ndrf staff
-
శ్రీకాకుళం : తీర ప్రాంతాలకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
-
ఇండియాలో తొలిసారి కాపాడే మహిళా దళాలు
‘రెస్క్యూ ఆపరేషన్’ అనే మాట వినే ఉంటారు. విపత్తులలో.. విలయాలలో.. వైపరీత్యాలలో.. ప్రాణాలకు తెగించడం. ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడటం. ఈ పనిలో ఇప్పటివరకు పురుషులే ఉన్నారు. ఇకపై మహిళలూ రెస్క్యూలోకి దిగబోతున్నారు! తొలి బ్యాచ్‌లో 100 మహిళలు శిక్షణ పొంది ‘ఏ క్షణానికైనా’ సిద్ధంగా ఉన్నారు. ఆపదలో ఆదుకునేవాళ్లను ఆపద్బాంధవులు అంటారు. మన దేశానికి అధికారిక ఆపద్బాంధవి.. ‘జాతీయ విపత్తు రక్షణ దళం’. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్.డి.ఆర్.ఎఫ్.) ఈ జాతీయ దళం పేరుకు ఆపద్బాంధవి అయినప్పటికీ ఇందులో ఇంతవరకు మరీ చిన్నస్థాయిలో తప్ప ప్రత్యక్షంగా ప్రాణాలు కాపాడే ‘డిజాస్టర్ కంబాట్’లో మహిళా సిబ్బంది లేరు. ‘రెస్క్యూ ఆపరేషన్లోకి మహిళల్ని తీసుకుని రిస్క్ చెయ్యలేం’ అనేవాళ్లు అధికారులు. ‘‘ఇది ‘హై–ప్రెషర్’ జాబ్, మగవాళ్లు మాత్రమే చేయగలరు’ అని కూడా! నీటిలో కొట్టుకుపోతున్న వాళ్లను హెలికాప్టర్ల నుంచి పైకి లాగడమే కాదు, కొన్నిసార్లు నడుముకు కట్టుకుని కూడా ఒడ్డుకు చేర్చవలసి ఉంటుంది. అదుపుతప్పి వ్యాపిస్తున్న మంటలను దారికి తేవడమే కాదు, కొన్నిసార్లు మంటల్లో చిక్కుకున్న వాళ్ల కోసం ఆ మంటల్లోకే వెళ్లవలసి ఉంటుంది. భూకంపాలప్పుడు శిథిలాల కింద ఉన్నవారిని కనిపెట్టడమే కాదు, సమయం మించిపోక ముందే ప్రాణాలతో వారిని బయటికి తేవాలి. ఇంకా.. రోడ్డు ప్రమాదాలు, విమాన ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారిని స్ట్రెచర్ల మీదే కాదు, అవసరం అయితే భుజాలపై మోసుకుని కూడా అంబులెన్స్‌లోకి ఎక్కించవలసి ఉంటుంది. ప్రతి క్షణమూ విలువైనదే కనుక ప్రతి ప్రయత్నమూ బలమైనదే కావాలి. ఆ బలం మహిళలకు ఉండదు అనుకునేవారు. అయితే ఆ ఆలోచనా ధోరణి మారింది. ఎన్.డి.ఆర్.ఎఫ్. తన బలం పెరగాలంటే రెస్క్యూ టీమ్‌లలో మహిళలు తప్పనిసరిగా ఉండాలని భావిస్తోంది. ఫలితమే ‘జాతీయ విపత్తు రక్షణ దళం’లోకి మహిళల చరిత్రాత్మక రంగ ప్రవేశం. ∙∙ తొలిసారి శిక్షణ పొంది వచ్చిన ఈ వంద మంది మహిళా బృందాన్ని ఉత్తరప్రదేశ్‌లోని గర్హ్ ముక్తేశ్వర్ పట్టణంలో గంగానది పొడవున గస్తీ విధుల్లో నియమించారు. ఆపద నుంచి కాపాడే పడవల్ని నడపడం, అవసరమైతే అప్పటికప్పుడు వాటికి మరమ్మతులు చేయడం, ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినవారిని గాలించి ఆ పడవల్లో ఒడ్డుకు చేర్చడం వంటివన్నీ వారు విజయవంతంగా పూర్తి చేసిన శిక్షణ లో భాగమే. వీళ్లు కాక మరో వందమందికి పైగా మహిళలకు ఎన్.డి.ఆర్.ఎఫ్. డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్.ప్రధాన్ శిక్షణ ఇప్పించబోతున్నారు. ఈ మొత్తం 200 మందీ ఇన్స్పెక్టర్లుగా, సబ్ ఇన్స్పెక్టర్లుగా, కానిస్టేబుళ్లుగా తమ విధులు నిర్వర్తిస్తారు. నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యిమంది సిబ్బందిలో 108 మంది మహిళల్ని మాత్రమే చేర్చుకునేందుకు తనకున్న అధికారం మేరకే ఈ నియామకాలు చేపట్టగలిగారు ఎన్.డి.ఆర్.ఎఫ్. డీజీ. లేకుంటే ఇంకా ఎక్కువమందినే తీసుకునేవారు. ‘‘మహిళలు రెస్క్యూ టీమ్‌లో ఉండటం వల్ల ప్రత్యేకమైన ఆపత్సమయ ప్రయోజనాలు ఉన్నాయి. మహిళల్ని కాపాడేందుకు మహిళలే చొరవ చూపగలరు. ఇంకా ప్రత్యేకమైన సందర్భాలలో మహిళల్ని మహిళలే ఆదుకోవడం అవసరమౌతుంది కూడా’’ అని ప్రధాన్ అంటున్నారు. ‘‘మహిళా బృందం, పురుష బృందం రెండూ ప్రధానమే. అయితే స్త్రీ, పురుషులు కలిసి ఉండే బృందాన్ని ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపుతున్నాం. ప్రాణాల్ని రక్షించేటప్పుడు స్త్రీ పురుషులిద్దరూ కలిసి పని చేయడం వల్ల తక్షణ ఫలితాలు ఉంటాయి’’ అంటారు ప్రధాన్. -
