new faces
-
BRS Party: కొత్త ముఖాలు.. కోటి ఆశలు!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితి తరఫున బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్న ఔత్సాహిక నేతలు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆశీస్సుల కోసం ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరికి ఈసారి అవకాశం లభించకపోవచ్చనే వార్తల నేపథ్యంలో పార్టీలో కొత్త ముఖాలు అభ్యర్థిత్వంపై ఆశతో విస్తృతంగా లాబీయింగ్ చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సొంత కేడర్‌ను తయారు చేసుకోవడం వంటి ఏర్పాట్లు కొనసాగిస్తూనే కేసీఆర్ దృష్టిలో పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోశ్‌తో పాటు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతల ద్వారా టికెట్ వేట కొనసాగిస్తున్నారు. దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరితో పాటు సుమారు 40 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌ల చైర్మన్ల వంటి కీలక పదవుల్లో ఉన్న నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరు కాకుండా మరో 30 మంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానికంగా వ్యతిరేకత, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సామాజికవర్గ సమీకరణాలు, ఆర్థిక స్థితిగతులు తదితరాలు.. టికెట్ వేటలో తమకు అనుకూలిస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆశావహులు అధినేత కేసీఆర్ దృష్టిలో పడేందుకు ఇటీవలి మహారాష్ట్ర పర్యటనకు తమ అనుచరులతో సహా తరలివెళ్లారు. సిట్టింగులకు దక్కని స్థానాల్లో.. ప్రస్తుత శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులకు గాను 103 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ పార్టీ టికెట్ దక్కుతుందని కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించినా.. పనితీరు సరిగా లేని వారిని పక్కన పెడతామనే సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుమారు 15 నుంచి 20 మంది సిట్టింగులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కదని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఈ నెలాఖరులో సుమారు 75 శాతం స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై స్పష్టత వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఇతరులను కలుపుకొని సుమారు 20 మందికి టికెట్ ఖరారుపై కేసీఆర్, కేటీఆర్‌లు సంకేతాలు ఇచ్చారు. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పిడికి అవకాశమున్న చోట తమకు అవకాశం ఇవ్వాలని కొత్తగా టికెట్ ఆశిస్తున్న నేతలు కోరుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ గతంలోనే తమకు హామీ ఇచ్చారని కొందరు చెప్తుండగా, మరికొందరు తమ పనితీరు, గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకుని టికెట్ ఇవ్వాలని కేసీఆర్‌ను కోరుతున్నారు. ఆశగా ఎదురుచూపులు కొత్తగా బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న నేతల్లో ప్రధానంగా గడాల శ్రీనివాసరావు (కొత్తగూడెం), మన్నె గోవర్ధన్‌రెడ్డి (ఖైరతాబాద్), మోతె శోభన్‌రెడ్డి (సికింద్రాబాద్), రేణికుంట్ల ప్రవీణ్ (బెల్లంపల్లి), మిట్టపల్లి సురేందర్ (మానకొండూరు), మైనంపల్లి రోహిత్ (మెదక్), చల్లా నారాయణరెడ్డి (మంథని) మరికొందరు ఉన్నారు. మన్నెం రంజిత్ యాదవ్ (నాగార్జునసాగర్), కందుల సంధ్యారాణి (రామగుండం), బొద్దుల లక్ష్మీనర్సయ్య అలియాస్ లక్ష్మణ్ (పెద్దపల్లి), వలిదాస్ జగదీశ్వర్‌గౌడ్ (శేరిలింగంపల్లి), నీలం మధు ముదిరాజ్ (పటాన్చెరు), ఢిల్లీ వసంత్ (జహీరాబాద్) ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకుడు గడాల శ్రీనివాసరావు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో సన్నద్ధతను ప్రారంభించారు. గాయకుడు మిట్టపల్లి సురేందర్ మానకొండూరు నుంచి టికెట్ కోసం ఇప్పటికే కేసీఆర్‌ను కలిసినట్లు సమాచారం. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టికెట్‌ను ఆశించిన మన్నెం రంజిత్ యాదవ్ తనకు అవకాశం దక్కుతుందనే ధీమాతో నియోజకవర్గంలో విçస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో సామాజికవర్గ సమీకరణాలు తమకు అనుకూలిస్తాయని కందుల సంధ్యారాణి (పెఱిక), బొద్దుల లక్ష్మీనర్సయ్య (పద్మశాలి), నీలం మధు (ముదిరాజ్) భావిస్తున్నారు. ఇటీవల పటాన్చెరు పర్యటన సందర్భంగా ప్రగతిభవన్‌కు రావాల్సిందిగా మధుకు కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంటున్న ఢిల్లీ వసంత్ పార్టీలో చేరికకు సంబంధించి షోలాపూర్ పర్యటన సందర్భంగా కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. -
మోదీ 2.oలో కొత్త ముఖాలు వీరేనా!
