the new government
-
కార్మికుల జీవితాలు ‘పేపర్’ ముక్కలేనా..!
మూతబడే దిశగా ఎస్పీఎం దయనీయ స్థితిలో ఎస్పీఎం కార్మికులు మూగబోనున్న కాగజ్నగరం తెలంగాణ ప్రభుత్వంపైనే ఆశలు కాగజ్‌నగర్ టౌన్ : పేపర్ ఫ్యాక్టరీనే నమ్ముకుని జీవిస్తున్న ఆ కార్మికుల పరిస్థితి పేపర్ ముక్కలాగే కానుందా..? కాగజ్‌నగర్‌లోని పేపర్ మిల్లు నడిపించడం కష్టమేనా..? మరి దానిపైనే ఆధారపడ్డ కార్మిక కుటుంబాల పరిస్థితి ఏంటీ..? కొత్త రాష్ట్రం.. కొత్త ప్రభుత్వమే ఆదుకుంటుందనే ధీమాతో ఎదురుచూస్తున్న ఆ కార్మికులకు భరోసా కల్పించే వారెవరు..? పాలకులూ స్పందించండి మీరే..! కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం) నిజాం నవాబు కాలంలో 1936 లో ఏర్పాటైంది. 1942లో ఈ ఫ్యాక్టరీలో పే పర్ ఉత్పత్తి ప్రారంభమైంది. దశాబ్దాలుగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ వస్తున్న ఈ పేపర్ మిల్లు 2010 నుంచి నష్టాల బారిన పడింది. అప్పటి నుంచి యాజమాన్యం ప్ర క్షాళన మొదలుపెట్టింది. ఈ మిల్లుపై ప్రత్యక్షంగా.. పరోక్షంగా వేలాది కుటుంబాలు ఆధారపడి బతుకుబండి లాగిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుతం మిల్లులో పేపర్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఆ కార్మికుల కుటుంబాలు దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94 రోజులుగా మిల్లులో పేపర్ ఉత్పత్తి నిలిచిపోయింది. మూడు నెలలుగా మిల్లులోని యంత్రాలు మూగబోయాయి. తక్కువగానే వేతనాలు.. యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేయడానికి గల కారణాలను, తాజా పరిణామాలపై ఎటువంటి బహిరంగ ప్రకటన చేయకపోవడంతో కార్మికుల్లో రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. మిల్లు ఉన్నతాధికారులు కూ డా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసి వెళ్తున్నట్లుగా సమాచారం. మిల్లు నిర్వహణ చీఫ్ గా వ్యవహరిస్తున్న ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కూ డా సెలవు పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. అసలే చాలీచాలని జీతాలు, ఆపై పెరుగుపోతున్న నిత్యావసర సరకుల ధరలు కార్మిక లోకానికి పెద్ద కష్టాలు తెచ్చిపెట్టగా, మరో వైపు తాజా గా మిల్లు మూతబడే స్థాయికి చేరడంతో ఏం చేయాలో కార్మికులకు తోచడం లేదు. ఇతర కాగిత పరిశ్రమలతో పోలిస్తే, స్థానిక మిల్లులో అతి తక్కువ వేతనాలతోనే కార్మికులు సేవలందించారు. ఆశించిన స్థాయిలో పేపర్ ఉత్పత్తి చేసి ఆదర్శంగా నిలిచారు. అయినా యాజమాన్యం ఉత్పత్తిని ఎందుకు నిలిపివేసిందో అనే అంశంపై జవాబు లేకుండాపోయింది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఉత్పత్తిని నిలిపివేసిన యాజమాన్యం కార్మికులకు 2 నెలల జీతాలు చెల్లించి, నవంబర్ నెల వేతనాన్ని ఇప్పటివరకు ఇవ్వలేదు. నిర్మానుష్యంగా మిల్లు.. ఎప్పటికీ కార్మికులతో కళకళలాడే మిల్లు లోపలి భాగం ప్రస్తుతం వెలవెలబోతోంది. యంత్రాలు మూగబోయాయి. ప్రతి రోజూ వందలాది సంఖ్యలో కర్ర, ఇతర ముడిసరుకులు తీసుకొచ్చే వాహనాలు పత్తా లేకుండాపోయాయి. మిల్లు ప్రాంతంలోని చిన్నచిన్న వ్యాపారులకూ ఉపాధి లేకుండాపోయింది. 1600 మంది కాంట్రాక్టు కార్మికులు మంచిర్యాల, కరీంనగర్, బల్లార్షా, చంద్రాపూర్ వంటి నగరాలకు వెళ్లి కూలీనాలీ చేసుకుంటున్నారు. కాగా, మిల్లును ఎలాగైనా తెరిపించాలనే సంకల్పంతో కార్మిక సంఘాల నాయకులు ఏకతాటిపైకొచ్చి ఉద్యమ బాట పట్టారు. ఐక్యకార్యాచరణ సమితిగా ఏర్పడి మిల్లు ఎదుట ధర్నాలు చేపడుతున్నారు. భారీ ర్యాలీలు నిర్వహిస్తూ, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాలను తలపిస్తూ, కార్మికులతోపాటు అన్ని సంఘాల నాయకులు, ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, వ్యాపారులు, వైద్యులు ఇలా ప్రతి ఒక్కరూ ఆందోళనల్లో భాగస్వాములవుతున్నారు. కొత్త ప్రభుత్వంపైనే ఆశలు.. కొత్త రాష్ట్రం.. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో సీఎం కె.చంద్రశేఖర్రావుపైనే ఇక్కడి వాసులు ఆశుల పెట్టుకున్నారు. డిసెంబర్ 25న సీఎం జైపూర్ పర్యటనకు వచ్చినా మిల్లుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కార్మికులు నిరాశకు గురయ్యారు. స్థానిక పాలకులు స్పందించి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. మిల్లు నడిపించేలా బాధ్యత తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. -
అప్పుల్లో గూడు!
