new turn
-
వారికి సంబంధం లేదు!
పంజగుట్ట: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసు మరో మలుపు తిరిగింది. తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ కేసు పెట్టిన బాధితురాలే తనను బెదిరించి ఆ కేసులు పెట్టించారని, 139 మందిలో చాలామందికి ఈ కేసుతో సంబంధం లేదని పేర్కొంది. అంతేకాకుండా తనను ఓ ప్రముఖ టీవీ యాంకర్, ఓ సినీ హీరో కూడా అత్యాచారం చేశారని గతంలో చెప్పిన ఆమె.. వారికి ఈ కేసుతో సంబంధం లేదని స్పష్టంచేసింది. సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె విలేకరులతో మాట్లాడింది. రాజారెడ్డి అలియాస్ డాలర్‌భాయ్.. తన కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించడంతో పాటు అత్యాచారం చేసి ఈ కేసుతో సంబంధం లేని వారి పేర్లు రాయించాడని చెప్పింది. వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు యత్నించాడని, అతడిపై కూడా త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలు పేర్కొంది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ.. కర్ణునికి కవచకుండలం ఎంత ముఖ్యమో.. ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ యాక్ట్ అంతే ముఖ్యమన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆ కేసులు దుర్వినియోగం కావడం బాధాకరమన్నారు. ఓ గిరిజన బాలికపై 139 మంది అత్యాచారం చేశారనగానే తాను స్పందించకపోవడం పట్ల పలువురు విమర్శలు కూడా చేశారని, బాధితురాలి నుంచి పూర్తి వివరాలు సేకరించడం కోసమే ఈ జాప్యం జరిగిందని తెలిపారు. ఆమెను విచారించగా, 139 మందిలో దాదాపు 30 శాతం మంది పదేళ్లలో అత్యాచారం చేశారని, మరికొందరు మానసికంగా వేధించారని చెప్పినట్టు వివరించారు. టీవీ, సినీ రంగానికి చెందిన వారికి కేసుతో సంబంధం లేదని, మాజీ ఎంపీ పీఏ మానసికంగా వేధించినట్లు మాత్రమే తెలుసుకున్నామన్నారు. అసలు బాధితురాలు ఇలా కావడానికి ముఖ్య కారణం విద్యార్థి సంఘం నాయకుడని.. అతన్ని, ఆశ్రయం కల్పించినట్లు నటించి మోసం చేసిన డాలర్ భాయ్‌ని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మహిళాసంఘాల నాయకులు సంధ్య, సజయ, విమలక్క, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం అధ్యక్షుడు కుమార్ పాల్గొన్నారు. -
ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కేసు కొత్త మలుపు
సాక్షి, విశాఖపట్నం: నగరంలో సంచలనం సృష్టించిన ఫైనాన్స్ వ్యాపారి అప్పలరాజు కిడ్నాప్ కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. కిడ్నాప్, దాడి వ్యవహారంలో అప్పలరాజు చెప్పిన వివరాలు ప్రకారం ముగ్గురు దుండగులు పాల్గొన్నట్లుగా పోలీసులు మొదట భావించారు. ఆ దిశగా లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు విచారణలో ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. సీసీ కెమెరాల పుటేజ్‌లు పోలీసులు పరిశీలించగా, ఒక్కడే ఆటో ఎక్కుతున్నట్టు గుర్తించారు. పొంతన లేని సమాచారంతో ఫైనాన్స్ వ్యాపారి.. పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు తెలిసింది. (ఎవరు చేస్తున్నారబ్బా..?) తనని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముగ్గురు వ్యక్తులు మంకీ క్యాంపులు ధరించి తనని ఆటోలో కిడ్నాప్ చేశారన్న అప్పలరాజు.. సాగర్ నగర్- రుషికొండ మధ్యలో తనపై హత్యాయత్నం చేసి లక్షా 25 వేల నగదు, బంగారం దోచుకుపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు బయటపడ్డాయి. అప్పలరాజు మాటలు అబద్దమని పోలీసులు తేల్చారు. షర్ట్ పై ఎటువంటి మరకలు లేకుండానే అప్పలరాజు పొట్టపై రెండు కత్తి గాట్లు ఉండటంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్స్ వ్యాపారంలో ఒత్తిళ్లను పక్కదారి పట్టించేందుకు కిడ్నాప్ డ్రామా ఆడారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. -
అగస్టా వెస్ట్‌లాండ్ కేసులో కొత్త మలుపు
-
CRDA రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్త మలుపు
-
మోదీ వివాదంలో కొత్త మలుపు
- ఇమిగ్రేషన్ డాక్యుమెంట్లపై రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సంతకం - 2011 నాటి పత్రాలు బహిర్గతం.. - పోర్చుగల్ ఆసుపత్రితో రాజస్థాన్ ప్రభుత్వం భూ ఒప్పందం.. అదే ఆసుపత్రిలో లలిత్ మోదీ భార్యకు ఆపరేషన్ - బీజేపీపై విమర్శల దాడి ముమ్మరం చేసిన కాంగ్రెస్ న్యూఢిల్లీ: సంచలనం సృష్టిస్తోన్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఇమిగ్రేషన్ వివాదంలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. 2011లో మోదీ భారత్ నుంచి సురక్షితంగా యూకే వెళ్లేందుకు నేటి రాజస్థాన్ ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నాయకురాలు వసుంధరా రాజే సహకరించినట్లు తెలిసింది. 18, ఆగస్టు, 2011 తేదీని సూచిస్తూ లలిత్ మోదీ యూకే ఇమిగ్రేషన్ కు సమర్పించిన దరఖాస్తులో వసుంధర రాజే సాక్షి సంతకం చేశారు. అయితే అనూహ్యరీతిలో మోదీ పర్సనల్ రిలేషన్స్ సిబ్బందే ఈ డాక్యుమెంట్లను బహిర్గతం చేశారు. మోదీ భార్యకు క్యాన్సర్ చికిత్స చేసిన పోర్చుగల్ ఆసుపత్రి విషయంలోనూ కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోర్చుగల్ రాజధాని లస్బన్ కేంద్రంగా పనిచేసే సదరు ఆసుపత్రి రాజస్థాన్ లో రీసెర్చ్ సెంటర్ స్థాపించాలనుకుంది. అందుకు అనుగుణంగా ఆ ఆసుపత్రికి 35 వేల ఎకరాల భూమిని ఉచితంగా కేటాయిస్తున్నట్లు వసుంధర రాజే ప్రభుత్వం అక్టోబర్ 2, 2014న జోవో జారీ చేసింది. సరిగ్గా ఇది జరిగిన రెండు నెలల తర్వాత అదే ఆసుపత్రిలో లలిత్ మోదీ భార్యకు ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆపరేషన్ ఉచితంగా నిర్వహించారా లేదా అనే విషయాలు ఇంకా తెలియాల్సిఉంది. భార్య ఆపరేషన్ కోసం ఇంగ్లాండ్ నుంచి పోర్చుగల్ వెళ్లాలనుకున్న మోదీకి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సాయం చేయడం, ఇప్పుడా విషయం వెలుగులోకి రావడంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగడం తెలిసిందే. తాజాగా వివాదంలో వసుంధరరాజే పాత్ర కూడా స్పష్టం కావడంతో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడిని ముమ్మరం చేసింది. -
ఓ అన్న ఆవేదన....