అక్షయ్.. స్వీట్ ఫాదర్
షూటింగులతో బిజీ బిజీగా ఉండే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. ఖాళీ సమయం దొరకితే పూర్తిగా కుటుంబంతో గడిపేందుకే కేటాయిస్తారు. ఎంత స్టార్డమ్ ఉన్నప్పటికీ.. పిల్లల విషయంలో మాత్రం అక్షయ్ ఓ సాధారణ తండ్రే. ఇటీవల తన గారాలపట్టి నిటారాను తీసుకుని సినిమాకు వెళ్తూ కెమెరా కంట్లో పడ్డారు. భార్య ట్వింకిల్ ఖన్నా, నిటారాలతో కలిసి సినిమా చూసేందుకు మాల్కు వెళ్లిన అక్షయ్.. నిటారాను జాగ్రత్తగా ఎత్తుకుని కనిపించి ఫ్యాన్స్ను ఫిదా చేశారు.
కెమెరాలు వరుసపెట్టి క్లిక్మంటుంటే భయపడిన నిటారా తండ్రిని హత్తుకుంది. అక్షయ్ తన పాపను ఎంతో జాగ్రత్తగా ఎత్తుకుని ఆమెకు భయపడొద్దని చెప్తూ అక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఈ తండ్రీకూతుళ్ల వెనకాలే ట్వింకిల్ నవ్వుకుంటూ నడిచారు. నిటారా, అక్షయ్ల ఫొటోలు చూసిన పలువురు తెగ ముచ్చటపడుతున్నారు. తన చిన్నారి పాపను బుజ్జగించిన తీరు చూసి 'వావ్' అంటున్నారు.
కాగా అక్షయ్ నావల్ అధికారిగా నటించిన 'రుస్తుం' సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్ను దాటేసింది.