ.2,727 కోట్లు కేటాయించిందని, పదేళ్లలో ఉన్నతతరగతి క్యాంపస్‌గా తీర్చిదిద్దేందుకు ఈ నిధులను వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీహార్ సీఎం జితన్‌రామ్ మంజి, పలువురు విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
'ఆ యూనివర్శిటీ సంస్కృతిలో ఒక భాగం'
రాజ్‌గిర్(బీహార్): నలందా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ మాత్రమే కాదని, అది సంస్కృతిలో భాగమని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. నలందా విశ్వవిద్యాలయానికి వస్తున్న అద్భుత స్పందన దృష్ట్యా దీనిని కేవలం తూర్పు ఆసియా దేశాల విద్యార్థులకే పరిమితం చేయకుండా, ఇతర దేశాల వారికీ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు ఆమె స్పష్టం చేశారు. బీహార్‌లో పునరుద్ధరించిన ఈ విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు మధ్య ఇది వారధి వంటిదన్నారు. గతంలో విదేశీ విద్యార్థులను ఆకర్షించడం ద్వారా దేశాన్ని ప్రపంచంతో అనుసంధానం చేసినట్లు చెప్పారు.కేంద్రం ఇప్పటికే రూ.2,727కోట్లు కేటాయించిందని, పదేళ్లలో ఉన్నత తరగతి క్యాంపస్‌గా తీర్చిదిద్దేందుకు ఈ నిధులను వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీహార్ సీఎం జితన్‌రామ్ మంజి, పలువురు విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
'నలంద' వేడుకల్లో సుష్మా స్వరాజ్
పాట్నా: ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వ విద్యాలయాల్లో ఒకటైన నలందా విశ్వవిద్యాలయం పున ప్రారంభ వేడుకల్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం రావటం సంతోషంగా ఉందన్నారు. నలంద విశ్వవిద్యాలయం బీహార్‌లోని రాజ్‌గిర్ ప్రాంతంలో 455 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన ప్రాంగణంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయంలో చరిత్ర, పర్యావరణ అధ్యయన విభాగాలలో మొత్తం 15 మంది విద్యార్థులతో పాటు ఆరుగురు అధ్యాపకులు ఉన్నారు. విద్యార్థులలో జపాన్, భూటాన్ దేశాలకు చెందిన ఒక్కో విద్యార్థి ఉన్నారు. కాగా 2020 నాటికి విశ్వవిద్యాలయం పూర్తిగా కొత్తరూపు సంతరించుకోనుంది. బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మంజీ, బీజేపీ నేత, మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సుశీల్ కుమార్ మోడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే నలందా విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభం అయ్యేందుకు కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు. నితీశ్‌కు ఆహ్వానం పంపలేదని విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. -
800 ఏళ్ల తర్వాత మళ్లీ ....
బీహార్ షరీఫ్:- ప్రపంచంలోనే తొట్టతొలి విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా, పలుదేశాల విద్యార్థులను ఆకర్షించిన ప్రాచీన నలందా విశ్వవిద్యాలయంలో సోమవారం మళ్లీ తరగతులు ప్రారంభమయ్యాయి. దాదాపు 800 సంవత్సరాల తర్వాత బీహార్‌లోని రాజ్‌గిరిలో పునరుద్ధరించిన విశ్వవిద్యాలయ నూతన ప్రాంగణంలో విద్యార్థుల చదువుల సందడి మొదలైంది. విశ్వవిద్యాలయంలో చరిత్ర, పర్యావరణ అధ్యయన విభాగాలలో మొత్తం 15 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో 9 మంది తొలిరోజున తరగతులకు హాజరయ్యారు. విద్యార్థులలో జపాన్, భూటాన్ దేశాలకు చెందిన ఒక్కో విద్యార్థి ఉన్నారు. విద్యార్థులకు, ఆరుగురు అధ్యాపకులకు, సిబ్బందికి వైస్ చాన్సలర్ గోపా సభర్వాల్ స్వయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోపా సభర్వాల్ మాట్లాడుతూ తొమ్మిదేళ్ల కృషితో ప్రాచీన విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభమైందని, భవిష్యత్తులో ఇది బలోపేతంకాగలదని ఆశిస్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయం మౌలిక సదుపాయాలు, అవసరాలపై సమీక్ష కోసం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ నెల 14న వర్సిటీని సందర్శిస్తారన్నారు. వివిధ కోర్సులకు 35దేశాల విద్యార్థుల నుంచి తమకు 1,400 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. సరైన ప్రచారంలేనందునే తక్కువ సంఖ్యలో విద్యార్థులు నమోదయ్యారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ** -
నలందలో వర్సిటీలో మళ్లీ చదువులు
వర్సిటీ పునఃప్రారంభం బీహార్షరీఫ్: ప్రపంచంలోనే తొట్టతొలి విశ్వవిద్యాల యాల్లో ఒకటిగా, పలుదేశాల విద్యార్థులను ఆకర్షించిన ప్రాచీనమైన నలందా విశ్వవిద్యాలయంలో మళ్లీ లాంఛనంగా తరగతులు ప్రారంభమయ్యాయి. దాదాపు 800 సంవత్సరాల తర్వాత బీహార్‌లోని రాజ్‌గిరిలో పునరుద్ధరించిన నూతన ప్రాగణంలో విద్యార్థుల చదువుల సందడి మొదలైంది. విశ్వవిద్యాలయంలో చరిత్ర, పర్యావరణ అధ్యయన విభాగాలలో మొత్తం 15 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోగా, వారిలో 9 మంది తొలిరోజున తరగతులకు హాజరయ్యారు. వారిలో జపాన్, భూటాన్ దేశాలకు చెందిన ఒక్కో విద్యార్థిసహా 9 మంది విద్యార్థులకు, ఆరుగురు అధ్యాపకులకు, సిబ్బందికి వైస్ చాన్స్‌లర్ గోపా సభర్వాల్ స్వయంగా స్వాగతం పలికారు. తొమ్మిదేళ్ల కృషితో ప్రాచీన విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభమైందని, భవిష్యత్తులో ఇది బలోపేతంకాగలదని ఆశిస్తున్నామని గోపా సభర్వాల్ ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు. విశ్వవిద్యాలయం మౌలిక సదుపాయాలు, అవసరాలపై సమీక్షకోసం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ నెల 14 న వర్సిటీని సందర్శిస్తారన్నారు. వివిధ కోర్సులకుగాను 35 దేశాల విద్యార్థులనుంచి తమకు 1,400 దరఖాస్తులు అందినట్టు చెప్పారు. సరైన ప్రచారంలేనందునే తక్కువ సంఖ్యలో విద్యార్థులు నమోదయ్యారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.