New invention
-
సృజనకు పదును పెడితేనే ఆవిష్కరణలు
జడ్చర్ల/ జడ్చర్ల టౌన్: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహిస్తేనే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి ఇండస్ట్రియల్ గ్రీన్ పార్కులోని ఎస్‌వీకేఎంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలకు పదుపుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ప్రతి పాఠశాలలోనూ సైన్స్ ప్రయోగశాలలు ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ప్రదర్శనలో 33 జిల్లాల నుంచి ఇన్స్పైర్ 2023– 24 విభాగంలో 301.. 2024– 25 రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన కింద 563 ఎంట్రీలు వచ్చాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు‡ పాల్గొన్నారు. సంజీవని హెలికాప్టర్సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల హైసూ్కల్ విద్యార్థి ప్రణీత్ కుమార్ తన గైడ్ శోభారాణితో కలిసి ‘సంజీవని హెలికాప్టర్’ప్రయోగాన్ని ప్రదర్శించాడు. హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ప్రూప్తో కూడిన బెలూన్ ఓపెన్ అయి సురక్షితంగా బయటపడేందుకు వీలుగా రూపొందించారు. బెలూన్‌లోనే ఆక్సిజన్ ఉండటం వల్ల అందులో ప్రయాణించే వారికి ఎలాంటి ప్రాణహాని ఉండదు. దీనికి జీపీఎస్ అనుసంధానం ఉండటం వల్ల హెలికాప్టర్ క్రాషెస్‌ను గుర్తించేందుకు సులువవుతుంది. మొక్కజొన్న వ్యర్థాల నుంచి బయో ఆయిల్మొక్కజొన్న వ్యర్థాలు, పేడ నుంచి బయో ఆయిల్ ఉత్పత్తి చేసే ఆవిష్కరణను నిజామాబాద్ విజయ హైస్కూల్ విద్యార్థులు విజిదేంద్రియ, శ్రీకర్ కలసి ప్రదర్శించారు. అ్రల్టాసోనిక్ హెల్మెట్వినికిడి లోపం ఉన్నవారితో పాటు వాహనదారులకు బైక్ నడిపే సమయంలో ప్రమాదాల నివారణకోసం అ్రల్టాసోనిక్ హెల్మెట్‌ను ఖమ్మం జిల్లా చెన్నారం జెడ్పీ హైసూ్కల్‌కు చెందిన విద్యార్థి ప్రియ రూపొందించింది. వాహనం నడిపేటప్పుడు సెన్సార్ల ఆధారంగా హెల్మెట్ గ్లాస్‌కు కంటికి కనిపించే విధంగా గ్రీన్, ఆరెంజ్, రెడ్ లైట్లను ఏర్పాటు చేశారు. దీని ఖర్చు కేవలం రూ.400 నుంచి రూ.1,000 వరకు అవుతుంది. -
వీల్‌చెయిర్ మోటార్బైక్గా మారిపోతే..!
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్... ఎలా పిలిచినా అంగవైకల్యం అనేది జీవితంలో ఎంతో పెద్ద లోటు. శరీరంలో ఏ అవయవం లేకపోయినా కష్టమే. వైకల్యాన్ని జయించేందుకు ఎంతో మనోస్థయిర్యం అవసరం. వికలాంగుల కోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అలాంటి వాటిలో మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థులు చేసిన ఈ ప్రయోగం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. వికలాంగుల వీల్ చెయిర్‌ను మోటార్బైక్గా మార్చే ఈ టెక్నాలజీ ఓ కొత్త స్టార్టప్‌గా మారిపోయింది. ఇప్పటి వరకు 5,200 బైకులు కొనుగోలు చేశారని సమాచారం.‘నియోమోషన్’ మోటర్బైక్కొద్ది రోజుల క్రితం జొమాటో డెలివరీ పార్ట్నర్ సయ్యద్ షహజాద్ అలీ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మోటార్బైక్గా మారిపోయిన ఓ వీల్‌చెయిర్‌లో అలీ దిలాసాగా కూర్చుని ఉన్నాడు. ‘‘వైకల్యమనేదే లేదు.. మనం చేయాలనుకుంటే ఏదీ అసాధ్యం కాదు. అయితే మనం అంకితభావంతో కృషిచేయాలంతే’’ అని అలీ అంటున్నాడు. ఈ కొత్త వీల్చెయిర్బైక్ కి ఆయన ‘నియోమోషన్’ అని పేరుపెట్టాడు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల సృజనాత్మకతకు ఇది నిదర్శనమి అలీ చెప్పాడు. ఈ వినూత్న సృష్టి.. వికలాంగులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అంటున్నాడు.