national language
-
Hindi Day: హిందీ అధికారిక భాష ఎలా అయ్యింది?
న్యూఢిల్లీ: నేడు ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే, అర్థం చేసుకునే భాషలలో హిందీ ఒకటి. హిందీ ప్రజల భాష అని మహాత్మా గాంధీ అభివర్ణించారు. అలాగే దానిని దేశ జాతీయ భాషగా చేయాలని కూడా ఆయన సిఫార్సు చేశారు. 1949, సెప్టెంబర్ 14న హిందీకి అధికార భాష హోదా ఇచ్చారు. అందుకే ఈ రోజు(సెప్టెంబర్ 14)ను హిందీ దినోత్సవంగా జరుపుకుంటారు. రాజ్యాంగ సభ ఆంగ్లంతో పాటు దేవనాగరి లిపిలో ఉన్న హిందీని అధికార భాషగా ఆమోదించింది. మొదటి హిందీ దినోత్సవాన్ని 1953 సెప్టెంబర్ 14న జరుపుకున్నారు. దీనిపై రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ జరిగింది.మనదేశంలోని చాలామంది ప్రజలు హిందీని జాతీయ భాషగా భావిస్తారు. నిజానికి హిందీ జాతీయ భాష కాదు. ఈ అంశంపై వివిధ భాషా ప్రయుక్త రాష్ట్రాలు, హిందీ మాట్లాడే రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఉన్నాయి. నిజానికి భారత రాజ్యాంగంలో ఏ భాషకూ జాతీయ హోదా ఇవ్వలేదు. స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ జరుగుతున్నప్పుడు రాజ్యాంగ పరిషత్‌లో భాషపై చర్చ జరిగింది. ఆ సమయంలో హిందీని జాతీయ భాషగా చేయాలని కొంత మంది కోరగా, మరికొందరు దీనిని వ్యతిరేకించారు.రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ తర్వాత హిందీని అధికార భాషగా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీని తరువాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343(1) ప్రకారం దేవనాగరి లిపి రూపంలో హిందీకి అధికార భాష హోదా ఇచ్చారు. 1949, సెప్టెంబర్ 14న రాజ్యాంగ సభ హిందీకి అధికార భాష హోదాను ఇచ్చింది. అధికారిక భాషకు జాతీయ భాషకు మధ్య వ్యత్యాసం ఉంది. రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాలను తెలియజేసేందుకు ఉపయోగించేది జాతీయ భాష. ప్రభుత్వం తన అధికారిక పనుల కోసం ఉపయోగించేది అధికారిక భాష అవుతుంది. జాతీయ న్యాయస్థానం, పార్లమెంట్ లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం హిందీని అధికారికంగా వినియోగిస్తుంటారు. ఇది కూడా చదవండి: ఆఫ్రికాపై చైనాకు ఎందుకంత ప్రేమ? -
దేశంలో హిందీ ఎంతమంది మాట్లాడతారు ?
