Offense
-
Calcutta High Court: వారిని డార్లింగ్ అనడం లైంగిక వేధింపే
కోల్‌కతా: ఫూటుగా తాగి మహిళా కానిస్టేబుల్‌ను డార్లింగ్ అని పిలిచిన ఓ వ్యక్తిని దోషిగా తేలుస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు వెలువరిచింది. పరిచయం లేని మహిళను అలా పిలవడడాన్ని ‘లైంగిక వేధింపు నేరం’గా పరిగణిస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ సందర్భంగా ఇదే కేసులో గతంలో కింది కోర్టు ఇచి్చన తీర్పును హైకోర్టు సమర్థించింది. భారతీయ శిక్షాస్మృతిలోని 354ఏ (మహిళా గౌరవాన్ని భంగపరచడం), 509 సెక్షన్ల కింద అతడిని దోషిగా తేలి్చంది. మహిళా కానిస్టేబుల్‌ను మద్యం మత్తులో డార్లింగ్ అని పిలిచిన జనక్ రామ్ అనే వ్యక్తికి గతంలో పడిన శిక్షను సమరి్థస్తూ జస్టిస్ జై సేన్ గుప్తా నేతృత్వంలోని ఏకసభ్య హైకోర్టు ధర్మాసనం తాజా తీర్పును వెలువరిచింది. ‘‘ పరిచయంలేని మహిళను తాగిన/తాగని వ్యక్తి నడి వీధిలో డార్లింగ్ అనే పిలిచే ధోరణి భారతీయ సమాజంలో లేదు. నిందితుడు మద్యం మత్తులో ఉంటే అప్పుడు నేరాన్ని మరింత తీవ్రమైనదిగా పరిగణిస్తాం’ అని జడ్జి వ్యాఖ్యానించారు. అండమాన్ నికోబార్ ద్వీపంలోని మాయాబందర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జనాన్ని అదుపు చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను ‘చలాన్ వేయడానికి వచ్చావా డార్లింగ్?’ అంటూ జనక్‌రామ్ వేధించాడు. -
రైల్లో అలారం చైన్‌కు లగేజీ తగిలిస్తే కేసు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులు, లగేజీ బ్యాగులు, సెల్ఫోన్లను అలారం చైన్ పుల్లింగ్ పరికరానికి వేలాడదీయడం చట్టరీత్యా తీవ్ర నేరమని రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో హెచ్చరించారు. పలు ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్ల కోచ్‌లను ఎల్బీహెచ్ కోచ్‌లుగా ఆధునీకరించారు. అత్యవసర పరిస్ధితిలో రైలును ఆపేందుకు గతంలో ఉపయోగించిన అలారం చైన్ స్థానంలో పాసింజర్స్ ఎమర్జెన్సీ అలారం సిగ్నలింగ్ డివైజ్ (పీఈఏఎస్డీ) అమర్చారు. ఈ పరికరం ఎరుపు రంగుతో హ్యాండిల్‌ను పోలి ఉండటంతో ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులు, లగేజీలు, సెల్‌ఫోన్‌ను వేలాడదీస్తున్నారు. ఈ కారణంగా పరికరం ఆటోమెటిక్‌గా లాక్ అయ్యి రైలు నిలిచిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ఈ తరహా ఘటనలు అక్టోబరు వరకూ డివిజన్ వ్యాప్తంగా 2,159 జరిగినట్టు పేర్కొన్నారు. ప్రయాణికులు సరైన కారణం లేకుండా అలారం చైన్ ఉపయోగించడం తీవ్ర నేరమని, రైల్వే చట్టం 141 సెక్షన్ ప్రకారం రూ.1000 జరిమానా, లేదా ఒక ఏడాది జైలు శిక్ష లేదా రెండు విధించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చదవండి: ‘స్కిల్’ శిక్షకులకు ఆహ్వానం -
చెక్ బౌన్స్ నేరం... ఇక క్రిమినల్ కాదు!!
