Narayana Reddy murder
-
రాష్ట్రంలో ఆటవిక పాలన: గడికోట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని, రాజకీయ హత్యలపై టీడీపీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. నారాయణరెడ్డి హత్య జరిగి 48 గంటలైనా ఇప్పటివరకు ఒక్క అరెస్టు కూడా జరక్కపోవడం దారుణమన్నారు. ఈ హత్యను కర్నూలు జిల్లా ఎస్పీ చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని, దోషులను పట్టుకోవడానికి అసలు ప్రయత్నమే చేయడం లేదని మండిపడ్డారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గడికోట మాట్లాడుతూ సోషల్ మీడియాలో వ్యంగాస్త్రాలు సంధించిన వారిని అరెస్టు చేయడానికి అత్యుత్సాహం చూపుతున్న టీడీపీ సర్కార్.. రాజకీయ హత్యలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్Sను పెంచి పోషిస్తున్నది సీఎం చంద్రబాబేనన్నారు. టీడీపీ ముఖ్యుల ప్రమేయం ఉన్నందునే ఈ కేసును పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే ఈ కేసులో డీజీపీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. -
సీబీఐ విచారణతోనే న్యాయం
నారాయణరెడ్డి హత్యపై వైఎస్ జగన్ డిమాండ్ సాక్షి ప్రతినిధి, కడప: కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్చార్జి నారాయణ రెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణతోనే న్యాయం జరుగుతుందన్నారు. ఆయన మంగళవారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్ ఏం చెప్పారంటే... ‘‘పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్చార్జి నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు, పులివెందుల నియోజకవర్గం వేంపల్లె ఉప మండలాధ్యక్షుడు రామిరెడ్డిలను కిరాతకంగా హత్య చేశారు. ఇవాళ చంద్రబాబు అధికారం లో ఉండొచ్చు, రేపు మేము అధికారంలోకి రావొచ్చు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఐదున్నర కోట్ల మంది ప్రజల్లో ముఖ్యమంత్రి అయ్యేందుకు దేవుడు ఒక్కరికే అవకాశం ఇస్తాడు. అలాంటి పదవిలో కూర్చున్న వ్యక్తి ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించు కోవాలి. ప్రజలకు మంచి చేయాలి. ఆ ప్రజల దీవెనలతో, దేవుడి ఆశీస్సులతో మళ్లీ మళ్లీ ముఖ్యమం త్రిగా ఎన్నికవ్వాలి. సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యర్థులను ప్రలోభాలకు గురిచేసి లొంగదీ సుకోవడం, వారు పదవులకు అనర్హులు కాకుండా కాపాడడం, ఒక అడుగు ముందు కేసి వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం, అప్పటికి కూడా ఎవరూ లొంగకపోతే వారిని హత్యలు చేయించడం.. ఇలాంటి పనులను ఏ సీఎం అయినా ఎప్పుడూ చేయకూడదు. ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారు ఇవాళ దుర్బుద్ధితో నారాయణరెడ్డిని చంపారు. దుర్బుద్ధితో ఏదైనా చేస్తే అది ఎదురుతన్నడం ఖాయం. రేపు అదే పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిచే పరిస్థితి వస్తుంది. నారాయణరెడ్డి కుటుంబం నుంచి అభ్యర్థి ఎన్నికల బరిలో నిలుస్తారు. భర్తను చంపేశారు.. ఏమవుతుంది? భార్య అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తారు. అంతేగానీ వారి(టీడీపీ) పథకం పారదు. అభ్యర్థే లేకుండా పోతే పార్టీయే లేకుండా పోతుందనుకుంటున్న వారి దుర్బుద్ధికి ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేసే పరిస్థితి కచ్చితంగా వస్తుంది. నారాయణరెడ్డి హత్యపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. ఈ కేసులో సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రే నిందితుడు. ముఖ్యమంత్రి ఆశీస్సులతోనే ఈ హత్య జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వారి చేతుల్లోనే ఉన్న పోలీసు డిపార్టుమెంట్లో విచారణ జరిపిస్తే ఏం న్యాయం జరుగుతుంది? కాబట్టి సీబీఐతో విచారణ జరిపిస్తేనే న్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి తప్పు చేసినా, ఉప ముఖ్యమంత్రి తప్పు చేసినా జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది. అప్పుడే న్యాయ వ్యవస్థ బతుకుతుంది’’ అని జగన్ అన్నారు. -
హత్యకు హత్య సమాధానం కాదు: చంద్రబాబు
-
ఆ హత్యతో నాకు సంబంధం లేదు
-
ఆ హత్యతో నాకు సంబంధం లేదు: కేఈ
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారాయణరెడ్డి హత్యతో తనకు సంబంధం లేదని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. తనకుగానీ, ముఖ్యమంత్రికిగానీ హత్యలు చేయించాల్సిన అవసరం లేదన్నారు. తాను హత్యా రాజకీయాలు ప్రోత్సహించనని తెలిపారు. ఆయన సోమవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నారాయణరెడ్డి హత్యలో తన పాత్ర ఉందని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించడం తగదన్నారు. తాను ఆ నియోజకవర్గం నుంచి గెలిచి ఉపముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాను కాబట్టే ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఆయన్ను ఎవరు హత్య చేశారో పోలీసు విచారణలో తేలుతుందన్నారు. తాను పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. ఈ హత్యలో తనతోపాటు తన కుమారుడు శ్యాంబాబుకూ సంబంధం లేదన్నారు. తానెప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని, తనపై కావాలనే ప్రతిపక్ష నేత బురద జల్లుతున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ మైనింగ్‌కు సంబంధించి తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, దీనికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. తన రాజకీయ వారసుడు శ్యాంబాబని గతంలోనే చెప్పానని, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆయన్ను పత్తికొండ నియోజకవర్గం టీడీపీ కో–ఆర్డినేటర్‌గా నియమించారని తెలిపారు. -