హిందీ జాతీయ భాషపై వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందినవారంతా కలిస్తే ఇంగ్లిష్ బదులుగా హిందీలో మాట్లాడాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రతిపాదనలు అగ్గి రాజేస్తే, తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ హిందీయే మన జాతీయ భాష అంటూ చేసిన ట్వీట్‌తో వివాదం భగ్గుమంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్‌లో బీజేపీ ‘ఒకే దేశం ఒకే భాష’ తీసుకువస్తుందన్న అనుమానంతో దక్షిణాది రాష్ట్రాలు ఎదురుదాడికి దిగాయి. చరిత్రలోకి తొంగి చూస్తే.. హిందీ భాషను ఇతర ప్రాంతాలపై రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలు కొత్తేం కాదు. స్వాతంత్య్రానికి ముందే 1937 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందీ భాషను బోధించడానికి ప్రయత్నిస్తే దానిని వ్యతిరేకిస్తూ మూడేళ్ల పాటు ఉధృతంగా ఉద్యమం జరిగింది. 1946లో మొదటిసారిగా సమావేశమైన రాజ్యాంగ పరిషత్ పార్లమెంటులో చర్చలు హిందీ, ఇంగ్లిష్‌లో కొనసాగించాలని నిర్ణయించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయ భాషగా ఏది ఉండాలన్న దానిపై ఆనాటి కాంగ్రెస్ నాయకులు కేఎం మున్షీ, గోపాలస్వామి అయ్యంగార్ హిందీ అనుకూల, వ్యతిరేక వర్గాలను కలుసుకొని అభిప్రాయాలను సేకరించారు. చివరికి హిందీ, ఇంగ్లిషులను కేంద్రం అధికార భాషలుగా గుర్తించింది. పదిహేనేళ్ల పాటు ఆ విధానం కొనసాగాక దానిని సమీక్షించాలని నిర్ణయించింది. పదిహేనేళ్ల గడువు ముగిశాక జాతీయ భాషగా హిందీని చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమిళనాడు భగ్గుమంది. చివరికి కేంద్ర ప్రభుత్వం 1963లో అధికార భాషా చట్టంలో హిందీతోపాటు ఇంగ్లిష్‌ని చేర్చింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాష్ట్రాలకు తమ అధికార భాషను గుర్తించే అధికారం, అందులోనే ఉత్తరప్రత్యుత్తరాలు చేసుకునే అవకాశం కల్పించింది. హిందీ ఎంతమంది మాట్లాడతారు ? 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 మాతృభాషలున్నాయి. వీటిలో 22 భాషల్ని రాజ్యాంగం గుర్తించి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చింది. ఆనాటి లెక్కల ప్రకారం 43.6% మందికి మాతృభాష హిందీయే. ఆ తర్వాత స్థానంలో 8 శాతంతో బెంగాలీ నిలిచింది. 6.86% మంది ప్రజలు మాట్లాడే మరాఠీ మూడో స్థానంలో నిలిస్తే, 6.70% మందితో మన తెలుగు భాష నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మధ్య కాలంలో తెలుగు, కన్నడ సినిమాలు బాలీవుడ్లో బంపర్ హిట్ కొడుతూ ఉండడంతో హిందీ చిత్ర పరిశ్రమలో కొందరు అసూయతో రగిలిపోతున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ప్రభంజనం మొదలైంది. ఇటీవల తెలుగు సినిమాలైన పుష్ప, ఆర్ఆర్ఆర్ వసూళ్లలో సునామీ సృష్టిస్తే, కన్నడ సినిమా కేజీఎఫ్–2 సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో హిందీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఈ స్థాయిలో ఎందుకు విజయం సాధించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ హిందీ ఎప్పటికీ మన జాతీయ భాషేనంటూ ట్వీట్ రాజకీయ రంగు పులుముకుంది. మూడు భాషల ఫార్ములా ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పనిసరి. ఇంగ్లిష్ భాషలో మాట్లాడడం, రాయడం రాకపోతే అంతర్జాతీయ సమాజంలో నెగ్గుకువచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇంగ్లిష్ సెకండ్ లాంగ్వేజీగా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. పలు రాష్ట్రాల్లో హిందీ కంటే ఇంగ్లిష్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విద్యా విధానం (ఎన్ఈపీ) మూడు భాషల ఫార్ములాను తీసుకువచ్చింది. 