ట్వింకిల్... ట్వింకిల్... లిటిల్ స్టార్స్ జాగ్రత్త!
‘ఒంటరిగా వెళ్లవద్దు.. పార్కుకు, పాఠశాలకు, బీచ్‌కి, మరెక్కడికైనా... మేనమామ, బంధువు లేదా స్నేహితుడైనప్పటికీ.. ఏ వ్యక్తితోనూ ఒంటరిగా వెళ్లవద్దు. ఉదయం, సాయంత్రం మరీ ముఖ్యంగా రాత్రిపూట అస్సలు ఒంటరిగా వెళ్లవద్దు’ అంటూ... నలభై ఏళ్ల క్రితం తల్లి తన చిన్నతనంలో నేర్పించిన భద్రతా పాఠాలనే ఇన్నేళ్ల తర్వాత తన కూతురు నితారాకు కూడా బోధిస్తున్నట్లు గుర్తించానని ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా నాటి బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా చెప్పింది.కోల్‌కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో యువ ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటన అనంతరం తన కుమార్తెతో తాను ఈ విధంగా సంభాషణ జరిపినట్టు తెలిపింది. అమ్మాయిల భద్రతకు సంబంధించి ఆఫ్‌లైన్‌లో ఇలాంటి ప్రమాదకర స్థితి ఉంటే ఆన్లైన్ ముప్పు మరో విధమైన సమస్యలకు లోను చేస్తుంది. డిజిటల్లో ఆడపిల్లల భద్రతకు సంబంధించి పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులేం చెబుతున్నారో తెలుసుకుందాం.నేటి డిజిటల్ యుగంలో అమ్మాయిల భద్రత బయటి ప్రదేశాలకు మించి విస్తరించింది. గతంలో అపరిచితుల నుంచి ప్రమాదం, రహదారి భద్రత, ఆట స్థలం ప్రమాదాలు.. ఈ ఆందోళనలు ఉండేవి. ఇప్పుడు ఇవి ఇలాగే కొనసాగుతుండగా డిజిటల్ యుగం మరో క్లిష్టమైన లేయర్‌ని ప్రవేశపెట్టింది.ఆన్ లైన్ ముప్పు..ఈ రోజుల్లో పిల్లలు ఆన్ లైన్ ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇక్కడ పిల్లలను కబళించేందుకు మోసగాళ్లు.. చాట్ రూమ్‌లు, సోషల్ మీడియా ల్యాట్ఫారమ్లు, గేమింగ్ కమ్యూనిటీలలో దాగి ఉంటున్నారు. ఆన్ లైన్ వస్త్రధారణ, దోపిడీ నుంచి వారిని రక్షించడానికి అప్రమత్తత, డిజిటల్ అక్షరాస్యత ప్రతి ఒక్కరికీ అవసరం.సైబర్ బెదిరింపులు..ఇంటర్నెట్ అనేది అపరిచితుల నుంచి బెదిరింపులను ్రపోత్సహిస్తుంది. సైబర్ బెదిరింపు పిల్లల మానసిక ఆరోగ్యానికి, ఆత్మగౌరవానికి ముప్పుగా మారుతుంది.అనుచితమైన కంటెంట్..కేవలం కొన్ని క్లిక్‌లతో, పిల్లలు వారి వయస్సుకు మించి అనుచితమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరు, ఇది వారి అభివృద్ధికి ఆటంకమే కాదు హాని కూడా కలిగించవచ్చు. రోడ్డు ప్రమాదాలు, గాయాలు, ప్రకృతి వైపరీత్యాలు పిల్లల భద్రతకు ముప్పును కలిగిస్తూనే ఉన్నాయి. అందువల్ల, ఆఫ్‌లైన్– ఆన్లైన్ నష్టాలను పరిష్కరించే భద్రతా విద్యకు సమతుల్య విధానం అవసరం.అవగాహన తప్పనిసరి..– భయాన్ని పెంచడం కంటే తెలివైన ఎంపికలు చేయడానికి వారిని శక్తిమంతం చేయడంపై దృష్టి పెట్టాలి.