సాక్షి, న్యూఢిల్లీ : 2019 ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన బీజేపీ అధికార పగ్గాలు చేపట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. అలాగే దాదాపు 62 మందితో భారీస్థాయిలో క్యాబినెట్ ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కొత్త మంత్రివర్గంలో అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పియూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు ప్రమాణం చేయనున్నారు. కాగా ఈ సారి కొత్తవారికి స్థానం కల్పించడం విశేషంగా నిలిచింది. ఈ నేపథ్యంలో మోదీ 2.0 లో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కొత్తవారి జాబితా అరవింద్ సావంత్ అనుప్రియ పాటిల్ రతన్ లాల్ కటారియా రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ఆర్సీపీ సింగ్ జి కిషన్ రెడ్డి సురేష్ అంగడి ఏ రవీంద్రనాథ్ కైలాష్ చౌదరి ప్రహ్లాద్ జోషి సోమ్ ప్రకాష్ రామేశ్వర్ తెలీ సుబ్రత్ పాథక్ దేబశ్రీ చౌదరి రీటా బహుగుణ జోషి -
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ సిద్దం..!
-
అసెంబ్లీకి ఏడు కొత్త ముఖాలు
సాక్షి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఏడుగురు కొత్తగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు, బీజేపీ తరఫున ఒకరు అసెంబ్లీకి తొలిసారి ఎన్నిక తమ నియోజకవర్గాల తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లా నుంచి ఏకైక మహిళ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పామర్రు నుంచి బరిలో దిగిన ఉప్పులేటి కల్పన గెలుపొందారు. ఆమె గతంలో రెండుసార్లు నిడుమోలు, పామర్రు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. మూడోసారి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యపై విజయం సాధించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి పోటీచేసిన ఏకైక మహిళా అభ్యర్థి కల్పన కావడం విశేషం. నాటి సర్పంచ్.. నేడు అసెంబ్లీకి... వైఎస్సార్సీపీ తరఫున తిరువూరు అసెంబ్లీ బరిలో నిలిచిన కొక్కిలిగడ్డ రక్షణనిధి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఆయన వల్లూరుపాలెం సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం పమిడిముక్కల జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. తొలిసారిగా తిరువూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. పెనమలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన బోడె ప్రసాద్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఆయన గతంలో పెనమలూరు సర్పంచ్‌గా పనిచేశారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసిన బొండా ఉమామహేశ్వరరావు కూడా పోటీ చేయడం తొలిసారి. ఎంపీ అభ్యర్థిగా విఫలమై.. ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచి... గన్నవరం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించిన వల్లభనేని వంశీమోహన్ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. 2009లో గన్నవరం నుంచే సీటు ఆశించిన ఆయన దాసరి బాలవర్ధనరావుకు అక్కడ సీటు కేటాయించడంతో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. అక్కడ ఓటమి చవిచూశారు. టీడీపీ తరఫున మచిలీపట్నం నుంచి పోటీ చేసిన కొల్లు రవీంద్ర కూడా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆ పార్టీ నుంచి పోటీచేసిన పోటీచేసిన ఆయన అప్పట్లో ఓటమిచెందారు. లోక్‌సభకు కేశినేని... విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కేశినేని శ్రీనివాస్ (నాని) కూడా ఎన్నికల బరిలో తొలిసారి దిగారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్‌పై గెలుపొంది లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టబోతున్నారు. -