8వ తరగతి వరకు హిందీని నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. ‘సరైన విధానంలో బోధించేవరకు మూడు భాషల ఫార్ములా మంచిదే. ఎన్ని భాషలు వస్తే అంత మంచిది. కానీ హిందీని జాతీయ భాషగా రుద్దకూడదు. ఆ భాష వస్తే ఒక అదనపు భాష వచ్చినట్టే. కానీ జాతీయ భాష అంటూ కిరీటాలు తగిలించకూడదు’ అని భాషావేత్త మాయా లీలా చెప్పారు. – నేషనల్ డెస్క్, సాక్షి స్థానిక భాషే సుప్రీం కేజీఎఫ్–2 సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన నేపథ్యంలో కన్నడ సినీ నటుడు, ఈగ ఫేమ్ సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగణ్ మధ్య ట్వీట్ల ద్వారా నడిచిన చర్చ రాజకీయ రచ్చకి దారితీసింది. హిందీ ఇక జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ స్పందిస్తూ అలాంటప్పుడు మీ సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీయే ఎప్పటికీ మన జాతీయ భాష అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ట్వీట్లు స్నేహపూర్వకంగా నడిచినప్పటికీ దానిపై రాజకీయ దుమారం లేచింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామిలు గురువారం నటుడు సుదీప్‌కు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. దేశంలో హిందీ కూడా ఇతర ప్రాంతీయ భాషల మాదిరిగా ఒక భాషే తప్ప జాతీయ భాష కాదని కుండబద్దలు కొట్టారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో భాషకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడిందని, ఎక్కడికక్కడ స్థానిక భాషే సుప్రీం అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హుబ్లీలో చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి మాతృభాషని గౌరవించాలని, ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలని అన్నారు. మన దేశంలో విశిష్టమైన భాషా వైవిధ్యాన్ని ప్రతీ పౌరుడు గౌరవించాలని, మాతృభాష వినిపిస్తే ఎవరైనా గర్వంతో ఉప్పొంగిపోవాల్సిందేనని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. హిందీ జాతీయ భాష కాదని సుదీప్ చేసిన ట్వీట్ నూటికి నూరు శాతం నిజమని, ఎక్కువ మంది మాట్లాడినంత మాత్రాన హిందీ జాతీయ భాష అవదని జేడీ(ఎస్) నాయకుడు కుమారస్వామి ట్వీట్లు చేశారు. మరోవైపు బొమ్మై కేబినెట్ మంత్రి డాక్టర్ సిఎన్ అశ్వంత్ నారాయణ్ కమ్యూనికేషన్ కోసం జాతీయ స్థాయిలో హిందీ భాషను మాట్లాడితే తప్పులేదని వ్యాఖ్యానించడం విశేషం. -
కేజీఎఫ్ 2 ఎఫెక్ట్: హిందీ భాషపై కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు..
Kiccha Sudeep Says Hindi Is No More A National Language: దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన 'ఈగ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. 'ఈగ' సినిమాలో విలన్‌గా మెప్పించి ఎంతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా పాత్రలో కొత్తదనం ఉంటే చాలు వెంటనే సినిమా చేసేస్తాడు. హీరోగానే కాదు.. కథలో తన ప్రాముఖ్యాన్ని బట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తుంటారు. ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి తనదైన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం సుదీప్ హీరోగా విక్రాంత్ రోణ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూలై 28న విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా కేజీఎఫ్ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేశాడు కిచ్చా సుదీప్. ఓ ప్రెస్ మీట్లో సుదీప్ మాట్లాడుతూ 'ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఒక చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరీ సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందిస్తారో చూడాలి. చదవండి: కిచ్చా సుదీప్ 3డీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే ? Kannada Actor @KicchaSudeep said ,"correct it,Hindi is no more the National Language, its no more a National language"! In a film launch & a huge applause from the crowd & the media. Hope the efforts of Kannada activists are reaching the intended places.👏👏#stophindilmposition pic.twitter.com/qpj06HJseG — ರವಿ-Ravi ಆಲದಮರ (@AaladaMara) April 23, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1531341776.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మన జాతీయ భాష మనకు గర్వకారణం: అమిత్ షా
-
‘హిందీ’ తేనెతుట్టెను కదిపిన అమిత్ షా!
న్యూఢిల్లీ/చెన్నై/కోల్‌కతా/బెంగళూరు: కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ‘హిందీ’ తేనెతుట్టెను కదిపారు. భారతదేశం మొత్తానికి ఒకే జాతీయభాష ఉండాల్సిన అవసరముందన్నారు. ఈ లోటును హిందీ తీర్చగలదని అభిప్రాయపడ్డారు. భారత్‌ను ఏకం చేయగల సత్తా హిందీకే ఉందన్నారు. ఢిల్లీలో శనివారం ‘హిందీ దినోత్సవం’ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తమిళనాడు, కర్ణాటక, బెంగాల్‌కు చెందిన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. హిందీని బలవంతంగా అమలుచేసేందుకు ప్రయత్నిస్తే దేశ సమగ్రతకే ప్రమాదమనీ, ఇండియా ముక్కలైపోతుందని హెచ్చరించాయి. అమిత్ షా వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని తమిళ రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. అధికార భాషల చట్టం–1963 ప్రకారం భారత పార్లమెంటు, ప్రభుత్వ వ్యవహారాల్లో హిందీ, ఇంగ్లిష్లను అధికార భాషలుగా గుర్తించారు. 1953 నుంచి ఏటా సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశంలో 44 శాతం మంది మాతృభాష హిందీయే. గాంధీ, పటేల్‌ల స్వప్నం అదే.. ప్రజలంతా తమ ప్రాంతీయ భాషలను వీలైనంత ఎక్కువగా వాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ‘భారత్ అనేక భాషలకు నెలవు. ప్రతీభాషకు తనదైన ప్రాధాన్యత ఉంటుంది. కానీ దేశం మొత్తంమీద ఒకే జాతీయభాష ఉండాల్సిన అవసరం చాలాఉంది. ఇది అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం దేశాన్ని ఏకం చేయగల సత్తా ఏ భాషకైనా ఉందంటే అది హిందీ మాత్రమే. ఎందుకంటే దేశంలో మెజారిటీ ప్రజలు హిందీ మాట్లాడుతారు. హిందీ భాష దేశాన్ని ఏకం చేయగలదు. దీనివల్ల విదేశీ భాషలు(ఇంగ్లిష్), సంస్కృతులు మనపై పెత్తనం చేయలేవు. కాబట్టి ప్రతిఒక్కరూ తమ ప్రాంతీయ భాషలను విరివిగా వాడండి. అదే సమయంలో హిందీని జాతీయభాషగా చేయాలన్న మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్‌ల స్వప్నాన్ని సాకారం చేయండి’ అని అమిత్ షా చెప్పారు. గాంధీ, పటేల్‌లు కూడా హిందీని జాతీయభాషగా చేయాలని దేశప్రజల్ని కోరారని షా గుర్తుచేశారు. భారత్‌లో 122 భాషలు, 19,500కుపైగా మాండలికాలు ఉన్నాయని షా గుర్తుచేశారు. కాగా, హిందీ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తాను హిందీని మాతృభాష స్థాయిలో ప్రేమిస్తానని హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తమిళనాడులో.. ఒకవేళ కేంద్రం మాపై హిందీని ఏకపక్షంగా రుద్దితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని తమిళనాడు సాంస్కృతిక శాఖ మంత్రి, అన్నాడీఎంకే నేత కె.