negative rating
-
విమానయానం భవిష్యత్ సుస్థిరం
న్యూఢిల్లీ: రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా దేశీ విమానయాన రంగం ఔట్‌లుక్‌ను స్థిరత్వానికి ఎగువముఖంగా సవరించింది. గతంలో ప్రకటించిన ప్రతికూల రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య(ట్రాఫిక్) వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ రంగం భవిష్యత్‌పట్ల ఆశావహంగా స్పందించింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో విమానయాన రంగం నష్టాల అంచనాలు రూ. 11,000 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లకు తగ్గించింది. వచ్చే ఏడాది(2023–24)కి సైతం తొలుత వేసిన నష్టం రూ. 7,000 కోట్ల అంచనాలలోనూ రూ. 5,000 కోట్లకు కోత పెట్టింది. వచ్చే ఏడాదిలోనూ ప్రయాణికుల ట్రాఫిక్ కొనసాగనున్నట్లు తాజా నివేదికలో ఇక్రా అభిప్రాయపడింది. దీంతో విమానయాన కంపెనీలు టికెట్ ధరల నిర్ణయంలో మరింత శక్తివంతంగా వ్యవహరించేందుకు వీలు చిక్కగలదని పేర్కొంది. ఇది మెరుగుపడుతున్న ఈల్డ్స్ ద్వారా ప్రతిఫలిస్తున్నట్లు తెలియజేసింది. 2022 జూన్‌లో గరిష్టానికి చేరిన వైమానిక ఇంధన(ఏటీఎఫ్) ధరలు క్రమంగా తగ్గుతుండటం, విదేశీ మారక రేట్లు స్థిరంగా ఉండటం లాభదాయకతకు సహకరించనున్నట్లు అంచనా వేసింది. 8–13 శాతం వృద్ధి: ఏప్రిల్ నుంచి ప్రారంభంకానున్న వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీ ప్యాసింజర్ ట్రాఫిక్ 8–13 శాతం స్థాయిలో పురోగమించనున్నట్లు నివేదికలో ఇక్రా అభిప్రాయపడింది. ఈ ఏడాది 55–60 శాతం వృద్ధి తదుపరి వచ్చే ఏడాదిలో ప్రయాణికుల సంఖ్య 14.5–15 కోట్లకు చేరగలదని అంచనా వేసింది. కరోనా మహమ్మారికి ముందుస్థాయికంటే ఇది అధికంకావడం గమనార్హం! దేశీ విమానయాన కంపెనీల ద్వారా విదేశీ ప్రయాణికుల సంఖ్య సైతం వృద్ధి బాటలో సాగుతున్నట్లు ఇక్రా పేర్కొంది. 2022 మార్చి నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు తిరిగి మొదలుకావడంతో ఈ ఏడాది తొలి 9 నెలల్లో (ఏప్రిల్–డిసెంబర్) కోవిడ్–19 ముందుస్థాయికంటే కేవలం 2.4 శాతం తక్కువగా ఇంటర్నేషనల్ ట్రాఫిక్ నమోదైనట్లు వెల్లడించింది. వార్షికంగా చూస్తే దేశీ కంపెనీల అంతర్జాతీయ ట్రాఫిక్ 10–15 శాతం ఎగసినట్లు తెలియజేసింది. గతేడాది 125–130 వృద్ధి తదుపరి ఇది అధికమేనని స్పష్టం చేసింది. -
వీడని వైరస్ భయాలు
ముంబై: దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతుండడం, ఫలితంగా ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందోనన్న అనిశ్చితి ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు నడిపించింది. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా భారత బ్యాంకింగ్ రంగం పట్ల మూడీస్ తన దృక్పథాన్ని నెగెటివ్‌కు తగ్గించడం పెద్ద ప్రభావాన్నే చూపించింది. బ్యాంకు స్టాక్స్‌లో అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఈ ప్రభావంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయి (2.06%) 8,084 వద్ద క్లోజయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 674 పాయింట్లు నష్టపోయి (2.39%) 27,591 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తరలించుకుపోతుండడం, ఫలితంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో విడత 76 స్థాయికి జారిపోవడం.. ఇన్వెస్టర్లను కొనుగోళ్ల విషయమై వేచిచూసే ధోరణి అనుసరించేలా చేసినట్టు ట్రేడర్లు అభిప్రాయపడ్డారు. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 2,225 పాయింట్లు (7.46%), నిఫ్టీ 576 పాయింట్లు (6.65%) చొప్పున నష్టపోయాయి. ఈ వారంలో చివరి రెండు రోజుల్లో నష్టాల కారణంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.4,82,033 కోట్ల మేర తరిగిపోయి రూ.1,08,66,723 కోట్లకు పడింది. అమ్మకాలకు దారితీసిన అంశాలు ► కరోనా వైరస్ ప్రభావం కారణంగా భారత బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగిపోవచ్చన్న అంచనాతో ఈ రంగం అవుట్‌లుక్‌ను స్థిరం నుంచి ప్రతికూలానికి మారుస్తూ మూడీస్ నిర్ణయం తీసుకుంది. ► కరోనా పాజిటివ్ కేసుల్లో భారీ పెరుగుదలతో ఆర్థిక మాంద్యం వస్తుందన్న ఆందోళన నెలకొంది. ► కరోనా వైరస్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై 4.1 ట్రిలియన్ డాలర్ల భారాన్ని మోపుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు పేర్కొంది. ► డాలరుతో రూపాయి విలువ శుక్రవారం 53 పైసలు నష్టపోయి 76.13 వద్ద క్లోజయింది. బ్యాంకు స్టాక్స్ బేర్... మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ భారత బ్యాంకింగ్ రంగ రేటింగ్‌ను నెగెటివ్‌కు మార్చడం, అందులోనూ కొన్ని బ్యాంకుల రేటింగ్లను తగ్గించడం ఆయా స్టాక్స్‌కు ప్రతికూలంగా మారింది. అత్యధికంగా ఆర్బీఎల్ బ్యాంకు 15.5 శాతం, బంధన్ బ్యాంకు 13 శాతం చొప్పున నష్టపోయాయి. సూచీల్లోని బ్యాంకు స్టాక్స్ అయిన.. యాక్సిస్ బ్యాంకు 9 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 8.5 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 8 శాతం, ఎస్బీఐ 6 శాతం చొప్పున పడిపోయాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకులు 2 శాతం చొప్పున నష్టపోయాయి. కరెన్సీ మార్కెట్ల పనివేళలు తగ్గింపు ముంబై: లౌక్‌డౌన్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ డెట్ మార్కెట్, కరెన్సీ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను వచ్చే మంగళవారం (ఈ నెల 7వ తేదీ) నుంచి కుదిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఈ మార్కెట్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నాయి. ఈ నెల 7 నుంచి ఉదయం 10 గంటలకు మార్కెట్లు ప్రారంభం అయి, మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తాయి. -
బ్యాంకింగ్ బోర్లా!
