nandigam
-
విషపు కోరల్లో ఏపీ.. చంద్రబాబు కపట నాటకం అంబటి రాంబాబు ఫైర్
-
వంగలపూడి అనితకు గూబ పగిలే కౌంటర్
-
మా సునామీని తట్టుకోలేవు వైఎస్ జగన్ వార్నింగ్
-
సంగారెడ్డి జిల్లా నందిగామలో దొంగల బీభత్సం
-
సకల సౌకర్యాలతో అభివృద్ధిపథంలో నందిగామ
-
నందిగామలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ ఎన్నికల ప్రచారం
-
నందిగామలో సామాజిక సాధికార బస్సు యాత్ర
-
రాళ్ల మధ్య ఇరుక్కుని ఇద్దరు మృతి
-
నందిగ్రామ్ ఎన్నికల ఫలితాల విచారణ వాయిదా
-
మానవత్వం చూపించిన వీఆర్వో
సాక్షి, నందిగాం: కరోనా భయంతో ఓ వ్యక్తి అంత్యక్రియలకు గ్రామస్తులంతా భయపడుతుంటే.. ఆ ఊరి వీఆర్వో మాత్రం అంతా తానై వ్యవహరించి మానవత్వం చాటుకున్నారు. నందిగాం మండలం సైలాడ గ్రామానికి చెందిన అట్టాడ వైకుంఠరావు(67) వారం రోజులుగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో విశాఖ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమ వారం రాత్రి వైకుంఠరావు మృతి చెందారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులు మంగళవారం గ్రామానికి తీసుకువచ్చారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో స్థానికులు అంత్యక్రియలకు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న స్థానిక వీఆర్వో పేరాడ యుగంధర్ మృతుని కుటుంబసభ్యులతో పాటు బంధువులు, గ్రామస్తులతో మాట్లాడి అవగాహన కల్పించారు. కరోనా రక్షణ చర్యలు చేపట్టి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు. కర్రలను సమకూర్చి స్వయంగా తాను కూడా శ్మశానం వద్దకు వెళ్లారు. వీఆర్వో యుగంధర్ చూపిన చొరవను పలువురు ప్రశంసించారు. చదవండి: వీఆర్వోలకు కొత్త బాధ్యతలు.. -
కృష్ణా: నందిగామ వద్ద రోడ్డుప్రమాదం
-
వైఎస్ జగన్ సభ: జనసంద్రమైన నందిగామ కృష్ణ జిల్లా
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
నందిగాం: నందిగాంలోని ఓ దాబా సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. టెక్కలి నుంచి పలాస వైపు మోటారు ఇంజన్ల సామాన్లు తీసుకువెళ్తున్న లారీ రోడ్డుకు పక్కగా నిలిపి లోపల ఒకరు, పైన మరొకరు నిద్రిస్తున్నారు. అదే దారిలో చెన్నై నుంచి కోల్‌కతాకు ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న మరో లారీ అధిక వేగంతో వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో లారీలో నిద్రిస్తున్న రాజ్‌కుమార్(23) కాలికు తీవ్రగాయాలు కాగా పైన నిద్రిస్తున్న ఎం.కృష్ణమూర్తి(49) లారీ లోడు కింద చిక్కుకున్నాడు. ఢీకొట్టిన లారీ డ్రైవర్ అరం మురుగన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న హైవే, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను టెక్కలి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. నందిగాం ఇన్చార్జి ఎస్ఐ ఎం.ఎస్.వి.ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నందిగాంలో ‘ఉల్లి’ రాజకీయాలు!