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన సంక్షోభంతో తల్లడిల్లుతున్న వ్యాపార వర్గాలకు కాస్త ఊరటనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చిన్న చిన్న ఉల్లంఘనలను క్రిమినల్ చర్యల పరిధి నుంచి తప్పించడంపై దృష్టి సారించింది. ఖాతాల్లో బ్యాలెన్స్ లేక చెక్ బౌన్స్ కావడం, రుణాల చెల్లింపు నిబంధనల ఉల్లంఘన మొదలైన చిన్నపాటి నేరాలను డీక్రిమినలైజ్ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకోసం 19 చట్టాలకు తగు విధంగా సవరణలు చేయనుంది. వీటిపై సంబంధిత వర్గాలు జూన్ 23లోగా తమ అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా నిర్దిష్ట సెక్షన్ పరిధిలో ఏ నేరాలను క్రిమినల్ నేరాల కింద కొనసాగించాలి, వేటిని డీక్రిమినలైజ్ చేయొచ్చు అన్నది ఆర్థిక సర్వీసుల విభాగం నిర్ణయం తీసుకుంటుంది. ‘చిన్న నేరాలను డీక్రిమినలైజ్ చేయడమనేది వ్యాపారాలకు సులభతరమైన పరిస్థితులు కల్పించే దిశగా ఎంతగానో తోడ్పడుతుంది. న్యాయవ్యవస్థలు, జైళ్లపై ఒత్తిడి తగ్గగలదు‘ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉల్లంఘనల జాబితా సిద్ధం.. కరోనా వైరస్ ప్రభావిత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ప్యాకేజీ వివరాల వెల్లడి సందర్భంగా సాంకేతిక, ప్రక్రియపరమైన చిన్నపాటి ఉల్లంఘనలను డీక్రిమినలైజ్ చేసే అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత నెలలోనే ప్రస్తావించారు. దీనికి అనుగుణంగా కేంద్ర ఆర్థిక సర్వీసుల శాఖ వివిధ చట్టాల్లో డీక్రిమినలైజ్ చేయతగిన చిన్న స్థాయి ఉల్లంఘనల జాబితాను రూపొందించింది. ప్రస్తుతం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 138 కింద ఖాతాలో తగిన బ్యాలెన్స్ లేక చెక్ బౌన్స్ అయితే దాన్ని జారీ చేసిన వ్యక్తి నేరం చేసినట్లుగా పరిగణించి రెండేళ్ల దాకా జైలు శిక్ష లేదా చెక్ పరిమాణానికి రెట్టింపు పెనాల్టీ విధించవచ్చు. లేదా జైలుశిక్ష, జరిమానా రెండూ విధించవచ్చు. తాజా ప్రతిపాదనల ప్రకారం దీన్ని సవరించే అవకాశం ఉంది. అలాగే, ఎల్ఐసీ విషయానికొస్తే ఆ సంస్థ పత్రాలు, ఖాతాలు లేదా ఇతరత్రా ప్రాపర్టీ ఏదైనా చట్టవిరుద్ధంగా ఎవరైనా తమ వద్ద ఉంచుకుంటే ఏడాది దాకా జైలు శిక్ష, రూ. 1,000 దాకా జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. దీన్ని కూడా సవరించవచ్చు. విదేశీ ఇన్వెస్టర్లకు ఊరట..: ఆర్థిక నేరాలకు సంబంధించి క్రిమినల్ చర్యల గురించి విదేశీ ఇన్వెస్టర్లలో ఎంతో కాలంగా ఆందోళన నెలకొందని, తాజా ప్రతిపాదనలు వారికి ఊరటనివ్వగలవని నిషిత్ దేశాయ్ అసోసియేట్స్ సంస్థ వ్యవస్థాపక భాగస్వామి ప్రతిభా జైన్ తెలిపారు. ఎస్ఎఫ్ఐవో, ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీల పరిధిపై స్పష్టత లేకపోవడంతో బహుళ నియంత్రణ సంస్థలు ఒకే నేరంపై విచారణ జరుపుతుండటం వల్ల ప్రతివాదులకు పెద్ద సమస్యగా ఉంటోందని ఆమె పేర్కొన్నారు. మరోవైపు చర్యలు తీసుకున్నా, తీసుకోకపోయినా కొన్ని నేరాల డీక్రిమినలైజేషన్‌తో ఉల్లంఘనలకు పాల్పడేవారిలో భయం పోతుందని శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కో పార్ట్నర్ వీణ శివరామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. రుణాలిచ్చే సంస్థల కోణంలో చూస్తే క్రిమినల్ చర్యల భయంతోనైనా డిఫాల్టర్లు కనీసం పునర్వ్యవస్థీకరణ లేదా చెల్లింపులపై చర్చలకైనా ముందుకొస్తున్నారని, దాన్ని డీక్రిమినలైజ్ చేస్తే ఆ భయాలు కూడా ఉండవని పేర్కొన్నారు. సవరణలు ప్రతిపాదించిన చట్టాలు ► నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ (చెక్ బౌన్స్) ► సర్ఫేసీ (బ్యాంకు రుణాల రీపేమెంట్పరమైన ఉల్లంఘనలు) ► ఎల్ఐసీ ళీ పీఎఫ్ఆర్డీఏ ళీ ఆర్బీఐ ► ఎన్‌హెచ్‌బీ ళీ బ్యాంకింగ్ నియంత్రణ ► చిట్ ఫండ్స్ ళీ యాక్చువేరీస్ ► జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (జాతీయీకరణ) ► అనియంత్రిత డిపాజిట్ స్కీముల నిషేధ చట్టం ► డీఐసీజీసీ ళీ నాబార్డ్ ళీ బీమా చట్టం ► ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధ) ► పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ సిస్టమ్స్ యాక్ట్ ► స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ► క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (నియంత్రణ) ► ఫ్యాక్టరింగ్ నియంత్రణ చట్టం -
నేరం మోపడంతో ఒకరి ఆత్మహత్య
సొసైటీ ఎదుట మృతుని బంధువుల ఆందోళన నిందితులను శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ సీతంపేట : చేయని నేరం తనపై మోపారని మనస్తాపానికి గురై ఒక వ్యక్తి రైలుపట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. దీంతో మృతుని శవంతో భార్య, కొడుకు, బంధువులు మృతుడు పనిచేసిన సొసైటీ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. మృతుని భార్య జానకీదేవి తెలిపిన వివరాల ప్రకారం... అక్కయ్యపాలెం పోస్టాఫీస్ వీధిలో నివశిస్తున్న కె.ఎస్.ఎస్.డి.ఎస్.ప్రసాద్(65) సీతంపేట మధురానగర్‌లోని వైశాఖి మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీలో ఐదేళ్లుగా గుమస్తాగా పనిచేస్తున్నారు. మార్చి 24న రాత్రి సొసైటీలో దొంగతనం జరిగింది. సుమారు రూ.98వేల నగదు, 90 గ్రాముల బంగారం చోరీకి గురైంది. ఈ దొంగతనంపై ప్రసాద్‌ను అనుమానించి సొసైటీ చైర్మన్ ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రసాద్‌ను పిలిపించి పోయిన