కాంగ్రెస్‌కు కొత్త ముఖాలు
తిరుపతి, రాజంపేట, చిత్తూరు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ చింతామోహన్, సాయిప్రతాప్ల స్థానాలు పదిలం పూతలపట్టు రవికి ఎంపీ స్థానానికి ప్రమోషన్ మదనపల్లె నుంచి షాజహాన్,నగరి నుంచి ఇందిర సాక్షి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి 2 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. లోక్‌సభ స్థానాలు మినహాయి స్తే అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీకి ద్వితీయశ్రేణి నా యకులే దిక్కయ్యారు. తిరుపతి, రాజంపేట నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చింతామోహన్, సాయిప్రతాప్‌లు మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేయనున్నారు. పూతలపట్టు శాసనసభ్యులుగా ఉన్న పి.రవి ఈసారి చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలోకి వచ్చే సరికి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీకాళహస్తి మినహా మిగిలిన అన్ని స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించిన స్థానాల్లో మదనపల్లె నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న షాజహాన్ బాషా మినహా మిగిలిన అందరూ కొత్తముఖాలు కావడం గమనార్హం. రాష్ట్ర విభజన పరిణామంతో కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో అభ్యర్థులు కరువయ్యారు. దీంతో ఆ పార్టీ కొత్త అభ్యర్థులను రంగంలోకి తెస్తోంది. ముఖ్యంగా ఇతర పార్టీల్లోకి వెళ్లలేని నాయకులను ఎంపిక చేసుకున్నట్లు కాంగ్రెస్ ప్రకటించిన జాబితాను చూస్తే స్పష్టమవుతోంది. షాజ హాన్ బాషా తెలుగుదేశం, వైఎస్ఆర్ సీపీల వైపు మొగ్గు చూపినప్పటికీ అక్కడ ఖాళీ లేకపోవడంతో గత్యంతరం లేక కాంగ్రెస్ నుంచే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. చంద్రగిరి నుంచి డీసీసీ అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రెడ్డి, నగరి నుంచి మాజీ మంత్రి ఆర్. చెంగారెడ్డి కుమార్తె వి.ఇందిరాప్రియదర్శిని మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు డాక్టర్ నరసింహులు అభ్యర్థిత్వాన్ని ఖరా రు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కుప్పం నియోజకవర్గం నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు అభ్యర్థి కానున్నారు. పలమనేరు నియోజకవర్గం నుంచి లిక్కర్ వ్యాపారి పార్థసారథికి అవకాశం ఇచ్చారు. సత్యవేడు నుంచి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన పెనుబాల చంద్రశేఖర్‌కు అవకాశం ఇచ్చారు. పుంగనూరు నియోజకవర్గంలో బోయకొండ దేవస్థానం చైర్మన్ వెంకటరమణారెడ్డి పోటీ చేయనున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గం నుంచి ముస్లిం మైనారిటీ కోటాల్లో షానవాజ్ అహ్మద్‌కు అవకాశం కల్పించారు. అయితే ఈయనెవరో తెలియని పరిస్థితి. తంబళ్లపల్లె నుంచి ములకలచెరువు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.ఎన్.చంద్రశేఖర్‌రెడ్డికి టికెట్ కేటాయించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నుంచి రామ్మూర్తి పోటీ చేయనున్నారు. పూతలపట్టు స్థానానికి మాజీ ఎమ్మెల్యే మునస్వామప్ప కుమారుడు అశోక్రాజ్కు అవకాశం ఇచ్చారు. -
