New governments
-
గూడు చెదిరింది!
పంచాయతీ భవనాలకు లభించని ఆమోదం నెలలు గడుస్తున్నా నిధులివ్వని ప్రభుత్వం సిబ్బంది కొరతతో దయనీయ పరిస్థితి ఆర్‌జీపీఎస్‌ఏ అమలుపై నీలినీడలు విశాఖ రూరల్ : పంచాయతీలకు సొంత గూడు కల ఇప్పట్లో నెరవేరేలా లేదు. శాశ్వత భవనాల నిర్మాణానికి ఆమోదం లభించి నెలలు గడుస్తున్నా.. ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. అసలు నిధులు ఏ విధంగా కేటాయిస్తారు.. పనులు ఎవరు చేపడతారన్నదానిపై స్పష్టత లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. కేంద్రం, రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరడంతో పాత పథకాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. లోటుబడ్జెట్‌తో సతమతమవుతున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆశించినమేర సాయం అందే అవకాశాలు కనిపించడం లేదు. రాజీవ్‌గాంధీ పంచాయతీ స్వశక్తికరణ్ అభియాన్(ఆర్‌జీపీఎస్‌ఏ) పథకం కింద పంచాయతీలకు సొగసులు అద్దుతామని గత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీ కార్యాలయాల ఏర్పాటు, అవసరమైన సిబ్బంది కల్పన, గ్రామ సభలకు సంబంధించి నిపుణుల బృందంతో అవగాహ న వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా జిల్లాకు 25 పంచాయతీ కార్యాలయాలకు శాశ్వత భవనాలను మంజూరు చేసింది. ఒక్కోదానికి రూ.12 లక్షలు కేటాయించింది. నెలలు గడుస్తున్నా నిర్మాణాలు లేవు పక్కా భవనాల నిర్మాణాలకు అధికారులు భూములను సైతం గుర్తించారు. ఆమేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. అవి ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. నిర్మాణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి, నిధులు ఏ విధంగా మంజూరు చేస్తారన్న విషయంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే పంచాయతీ శాఖ ద్వారా చేపట్టే కొన్ని పనుల కోసం ఇతర ఇంజినీరింగ్ శాఖలపై ఆధారపడకుండా 3, 4 పంచాయతీలకు కలిపి ఒక డీఈ, ఏఈ స్థాయి టెక్నికల్ సిబ్బందిని నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులను పూర్తి స్థాయిలో నియమించకపోవడంతో గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. టెక్నికల్ సిబ్బంది నియామకం జరిగే అవకాశం కూడా లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ పంచాయతీ కార్యాలయాల నిర్మాణాల విషయమై ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించగా.. ఒక్కో కార్యాలయానికి రూ.12 లక్షలు చాలవని ఇంజినీరింగ్ అధికారులు తేల్చి చెప్పారు. ఎంత అవసరం, ప్రతిపాదనలు ఎవరు చేస్తారన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో ఈ అంశాన్ని పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది. నిర్మాణాలకు గుర్తించిన స్థలాలను ఇతర అవసరాలకు కేటాయిస్తారేమోనని పంచాయతీ అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మె యథాతథం
హైదరాబాద్:విద్యుత్ ఉద్యోగులు సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వంతో సంప్రదింపులు సఫలీకృతం కాకపోవడంతో విద్యుత్ ఉద్యోగులు సమ్మెను మరింత తీవ్రతరం చేసేందుకు నడుంబిగించారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించని విద్యుత్ జేఏసీ సమ్మెతోనే తగిన సమాధానం చెప్పాలని భావిస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఐఆర్(మధ్యంతర భృతి) చెల్లిస్తేనే సమ్మె విరమణపై ఆలోచిస్తామన్నారు. అంతకుముందు కొత్త ప్రభుత్వాలు ఏర్పడేంత వరకూ విద్యుత్ ఉద్యోగులు కాస్త ఓపిక పట్టాలని చీఫ్ సెక్రటరీ మహంతి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాల ఏర్పాటుకు కొంత సమయం పట్టే ఆస్కారం ఉన్నందున అప్పటి వరకూ ఉద్యోగస్తులు ఆగాల్సి న అవశ్యం ఉందన్నారు. దీనికి సంబంధించి ఈరోజు మీడియాతో మాట్లాడిన మహంతి..కొత్త ముఖ్యమంత్రిల వద్దకు ఫైళ్లను పంపించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పడే తరుణంలో తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏప్రిల్ నెల నుంచే ఏరియర్స్ అందుతాయన్నారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే పే రివిజన్ కార్యక్రమం ఉంటుందన్నారు. పే రివిజన్ తో రూ. 1250 కోట్ల మేర అదనపు భారం పడుతుందన్నారు. ఒకవేళ సమ్మె చేస్తే ఆస్పత్రులు, రైల్వేలకు, తాగునీటికి పలు ఇబ్బందులు ఎదురవుతాయని మహంతి తెలిపారు. -
కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే పే రివిజన్
-
కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే పే రివిజన్
