New Wave
-
వేల సంఖ్యలో కోవిడ్ కేసులు.. మరో వేవ్‌కు సంకేతమా?
పారిస్: కరోనా పీడ ఇప్పట్లో విరగడయ్యేలా కనిపించడం లేదు. ప్రపంచాన్ని పట్టి కుదిపేసిన కోవిడ్ మహమ్మారి మరోసారి పంజా విసిరేలా ఉంది. పలు దేశాల్లో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఈ భయాలను మరింత పెంచుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌లో కోవిడ్ తీవ్ర రూపు దాల్చేలా ఉందని ఫ్రెంచ్ వ్యాక్సినేషన్ చీఫ్ అలేన్ ఫిష్చర్ అన్నారు. ఫ్రాన్స్-2 టెలివిజన్‌తో బుధవారం ఆయన మాట్లాడారు. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయని, ఇది మరో వేవ్‌కు సంకేతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం ఇదేమాదిరిగా అధిక కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. మహమ్మారి మరోసారి విజృంభిస్తుందనడంలో సందేహం లేదని చెప్పారు. అయితే, కొత్త వేరియంట్లతో కూడిన తాజా వేవ్ తీవ్రత ఎలా ఉంటుందన్నదే అసలైన సవాల్ అని వ్యాఖ్యానించారు. ఐసీయూలో వెంటిలేటర్‌పై పాక్ దిగ్గజ క్రికెటర్ భౌతిక దూరం పాటించడం, జనం గుంపులోకి వెళ్లినప్పుడు మాస్కు ధరించడం తప్పనిసరి అని సూచించారు. ఇతర యూరప్ దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా పోర్చుగల్‌లో రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ.4, బీఏ.5 వెలుగుచూశాయని తెలిపారు. కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లతో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంటున్నట్టు తెలిపారు. అయితే, వ్యాప్తిలో వేగం ఉండటం ఆందోళన కలిగించే అంశమని చెప్పుకొచ్చారు. కాగా, మంగళవారం ఒక్కరోజే ఫ్రాన్స్‌లో 90 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీడెవడ్రా బాబు! ఇలా వెళ్తున్నాడు.. తేడా కొడ్తే అంతే సంగతులు -
మాస్క్‌లు ధరించాల్సిందే!: తెలంగాణ డీహెచ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా అదుపులోనే ఉన్నా.. జాగ్రత్తలు పాటించాల్సిందేనని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. ఈ మేరకు గురువారం కరోనా సమాచారం గురించి పలు జాగ్రత్తలను మీడియా ద్వారా ఆయన తెలియజేశారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, తెలంగాణలో ఆ పరిస్థితి రావొద్దు అంటే ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారాయన. అర్హులైన ప్రతీ ఒక్కరూ బుస్టర్ డోస్ వ్యాక్సిన్, 12 ఏళ్ళు పైబడిన పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇప్పించాలని కోరారు. ఆరువారాలుగా కరోనా వైరస్ అదుపులోనే ఉంది. రోజూ 20 నుంచి 25 మధ్య కేసులు నమోదు అవుతున్నాయని, ప్రభుత్వం కరోనా పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని తెలిపారాయన. థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఫోర్త్‌వేవ్‌పై అనేక సందేహాలున్నాయి. దేశంలో ఆర్ వ్యాల్యూ అనేది పూర్తిగా కంట్రోల్ లోనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 1శాతం కంటే ఎక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 0.5 మాత్రమే ఉంది. ఫోర్త్ వేవ్ రాబోదని ఎన్ఐఎం సీరో సర్వేలాంటివి చెప్తున్నాయి. 93శాతం ప్రజల్లో కోవిడ్ యాంటీ బాడీస్ ఉన్నట్లు సీరో సర్వేల్లో వెల్లడైంది. ప్రజలందరూ ధైర్యంగా ఉండండి. అలాగని కరోనా భయం పూర్తిగా తొలగిపోలేదు. రాబోయే రోజుల్లో శుభకార్యాలు చాలా ఉన్నాయి. ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఫంక్షన్లు, ప్రయాణాల్లో ప్రజలందరూ మాస్క్ లు ధరించాలి. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలి, శానిటైజర్లు వాడాలని ప్రజలకు సూచిస్తున్నాం అని తెలిపారు డీహెచ్. చదవండి: భారత్‌లో వరుసగా రెండో రోజు కేసుల్లో పెరుగుదల -
Corona: కరోనా ఫోర్త్ వేవ్ హెచ్చరిక!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల విజృంభణ మళ్లీ మొదలవుతోందా? డెయిలీ కేసుల పెరుగుతుండడం అందుకు నిదర్శనమా? జూన్ కంటే ముందే.. ఫోర్త్ వేవ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయా?.. అవుననే సంకేతాలు ఇస్తూనే అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. భారత్‌లో వరుసగా 11 వారాల పాటు తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల్లో ఒక్కసారిగా పెరుగుల చోటు చేసుకుంది. గత ఒక్కవారంలోనే 35 శాతం కేసులు పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో కొన్ని రోజులుగా రోజువారీ కేసులు వెయ్యికి దిగువనే నమోదవుతున్నాయి. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య ఒకేసారి రెండు వేలను దాటేసింది. గత 24 గంటల్లో(సోమవారం బులిటెన్ ప్రకారం..) 2,183 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు నమోదైన కేసుల సంఖ్య 1,150 మాత్రమే. అంటే కేసుల సంఖ్య ఒక్క రోజులోనే దాదాపుగా 90 శాతం మేర పెరిగింది. రోజూవారీ పాజిటివిటీ రేటు చూసుకుంటే.. 