పాండియరాజన్ హెచ్చరించారు. అమిత్ షా వ్యాఖ్యలు దేశ సమగ్రతకు భగం కలిగిస్తాయని డీఎంకే అధినేత స్టాలిన్ ఆందోళన వ్యక్తంచేశారు. అమిత్ షా వ్యాఖ్యలను సీపీఐ, పీఎంకే, ఏఎంఎంకేతో పాటు పలు ద్రవిడ పార్టీలు వ్యతిరేకించాయి. పశ్చిమ బెంగాల్లో.. ప్రజలు అన్ని సంస్కృతులను గౌరవించాల్సిందేనని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అయితే అందుకోసం మాతృభాషను పణంగా పెట్టాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు, హిందీ, హిందూ, హిందూత్వ కంటే భారత్ చాలా పెద్దదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. భారతీయులందరి మాతృభాష హిందీ కాదని స్పష్టం చేశారు. కర్ణాటకలో.. ‘మేం హిందీని వ్యతిరేకించట్లేదు. బలవంతంగా రుద్దడాన్నే తప్పుపడుతున్నాం’ అని కర్ణాటక కాంగ్రెస్ నేత సిద్దరామయ్య ట్వీట్‌చేశారు. జేడీఎస్ నేత కుమారస్వామి మాట్లాడుతూ..‘కేంద్రం హిందీ దినోత్సవాన్ని జరుపుతోంది. మిస్టర్ మోదీ.. మీరు కన్నడ దినోత్సవం ఎప్పుడు జరపబోతున్నారు? హిందీలాగే కన్నడ కూడా అధికార భాషే’ అని వ్యాఖ్యానించారు. అక్టోబర్ 1 నుంచి ఉద్యమిస్తామని కన్నడ సంఘాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. -
దక్షిణాదిలో హిందీని విస్తృతం చేయాలి
హైదరాబాద్: జాతీయ భాష హిందీని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్ర మానవ వనరుల సహాయమంత్రి సత్యపాల్ సింగ్ అన్నారు. బోయిన్‌పల్లిలో కేంద్రీయ హిందీ సంస్థాన్ నూతన భవన నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. హిందీ భాష నేర్చుకోవడానికి అత్యంత సులువుగా ఉండటంతోపాటు ఇతర భారతీయ, విదేశీ భాషలనూ నేర్చుకోవడంలోనూ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. హిందీ భాషను దక్షిణాదిలోనూ విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంస్థాన్ భవన నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు స్థానిక ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న చొరవ తీసుకోవాలన్నారు. కేంద్ర సంస్థలకు స్థలమిచ్చేందుకు సిద్ధం రాష్ట్రంలో నిర్మించనున్న కేంద్ర సంస్థల కార్యాలయాలు, ఇతర భవనాలకు స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. భాషాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన భాషలైన తెలుగు–ఉర్దూ పరస్పర తర్జుమాకు 66 మంది ట్రాన్స్‌లేటర్లను నియమించినట్లు చెప్పారు. అధికారిక కార్యకలాపాల నిర్వహణకు హిందీ–తెలుగు–ఉర్దూ తర్జుమాకు అవసరమైన సిబ్బంది ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని కేంద్ర మంత్రిని కోరారు. 1976లో ప్రారంభమైన కేంద్రీయ హిందీ సంస్థాన్ ఆధ్వర్యంలో 16వేల మంది టీచర్లకు హిందీలో శిక్షణ ఇచ్చినట్లు సంస్థాన్ వైస్ చైర్మన్ కమల్ కిషోర్ గోయెంకా తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, కేంద్రీయ హిందీ సంస్థాన్ డైరెక్టర్ నంద కిశోర్ పాండే, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
రాజ భాష..రాచబాటే..