కాంగ్రెస్ తెరపై కొత్త ముఖాలు
మార్పులు.. చేర్పులు.. వడపోతలు చివరి నిమిషం వరకు ఆగని యత్నాలు 11 స్థానాల్లో కుదిరిన ఏకాభిప్రాయం కూకట్‌పల్లికి ముద్దం, మల్కాజిగిరికి ఆకుల పేర్లు సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్‌లో ఈసారి కొత్తనీరు పారుతోంది. శాసనసభ అభ్యర్థుల జాబితాలో పలు కొత్త ముఖాలు తెరపైకి వచ్చాయి. శనివారం రాత్రే ప్రకటించాల్సినగ్రేటర్ హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాలకు ప్రతిపాదించిన జాబితాపై గుర్రుగా ఉన్న పలువురు నేతలు మళ్లీ ఢిల్లీ బాటపట్టారు. అక్కడి నుంచి అందిన సమాచారం మేరకు.. తమ అదృష్టాన్ని చివరిసారిగా పరీక్షించుకునేందుకు ఏఐసీసీ కార్యాలయంలో పడిగాపులు కాస్తున్నారు. మరికొందరు ఆదివారం గాంధీభవన్ ఎదుట నిరసనకు దిగారు. అయితే ముందుగా రూపొందించిన జాబితాకు, ప్రస్తుతం సిద్ధమైన జాబితాకు మధ్య భారీ తేడాలున్నట్లు సమాచారం. అంబర్‌పేట నుండి వి.హన్మంతరావు పేరు ఖరారైన ట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయనకు ఇంకా రెండేళ్ల పదవీ కాలం (రాజ్యసభ) ఉండగా, మళ్లీ ఇప్పుటు టికెట్ ఎందుకంటూ ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు మెయిళ్లు, ఫ్యాక్స్‌ల ద్వారా ఆదివారం ఏఐసీసీ కార్యాల యంలో నిరసన తెలిపారు. ఈ నియోకజవర్గం నుండి కార్పొరేటర్ దిడ్డి రాంబాబుతో పాటు మరో ఇద్దరు విద్యాసంస్థల ప్రతినిధుల పేర్లను ఏఐసీసీ పరిశీలించింది. ముషీరాబాద్ నియోకజవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మణెమ్మ తనయుడు శ్రీనివాసరెడ్డి తనకు టికెట్ దాదాపు ఖాయమైందన్న భరోసాతో ఉండగా, ఏఐసీసీ జాబితాలో మాత్రం గత ఎన్నికల్లో ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పి.వినయ్‌కుమార్ పేరు ఉన్నట్లు సమాచారం. వినయ్‌కి కాంగ్రెస్‌లో సభ్యత్వం కూడా లేదని ఆయన ప్రత్యర్థివర్గం ఏఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఇలాంటి పరిస్థితే కంటోన్మెంట్‌లోనూ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్రావు పార్టీ తీరుపై అగ్గిమీద గుగ్గిలం అవుతూ అక్కడి నుండే స్వతంత్య్ర అభ్యర్థిగా రంగంలోకి దిగే ఏర్పాట్లు చేస్తున్నారు మల్కాజిగిరిలో మళ్లీ రాజేందర్! మల్కాజిగిరి శాసనసభకు ఏఐసీసీ రూపొందించిన జాబితాలో విచిత్రంగా ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పేరు కనిపిస్తోందని సమాచారం. ఇటీవలే రాజేందర్ టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. అయితే తనకు టికెట్ఇస్తే మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధమేనని రాజేందర్ ఏఐసీసీకి సందేశం ఇవ్వటంతో ఆయన అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదే నియోజకవర్గం నుంచి ఆదం సంతోష్‌కుమార్, నందికంటి శ్రీధర్ సైతం టికెట్ తమకు ఖాయమైపోయిందన్న ధీమాలో ఉన్నారు. కూకట్పల్లి శాసనసభ స్థానానికి నిర్మాత ఆది శేషగిరిరావు పేరు దాదాపుగా ఖరాైరె న అనంతరం, అనూహ్యంగా కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ ముందుకొచ్చారు. ఏకాభిప్రాయం ఉన్న స్థానాలివే.. ఖైరతాబాద్- దానం నాగేందర్ గోషామహల్ -ముఖేష్‌గౌడ్ నాంపల్లి- వినోద్ కార్వాన్- రూప్సింగ్ సికింద్రాబాద్ -జయసుధ సనత్‌నగర్- మర్రి శశిధర్‌రెడ్డి జూబ్లీహిల్స్- విష్ణువర్ధన్‌రెడ్డి ఉప్పల్ - బండారి లక్ష్మారెడ్డి ఎల్బీనగర్- సుధీర్‌రెడ్డి కుత్బుల్లాపూర్ -కూన శ్రీశైలంగౌడ్ శేరిలింగంపల్లి-భిక్షపతియాదవ్ -