ఆరు నెలలుగా పైసా చెల్లించని టీడీపీ ప్రభుత్వం ఇంటికి లక్షన్నర దేవుడెరుగు.. కట్టుకొన్న ఇళ్లకు బిల్లులెప్పుడో వడ్డీలకు తెచ్చి ఇళ్లు నిర్మించుకొంటున్న లబ్ధిదారులు మార్చినాటికి బకాయిరూ.16.53 కోట్లు బి.కొత్తకోట: పేదల గూడు అప్పుల్లో కూరుకుపోతోంది. కొత్త ప్రభుత్వంపై పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇంటికి లక్షన్నర ఇస్తామని హామీఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేదల నడ్డి విరుస్తున్నారు. వారిని మరింత అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు ఆరు నెలలైనా ఒక్కపైసా చెల్లించకపోవడంతో లబోదిబోమంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 23తో ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.16.53 కోట్ల చెల్లింపులు ఆగాయి. నమోదు కాని నిర్మాణాలు మార్చి నెలాఖరుతోనే జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణాల నమోదు ఆగిపోయింది. మండల స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అధికారులు నిర్మాణాలను వదిలేశారు. జిల్లాలోని పేదలకు 4,43,009 గృహాలను మంజూరు చేశారు. వీటిలో 2,95,134 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. 31,900 పునాదుల స్థాయి, 2,130 గోడల స్థాయి, 13,170 రూఫ్లెవల్లో ఉన్నాయి. 1,00671 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టనేలేదని తేల్చారు. మే 24 వరకు జిల్లాలో ఇళ్ల నిర్మాణాలకు రూ.1,236.2కోట్లను ఖర్చు చేశారు. అప్పటి నుంచి రికార్డు పరంగా ఈ లెక్కలో మార్పులేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో నిర్మాణాలను నమోదు చేయడం మానేశారు. బకాయిలు రూ.60 కోట్లు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సుమారు రూ.60కోట్ల బకాయిలు చెల్లించాల్సి వస్తుందని అంచనా. వివిధ దశల్లోని నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. లబ్ధిదారులు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకొస్తున్నారు. మార్చి నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించడం ప్రారంభిస్తే రూ.60 కోట్ల వరకు ఇవ్వాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఇదిగాక మార్చిలోపున్న బకాయిలు కలుపుకుంటే రూ.75 కోట్లకుపైనే చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. లక్షన్నర ఎప్పుడో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటికి రూ.లక్షన్నర ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో కనీసం కట్టుకుంటున్న ఇళ్లకైనా బిల్లులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి ఎస్టీలకు రూ.1.05 లక్షలు, ఎస్సీలకు రూ.లక్ష, బీసీ, ఓసీలకు రూ.70వేలు ఇస్తున్నారు. వడ్డీలకు తెచ్చి కడుతున్నాం నా భార్య నాగరత్నమ్మకు ఇందిరమ్మ గృహం మం జూరైంది. పునాది దశలో రూ.14 వేలు, గోడల దశలో 34 వేల బిల్లులు చెల్లించారు. ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా పైకప్పుకు మోల్డింగ్ వేస్తేనే బిల్లులు వస్తాయి లేకుంటే రావని అధికారులు చెప్పడంతో రూ.20 వేలు అప్పుతెచ్చి పైకప్పు నిర్మాణం పూర్తి చేశాం. ఇంతవరకు బిల్లులు చేతికందలేదు. -డీ.వెంకట్రమణ, పెద్దతిప్పసముద్రం అప్పులెలా తీర్చాలి ఇందిరమ్మ పథకంలో ఇల్లిచ్చారు. బిల్లులివ్వకుంటే చేసిన ఎలా కట్టుకోవాలి. గతంలో రెండు దఫాలుగా రూ.39 వేలు ఇచ్చారు. సుమారు లక్ష మేరకు అప్పుచేశాం. మిగిలిన బిల్లు కోసం అధికారులను అడిగితే ఎవరూ సమాధానం ఇవ్వరు. ఇంటి పనులు ఆపేశాం, అప్పులు మిగిలిపోయాయి. -బి.వల్లెమ్మ, పెద్దకొండామర్రి మోల్డింగ్ పనులతో ఆపేశాం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని ఆనందమేసింది. పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయండి బిల్లులు ఇస్తామని అధికారులు చెప్పారు. పూర్తిచేసినా ఇప్పటివరకూ రూ.16 వేలు ఇచ్చారు. మిగిలిన బిల్లు ఇస్తే పనులు పూర్తి చేస్తామని అధికారులకు తెలిపినా పట్టించుకునేవారు లేరు. -టీ.అలివేలమ్మ, పెద్దకొండమర్రి పట్టించుకునేదెవరు ఇందిరమ్మ ఇంటికి పునాది, గోడల దశ వరకు మాత్రమే బిల్లులిచ్చారు. మూడు నెలల క్రితం ఇంటి పైకప్పు కోసం రూ.30 వేలు అప్పుచేసి నిర్మాణం పూర్తి చేయించాం. ఇంతవరకు బిల్లు మంజూరు చేయలేదు. నిర్మాణం పూర్తిచేస్తే బిల్లులు తొందరగా మంజూరు చేస్తామని చెప్పిన అధికారులు పత్తాలేరు. అప్పులకు వడ్డీలు కడుతున్నాం. -కే. రెడ్డెమ్మ, పెద్దతిప్పసముద్రం -
