new plants
-
కోరమాండల్ రూ.800 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ రూ.800 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో రెండు నూతన ప్లాంట్ల ఏర్పాటుకు రూ.677 కోట్లు వెచ్చించాలని గురువారం సమావేశమైన బోర్డు నిర్ణయం తీసుకుంది. మిగిలిన మొత్తాన్ని మూలధన అవసరాలకు వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్లాంటును రూ.513 కోట్లతో విస్తరిస్తోంది. ఇందులో భాగంగా 7,50,000 టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రాన్యులేషన్ ట్రైన్‌ను 24 నెలల్లో ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కాకినాడ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 22,50,000 టన్నులు ఉంది. వినియోగం 93 శాతానికి చేరిందని కంపెనీ తెలిపింది. ‘ఈ విస్తరణతో కాకినాడ ప్లాంట్‌ను భారత్‌లో అతిపెద్ద ఎరువుల తయారీ కేంద్రాల్లో ఒకటిగా మారుస్తుంది. ఎరువుల రంగంలో సంస్థ నాయకత్వాన్ని సుస్థిరం చేస్తుంది’ అని కోరమాండల్ తెలిపింది. ఫంగిసైడ్స్ మల్టీ ప్రొడక్ట్.. అలాగే గుజరాత్‌లోని అంకలేశ్వర్ వద్ద 600 టన్నుల వార్షిక సామర్థ్యంతో ఫంగిసైడ్స్ మల్టీ ప్రొడక్ట్ ప్లాంట్‌ను రూ.164 కోట్లతో నెలకొల్పాలని నిర్ణయించింది. 18 నెలల్లో ఇది కార్యరూపంలోకి రానుంది. క్రాప్ ప్రొటెక్షన్ టెక్నికల్స్‌ను ఇక్కడ తయారు చేస్తారు. కోరమాండల్ క్రాప్ ప్రొటెక్షన్ ఫిలిప్పైన్స్‌లో (సీసీపీపీ) అదనంగా 6.67 శాతం వాటాను రూ.76 లక్షలతో కొనుగోలు చేయాలని బోర్డు నిర్ణయించింది. తద్వారా సీసీపీపీ పూర్తి అనుబంధ కంపెనీగా మారుతుందని వివరించింది. తగ్గిన నికర లాభం.. సెప్టెంబర్ త్రైమాసికంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13 శాతం క్షీణించి రూ.659 కోట్లకు చేరింది. ఎబిటా 8 శాతం తగ్గి రూ.975 కోట్లు నమోదైంది. టర్నోవర్ 6.4 శాతం ఎగసి రూ.7,433 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కోరమాండల్ షేరు ధర 2.46 శాతం లాభపడి రూ.1,640 వద్ద స్థిరపడింది. -
సెమీ కండక్టర్ల రంగంలో గ్లోబల్ పవర్‌గా ఇండియా
గాందీనగర్: సెమీ కండక్టర్ల రంగంలో మన దేశం కీలక పాత్ర పోషించబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రంగంలో భారత్ గ్లోబల్ పవర్‌గా ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. ఇండియాలో రూ.1.25 లక్షల కోట్లతో స్థాపించనున్న మూడు సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్లకు ప్రధాని మోదీ బుధవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో రెండు గుజరాత్లో, ఒకటి అస్సాంలో రాబోతున్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు దేశీయంగా సెమీ కండక్టర్ల తయారీని పట్టించుకోలేదని పరోక్షంగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అభివృద్ధి పట్ల అంకితభావం లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. దేశ శక్తి సామర్థ్యాలను, ప్రాధాన్యతలను, భవిష్యత్తు అవసరాలను గుర్తించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యా యని ఆక్షేపించారు. మన దే శాన్ని సెమీ కండక్టర్ల తయారీ హబ్‌గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు. దేశీయంగా చిప్‌ల తయారీతో యువతకు ఎన్నెన్నో ఉ ద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి ఈ రంగం దోహదపడుతుందని వివరించారు. సెమీ కండక్టర్ మిషన్‌ను రెండేళ్ల క్రితం ప్రకటించామని, తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఈరోజు మూడు పరిశ్రమలకు శంకుస్థాపన చేశామని వ్యాఖ్యానించారు. అనుకున్నది సాధించే శక్తి భారత్‌కు, ప్రజాస్వామ్యానికి ఉందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పీఎం–సూరజ్ నేషనల్ పోర్టల్ ప్రారంభం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీలు, బీసీలే అత్యధికంగా లబ్ధి పొందుతున్నారని ప్రధాని మోదీ చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయా వర్గాలను విస్మరించాయని ఆరోపించారు. దేశాభివృద్ధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీల పాత్రను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ గుర్తించలేదని విమర్శించారు. దళిత, గిరిజన వర్గాలకు చెందిన రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపదీ ముర్మును తాము రాష్ట్రపతులను చేశామని అన్నారు. అణగారిన వర్గాలను అత్యున్నత పదవుల్లో నియమిస్తున్నామని, ఇది ఇకపైనా కొనసాగుతుందని వివరించారు. ప్రధానమంత్రి సామాజిక్ ఉత్థాన్, రోజ్‌గార్ ఆధారిత్ జన్‌కల్యాణ్(పీఎం–సూరజ్) నేషనల్ పోర్టల్‌ను మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా ఎస్టీలు, ఎస్సీలు, వెనుకబడిన తరగతులతోపాటు పారిశుధ్య కార్మికులు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. -
రూ. 120 కోట్లతో మోల్డ్‌టెక్ ప్లాంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాకేజింగ్ రంగ సంస్థ మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ రూ.100 కోట్లతో కొత్తగా మూడు ప్లాంట్లను ప్రారంభించింది. తెలంగాణలోని సుల్తాన్పూర్, హరియాణాలోని పానిపట్, తమిళనాడులోని చెయ్యార్ వద్ద ఏర్పాటయ్యాయి. వీటి మొత్తం వార్షిక సామర్థ్యం 5,500 మెట్రిక్ టన్నులు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కోసం మహారాష్ట్రలోని మహద్ వద్ద రూ.20 కోట్లతో 1,500 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం గల ప్లాంటు 2024 అక్టోబర్ నాటికి రెడీ అవుతోంది. 2024–25లో మోల్డ్‌టెక్ రూ.75–80 కోట్ల మూలధన వ్యయం చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.120 కోట్లు, 2022–23లో రూ.148 కోట్లు వెచ్చించింది. 2024–25లో పరిమాణంలో 15–18 శాతం వృద్ధిని ఆశిస్తోంది. తాజా విస్తరణతో 2024–25లో మొత్తం వార్షిక తయారీ సామర్థ్యం 54,000 మెట్రిక్ టన్నులకు చేరుతుందని మోల్డ్‌టెక్ సీఎండీ జె.లక్ష్మణ రావు వెల్లడించారు. ‘కొత్త ప్లాంట్లు కంపెనీ వృద్ధి అవకాశాలను ప్రధానంగా ఫార్మా ప్యాకేజింగ్‌లో మెరుగుపరుస్తాయి. ఫార్మా పరిశ్రమ నుండి మా ఉత్పత్తులకు డిమాండ్ చాలా ప్రోత్సాహకరంగా ఉంది. 2024–25 తొలి త్రైమాసికం నుండి ఫార్మా ప్యాకేజింగ్ ఆదాయం తోడవుతుంది. 5–6 ఏళ్లలో మొత్తం ఆదాయంలో ఫుడ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా విభాగాలు 50 శాతం సమకూర్చాలన్నది మా ప్రణాళిక’ అని తెలిపారు. -