వస్తువులు సొసైటీకి అప్పగించాలని ఆదేశించారు. సొసైటీలో దొంగతనం జరిగినపుడు ఎవరెవరు ఉన్నారు, ఎలా జరిగింది అన్న విషయాలు పూర్తి స్థాయిలో విచారించకుండా నేరం మోపడంతో తట్టుకోలేక వారం రోజుల కిందట ప్రసాద్ ఇళ్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆదివారం మధ్యాహ్నం విజయనగరం జిల్లా జామి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిక్కులేని వారిమయ్యాం: ఒక తాళం తన భర్త వద్ద, మరొకటి సొసైటీ చైర్మన్ వద్ద ఉంటాయని, కానీ రె ండు తాళాలు తన భర్త వద్దనే ఉన్నట్టు బలవంతంగా సంతకం చేయించుకున్నారని మృతుని భార్య జానకీదేవి ఆరోపించారు. పోలీసులు, సొసైటీ యాజమాన్యం బతకనివ్వరని తన వద్ద ఆందోళన వ్యక్తం చేశారని, అప్పటి నుంచి కనిపించకుండా పోయిన తన భర్త ఇలా శవమై వచ్చారని జానకీదేవి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో అద్దె ఇంటిలో కాలం వెళ్లదీస్తున్నామని, తన భర్త మరణంతో దిక్కులేనివారిమయ్యామని వాపోయింది. తన భర్తపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, అసలు నేరస్తులను శిక్షించాలని, తన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ద్వారకా సీఐ షణ్ముఖరావు బాధిత కుటుంబ సభ్యులతో చర్చించారు. విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో మృతుని కుమారుడు రమేష్, సామాజిక కార్యకర్త గుమ్మడి కామినాయుడు, బంధువులు పాల్గొన్నారు. -
కొడుకు మాట్లాడితే చాలు
పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి ►ఈ అమ్మ ముద్ద అడగడం లేదు. ప్రేమ అడుగుతోంది. ►తన కొడుకు చేత మాట్లాడించమని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. ►‘నా కొడుకు మీద కేసు పెట్టకండి... నా కొడుకును కొట్టకండి... ►వాడిని నాతో మాట్లాడమని చెప్పండి చాలు’ అని ప్రాధేయపడింది. ►ఇటీవల ముసలి తల్లిదండ్రులని పిల్లలు బస్టాండ్లలో, శ్మశానాల్లో, బజార్లలో వదిలివెళ్లిపోవడం వింటున్నాం. భార్యని వేధిస్తే కేసు పెట్టొచ్చు. ►అమ్మని పట్టించుకోకపోవడం వేధింపు కాదా? అది కేసు కాకూడదా? ►నిజానికి అలాంటి చట్టం ఉంది. కానీ ఏ తల్లి, ఎంత వేధింపునకు గురైనా తన కొడుకు మీద ►కేసు పెడుతుందా? ఇక్కడ కేసు ప్రేమకు సంబంధించినదే తప్ప నేరానికి సంబంధించినది కాదు. ►తల్లి మనల్ని చూసుకున్నట్టుగా అల్లారు ముద్దుగా చూసుకోనక్కర్లేదు. ►పస్తులుండి భోజనాలు పెట్టక్కర్లేదు. జీవితాలు త్యాగం చేసి, ఆస్తులు కట్టబెట్టక్కర్లేదు. ►అమ్మా అని పిలిస్తే చాలు. బిడ్డలా చూసుకుంటే చాలు. అరవై ఏళ్ల సరోజనమ్మ (పేరు మార్చాం)... భర్త, ఇద్దరు కొడుకులతో హైదరాబాద్‌లోని ఓ బస్తీలో ఉంటోంది. పిల్లల ఆదరణ, ఆప్యాయతలతో