0.31 శాతం నుంచి 0.83 శాతానికి పెరిగింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లో ఇన్ఫెక్షన్ల పెరుగుదల ఎక్కువగా నమోదు అయ్యింది. అయితే చాలాచోట్ల కేసులు తగ్గుముఖం పట్టిన పరిస్థితులు కనిపిస్తున్నా.. కొత్త వేరియెంట్లను తక్కువగా అంచనా వేయొద్దని, కేసులు ఒక్కసారిగా వెల్లువెత్తే అవకాశం లేకపోలేదని, ఈ పెరుగుదలను ఫోర్త్ వేవ్‌కి సంకేతాలుగా భావించి అప్రమత్తంగా ఉండాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కేసుల్ని పరిశీలించండి వైరస్ తీవ్రత లేదన్న ఉద్దేశం, వ్యాక్సినేషన్ కారణంగా ప్రభుత్వాలు సైతం కరోనాను పెద్దగా పట్టించుకోవడం లేదు. చాలాచోట్ల టెస్టింగ్-ట్రేసింగ్ కూడా జరగడం లేదు. ఈ తరుణంలో కరోనా మృతుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరగడం కలవరపరుస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 214 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 62 కేరళ బ్యాక్ లాగ్ మరణాలు ఉన్నప్పటికీ... అంతకు ముందు రోజులో పోలిస్తే రెగ్యులర్ కరోనా మరణాల సంఖ్య భారీగానే నమోదు అయ్యాయి. ఇప్పటికే కరోనా తీవ్రత తగ్గడంతో పలు రాష్ట్రాలు ఆంక్షల్ని సడలించడం, పూర్తి ఎత్తేయడం చేశాయి. దీంతో మాస్క్ ల్లేకుండా జనాలు స్వేచ్ఛగా సంచరించడం పెరిగింది. ఇదే కేసులు పెరగడానికి కారణం అవుతుందని ఎయిమ్స్ వైద్యులు భావిస్తున్నారు. ఈ తరుణంలో.. కేసుల పెరుగుదలపై దృష్టిసారించాలని వైద్య నిపుణులు రాష్ట్రాలకు కీలక సూచన చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కవచంగా భావించే ‘మాస్క్’ ధరించడాన్ని రూల్ తప్పనిసరి అమలు చేయాలని వాళ్లు కోరుతున్నారు. మాస్క్ మళ్లీ తప్పనిసరి యూపీలో కరోనా కేసుల పెరుగుదల కలవరపెడుతోంది. ఈ తరుణంలో గౌతమ్ బుద్ధ నగర్లో 65, ఘజియాబాద్‌లో 20, లక్నోలో 10 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో ఆరు జిల్లాల్లో మాస్క్ తప్పనిసరి నిబంధనను మళ్లీ తీసుకొచ్చింది యూపీ ప్రభుత్వం. ఇక తెలంగాణలోనూ మాస్క్‌ను తప్పనిసరి చేయబోతున్నారంటూ కథనాలు వెలువడుతున్నా.. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫోర్త్‌వేవ్ హెచ్చరికలు! ఇదిలా ఉండగా.. ఈ పరిస్థితులు ఫోర్త్ వేవ్‌కి దారి తీస్తాయో లేదో ఇప్పుడే చెప్పలేమన్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. .అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉందని గుర్తు చేస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో 517 కేసులు నమోదు అయ్యాయి. గత పదిహేను రోజుల్లో క్లోజ్ కాంటాక్ట్ 500 శాతం పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఘజియాబాద్, నోయిడా రీజియన్‌లోనూ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. విద్యార్థులతోనే కరోనా విజృంభిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో స్కూల్స్ మూతపడుతున్నాయి. దేశంలో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 4,30,44,280కి చేరుకోగా... మరణాల సంఖ్య 5,21,965గా నమోదు అయ్యింది. ప్రస్తుతం దేశంలో 11,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 2,66,459 డోసుల వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 1,86,54,94,355 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. సంబంధిత వార్త: మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. కొత్త మార్గదర్శకాలు జారీ -
ఇలాగైతే ఎలాగ?
తెలివిగల వాడు తొలిసారే తెలుసుకుంటాడు. తెలివితక్కువ వాళ్ళే నాలుగు చోట్ల అంటించుకున్న తరువాత కూడా తెలుసుకోరు! ఇది చిన్నప్పుడు మనకు పెద్దలు చెప్పే మాట. కరోనా విషయంలో అందరం మరోసారి గుర్తుతెచ్చుకోవాల్సిన మాట. కరోనా మొదటి ఉధృతిని తట్టుకొని, రెండో ఉధృతికి తల్లడిల్లి, అది ఇంకా పూర్తిగా తగ్గిందో లేదో తెలియక ముందే, రకరకాల వేరియంట్లు విదేశాల్లో వ్యాపిస్తున్నాయని వింటున్నా... వినోదాలు, విహారాలంటూ జనం గుంపులుగా చూపుతున్న తెలివితక్కువతనం చూస్తే ఏమనాలి? ఇంగ్లిష్‌లో కొత్తగా వచ్చిన ‘కోవిడియట్స్’ పదం స్ఫురణకు వస్తుంది. జనం ఇలా ఉంటే, కొందరు పాలకులు ‘కావడ్ యాత్ర’ (శివభక్తుల కావడియాత్ర) లాంటి సామూహిక ఉత్సవాలు, ఉప ఎన్నికలంటూ ఉత్సాహపడడం ఇంకా విడ్డూరం. ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే ప్రయత్నాల్ని అర్థం చేసుకోగలం కానీ, అర్థరహిత ప్రయత్నాలను ఎలా సమర్థించాలి? వద్దు బాబోయ్ అనుకుంటున్న కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడీ సామూహిక మూర్ఖత్వంతో ముందుకు చొచ్చుకువస్తే... అప్పుడు లెక్కలు వేసుకొని ఏం ప్రయోజనం? కరోనా ఎక్కువున్న ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మాట్లాడుతూ చెప్పిన అప్రమత్తత కానీ, ‘‘థర్డ్ వేవ్ అనివార్యం’’ అంటూ భారత వైద్య సంఘం (ఐఎంఏ) చేసిన హెచ్చరిక కానీ తప్పనిసరిగా చెవికెక్కించుకోవాల్సినవే! ఈశాన్యం లోనే కాదు... దక్షిణాదిన కేరళ, మహారాష్ట్రల్లో మళ్ళీ కేసులు గణనీయంగా పెరుగుతుండడం గమ నార్హం. ‘టెస్ట్ పాజిటివిటీ రేటు’ కేరళలో కొన్నిచోట్ల 10 శాతం పైన, మహారాష్ట్రలో 4.5 శాతం ఉంది. అలాగే, కరోనా వ్యాప్తి వేగాన్ని సూచించే ‘ఆర్–వ్యాల్యూ’ కూడా ఈ జూలైలో పెరుగుతున్నట్టు ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్’ పరిశోధకులు తేల్చారు. ఇది పారా హుషార్ పరిస్థితి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సరిగ్గా ఇలాగే జాగ్రత్తలు గాలికి వదిలేయడం వల్ల ‘ఆర్–వ్యాల్యూ’ పెరిగింది. ఏప్రిల్‌కి సెకండ్ వేవ్‌గా పరిణమించింది. కర్ణుడి చావుకు మల్లే ఈ దుఃస్థితికీ అనేక కారణాలు. అనేక రాష్ట్రాల్లో టెస్టుల సంఖ్య, అలాగే వేస్తున్న టీకాల సంఖ్య మునుపటి కన్నా బాగా తగ్గడం ఆందోళనకరం. జూన్ 19 నుంచి మొదలైన వారంలో దేశ వ్యాప్తంగా 4.12 కోట్ల టీకాలు వేస్తే, నెల తరువాత ఇప్పుడీ వారంలో కేవలం 91 లక్షల టీకాలే వేస్తున్నట్టు అంచనా. దీనికి అనేక రాష్ట్రాల్లో టీకా కొరత ఓ కారణం. దేశరాజధానిలో కోవిషీల్డ్ కొరత. ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో సరుకు లేక అనేక జిల్లాల్లో టీకాలు వేయడం ఆపేశారు. ఒకటి రెండు రోజులు టీకాలు వేయడం, తరువాత చాలా రోజులు టీకా కేంద్రాలను మూసేయడం– ఇదీ పరిస్థితి. ఇలా టీకాల కొరత ఉందంటూ రాష్ట్రాలు గగ్గోలు పెడుతుంటే, కొత్తగా ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి అవన్నీ అర్థం లేని వాదనలంటున్నారు. ఎప్పుడు, ఎన్ని డోసుల టీకాలు కేంద్రం నుంచి అందుతాయో ముందుగానే రాష్ట్రాలకు తెలుసంటున్నారు. జూన్‌లో లాగానే ఈ నెలకూ రాష్ట్రాలకు 12 కోట్ల డోసులు కేటాయిం చామనీ, వాటిని ఎలా వాడాలనే విషయంలో రాష్ట్రాలకు ప్రణాళిక లోపించిందనీ కేంద్రం వాదన. పరస్పర నిందారోపణల బదులు పరిష్కారం ఆలోచించడం తక్షణ కర్తవ్యం. ప్రైవేటు రంగంలో టీకాలు వేగంగా జరగనిచోట వాటికి కేటాయిస్తున్న టీకాలను తగ్గించడమో, ఆ విచక్షణను రాష్ట్రాలకు అప్పగించడమో కేంద్రం చేయవచ్చు. అలాగే, టీకా ఉత్పత్తిదారులు ఇప్పుడు నెలకు 12 కోట్ల డోసులే సరఫరా చేస్తున్నారు. ఈ ఆగస్టు కల్లా రోజుకు 30 కోట్ల డోసులు అందించేలా ప్రోత్సహిస్తే మేలు. దీనివల్ల రోజుకు కోటి మందికి టీకా వేయాలనే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఏడాది చివరికల్లా దేశంలోని వయోజనులందరికీ టీకాలు వేసేయవచ్చు. ఇది ఓ పెద్ద సవాలే. ఇప్పటి ఉత్పత్తి, టీకాలేసే వేగం సరిపోవనీ, అదనపు ప్రణాళిక – ఆచరణ ముఖ్యమనీ పాలకులు గ్రహించాలి. అదే సమయంలో ప్రజలు, పాలకులు పాత తప్పులు మళ్ళీ చేస్తేనే పెద్ద చిక్కు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా జాగ్రత్తలు గాలికి వదిలేసి, కుంభమేళాలో లక్షల మంది గుమిగూడే స్వేచ్ఛ నిచ్చారు. ఫలితం– ఆ నెల మొదట్లో దేశంలో కేసులు 80 వేలుంటే, నెలాఖరుకు దాదాపు 4 లక్షలకు చేరాయి. ఇప్పుడు ఉత్తరాదిన పక్షం రోజుల పాటు సాగే ప్రసిద్ధ ‘కావడ్ యాత్ర’ రానుంది. యూపీ, హర్యానా, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్ తదితర అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు హరిద్వార్ వెళ్ళి గంగాజలం తెచ్చుకొని, దారి పొడవునా ఆలయాల్లో శివుడికి అభిషేకిస్తారు. విమర్శలు తలెత్తడంతో ఉత్తరాఖండ్, ఒడిశా లాంటివి ఈ యాత్రను ఈసారి రద్దు చేశాయి. కానీ, ఎన్నికలు రానున్న ఉత్తరప్రదేశ్ పాలకులు మాత్రం షరతులతో కూడిన అనుమతులు ఇస్తామంటున్నారు. దీనిపై సుప్రీం కోర్టు కేంద్ర, యూపీ సర్కార్లకు నోటీసివ్వడం గమనార్హం. భక్తివిశ్వాసాలను గౌరవిస్తూనే, అందరూ షరతులకు కట్టుబడేలా చూడడం ఏ ప్రభుత్వానికైనా ఆచరణలో అసాధ్యమే. సౌదీ అరేబియా సైతం వరుసగా ఈ రెండో ఏడాది కూడా ఇతర దేశస్థులను హజ్ యాత్రకు అనుమతించడం లేదని గుర్తించాలి. ఇప్పటికే వరుస ఉత్సవాల సీజన్ మొదలై, టీకాలూ కొరతగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలకూ అప్రమత్తతే శరణ్యం. గుంపుగా బయట తిరిగింది... భక్తి కోసమా, భుక్తి కోసమా, వారాంతపు రక్తి కోసమా లాంటి విచక్షణ కరోనాకు పట్టదు. గుమిగూడితే వ్యాపించడమే దాని లక్షణం. అవును... థర్డ్ వేవ్ దానంతట అది రాదు. అజాగ్రత్త, అశ్రద్ధతో కోరికొని తెచ్చుకొంటేనే ఉధృతంగా వస్తుంది. గడప దాటే లోగానే మహ మ్మారిని మళ్ళీ ఇంట్లోకి పిలిస్తే ఆ తప్పు ముమ్మాటికీ మనదే! -
డెల్టాప్లస్ మూడో వేవా? కొత్త వేరియంట్‌పై ఆందోళన