టెక్నో కొత్త పెయింట్స్ ప్లాంట్స్.. ఎక్కడో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యరో: పెయింట్స్ తయారీలో ఉన్న టెక్నో పెయింట్స్ రూ. 46 కోట్లతో కొత్తగా మూడు ప్లాంట్లను ఈ ఏడాదే నెలకొల్పుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, చిత్తరుతోపాటు మధ్యప్రదేశ్‌లోని కట్నీ వద్ద ఇవి రానున్నాయి. ఈ కేంద్రాల్లో డ్రై సిమెంట్ పుట్టీ, టెక్స్చర్స్, ప్రైమర్స్, ఎమల్షన్స్ తయారు చేస్తారు. తొలి దశలో ఒక్కొక్క ప్లాంటు వార్షిక సామర్థ్యం 30,000 మెట్రిక్ టన్నులని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ఊరు - మన బడి, మన బస్తీ - మన బడి కార్యక్రమంలో భాగంగా 26,065 పాఠశాలలకు రంగులు వేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టాం. 2023లో దేశవ్యాప్తంగా రిటైల్‌లో విస్తరిస్తాం. విక్రయ కేంద్రాల్లో కలర్ బ్యాంక్స్ పరిచయం చేస్తాం. వీటితో వినియోగదారు కోరుకున్న రంగును వెంటనే అందించవచ్చు. 2022–23లో 100 శాతం వృద్ధి సాధించాం’ అని వివరించారు. -
ఏపీలో టెక్నో పెయింట్స్ ప్లాంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ తయారీలో ఉన్న టెక్నో పెయింట్స్ రూ.46 కోట్లతో కొత్తగా మూడు ప్లాంట్లను ఈ ఏడాదే నెలకొల్పుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, చిత్తూరుతోపాటు మధ్యప్రదేశ్‌లోని కట్నీ వద్ద ఇవి రానున్నాయి. ఈ కేంద్రాల్లో డ్రై సిమెంట్ పుట్టీ, టెక్స్చర్స్, ప్రైమర్స్, ఎమల్షన్స్ తయారు చేస్తారు. తొలి దశలో ఒక్కొక్క ప్లాంటు వార్షిక సామర్థ్యం 30,000 మెట్రిక్ టన్నులని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ఊరు–మన బడి, మన బస్తీ–మన బడి కార్యక్రమంలో భాగంగా 26,065 పాఠశాలలకు రంగులు వేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టాం. 2023లో దేశవ్యాప్తంగా రిటైల్‌లో విస్తరిస్తాం. విక్రయ కేంద్రాల్లో కలర్ బ్యాంక్స్ పరిచయం చేస్తాం. వీటితో వినియోగదారు కోరుకున్న రంగును వెంటనే అందించవచ్చు. 2022–23లో 100 శాతం వృద్ధి సాధించాం’ అని వివరించారు. -
ఏపీలో విష్ణు కెమికల్స్ పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పెషాలిటీ కెమికల్స్ తయారీ సంస్థ విష్ణు కెమికల్స్ కార్యకలాపాలను భారీగా విస్తరిస్తోంది. వచ్చే అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్లో స్పెషాలిటీ కెమికల్స్ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు బోర్డు సోమవారం ఆమోదముద్ర వేసినట్లు తెలిపింది. విష్ణు కెమికల్స్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా 57 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఆటోమొబైల్, ఫార్మా, ఉక్కు తదితర పరిశ్రమలకు ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. -
మోల్డ్‌టెక్ రెండు ప్లాంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాకేజింగ్ రంగ కంపెనీ మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ కొత్తగా రెండు ప్లాంట్లను స్థాపిస్తోంది. తమిళనాడులోని చెయ్యార్, హరియాణాలోని పానిపట్ వద్ద ఇవి రానున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ కోసం వీటిని నెలకొల్పుతున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఒక్కో ప్లాంటుకు రూ.30 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ సీఎండీ జె.లక్ష్మణరావు తెలిపారు. చదవండి: QR Code On Cylinders: కేంద్రం సంచలన నిర్ణయం, గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త -
