స్టార్ హీరో సరదా బెడిసి కొట్టింది..!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న తన ఫ్యామిలీ లైఫ్ మాత్రం మిస్ చేసుకోడు. ముఖ్యంగా తన పిల్లలు ఆరవ్, నిటారాలతో గడపటం అంటే అక్షయ్ కి చాలా ఇష్టం. కొద్ది రోజులుగా టాయిలెట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న అక్షయ్, ఇప్పుడు కాస్త ఫ్రీ టైం దొరకటంతో తన కూతురు నిటారాతో కలిసి సరదాగా ఆడుకుంటున్నాడు. భార్య ట్వింకిల్ విహారయాత్రకు ఆస్ట్రియా వెల్లటం, కొడుకు ఆరవ్ ఉన్నత చదువుల కోసం అమెరికాలో ఉండటంతో నిటారాను అక్షచే చూసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కూతురితో ఆడుకుంటున్న అక్షయ్ సరదా బెడిసి కొట్టింది. నిటారాను ఉయ్యాల ఎక్కించి ఆడిస్తున్నారు. పాప ఉయ్యాల ఊగుతున్నప్పుడు అక్షయ్ ఎదురుగా నిలబడ్డారు. ఉయ్యాల వేగంగా ఊగుతుండటంతో పాప కాళ్లు ఏకంగా అక్షయ్ ముఖం మీదకు వచ్చాయి. దీంతో ఉలిక్కి పడిన కిలాడీ స్టార్, వెంటనే తెరకొని కిందపడకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన అక్షయ్'డ్యాడీస్ డే అవుట్ బెడిసికొట్టింది' అని కామెంట్ చేశాడు.
Daddy's day out gone wrong #ParentLife pic.twitter.com/qygsDRsF2U
— Akshay Kumar (@akshaykumar) 25 July 2017