న్యూఢిల్లీ: భారత బ్యాంకింగ్ రంగ దృక్పథాన్ని స్థిరం నుంచి ప్రతికూలానికి (నెగెటివ్) మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తగ్గించేసింది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అవరోధాలతో వృద్ధి మందగిస్తుందని.. దీంతో బ్యాంకుల ఆస్తుల నాణ్యత తగ్గిపోవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. కార్పొరేట్, సూక్ష్మ, మధ్య తరహా సంస్థలు, రిటైల్ విభాగంలోని మొండిబాకీలు పెరగవచ్చని.. ఫలితంగా బ్యాంకుల లాభాలు, నిధులపై ఒత్తిళ్లు పెరిగిపోతాయని మూడీస్ నివేదికలో పేర్కొంది. ‘‘ఉన్నట్టుండి ఆర్థిక కార్యకలాపాలు ఒకేసారి ఆగిపోవడంతో నిరుద్యోగం పెరుగుతుంది. ఇది గృహాలు, కంపెనీల ఆదాయాలు తగ్గిపోయేందుకు దారితీస్తుంది. దీంతో చెల్లింపుల్లో జాప్యం పెరిగిపోయేందుకు కారణమవుతుంది. ఎన్బీఎఫ్సీ సంస్థల్లో నిధుల ఒత్తిళ్లు బ్యాంకుల రిస్క్‌ను పెంచుతుంది. ఎందుకంటే ఎన్బీఎఫ్సీ రంగానికి బ్యాంకుల ఎక్స్పోజర్ (రుణ పోర్ట్‌ఫోలియో) ఎక్కువగా ఉంది’’ అని మూడీస్ వెల్లడించింది. ఈ అంశాలు బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీయడంతోపాటు రుణ వృద్ధికి విఘాతం కలిగిస్తాయని అంచనా వేసింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిధుల లభ్యత స్థిరంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. యస్ బ్యాంకు డిఫాల్ట్‌తో రిస్క్ తీసుకోవడానికి కస్టమర్లు వెనుకాడడం చిన్న ప్రైవేటు బ్యాంకులకు నిధుల ఒత్తిళ్లు పెరగవచ్చని అంచనా వేసింది. ఈ బ్యాంకుల పట్ల నెగెటివ్.. ఇండస్ ఇండ్ బ్యాంకు రేటింగ్స్‌ను డౌన్‌గ్రేడ్ చేసేందుకు పరిశీలనలో పెడుతున్నట్టు మూడీస్ ప్రకటించింది. ఇండస్ ఇండ్ బ్యాంకు పోర్ట్‌ఫోలియో ఎక్కువగా వాహన రుణాలు, సూక్ష్మ రుణాలు కావడంతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులతో బ్యాంకుపై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని మూడీస్ పేర్కొంది. అలాగే, ప్రస్తుత సవాళ్లతో కూడిన వాతావరణంలో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు రేటింగ్లను డౌన్‌గ్రేడ్ చేసింది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకుల రేటింగ్‌ను స్థిరం (స్టేబుల్) నుంచి నెగెటివ్‌కు తగ్గించింది. ఐడీబీఐ బ్యాంకు రేటింగ్‌ను పాజిటివ్ నుంచి స్టెబుల్‌కు డౌన్‌గ్రేడ్ చేసింది. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకుల గ్లోబల్ రేటింగ్స్‌లో మార్పులు చేయలేదు. లౌక్‌డౌన్ కారణంగా రుణ గ్రహీతల వేతనాలకు ఇబ్బందులు ఎదురైతే అది రిటైల్, క్రెడిట్‌కార్డు రుణాల చెల్లింపులపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది. ఈ రంగాలపై ఎక్కువ ప్రభావం.. ఎయిర్‌లైన్స్, ఆటోమొబైల్ ఓఈఎం కంపెనీలు, ఆటో విడిభాగాల సరఫరా కంపెనీలు, ఆయిల్ అండ్ గ్యాస్ తయారీదారులు, గేమింగ్, గ్లోబల్ షిప్పింగ్, విచక్షణా రహిత రిటైల్ వినియోగం, ఆతిథ్య రంగాలు కరోనా వైరస్ కారణంగా ఎక్కువ ప్రతికూలతలను చవిచూసే రంగాలుగా మూడీస్ పేర్కొంది. -
బ్యాంకుల రేటింగ్లలో కోత
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) రేటింగ్ అంచనాలను స్థిర స్థాయి నుంచి నెగెటివ్ స్థాయికి తగ్గించినట్లు ఎస్అండ్పీ రేటింగ్స్ సంస్థ తెలిపింది. రాబోయే ఏడాదిన్నర కాలంలో మొండి బకాయిల భారం మరింత పెరగొచ్చన్న అంచనాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే కొంత పటిష్టమైన, ప్రభుత్వం నుంచి మద్దతు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్న బ్యాంకుగా సూచిస్తూ.. స్వల్పకాలికంగా ‘ఏ-3’, దీర్ఘకాలికంగా ‘బీబీబీ మైనస్’ రేటింగ్‌ను ఇస్తున్నట్లు ఎస్అండ్పీ క్రెడిట్ అనలిస్టు అమిత్ పాండే చెప్పారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ను(ఐవోబీ) కూడా ప్రతికూల అంచనాలతో.. ప్రత్యేకంగా గమనించాల్సిన విభాగంలోకి(క్రెడిట్వాచ్) ఎస్అండ్పీ చేర్చింది. ఎన్పీఏలతో నష్టాలు మరింత పెరగొచ్చన్న అంచనాలు దీనికి కారణం. ఐవోబీకి దీర్ఘకాలికంగా ‘బిబిప్లస్’, స్వల్పకాలికంగా ‘బి’ రేటింగ్ ఉంది. ఐడీబీఐ బ్యాంకునకు బిబిప్లస్ దీర్ఘకాలిక రేటింగ్‌ను ఇస్తున్నట్లు ఎస్అండ్పీ తెలిపింది. -
భారత్ బలహీనతలన్నీ ఇప్పటికే పరిగణలోకి..
న్యూఢిల్లీ: భారత్ బలహీన ఆర్థిక పరిస్థితులన్నీ ప్రస్తుత రేటింగ్స్‌కు అనుగుణంగానే ఉన్నాయని రేటింగ్ దిగ్గజ సంస్థలు స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ), మూడీస్ మంగళవారం పేర్కొన్నాయి. పలు అంశాలు ఇప్పటికే ‘డిస్కౌంటయిన’ నేపథ్యంలో ప్రస్తుత ఔట్‌లుక్‌లలో ఎటువంటి మార్పులూ చేయబోవడం లేదని సైతం స్పష్టం చేశాయి. బీబీబీ కొనసాగింపు: ఎస్ అండ్ పీ భారత్ రేటింగ్స్‌పై నెగిటివ్ ఔట్లుక్- ‘బీబీబీ-’ సావరిన్ క్రెటిగ్ రేటింగ్స్‌ను కొనసాగిస్తున్నట్లు ఎస్అండ్పీ సీనియర్ డెరైక్టర్ (సావరిన్ అండ్ ఇంటర్నేషనల్ పబ్లిక్ ఫైనాన్స్ రేటింగ్స్-ఆసియా,పసిఫిక్) కిమ్ ఇంగ్ టెన్ ఒక ఈ-మెయిల్ ప్రకటనలో పేర్కొన్నారు. క్యాపిటల్ ఔట్‌ఫ్లోస్, రూపాయి తీవ్ర బలహీనత పెట్టుబడుదారు విశ్వాసంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది. క్యాపిటల్ ఔట్‌ఫ్లోస్‌ను నిరోధిస్తూ, ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలు అటు దేశీయంగా ఇటు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లను అయోమయంలో పడేస్తాయని కిమ్ పేర్కొన్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పెట్టుబడులు మరింత క్షీణిస్తాయని విశ్లేషించారు. బీఏఏ3 రేటింగ్: మూడీస్ తమ రేటింగ్ ఔట్లుక్ ‘బీఏఏ3’పై రూపాయి బలహీనత ప్రభావం ఏదీ ఉండబోదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది. రూపాయి బలహీనత, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు, బలహీన వృద్ధి... ప్రస్తుతం తామ సావరిన్ రేటింగ్‌కు ఇప్పటికే ఫ్యాక్టరింగ్ అయిన అంశాలని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వైస్-ప్రెసిడెంట్ అండ్ సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ అత్సీ సేథ్ ఒక పత్రంలో పేర్కొన్నారు. నిర్ణయాలపై భవిష్యత్ స్పందనల ప్రకారం తమ తదుపరి రేటింగ్ పరిశీలన ఆధారపడి ఉంటుందని అన్నారు.