ఆమెకు రక్షణ
ఖమ్మం క్రైం : మహిళా భద్రతకు భరోసా ఇచ్చేలా నూతన ప్రభుత్వం ముందుకు కదిలింది. ఇటీవల జరుగుతున్న సంఘటనలు మహిళలను ఆందోళనకు గురిచేస్తుండడంతో ప్రభుత్వం వారి భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మహిళా రక్షణపై సీనియర్ ఐఏఎస్, ఏపీఎస్ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక అందజేశారు. ఈ నివేదికలో సూచనల ఆధారంగా ప్రభుత్వం జిల్లా స్థాయిలో మహిళల భద్రతపై తీసుకునే చర్యలకు సంబంధించి కసరత్తు చేస్తోంది. ప్రతి సబ్ డివిజన్లో మహిళాపోలీస్ స్టేషన్.. ప్రస్తుతం ఒక్క జిల్లా కేంద్రంలో మాత్రమే మహిళా పోలీస్‌స్టేషన్ ఉంది. దీంతో దూర ప్రాంతాల మహిళలు ఇంతదూరం వచ్చి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. అయితే ప్రతి సబ్‌డివిజన్‌లో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మహిళ రక్షణ కమిటీ సూచించటంతో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించారు. జిల్లాలో ఏడు సబ్ డివిజన్లు ఉండగా ఖమ్మం సబ్ డివిజన్లో భాగంగా జిల్లా కేంద్రంలో మాత్రమే మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. ఇప్పుడు మిగతా ఆరు డివిజన్లతో పాటు ఖమ్మం సబ్ డివిజన్లో మరో స్టేషన్ ఏర్పాటుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో మహిళారక్షక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు.. మహిళలపై జరుగుతున్న దాడులతోపాటు అఘూయిత్యాలను యుద్ధ ప్రాతిపదికన ఆరికట్టడానికి ఢిల్లీ పోలీసుల తరహాలో మహిళారక్షక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతి లభించిన తర్వాత మహిళా రక్షక్ విధివిధానాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. మహిళలు, యువతుల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి.. మహిళలు, యువతుల అక్రమ రవాణాపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇల్లెందు, ఖమ్మం, కొత్తగూడెం సబ్ డివిజన్లలోని పలు తండాల్లో కొంతకాలంగా మహిళలు, యువతులను అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిసింది. మహిళా రక్షణ కమిటీ సూచనలతో దీన్ని అరికట్టేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మహిళల వేధించిన ఎన్ఆర్ఐలనూ వదిలేది లేదు.. వరకట్న వేధింపులతోపాటు, మహిళల పట్ల ఇతర నేరాలకు పాల్పడి విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలను స్వదేశానికి రప్పించాలనే కమిటీ సూచనలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. అలాంటి ఎన్ఆర్ఐల జాబితా సిద్ధం చేయాటానికి సమాయత్తమవుతున్నారు. విద్యా సంస్థల్లో ప్రత్యేక శిబిరాలు.. మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే కమిటీ సూచన మేరకు జిల్లా పోలీసులు విద్యాసంస్థలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించగానే దీనిని ఆచరణలో పెట్టాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడితే అత్యంత కఠినంగా, నేరగాళ్లకు భయం పుట్టేలా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పటంతో పాటు పోలీస్‌శాఖకు సైతం ఆదేశాలు అందాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారెవరైనా ఉపేక్షించేది లేదని అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు. కేసు నమోదైన ఒక్క రోజులోనే వారిపై చర్యలు తీసుకోవటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తమ భద్రతకు ప్రభుత్వం సంరక్షణ చర్యలు తీసుకుంటుండడంతో పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు భద్రత అవసరం .. - బత్తిన సాయిశ్రీ, వైరా డీఎస్పీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయడం హర్షనీయం. మహిళలు నిర్భయంగా జరిగిన అన్యాయాన్ని తెలియజేసినప్పుడే చట్టాలు వారికి రక్షణగా నిలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మహిళా భద్రతపై కమిటీ, మహిళలకు వారి వారి స్థానాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు ఎంతో ఉపయోగపడుతాయి. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చి ఇంటి నుంచే మంచి నడువడిక అలవడేలా చూడాలి. సమాజం కూడా మహిళలకు రక్షణగా ఉంటే చట్టాలకు మరింత మద్దతు లభించినట్లు అవుతుంది. -
