non-subsidized
-
విమాన ఇంధనం.. డీజిల్ కన్నా చౌక!
ఢిల్లీలో లీటరు డీజిల్ రూ. 51.52.. విమాన ఇంధనం రూ.46.51 న్యూఢిల్లీ: గతనెలలో పెట్రోలు ధర కంటే తక్కువైన విమాన ఇంధనం(జెట్ ఫ్యూయెల్) ధర ఆదివారం మరో 11.3 శాతం తగ్గి డీజిల్ కన్నా కూడా చౌక అయింది. ఢిల్లీలో ఏటీఎఫ్(విమాన టర్బైన్ ఇంధనం) ధర రూ.46.51కి తగ్గింది. ప్రస్తుతం అక్కడ డీజిల్ ధర రూ.51.52 వద్ద ఉంది. ఢిల్లీలో కిలోలీటరు ఏటీఎఫ్ ధర రూ.5,909.9కి తగ్గింది. గత నెలలో తగ్గింపు వల్ల ఏటీఎఫ్ ధర లీటరుకు రూ.52.42కు తగ్గింది. దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర (రూ.58.91) కన్నా విమాన ఇంధన ధరే తక్కువైంది. సాధారణంగా ఏటీఎఫ్ కన్నా ఆటోమొబైల్ వాహనాలకు వాడే ఇంధనం నాణ్యత తక్కువగా ఉంటుంది. అందువల్ల ధర కూడా తక్కువగా ఉంటుంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన కంపెనీలకు ఈ తగ్గింపుతో ఊరట లభించనుంది. నాన్‌సబ్సిడీ గ్యాస్‌పై రూ. 103 తగ్గింపు అంతర్జాతీయంగా చమురు ధరలు ఆరేళ్లలోనే అతి తక్కువకు పడిపోవడంతో సబ్సిడీయేతర వంట గ్యాసు సిలిండర్‌పై కేంద్రం రూ.103.5 తగ్గించింది. అయితే, పెట్రోలు, డీజిల్ ధరల్లో మాత్రం మార్పు లేదు. -
స్తంభించిన గ్యాస్ సరఫరా
తగ్గింపు వివరాలు ఏజెన్సీలకు అందని వైనం నిలిచిపోయిన విక్రయాలు జిల్లాలో ప్రజల ఇక్కట్లు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : చమురు కంపెనీలు గ్యాస్ ధరలు తగ్గించినా ఆ మేరకు ఉత్తర్వులు అందకపోవడంతో జిల్లాలో శనివారం సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. చమురు కంపెనీల నుంచి ఏజెన్సీలకు కూడా గ్యాస్ సరఫరా కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీలలో కూడా అమ్మకాలు నిలిచిపోయాయి. ఇటీవల గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజల నెత్తిన భారం మోపిన కేంద్ర ప్రభుత్వం గృహావసరాల గ్యాస్ సిలిండర్‌పై రూ.110, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.270 తగ్గించింది. దీని ప్రకారం గృహావసరాలకు వాడే 14 కేజీల గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం సబ్సిడీతో కలిపి రూ.1,320 ఉండగా ఫిబ్రవరి నుంచి రూ.1,210 చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నాన్ సబ్సిడీలో సరఫరా చేసే కమర్షియల్ గ్యాస్ 19 కేజీల సిలిండర్ రూ.2,320 నుంచి రూ.2,050కి తగ్గింది. నిలిచిపోయిన విక్రయాలు... తగ్గించిన ధరల వివరాలను చమురు కంపెనీలు గ్యాస్ ఏజెన్సీలకు పంపకపోవటంతో విజయవాడ నగరంలో, జిల్లాలో 76 గ్యాస్ ఏజెన్సీలలో సిలిండర్ల విక్రయాలు నిలిచిపోయాయి. ప్రతిరోజూ జిల్లాలో 21 వేల గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తారని అంచనా. ఆధార్ లింక్‌పై ప్రకటనలు గుప్పిస్తూ ప్రభుత్వం నుంచి సబ్సిడీ గ్యాస్‌పై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయకపోవటంతో గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఏడాదికి గతంలో ఇచ్చే తొమ్మిది సిలిండర్లను 12కి పెంచుతూ ప్రభుత్వం నుంచి గ్యాస్ ఏజెన్సీలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. జరుగుతున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రెండు సిలెండర్లు ప్రతి వినియోగదారునికీ ఇస్తారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఏడాదికి 12 సిలెండర్లు సరఫరా చేయాలని గ్యాస్ ఏజెన్సీలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