ఒక్క రోజులో 6 వేలకుపైగా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 6,088 కరోనా కేసులు శుక్రవారం నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 1,18,447గా ఉంది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 66,330 కాగా, 48,534 మంది కోలుకున్నారు. కోవిడ్–19తో ఇప్పటివరకు 3,583 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 148 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. ఢిల్లీలోని ఎన్డీఆర్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో విధుల్లో ఉన్న ఎస్ఐ ర్యాంక్ అధికారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. కాగా, కోవిడ్–19 విధుల అనంతరం వైద్య సిబ్బందికి క్వారంటైన్ అవసరం లేదని ఆరోగ్య శాఖ ఇచ్చిన ఆదేశాలపై ఢిల్లీలోని వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. వేలాది ప్రాణాలు నిలిచాయి దేశవ్యాప్త లాక్డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్డౌన్ వల్ల 14 లక్షల నుంచి 29 లక్షల వరకు కేసులను నిరోధించగలిగామని, 78 వేల ప్రాణాలు కాపాడగలిగామని పేర్కొంది. ఈ విషయాలు పలు అధ్యయనాల్లో వెల్లడయ్యాయని కోవిడ్‌పై ఏర్పాటు చేసిన సాధికార బృందం–1 చైర్మన్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. కేసులు రెట్టింపు అయ్యే సమయం కూడా లాక్‌డౌన్‌ను ప్రకటించిన సమయలో 3.4 రోజులుండగా, ఇప్పుడు 13.3 రోజులకు పెరిగిందన్నారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా కొద్ది ప్రాంతాలకే పరిమితమయిందని, 80% యాక్టివ్ కేసులు ఐదు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని వివరించారు. ఇప్పటివరకు 48,534 మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం వెల్లడించారు. మొత్తం కేసుల్లో ఇది 41% అన్నారు. కరోనాను జయించిన వృద్ధురాలు ఇండోర్‌కు చెందిన ఒక 95 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించారు. కోలుకున్న అనంతరం శుక్రవారం ఆమెను స్థానిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇది అద్భుతమని, మనోస్థైర్యమే ఆమెను కాపాడిందని వైద్యులు వ్యాఖ్యానించారు. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో 10న ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె 70 ఏళ్ల కుమారుడు కరోనాతో రెండు వారాల క్రితం మరణించారు. -
బోటు ప్రమాదం: కొనసాగుతున్న సహాయక చర్యలు
-
పడవ జాడ కోసం
దేవీపట్నం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి బృందం: గోదావరి నదిలో 72 మంది పర్యాటకులతో ప్రయణిస్తున్న ప్రైవేట్ టూరిజం బోటు రాయల్ వశిష్ట గల్లంతై మంగళవారం సాయంత్రానికి 53 గంటలు గడిచాయి. ప్రమాదానికి గురైన బోట్‌ను వెలికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నావికాదళం బృందాలు శ్రమిస్తున్నాయి. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద ప్రైవేట్ బోటు ఆదివారం గోదావరిలో మునిగిపోయింది. అదే రోజు సాయంత్రం విపత్తుల నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. మూడు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు, నేవీ హెలికాప్టర్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ప్రభుత్వం రంగంలోకి దించింది. ఉత్తరాఖండ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంట తీసుకొచ్చిన అత్యాధునిక కెమెరా సహాయంతో నీటి అడుగున బోటు జాడను తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గోదావరిలో 214 అడుగుల లోతున బోటు ఉన్నట్లు గుర్తించారు. జర్మనీకి చెందిన డ్రాగర్ కంపెనీ తయారు చేసిన ఆధునిక యంత్రాన్ని నేవీ అధికారులు ఘటనా స్థలానికి తీసుకొచ్చారు. ఈ యంత్రం ద్వారా రెస్క్యూ టీమ్ సభ్యుడిని బోటు వద్దకు పంపించి, సురక్షితంగా వెనక్కి తీసుకురావొచ్చని అధికారులు చెబుతున్నారు. అవసరాన్ని బట్టి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తామని అంటున్నారు. గత మూడు రోజులుగా రంపచోడవరం ఐటీడీఏ పీఓ నిషాంత్‌కుమార్ ఘటనా స్థలం వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఘటనా స్థలంలో ఈదురు గాలులతో కూడిన ››వర్షం కురవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. మృతదేహాల జాడ వెతికే పనిలో.. కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిన ప్రదేశంలో మృతదేహాల జాడ కనిపెట్టేందుకు సహాయక సిబ్బంది కృషి చేస్తున్నారు. కచ్చులూరు మత్స్యకారులకు చెందిన 17 బోట్లతోపాటు రెస్క్యూ టీమ్ బోట్లు కచ్చులూరు నుంచి పోలవరం కాఫర్ డ్యామ్ వరకు ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు గోదావరికి మూడు సార్లు వరదలు వచ్చాయి. బోటు బోల్తా పడిన సమయంలో గోదావరిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి గోదావరిలో నీటి మట్టం పది అడుగుల మేర తగ్గింది. దీంతో గల్లంతైన వారి మృతదేహాలు గోదావరి ఒడ్డున పొదల్లో చిక్కుకునే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భారీ వర్షాలు.. 26 ఏళ్ల తరువాత గేట్ల ఎత్తివేత
తిరువనంతపురం : కేరళలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటి వరకు 26 మంది మృతిచెందగా మరికొంత మంది గల్లంతైన విషయం తెలిసిందే. భారీ వర్షాలతో ఇబ్బందిపడుతున్న కేరళవాసులకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఆర్ఎఫ్ దళాలను అదేశించారు. విపత్తు నిర్వహణ వర్గాల సమాచారం ప్రకారం గురువారం ఉదయం ఇడుక్కీ, మలప్పురం, కన్నూర్ జిల్లాలో భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడి 10 మంది మృతి చెందారు. తాగునీరు, తిండిలేక గత మూడు రోజులుగా కేరళ వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు సహాయచర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలకు అప్రమత్తం చేసి, పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. భారీ వర్షాలతో ఇడుక్కీ రిజర్వాయర్ నీటి మట్టం పెరిగిపోయింది. డ్యామ్ గరిష్ట నీటిమట్టం 2,403 అడుగులు కాగా, గురువారం సాయంత్రం నాటికి 2,398 అడుగులకు చేరింది. వరద ఉదృతి పెరగడంతో అధికారులు గేట్లను ఎత్తివేశారు. కాగా 26 ఏళ్ల తరువాత ఇడుక్కీ డ్యామ్ గేట్లను ఎత్తివేయడం ఇదే తొలిసారి. కాగా ప్రంపంచంలోనే రెండవ అతి పెద్ద వంపైన ఆనకట్ట కలిగిన ప్రాంతంగా ఇడుక్కి ప్రసిద్ది చెందింది. -
మిగిలింది మన్నే!
►మాలిన్ గ్రామాన్ని పూర్తిగా మింగేసిన కొండచరియలు ►ఒక్క ఇల్లు కూడా మిగలకుండా ఆనవాలు కోల్పోయిన గ్రామం ►ఇప్పటిదాకా ప్రాణాలతో బయటపడింది 8 మంది మాత్రమే ►మృతుల సంఖ్య 42కి చేరిందని వెల్లడించిన పుణే కలెక్టర్ ►130 మంది గల్లంతు, శిథిలాల కిందే ఉన్నారంటున్న స్థానికులు ►పొక్లెయినర్లతో శరవేగంగా జరుగుతున్న సహాయక చర్యలు ►ఘటనాస్థలాన్ని సందర్శించిన రాజ్‌నాథ్, పవార్ తదితరులు సాక్షి, ముంబై: ప్రకృతి ఒడిలో ఉన్నామంటూ పరవశించిపోతున్న ఆ గ్రామాన్ని చూసి కొండకు కన్నుకుట్టిందా? ఏదైనా జీవిపై కన్నేసిన కొండచిలువ దానిని పూర్తిగా మింగేసి, ఎలా నుజ్జునుజ్జు చేస్తుందో పుణే జిల్లాలోని మాలిన్ గ్రామాన్ని కూడా ఈ కొండచరియలు అలా చేశాయి. 46 ఇళ్లున్న ఆ గ్రామంలో ఇప్పుడు కనీసం ఒక్క ఇల్లు కూడా మిగల్లేదంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మృతులను చూసి ఏడ్చేవారు కూడా లేరంటే అతిశయోక్తి కాదేమో?అసలు అక్కడ నిన్నటిదాకా ఓ గ్రామం ఉందని చెప్పినా నమ్మే పరిస్థితి లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా చేసిన వ్యాఖ్యలు దుర్ఘటన తీవ్రతకు అద్దం పడుతున్నాయి. తవ్వుకుంటూ పోయినకొద్ది ఇళ్ల శిథిలాలు, వాటికి కింద విగత జీవులుగా మారిన దేహాలు బయటపడుతున్నాయి. ప్రాణాలతో ఉన్నవారిని కాపాడేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలను వృథా ప్రయాసగా కొందరు చెబుతున్నారంటే ఇక కనీసం ఒక్కరు కూడా ఊపిరితో బయటపడలేదని పరిస్థితి కనిపిస్తోంది. 30కి చేరిన మృతుల సంఖ్య... బుధవారం జరిగిన మాలిన్ దుర్ఘటనలో మృతుల సంఖ్య 30కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మరో 130 మందికిపైగా ఆచూకి గల్లంతైంది. వీరంతా శిథిలాలకింద ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నలుగురిని మాత్రమే గురువారం ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీశారు. మరో పది మృతదేహాలను కూడా బయటకు తీసినట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం... వర్షం, బురదతోపాటు గ్రామానికి చేరుకోలని ప్రతికూల పరిస్థితులు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ ముందుకు వెళ్తున్నారు. బుధవారం రాత్రంతా కూడా శిథిలాల తొలగింపు కొనసాగింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో భారీగా వర్షం కురవడంతో సహాయక చర్యలను కాసేపు ఆపారు. 30 నిమిషాల తర్వాత మళ్లీ ప్రారంభించారు. జేసీబీలు, పొక్లెయిన్ల సాయంతో మట్టిని తొలగిస్తూ శిథిలాల కింద ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమోనని చూస్తున్నారు. ఊపిరితో ఉన్నవారిని గుర్తించేందుకు పోలీసు కుక్కల సాయం కూడా తీసుకుంటున్నారు. అత్యాధునిక పరికరాలతో కూడా బతికున్నవారి కోసం అన్వేషిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విపత్తులను ఎదుర్కొనేందుకు మరో రెండు ఎస్డీఆర్ఎఫ్లు సాక్షి, ముంబై: విపత్తులు ఎదురైనప్పుడు సత్వరమే సహాయక చర్యలు అందించేందుకు మరో రెండు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్) కంపెనీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రిమండలి సమావేశంలో గురువారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 428 పదవులను కొత్తగా సృష్టించి, వీటిని ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ద్వారా భర్తీ చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. ఎస్డీఆర్ఎఫ్ ప్రస్తుతం పుణే సమీపంలోని తలేగావ్‌లో ఉంది. రాష్ట్రంలో ఏ మూలకు, ఎలాంటి ఆపత్తు వచ్చిన ఇక్కడి నుంచి సిబ్బంది, అధికారులు వెళ్లాల్సి వస్తోంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అదనంగా రెండు కంపెనీలు స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో కంపెనీలో మూడు బృందాలు అంటే అధికారులు, సిబ్బంది కలిసి 45 మంది ఉంటారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)లో ప్రస్తుతం 1,145 మంది ఉన్నారు. ఇది మహారాష్ట్ర గుజరాత్, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లోని విపత్తుల బాధ్యతలు చూసుకుంటోంది. ముంబైలో ఒకరి మృతి ఐదుగురికి గాయాలు ముంబై: వర్షం జోరుకు కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. చెంబూర్‌లో గురువారం కొండచరియలు విరిగిపడడంతో ఐదేళ్ల బాలుడు మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకెళ్తే... అశోక్‌నగర్‌లో ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఉన్న కొండల కింద గుడిసెలు వేసుకొని నివసిస్తున్నవారిపై ఒక్కసారిగా పెద్దమొత్తంలో మట్టి, రాళ్లు వచ్చి పడ్డాయి. ఈ సమయంలో గుడిసె ముందు ఆడుకుంటున్న గణేశ్ ఖురడేతోపాటు అక్కడే కూర్చున్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సచారం అందుకున్న బీఎంసీ విపత్తుల నిర్వహణ బృందం ఘటనాస్థలానికి చేరుకొని శిథిలాలకింద చిక్కుకున్న ఆరుగురిని బయటకు తీసి సమీపంలోని శతాబ్ది ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ అశోక్ మృతి చెందాడని, మిగతా ఐదుగురికి ప్రాణాపాయమేమీ లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కొండ సమీపంలో నివసిస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని బీఎంసీ ఓ ప్రకటన విడుదల చేసింది.