మొదటి వేవ్ చివరిలో ఏర్పడిన కరోనా వేరియంట్లు మ్యుటేట్ అయి ఈ ఏడాది జనవరిలో డెల్టా వేరియంట్‌గా రూపాంతరం చెందాయి. ఇది రెండో వేవ్‌కు కారణమైంది. ఇప్పుడా డెల్టా రకం మరింతగా మ్యుటేషన్ చెంది ‘డెల్టా ప్లస్ (ఏవై 1)’గా మారింది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో దీనితో కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలోనూ దీంతో మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటించకుంటే మరో నెల రోజుల్లోనే మూడో వేవ్ మొదలవుతుందని, డెల్టా ప్లస్ విజృంభించే చాన్సుందని మహారాష్ట్ర సర్కారు ఇటీవలే హెచ్చరించింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆ రాష్ట్రంలో తొలిసారిగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదైంది. ఓ మహిళలో ఈ వేరియంట్‌ను గుర్తించిన అధికారులు.. కాంటాక్టులకు టెస్టులు చేయిస్తున్నామన్నారు. జార్ఖండ్‌లోనూ డెల్టా ప్లస్ కేసులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర సర్కారు పేర్కొంది. సాక్షి, హైదరాబాద్: కరోనా రెండో వేవ్ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. భారీ స్థాయిలో కేసులకు కారణమైన కరోనా డెల్టా వేరియంట్ నియంత్రణలోకి వస్తోంది. కానీ ఇంతలోనే డెల్టా వేరియంట్ మ్యుటేషన్ చెంది.. కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్‌గా మారిందని పరిశోధకులు ఇటీవల ప్రకటించారు. ఈ వేరియంట్ కారణంగా మూడో వేవ్ రావొచ్చన్న అంచనాలతో మరోసారి ఆందోళన మొదలైంది. ఇప్పటికే దేశాన్ని గడగడలాడించిన డెల్టా నుంచి రూపాంతరం చెందిన డెల్టా ప్లస్ ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. దీనివల్ల ప్రమాదం ఎంత వరకు ఉంటుంది, ఎలా ఉంటుంది, వ్యాక్సిన్లతో ప్రయోజనం ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేశంలో ఇప్పటికే చాలామంది డెల్టా వేరియంట్ బారినపడి కోలుకున్నందున.. డెల్టా ప్లస్ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని కొందరు వైద్య నిపుణులు, పరిశోధకులు చెప్తున్నారు. మరోవైపు దేశంలో కొన్ని కేసులే నమోదయ్యాయని, దాని ప్రభావమేంటో తెలిసేందుకు ఒకట్రెండు నెలలు పడుతుందని.. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండక తప్పదని మరికొందరు సూచిస్తున్నారు. వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ డెల్టా ప్లస్ వేరియంట్, మూడో వేవ్ అంచనాలపై పల్మనాలజిస్ట్ వీవీ రమణప్రసాద్, అసోసియేట్ ప్రొఫెసర్ కిరణ్ మాదల తమ అభిప్రాయాలు పంచుకున్నారు. డెల్టా ప్లస్‌తో మూడో వేవ్! సైద్ధాంతికంగా చూస్తే మనదేశంలో కరోనా మూడో వేవ్ డెల్టా ప్లస్ వేరియెంట్‌తోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడోదశ రావొచ్చనే అంచనాలు ఎక్కువగానే ఉన్నందున.. అది డెల్టా ప్లస్ ఆ రూపంలోనే ఉండే అవకాశాలు ఉన్నందున మరిన్ని జాగ్రత్తలు అవసరం. వ్యాక్సిన్లను కూడా తప్పించుకుని ‘ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం’ కిందకు కొత్త వేరియంట్ మారుతుందని కొందరు సూత్రీకరణలు చేస్తున్నా.. అలా జరిగే అవకాశాలు చాలా తక్కువ. దేశంలో కరోనా రెండో వేవ్ ఉధృతికి కారణమైన డెల్టా వేరియెంట్‌పై ఇప్పటికే మన దగ్గరున్న వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని వివిధ పరిశోధనలు తేల్చాయి. అందువల్ల ప్రస్తుతం వ్యాక్సినేషన్ అనేది కీలకంగా మారింది. వీలైనంత త్వరగా అవకాశమున్న మేర రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ప్రస్తుత లాక్ డౌన్‌ను మరికొంతకాలం కొనసాగించాలి. రెండో వేవ్ మాదిరిగానే మూడో వేవ్‌కు కూడా మహారాష్ట్ర నుంచే డెల్టా ప్లస్ వేరియెంట్‌తో మొదలయ్యే అవకాశం ఉంది. మూడో వేవ్ రాదనే అజాగ్రత్త వదిలేసి, డెల్టా ప్లస్ వేరియెంట్ పట్ల మరింత జాగరూకతతో వ్యవహరించాలి. ఈ విషయంలో ప్రభుత్వాలు, ప్రజలు అంతా అప్రమత్తంగా వ్యవహరించాలి. డెల్టా ప్లస్ వేరియెంట్ ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా వ్యాప్తి చెందుతుందనే ఒకటి రెండు నెలల్లో స్పష్టత వస్తుంది. ఒకవేళ డెల్టా ప్లస్ వేరియెంట్ విపరీతంగా వ్యాప్తి చెందినా.. తీవ్రత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగని జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం. - డాక్టర్ వీవీ రమణప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ప్రమాదం పెద్దగా ఉండకపోవచ్చు వైరస్ మ్యుటేషన్లలో సాధారణంగా స్పైక్ ప్రోటీన్ , రెసెప్టార్ బైండింగ్ డొమైన్ వంటివి మారుతుంటాయి. మనదేశంలో ఈ ఏడాది జనవరిలో బి.1.617 వేరియెంట్‌తో మహారాష్ట్రలో సెకండ్ వేవ్ మొదలైంది. మార్చి నాటికి అది డెల్టా (బీ.1.617.2) వేరియంట్‌గా రూపాంతరం చెంది తీవ్రత, వ్యాప్తి వేగం పెరిగింది. ఏప్రిల్ కల్లా దేశంలోని 50 శాతం కేసులకు, మే నాటికి 90 శాతం కేసులకు ఆ వేరియెంటే కారణమైంది. ఇప్పుడు రెండో వేవ్ తగ్గుతున్న దశలో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా శాంపిళ్లను పరిశీలిస్తే 20 శాతం దాకా డెల్టా వేరియంట్ వ్యాప్తిలో ఉంది. కొత్తగా నమోదయ్యే కేసుల్లో.. అమెరికాలో పదిశాతం, బ్రిటన్‌లో 60 శాతం దాకా ఇదే ఉంది. ప్రస్తుతం విదేశాల్లో ఈ వేరియెంట్ విస్తృతి దశలో ఉంది. అంటే.. మనకు ఇటీవలి మార్చిలో ఉన్నప్పటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ అలాంటి సమయంలోనే రెండు మార్పులు జరిగి డెల్టాగా మ్యుటేషన్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. మనం ఉధృతి దశను దాటి వచ్చేశాం. డెల్టా వేరియెంట్‌కు ఇప్పటికే దేశంలో చాలా వరకు ప్రజలు ఎఫెక్ట్ అయ్యి ఉంటారని అహ్మదాబాద్ సెరో ప్రివెలెన్స్ సర్వేను బట్టి తెలుస్తోంది. దేశంలోని ప్రతీ ముగ్గురిలో ఒకరికి యాంటీబాడీస్ కూడా ఉత్పత్తయి ఉంటాయని అంచనా వేశారు. ప్రజలు ఇంత భారీగా ఒక మ్యుటేషన్‌తో ప్రభావితమయ్యాక.. కొద్దికాలంలోనే మరో మ్యుటేషన్ బారిన పడటం జరగదని అంచనా వేస్తున్నారు. అదీగాక డెల్టా నుంచే, కేవలం 10 శాతం మార్పులతో వచ్చే మ్యుటేషన్‌కు పెద్దగా ప్రభావం చూపేంత శక్తి ఉండదు. అలాగాకుండా ఇండియాదే మరో తీవ్రమైన మ్యుటేషన్ వస్తే ప్రమాదకరం అయ్యే అవకాశాలు ఉంటాయి. - డాక్టర్ కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి నెల రోజుల్లోనే మూడో వేవ్! దేశంలో కరోనా రెండో వేవ్ మొదలైన మహారాష్ట్రలోనే మూడో వేవ్ కూడా మొదలుకావొచ్చన్న అంచనాల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా ఇదే హెచ్చరిక చేసింది. కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మూడో వేవ్ రావొచ్చని అంచనా వేసింది. లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారని, భారీగా గుమిగూడటం ఇలాగే కొనసాగితే.. మరో నెల రోజుల్లోనే మూడో వేవ్ మొదలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కరోనా పరిస్థితిపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఇటీవల ఉన్నతస్థాయిలో సమీక్షించారు. మూడో వేవ్‌ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై చర్చించారు. మూడో వేవ్ తీవ్రంగా ఉండొచ్చని, కేవలం మహారాష్ట్రలోనే యాక్టివ్ కేసుల సంఖ్య ఎనిమిది లక్షలకు చేరొచ్చని.. బాధితుల్లో పది శాతం వరకు పిల్లలు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. కాగా మన దేశంలో వచ్చిన కరోనా రెండు వేవ్‌లలో మహారాష్ట్ర ఎక్కువగా ప్రభావితమైంది. తొలివేవ్‌లో 19 లక్షల కేసులు, రెండో వేవ్‌లో ఏకంగా 40 లక్షల కేసులు వచ్చాయి. మూడో వేవ్‌లో ఇంతకు రెండింతలుగా ఏకంగా 80 లక్షల వరకు కేసులు రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. బెడ్లు, ఆక్సిజన్, మందుల స్టాకుపై దృష్టి మూడో వేవ్ సన్నద్ధతలో భాగంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని.. బెడ్లు, ఆక్సిజన్, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మహారాష్ట్ర సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టిపెట్టాలని సూచించారు. పీపీఈ కిట్లు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను పెద్ద సంఖ్యలో సమకూర్చుకోవాలని.. ప్రజలంతా భౌతిక దూరం, మాస్కులు వంటి కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. జార్ఖండ్‌లోనూ కేసులు.. జార్ఖండ్ రాష్ట్రంలోనూ పలు డెల్టా ప్లస్ కోవిడ్ కేసులను గుర్తించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కొందరు పేషెంట్ల శాంపిల్స్‌ను భువనేశ్వర్‌లోని ల్యాబ్‌కు పంపామని, అక్కడ చేసిన వైరస్ జన్యు పరీక్షల్లో డెల్టా ప్లస్‌గా గుర్తించినట్టు సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ కొత్త వేరియంట్ మరింత ప్రమాదకరం కావొచ్చని, దీని వ్యాప్తి తీవ్రతపై ఇంకా నిర్ధారణ జరగాల్సి ఉందని జార్ఖండ్‌లోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) మైక్రో బయాలజీ విభాగం అధిపతి మనోజ్ కుమార్ వెల్లడించారు. స్పైక్ ప్రొటీన్‌లో మార్పులతో.. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ (బీ.1.167.2)లో మ్యూటేషన్లు జరిగి డెల్టా ప్లస్ (ఏవై.1)గా రూపాంతరం చెందింది. కరోనా వైరస్ మన శరీర కణాలకు అతుక్కుని, లోపలికి ప్రవేశించేందుకు తోడ్పడే స్పైక్ ప్రొటీన్‌లో మార్పులు జరిగాయి. ఈ మార్పును ‘కే417ఎన్’గా పిలుస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం చేసిన వ్యాక్సిన్లలో చాలా వరకు ఈ స్పైక్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకునే పనిచేస్తాయి. ఇప్పుడీ ప్రొటీన్లోనే మార్పులు రావడంతో వ్యాక్సిన్లు ఎంత వరకు ప్రభావం చూపగలవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ సోకడం, వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల మన శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీల నుంచి కొత్త వేరియంట్ తప్పించుకోగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే డెల్టా ప్లస్ వేరియంట్లో వచ్చిన కొత్త మార్పులు కేవలం పదిశాతమేనని, దాని ప్రభావం మరీ ఎక్కువగా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వ్యాప్తి విపరీతంగా ఉన్నా.. ప్రమాదకరంగా మారే అవకాశం తక్కువనే ఆశాభావం కనిపిస్తోంది. కాగా.. కొత్తగా అందుబాటులోకి వచ్చిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టెయిల్ ఔషధం ప్రభావం నుంచి డెల్టా ప్లస్ వేరియంట్ తప్పించుకుంటున్నట్టుగా ఇటీవలి పరిశోధనల్లో గుర్తించారు. -
