National priority
-
క్రిప్టో కరెన్సీకి జాతీయ ప్రాధాన్యత.. ట్రంప్ యోచన!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గెలిచాక క్రిప్టో కరెన్సీకి (cryptocurrency) కొత్త ఊపు వచ్చింది. ట్రంప్ మొదటి నుంచి కూడా క్రిప్టో కరెన్సీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా జాతీయ ప్రాధాన్యత అంశంగా క్రిప్టో కరెన్సీని మార్చేందుకు ఉత్తర్వులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ కథనం పేర్కొంది.ఈ చర్య అమెరికా విధాన మార్పును సూచిస్తుందని, ప్రభుత్వ నిర్ణయాలను రూపొందించడంలో క్రిప్టో పరిశ్రమకు మరింత ప్రాముఖ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. నివేదికలో పేర్కొన్న మూలాల ప్రకారం.. ఈ ఉత్తర్వులు క్రిప్టోకరెన్సీని జాతీయ ఆవశ్యకతగా నిర్దేశిస్తాయి. క్రిప్టో పరిశ్రమకు ప్రభుత్వ ఏజెన్సీలు సైతం సహకారం అందిస్తాయి. అంతేకాకుండా పరిశ్రమ విధాన అవసరాల కోసం క్రిప్టోకరెన్సీ సలహా మండలిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ కాయిన్‌బేస్, రిపుల్ వంటి ప్రముఖ సంస్థల నుండి విరాళాలతో సహా క్రిప్టోకరెన్సీ పరిశ్రమ నుండి గణనీయమైన మద్దతును పొందారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో రానున్న కొత్త ప్రభుత్వంతో తమ బంధాన్ని సూచించేలా వాషింగ్టన్లో క్రిప్టో పరిశ్రమ వేడుకలకు సిద్ధమైందిజాతీయ బిట్‌కాయిన్ నిధియూఎస్లో జాతీయ బిట్‌కాయిన్ (Bitcoin) నిధిని సృష్టించడం పరిశీలనలో ఉన్న మరో కీలక అంశంగా నివేదిక పేర్కొంది. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన బిట్‌కాయిన్‌ను కలిగి ఉంది. నవంబర్ ఎన్నికల నుండి బిట్‌కాయిన్ ధర దాదాపు 50% పెరిగింది. భవిష్యత్తులో క్రిప్టో నిల్వలు పెరుగుతాయన్న ఊహాగానాల కారణంగా బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లకు చేరుకుంది.ప్రతిపాదిత నిధి ప్రభుత్వం బిట్కాయిన్లను కలిగి ఉండటాన్ని లాంఛనప్రాయంగా మారుస్తుంది. క్రిప్టోకరెన్సీ పట్ల ప్రభుత్వ వైఖరిలో వ్యూహాత్మక మార్పును ప్రతిబింబిస్తుంది. బిట్‌కాయిన్ 2024లో అద్భుతమైన వృద్ధిని సాధించింది. దాని విలువ సంవత్సరంలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది.బైడెన్ పాలనలో ఒడుదొడుకులుఅధ్యక్షుడు జో బిడెన్ పరిపాలనలో అనేక నియంత్రణ సవాళ్లను ఎదుర్కొన్న క్రిప్టో రంగానికి ఈ చొరవ భారీ మార్పును సూచిస్తుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)తో సహా ఫెడరల్ ఏజెన్సీలు ఇటీవలి సంవత్సరాలలో క్రిప్టో కంపెనీలకు వ్యతిరేకంగా 100 కుపైగా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టాయి. -
'ఆ ఉగ్రవాదులతో మాకు ముప్పులేదు'
వాషింగ్టన్: అణు భద్రతకు ప్రపంచ దేశాలు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అమెరికాలో జరిగిన అణుభద్రత సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రపంచదేశాలన్నీ ఒకేలా ఆలోచిస్తున్నాయని ఈ ధోరణిలో మార్పు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి దేశం ఆ టెర్రరిస్టులు మీ దేశం వారు, వారి నుంచి మాకు ముప్పులేదు అనే తీరుగా నేతలు వ్యవహరిస్తున్నారని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై అన్నిదేశాల నేతలు తమ అందరి సమస్యగా భావించాలని పేర్కొన్నారు. మనం ఇంకా ఉగ్రవాదుల కోసం కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్లలో వెతుకుతున్నాం... కానీ అంతకంటే మెరుగైన విధానాలు అవలంభించాల్సిన అవసరం ఏర్పదిందని మోదీ అభిప్రాయపడ్డారు. సదస్సుకు హాజరైన ఇరవై దేశాల అగ్రనేతలను ఉద్దేశించి మరిన్ని విషయాలు ప్రస్తావించారు. ఉగ్రవాదులు 21వ శతాబ్దపు అత్యాధునికమైన ఆయుధాలు, టెక్నాలజీ వాడుతున్నారని... అయితే ప్రభుత్వాలు మాత్రం పాత పద్ధతులు, మార్గాలలోనే చర్యలు తీసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు ప్రపంచ వ్యాప్తంగా నెట్ వర్క్ ఉంటుందని, అందుకు అన్ని దేశాల నేతలు సమిష్టిగా ఈ విషయంపై దృష్టిసారించాలని సూచించారు. ప్రపంచదేశాల భద్రతకు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఎంతో సేవ చేశారని మోదీ కొనియాడారు. బ్రస్సెల్స్ దాడుల గురించి మాట్లాడుతూ.. అణుభద్రతకు ఉగ్రవాదం పెను ముప్పుగా మారుతుందనడానికి ఇదో ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. -
ఎన్‌ఐడీకి జాతీయ ప్రాధాన్య హోదా!