నందిగాం: నందిగాంలో గురువారం సాయంత్రం ఉల్లి రాజకీయాలు నడిచాయి. ఇందిరా క్రాంతిపథం ద్వారా ఉల్లిపాయల పంపిణీ జరిగింది. గ్రామాల్లో ఎలాంటి ప్రచారం లేకుండా పంపిణీ చేపట్టారు. టీడీపీ మండలాధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్, మరో నాయకుడు మళ్ల బాలకృష్ణ చేతులమీదుగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఉల్లి పంపిణీ వార్త సాయంత్రం 4గంటలకు తెలియగానే పరిసర గ్రామాల నుంచి ఒక్కసారిగా పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. కిక్కిరిసిన జనాలు రావడంతో రేషన్ కార్డుకు 2 కిలోలు అందించారు. కానీ రూ. 20లకు అమ్మకం చేపట్టాల్సిపోయి కిలో రూ. 30ల చొప్పున విక్రయించినట్లు స్థానికులు విలేకర్లకు ఫిర్యాదు చేశారు. ఇదేమని ప్రశ్నించిన వారికి ఏపీఎం జాంబవతి ‘మా ఇష్టం.. మాకు నచ్చిన విధంగా పంపిణీ చేస్తాం’ అని చెప్పడంతో కొంతమంది ఆశ్చర్యపోయారు. మరికొంతమంది గ్రామైక్య సంఘ అధ్యక్షులతో గ్రామాలకు తరలించి, నచ్చిన విధంగా అమ్మకాలు చేపట్టాలని ఆమె ఆదేశించినట్లు స్థానికులు తెలిపారు. మండలానికి ఎన్ని కిలోలు మంజూరయ్యాయని విలేకరులు ప్రశ్నించగా అకస్మాత్తుగా పంపించారు.. వివరాలు చెప్పలేమని ఏపీఎం సమాదానం చెప్పారు. రహస్య ప్రాంతంలో ఉల్లి నిల్వలు నందిగాం మండలానికి మంజూరైన ఉల్లి బస్తాలను మరికొన్ని టీడీపీ నాయకుల ఇళ్లలో నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. వాటిని వారు ఇష్టారాజ్యంగా కార్యకర్తలకు అమ్మకాలు చేసుకోవాలని ఏపీఎం స్వయంగా వారికి తెలిపినట్లు సమాచారం. పెంటూరు, వేణుగోపాలపురం, సుభద్రాపురం, నందిగాం బీసీ కాలనీల్లో కొన్ని బస్తాలను నిల్వ చేసినట్లు కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి !
నందిగాం: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు నేలబావిలో శవమై తేలాడు. మృతుడు పలాస మండల మాజీ అధ్యక్షుడు నిమ్మాన బైరాగి (కాపు బైరాగి) నాలుగో కుమారుడు దుర్యోధన అలియాస్ చిన్నారి (27)గా గుర్తించారు. నందిగాం మండలం జాతీయ రహదారి సుభద్రాపురం సమీపంలోని నేల బావిలో బైరాగి శవాన్ని శనివారం ఉదయం కనుగొన్నారు. పాతకక్షల నేపథ్యంలో తన కుమారుడుని హత్య చేసి బావిలో పడేసి ఉంటారని మృతుని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ సఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఏడు గంటల సమయంలో కాశీబుగ్గ మార్కెట్‌కు వెళ్తానని చెప్పి దుర్యోధన ఇంటి నుంచి వెళ్లి..ఆ తరువాత నుంచి కనిపించలేదు. దీంతో పరిసర ప్రాంతాల్లో వెతకడంతోపాటు.. బంధువులను ఆరా తీశారు. ఈ క్రమంలో నందిగాం ప్రాంతంలో గాలిస్తుండగా సుభద్రాపురం సమీపంలో రోడ్డు పక్కనే ఏపీ 30 క్యూ 7411 నంబరు గల ద్విచక్రవాహనం నిలుపుదల చేసి ఉండటాన్ని శనివారం ఉదయం గుర్తించారు. దీంతో సమీపంలో ఉన్న నేలబావిలోకి చూడగా దుర్యోధన శవమై తేలి కనిపించాడు. నందిగాం ఎస్సై సీహెచ్ ప్రసాద్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాశీబుగ్గ డీఎస్సీ దేవప్రసాద్‌కు సమాచారం అందించారు. టెక్కలి సీఐ భవానీప్రసాద్‌తో కలిపి సంఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. పాత కక్షలే కారణమా? పాతకక్షల నేపథ్యంలో దుర్యోధనను హత్య చేసి ఉంటారని అతని కటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీపీ నిమ్మాన బైరాగి రెండో కుమారుడు గణేష్ 2011 జూన్ ఒకటో తేదీన హత్యకు గురయ్యాడు. పలాస పట్టణానికి చెందిన బూర్జపేట సూర్యనారాయణతోపాటు ఎన్.బాలకృష్ణ, అప్పారావులు గొప్పిలి సమీపంలోని ఒడిశా సరిహద్దులో గణేష్‌ను హత్య చేసినట్లు నిమ్మాన బైరాగి తెలిపారు. ఆ కేసులో ఇటీవలే సోంపేట కోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెలువరించిందన్నారు. హంతకులకు శిక్ష పడినట్టు చెప్పారు. ఈ కక్షతోనే తన నాలుగో కుమారుడు దుర్యోధనను హతమార్చినట్టు అనుమానం వ్యక్తం చేశాడు. మృతుని ముంజేటి మణికట్టుపై బ్లేడుతో కోసినట్టు ఉండడంతో హత్యాగా భావిస్తూ పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం ఎలాంటి అనుమానం లేదని, బావిలో పడి చనిపోయినట్టు పేర్కొన్నారు. దుర్యోధన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రేమ..పెళ్లి..పరార్..
నందిగాం: ఐటీడీఏ ఉద్యోగి ఒకరు ఓ యువతిని మోసం చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని మూడు రోజులు కాపురం చేసి పరారయ్యాడు. అంతేకాదు మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడ్డాడు. దీంతో మోసిపోయినట్టు గ్రహించిన యువతి అతగాడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. వివరాల్లోకి వెళితే...నందిగాంలోని ఎస్సీ వీధిలోకి చెందిన మట్ట నాగభూషణం (27) ఐటీడీఏలో టైపిస్టుగా పని చేస్తున్నాడు. మందసలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే సీతంపేట డిప్యుటేషన్‌పై వెళ్లాడు. అదే వీధిలో నివాసముంటున్న కురమాన కళావతి (25)ని ప్రేమించాడు. ఇద్దరూ ఈ ఏడాది ఫిబ్రవరి 14న విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానంలో పెళ్లి చేసుకున్నారు. తిరిగి శ్రీకాకుళం వచ్చి బలగమెట్టు వద్ద ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. ఫిబ్రవరి 17న నందిగాం పోలీసులను ఆశ్రయించి ఇద్దరం మేజర్లం, విశాఖపట్నంలో పెళ్లి చేసుకున్నాం.. పెద్దల నుంచి భయం ఉంది రక్షణ కల్పించాలని కోరారు. అక్కడి నుంచి అదే రోజు శ్రీకాకుళం వెళ్లిపోయారు. మరుసటి రోజు సీతంపేట ఉద్యోగానికి వెళ్లి వస్తానని చెప్పి నాగభూషణం ఇంటి నుంచి బయటకువెళ్లాడు. అప్పటి నుంచి అతగాడు తిరిగి రాలేదు. ఓ రోజు నాగభూషణం ‘మా అమ్మ వల్ల నీ నుంచి విడిపోతున్నాను’ అని కళావతి సెల్‌ఫోన్‌కు మెసేజ్ పెట్టాడు. దీంతో కళావతి ఫిబ్రవరి 24న శ్రీకాకుళం మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇంతలో ఈ నెల 27న మరో అమ్మాయితో పెళ్లి చేసుకునేందుకు నాగభూషణం నందిగాం రాగా స్థానికులు పోలీసులు, యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా బాధితురాలు కళావతి శ్రీకాకుళం ఐద్వా సభ్యులను తీసుకుని నాగభూషణం ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను నిలదీసింది. మహిళా సంఘ సభ్యులు, నాగభూషణం కుటుంబ సభ్యులు గొడవ పడ్డారు. అప్పటికీ ఆ యువకుడి ఆచూకీ చెప్పకపోవడంతో యువతి అతగాడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. ఎస్సై సీహెచ్ ప్రసాద్ వెళ్లి వివాదాన్ని సద్దుమనిగేలా చేశారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నెలరోజులు గడుస్తున్నా పోలీసులు కనీసం స్పందించలేదని, ఒక బాధ్యత గల ఉద్యోగం చేస్తూ ప్రేమ, పెళ్లి పేరిట మోసం చేసిన వాడిని పట్టుకొని కళావతికి న్యాయం చేయలేదని మహిళా సంఘ జిల్లా అధ్యక్షురాలు పి.శ్రీదేవి, కె.నాగమణి, పి.ఉష, గణేష్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లినట్టు చెప్పారు. దీనిపై కేసు నమోదు అయిందని.. విచారణ జరుపుతున్నామని స్థానిక ఎస్సై సీహెచ్ ప్రసాద్ చెప్పారు. -
ఇదీ సంక్రాంతి సంబరాల్లో భాగమేనా?