నెస్లే ఇండియా భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: గ్లోబల్ ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఎస్ఏ దేశీయంగా భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. రానున్న మూడున్నరేళ్లలోగా అంటే 2025కల్లా రూ. 5,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ సీఈవో మార్క్ ష్నీడర్ వెల్లడించారు. తద్వారా దేశీ బిజినెస్‌కు జోష్‌నివ్వడంతోపాటు కొత్త వృద్ధి అవకాశాలను అందుకోనున్నట్లు తెలియజేశారు. నిధులను పెట్టుబడి వ్యయాలుగా వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త ప్లాంట్ల ఏర్పాటు, ఇతర సంస్థల కొనుగోళ్లు, ప్రొడక్టు పోర్ట్‌ఫోలియో విస్తరణ తదితరాలను చేపట్టనున్నట్లు వివరించారు. కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9 ప్లాంట్లను నిర్వహిస్తోంది. కొత్తగా తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు తగిన ప్రాంతాలను అన్వేషిస్తున్నట్లు నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. పెట్టుబడులకు అధికారిక సంస్థల నుంచి అనుమతులు లభించాల్సి ఉండగా.. మరింత మందికి ఉపాధి లభించే వీలుంది. ప్రస్తుతం 6,000 మంది సిబ్బంది ఉన్నారు. టాప్–10లో ఒకటి... నెస్లేకు ప్రాధాన్యతగల టాప్–10 మార్కెట్లలో ఒకటైన ఇండియాలో 2025కల్లా రూ. 5,000 కోట్లు వెచ్చించనున్నట్లు ష్నీడర్ తెలియజేశారు. కంపెనీ గత ఆరు దశాబ్దాలలో రూ. 8,000 కోట్లను వెచ్చించినట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశీయంగా 110 ఏళ్ల క్రితమే కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ 1960 నుంచీ తయారీకి తెరతీసినట్లు వివరించారు. -
రాష్ట్రంలో సన్ ఫార్మా ప్లాంట్
సాక్షి, అమరావతి: ఫార్మాస్యూటికల్స్ రంగంలోని పెద్ద కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా రాష్ట్రంలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఇంటిగ్రేటెడ్ ఎండ్ టూ ఎండ్ ప్లాంట్‌గా దీన్ని తీసుకొస్తామని, ఎగుమతులు లక్ష్యంగా ఉత్పత్తులు ఉంటాయని కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మంగళవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సంఘ్వీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగం ప్రగతి, సన్ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్ వారికి వివరించారు. అవకాశాలను వినియోగించుకోవాలని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సమగ్రాభివృద్ధి ధ్యేయంగా తీసుకుంటున్న చర్యలనూ ముఖ్యమంత్రి జగన్ వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అత్యంత పారదర్శక విధానాలు అందుబాటులో ఉన్నాయని, నైపుణ్యాభివృద్ధిని పెంచడం ద్వారా నాణ్యమైన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యలనూ సీఎం తెలిపారు. అనంతరం సమావేశం వివరాలను దిలీప్ షాంఘ్వీ వెల్లడించారు. ఆ వివరాలు.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం విధానం ముఖ్యమంత్రిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ఎదుర్కొంటున్న సవాళ్ల మీద ఆయనకున్న అవగాహనకు నేను ముగ్థుడినయ్యాను. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అన్నది ముఖ్యమంత్రి విధానంగా స్పష్టమవుతోంది. పర్యావరణహిత విధానాలపై సీఎం ప్రత్యేక దృష్టితో ఉన్నారు. సాంకేతికతను బాగా వినియోగించుకుని అత్యంత సమర్థత ఉన్న మానవ వనరులను తయారుచేయడం ద్వారా ప్రజల ఆదాయాలను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ఆయనున్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన దిశగా ముఖ్యమంత్రి ముందడుగు వేస్తున్నారు. మా కంపెనీ తరఫున మేం కూడా దీనిపై గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పాం. సన్ ఫార్మా తరఫున ఒక పరిశ్రమను నెలకొల్పుతామని.. తద్వారా మా తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటామని చెప్పాం. కొత్త పరిశ్రమను విజయవంతంగా ఏర్పాటుచేయడానికి అధికారులతో మా సంప్రదింపులు కొనసాగుతాయి. పరిశ్రమలకు చక్కటి సహకారం, మద్దతును సీఎం ఇస్తామన్నారు. ఔషధ రంగంలో మా ఆలోచనలను ఆయనతో పంచుకున్నాం. ఇంటిగ్రేటెడ్ తయారీ యూనిట్‌పై మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి ఔషధాలను ఎగుమతి చేయాలన్నది మా లక్ష్యాల్లో భాగం. ఈ సమావేశంలో కంపెనీ ప్రతినిధులు విజయ్ పరేఖ్, సౌరభ్ బోరా, విద్యాసాగర్ కూడా పాల్గొన్నారు. -
హీరో మోటో భారీ విస్తరణ ప్రణాళికలు
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్.. భారీ విస్తరణ ప్రణాళికలను చేపట్టనుంది. ఇందు కోసం వచ్చే 5–7 ఏళ్లలో రూ. 10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ ప్రకటించారు. ఈ ఏడాదిలో 10 కోట్ల వాహన విక్రయాల మైలురాయిని అధిగమించే అవకాశం ఉందని వెల్లడించారు. బీఎస్–6 గ్లామర్ విడుదల: భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్ఘార నిబంధనలకు అనుగుణంగా ఉన్న హీరో గ్లామర్ బైక్‌ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధరల శ్రేణి రూ. 68,900– 72,000 కాగా, ప్యాషన్ ప్రో ధరల శ్రేణి రూ. 64,990– 67,190గా నిర్ణయించింది. ఎక్స్ట్రీమ్ 160ఆర్ బైక్‌ను ఆవిష్కరించింది. ఇది ఈ ఏడాది మార్చి నుంచి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. -
హైదరాబాద్‌లో అంతర్జాతీయ బ్రాండ్ల టీవీల అసెంబ్లింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల తయారీలో ఉన్న మోటరోలా, నోకియా, వన్‌ప్లస్ వంటి దిగ్గజ సంస్థలు ఎల్ఈడీ టీవీల రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. విశేషమేమంటే ఈ కంపెనీల టీవీలు హైదరాబాద్‌లో రూపుదిద్దు కుంటున్నాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న స్కైక్వాడ్ ఇప్పటికే ప్యానాసోనిక్, లాయిడ్ వంటి ఏడు బ్రాండ్ల టీవీలను అసెంబుల్ చేస్తోంది. కంపెనీకి ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్, శంషాబాద్ వద్ద ప్లాంట్లున్నాయి. ఏటా 30 లక్షల ఎల్ఈడీ టీవీలను రూపొందించే సామర్థ్యం ఉంది. 3,000 మంది ఉద్యోగులు ఉన్నారని కంపెనీ ఎండీ రమీందర్ సింగ్ సోయిన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. అంతర్జాతీయ కంపెనీలకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో నాలుగు కొత్త బ్రాండ్లు తోడవనున్నాయని వివరించారు. రెండో దశలో రూ.1,400 కోట్లు.. స్కైక్వాడ్ భాగస్వామ్యంతో చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ స్కైవర్త్ శంషాబాద్ వద్ద 50 ఎకరాల్లో ప్లాంటును నెలకొల్పుతోంది. తొలి దశలో రూ.700 కోట్లు పెట్టుబడి చేస్తున్నారు. ఇరు సంస్థలు కలిసి టీవీలతోపాటు వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లను అసెంబుల్ చేస్తాయని రమీందర్ వెల్లడించారు. ‘ఆరు నెలల్లో ఈ ఉత్పత్తుల తయారీ మొదలవుతుంది. కొత్త ప్లాంటు ద్వారా 5,000 మందికి ఉపాధి లభించనుంది. 