Notaries
-
ఖజానా నింపండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టొద్దని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సూచించింది. భూముల అమ్మకాలతో పాటు నోటరీల క్రమబద్ధీకరణ, పన్నుల ఆదాయం పెంపు తదితర మార్గాల ద్వారా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని ఆదేశించింది. ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకష్ణారావు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్, ఆర్థిక, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఆ శాఖ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ శాఖల రాబడులు, బకాయిలకు సంబంధించిన వివరాలను మంత్రులకు వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నిధుల సమీకరణకు సంబంధించిన పలు అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి పలు సూచనలు చేసినట్టు తెలిసింది. పన్ను ఆదాయం మరింత పెంచండి రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన భూముల అమ్మకాల ప్రక్రియను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. మూడు ప్రధాన పారిశ్రామిక వాడల అమ్మ కాలతో పాటు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న విలు వైన ప్రభుత్వ భూములను అటు ప్రజా ప్రయోజనార్థం వినియోగించుకోవడంతో పాటు ఖజానా కు ఊతమిచ్చే విధంగా ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ప్రత్యేకంగా దష్టి పెట్టి పనిచేయాలని మంత్రివర్గం సూచించింది. అదేవిధంగా నోటరీల ద్వారా క్రయ విక్రయ లావాదేవీలు జరిగిన స్థలాలు, నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటన చేసినందున అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పన్ను వసూళ్ల విషయంలో పకడ్బందీగా వ్యవహరించడం ద్వారా ఆదాయం పెరుగుతున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ పన్ను ఎగవేత జరగకుండా అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని స్పష్టం చేసింది. పన్ను ఆదాయం పెంచడం ద్వారా రెవెన్యూ శాఖలు ప్రభుత్వ మనుగడ సజావుగా సాగేట్టు చూడాలని ఉపసంఘం ఆదేశించింది. పన్నుల ఆదాయం ఇప్పటికే ఆశించిన విధంగా ఉన్నప్పటికీ మరింత పెరిగేలా కషి చేయాలని కోరింది. వారం రోజుల్లో 58, 59 జీవోల సంబంధిత పట్టాలు మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. వాటి ప్రకారం.. జీవో 58, 59లకు (ప్రభుత్వ స్థలాల్లో అనుమతుల్లేని నిర్మాణాల క్రమబద్ధీకరణ సంబంధిత జీవోలు) సంబంధించి వచ్చిన దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. ఇప్పటికే డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేసి ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. పేదలకు ఇళ్ల స్థలాలపై సీసీఎల్‌కు ఆదేశాలు పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియపై కూడా ఉపసంఘం చర్చించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏయే జిల్లాల్లో ఎన్ని పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయో గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని సీసీఎల్ఏను ఆదేశించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందేలా చూడాలని, జిల్లాల కలెక్టర్లు రోజువారీగా సమీక్షలు నిర్వహించి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న పేదలకు హక్కులు కల్పించి వారి జీవితాల్లో ఆనందం నింపాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని, ఆ దిశగా అధికారులు కషి చేసి అర్హులైన వారికి ప్రభుత్వం అందించే ప్రయోజనాన్ని కలిగించాలని సూచించింది. -
నోటరీలో నకి‘లీలలు’