వైకల్యం ఓ పెద్ద సవాలు.. ఈ వాహనాన్ని తయారుచేసిన ఫౌండర్లలో ఒకరైన సిద్ధార్ధ్ డాగా మాట్లాడుతూ ‘‘నియోమోషన్ వికలాంగుల జీవితాలను సమూలంగా మార్చివేయబోతోంది’’ అన్నారు. నియోమోషన్ ప్రయాణం ఐఐటీ మద్రాస్‌లో ప్రారంభమైంది. ఫైనల్ ఇయర్లో ఉండగా డాగా, ఇంకా ఆయన స్నేహితులను వారి ప్రొఫెసర్ డాక్టర్ సుజాతా శ్రీనివాసన్ చాలా ప్రభావితం చేశారు. డాక్టర్ సుజాతా శ్రీనివాసన్ టిటికె సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైస్ డెవలప్మెంట్ విభాగం చూసేవారు. వైకల్యాన్ని అధిగమించే పరికరాలపై వారు చాలా పరిశోధనలు చేసేవారు. ముందు డాగా మిత్రబృందానికి అప్పగించిన పనేమిటంటే... స్విమ్మింగ్‌పూల్‌లో వికలాంగులు సురక్షితంగా దిగడం, బైటకు రావడం, వ్యాయామంగా ఈతను ఉపయోగించుకోవడం ఎలా అనే అంశాలను పరిశీలించమన్నారు. వికలాంగులు ఎదుర్కొనే అనేక సవాళ్లను ఇది వారి కళ్లకు కట్టింది.సౌకర్యవంతంగా.. దృఢంగా..ఆ అనుభవం నుంచే ఈ నియోమోషన్ (వీల్‌చెయిర్ వాహనం) ఐడియా వారికి వచ్చింది. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ డిజైన్. మార్కెట్లో దొరికే వీల్చెయిర్లు అన్నీ ఒకే డిజైన్‌లో ఉంటాయి. వైకల్యం ఉన్నవారికి అందరికీ ఒకే రకమైన వీల్‌చెయిర్ పనిచేయదు. కానీ ఈ నియోమోషన్ వీల్‌చెయిర్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చాలా దృఢంగా కూడా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చున్నా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.గంటకు 50 కి.మీ ప్రయాణంనియోమోషన్ నిజానికి నియోఫ్లై అనే వీల్ చెయిర్, నియోబోల్ట్ అనే మోటార్బైక్గా ఉపయోగపడే పరికరం రెండింటి సమ్మేళనం. నియోబోల్ట్ అనేది లిథియం–అయాన్ బ్యాటరీతో నడిచే విద్యుత్ పరికరం. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 25 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అలాగే 50 కిలోమీటర్లు ప్రయాణించే వేరియంట్ కూడా ఉంది.నాణ్యత ఎక్కువ..ధర తక్కువ..అయితే ఎన్ని సౌకర్యాలు, సౌలభ్యాలు ఉన్నా వికలాంగులకు అందుబాటు ధరలో ఉంటేనే ఉపయోగం. ఎక్కువమంది ఉపయోగించుకోగలుగుతారు. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకునే సాధ్యమైనంత తక్కువ ధరకు లభించేలా.. అదే సమయంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నియోమోషన్ను తయారు చేసినట్టు డాగా వివరించారు. ప్రస్తుతం నియోమోషన్ రూ.1,10,000కు లభిస్తోంది. అంతర్జాతీయంగా ఇలాంటి పరికరాలతో పోలిస్తే ఇందులో సౌకర్యాలు ఎక్కువ అని, ధర చాలా తక్కువని డాగా వివరించారు. -
ఐఐటీ విద్యార్థులు కనిపెట్టిన కొత్త యంత్రం
-
ఇక సిలికాన్‌తో పనిలేదోచ్..!
బోస్టన్: సాధారణంగా ఎలక్ట్రానిక్ పరికరాల్లో సిలికాన్ లేదా కాపర్ మెటీరియల్ ను ఉపయోగించడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ, బొగ్గు పొరలను ఉపయోగించి పనిచేసే ఎలక్ట్రానిక్ హీటింగ్ డివైజ్‌ను అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ రంగంలోని మరిన్ని పరికరాల తయారీలో బొగ్గును ఉపయోగించవచ్చని చెబుతున్నారు. బొగ్గు ఉపయోగాలను పరిశీలించిన శాస్త్రజ్ఞులకు క్రమంగా సాధారణ మెటీరియల్స్‌తో పోల్చితే బొగ్గు మాలిక్యులర్ కాంప్లెక్సిటీలో భారీ తేడా కనిపించడంతో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ వినియోగంలో వాడి విజయం సాధించారు. ఇప్పటివరకు బొగ్గుతో తయారుచేసిన ఎలక్ట్రికల్ హీటింగ్ డివైజ్‌ను కార్లు, విమానాలు కిటికీలు, రెక్కల్లో ఉపయోగించారు. మొదటి దశలో బొగ్గులో ఉండే ఆంథ్రసైట్, లిగ్నైట్, రెండు బైట్యుమినస్ రకాల ప్రాపర్టీల్లో తేడాలను గమనించిన పరిశోధకులు సహజసిద్ధంగా లభించే బొగ్గులో ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ తయారీకి కావలసిన అన్నీ గుణాలు కలిగి ఉన్న దాన్ని ఎంపిక చేసుకున్నారు. తర్వాత ప్రత్యేక పద్ధతుల్లో బొగ్గును పొడిగా తయారుచేసి పలుచని ఫిల్మ్ మీద మిశ్రమాన్ని పోసి పొరలుగా