♦ హిందీ నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు ♦ ఆసక్తి చూపుతున్న యువత ♦ నేడు జాతీయ హిందీ దినోత్సవం పాలకుర్తి టౌన్ : ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ‘మాండలీస్’.. ఆ తర్వాతి స్థానం హిందీ భాషకు దక్కింది. దేశంలో ఈ భాషది మొదటి స్థానమే. అత్యధిక రాష్ట్రాల్లో మాతృభాషగా ఉన్న భాష కూడా హిందీనే. ఈ ప్రాముఖ్యత నేటికీ ఏమాత్రం తగ్గలేదు. ఒక్కప్పుడు తమిళనాడులో హిందీ భాష బోర్డులు కనిపిస్తే తగులబెట్టే రోజుల్లోనూ మహాత్మగాంధీ హిందీ ప్రచార సభలు నిర్వహించారు. ఇప్పటికీ భాషాభివృద్ధికి కమిటీలు ఏర్పాటు చేసి ప్రచార సభలు నిర్వహిస్తూనే ఉన్నారు. హిందీ జాతీయ భాషతో పాటు అధికార భాషగానూ పేరొందింది. అవకాశాలు బోలెడు.... హిందీ భాషాభివృద్ధికి అనేక సంస్థలు కృషి చేస్తూనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగాల వైపు విద్యార్థులు పరుగులిడుతున్న తరుణంలోనూ హిందీ పండిత శిక్షణకు అనేక మంది యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉపాధ్యాయులుగా, అనువాదకులుగా బోలెడు అవకాశాలున్నాయి. శిక్షణ సంస్థలు కూడా జిల్లాల్లో విస్తరించాయి. కాగా సెప్టెంబర్ 14న జాతీయ హిందీ దినోత్సవంగా 1949లో రాజ్యాంగ కమిటీ ప్రకటించింది. అప్పటి నుంచి పలు కార్యక్రమాలు నిర్వహిస్తు ప్రచారం సాగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను వివరించనున్నారు. బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాల్లో హిందీభాషను ప్రొత్సహించడానికి అధికారులు కార్యాలయంలోని బోర్డుపై రోజుకో హిందీ పదాన్ని రాసి అటు సిబ్బందికి, ఇటు వినియోగదారులకు అవగాహన పెంచుతున్నారు. హిందీ కోర్సులను అధ్యయనం చేయడం ద్వారా బోధన రంగంలోనే కాకుండా ఇతర వృత్తిపరమైన రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చు. తపాలా, భారత్ సంచార్ నిగమ్, జాతీయ బ్యాంకులు, నాయ్యస్థానాలు, జీవిత బీమా, మీడియా, చట్ట సభల్లో ట్రాన్స్‌లేటర్లు, జర్నలిస్ట్ ఉద్యోగాలకు హిందీ భాషా పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. -
హిందీ పెత్తనం
విశిష్ట తెలుగు కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి స్వాతంత్రోద్యమ సమయంలో హిందీ భాషా పెత్తనాన్ని ప్రశ్నించారు. ఆ ఉద్యమంలో పనిచేస్తున్నవారు మహాత్మా గాంధీ నుంచి, కాంగ్రెస్ నుంచి ఈ విషయంలో స్పష్టత సాధించాలని కోరారు. దక్షిణాది ప్రజల్లో హిందీ విషయంలో ఉన్న అనుమానాలనూ, భయా లనూ ఇది చాటుతుంది. స్వాతంత్య్రం వచ్చిన రెండు దశాబ్దాల తర్వాత హిందీకి వ్యతి రేకంగా దక్షిణాది రాష్ట్రాలు... మరీ ముఖ్యంగా తమిళనాడు ఏ స్థాయిలో భగ్గు మన్నాయో అందరికీ తెలుసు. దీన్నంతటినీ మరిచి అప్పుడప్పుడు కేంద్రంలోని పాల కులు హిందీకి ‘ఎలాగైనా’ అగ్రాసనం సాధించిపెట్టాలని పరితపిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రుల అధికారిక ప్రసంగాలన్నీ ఇకపై హిందీలోనే ఉండాలన్న పార్లమెంటరీ కమిటీ సిఫార్సుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల ఆమోదముద్ర వేశారు. అధికార భాషకు చెందిన ఆ కమిటీ మొత్తంగా 117 సిఫార్సులు చేస్తే వాటిల్లో కొన్నిటిని ప్రణబ్ ఆమోదించారు. సీబీఎస్ఈ సిలబస్ లోనూ, అన్ని కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లోనూ ఎనిమిది నుంచి పదో తరగతి వరకూ హిందీని తప్పనిసరి పాఠ్యాంశం చేయాలన్నది అందులో ఒకటి. అంతేకాదు... ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా జారీ చేసే టిక్కెట్లు ఇకపై హిందీలో ఉండబోతున్నాయి. మన దేశం బహు భాషల నిలయం. జనాభా గణన సమయంలో సేకరించిన వివరాలు దేశంలో 122 భాషలున్నాయని లెక్కేస్తే పీపుల్స్ లింగ్విస్టిక్ సొసైటీ (పీఎల్ఎస్) 780 భాషలున్నాయని తేల్చింది. నిజానికి ఈ సంఖ్య 1,000 దాటి ఉండొచ్చని కొందరి అంచనా. దేశంలో 60 శాతంమంది హిందీయేతర భాషలు మాట్లాడుతున్నారు. మిగిలిన 40 శాతంమందిలో అందరూ ‘స్వచ్ఛమైన’ హిందీ మాట్లాడరు. హిందీకి దగ్గరగా ఉన్న బ్రజ్‌భాష, ఛత్తీస్‌గఢీ, హర్యాన్వీవంటి 49 రకాల పలుకుబడులు వారి నోట వెంట వెలువడతాయి. మరి ఏ ప్రాతిపదికన హిందీ భాషకు ఇంతటి ప్రాధాన్యం ఇవ్వదల్చుకున్నారో పాలకులే చెప్పాలి. 1959 మొదలుకొని ఇంతవరకూ అధికార భాషకు చెందిన పార్లమెంటరీ కమిటీలు తొమ్మిది నివేదికలను సమర్పించాయి. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం హిందీ భాష వినిమయాన్ని పెంచడం కోసమంటూ చేసిన ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మెట్రిక్, ఆ పైస్థాయి అభ్యర్థులకు నిర్వహించే పోటీ పరీక్షల్లో హిందీ ప్రశ్నపత్రం తప్పనిసరిగా ఉండాలన్నది ఆ ప్రతిపాదనల్లో ఒకటి. యూపీఏ ప్రభుత్వానికి తమ పార్టీయే నేతృత్వం వహిస్తున్నా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ప్రతి పాదనలను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. వాటిని అమల్లోకి తెస్తే హిందీ భాషా ప్రాంతాల అభ్యర్థులు మాత్రమే లబ్ధి పొందుతారని, ఇతర రాష్ట్రాల వారు తీవ్రంగా నష్టపోతారని... ఇది తమకు సమ్మతం కాదని చెప్పారు. ప్రజలు దేశంలో కాదు... భాషలో నివసిస్తారని తత్వవేత్త ఎమిల్ సియోరాన్ అంటాడు. ఏ భాషా ప్రాంతం వారైనా మరో భాష పెత్తనాన్ని సహించలేరు. భాష అధికారానికీ, ఆధిపత్యానికీ చిహ్నంగా మారితే అంగీకరించరు. తమ భాషా సంస్కృ తులను ఆ భాష నాశనం చేస్తుందన్న భయాందోళనలు జనంలో అలుముకుం టాయి. ఒకే భాష మాట్లాడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం తమ మాటనూ, పలుకు బడినీ కించపరుస్తున్నారని తెలంగాణ ప్రాంత వాసులు ఆరోపించడం... విభజనో ద్యమానికి గల కారణాల్లో అదొకటి కావడం మరిచిపోకూడదు. తమ భాషపైనా, మాండలికంపైనా, సంస్కృతిపైనా ప్రజలకుండే మక్కువ అలాంటిది. దేశంలో హిందీ ధగధగలాడాలని, అది జాతీయ భాషగా వెలుగులీనాలని ఉత్తరాది నేతలు కోరు కోవడం ఈనాటిది కాదు. స్వాతంత్య్రోద్యమ సమయంలోనే దాన్ని ‘ఉమ్మడి భాష’గా ప్రకటింపజేయడానికి జాతీయ కాంగ్రెస్‌లో ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ ఎన్జీ రంగా వంటి తెలుగు నేతలు వాటిని గట్టిగా ప్రతిఘటిం చారు. మద్రాసు ప్రెసెడె న్సీగా ఉన్నప్పుడే తమిళ గడ్డపై హిందీ వ్యతిరేకోద్యమం సాగింది. వీటిని మరువ రాదు. పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులు సలహా పూర్వకమైనవే తప్ప