15–20 శాతం విడిభాగాలు స్థానికంగా తయారవుతున్నాయి. దీనిని 50 శాతానికి తీసుకువెళతాం. మరో 20 దాకా అనుబంధ సంస్థలు రానున్నాయి. వీటి ద్వారా 3,000 ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నాం. రెండవ దశలో ఇరు సంస్థలు కలిసి రూ.1,400 కోట్ల పెట్టుబడి చేయాలని భావిస్తున్నాం’అన్నారు. -
డుమాంట్.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం ఐస్‌క్రీమ్ మార్కెట్లోకి కొత్త బ్రాండ్ ‘డుమాంట్’ ప్రవేశించింది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలో 10 స్టోర్లను తెరిచిన ఈ కంపెనీ.. ఏడాదిలో దక్షిణాది రాష్ట్రాల్లో 100 ఔట్లెట్లను ప్రారంభించాలని కృతనిశ్చయంతో ఉంది. మూడేళ్లలో ఈ రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రలోనూ అడుగుపెడతామని డుమాంట్ ఎండీ వివేక్ అయినంపూడి తెలిపారు. గురువారమిక్కడ డుమాంట్ బ్రాండ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా బ్రాండ్ డైరెక్టర్ సుమన్ గద్దె, మార్కెటింగ్ డైరెక్టర్ చైతన్య బోయపాటితో కలిసి మీడియాతో మాట్లాడారు. 2022 నాటికి 300 కేంద్రాల స్థాయికి వెళతామన్నారు. సొంత స్టోర్లతోపాటు ఫ్రాంచైజీల ద్వారా కూడా నెలకొల్పుతామని చెప్పారు. ఫ్రాంచైజీ కోసం ఇప్పటికే 40కి పైగా ఎంక్వైరీలు వచ్చాయన్నారు. తొలి ఏడాది రూ.12–15 కోట్ల ఆదాయం ఆశిస్తున్నట్టు వెల్లడించారు. డుమాంట్ ఉత్పత్తుల అభివృద్ధికి రూ.3 కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. భారత్‌లో తొలిసారిగా.. విజయవాడ కేంద్రంగా 20 ఏళ్లుగా ఐస్‌క్రీమ్స్ విపణిలో ఈ కంపెనీ విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తోంది. దక్షిణాదిన వివిధ బ్రాండ్లలో ఫ్రోజెన్ డెసర్ట్ను పలు రెస్టారెంట్లు, క్యాటెరర్స్కు సరఫరా చేస్తోంది. గంటకు 1,900 లీటర్ల ఐస్ క్రీమ్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. విజయవాడ కేంద్రానికి ఇప్పటికే రూ.15 కోట్లు వెచ్చించింది. 10 కోల్డ్ స్టోరేజీలను నిర్వహిస్తోంది. ఒకట్రెండేళ్లలో హైదరాబాద్‌లో ప్లాంటు ఏర్పాటు చేస్తామని వివేక్ తెలిపారు. గంటకు 3,000 లీటర్ల ఐస్‌క్రీమ్ ఉత్పత్తి సామర్థ్యంతో రానున్న ఈ ప్లాంటుకు రూ.15 కోట్ల వరకు వెచ్చిస్తామన్నారు. ‘డుమాంట్ బ్రాండ్‌లో 34 రకాల ఐస్ క్రీమ్స్, మిల్స్షేక్స్ను తీసుకొచ్చాం. అన్నీ స్వచ్చమైన పాలతో చేసినవే. భారత్‌తోపాటు పలు దేశాల నుంచి తాజా పండ్లను సేకరించి వీటి తయారీలో వాడుతున్నాం. బ్లూబెర్రీ చీస్‌కేక్, కారామెలైజ్డ్ పైనాపిల్, చాకో ఆరేంజ్, మాపుల్ అండ్ రైసిన్స్, ఖీర్, థాయ్ టీ వంటి వెరైటీలు భారత్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టినవే. కొత్త రుచుల అభివృద్ధిలో ప్రత్యేక విభాగం నిమగ్నమైంది’ అని వివరించారు. -
రెండేళ్లలో మూడు రెట్లకు ఉత్పత్తి సామర్థ్యం