ప్రభుత్వం ఓ వైపు సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ, మండల స్థాయిలో కమిటీలు వేసి చిన్నారులతోపాటు యువతకు, మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి సంబరాలను ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేసింది. ఇది శుభ పరిణామమే అయినా.. మరోవైపు మద్యం విక్రయూలు పెంచాలని టార్గెట్ విధించడంతో ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లో సిండికేట్లు రెచ్చిపోతున్నారు. గ్రామాలకు విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తున్నారు. నందిగాం: గ్రామాల్లో బెల్ట్ షాపులు, దాబాల్లో మద్యం విక్రయాలు మరింత ఊపందుకున్నాయి. ముఖ్యంగా నందిగాం మండల గ్రామాల్లో ఎక్కడికక్కడ మద్యం విక్రయూలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. జాతీయ రహదారి పక్కన ఉన్న దాబాల్లోనూ మద్యం జోరుగా విక్రయిస్తున్నారు. సిండికేట్ వ్యాపారులు ఆటోల్లో మద్యం నిల్వలను గ్రామాలకు తర లించి విక్రయూలను ప్రోత్సహిస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల నిఘా కరువవ్వడంతో సంక్రాంతి నేపథ్యంలో వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఎక్సైజ్ అధికారులే ప్రభుత్వ టార్గెట్ పూర్తి చేయించాలన్న ఉద్దేశంతో గ్రామాల్లో మద్యం అమ్మకాలు చేపట్టాలని వ్యాపారులకు చెబుతున్నారని సమాచారం. దీంతో కిల్లీ బడ్డీలు, పాన్షాపుల్లోనూ మద్యం విక్రయాలు విరివిగా జరుపుతున్నారు. సంక్రాంతి సమయంలో విక్రయూలు మరింత జోరందుకోనున్నాయి. ఫలితంగా గ్రామాల్లో అంశాంతి నెలకొంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిద్దరోతున్న నియంత్రణ కమిటీలు గ్రామాల్లో బెల్టు దుకాణాలు నిర్వహించకుండా గత ఏడాది జూన్‌లో మండల, గ్రామస్థాయి కమిటీలు నియమించారు. మండల స్థాయిలో ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, తహశీల్దారు, ఎంపీడీవో, ఎక్సైజ్ ఎస్సై, సివిల్ ఎస్సైలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గ్రామ స్థాయిలో సర్పంచి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, గ్రామైక్య సంఘ అధ్యక్షులు, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి కమిటీలో ఉన్నారు. ప్రతినెలా సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో మద్యం విక్రయూలు జరగకుడా వీరు బాధ్యత వహించాలి. అయితే ఈ కమిటీలు మద్యం విక్రయాల గురించి అసలు పట్టించుకోవడమే లేదు. -
ఈతకు వెళ్లి గల్లంతైన నలుగురు యువకులు
-
రోడ్డు నిర్మాణం.. ప్రచారాస్త్రమే !
బెజ్జూర్, న్యూస్‌లైన్ : ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వాలు.. స్థాని క ప్రజాప్రతి నిధులు మారి నా రోడ్డు సమస్య తీరడం లేదు. ఎన్నికల సమయంలో ప్ర చారాస్త్రంగా మారుతూనే ఉంది. ఇచ్చిన హామీలను నాయకులు మర్చిపోతూనే ఉన్నా రు. మండలంలోని ఎర్రగుంట, నందిగాం, మొర్లిగూడ, జిల్లేడ గ్రామాల ప్రజలు దీర్ఘకాలంగా సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నా రు. పాపన్‌పేట నుంచి మొర్లిగూడ వరకు 12కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆరు కిలోమీట ర్ల మేర అటవీ శాఖ భూమి ఉంది. మొర్లిగూడ పక్కనే జిల్లేడ, నందిగాం గ్రామాలున్నాయి. మొర్లిగూడ, జిల్లెడ గ్రామాల్లో 2000 మంది జ నాభా ఉండగా.. వీరిలో 1,070 మంది ఓటర్లు ఉన్నారు. అందరూ గిరిజనులే. పాపన్‌పేట్ గ్రామం నుంచి అటవీ ప్రాంతంలో రో డ్డు ని ర్మాణం చేపడితే సమస్య తీరిపోతుంది. బస్సు సౌకర్యమూ కలుగుతుంది. కానీ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతి లభించడం లేదు. రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే నిధుల నుంచి మట్టి రోడ్డు వేసినా అటవీ శాఖ పరిధిలోని భూ మి వరకు రాగానే నిలిపివేశారు. ఎన్నికల సమయంలో నాయకులు ఇస్తున్న హామీలు ఇప్పటి కీ నెరవేరడం లేదు. బెజ్జూరుకు 20 కిలోమీటర్ల దూరంలోని ఎర్రగుంట గ్రామంలో 400 మం ది జనాభా ఉన్నారు. అక్కడ ఇప్పటికీ కరెం టు, రోడ్డు, నీటి సమస్య తీవ్రంగా ఉంది. పెంచికల్‌పేట నుంచి ఎర్రగుంటకు రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఆరు కిలోమీటర్లు కాలినడ క, ఎడ్లబండిపై వెళ్తున్నారు. సమస్యలు పరిష్కరించే వారికే ఓటు వేస్తామని ఆయా గ్రామాల ప్రజలు తేల్చిచెబుతున్నారు.