సామాన్యునిపై గ్యాస్ ‘బండ’
=సిలిండర్ ధర పెంచిన సర్కారు =సబ్సిడీ సిలిండర్‌పై రూ.30, నాన్ సబ్సిడీ సిలిండర్‌పై రూ.215 పెంపు చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: గ్యాస్ సిలిండర్ల ధర పెంచుతూ జనంపై సర్కారు పెనుభారం మోపింది. ప్రజలు ఊహించని రీతిలో కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా దీన్ని జనం నెత్తినవేసింది. పదిహేను రోజుల క్రితం ఒక్కో సిలిండర్‌పై 13 రూపాయల చొప్పున కేంద్రం పెంచింది. ఇది చాలదన్నట్లు బుధవారం మరోమారు కొరడా ఝుళిపించింది. ఒక్కో సిలిండర్‌పై 30 రూపాయల చొప్పున పెంచి వినియోగదారుల నెత్తిన మరింత భారం వేసింది. ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కలసి సిలిండర్ ధర 1145 రూపాయలకు చేరుకుంది. జిల్లాలో సుమారు ఏడు లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో దీపం కనెక్షన్ కలిగిన వారు రెండు లక్షల మంది వరకు ఉన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించే సిలిండర్ల సంఖ్య సుమారు మూడు వేల వరకు ఉంది. నాన్ సబ్సిడీ సిలిండర్‌పై రూ.215 భారం నాన్ సబ్సిడీ సిలిండర్ వినియోగదారులనూ కేంద్ర ప్రభుత్వం విడిచి పెట్టలేదు. ఈ కోటాలో వినియోగదారులు ఇప్పటి వరకు రూ.1112.50 వంతున చెల్లిస్తున్నారు. ఈ సిలిండర్ల ధరను 215 రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వినియోగదారులు 1327.50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో వాణిజ్య అవసరాలకు సిలిండర్లు వినియోగించే 8,865 మందిపై భారం పడింది. అలాగే గృహ వినియోగదారులు 9 సిలిండర్ల కోటా దాటితే రూ.1327.50 చొప్పున కొనాల్సిందే. సిలిండర్ల ధర పెంపు నేపథ్యంలో వినియోగదారులు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ధరల పెంపునకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర పెంచుకుంటూ పోతే ఎలా ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడం అన్యాయం. ఇప్పటికే రాయితీ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో సరిగా జమ కావడం లేదు. ఆధార్‌తో లింక్ పెట్టి రాయితీ సొమ్ము నెలలు తరబడి వేయడం లేదు. దీనికితోడు ప్రతి పదిహేను రోజులకోసారి సిలిండర్ల ధర పెంచుకుంటూ పోతే ఎలా. -దీప్తి, గృహిణి, చిత్తూరు సామాన్యుల పరిస్థితి ఏంటి ప్రతి పదిహేను రోజులకోసారి ధరలు పెంచుకుంటూ పోతున్నారు. ఇలా అయితే సామాన్యులు ఎలా బతుకుతారు. జనం పరిస్థితిని కేంద్రం ఇకనైనా పట్టించుకోవాలి. అలాగే ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా ప్రభుత్వం రాయితీపై సిలిండర్ ఇవ్వాలి. -కవిత, గృహిణి , చిత్తూరు -
గుదిబండ