హైదరాబాద్:కొత్త ప్రభుత్వాలు ఏర్పడేంత వరకూ విద్యుత్ ఉద్యోగులు కాస్త ఓపిక పట్టాలని చీఫ్ సెక్రటరీ మహంతి స్పష్టం చేశారు. ప్రభుత్వాల ఏర్పాటుకు కొంత సమయం పట్టే ఆస్కారం ఉన్నందున అప్పటి వరకూ ఉద్యోగస్తులు ఆగాల్సి న అవశ్యం ఉందన్నారు. దీనికి సంబంధించి ఈరోజు మీడియాతో మాట్లాడిన మహంతి..కొత్త ముఖ్యమంత్రిల వద్దకు ఫైళ్లను పంపించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పడే తరుణంలో తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏప్రిల్ నెల నుంచే ఏరియర్స్ అందుతాయన్నారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే పే రివిజన్ కార్యక్రమం ఉంటుందన్నారు. పే రివిజన్ తో రూ. 1250 కోట్ల మేర అదనపు భారం పడుతుందన్నారు. ఒకవేళ సమ్మె చేస్తే ఆస్పత్రులు, రైల్వేలకు, తాగునీటికి పలు ఇబ్బందులు ఎదురవుతాయని మహంతి తెలిపారు. -
కుదింపులు, విలీనాలు కుదరవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో శాఖలు, విభాగాల కుదింపులు, విలీనాలు కుదరవని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. ఇటువంటి నిర్ణయాలను తెలంగాణ, సీమాంధ్రల్లో కొత్త ప్రభుత్వాలే తీసుకుంటాయని పేర్కొన్నారు. విభజనకు సంబంధించిన అంశాలపైనే తాను నిర్ణయాలు తీసుకుంటానని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సంస్కరణలతో పాటు అవసరం లేని విభాగాల కుదింపు, కొన్ని శాఖలను విలీనం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి వినోద్ అగర్వాల్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఎక్కడా కూడా శాఖల కుదింపు, విభాగాల విలీనం గురించి పేర్కొనలేదు. పూర్తిగా విభజన గురించి మాత్రమే పేర్కొన్నారు. కాగా, సంక్షేమ శాఖలన్నింటినీ ఒకే శాఖ కింద పరిగణించాలని, వ్యవసాయ-పశుసంవర్థక శాఖలను, గ్రామీణ మంచినీటి-పంచాయతీరాజ్ శాఖలను, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖలను విలీనం చేయాలని అధికారులు అభిప్రాయపడ్డారు. దీనికి గవర్నర్ నర్సింహన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్నికైన ప్రభుత్వాలే ఇలాంటి నిర్ణయాలను తీసుకోవాలి తప్ప గవర్నర్‌గా తాను తీసుకోలేనని ఆయన స్పష్టం చేశారు. -
జూన్ 2 వరకు రాష్ట్రపతి పాలన
గవర్నర్ నరసింహన్ వెల్లడి ఆ తర్వాతే రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు తిరుమల: ‘‘రాష్ట్ర విభజనలో భాగంగా అపాయింటెడ్ డే నోటిఫికేషన్ ప్రకారం జూన్ 2న రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావాల్సి ఉంది. అంతవరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది’’ అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ర్టంలో ఎన్నికల కోడ్ వల్ల సీఈవోగా పూర్తి బాధ్యతలు నిర్వర్తించలేకపోయినా రాజ్యాంగపరమైన గవర్నర్ హోదాలో ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నారని చెప్పారు. వేసవిలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో సమస్యలు లేకుండా నిత్యం సమీక్షిస్తూ రైతుల అవసరానికి అనుగుణంగా చర్యలు చేపట్టామన్నారు. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం నుంచి 270 మెగావాట్ల విద్యుత్‌ను అదనంగా కేటాయించేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. అలాగే ఈ వేసవిలో తాగునీటి సరఫరా, వైద్య సేవలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లాగే సార్వత్రిక ఎన్నికలు కూడా విజయవంతంగా పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇస్తికఫాల్ మర్యాదతో గవర్నర్‌కు శ్రీవారి దర్శనం... రా్రష్టపతి పాలన విధించిన తర్వాత తొలిసారిగా తిరుమలకు వచ్చిన గవర్నర్‌కు టీటీడీ ఆలయ మర్యాదలతో శ్రీవారి దర్శనం చేయించింది. సతీమణి విమలా నరసింహన్‌తో కలసి వచ్చిన ఆయనకు ఆలయ మహద్వారం వద్ద వేద పండితులు, ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఆలయ మర్యాదలైన ఇస్తికఫాల్‌తో స్వాగతం పలికారు. స్వామివారి పాదాల వద్ద ఉంచిన శేషవస్త్రాన్ని గవర్నర్‌కు బహూకరించారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయక మండపంలో ఈవో, జేఈవో గవర్నర్ దంపతులకు శ్రీవారి లడ్డూ, స్వామివారి చిత్రపటం అందజేశారు. అంతకుముందు గవర్నర్ దంపతులు తిరుచానూరులో పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 24గంటలు సాక్షి, తిరుమల: తిరుమలకు శనివారం కూడా భక్తులు పోటెత్తారు. కాలిబాట భక్తులతో కిక్కిరిసిపోయింది. సర్వదర్శనం కోసం మొత్తం 31కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల ఆళ్వారు చెరువు చుట్టూ క్యూలో బారులు తీరారు. వీరికి 24 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. కాలిబాటల్లో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 13 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనం వెలుపల రెండు కిలోమీటర్లు క్యూ కట్టారు. వీరికి 12 గంటలు, రూ.300 టికెట్ల భక్తులకు 6గంటల తర్వాత స్వామి దర్శనానికి అనుమతించనున్నారు. గదుల కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్రీయ విచారణ కార్యాలయం, ఎంబీసీ-34, పద్మావతి అతిథిగృహాల వద్ద గదుల కోసం భక్తులు క్యూ కట్టారు. తలనీలాలు సమర్పించుకునేందుకు కల్యాణ కట్టల్లో నాలుగు గంటల పాటు భక్తులు పడిగాపులు కాచారు.