ఎడ్యూ న్యూస్: అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ)కు అరుదైన హోదా దక్కనుంది. ఈ సంస్థకు జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థ(ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్) హోదాను ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లును ప్రభుత్వం గతేడాది సభలో ప్రవేశపెట్టింది. తాజాగా దీనికి ఆమోదముద్ర లభించింది. దీనిప్రకారం.. ఎన్ఐడీ డిజైనింగ్‌కు సంబంధించి వివిధ విభాగాల్లో శిక్షణ, పరిశోధనలు నిర్వహించవచ్చు. ఈ రంగంలో డిప్లొమా, డిగ్రీ సర్టిఫికెట్లను, అవార్డులను ప్రదానం చేయొచ్చు. అంతేకాకుండా స్పాన్సర్డ్, ఫండెడ్ రీసెర్చ్‌ను, కన్సల్టెన్సీ ప్రాజెక్టులను చేపట్టవచ్చు. సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం-1860, బాంబే పబ్లిక్ ట్రస్టు చట్టం-1950 ప్రకారం ఎన్ఐడీ 1961లో ఏర్పాటైంది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థ. ఎన్ఐడీ.. డిజైన్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేట్, పోస్టు-గ్రాడ్యుయేట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. తాజాగా లభించే హోదా ద్వారా ఎన్ఐడీ ఇకపై నాణ్యమైన డిజైనింగ్ విద్యను అందించే అవకాశం ఉంటుందని, విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీజీతోపాటు ఎంఫిల్, పీహెచ్డీ డిగ్రీలను కూడా ప్రదానం చేస్తుందని వెల్లడించారు. ఎన్ఐడీ కోర్సులు: ప్రస్తుతం ఎన్ఐడీ మూడు క్యాంపస్‌లు (అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు) ద్వారా బ్యాచిలర్ స్థాయిలో గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ పేరుతో కోర్సులు అందిస్తోంది. అవి.. యానిమేషన్ అండ్ ఫిల్మ్ డిజైన్; సెరామిక్ అండ్ గ్లాస్ డిజైన్; ఎగ్జిబిషన్ డిజైన్; ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్; ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్; గ్రాఫిక్ డిజైన్; ప్రొడక్ట్ డిజైన్; టెక్స్టైల్ డిజైన్. కోర్సుల వ్యవధి: నాలుగేళ్లు అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో.. పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ పేరుతో పలు స్పెషలైజేషన్లలో డిజైన్ కోర్సులను అందిస్తోంది. అవి.. యానిమేషన్ అండ్ ఫిల్మ్ డిజైన్; అపరెల్ డిజైన్; సెరామిక్ అండ్ గ్లాస్ డిజైన్; డిజైన్ ఫర్ డిజిటల్ ఎక్స్పీరియన్స్; డిజైన్ ఫర్ రిటైల్ ఎక్స్పీరియన్స్; ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్; ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్; గ్రాఫిక్ డిజైన్; ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్ఫేజ్ డిజైన్; లైఫ్‌స్టైల్ యాక్సెసరీ డిజైన్; న్యూ మీడియా డిజైన్; ప్రొడక్ట్ డిజైన్; స్ట్రాటజిక్ డిజైన్ మేనేజ్మెంట్; టెక్స్టైల్ డిజైన్; టాయ్ అండ్ గేమ్ డిజైన్; ట్రాన్స్పోర్ట్ అండ్ ఆటోమొబైల్ డిజైన్. ఈ కోర్సుల కాల వ్యవధి : రెండున్నర సంవత్సరాలు. అర్హత : సంబంధిత విభాగంలో బ్యాచిలర్ స్థాయి కోర్సులో ఉత్తీర్ణత ఎన్ఐడీలో ప్రవేశ ప్రక్రియ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ క్యాంపస్‌ల్లో బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే.. నేషనల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఎంట్రెన్స్ డిగ్రీ, పీజీ స్థాయి కోర్సులకు వేర్వేరుగా ఉంటుంది. దీనికోసం ప్రతి ఏటా సెప్టెంబర్/అక్టోబర్‌లో నోటిఫికేషన్ వెలువడుతుంది. జనవరిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జూన్ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. పీజీ కోర్సు చేయాలనుకునే ఔత్సాహికులు ఎన్ఐడీ నిర్వహించే ప్రవేశ పరీక్ష లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిర్వహించే ప్రవేశ పరీక్ష (నిఫ్ట్ పీజీ ఎంట్రెన్స్) ద్వారా కూడా ఎన్ఐడీలో ప్రవేశం పొందొచ్చు. ఎన్ఐడీ వెబ్సైట్: http://www.nid.edu/