=పెరిగిన నాన్ సబ్సిడీ గ్యాస్ ధర =ఆధార్ ఇవ్వకపోతే సిలిండర్ రూ. 1323 =రూ. 10 వ్యాట్ వడ్డన అదనం =నేటినుంచే కొత్త ధరలు అమలు =వినియోగదారుల బెంబేలు కొత్త ఏడాది తొలిరోజునే యూపీఏ సర్కార్ గ్యాస్ వినియోగదారులపై నెత్తిన గుదిబండ పడేసింది. నాన్ సబ్సిడీ సిలిండర్ ధరను పెంచినట్లు ప్రకటించి గృహ వినియోగదారులను కూడా దొంగదెబ్బ తీసింది. గ్యాస్ ధర పెరగడంతో ఒక్కో సిలిండర్‌కు రూ. 10 చొప్పున వ్యాట్ భారం అదనంగా పడుతుంది. ఏడాదిలో సబ్సిడీపై తొమ్మిది సిలిండర్లు పొందినవారు ఆ తర్వాత నుంచి పెరిగిన ధర ప్రకారం రూ.1323 పెట్టి కొనుక్కోవాల్సిందే. ఆధార్ నంబర్ ఇవ్వనివారు గురువారం నుంచి కొత్త ధర పూర్తిగా చెల్లించడం మింగుడుపడని విషయం. ఇక కమర్షియల్ వినియోగదారులపై ఒక్కో బండకు రూ. 395 భారం పడింది. విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గ్యాస్ సిలిండర్ల గృహ వినియోగదారులను కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దొంగదెబ్బతీసింది. ప్రత్యక్షంగా చెప్పుకోదగిన భారం పడనట్లే కనిపించినా ఒక్కో వినియోగదారుడు ఈ నెలలో అదనంగా మరో రూ. 200 ముందుగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. నాన్ సబ్సిడీ సిలిండర్ ధర పెంచినట్లు చెబుతున్నా... పెరిగిన ధరను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చినా.. పేదలు, సామాన్య, మధ్యతరగతి వర్గాల వారు ప్రతి నెల అదనపు పెట్టుబడి పెట్టాల్సివస్తోందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పెరిగిన ధరల ప్రభావం జిల్లాలోని 74 గ్యాస్ ఏజెన్సీల్లో ఉన్న పది లక్షల డొమెస్టిక్, రెండు లక్షల కమర్షియల్ వినియోగదారులపై పడుతుంది. ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసిన వినియోగదారులకే ఈనెల నుంచి గ్యాస్ సబ్సిడీ లభిస్తుందని డీలర్లు చెబుతున్నారు. అలా చేయని వారు నాన్ సబ్సిడీ ధర మొత్తం చెల్లించి గ్యాస్ కొనుగోలు చేయాల్సిందే. పెరిగిన ధరలు ఇలా.. గత నెలలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధర రూ. 1868 ఉండగా, జనవరి నుంచి రూ. 2263కి పెంచారు. ఒక్కో బండపై రూ. 395 పెరిగింది. గృహ వినియోగదారులైతే ఏడాదికి తొమ్మిది సిలెండర్లు మించితే నాన్ సబ్సిడీ ధరపైనే కొనుగోలు చేయాలి. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌కు గత నెలలో రూ. 1104 చెల్లించగా, రూ. 634 సబ్సిడీని ప్రభుత్వం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అంటే 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 470లకు విక్రయించారు. పెరిగిన ధరల ప్రకారం ఈ నెలలో ప్రతి వినియోగదారుడు గ్యాస్ బుక్ చేసి ముందుగా రూ. 1323 చెల్లించాలి. ప్రభుత్వం రూ.843 సబ్సిడీని వినియోగదారుల ఖాతాల్లో జమచేస్తుంది. గ్యాస్ సిలిండర్ ధర రూ. 480 అవుతుంది. ఈ నెల నుంచి ప్రతి వినియోగదారుడు గ్యాస్ కొనుగోలుకు అదనంగా రూ. 200 పెట్టుబడి పెట్టాల్సిందే. ఇలా ప్రతి నెలా సిలిండర్‌కు రూ. 1323 పెట్టుబడిగా పెట్టడం పెనుభారమవుతుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. డీలర్ల గగ్గోలు .. పెరిగిన ధరలతో గ్యాస్ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కో లోడుకు రూ. 5 లక్షలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సివస్తుందని భయపడుతున్నారు. గురువారం నుంచే గ్యాస్ ధర పెరగడంతో పెద్ద మొత్తంలో పెట్టుబడి సొమ్ము వెతుక్కోవలసి వస్తున్నదని వారు వాపోతున్నారు.