హత్యా రాజకీయాలతో భ్రష్టు పట్టిస్తున్నారు: ఐవీ రెడ్డి
కళకళలాడాల్సిన రాష్ట్రాన్ని టీడీపీ నేతలు, వారి అనుచరులు హత్యారాజకీయాలతో భ్రష్టు పట్టిస్తున్నారని గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఐవీ రెడ్డి ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణ హత్యను ఆయన ఖండించారు. రాజకీయంగా ఎదుగుతూ పట్టు సాధిస్తున్న క్రమంలో ఆయన ఎదుగుదలను ఓర్వలేక.. నిరాయుధుడిగా ఉన్న సమయంలో ఇలా హత్యకు తెగబడటం చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలను పోలీసుల సాక్షిగా బాబు, లోకేష్ సమాధి చేసినట్టు మరోసారి రుజువయ్యిందని, ఇంతటి అరాచక ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రంలోను చూసి ఉండరని ఆయన మండిపడ్డారు. బాబు సర్కార్ ప్రోత్సహిస్తున్న హత్యా రాజకీయాలకు ప్రజలు చెల్లుచీటీ పలికే తరుణం దగ్గరలోనే ఉందని చెప్పారు. చెరుకులపాడు నారాయణరెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఐవీ రెడ్డి గుర్తు చేసుకున్నారు. -
హత్యకు హత్య సమాధానం కాదు: చంద్రబాబు
పోలవరం: కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్ సీపీ కన్వీనర్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. హత్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని ఆయన అన్నారు. పోలవరం పర్యటనలో ఉన్న చంద్రబాబు సోమవారమిక్కడ మాట్లాడుతూ.. హత్యకు హత్య సమాధానం కాదని అన్నారు. కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎస్పీలకు మధ్య సమన్వయం లేక పోవడమే కారణంగానే వివాదాలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని తేల్చిచెప్పారు. సకాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఇప్పటివరకు 16 సార్లు ప్రాజెక్టును స్వయంగా పరిశీలించానని తెలిపారు. స్పిల్ వే పని పూర్తి అవుతోందని, ప్రతివారం పోలవరం పనితీరుపై సమీక్ష చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకూ 12 గేట్లు పూర్తి చేశారని, మరో 32 గేట్లు పూర్తి చేయాల్సి వుందని తెలిపారు. కాంక్రీటు వర్కుకు మెషినరీ అవసరమని, అందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. వేసవి కావడంతో రాత్రి సమయాల్లో కూడా పని చేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రంతో సమన్వయంతో వెళ్లాల్సిన అవసరముందన్నారు. -
నారాయణరెడ్డి ఆ సంగతి నాకు చెప్పలేదు: కేఈ
- వైఎస్సార్సీపీ నేత హత్యపై డిప్యూటీ సీఎం స్పందన విజయవాడ: రాష్ట్రంలో సంచలన సృష్టించిన చెరకులపాడు నారాయణరెడ్డి హత్యపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎట్టకేలకు స్పందించారు. హత్యకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. విపక్ష నేతలు వరుసగా హత్యలకు గురవుతున్నా తెలుగుదేశం పాలనలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని కేఈ పేర్కొన్నారు. ‘తనకు ప్రాణహాని ఉందన్న విషయాన్ని నారాయణరెడ్డి ఏనాడూ నాతో చెప్పలేదు. కేవలం పోలీసులకు మాత్రమే చెప్పుకున్నాడు. అతని గన్ లైసెన్స్ రెన్యూవల్ విషయం పోలీసులకే తెలుసు. నా కుమారుడి ఇసుకదందాపై పోరాడినందుకే నారాయణరెడ్డిని అంతం చేశారని అనడం కరెక్ట్కాదు. ఈ హత్యకూ మాకు ఎలాంటి సంబంధం లేదు. నారాయణరెడ్డి గన్ లైసెన్స్ ఎందుకు రెన్యూవల్ చేయలేదో పోలీసులనే అడగాలి..’ అని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని, నారాయణరెడ్డిని చంపింది ఎవరో పోలీసుల విచారణలో తేలుతుందని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని కేఈ అన్నారు. ఇకపై కర్నూలు జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చూస్తానని చెప్పారు. హైకోర్టు మా పేర్లు చెప్పిందా? కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు నేతృత్వంలో సాగుతోన్న ఇసుక మాఫియాపై నారాయణరెడ్డి కోర్టును ఆశ్రయించడం, దందాలపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించడం తదితర అంశాల నేపథ్యంలో కేఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘హైకోర్టు ఆదేశాల్లో నా పేరుగానీ, నా కొడుకు పేరుగానీ ఉందా? నా వారసుడు కాబట్టే అభాండాలు వేస్తున్నారు. ఇసుక దందాపై కలెక్టర్, ఉన్నతాధికారులతో బహిరంగ చర్చ పెట్టాం. కానీ అప్పుడు ఎవరూ ముందుకురాలేదు’అని కేఈ పేర్కొన్నారు.