తయారుచేసుకున్నారు. ఈ పొరల్ని సాధారణంగా అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ తయారీ పద్ధతి ఫ్యాబ్రికేషన్‌లో సిలికాన్ స్థానంలో బొగ్గు పొరల్ని ఉంచారు. ఇలా మామూలు తయారీ పద్ధతిని ఉపయోగించి ప్రస్తుతం తయారవుతున్న అన్నీ ఎలక్ట్రానిక్ పరికరాల్లో దీనిని ఉపయోగించొచ్చని శాస్త్రజ్ఙులు చెబుతున్నారు. దీంతో సిలికాన్‌తో పోల్చితే తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ వస్తువులు లభ్యమయ్యే అవకాశం ఉంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను జర్నల్ నానో లెటర్స్‌లో ప్రచురించారు. -
ఎక్కడైనా.. ఎప్పుడైనా రేషన్
* త్వరలో అమలులోకి రానున్న పోర్టబిలిటీ * ‘తూర్పు’ నుంచే పైలట్ ప్రాజెక్టు! సాక్షి, రాజమండ్రి : బడుగులకు రేషన్ పంపిణీ విధానంలో సంస్కరణలు తేవడమే కాకుండా ఆధార్ అనుసంధానంతో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు మరో కొత్త ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా రేషన్ కార్డు పోర్టబిలిటీ విధానం అమలులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో వంద దుకాణాల్లో అమలవుతున్న ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సర్వీస్ (ఈపీఓఎస్) వచ్చే నెల 15 నుంచి జిల్లా అంతటా అమలు చేస్తున్నారు. ఈ విధానం కూడా జిల్లాలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడే ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన అమలులోకి తేనున్న ఈ విధానానికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ గ్రీన్‌సిగ్నల్ కూడా లభించింది. పోర్టబిలిటీ అంటే.. ఇదొక స్మార్ట్ కార్డు తరహా విధానం. స్మార్ట్ కార్డుల ద్వారా ఆన్లైన్ విధానంలో ఎలా సేవలు పొందుతామో, అలాగే ఏ ఊళ్లో లేదా, ఏ జిల్లాలో నుంచైనా సరకులు తెచ్చుకునే వీలుంటుంది. ఇప్పటి వరకు రేషన్ దుకాణాల్లోనే సరకులు తెచ్చుకునే వారు. ప్రతి నెలా 18లోగా తెచ్చుకోకపోతే అవి వెనక్కి వెళ్లిపోతాయి. ఇలాంటి ఇబ్బందులు ఈ విధానంలో ఉండవు. ఏ రేషన్ దుకాణం నుంచైనా ఎప్పుడైనా సరకులు తెచ్చుకోవచ్చు. ఇతర ప్రాంతాలకు వెళ్లినా.. సమీపంలోని రేషన్ దుకాణం నుంచి సరకు తెచ్చుకోవచ్చు. సాధ్యమేనంటున్న అధికారులు జిల్లాలో 99 శాతం రేషన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ఆ డేటా అంతా సెంట్రలైజ్డ్ విధానంలో ప్రధాన సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. ఆధార్ నంబరును పరీక్షించి, ఆన్లైన్ చేస్తారు. కార్డు నంబరు రేషన్ దుకాణంలో ఫీడ్ చేస్తే లబ్ధిదారుడి వివరాలు లభ్యమవుతాయి. కేటాయించిన మేరకు సరకు ఇస్తే ఆ వివరాలు అక్కడే ఆన్లైన్లో నమోదవుతాయి. ఏ దుకాణంలో పరిశీలించినా.. ఆ వివరాలు తెలుస్తాయి. దీంతో మరోచోట సరకులు తీసుకునే వీలుండదు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. అంతా సరళీకృతం జిల్లాలో దాదాపు 2700 రేషన్ దుకాణాలున్నాయి. వీటిలో ప్రతీ నెలా ఒకటి నుంచి 18వ తేదీ వరకూ సరకులు ఇస్తారు. తర్వాత 19న డీలర్లు వాటి రికార్డులు సమర్పిస్తారు. కొత్తగా వచ్చే సరకు కోసం డీడీలు తీస్తారు. 20 నుంచి 30 వరకూ డీలర్లకు సరకు చేరుతుంది. కొత్త విధానం వల్ల ఈ వంతుల వారీ పద్ధతులు ఉండవు. డీలర్లకు సరకు పరిమితి తొలగిస్తారు. రోజుకు ఎన్ని కార్డులకు, ఎంత సరకు ఇచ్చారో ఆన్లైన్లో గణాంకాలు స్పష్టమవుతాయి. రాజమండ్రిలో ఈపీఓఎస్పై అధికారులతో నిర్వహించిన సమీక్షలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ ఎదుట జిల్లా మేనేజర్ కుమార్ ఈ ప్రతిపాదన ఉంచారు. ముందుగా ఇక్కడి నుంచే ఒకేసారి ఈ విధానం ప్రారంభించాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా అమలయ్యాక రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు.