Narine
-
సునీల్ నరైన్ మరో చరిత్ర
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)10లో కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో నరైన్ 15 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ శతకం సాధించాడు. తద్వారా యూసఫ్ పఠాన్ సరసన నిలిచాడు. అంతకుముందు 2014లో యూసఫ్ పఠాన్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రికార్డును కోల్ కతాకు చెందిన నరైన్ చేరుకోవడం విశేషం. ఈ మ్యాచ్ లో నరైన్ దూకుడుగా ఆడటంతో కోల్ కతా ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పవర్ ప్లే స్కోరుగా రికార్డులకెక్కింది. అయితే 17 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసిన తరువాత నరైన్ తొలి వికెట్ గా అవుటయ్యాడు. అంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ ఆది నుంచి తడబడుతూనే బ్యాటింగ్ చేసింది. క్రిస్ గేల్(0), కోహ్లి(5), ఏబీ డివిలియర్స్(10) వికెట్లను ఆదిలోనే కోల్పోయిన ఆర్సీబీని మన్ దీప్ సింగ్ ఆదుకున్నాడు. మన్ దీప్(52;43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా బ్యాటింగ్ చేయగా, ఆపై ట్రావిస్ హెడ్(75 నాటౌట్;47 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ జోడి 71 పరుగుల్నిజత చేసి ఆర్సీబి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ట్రావిస్ హెడ్ తన జోరును కడవరకూ కొనసాగించాడు. చివరి ఓవర్ లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సాధించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. -
మరోసారి నరైన్ మెరుపులు
కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఓపెనర్ గా వచ్చిన సునీల్ నరైన్ విజృంభించాడు. 17 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 42 పరుగులు చేసి కోల్ కతా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కోల్ కోత్ చేసిన తొలి 45 పరుగుల్లో 42 పరుగులు నరైన్ కావడం ఇక్కడ విశేషం. కోల్ కతా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగింది. దాంతో గౌతం గంభీర్ కలిసి నరైన్ ఓపెనర్ గా వచ్చాడు. క్రిస్ లిన్ గాయం కారణంగా ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో నరైన్ ను ఓపెనర్ గా ప్రయోగిస్తోంది కోల్ కతా. ఆ ప్రయోగం మరోసారి ఫలించడంతో కోల్ కతా శుభారంభం చేసింది. ఈ ఐపీఎల్ సీజన్ లో అంతకుముందు కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా నరైన్ దూకుడుగా ఆడాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. మరొకసారి గుజరాత్ పై నరైన్ విరుచుకుపడటంతో కోల్ కతా భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. -
బంగ్లాలో ఏం జరిగింది?
హృషికేశ్, నరైన్, మియాజార్జ్, సంచితా శెట్టి ప్రధాన పాత్రల్లో సాయిభరత్ దర్శకత్వంలో రూపొందించిన తమిళ చిత్రం ‘రమ్’. ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్ మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ‘మంత్రిగారి బంగళా’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రతి సన్నివేశం ఉత్కంఠ కల్గిస్తుంది. సునీల్ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మియాజార్జ్ ఈ చిత్రంలో కీలక పాత్ర చేశారు. అనిరుధ్ బాణీలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. జనవరిలో పాటలను, ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బేబీ త్రిష.