nvs nagi reddy
-
వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం అగ్రికల్చర్ మిషన్‌పై సమీక్ష నిర్వహిస్తున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, సాగునీరు, పెట్టుబడి సాయం, పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్ తదితర అంశాలపై చర్చించేందుకు ఆయన ఇవాళ ఉదయం తాడేపల్లిలోన తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు అధికారులుతో సమావేశం అయ్యారు. కాగా వ్యవసాయ రంగ సంక్షోభానికి పరిష్కార మార్గాలు కనుగొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విధాన సలహా మండలిగా అగ్రికల్చర్ (వ్యవసాయ) మిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వ్యవసాయం, అనుబంధ రంగాలు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉత్తమ సమన్వయానికి ఈ మిషన్ దోహదపడుతుంది. రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఎప్పటి కప్పుడు ఉత్తమమైన సేవలు అందించడం, ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల ధరలు సహా వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తుంది. అలాగే వ్యవసాయ సంస్థలకు, రైతాంగానికి ఎప్పటికప్పుడు మార్గదర్శకత్వం వహిస్తుంది. రైతులు సాధికారిత సాధించేలా విధానపరమైన ప్రాథమిక వేదికగా ఉంటుంది. ఈ మిషన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చైర్మన్‌గా, రైతు నాయకుడు ఎంవీ ఎస్ నాగిరెడ్డి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. -
గోపాలకిృష్ణ ద్వివేదీని కలిసిన నాగిరెడ్డి
-
పథకాలు అందాలంటే ఆ పార్టీకే ఓటేయ్యాలంట..!
సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘం ఆదేశాలను ధిక్కరించి ఎన్నికల ప్రక్రియనే చంద్రబాబు నాయుడు సవాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేత ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకిృష్ణ ద్వివేదీకి శనివారం ఆయన ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుత పదవిలో ఉండి ఎన్నికల తాయిలాలపై చంద్రబాబు బహిరంగ సభలో ప్రసంగించినట్లు సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యాంగం ప్రకారం, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసి.. ఎన్నికల వేళ నియంతలా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యమన్నా, ఎన్నికల సంఘమన్నా చంద్రబాబుకి లెక్కలేదని, పథకాల పేరుతో ఆయన తరఫున డబ్బులు పంచుతానని ప్రకటించడం బరితెగింపుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు నిజస్వరూపం విశాఖ సభలో బయటపడిందని అన్నారు. ప్రభుత్వ ధనాన్ని పార్టీ ధనంగా వాడుకొంటున్నారని, ఆయనది రాచరిక పాలన అని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలను అందాలంటే టీడీపీకి ఓటు వేయ్యాలని లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఎన్నికల సంఘం ధర్మబద్ధంగా వ్యవహరించి ఎన్నికలను సజావుగా జరిపించాలని ఆయన కోరారు. -
‘పవన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు’
సాక్షి, విజయవాడ: అధికారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంత నీచానికైనా దిగజారుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లో అమలుకు వీలుకాని హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, అబద్ధపు వాగ్ధానాలతో మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం కేవలం అబద్ధాలు చెప్పడానికే ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు నాయుడు వాడుతున్న బాష అభ్యతరకరంగా ఉందన్నారు. గతంలో జగన్‌కు ఓటువేస్తే.. కాంగ్రెస్‌కు వేసినట్టే అని ప్రచారం చేశారని, ఇప్పుడేమో కేసీఆర్‌కి వేసినట్టే అని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హరికిృష్ణా శవం పక్కన పెట్టుకుని టీఆర్ఎస్తో పొత్తుకు వెంపర్లాడింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. తన రాజకీయ స్వార్థ ప్రయోజనం కోసం తెలంగాణలో ఆంధ్ర వాళ్లపై దాడులు జరుగుతున్నాయని ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అండతోనే సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. వైఎస్సార్ బతికి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని స్పష్టం చేశారు. -
ప్రభుత్వం వెనుకడుగు వేస్తే...
హైదరాబాద్: ఏపీలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఏపీ రైతు విభాగం రాష్ట్రస్థాయి సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు రుణమాఫీ చేయకుండా హామీలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. జిల్లాల్లో సాగుబడి గణనీయంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం బేషరతుగా పంట రుణాలు మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలన్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తే రైతాంగానికి తమ పార్టీ అండగా ఉంటుందని నాడిరెడ్డి భరోసాయిచ్చారు.