► నిర్మాణంలో మరిన్ని కొత్త ప్లాంట్లు ► అక్టోబరు నుంచి మార్కెట్ జోష్ ► ‘సాక్షి’తో జేఎస్‌డబ్ల్యు సిమెంట్ ► సీఈవో అనిల్ కుమార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీలో ఉన్న జేఎస్‌డబ్ల్యు సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెద్ద ఎత్తున పెంచుతోంది. ప్రస్తుతం కంపెనీకి ఉన్న ప్లాంట్ల వార్షిక సామర్థ్యం 6 మిలియన్ టన్నులు. పశ్చిమ బెంగాల్, కర్నాటక, తమిళనాడు, ఒడిశాలో సంస్థ కొత్త ప్లాంట్లు నెలకొల్పుతోంది. రెండేళ్లలో ఈ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని జేఎస్‌డబ్ల్యు సిమెంట్ డెరైక్టర్, సీఈవో అనిల్ కుమార్ పిళ్లై వెల్లడించారు. ఇవి కార్యరూపంలోకి వస్తే ఉత్పత్తి సామర్థ్యం 18 మి. టన్నులకు చేరుకుంటుందని చెప్పారు. ఇందుకు కంపెనీ రూ.1,700 కోట్లకుపైగా వెచ్చిస్తున్నట్టు సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మార్కెట్ పరిస్థితి, కంపెనీ విస్తరణ గురించి ఆయనింకా ఏమన్నారంటే.. కొనుగోళ్లకు సిద్ధం.. తూర్పు భారత్‌లో అడుగు పెట్టాలన్నది జేఎస్‌డబ్ల్యు సిమెంట్ ప్రణాళిక. ఈ నేపథ్యంలోనే లఫార్జ్ ఇండియా చేతిలో ఉన్న ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాం. చత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో ఈ ప్లాంట్లున్నాయి. కొనుగోలు ప్రక్రియ కొలిక్కి రాలేదు. కంపెనీ వృద్ధికి తోడవుతుందని భావిస్తే ప్లాంట్ల కొనుగోళ్లకు సిద్ధం. దక్షిణాది మార్కెట్లో కంపెనీకి 4.5-5% వాటా ఉంది. 2014-15లో 2.12 మిలియన్ టన్నుల సిమెంటు, గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్(జీజీబీఎస్) 1 మి. టన్నులు విక్రయించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.27 మి. టన్నుల సిమెంటు, 1.4 మి. టన్నుల జీజీబీఎస్ విక్రయాలు అంచనా వేస్తున్నాం. నిర్మాణాలకు సరైన సమయం.. కంపెనీకి ఉన్న ప్లాంట్ల వినియోగం ప్రస్తుతం 50-55 శాతముంది. అక్టోబరు నుంచి ఇది మెరుగుపడి 60%కి చేరుతుందని భావిస్తున్నాం. తక్కువ డిమాండ్, ప్లాంట్ల సామర్థ్యం అధికంగా ఉండడం పరిశ్రమకు అతి పెద్ద అడ్డంకి. దక్షిణాది ప్లాంట్లకే ఈ సమస్య ఉంది. ఉత్తరాదిన ఉన్న పలు కంపెనీల ప్లాంట్ల వినియోగం 70-75% దాకా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో బస్తా ధర రూ.250 ఉంది. గతేడాది ఇదే సమయంలో ఈ ధర ఏకంగా రూ.310 నమోదైంది. ఏదేమైనా ప్రస్తుతమున్న సిమెంటు ధరలు చాలా తక్కువ. ఇళ్లు కట్టుకోవడానికి కస్టమర్లకు ఇదే సరైన సమయం. అక్టోబరు నుంచి మంచి రోజులు.. దక్షిణాది సిమెంటు మార్కెట్ 2015-16లో 4 శాతం తిరోగమన వృద్ధి చెందింది. మార్కెట్ తిరిగి అక్టోబరు నుంచి గాడిలో పడుతుందని విశ్వసిస్తున్నాం. దీర్ఘకాలిక మన్నికను దృష్టిలో పెట్టుకుని జాతీయ రహదారులను సిమెంటు కాంక్రీటుతో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది సిమెంటు పరిశ్రమకు పెద్ద బూస్ట్‌నిస్తుంది. తారు రోడ్ల జీవిత కాలం కొన్నేళ్లే. సిమెంటు రోడ్ల జీవిత కాలం 25 ఏళ్ల పైమాటే. రెండు మూడేళ్లలో కొత్త రోడ్లన్నీ సిమెంటు కాంక్రీటువే కనపడనున్నాయి. అలాగే కొత్త రైల్వే ప్రాజెక్టులు, ఇతర మౌలిక వసతులు, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని.. వెరశి సిమెంటుకు డిమాండ్ పెరిగి పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయి.