Neerja Bhanot
-
పాయింట్ బ్లాంక్‌లో గన్.. భయపడని వీర మహిళ
పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ ఉన్న బయటపడని నైజం ఆమెది. తనని షూట్ చేస్తారని తెలిసిన ప్రాణం కోసం కాళ్లమీద పడకుండా ఎదురొడ్డి పోరాడిన సాహసి ఆమె. వయసు కేవలం ఇరవై రెండు సంవత్సరాలు అయినా మనసు మాత్రం హిమాలయ శిఖరమంతా. తాను చనిపోతున్న సమయంలోనూ ముగ్గురు చిన్నారులకు రక్షణ కవచంలా నిలిచి మరీ మృత్యువును ఆహ్వానించిన త్యాగశీలి. ఆమె ఎవరో కాదు అతిచిన్న వయసులోనే ఎంతో ధైర్యసాహసాలు చూపి ఆశోకచక్ర అవార్డును పొందిన నీరజా భనోత్. సెప్టెంబర్5, 1986 భారతదేశంలో మర్చిపోలేని ఒక సంఘటన. విచక్షణారహితంగా ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి చాలా మంది ప్రాణాలను బలిగొన్న రోజు. ఆరోజే ఒక అపురూపమైన వ్యక్తి గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి ప్రపంచానికి తెలిసిన రోజు. ఈ రోజు నీరజ భనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజు జరిగిన సంఘటనను, ఆమె ధైర్యసాహసాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సెప్టెంబర్ 5, 1986, ముంబై నుంచి కరాచీ మీదుగా న్యూయార్క వెళ్లాల్సిన విమానం మేఘాలను చీల్చుకుంటూ ముందుకు సాగిపోతోంది. సరిగ్గా ఉదయం 4:30కి కరాచీ విమానాశ్రయంలో దిగింది. అక్కడ దిగాల్సినవాళ్లు దిగారు. ఎక్కాల్సినవాళ్లు ఎక్కారు. విమానం మళ్లీ గాల్లోకి లేవనుంది. సరిగ్గా అప్పుడే మూడు సార్లు తుపాకి పేల్చిన చప్పుడు. ఒక్క సారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఎదురుగా ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ దుస్తులు వేసుకున్న నలుగురు సాయుధులు. తుపాకులు చూపిస్తూ అందరినీ చేతులు వెనక్కి పెట్టుకొమ్మని ఆదేశించారు. పెట్టుకున్నాక కట్టేశారు. చివరికి కెప్టెన్‌ని, కో-పెలైట్‌ని, కాక్‌పిట్ క్రూని కూడా బంధించారు. ఒకే ఒక్కరిని తప్ప. ఆమె నీరజా భనోత్. పంజాబ్‌లో పుట్టి, ఫ్లయిట్ అటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఇరవ రెండేళ్ల యువతి. హైజాకర్లు విమానం ఎక్కగానే క్రూ మెంబర్స్‌ని అలర్ట్ చేసింది నీరజ. దాంతో పైలట్లు తమ విజ్ఞానాన్ని ఉపయోగించి ఫ్లయిట్‌ను ఎగరకుండా చేశారు. ఆ తర్వాత విమానాన్ని హైజాక్ చేయాలన్న దుండగుల పథకం ఫెయిలైంది. దాంతో వాళ్ల కోపం కట్టలు తెంచుకుంది. సైప్రస్‌కు విమానంతో సహా వెళ్లి, అక్కడ జైల్లో ఉన్న తమవారిని విడుదల చేయించాలన్న ప్లాన్ బెడిసి కొట్టడంతో ఆ ప్రతాపం ప్రయాణికుల మీద చూపించడం మొదలు పెట్టారు. కొందరిని చంపేశారు. మిగిలిన వాళ్ల పాస్‌పోర్టులు సేకరించమని నీరజకు పురమాయించారు. అయితే అందరిని సౌకర్యంగా ఉంచే ఆమె, ఇప్పుడు అందరినీ ఎలా కాపాడాలా అన్న ఆలోచనలో పడింది. ధైర్యం ఆమె నరనరాల్లో ఉంది. కొంతమంది పాస్ పోర్టులు దాచేసింది. ఉగ్రవాదులు కొందరిని హింసించబోతే అడ్డుకుంది. వాళ్లను కట్టడి చేసేందుకు పదిహేడు గంటలపాటు ప్రయత్నించింది. కానీ చివరికి ఉగ్రవాదులు సహనం కోల్పో యారు. విచక్షణా రహితంగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు. దాంతో ఎమర్జెన్సీ ద్వారం గుండా ప్రయాణికుల్ని తప్పించే ప్రయత్నం మొదలుపెట్టింది నీరజ. ఆ విషయాన్ని ఉగ్రవాదులు పసిగట్టేశారు. అందుకు శిక్షగా ఆమె ప్రాణాలనే తీసేసుకున్నారు. నీరజ మరణం అందర్నీ కలచి వేసింది. ఆ రోజు ప్రాణాలతో బయటపడిన వాళ్లంతా ఇప్పటికీ నీరజను తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఉగ్రవాదులు ఫ్లయిట్ ఎక్కేటప్పటికి ఎంట్రన్స్ దగ్గర ఉన్న నీరజకు పారిపోయే అవకాశం ఉన్నా పారిపోలేదని చెబుతుంటారు. అందుకే ఆమె జీవిత చరిత్ర ఆధారంగా సోనమ్ కపూర్ హీరోయిన్గా ‘నీర్జా’ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఆరోజు జరిగిన ప్రతి సంఘటనను కళ్లకు కట్టినట్టు చూపించింది. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు నీరజ ధైర్య సాహసాలను కొనియాడారు. ఎంతో మందికి నీరజ ఆదర్శంగా నిలిచారు. (యూనిఫామ్‌లో.. శాంతి పావురం!) -
ఆ రాక్షసుల ఫోటోలను విడుదల చేశారు
వాషింగ్టన్ : పాన్ అమెరికా ఎయిర్వేస్ విమాన హైజాక్, మారణ హోమానికి సంబంధించి ఉగ్రవాదుల ఫోటోలను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ మరోసారి విడుదల చేసింది. 1986, సెప్టెంబర్ 5న ముంబై నుంచి న్యూయార్క్ బయలుదేరిన పాన్ యామ్ ఫ్లైట్ 73 విమానాన్ని కరాచీలో హైజాక్ చేసిన ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. ఆ రోజు ఏం జరిగిందంటే... ఈ విమానంలో అటెండెంట్‌గా పనిచేస్తున్న నీర్జా భానోత్ టెర్రరిస్టుల బారి నుంచి 359 మందిని తన వంతు ప్రయత్నం చేశారు. ప్రయాణికులు సురక్షితంకోసం ఆమె తన జీవితాన్ని పణంగా పెట్టారు. కానీ, ఈ క్రమంలో నీర్జాతోపాటు 20 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు అమెరికన్లు కూడా ఉన్నారు. హైజాకర్లు మహ్మద్ హఫీజ్ అల్ టర్కీ, జమల్ సయ్యిద్ అబ్దుల్ రహిమ్, మహ్మద్ అబ్దుల్లా ఖలీల్ హుస్సేన్, మహ్మద్ అహ్మద్ అల్ మున్వర్ ప్రధాన నిందితులు. 2000 సంవత్సరంలో తొలిసారి వీరి ఫోటోలను విడుదల చేయగా.. ఇప్పుడు ఏజ్-ప్రోగ్రెసన్ టెక్నాలజీ ద్వారా వారు ఇప్పుడు ఎలా ఉంటారన్నది అంచనా వేస్తూ వారి ఫోటోలు రిలీజ్ చేశారు. వీళ్లల్లో ప్రతీ ఒక్కరిపై 5 మిలియన్ల అమెరికన్ డాలర్ల నజరానా ఉంది. వీరంతా అబు నిదల్ ఆర్గనైజేషన్ సంస్థకు చెందిన వారని.. ప్రస్తుతం వీరంతా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారని ఎఫ్‌బీఐ ప్రకటించింది. -
లోక్‌సభలో 'నీర్జా'కు నీరాజనాలు
న్యూఢిల్లీ: విమానాల హైజాకింగ్ వ్యతిరేక బిల్లు 2014 (యాంటీ హైజాకింగ్ లా)కు లోక్ సభలో సోమవారం ఆమోద ముద్ర పడింది. సవరించిన ఈ బిల్లు ప్రకారం విమానాల హైజాకింగ్‌కు పాల్పడిన వారికి ఇకముందు మరణదండన విధిస్తారు. బిల్లుపై చర్చ సందర్బంగా హైజాకర్లు కాల్చి చంపిన నీర్జా భానోత్ కు సభ్యులు నీరాజనాలు పలికారు. ఈ బిల్లు పైగా చర్చ సందర్భంగా 1986 లో హైజాక్ విమానంలో మరణించిన పాన్ ఏఎం ఎయిర్ హోస్టెస్ నీర్జా భానోత్ సాహసాన్ని సభ్యులు కొనియాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ప్రయాణికులు సురక్షితంకోసం ఆమె తన జీవితాన్ని పణంగా పెట్టారని ప్రశంసించారు. ఆమె ఒక సాహసోపేత మహిళ అనీ, ఆమె తెగువపై బాలీవుడ్ లో ఇటీవల చిత్రం కూడా విడుదలైందని టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ గుర్తు చేశారు. టీఆర్ఎస్ ఎంపీ బీఎన్ గౌడ్ బిల్లును సమర్ధిస్తూ మాట్లాడుతూ.. బాధితులకు నష్టపరిహారం అందించేలా పటిష్టయైన వ్యవస్థను రూపొందించాలన్నారు. అమెరికాకు చెందిన పాన్ ఏఎం కంపెనీ ఇప్పటికీ భారత సిబ్బందికి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. నీర్జా భానోత్ , సీనియర్ అటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ముంబై -న్యూ యార్క్ పాన్ ఏఎం విమానాన్ని కరాచీలో ఉగ్రవాదులు హైజాక్ చేశారు. సెప్టెంబర్ 5, 1986 లో ప్రయాణీకులను కాపాడే క్రమంలో ఉగ్రమూకల తూటాలకు నిర్జా బలి అయ్యారు. ఆమె ధైర్యసాహసాలకుగాను భారతదేశం అత్యున్నత శాంతి సేనా పురస్కారం అశోక్ చక్ర ప్రకటించింది. కాగా ఇంతకుముందు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ బిల్లుకు రాజ్యసభ ఇటీవల ఆమోద ముద్ర వేసినసంగతి తెలిసిందే. -
సాహసి
అందరూ అన్నీ కావాలని చేయకపోవచ్చు. అందుకే ఎవరివల్ల అయినా తప్పు జరిగితే... తొందరపడి వాళ్లని విమర్శించకూడదు. ఎవరికి తెలుసు... రేపు ఏదైనా కారణం వల్ల మనకు తెలియకుండానే మనమూ ఆ తప్పు చేస్తామేమో! - నీరజా భనోత్ విధి చాలా బలమైనది. దాన్ని ఎదిరించడం ఎవరి తరమూ కాదు. ఎదిరించాలని ప్రయత్నిస్తే ప్రాణమే పోవచ్చు. కానీ ప్రాణం పోయినా ఫరవాలేదంటూ విధికి ఎదురు నిలిచి చేసే పోరాటం మాత్రం... చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. నీరజా భనోత్ ఈ లోకానికి చెప్పిన వాస్తవమిది. నీరజ... ఓ సాహసి. అనుకోకుండా ముంచుకొచ్చిన ఉపద్రవం నుంచి కొందరిని కాపాడ్డానికి తన ప్రాణాలను ఒడ్డిన త్యాగశీలి. సెప్టెంబర్ 5, 1986. ముంబై నుంచి కరాచీ మీదుగా న్యూయార్క వెళ్లాల్సిన విమానం మేఘాలను చీల్చుకుంటూ ముందుకు సాగిపోతోంది. సరిగ్గా ఉదయం 4:30కి కరాచీ విమానాశ్రయంలో దిగింది. అక్కడ దిగాల్సినవాళ్లు దిగారు. ఎక్కాల్సినవాళ్లు ఎక్కారు. విమానం మళ్లీ గాల్లోకి లేవనుంది. సరిగ్గా అప్పుడే మూడు సార్లు తుపాకి పేల్చిన చప్పుడు. ఒక్క సారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఏమయ్యిందో అర్థంకాక అయోమయంగా చూశారు. ఎదురుగా ఎయిర్పోర్ట సెక్యూరిటీ దుస్తులు వేసుకున్న నలుగురు సాయుధులు. కళ్లతోనే నిప్పులు కురిపిస్తున్నారు. తుపాకులు చూపిస్తూ అందరినీ చేతులు వెనక్కి పెట్టుకొమ్మని ఆదేశించారు. పెట్టుకున్నాక కట్టేశారు. చివరికి కెప్టెన్‌ని, కో-పెలైట్‌ని, కాక్‌పిట్ క్రూని కూడా బంధించారు. ఒకే ఒక్కరిని తప్ప. ఆమే... నీరజా భనోత్. పంజాబ్‌లో పుట్టి, ఫ్లయిట్ అటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఇరవే రెండేళ్ల యువతి. హైజాకర్లు విమానం ఎక్కగానే క్రూ మెంబర్సని అలర్ట చేసింది నీరజ. దాంతో పైలట్లు తమ విజ్ఞానాన్ని ఉపయోగించి ఫ్లయిట్‌ను ఎగరకుండా చేసేశారు. ఆ తర్వాత విమానాన్ని హైజాక్ చేయాలన్న దుండగుల పథకం ఫెయిలైంది. దాంతో వాళ్ల కోపం కట్టలు తెంచుకుంది. సైప్రస్‌కు విమానంతో సహా వెళ్లి, అక్కడ జైల్లో ఉన్న తమవారిని విడుదల చేయించాలన్న ప్లాన్ బెడిసి కొట్టడంతో ఆ ప్రతాపం ప్రయా ణీకుల మీద చూపించడం మొదలు పెట్టారు. కొందరిని చంపేశారు. మిగిలిన వాళ్ల పాస్‌పోర్టులు సేకరించమని నీరజకు పురమాయించారు. ఎవరైనా అయితే బెదిరిపోయేవారు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో బెంబేలు పడేవారు. కానీ అక్కడున్నది నీరజ. ధైర్యం ఆమె నరనరాల్లోనూ ఉంది. అందుకే ఏం చేయాలా అని ఆలోచిం చింది. ఫ్లయిట్ అటెండెంట్‌గా అందరినీ సౌకర్యంగా ఉంచే ఆమె, ఇప్పుడు అందరినీ ఎలా కాపాడాలా అన్న ఆలో చనలో పడింది. కొంతమంది పాస్ పోర్టులు దాచేసింది. ఉగ్రవాదులు కొందరిని హింసించబోతే అడ్డుకుంది. వాళ్లను కట్టడి చేసేందుకు పదిహేడు గంటలపాటు ప్రయత్నించింది. కానీ చివరికి ఉగ్రవాదులు సహనం కోల్పో యారు. విచక్షణా రహితంగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు. వేగంగా కదిలింది నీరజ. ఎమర్జెన్సీ ద్వారం గుండా ప్రయాణీకుల్ని తప్పించే ప్రయత్నం మొదలుపెట్టింది. అయితే ఆ విషయాన్ని ఉగ్రవాదులు పసిగట్టేశారు. అందుకు శిక్షగా ఆమె ప్రాణాలనే తీసేసుకున్నారు. నీరజ మరణం అందర్నీ కలచి వేసింది. ఆమె సాహసానికి ప్రభుత్వం అశోకచక్ర అవార్డును ప్రకటించింది. ఆ అవార్డును అందుకున్న తొలి మహిళ, అతి పిన్న వయస్కురాలు నీరజ. ఆ రోజు ప్రాణాలతో బయటపడిన వాళ్లంతా ఇప్పటికీ నీరజను తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఉగ్రవాదులు ఫ్లయిట్ ఎక్కేటప్పటికి ఎంట్రన్స్ దగ్గర ఉన్న నీరజకు పారిపోయే అవకాశం ఉన్నా పారిపోలేదని చెబుతుంటారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో వాళ్లు తనను షూట్ చేస్తున్నా కూడా... భయపడి పరుగులు తీయకుండా, తనను ఏమీ చేయవద్దని వాళ్ల కాళ్లమీద పడకుండా నిలిచిన సాహ సాన్ని పొగుడుతూ ఉంటారు. మరణం చేరువవుతున్న సమయంలో కూడా... ఓ ముగ్గురు చిన్నారులకు రక్షణ కవచంలా నిలబడి మరీ మృత్యువును ఆహ్వానించిన ఆమె త్యాగానికి సలాం కొడుతుంటారు. తన సాహసాన్ని త్యాగ నిరతిని చరిత్రలో రక్తంతో లిఖించింది నీరజ. ఆ పుటను తిరగేసిన ప్రతిసారీ మన మనసు చెమ్మగిల్లుతూనే ఉంటుంది. -
విమానంలో ఆ రోజు ఏం జరిగిందీ....?
న్యూఢిల్లీ: పాన్ అమెరికా ఎయిర్వేస్ విమానంలో అటెండెంట్‌గా పనిచేస్తున్న నీర్జా భానోత్ టెర్రరిస్టుల బారి నుంచి 359 మంది ప్రయాణికులను రక్షించేందుకు తన ప్రాణాలను అర్పించిన యదార్థ సంఘటనపై సోనమ్ కపూర్ నటించిన హిందీ సినిమా ‘నీర్జా’ బాక్సాఫీసు వద్ద హిట్ అయిన విషయం తెల్సిందే. అసలు ఆ రోజు విమానంలో ఏం జరిగింది ? విమానంలోకి టెర్రరిస్టులు ఎలా ప్రవేశించారు? ప్రయాణికులను ఎలా చంపారు? అన్న అంశాలను ఆ రోజు విమానం నుంచి ప్రాణాలతో బయటపడ్డ సంగీత విద్వాంసుడు నయన్ పాంచోలి చెప్పిన కథనం ఇదీ... ‘అది 1986, సెప్టెంబర్ 5, అహ్మదాబాద్‌కు చెందిన మ్యూజిక్ కంపోజర్స్. గాయనీ గాయకులతో కూడిన బృందం మాది. అమెరికాలోని పలు నగరాల్లో సంగీత విభావరి నిర్వహించేందుకు మేము వెళుతున్నాం. పాన్ ఏఎంకు చెందిన ముంబై నుంచి కరాచి, ఫ్రాంక్‌ఫర్ట్‌ల మీదుగా న్యూయార్క్ వెళ్లే విమానంలో ఎక్కాం. అప్పుడు నాకు 21 ఏళ్లు. మా విమానం ముంబై నుంచి బయల్దేరి తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో కరాచి విమానాశ్రయంలో దిగింది. కొంతమంది ప్రయాణికులు కరాచిలో దిగి పోయారు. విమానాన్ని క్లీనర్లు విమానం ఎక్కి తమ పని ముగించుకొని వెళ్లడానికి సిద్ధమయ్యారు. అంతలో విమానాశ్రయం సెక్యూరిటీ దుస్తుల్లో ఉన్న నలుగురు సాయుధులు బిజినెస్ క్యాస్ వైపునున్న ద్వారం గుండా లోపలికి ప్రవేశించారు. అటువైపు నుంచి అరుపులు, కేకలు వినిపించాయి. గాలిలోకి మూడు, నాలుగు సార్లు కాల్పులు జరిపిన శబ్దాలు వినిపించాయి. ముందు భాగానికి, వెనక భాగానికి ఇద్దరు చొప్పున సాయుధులు విడిపోయారు. వారిలో ఒకరి వద్ద మిషన్ గన్ ఉండగా, మిగతా వారి వద్ద పలు తుపాకులు, గ్రెనేడ్లు ఉన్నాయి. ప్రతి ప్రయాణికుడు తన నెత్తికి రెండు చేతులు పెట్టుకోవాలని వారు ఆదేశించారు. నాతో సహా ప్రయాణికులందరం అలాగే చేశాం. అదే సమయంలో వెంటనే స్పందించిన సీనియర్ ఫ్లైట్ అటెండెంట్ నీర్జా భానోత్ కాక్‌పిట్‌లోకి వెళ్లి కెప్టెన్, కోపైలట్, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే విమానాన్ని టేకాఫ్ చేయాల్సిందిగా సూచించారు. కానీ వారంతా విమానం దిగి పారిపోయారు. ఈలోగా నీర్జాను మినహా మిగతా ఫ్లైట్ అటెండర్లందరిని టెర్రరిస్టులు బంధించారు. ఎయిర్‌వేస్‌తో మాట్లాడేందుకు నీర్జాను బంధించలేదు. ప్రయాణికులను భయపెట్టేందుకు రాకేష్ కుమార్ అనే వ్యక్తిని ముందుగా కాల్చి చంపారు. అతని శవాన్ని విమానం నుంచి బయట పడేశారు. ప్రయాణికుల పాస్‌పోర్టులను సేకరించడం మొదలు పెట్టారు. ఈలోగా కొంత మంది అమెరికా పౌరుల పాస్‌పోర్టులను నీర్జా తీసుకొని సీట్ల కింద దాచిపెట్టారు. మమ్మల్ని భయపెడుతూ టెర్రరిస్టులు అరబిక్ భాషలో అరపులు, కేకలు వేశారు. మధ్యాహ్నం శాండివిచ్‌లు ఆఫర్ చేశారు. ఆ పరిస్థితిలో ఎవరికీ తినేందుకు మకస్కరించలేదు. సాయంత్రం నెత్తిమీద చేతులు పెట్టుకొని నిలబడాల్సిందిగా ఆదేశించి ప్రయాణికులు క్యూలో టాయ్లెట్లకు వెళ్లేందుకు అనుమతించారు. విమానాన్ని హైజాక్ చేసిన 17 గంటలకు విమానంలోని ఇంధనం ఖాళీ అయింది. దాంతో జనరేటర్ నడవక విమానంలో లైట్లన్నీ ఆరిపోయాయి. భయపడిన టెర్రరిస్టులు ప్రయాణికులపై గుడ్డిగా కాల్పులు జరపడం ప్రారంభించారు. ఎంతో మంది చావు కేకలు వినిపించాయి. నీర్జా భానోత్ (23 ఏళ్లు)తో పాటు నా ట్రూప్‌నకు చెందిన ఇద్దరు కాల్పుల్లో మరణించారు. గ్రెనేడ్లు కూడా విసిరారు. ప్రాణాలు రక్షించుకోవడం కోసం నేను నా పక్కనే ఉన్న ఎమర్జెన్సీ డోర్‌ను తీసుకొని బయటకు దూకుతుండగా, ఓ గ్రెనేడ్ శకలాలు వచ్చి నా ఎడమ కంటికి తాకాయి. అలాగే కింద పడిపోయాను. నన్ను కరాచి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. 48 గంటల తర్వాత ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ముంబై తీసుకెళ్లారు. అక్కడ కంటికి చికిత్స చేయించుకున్నా లాభం లేకపోయింది. అమెరికాలోని చికాగో ఆస్పత్రికి వెళ్లాను. అక్కడా నా కంటి చూపును ఎవరూ పునరుద్ధరించలేక పోయారు. ఆ రోజును ఇప్పటికీ మరచిపోలేను. మానవత్వానికి చీకటి రోజు. ప్రయాణికులు జాతి,కుల, మత విభేదాలను విస్మరించిన రోజు. ఒకరి పట్ల ఒకరు మానవత్వంతో వ్యయహరించిన రోజు’ అంటూ ఆ నాటి సంఘటనను వివరించారు. -
‘నీర్జా’ అరుదైన యాడ్ విడుదల
గాంధీనగర్: సోనమ్ కపూర్ నటించిన హిందీ సినిమా ‘నీర్జా’ హిట్టవడంతో ఇప్పుడు నీర్జా భానోత్ నిజ జీవితంపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. 259 మంది ప్రయాణికులను రక్షించేందుకు తన 23వ పుట్టిన రోజుకు కొన్ని గంటల ముందు ప్రాణాలు అర్పించిన నీర్జాకు నివాళిగా పాల ఉత్పత్తుల సంస్థ ‘అముల్’ ఆమె 1980 దశకంలో నటించిన అతి అరుదైన యాడ్‌ను ఇప్పుడు పునర్ విడుదల చేసింది. అముల్ చాక్లెట్‌కు సంబంధించిన ఆ యాడ్‌లో ‘త్రి చక్ర సైకిల్‌ను నడిపేందుకు చాలా పెద్దోడివి. పైలట్ అవడానికి చాలా చిన్నోడివి. అముల్ చాక్లెట్ తినేందుకు సరైన వయస్సు వాడివి’ అనే పాటను ఓ బాలుడితో కలసి పాడుతారు. నీర్జా పాన్ అమెరికా ఎయిర్వేస్లో చేరడానికి ముందు యాడ్స్‌లో మోడల్‌గా పనిచేశారు. బెంజర్ సారీస్, బినాకా టూత్ పేస్ట్, గోద్రెజ్ బెస్టో డిటర్జెంట్, వాపోరెక్స్, వీకో టర్మరిక్ , తదితర యాడ్స్‌లో ఆమె నటించారు. నీర్జా ధైర్యసాహసాలకు మెచ్చిన భారత్ ప్రభుత్వం మరణానంతరం ఆమెకు అశోకచక్రను ప్రకటించింది. ఆ అవార్డు లభించిన తొలి పౌరురాలే కాకుండా అత్యంత పిన్న వయస్సులో ఈ అవార్డు లభించిన వ్యక్తిగా కూడా ఆమె పేరు రికార్డుల్లోకి ఎక్కింది.