డివిడెండ్ చెల్లించిన ఎన్హెచ్డీసీ
భోపాల్ : హైడ్రోపవర్ మేజర్ నర్మదా జలవిద్యుత్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్హెచ్డీసీ ) మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి భారీ డివిడెండ్ చెల్లించింది. సుమారు రూ 195. 87 కోట్ల డివిడెండ్ ను శుక్రవారం చెల్లించింది. ఈ డివిడెండ్ చెక్కును చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధీమన్ పారిజ్ నిన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి అప్పగించారు, ఒక అధికారి ఒకరు చెప్పారు.
2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను డివిడెండ్ చెక్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుకుందని ఎన్హెచ్డీసీ సంస్థ అధికారి తెలిపారు. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం, ఎన్హెచ్పీసీ భాగస్వామ్య సంస్థే ఎన్హెచ్డీసీ. భోపాల్ కేంద్రంగా 2000 సం.రంలో స్థాపించిన ఈ జాయింట్ వెంచర్ సంస్థ రాష్ట్రంలో హడ్రో పవర్ (జలశక్తి) ఇతర పునరుద్ధరణ శక్తి అభివృద్ధి దిశగా పనిచేస్తుంది.