ఇక ఎన్టీఆర్ కూపన్లు
నరసన్నపేట రూరల్ : కొత్త ప్రభుత్వం కొలవుదీరింది ఇంకేముంది ఇప్పటి వరకు అందని రేషన్ కార్డులు అందేస్తారుులే అని ఎదురు చూసిన లబ్దిదారులకు నిరాశే ఎదురవుతోంది. పాత ప్రభుత్వ విధానంలోనే కొత్తగా ఎన్టీఆర్ ప్రజాపంపిణీ పేరుతో కూపన్లు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. పథకం పేరు మార్చి ఆరు నెలలకు సరిపడా కొత్త కూపన్లు అందిస్తుడడంతో లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రచ్చబండ వన్‌లో కూపన్లు అందించిన వారికి ఇప్పటి వరకు కొత్త కార్డులు జారీ కాలేదు. కుటుంబ సభ్యుల గ్రూపు ఫొటో, ఆధార్ కార్డులతో డిక్లరేషన్ సమర్పించినప్పటికీ హైదరాబాద్ నుంచి కార్డుల ప్రింటింగ్ కాలేదని చెబుతూ వీరికి కార్డులు అందించలేదు. ఈ విధంగానే నరసన్నపేట నియోజకవర్గంలో 3 వేల మంది వరకూ లబ్దిదారులు ఉన్నారు.కొత్తగా కార్డుల కోసం మరో 6 వేల దరఖాస్తులు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి పనికి రేషన్ కార్డు జిరాక్స్ తప్పనిసరి కావడంతో కొత్త కార్డులు అందించాల్సిందే అంటూ లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే బియ్యం, ఇతర నిత్యవసర సరుకులు ఇస్తున్నాం కదా కార్డు కోసం అంత తొందర ఎందుకు అని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. కార్డుల్లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని లబ్దిదారులు వాపోతున్నారు. కాగా గత నెలలో నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో 3 వేల మంది లబ్దిదారులకు కూపన్లు అందించారు. డిసెంబర్ వరకూ సరిపడా కూపన్లు లబ్దిదారులకు మంజూరు చేశారు. ఆగష్టు నుంచి ఈ కూపన్లు వినియోగంలోకి వచ్చాయి. కాగా రచ్చబండ -3లో వచ్చిన దరఖాస్తులు పరిశీలన అనంతరం కార్డులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ దశలో మళ్లీ కూపన్లు మాత్రమే సరఫరా చేయడంతో లబ్దిదారులు నిరశన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందంచి కూపన్లు స్థానంలో కార్డులు మంజూరు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం: స్వామిగౌడ్
సాక్షి,సిటీబ్యూరో: కొత్త ప్రభుత్వంలో అందరం ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని తెలంగాణ శాసనమండలి అధ్యక్షుడు స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. రవీంద్రభారతిలో శుక్రవారం సత్కళా భారతి హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘జయ జయహే తెలంగాణ’ సంగీత నత్యరూపకం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జయజయహే నృత్యరూపకాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని సూచించారు. 60 ఏళ్ల తెలంగాణ పోరాట ఘట్టాలను ఒక గంటలో చూపించడం మహాద్భుతమన్నారు. నృత్య రూపకానికి దర్శకత్వం వహించిన డాక్టర్ కోట్ల హనుమంతరావు, సంగీతం సమకూర్చిన డీఎస్వీ శాస్త్రి, రచన చేసిన డాక్టర్ వడ్డేపల్లి కష్ణలు అభినందనీయులన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణ మాట్లాడుతూ నృత్యరూపక కళాకారులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ స్వీయ రాజకీయ చిత్తం కోసం పోరాడి...చివరికి సాధించుకున్నదని చెప్పారు. రాజకీయాలు మాట్లాడేవారు తెలంగాణ పోరాటం విముక్తి కోసం జరిగిన పోరాటంగా గుర్తించడం లేదన్నారు. గురుకుల భూములను ప్రభుత్వం తీసుకోవాలనుకుంటోందన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ జయ జయహే తెలంగాణ నృత్యరూపకం, తెలంగాణ జనపద గేయాలు భేషుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. అనంతరం నృత్య రూపకంలో పాల్గొన్న కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్కళా భారతి అధ్యక్షుడు జి.సత్యనారాయణ, ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ ఘట్టాలను గుర్తుచేసిన రూపకం జయ జయహే తెలంగాణ సంగీత నృత్య రూపకం 60 ఏళ్ల తెలంగాణ పోరాటంలోని కీలక ఘట్టాలను ఒక గంటలో కళ్ల ముందుంచింది. దీన్ని తిలకించేందుకు వచ్చిన ప్రజలు, నేతలు ఉత్కంఠగా సన్నివేశాలను తిలకించారు. రవీంద్రభారతి ప్రాంగణంలో ఉన్న యావన్మంది రూపకాన్ని రచించిన డాక్టర్ వడ్డేపల్లి కష్ణ, దర్శకత్వం వ హించిన డాక్టర్ అనితారావు, డాక్టర్ కోట్ల హనుమంతరావు, సంగీతం సమకూర్చిన డీఎస్వీ శాస్త్రిలను ప్రశంసించారు. -
కొత్త ప్రభుత్వం పాత పథకాలకు మంగళం..