కైకలూరు టీడీపీలో ముదురుతున్న ముసలం
టిక్కెట్ల కలకలం ఇంటి సమస్యలే జయమంగళను దూరం చేస్తున్నాయా? తెరపైకి కొత్త ముఖాలు వ్యతిరేకిస్తున్న మాగంటి, జయమంగళ అనుచరగణం కైకలూరు, న్యూస్‌లైన్ : కైకలూరు తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల కలకలం మొదలైంది. ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు పార్టీలో చేరతారని వస్తున్న ఊహాగానాలపై లోక్‌సభ సీటు ఆశిస్తున్న మాగంటి బాబు వర్గం కారాలు మిరియాలు నూరిన విషయం విదితమే. తాజాగా జిల్లాలోని తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కైకలూరు మినహా మిగతావి యథాతథంగా పోటీలో ఉండే అవకాశం ఉందని ఓ పత్రికలో (సాక్షి కాదు) వచ్చిన కథనం కైకలూరు నియోజకవర్గ పార్టీ వర్గాల్లో శుక్రవారం కలకలం రేపింది. నియోజకవర్గంలో అన్ని మండలాల నాయకులు ఈ అంశంపై స్థానిక మాగంటి బాబు నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి నిప్పులు చెరిగారు. టీడీపీ, బీజేపీ పొత్తుల్లో భాగంగా ఇప్పటికే బీజేపీలో చేరిన యెర్నేని సీతాదేవికి కైకలూరు సీటు కేటాయిస్తే కచ్చితంగా వ్యతిరేకిస్తామని కార్యకర్తలు కుండబద్దలు కొట్టినట్టు చె ప్పారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే జయమంగళ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడం, కార్యకర్తల్లో విభేదాలపై అధిష్టానం ఈ సారి సీటు కేటాయింపులో ఆచితూచి వ్యవహరిస్తుందనే అనుమానం కార్యకర్తల్లో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున అవకాశం దొరికితే పోటీ చేయడానికి మరో ఇద్దరు నేతలు కాచుకు కూర్చున్నారు. సీటివ్వకపోతే వ్యతిరేకిస్తాం... పత్రిక కథనంతో కంగుతున్న నాయకులు జయమంగళకు సీటు కేటాయించకపోతే వ్యతిరేకిస్తామని శుక్రవారం టీడీపీ ఏలూరు లోక్‌సభ పరిశీలకుడు గరికపాటి రామ్మోహనరావుకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసేదిలేక పత్రిక కథనాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని నచ్చచెప్పి పంపించినట్లు సమాచారం. ఈ విషయంపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకట్రామయ్య, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు పెన్మెత్స త్రినాథరాజు, వల్లభనేని శ్రీనివాస చౌదరి, కొత్తూరు విఠల్, రేమల్లి విజయబాబు, నాయకులు సమావేశంలో మాట్లాడుతూ మాగంటి, జయమంగళకు మాత్రమే తమ మద్దతు ఉంటుందని తేల్చిచెప్పారు. -
3డి ప్రింటింగ్ ఫేసు
లండన్: రోడ్డుప్రమాదంలో తీవ్రం గాయాలపాలైన వ్యక్తికి ఇంగ్లాండ్‌కు చెందిన వైద్యులు 3డి ప్రింటింగ్ టెక్నాలజీతో కొత్త ముఖాన్ని అమర్చారు. వైద్యశాస్త్ర చరిత్రలో ఒక వ్యక్తికి 3డి టెక్నాలజీ ద్వారా కొత్త ముఖాన్ని అమర్చడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్‌కు చెందిన స్టెఫెన్ పవర్(29) గతేడాది రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో అతడి ముఖం తీవ్రంగా దెబ్బతింది. దవడ ఎముకలు పూర్తిగా విరగడంతో నాలుగు నెలలుగా ఆసుపత్రిలోనే చికిత్సపొందుతున్నాడు. ఈ నేపథ్యంలో మెరిస్టన్ ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం స్టెఫెన్ ముఖానికి ఎనిమిది గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి, విజయవంతంగా అతడి పూర్వపు రూపాన్ని తీసుకొచ్చారు. అయితే శస్త్రచికిత్సకు ముందు వైద్యుల బృందం స్టెఫెన్ తొలిరూపాన్ని సి.