Covid Third Wave: మన పిల్లలు సేఫ్
కరోనా మూడో వేవ్‌లో పిల్లలకు ప్రమాదమనే అంచనాల నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో, ఎయిమ్స్ సంయుక్తంగా ఐదు రాష్ట్రాల్లోని 10 వేల మందిపై అధ్యయనం చేపట్టాయి. మన శరీరంలో వైరస్‌లపై పోరాడే సహజ రోగ నిరోధక స్పందన స్థాయిని సీరో పాజిటి విటీ అంటారు. తాజా అధ్యయనంలో పిల్లల్లో సీరో పాజిటివిటీ రేటును పెద్దవారితో పోలిస్తే పెద్ద తేడా లేదని గుర్తించారు. ముఖ్యంగా 10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో సీరో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంది. వారు ఎక్కువగా, స్వతంత్రంగా బయటికి వెళ్తుండటం దీనికి కారణం కావచ్చని అంచనా వేశారు. ‘ప్రస్తుతమున్న కరోనా వేరియంట్ల ద్వారా భవిష్యత్తులో వచ్చే మూడో వేవ్.. రెండేళ్లపైన వయసున్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే చాన్స్ తక్కువ’ అని అధ్యయనం పేర్కొంది. న్యూఢిల్లీ: పిల్లలపై కరోనా మూడో వేవ్ ప్రభావం మరీ భయపడినంత స్థాయిలో ఉండకపోవచ్చని వెల్లడైంది. పిల్లల్లో గతంలో ఇన్ఫెక్షన్ సోకిన (సీరో పాజిటివిటీ) రేటు అధికంగా, దాదాపు పెద్దలతో సమానంగా ఉన్న కారణంగా.. కరోనా మూడో వేవ్ ముప్పు పిల్లల్లో తక్కువగానే ఉంటుందని తాజా అధ్యయనం ప్రాథమికంగా తేల్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కలిసి ఐదు రాష్ట్రాల్లోని 10 వేల మందిపై ఈ అధ్యయనం చేస్తున్నాయి. ఇతరుల కన్నా పిల్లలపై మూడో వేవ్ ముప్పు అధికంగా ఉంటుందని ఆందోళనకర వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ స్టడీ ప్రాథమికంగా వెల్లడించిన వివరాలు.. కొంతవరకు ఆ భయాలను తొలగించే అవకాశముంది. ఈ అధ్యయనంలో ఎలీసా కిట్స్‌తో శరీరంలో కోవిడ్ యాంటీబాడీల స్థాయిని గుర్తించారు. మన శరీరంలో వైరస్‌లపై పోరాడే సహజ రోగ నిరోధక స్పందన స్థాయిని సీరో పాజిటివిటీగా పేర్కొంటారు. ఈ అధ్యయనానికి ఎయిమ్స్ ఎథిక్స్ కమిటీ ఆమోదం లభించింది. డేటా అందుబాటులో ఉన్న 4,509 మంది వలంటీర్లలో 700 మంది 18 ఏళ్లలోపు వయసు ఉన్నవారు కాగా.. మిగతా వారు 18 ఏళ్ల వయసువారు. వారి సగటు వయసు ఢిల్లీ (అర్బన్)లో 11, ఢిల్లీ (రూరల్)లో 12, భువనేశ్వర్ (ఒడిశా)లో 11, గోరఖ్‌పూర్ (యూపీ)లో 13, అగర్తల (త్రిపుర)లో 14గా ఉంది. వీరి నుంచి ఈ సంవత్సరం మార్చ్ 15 నుంచి జూన్ 10వ తేదీ మధ్య వివరాలు సేకరించారు. ‘పిల్లల్లో సీరో పాజిటివిటీ’ రేటు అధికంగా, దాదాపు పెద్దలతో సమానంగా ఉంది. అందువల్ల భవిష్యత్తులో ప్రస్తుతమున్న వేరియంట్ల ద్వారా వచ్చే మూడో వేవ్ రెండేళ్లపైన వయసున్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం తక్కువ’’ అని ఆ స్టడీ తేల్చింది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, డిపార్ట్మెంట్ ఆఫ్ సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్లు పునీత్ మిశ్రా, శశికాంత్, సంజయ్ కే రాయ్ తదితరులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. స్టడీ ప్రాథమికంగా నిర్ధారించిన ముఖ్యాంశాలు సీరో ప్రివలెన్స్ (జనాభాలో వ్యాధికారక వైరస్ ఉనికి) 18 ఏళ్లలోపు వయసు వారిలో 55.7%, 18 ఏళ్లపైన వయసున్న వారిలో 63.5%గా ఉంది. ఈ విషయంలో పెద్దలు, పిల్లల్లో తేడా ఎక్కువగా లేదు. కరోనా సోకిన సమయంలో 50.9 శాతం పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. రెండో వేవ్ ముందు దక్షిణ ఢిల్లీలో జనసాంద్రత అధికంగా ఉన్న ఒక కాలనీలో సీరో ప్రివలెన్స్ రేటు 74.7%. అలాగే ఫరీదాబాద్ ప్రాంతంలోని పిల్లల్లో ఆ రేటు 59.3%. రెండో వేవ్ తరువాత ఆ ప్రాంతాల్లో ఈ రేటు మరింత పెరిగే అవకాశముంది. గ్రామీణ జిల్లా అయిన గోరఖ్‌పూర్‌లో సీరో ప్రివలెన్స్ రేటు 87.9 శాతంగా ఉంది. సర్వే చేసిన గ్రామీణ ప్రాంత జనాభాలో సగానికి పైగా (62.3%) ఇప్పటికే వైరస్ బారిన పడినటుŠల్ నిర్ధారణ అయింది. త్రిపురలో స్టడీలో పాల్గొన్న పిల్లల్లో 51.9% మందికి మాత్రమే సీరో ప్రివలెన్స్ కనిపించింది. దేశవ్యాప్తంగా 2020 ఆగస్ట్‌లో కూడా సీరో ప్రివలెన్స్ సర్వే జరిపారు. అప్పుడు 10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 3,021 మంది పిల్లల్లో పాజిటివిటీ రేటు 9 శాతమే కాగా, ప్రస్తుత సర్వేలో అది 60.3% కావడం గమనార్హం. -
జడుపు వీడి జాగ్రత్తపడదాం
భయాలను అధిగమించే సాక్షాధారాలు, శాస్త్రీయ సమాచారమే మనిషి మనుగడకు దీపదారి. మానవేతిహాస సుదీర్ఘ గమనంలో కాలపరీక్షకు నిలిచిన నిజాలే మనిషి జీవన గమనాన్ని శాసించాయి. నిష్కారణ భయాలు, నిర్హేతుక ఆందోళనలు కాలం గడిచే కొద్దీ గాలికి కొట్టుకు పోయే దూదిపింజల్లా కనుమరుగయ్యాయి. ఏ కొత్త పరిణామం విషయంలోనైనా... అనిశ్చితి వల్ల భయాందోళనతో గడపటమా? భరోసాతో నిర్భయంగా ఉండటమా అన్నది వాస్తవిక సమాచారాన్ని బట్టే ఉంటుంది. కోవిడ్-19 మూడో అల గురించి, ముఖ్యంగా పిల్లలకు ప్రమాద మని వస్తున్న వార్తలు, వార్తా కథనాలు గగుర్పాటు పుట్టిస్తున్నాయి. ఆయా కథనాలు, అంచనాల వెనుక శాస్త్రీయత ఎంత? సాక్షాధారాలపై అధ్యయనాలు చెబుతున్నదేమిటి? నిపుణుల విశ్లేషణలెలా ఉన్నాయి...? అని చూసినపుడు పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. వాస్తవికత కన్నా అంచనాలే అధికం. సాక్షాధారాల కన్నా ప్రమాద ఆస్కారపు భయాలే ఎక్కువ ప్రచారం లోకి వచ్చాయి. వీటిని గుడ్డిగా నమ్మకుండా, కాస్త లోతుగా విశ్లేషించినపుడు... కలతతో భయాందోళన చెందాల్సినంత ప్రమాదం లేదనిపిస్తోంది. అప్రమత్తంగా ఉండి, తగు జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. కొన్ని అధ్యయనాల్లో పౌరుల, పిల్లల మానసిక స్థితి అదుపు తప్పి అరిష్టాలు సృష్టించిన ఉదంతాలున్నాయి. కనుక, ప్రాథమిక అవగాహన, సంపూర్ణ విషయ పరిజ్ఞానంతో మసలుకోవడమే మేలు. అంటే... నిర్లక్ష్యంగానో, ఏదీ పట్టనట్టో ఉండా లని కాదు! అలా అని, లేని భయాలతో పరుగులు పెట్టి స్వయంగాను, ఇతరులను ఆందోళనకు గురిచేయవద్దనేది భావన! కోవిడ్-19 కారణమవుతున్న కరోనా వైరస్ తరచూ ఉత్పరివర్తన చెందుతూ స్వభావాన్ని మార్చుకుంటున్న తీరు, ప్రభావితం చేస్తున్న పోకడ ప్రమాదకరంగానే ఉంది. మొదటి అల కన్నా రెండో అల సృష్టించిన విధ్వంసాన్ని కళ్లారా చూశాం. దేశంలో నిలకడగా రోజూ నాలుగు లక్షలకు తగ్గకుండా కేసులు నమోదైన దుస్థితి! పాతిక రోజుల్లో లక్షమంది మరణించారు. కొత్త వైవిధ్యం ‘డెల్టా’ వల్ల ఇంతటి ఉపద్రవం అనేది విశ్లేషణ! ఇలాగే, ‘డెల్టా ప్లస్’, మరో ఉత్పరి వర్తన- వైవిధ్యంతో వైరస్ రేపు ఇంకో రూపు సంతరించుకుంటే అనివార్యంగా ‘మూడో అల‘ పుట్టొచ్చు! ప్రతికూల ప్రభావమూ చూపొచ్చు. దాన్నెవరూ కాదనలేరు. అది చూపే తీవ్రత, కలిగించే నష్టం మాత్రం, మన వ్యవహార శైలిని బట్టే ఉంటుంది. మొదటి అల ప్రభావం తగ్గిన వెంటనే... మనం ఆంక్షలు సడలించి, నిర్భందం ఎత్తేసి, కట్టడిని తొలగించిన వైనం సవ్యంగా లేకుండింది. మార్గదర్శకాల్ని గాలికి వదిలి... మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా, గుంపులుగా కలియతిరుగుతూ జనం చేసిన స్వేచ్ఛా విహారం వైరస్ వ్యాప్తిని పెంచింది. ఫలితంగా రెండో అల ఉదృతమైంది. కోవిడ్ సముచిత ప్రవర్తన (సీఏబీ) పూర్తిగా మరిచాం. ప్రమాదస్థితి చెయిదాటి, మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మొదటి, రెండో అలల సందర్భంగా దేశంలో, ప్రపంచ వ్యాప్తంగానూ పిలల్లలపై అవి చూపిన ప్రభావం గురించి పలు అధ్యయనాలు జరిగాయి. కోవిడ్ సోకిన పిల్లల్లో (నవజాత శిశువులు కాకుండా పదేళ్ల లోపు వారు) 0.1 నుంచి 1.9 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరాల్సి వచ్చింది. ఆస్పత్రి పాలైన వారిలోనూ 1.3 నుంచి 3.2 శాతం మంది మరణించారు. అందులో 40 శాతం మంది, అప్పటికే ఇతరేతర జబ్బుల (కోమార్బిడిటీస్)తో ఉన్నవారు. మన దేశంలో కోవిడ్ వల్ల మరణించిన మొత్తం 3.7 లక్షల మందిలో పిల్లలు 0.1 శాతం అనేది గుర్తించాలి. కారణం ఏమైతేనేం, రెండు అలల సందర్భంగా పిల్లల విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పటివరకు పెద్దలకు టీకా మందు ఇప్పిస్తున్నాము. పిల్లల టీకా గురించి ఇంకా ఆలోచించలేదు. టీకా పొందిన వారికి వైరస్ సోకినా ప్రాణాంతక ప్రమాదం లేక, వారు వైరస్ వాహకులుగా పిల్లలకు వ్యాధిని అంటించవచ్చు... ఇలాంటి వేర్వేరు కారణాల వల్ల రేపు, మూడో అల వచ్చి, ఉదృతంగా ఉంటే... పిల్ల లకు అధిక ప్రమాద ఆస్కారం ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఇదొక ముందు జాగ్రత్త! అంతే తప్ప, మూడో అలలో వైరస్ పిల్లల కోసమే రాదు! వారికి వైరస్ సోకనీకుండా, సోకే ఆస్కారం తొలగించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలపై తీవ్రత ప్రభావం అధ్యయనానికి ప్రత్యే కంగా ఏర్పాటైన ‘లాన్సెట్–కోవిడ్ కమిషన్ ఇండియా టాస్క్‌ఫోర్స్’ నిపుణులు కూడా ఇదే సూచించారు. పిల్లల మానసిక స్థితిపై కోవిడ్ ప్రభావం గురించి 10 దేశాల్లో జరిగిన 15 అధ్యయనాల ప్రకారం... 22,996 మంది పిల్లలు/ కౌమారుల్లో, 79.4 శాతం మంది కోవిడ్‌కు భయపడి క్వరంటైన్ అయ్యారు. 21.3 శాతం మంది నిద్రలేమి/ నిద్రా భంగానికి గురయ్యారు. 22.5 శాతం మంది భయం వల్ల ఆస్పత్రి పాలు కావాల్సి వచ్చింది. పిల్లలు మానసికంగా ఆందోళనకు గురికాకుండా చూడాలని నిపుణుల సూచన. వైరస్ సోకే ఆస్కారం లేకుండా జాగ్రత్త పడాలి. మంద్రంగా లక్షణాలు కనిపించినా ఇంట్లోనే వేరుగా (ఐసొలేషన్) ఉంచి, జ్వరం మాత్రలు వేయాలి. కొంచెం తీవ్రత, ఇన్ఫెక్షన్ వంటివి వస్తే వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి. దేశవ్యాప్తంగా టీకా ప్రక్రియను ముమ్మరం చేయాలి. ప్రస్తుత కట్టడిని దశల వారిగా ఉపసంహరించాలి. పౌరులు కోవిడ్ సముచిత ప్రవర్తనతో మెదలాలి. పిల్లల్ని కాపాడుకోవడమంటే మన భవిష్యత్తును భద్రపరచుకోవడమే! ఇది మనవిధి, అంతకు మించి కర్తవ్యం! -
నవ కెరటం!