కందుకూరు: కొత్త ప్రభుత్వం రావడంతోనే పాత పథకాలకు మంగళం పాడుతోంది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతుండగా..ప్రస్తుతం మరో భారీ పథకానికి ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లభించడం లేదు. వర్షపు నీటి ముంపు నుంచి కందుకూరు మున్సిపాలిటీని కాపాడే లక్ష్యంతో రూ.100 కోట్ల అంచనాలతో రూపొందించిన భారీ పథకానికి ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బ తగిలింది. = గుంటూరు నగర కార్పొరేషన్ అంత స్థాయిలో కందుకూరు మున్సిపాలిటీ విస్తీర్ణం కలిగి ఉంది. దాదాపు 61 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మున్సిపాలిటీ సొంతం. 50 వరకు కాలనీలున్నాయి. వీటిలో శివారు ప్రాంతాల కాలనీలన్నీ ఇప్పటికీ సరైన మౌలిక వసతులకు నోచుకోక కునారిల్లుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ కాలనీల్లో పరిస్థితులు మాత్రం మారడం లేదు. పైగా ఎక్కడికక్కడ ఆక్రమించి కట్టుకున్న గృహాలు కావడంతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్‌కి విరుద్ధంగా ఇష్టారీతిన ఇళ్లు వెలిశాయి. = మున్సిపాలిటీలో ఇప్పటి వరకు కేవలం రెండే రెండు కాలనీలకు మున్సిపల్ అనుమతులున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీటిలో వాసవీనగర్. ఐఎస్రావ్ నగర్‌లకు మాత్రమే అనుమతులున్నాయి. = మిగిలిన కాలనీల్లో ఏ ఒక్కదానికి కూడా మున్సిపల్ అనుమతులు లేవు. దీంతో ఈ కాలనీలో ఇష్టారీతిన రోడ్లు, కుంటలు ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇక్కడే అసలు సమస్య తలె త్తుతోంది. కొద్దిపాటి వర్షం కురిసినా దాదాపు 70 శాతం పట్టణంలో నీరు నిలుస్తుంది. ఏ కాలనీలో చూసినా మోకాలు లోతు నీళ్లు పారుతుంటాయి. ప్రతి ఇంటిలోకి నీరు వచ్చి చేరుతుంది. = ఇక లోతట్టు ప్రాంతాలైన జనార్ధనకాలనీ, ఉప్పుచెరువు, లంబాడిడొంక, శ్రీరామ్‌నగర్, ఏకలవ్యనగర్, శ్రీనగర్‌కాలనీ తదితర ప్రాంతాల్లో అయితే వర్షపు నీరు తగ్గే వరకు ఇల్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందే. = ఉప్పుచెరువులో నీటి ఉధృతికి రెండు, మూడు రోజుల పాటు ఇళ్లలోకి పోయే అవకాశం ఉండదు. పట్టణ ం నడిబొడ్డున ఉన్న కాలనీల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంటోంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఏ వైపూ వర్షపు నీరు పోయే అవకాశం లేకపోవడంతో వర్షపు నీరు మొత్తం పొంగి ఇళ్లలోకి వచ్చి చేరుతుంటుంది. శాశ్వత పరిష్కారం కోసం భారీ ప్రణాళిక = వర్షపు నీటి ముంపు నుంచి పట్టణాన్ని శాశ్వతంగా రక్షించేందుకు మున్సిపల్ అధికారులు గతంలో భారీ ప్రణాళికను రూపొందించారు. దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. = దీని ప్రకారం మున్సిపాలిటీలోని భారీ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించి వర్షపు నీటిని మళ్లించాలనేది ప్రణాళిక. = పట్టణం మొత్తం మీద 60 కిలోమీటర్ల మేర ఈ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాల్సి ఉంది. ప్రధాన కాలనీలతో పాటు, లోతట్టు ప్రాంతాలను కలుపుతూ భారీ డ్రైనేజీ వ్యవస్థను చేపట్టి పట్టణంలో నుంచి వచ్చే వర్షపు నీటి ఇటు ఓవీ రోడ్డు వైపు ఉన్న వాగులోకి, అలాగే కొండముడుసుపాలెం వద్ద ఉన్న ఎర్రవాగులోకి మళ్లించే విధంగా రూపకల్పన చేశారు. = గతంలో మున్సిపల్‌శాఖ మంత్రిగా నియోజకవర్గం నుంచి మహీధర్‌రెడ్డి ఉండడంతో దాదాపు నిధులు విడుదలైనట్టేనని అంతా భావించారు. ఎన్నికలకు ముందే నిధులు విడుదలవుతాయని ప్రచారం సాగింది. అధికారులు కూడా అదే ఆశతో ఉన్నారు. అయితే అప్పట్లో బ్రేక్ పడ్డ ఈ పథకం ప్రస్తుతం ముందుకు కదిలే పరిస్థితి కానరావడం లేదు. = ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లేకపోవడమే ఇందుకు కారణం. ఈ పథకానికి సంబంధించి ఫైల్ పూర్తిగా రద్దు చేసినట్లు సమాచారం. రూ.100 కోట్లు విలువ చేసే ఈ పథకానికి ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఫైల్‌ను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పట్టణ వాసుల వర్షపు నీటి ముంపు సమస్యకు ఇప్పట్లో పరిష్కారం లేనట్లే. -
తరాలు మారినామారని తలరాత