టి. స్కాన్ తీసి, 3డి మోడల్ ముఖాన్ని తయారు చేసింది. తర్వాత దాన్ని ప్రింట్ తీసి సర్జరీతో స్టెఫెన్కు తొలిరూపం వచ్చేలా చేసింది. టైటానియంతో తయారైన ఈ 3డి ప్రింటింగ్ మోడల్‌ను బెల్జియం నుంచి తెప్పించినట్లు డాక్టర్లు తెలిపారు. -
రెండు కార్పొరేషన్లలో మహిళల రాజ్యం
తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్ మేయర్ మహిళలకు తిరుపతి జనరల్ మహిళ, చిత్తూరు బీసీ మహిళ జిల్లా రాజకీయాల్లోకి కొత్త ముఖాలు తిరుపతి రేసులో డాక్టర్లు సాక్షి, చిత్తూరు: జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో రాజకీయ ముఖ చిత్రం మారనుంది. ఇక మహిళలు స్థానిక సంస్థల పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. రాజకీయ పార్టీ ఏదైనా అంతి మంగా మహిళలే మేయర్లుగా రాజ్యమేలనున్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం రిజర్వేషన్లు ప్రకటించింది. ఈ రిజర్వేషన్లలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు జనరల్ మహిళ, చిత్తూ రు కార్పొరేషన్ బీసీ మహిళకు రిజర్వేషన్ అయింది. ఈ క్రమంలో జిల్లా రాజ కీయాల్లోకి కొత్త ముఖాలు అరంగేట్రం చేయనున్నాయి. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు ఆశావహుల సంఖ్య కూడా భారీగానే ఉండనుంది. డివిజన్లు, వార్డుల్లోనూ సగం మహిళల కు రిజర్వేషన్లు ఉండడంతో మహిళల భాగస్వామ్యం మున్సిపల్ పాలనలో పెరగనుంది. తిరుపతి బరిలోకి డాక్టర్లు.. తిరుపతిలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీల తరఫున కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా అవకాశం వస్తే రంగంలోకి దిగాలని కొందరు మహిళా డాక్టర్లు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. రెండు సంవత్సరాలుగా ఓసీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు, ముగ్గురు మహిళా డాక్టర్లు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ, ఉద్యమాల్లోనూ చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు. ప్రజలకు, మీడియాకు సుపరిచితులుగా ఉన్నారు. వీరిలో ఎవరినైనా ప్రధాన రాజకీయ పార్టీలు మేయర్ అభ్యర్థులుగా పరిగణ నలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. దీంతో తిరుపతి రాజకీయ చిత్రపటం పైకి కొత్త ముఖాలు రానున్నాయి. చిత్తూరులో రాజకీయ నాయకుల భార్యలు చిత్తూరు కార్పొరేషన్ మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో రాజకీయం మారనుంది. ఇప్పటివరకు పురుషులే చైర్మన్లుగా ఉంటూ వచ్చిన ఈ మున్సిపాల్టీకి గతంలో ఎమ్మెల్యే సీకే బాబు సతీమణి సీకే లావణ్య పోటీచేసి స్వల్పతేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్, టీడీపీలో ప్రముఖ నాయకులందరూ ఓసీకి చెందినవారు కావడంతో బీసీకి చెందిన నాయకులు భార్యలను రంగంలోకి దింపాల్సి ఉం టుంది. ఈ క్రమంలో ఏ పార్టీలో చేరనప్పటికీ బీసీ సంక్షేమ సంఘం తరఫున చురుకుగా వ్యవహరిస్తున్న ఒక నాయకుడు తన భార్యను మేయర్ అభ్యర్థిగా రంగంలోకిదింపే అవకాశాలులేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. -
కొత్త మెరుపులు