నిశ్చింతగా గడపాల్సిన సరోజనమ్మ వారి నిరాదరణ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో తనకు న్యాయం కావాలంటూ పోలీసుస్టేషన్‌కు వెళ్లింది! ‘అయ్యా, నాకు నా కొడుకు ప్రేమ కావాలె, మీరే న్యాయం చేయాలె’ అంటూ ఏడుస్తూ ఠాణాలోనే కూర్చుంది. ‘ఇది మీ ఇంటి సమస్య. మీరే పరిష్కరించుకోవాలి. ఏదైనా నేరం జరిగితే చెప్పండి. కేసుపెడతాం’ అన్నారు పోలీసులు. ‘అయ్యా, కేసొద్దు. నా కొడుకును కొట్టద్దు. జైల్లో పెట్టద్దు. వాడి కొలువు పోవద్దు. వాడు నాతో మునుపటిలా మాట్లాడితే సాలు. నాకీ సాయం చేయుండ్రి’ అని చేతులెత్తి దండంపెట్టింది సరోజనమ్మ. పోలీసులు కొడుకులను పిలిపించారు. విషయం కనుక్కున్నారు. సరోజనమ్మ ఆవేదనను శ్రద్ధగా, సానుభూతితో విన్నారు. ‘‘ఈ ఏడాది జనవరిలో చిన్న కొడుకు పెండ్లి చేసిన్నయ్యా. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు, వాళ్ల పిల్లలతో ఈ ముసలితనంలో సంతోషంగా ఉండాలని నే కోరుకున్న. కానీ, పెళ్లయిన రెణ్ణెళ్లకే నా కొడుకు నాతో మాటలు బంజేశిండు. ‘అమ్మా! ఎట్లున్నవే’ అని అడుగతలేడు. ఎందుకిట్లా అవుతోందని నాకు మనసు మనసుల లేదు. యాపైఏళ్ల క్రితం... పదకొండేళ్ల వయసులో హైదరాబాద్‌కు అత్తగారింటికి వచ్చిన. మా ఆయనకు మతి సరిగ్గా ఉండేది కాదు. గవర్నమెంట్ ఆఫీసులో ఓ చిన్న ఉద్యోగం చేసేటోడు. మతి సరిగ్గా లేదు, ఉద్యోగం నుంచి తీసేస్తామంటే.. ఆడికి పోయి పై అధికారులందరి కాళ్లు పట్టుకున్నా. ఆ రోజులు కాబట్టి, నా బాధ అర్థం చేసుకొని ఉద్యోగంలో ఉండనిచ్చిండ్రు. ‘మా అక్క ముఖం చూసి నిన్నిచ్చినా బిడ్డా, మతిలేనోడితో ఎట్లా ఏగుతవ్, వదిలొచ్చెయ్, ఇంకో పెండ్లి చేస్తా!’ అన్నడు మా నాయిన. ‘వద్దు నాయినా, సావ యినా.. బతుకైనా ఇక్కడే’ అనే జెప్పిన. ముగ్గురు పిల్లలు కలిగిండ్రు. ఉన్నంతల్నే పిల్లలకు సదువులు జెప్పించిన. ఆయనకొచ్చే కొద్ది జీతంల్నే పొదుపుగా నెట్టుకొస్తూ చిన్న జాగన రెండంతస్తుల ఇల్లు కట్టించిన. కూతురికి మంచి సంబంధమే చేసిన. పెద్దోడి పెళ్లైనంక మొదటి అంతస్తులో కాపురం పెట్టించిన. అలాగే, ఆర్నెల్ల క్రితం చిన్నోడికి పెళ్లి చేసి ఆ పై అంతుస్తులో కాపురం ఉంచిన. కొడుకులు-కోడండ్లు నా దగ్గరకే వచ్చి భోజనం చేసేటోళ్లు. కానీ, ఎందుకో నా ఈ నడాన మాటంటేనే నా కొడుక్కు పడకుండా అయ్యింది. నన్ను చూడందే కళ్లు తెరిచేటోడు కాదు బడికి పోయేటప్పుడే కాదు, నిన్నమొన్నటిదాక ఆఫీసుకు పోయేటప్పుడు కూడా పొద్దున్నే పాలు పట్టుకొని కొడుకుల ఎనకాలే తిరిగేదాన్ని, చిన్నోడైతే.. నన్ను చూడందే పొద్దున్నే నిద్ర నుంచి కళ్లు కూడా తెరిశేటోడు కాదు. నీ ముఖం చూస్తే అ రోజంతా బాగుంటదే అనేటోడు. ఆఫీసుకెళ్లినా ఫోన్ చేసి, ‘తిన్నవానే!’ అని పలకరించేటోడు. ఆఫీసు నుంచి రాగానే పక్కన కూర్చొని గా ముచ్చట్లు జెప్పేటోడు. వాడు ఆఫీసుకు పోయేటప్పుడు పొరపాట్న నేను కూరగాయలకు బోయి ఇంకా రాకపోయినా వచ్చేదాకా కూసోని అప్పుడు ఎల్లేటోడు. వాడకట్టున చూసేవాళ్లంతా సరోజనమ్మ పిల్లలే పిల్లలు. అంత బాగా పెంచింది అనేవారు. నాలుగు నెలలుగా మాటల్లేవు ఓ రోజు ‘నా భార్యను సరిగా చూస్త లేవు. నేనంటే నీకు ఇష్టం లేదు. నీకు అన్నా, వదిన అంటేనే ఇష్టం’ అన్నాడు చిన్నోడు. ‘అదేందిరా, మీరిద్దరూ నాకు రెండు కండ్లు. ఏ కన్ను ఇష్టం అంటే, ఎట్లా చెబుతా,’ అని సముదాయించినా! అయినా అట్టనే ఉన్నడు. వాడి మనసు మారింది. ఎప్పుడు ఆఫీసుకు పోయేటోడో, ఎప్పుడొచ్చేటోడో తెలిసేది కాదు. నాకు ఆరోగ్యం బాగుండదు. ఒకసారి గుండెపోటు కూడా వచ్చింది. మా ఆయన చూస్తే ఓ మాటా పలుకు లేకుండా ఉంటడు. మమ్మల్ని చూసుకోవాల్సిన కొడుకు ఇట్టా ఏ మాత్రం పట్టనట్టుగా ఉంటే ఏమనుకోను? నా ముఖం సూడకపోతే ఆ రోజు బాగుండదు అని చెప్పినోడు. ఇయ్యాల నా ముఖం చూడటానికే రావడం లేదు. కుమిలి కుమిలి ఏడ్సిన. తర్వాత అసలు విషయం బయటపడింది. ఆస్తిలో వాటా గురించి! కంటి నిండా కునుకు లేదు ‘ఆస్తి పంచిస్తే అది అమ్ముకొని, వేరే దగ్గర ఇల్లు కొనుక్కుంటాం’అన్నారు. ‘ఇప్పుడే ఆస్తి ఎట్లా పంచిస్తా!, మేమా ముసలితనంలో ఉన్నాం. అన్నకు లాగ నీకు ఓ బిడ్డ పుట్టాక ఇస్తా’ అని సముదాయించిన. కానీ, ఇన లేదు. పంచాయితీని నలుగురు పెద్ద మనుషులల్ల పెట్టిండ్రు. వాళ్లు కూడా ‘ఎప్పుడైనా కొడుకులకు ఇచ్చేదే కదా! ఇచ్చెయ్’ అన్నరు. అప్పటికి ఏమీ జెప్పలే. కానీ, ఇంటికొచ్చి ఆలోచన చేశిన. ఆస్తి పంచిస్తే కొడుకు అమ్ముకొని ఏరే వెళ్లిపోతడు. నా కండ్లముందుండడు. ఇప్పుడే ఇట్లున్నడు. రేపు దూరమైనంక మళ్లా ‘అమ్మా!’ అని పిలుస్తడన్న నమ్మకం లేదు. ఎప్పుడూ గిదే మనాది. పెండ్లి కాకముందు ఎట్ల చూసుకునేటోళ్లు... అని యాదికొస్తే దుఃఖం ఆగలేదు. సాధించినఈ ఆస్తి కొట్లాట ఎటు తిరిగి ఎటొస్తదో తెల్వదు. ఎవరికి ఏమైనా కష్టమే. రెండు దినాలు బాగా ఆలోశించిన. సదువుకున్నదాన్ని కాదు. ఎవరిని అడగాల్నో తెలియదు. పోలీసులైతే న్యాయం చేస్తారనిపించి, సక్కగ ఆడికేబోయిన. వాళ్లు నా ఇద్దరు కొడుకులను, కోడండ్లను పిలిచి మాట్లాడిండ్రు. ‘ఏం కావాలి’ అని వాళ్లు నన్ను అడిగితే- నన్ను మునుపటిలా చూసుకోవాలె అని చెప్పిన. ‘నెల రోజులు పెద్ద కొడుకు, ఇంకో నెల రోజులు చిన్న కొడుకు ఇట్లా ఎప్పటికీ.. వాళ్లు తినేదాంట్లో నాకూ, మా ఆయనకు ఇంత పెట్టాల’ని చెప్పిన. ఇప్పుడు చిన్న కొడుకు వంతు. కొడుకు-కోడలు పొద్దున, రాత్రి భోజనం తెచ్చి పెట్టి మాట్లాడించి పోతుండ్రు. ముందు పట్టించుకోనట్లు ఉన్న నా కొడుకు, ఇప్పుడు మంచిగ చూసుకుంటుండు, మునుపటిలా