మడికట్టు (చేవెళ్లరూరల్): తరాలు మారినా.. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. ఎంతమంది పాలకులు వచ్చినా ఆ గ్రామస్తుల తలరాత మాత్రం మారడం లేదు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమ రాత మారేనా అని ఎదురు చూస్తున్నారు. మండలంలోని తంగడపల్లికి మడికట్టు అనుబంధ గ్రామంగా ఉంది. ఇక్కడి జనాభా దాదాపు 500కుపైనే. 350 మంది ఓటర్లున్నారు. ఏళ్లతరబడి గ్రామంలో సమస్యలు తిష్టవేసుకొని ఉన్నాయి. ఎన్నికల సమయంలోనో, ఏదైనా ప్రారంభోత్సవాల సందర్భంలో మాత్రమే నాయకులు, అధికారులు దర్శనమిస్తారని.. స్థానిక సమస్యల గురించి పట్టించుకునేవారే లేరని గ్రామస్తులు వాపోతున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రధాన సమస్యలివీ.. గ్రామం మొత్తానికి ఒకేఒక బోరు మోటార్ ఉంది. దీంతోనే గ్రామానికి నీటి సరఫరా అవుతోంది. సింగిల్ ఫేజ్ మోటార్లు ఉన్నప్పటికీ నీళ్లు లేక పనిచేయటం లేదు. గ్రామానికి ఏడాది క్రితం బీటీ రోడ్డు వేశారు. ఆరునెలలు తిరక్కుండానే అది గుంతలమయంగా మారింది. వర్షం పడితే గుంతల్లో నీళ్లు నిలిచి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. గ్రామానికి వచ్చే ఒకేఒక బస్‌కు సైతం అంతరాయం తప్పడం లేదు. గుంతలను చూసి డ్రైవర్లు ఈ ఊరికి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. గ్రామంలో ఇళ్లను తాకే ఎత్తులో విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. గ్రామానికి విద్యుత్‌ను సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ వద్ద ఆన్ ఆఫ్ లేక సింగిల్‌ఫేజ్ కనెక్షన్‌తోనే సరఫరా అవుతోంది. ఏళ్ల కిత్రం ఒక్క మురుగు కాలువను నిర్మించారు. గ్రామంలో ఇళ్లు విస్తరిస్తున్నా వాటికి అనుగుణంగా మురుగు కాలువలను నిర్మించడం లేదు. ఉన్న ఒక్క కాలువను కూ డా శుభ్రం చేసేవారులేక పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఇళ్ల మధ్యే మురుగు నీరు నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. ఇక అంతర్గత రహదారులు లేవు. మట్టి రోడ్లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. సర్పంచ్ తంగడ్‌పల్లిలో ఉండటంతో ఇక్కడి ప్రజల సమస్యలు తెలియటంలేదు. -
ఇక బదిలీల జాతర!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నూతన ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు జరిగిన నేపథ్యంలో ఇక బదిలీల ప్రక్రియకు తెర లేవనుంది. జిల్లా పాలనపై సర్కారు మార్కు పడనుంది. సుమారు నాలుగైదు మాసాల క్రితం జరిగిన బదిలీల్లో ఇతర జిల్లాలకు వెళ్లిన పోలీసు, రెవెన్యూ అధికారులు తిరిగి జిల్లాకు రానున్నారు. 33 మంది సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులు, 37 మంది రెవె న్యూ, పంచాయతీ రాజ్ అధికారులు ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లారు. నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి జిల్లా కు వచ్చిన అధికారులు సైతం తిరిగి సొంత జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా ఉన్నతాధికారుల్లో పలువురు బదిలీ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారమూ జరుగుతోంది. రెం డు, మూడు రోజుల్లో బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. నెలాఖరు వరకు ఈ జాతర కొనసాగనుంది.జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యోగుల బదిలీలకు కసరత్తు జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో బదిలీలు, నియామకాలపై వివిధ ప్రభుత్వ శాఖ ల అధికారుల్లో అలజడి మొదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఐదు నెలల క్రితం వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం కలిగింది. ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో తిరిగి ఆ అధికారులు జిల్లాలో కోరుకున్నచోట పోస్టింగ్ కోసం పైరవీల బాట పట్టారు. పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, రెవెన్యూ, విద్య, పోలీసు, వైద్య ఆరోగ్య, సాంఘిక సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు సహా అన్ని ప్రభుత్వశాఖల్లో అధికారులు, ఉద్యోగులకు బదిలీలు జరగవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బదిలీల ప్రక్రియను తమకు అనుకూలంగా మలచుకునేందుకు పలువురు అధికారులు, ఉద్యోగులు పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీడీవోలు, తహశీల్దార్లతో పాటు వివిధ స్థాయిల అధికారులు, ఉద్యోగులకు బదిలీలు జరిగే అవకాశం ఉన్నందున వారు సైతం కోరుకున్న స్థానం కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. కాగా రెండు రోజుల్లో బదిలీల ఉత్తర్వుల పరంపర మొదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జిల్లా నేతలు, సహచర శాసనసభ్యులతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. -
అధికారులకు బదిలీల జ్వరం
ఎదురుచూపులు అనుకూల పోస్టింగ్‌ల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు కమిషనరేట్‌లో స్థానం కోసం సీఐల రాజకీయ పైరవీలు తహశీల్దార్, ఎంపీడీవోలదీ అదే పరిస్థితి ఏ బదిలీ అయినా పది రోజుల తర్వాతే ఎన్నికలు పూర్తయ్యాయి.. కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది.. దీంతో పాటు రాష్ట్ర విభజన కూడా జరిగింది.. ఈ నేపథ్యంలో బదిలీలకు అవకాశముండటంతో అధికారులు ఇప్పటినుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమకు అనుకూలమైన స్థానాల కోసం పైరవీలు చేస్తున్నారు. సాక్షి, విజయవాడ : అధికారులకు బదిలీల జ్వరం పట్టుకుంది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు శాఖల్లో ఏ ఇద్దరు అధికారులు కలిసినా ఇదే చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు చెందిన పలువురు అధికారులను ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పొరుగు జిల్లాలకు బదిలీ చేశారు. ఇది జరిగి దాదాపు మూడు నెలలు దాటింది. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోగా.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సహజంగా అన్ని కీలక విభాగాల్లో బదిలీలు జరుగుతాయి. కలెక్టర్ స్థాయి నుంచి ఎస్ఐల వరకు అన్ని కేటగిరీల్లో ఉంటాయి. సొంత ప్రాంతంలో పోస్టింగ్ కోసం కొందరు, ఆదాయ వనరులు బాగా ఉండే ప్రాంతంలో మరికొందరు పోస్టింగ్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ పలువురు అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రపతి పాలన ముగిశాకే... జిల్లాలో అన్ని ప్రభుత్వ విభాగాల్లో కలిపి సుమారు 30 వేల మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. గత ఫిబ్రవరిలో 47 మంది ఎంపీడీవోలు, 42 మంది తహశీల్దార్లు, విజయవాడ కమిషనరేట్ పరిధిలో 19 మంది సీఐలు, 30 మందికి పైగా ఎస్ఐలు, జిల్లా పోలీసు శాఖ పరిధిలో 10 మంది సీఐలు, 10 మంది ఎస్ఐలు బదిలీపై పొరుగున ఉన్న గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలకు వెళ్లారు. వారంతా తిరిగి జిల్లాకు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ఇంకా రాష్ట్రపతి పాలన అమలులో ఉండడం బదిలీలకు అడ్డంకిగా మారింది. ఎవరి ప్రయత్నాలు వారివి... రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారాక కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారుల బదిలీలు సాధారణంగా జరుగుతుంటాయి. వీరితోపాటు కిందిస్థాయి అధికారులకు కూడా బదిలీలు జరుగుతాయి. ఎన్నికల నేపథ్యంలో ఇతరప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా బదిలీల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వపరమైన కార్యక్రమాలు, ఫైళ్లు పెండింగ్ పడిపోతున్నాయి. తాత్కాలికంగా బదిలీపై వచ్చిన అధికారులెవరూ ముఖ్యమైన ఫైళ్లు క్లియర్ చేయకపోవడంతో ప్రభుత్వ శాఖలతో ముడిపడిన వ్యవహారాలు నిలిచిపోతున్నాయి. విధానపరమైన అంశాల విషయంలోనూ కొందరు అధికారులు ఫైళ్లను పెండింగ్‌లో ఉంచేస్తున్నారు. ఆదాయం వచ్చే స్టేషన్లపై పోలీసుల గురి... పోలీసు అధికారులు బదిలీల కోసం రాజకీయ పైరవీలు సాగిస్తున్నారు. ఏలూరు రేంజ్ పరిధిలో పనిచేస్తున్న సీఐ, ఎస్ఐలు అనేకమంది జిల్లాకు చెందిన వారున్నారు. ఎన్నికల సమయంలో జిల్లా నుంచి సుమారు 70 మంది వరకు సీఐ, ఎస్ఐలు ఇతర జిల్లాలకు వెళ్లారు. మరో పది రోజుల తర్వాత బదిలీలు జరిగే అవకాశం ఉండటంతో కొందరు సెలవు పెట్టి మరీ పైరవీలు సాగిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కలిసి తమ అభ్యర్థనలను తెలిపి సహకరించాలని కోరుతున్నారు. మరికొందరు నేరుగా హైదరాబాద్ వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలను కలవడం గమనార్హం. కమిషనరేట్‌కు సంబంధించి విజయవాడ నగరంలో ఎక్కడ పోస్టింగ్ దక్కినా అది ఆదాయం ఎక్కువగా వచ్చే (ఫోకల్) స్థానమే అవుతుంది. దీంతో ఆర్థిక, సామాజిక అంశాలతో కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక జిల్లా పోలీసు శాఖలో మున్సిపాలిటీల్లో ఆదాయం బాగుంటుంది. దీంతో పట్టణాల్లో పోస్టింగ్ కోసం కొందరు సీఐలు ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు. మీ ఇష్టమే.. మా ఇష్టం ఇక తహశీల్దార్, ఎంపీడీవోలు కూడా ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారు. జిల్లా నుంచి 47 మంది ఎంపీడీవోలు, 42 మంది తహశీల్దార్లు బదిలీ యత్నాల్లో ఉన్నారు. పలువురు అధికారులు ప్రజాప్రతినిధుల్ని ఆశ్రయించి ఫలానాచోట పోస్టింగ్ ఇప్పించాలని కోరుతున్నారు. కుదరని పక్షంలో మీ నియోజకవర్గంలో ఎక్కడ పోస్టింగ్ ఇప్పించినా ఫర్వాలేదు.. మీ ఇష్టమే మా ఇష్టం.. మీకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పి ప్రయత్నాలు సాగిస్తున్నారు. యూనియన్ కార్యకలాపాల్లో నిమగ్నమైన నేతలు టీడీపీ ముఖ్యనేతల నుంచి సిఫార్సులతో ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు. దీంతో నేతల నివాసాలు సందడిగా మారిపోయాయి. -
పీఠముడి
వారాలు గడుస్తున్నాఎదురు తెన్నులు పదవీ ప్రమాణం చేయని జెడ్పీ, ఎంపీటీసీ సభ్యులు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాకే అధికారపగ్గాలు దీర్ఘకాలంగా ప్రత్యేక పాలనలో మండల, జిల్లా పరిషత్‌లు జిల్లా,మండలపరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు వింత పరిస్థితి ఎదురైంది. వారాలు గడుస్తున్నా ‘పీఠ’ముడి వీడడం లేదు. గెలిచిన అభ్యర్థులు పాలన పగ్గాలు చేపట్టే పరిస్థితి లేదు. ఎన్నికలు ముగిసి 50 రోజులైనా జిల్లాలో ఇంకా ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. కొత్తపాలక వర్గాలు కొలువు తీరకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన దాదాపు రూ.13 కోట్లు వరకు నిధులు నిలిచిపోయాయి. దీంతో జిల్లాలో అనేక సమస్యలు తిష్టవేశాయి. విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో విజయం సాధించినా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు అధికార దర్పం వెలగబెట్టలేని దుస్థితి. పాలనా పగ్గాలు చేపట్టే విషయంలో వారాల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. సుధీర్ఘకాలం తరువాత ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. జిల్లా పరిషత్ పాలక వర్గ పదవీకాలం 2011 జూన్‌తో ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్ పాలనే కొనసాగింది. కొన్ని విధానపరమైన నిర్ణయాలు, జీతాలు, చెల్లింపులు, అత్యవసర పనులు, సాధారణ పరిపాలన మినహా ప్రజాహిత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వ్యక్తిగత ఇబ్బందుల పరిష్కారం వంటివి అమలుకు నోచుకోలేదు. మండలాల్లో అధికారులు, సిబ్బంది కొరత విపరీతంగా ఉండడంతో ప్రధాన సమస్యలపై కూడా వారు దృష్టి సారించలేని పరిస్థితి ఏర్పడింది. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పించేందుకు కూడా నిధుల కొరతతో అధికారులు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. దీంతో అనేక సమస్యలు పరిష్కారానికి కొత్త పాలకవర్గం కోసం ఎదురుచూస్తున్నాయి. అన్నింటికీ నిరీక్షణే : రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో గత నెలలో రెండు దశలలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫలితాల కోసం అభ్యర్థులు నెలన్నరపాటు ఉత్కంఠగా ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ నెల 13న జెడ్పీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులెవరో తేలిపోయింది. అయితే ఫలితాలు వచ్చి మూడు వారాలైనా ఇప్పటి వరకు వీరు అధికారికంగా ఆ హోదాలను అనుభవించలేని వింత పరిస్థితిలో ఉన్నారు. రాష్ర్ట విభజన కారణంగా ఈ దఫా ప్రమాణ స్వీకరాలకు జాప్యం జరుగుతోంది. జూన్ 8న కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక, ఎమ్మెల్యే, ఎంపీలు ప్రమాణ స్వీకారం ముగిశాక వీరి ప్రమాణ స్వీకారాలు ఉండనున్నాయి. అయితే ఆ రోజు ఎప్పుడన్నది ఎవరికీ తెలియదు. రాష్ట్ర విభజన కారణంగా ఎన్నికల్లో గెలిచినా.. ఈ దఫా అధికారాన్ని చేపట్టడానికి వారాలు వేచి ఉండాల్సి వస్తోందని అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు. కొత్త పాలకవర్గాలపై ఆశలు కొత్త పాలకవర్గం ఎప్పుడు ఏర్పాటవుతుందోనని ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. జిల్లా పరిషత్‌కు 13వ ఆర్థిక సంఘం నిధుల కింద కేంద్రం నుంచి రూ.కోట్లు రానున్నాయి. ఈ డబ్బులతో గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాలకు, రోడ్డులు, పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టేందుకు వీలు కలుగుతుంది. అలాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్ఎఫ్సీ) కింద రూ.1.5 కోట్లు వరకు వస్తుంది. ఇందులో 50 శాతం నిధులతో జిల్లా పరిషత్ పాఠశాలల్లో పారిశుద్ధ్యం, తాగునీటి ఏర్పాట్లను వినియోగించే అవకాశముంటుంది. వీటితో పాటు జనరల్ ఫండ్ కింద ప్రభుత్వం నుంచి రూ.5 నుంచి రూ.6 కోట్లు వరకు విడుదలవుతుంది. ఈ నిధులు వస్తే జిల్లాలో రోడ్లు కల్పనతో పాటు పారిశుద్ధ్యం మెరుగుపడి, మంచినీటి ఇబ్బందులు తొలగుతాయని ప్రజలు భావిస్తున్నారు.