► మహిళల క్రికెట్లో దూసుకెళుతున్న స్మృతి మంధన ► దూకుడైన ఆటతో అదరగొడుతున్న వైనం స్మృతి మంధన కిట్ బ్యాగ్‌లో దాదాపు భారీ సైజ్ బ్యాట్ ఒకటి ఉంటుంది. ప్రాక్టీస్ సమయంలో ఆమె దాన్ని కూడా తప్పనిసరిగా తీసుకొస్తుంది కానీ దాంతో బ్యాటింగ్ మాత్రం చేయదు. అది రాహుల్ ద్రవిడ్ సంతకం చేసి ఆమె అన్నకు బహుమతిగా ఇచ్చిన బ్యాట్. స్మృతి క్రికెట్ మొదలు పెట్టినప్పుడు ద్రవిడ్ అంత గొప్ప ప్లేయర్ కావాలని దీవిస్తూ సోదరుడు ఇచ్చిన ఆ బ్యాట్ ఆమెకు ఎప్పటికప్పుడు స్ఫూర్తినిస్తూ ఉంటుంది. ఒకప్పుడు స్మృతి, మ్యాథ్యూ హేడెన్లా ఆడేందుకు ప్రయత్నించింది. అలాంటి ఆటతీరు నీకు నప్పదంటూ కోచ్ చెప్పడంతో బలంకంటే టైమింగ్‌నే నమ్ముకుంటూ కుమార సంగక్కర శైలిని అనుకరించింది. ఆసీస్ గడ్డపై టి20 సిరీస్ గెలిచినప్పుడు స్వయంగా ప్రశంసించిన హేడెన్, సొంత శైలిని అలవర్చుకోమని చెప్పడం ఆమె ఆటను మార్చింది. బ్యాటింగ్‌లో యువరాజ్‌ను అభిమానించినా... తనదైన ప్రత్యేకత కోసం శ్రమిస్తున్న స్మృతి మంధన ఇప్పుడు భారత మహిళల క్రికెట్లో కొత్త కెరటం. సాక్షి క్రీడా విభాగం ‘పురుషుల క్రికెట్లో ఇప్పుడు 18వ నంబర్ జెర్సీకి చాలా ప్రత్యేకత ఉంది. చూస్తూ ఉండండి కొద్ది రోజుల్లోనే మహిళల 18వ నంబర్ కూడా సంచలనానికి కేంద్రంగా మారుతుంది’... ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ జరిగినప్పుడు విరాట్ కోహ్లితో పోలుస్తూ కామెంటేటర్లు చేసిన వ్యాఖ్య స్మృతికి లభిస్తున్న గుర్తింపునకు అద్దం పడుతుంది. దాదాపు ఐదు నెలల క్రితం ఆస్ట్రేలియాలోని బిగ్‌బాష్ లీగ్‌లో ఫీల్డింగ్ చేస్తూ స్మృతి మోకాలికి తీవ్ర గాయమైంది. దాంతో ఆమె వరల్డ్ కప్ క్వాలిఫయర్, దక్షిణాఫ్రికాలో నాలుగు దేశాల టోర్నీకి దూరమైంది. ఈ గాయం కెరీర్‌ను ముగిస్తుందేమోనని కూడా ఆమె భయపడింది. అయితే దీనినుంచి కోలుకొని మళ్లీ బరిలోకి దిగేందుకు మంధన తీవ్రంగా కష్టపడింది. బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహ్యాబిలిటేషన్ ప్రోగ్రాంలో ఆటతో పాటు ఫిట్నెస్ కోసం కూడా అదనంగా శ్రమించింది. స్వయంగా కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఆమె కోలుకోవడంపై సందేహాలు వ్యక్తం చేసినా... పట్టుదలగా తిరిగొచ్చిన స్మృతి ప్రపంచ కప్‌కు తన ఎంపిక సరైందేనని నిరూపించింది. నాన్న, అన్న అండగా..: మహారాష్ట్రలోని సాంగ్లి పట్టణం స్మృతి స్వస్థలం. స్మృతి సోదరుడు శ్రవణ్ మహారాష్ట్ర తరఫున అండర్–19 స్థాయి వరకు ఆడాడు. వర్ధమాన ఆటగాడిగా రాణిస్తున్న సమయంలో అతని పేరు, స్కోర్లు పదే పదే స్థానిక పత్రికల్లో రావడం ఆమెను ఆకర్షించింది. దాంతో తాను కూడా క్రికెట్ ఆడతానన్న ఆమె కోరికను తండ్రి శ్రీనివాస్ కాదనలేదు. అయితే సాధారణంగా కుడి చేతి వాటమే అయినా... తండ్రికి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌పై మక్కువ ఉండటంతో అలా ఆమె ఎడమచేతి వాటంగా మారింది. స్థానిక కోచ్ అనంత్ వద్ద ఆటను మెరుగుపర్చుకున్న స్మృతి 9 ఏళ్ల వయసులో మహారాష్ట్ర అండర్–15 జట్టులో, 11 ఏళ్ల వయసులో అండర్–19 జట్టులోకి ఎంపిక కావడం విశేషం. సైన్స్ చదవడం తనకు ఇష్టమని చెప్పినా... ఆటపైనే దృష్టి పెట్టమంటూ తల్లి స్మిత ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె దూసుకుపోయింది. దేశవాళీ అండర్–19 వన్డేల్లో గుజరాత్‌పై 224 నాటౌట్‌తో పాటు మరో మూడు సెంచరీలు చేయడం స్మృతి సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. అనంతరం చాలెంజర్ టోర్నీకి, ఆపై భారత సీనియర్ జట్టుకు ఎంపిక కావడం చకచకా జరిగిపోయాయి. మెరుపు బ్యాటింగ్..: 16 ఏళ్ల వయసులో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో స్మృతి తొలిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తర్వాతి సంవత్సరం వార్మ్స్లీలో ఇంగ్లండ్‌పై చారిత్రక టెస్టు విజయం సాధించిన భారత జట్టులో స్మృతి సభ్యురాలు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఎనిమిది మందిలో ఈమె కూడా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ సాధించి గెలుపులో కీలక పాత్ర కూడా పోషించింది. ఏడాదిన్నర క్రితం హోబర్ట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 109 బంతుల్లో 102 పరుగులు సాధించిన మ్యాచ్ ఆమె కెరీర్లో చెప్పుకోదగ్గ క్షణం. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లపై చెలరేగిన తీరు ఆమెకు ఉమెన్ బిగ్‌బాష్ లీగ్‌లో అవకాశాన్ని కల్పించింది. ‘స్మృతిలో నేను గమనించిన లక్షణం ఆమె దూకుడు. ఒక్కసారి తాను గట్టిగా నిర్ణయించుకుంటే ఏ సవాల్‌కైనా సిద్ధంగా ఉంటుంది. అది ఎలాంటిదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా వంద శాతం శ్రమిస్తూ ఏటికి ఎదురీది వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. లేదంటే హోబర్ట్లాంటి ఇన్నింగ్స్ అందరికీ సాధ్యం కాదు’ అని ఆమెపై భారత జట్టు మాజీ కోచ్ పూర్ణిమా రావు ప్రశంసలు కురిపించారు. రెండు ఇన్నింగ్స్‌లతోనే ఆగిపోను, ప్రపంచకప్ గెలవడమే లక్ష్యం అంటున్న స్మృతి మంధన మున్ముందు బ్యాట్స్‌మన్‌గా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అది మాత్రమే మారింది... ఈ నెల 18తో 21 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న స్మృతి, సాంగ్లిలోనే కామర్స్‌లో రెండో ఏడాది డిగ్రీ చదువుతోంది. ప్రపంచ కప్‌కు ముందు వరకు ఆమె కంటి సమస్యతో బాధ పడింది. ఫలితంగా కెరీర్ ఆరంభం నుంచి కళ్లద్దాలు ధరించే ఆమె బ్యాటింగ్ చేస్తూ వచ్చింది. అది ఆటకు అడ్డుగా మారకున్నా... దీనికి ఫుల్స్టాప్ పెట్టాలని స్మృతి భావించింది. మోకాలి గాయంతో కోలుకుంటున్న సమయంలోనే కంటికి శస్త్రచికిత్స చేయించుకొని ఇప్పుడు కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగింది. ‘వేటాడే పులి తరహాలో బ్యాటింగ్ సమయంలో ఆమె కళ్లలో అప్పుడూ, ఇప్పుడూ కూడా అదే తీవ్రత, ఏకాగ్రత ఉంది. కళ్ల జోడు లేకపోవడం ఒక్కటే మార్పు. మిగతాదంతా సేమ్ టు సేమ్’ అని ఆమె సహచరులు స్మృతి గురించి ఇప్పుడు చెబుతున్నారు.