– తగిన పర్యవేక్షణ, మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే పిల్లలు పరిపక్వం చెందుతున్నప్పుడు క్రమంగా మరింత స్వాతంత్య్రం పొందేందుకు అనుమతించాలి. – పిల్లలకు సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్పించాలి. నమ్మకం, పరస్పర గౌరవం ఉండే వాతావరణాన్ని సృష్టించాలి.– అధిక రక్షణ వారి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఆందోళనను సృష్టిస్తుంది. వారు వారి తప్పుల నుండి నేర్చుకునేలా వయసుకి తగిన స్వేచ్ఛను, అవకాశాలను ఇవ్వాలి.– ఆన్ లైన్ బెదిరింపులను విస్మరించవద్దు. ప్రస్తుత ఆన్ లైన్ ట్రెండ్స్, ప్రమాదాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఇంటర్నెట్ భద్రత గురించి మీ చుట్టూ ఉన్నవారితో మాట్లాడుతూ ఉండండి.– డిజిటల్ భద్రత అనేది కేవలం శారీరక శ్రేయస్సు కంటే ఎక్కువ. హద్దుల్లో ఉండటం, ఆరోగ్యకరమైన సంబంధాలు, అనుచితమైన ప్రవర్తనను ఎలా గుర్తించాలి, ప్రతిస్పందించాలనే దాని గురించి పిల్లలకు బోధించడం ద్వారా భావోద్వేగ భద్రతను పరిష్కరించాలి.డిజిటల్ పేరెంటింగ్ తప్పనిసరి..ఇంట్లో పిల్లలు సేఫ్‌గా ఉన్నారు అనుకుంటారు కానీ, నేటి రోజుల్లో బయట కన్నా డిజిటల్లోనే మరిన్ని ప్రమాదాల బారినపడుతున్నారు. నేరుగా కన్నా ఆన్లైన్లోనే చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ ఎక్కువ జరుగుతుంది. డిజిటల్ మోసగాళ్లు టీనేజ్ అమ్మాయిలను ఆకర్షించి సరోగసి, ఆర్గాన్ ట్రేడింగ్ చేస్తున్నారు. కొత్తదనాన్ని ఆస్వాదించాలి అంటూ పిల్లలను హిప్నోటైజ్ చేస్తుంటారు. వారిని తప్పుదారి పట్టించి, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసుకోవడం.. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడటం... ఫలితంగా పిల్లలు భయాందోళనకు లోనవడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి.ఫోన్ లేదా ట్యాబ్ లేదా ఇతర గ్యాడ్జెట్స్‌లో పేరెంటల్ కంట్రోల్ ఉండేలా చూసుకోవాలి. ఫ్యామిలీ ఇ–మెయిల్ తప్పనిసరి. ఏ వయసువారికి ఎలాంటి ఆన్లైన్ గేమ్స్ బెటర్ అనేవి తెలుసుకోవాలి. ప్రమాదాల వంక పెట్టి పిల్లలను డిజిటల్ నుంచి దూరం చేయకుండా అవగాహన కల్పించడం అవసరం. సమస్య తలెత్తితే చైల్డ్ హెల్ప్‌లైన్: 1098, నేషనల్ కమిషన్ ఫర్ ్ర΄÷టెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సిపిసిఆర్), ఓసిఎస్ఎఇ (ఆన్లైన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అండ్ ఎక్స్ల్యాయిటేషన్), పోక్సో, మినిస్ట్రీ ఆఫ్ ఉమన్ అండ్ చైల్డ్ రైట్స్ (ఎమ్డబ్ల్యూసీడీ),..లోనూ కేస్ ఫైల్ చేయచ్చు. – అనీల్ రాచమల్ల, సైబర్ సేఫ్టీ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్