మాట్లాడుతుండు. అది సాలు నాకు’ అని కన్నీళ్లు తుడుచుకుంది సరోజనమ్మ. పిల్లలే ఆస్తులుగా, వారితోటే ప్రపంచంగా బతికే తల్లిదండ్రులున్న సమాజం మనది. ముదిమిలో తమ పిల్లలతో -వారి పిల్లలతో ఆనందంగా జీవించడం కోసం కలలు కంటారు. కానీ, ఆ కలలన్నీ కల్లలయ్యే సంఘటనలు ఎన్నో మన సమాజంలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ తీరు మారాలి. కని పెంచిన వారి రుణం... వారి వృద్ధాప్యంలో తప్పక తీర్చుకోవాలి. ఇది పిల్లల బాధ్యత. కనీస మానవత్వం. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి అంతా సాక్షి చలవే... నాకు 80 ఏళ్లు. ఇద్దరు కొడుకులు, నలుగురు బిడ్డలు. నేనూ, మా ఆయన పిల్లలను రెక్కల కష్టమ్మీద సాకినం. మా ఆయన చనిపోయి శానకాలమైంది. కొన్నాళ్లు ఒక కొడుకు ఇంట్లో, ఇంకొన్నాళ్లు ఇంకో కొడుకింట్లో ఉండేదాన్ని. ఏడాది క్రితం.. కొడుకులు, బిడ్డలు ఎవరూ పట్టించుకోకపోవడంతో మా ఊళ్లో కమ్యూనిటీ హాల్ ముందు పడుకునేదాన్ని. ఎవరైనా దయతలచి ఇంత తిండి పెట్టేవారు. లేదంటే, అదీ ఉండేది కాదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అక్కడే పడి ఉండేదాన్ని. సాక్షి టీవీల నా గురించి ఇవ్వడంతో ఊరి పెద్దలు మా కొడుకులను పిలిచి మంచిగ చూసుకోమని చెప్పారు. అప్పటి నుంచి మంచిగ చూసుకుంటున్నరు. - అడిదెల్ల మైసమ్మ, చివ్వెంల, నల్లగొండ కౌన్సెలింగ్ ఇస్తాం పిల్లల ప్రేమ కావాలంటూ పెద్దలు అడుగుతుంటే బాధేస్తుంది. కన్నవాళ్లను సరిగా చూడకున్నా, ప్రేమపంచకున్నా, అన్నం పెట్టుకున్నా ఆ పిల్లలపై సీనియర్ సిటిజన్స్ యాక్ట్‌ప్రకారం కేసులు నమోదు చేయవచ్చు. ముందుగా వారి పిల్లలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. ఒక వేళ వినకపోతే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం. - డి. ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఏసీపీ. బంజారాహిల్స్ కేసు పెట్టొచ్చు 2001లో 7.5 శాతం ఉన్న వృద్ధుల జనాభా 2026 నాటికి 12.4 శాతానికి పెరుగుతందని ఒక అంచనా. ఎన్నాళ్లుగానో ఎంతోమంది వృద్ధులు పిల్లలు పట్టించుకోని కారణంగా బాధపడుతున్నారు. ఇది గమనించి భారత ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కోసం 2007లో ఒక చట్టం తెచ్చింది. పెద్దలను చూసుకోవాల్సింది పిల్లలేనని ఈ యాక్ట్ చెబుతోంది. వృద్ధులను, వారి ఆస్తులను రక్షించడానికి పిల్లలు లేకపోతే ఈ బాధ్యత వారి బంధువులు తీసుకోవాల్సి ఉంటుంది. వృద్ధులకు ఆదాయం లేనప్పుడు మెయింటెనెన్స్ కోసం వారి పిల్లలు, మనవలు, మనవరాళ్లు, బంధువులు.. మీద కూడా కేసు ఫైల్ చేయవచ్చు. - నిశ్చల సిద్ధారెడ్డి, హైకోర్ట్ అడిషనల్ ప్లీడర్ -
నేరం రుజువైతే ఎంపిల సభ్యత్వం రద్దు:సుప్రీం