ఆదేశాలు కాదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెబుతు న్నారు. ఈ విషయంలో ఆర్డినెన్స్ జారీచేసే ఉద్దేశం లేదంటున్నారు. మంచిదే. కానీ సీబీఎస్ఈ సిలబస్‌లో, కేంద్రీయ విద్యాలయాల్లో హిందీని తప్పనిసరి చేయడం లోని అంతరార్ధమేమిటి? ఇందువల్ల ఇతర భాషా సంస్కృతులవారు నష్టపోయే అవకాశం లేదా? హిందీ భాషపై ఆ ప్రాంతవాసులకుండే అభిమానాన్ని, భావోద్వేగాలను ఎవ రైనా అర్ధం చేసుకుంటారు. అయితే అది నేర్చుకుతీరాలని ఇతరులపై ఒత్తిడి తీసుకు రావడం... ఆ భాషకూ, ఉత్తీర్ణతకూ...ఆ భాషకూ, ఉద్యోగానికీ... ఆ భాషకూ, పదో న్నతికీ లంకె పెట్టడం ఎవరూ సహించరు. ఇతర ప్రాంతాలవారికి హిందీ తప్పనిసరి కావాలనేవారు ఇతర భాషల్లో దేన్నయినా ప్రాథమికంగానైనా నేర్చుకునే ప్రయత్న మైనా చేసిన దాఖలాలున్నాయా? ఏ భాష అయినా సహజ పద్ధతుల్లో వికసించాలి. వలసలు, వాణిజ్యం, వినోదం వంటివి అందుకు దోహదపడతాయి. అలాంటివన్నీ ఇప్పటికే హిందీ భాషా వ్యాప్తిని తగినంతగా పెంచాయి. హిందీ చలనచిత్రాలు, టెలివిజన్ సీరియల్స్, ఇతర వినోద కార్యక్రమాలు పాలకుల ప్రమేయం లేకుండానే ఆ పని చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడే అది రాజభాషగా ఊరేగాలన్న ఆత్రుత దీన్నం తటినీ దెబ్బతీస్తుంది. ఇంతకూ హిందీ జాతీయ భాష కాదు. రాజ్యాంగం గుర్తించిన 22 అధికార భాషల్లో అదొకటి మాత్రమే. కాకపోతే దానికి తొలి స్థానం ఇచ్చారు. 1965కల్లా ఇంగ్లిష్ స్థానంలో హిందీని రాజభాష చేయాలని రాజ్యాంగ నిర్ణాయక సభలో సంకల్పించినా దక్షిణాదిన హిందీ వ్యతిరేకోద్యమం ఉధృతంగా సాగడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. జనం భాషనూ, వారి సంస్కృతినీ, వారి సంప్రదా యాలనూ, వారి పలుకుబడిని గౌరవించడం అవసరం. పెత్తందారీ పోకడలు, ఏక పక్ష నిర్ణయాలు, అధికార శాసనలు ఏ భాషనూ విస్తరింపజేయలేవు సరికదా... దానిపై అయిష్టతను పెంచుతాయి. పాలకులు దీన్ని గుర్తుంచుకోవాలి. -
'హిందీని దేశ బాషగా తీర్చిదిద్దాలి'
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో హిందీని అధికారభాష చేయాలన్నా, విశ్వభాషగా మార్చాలన్నా దేశభాషగా తీర్చిదిద్దాల్సిన అసవరం ఎంతైనా ఉందని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ అభిప్రాయపడ్డారు. హిందీయేతర రాష్ట్రాలను అలక్ష్యం చేస్తే, హిందీ ఎప్పటికీ విశ్వభాష కాలేదని ఆయన అన్నారు. విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో భోపాల్‌లో నిర్వహిస్తున్న 10వ ప్రపంచ హిందీ మహాసభల్లో శుక్రవారం 'హిందీయేతర భాషా ప్రాంతాల్లో హిందీ' అంశంపై గోష్టిని ఆయన ప్రారంభించారు. హిందీయేతర రాష్ట్రాల్లోని హిందీ సంస్థల్లోని ఉద్యోగాలను స్థానిక పండితులకే ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రాల స్థానిక భాషల్లోని సాహిత్యాన్ని హిందీలోకి అనువదించి ఉత్తరాది రాష్ట్రాల పాఠ్యపుస్తకాల్లో చేరిస్తే జాతీయ సమైక్యత వెల్లివిరుస్తుందని యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ సూచించారు.