ఆధార్ కార్డులు మార్చాలన్నా, పుట్టిన తేదీ, డెత్ సర్టిఫికెట్లు, వీలునామాలు, భూ వివాదాలు, ఎన్నికల్లో పోటీ, స్వీయ ధ్రువీకరణలు ఇలా అన్నిరకాల పనులకు అధికారిక ధ్రువీకరణ కలిగిన న్యాయవాది చేత నోటరీ చేయించుకోవాలి. నోటరీ చేస్తేనే దానికనుగుణంగా పనులు జరుగుతాయి. దీనిని ఆసరాగా చేసుకుని అర్హతలేని కొందరు వారి వద్ద తయారు చేసి ఉంచిన స్టాంపులు, సంతకాలు పెట్టి అర్జీదారుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. అర్హత ఉన్న న్యాయవాదుల పేరుతో కొందరు ఏజెంట్లు, కంప్యూటర్ దుకాణదారులు, సిబ్బంది డమ్మీ స్టాంపులు రూపొందించి వాటిపై ఫోర్జరీ సంతకాలతో నోటరీలు జారీ చేస్తున్నారు. త్వరగా పనులు జరుగుతుండటంతో ప్రజలు వాటిపై పెద్దగా ఆలోచన చేయకుండా అడిగినంత సమర్పించుకుంటున్నారు. సాక్షి, అమరావతి : విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని ప్రధాన పట్టణాలైన మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, అవనిగడ్డ, నూజివీడు, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో ఈ విధమైన అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం. సబ్ రిజిస్ట్రార్, కోర్టు ప్రాంగణాలలోని కొన్ని కంప్యూటర్ దుకాణాల నిర్వాహకులే లాయర్ల పేరుతో స్టాంపులు తయారు చేసుకున్నారు. వినియోగదారులు వచ్చినప్పడు లాయర్ గారు అందుబాటులో లేరని, తమకు అదనపు సొమ్ము అందజేస్తే ఇప్పటికిప్పుడే సంతకాలు చేసి సీల్ వేసిన నోటరీ పేపర్లు ఇస్తామని బేరాలకు దిగుతున్నారు. నోటరీ ద్వారా చేయించే పనులు దాదాపుగా అత్యవసరం కావడంతో ఓ రెండు వందలు అధిక మొత్తం చెల్లించైనా నోటరీ సంపాదిస్తున్నారు. ఇలా సదరు నకిలీ నోటరీల ద్వారా నిత్యం వేలాది రూపాయల్లో అక్రమమార్గంలో సంపాదిస్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నింటికీ అర్జీదారుడు పూర్తి సమ్మతితో రూపొందించిన ప్రమాణపత్రాన్ని ఆధారాలను పరిశీలించి నోటరీ లైసెన్స్ ఉన్న న్యాయవాది స్టాంపు వేసి సంతకం ధ్రువీకరిస్తారు. అర్హత ఉన్న న్యాయవాదులు, లైసెన్స్ పొందని న్యాయవాదుల పేరుతో అక్రమార్కులు డమ్మీ స్టాంపులను తయారు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక్కో నోటరీకి రూ. 300 నుంచి రూ.600 వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం సాధారణ నోటరీకి రూ.50, రూ.100 మాత్రమే వసూలు చేయాలి. ప్రభుత్వ పథకాల్లో నోటరీల అవశ్యకత ఉండటంతో వీటి ప్రభావం పథకాల్లో అవకతవకలు జరిగే ప్రమాదముంది. అర్హతలు ఇవీ... భారత ప్రభుత్వం రూపొందించిన నోటరీ యాక్ట్–1952 నోటరీకి ఉండవల్సిన అర్హతలు, నియమాలు, విధివిధానాలను సూచిస్తోంది. నోటరీ చేయడానికి న్యాయవాది పట్టా పొంది పది సంవత్సరాలు కోర్టులో ప్రాక్టీసు చేసి అనంతరం నోటరీ చేయడానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఏడేళ్లకే నోటరీకి అర్హత లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భారతీయ లీగల్ సర్వీసెస్‌లో సభ్యులై ఉండి ప్రత్యేక అనుమతులను పొంది ఉండాలి. ఇలా పొందిన లైసెన్సులను ప్రతి మూడేళ్లకోసారి రెన్యువల్ చేయించుకోవాలి. జిల్లాలో కొందరికి నోటరీ అర్హత ఉన్నప్పటికి లైసెన్స్ రెన్యూవల్ చేయించకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారు ఇప్పటికీ సంతకాలు పెట్టి నోటరీలు జారీచేస్తున్నారు. అడ్డుకోకపోతే ప్రమాదమే... అక్రమమార్గంలో నోటరీలు జారీచేస్తుండటంతో చాలా ప్రమాదాలు జరిగే అవకాశముంది. అర్హతలు లేకపోయినప్పటికీ ప్రభుత్వ పథకాలు పొంది, వాటికి అన్ని అర్హతలు ఉన్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. మరోవైపు ఆస్తి సంబంధిత విషయాల్లోను సంఘర్షణలు తలెత్తుతాయి. సంఘ విద్రోహులు సులువుగా ప్రభుత్వ గుర్తింపుకార్డులు పొందే అవకాశముంది. బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లో చొరబడిన పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ విధంగా నకిలీ పత్రాలతో పశ్చిమ బెంగాల్ పౌరసత్వం పొందిన ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. పైకి చిన్నగా కనిపించినప్పటికీ దాని వల్ల జరిగే పరిణామాలు గుర్తించి అధికారులు స్పందించి నకిలీ నోటరీల ఆటకట్టించాలి. మరోవైపు వీటితో ఏమాత్రం సంబంధంలేని న్యాయవాదులకు కూడా మకిలి అంటే ప్రమాదం ఉంది. -
దసరాలోగా ‘గురుకుల’ ఫలితాలు
► నెలాఖరులో డీఎస్సీ నోటిఫికేషన్! ► సన్నద్ధమవుతున్న టీఎస్పీఎస్సీ సాక్షి, హైదరాబాద్: గురుకుల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలు దసరాలోపు వెలువడనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు అందనందున.. ఆ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు పదిహేను, ఇరవై రోజుల సమయం పట్టవచ్చని సమాచారం. గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్పీఎస్సీ ఇటీవలే పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలన్నీ ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించినందున.. త్వరగానే ఫలితాలు విడుదల చేసేందుకు అవకాశముందని, ఆ దిశగా కసరత్తు జరుగుతోందని టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. ఈ పరీక్షల ఫలితాలన్నీ నెలాఖరులోగానే వెల్లడించేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిపాయి. విద్యా శాఖ నుంచి సమాచారం కోసం.. 8,452 టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన నేపథ్యంలో నోటిఫికేషన్ జారీకి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే సంబంధిత పోస్టుల వివరాలు, జిల్లాల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు, స్థానికత నిబంధనలు తదితర సమాచారం విద్యా శాఖ నుంచి రావాలని.. ఆ వెంటనే నోటిఫికేషన్ జారీకి కసరత్తు మొదలవుతుందని కమిషన్ వర్గాలు తెలిపాయి. ఈ సమాచారం అందించేందుకు విద్యా శాఖకు కనీసం వారం పట్టవచ్చని.. ఆ తర్వాతే సిలబస్ ఖరారు, మార్గదర్శకాలు, అర్హతలను నిర్ధారించాల్సి ఉంటుందని వివరించాయి. ఈ నేపథ్యంలో టీచర్ పోస్టుల నోటిఫికేషన్ సెప్టెంబర్ నెలాఖరులోగానీ అక్టోబర్‌లో గానీ వెలువడే అవకాశముందని పేర్కొన్నాయి. -
రిజిస్ట్రేషన్లలో నోటరీలకు స్వస్తి!
మున్సిపాల్టీల్లో మార్టిగేజ్ రిజిస్ట్రేషన్లపై స్పష్టత ఇచ్చిన రిజిస్ట్రేషన్ల శాఖ సాక్షి, హైదరాబాద్: పురపాలక సంఘాల్లో భూమి/భవ నాల తనఖాకు సంబంధించి నోటరీలు చెల్లవని రిజిస్ట్రే షన్ల శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 2013 డిసెంబర్లోనే ఉత్తర్వులిచ్చినా అమలుకు నోచుకోవడం లేదు. రిజిస్ట్రేషన్ల శాఖకు వార్షికాదాయం తగ్గడానికి ఇది కూడా కారణమని గ్రహించిన ఉన్నతాధికారులు తాజాగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇకపై పట్టణ ప్రాంతాల్లోని ఏ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ నోటరీలను పరిగ ణలోకి తీసుకోవద్దని సబ్రిజిస్ట్రార్లకు ఆదేశాలిచ్చారు. ఏదైనా భవన నిర్మాణానికి పురపాలక సంఘాల నుంచి అనుమతి తీసుకునేటప్పుడు నిబంధనల ప్రకారం 10 శాతం భూమి లేదా భవనాన్ని సదరు మున్సిపాలిటీకి మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్‌డ్యూటీ రూ.5వేలతో పాటు మార్కెట్ వాల్యూలో 0.5శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. 2013కు ముందు భవన నిర్మాణ అనుమతి కోసం పురపాలక సంఘాలకు దరఖా స్తు చేసుకునే యజమానులు 10 శాతం భూమి/భవనాన్ని తనఖా పెట్టినట్లుగా నోటరీ చేయించేవారు. 2013 తరువాత కూడా ఇది కొనసాగించడం వల్ల శాఖ ఆదాయానికి గండి పడుతోంది. దీంతో శాఖ తాజా నిర్ణయం తీసుకుంది.