Old memories
-
తీసేయ్.. తీసేయ్.. అందర్నీ డిలీట్ చేసేయి స్వామీ
దేముడా.. ఓ మంచి దేముడా.. నా జీవితంలో ఇంకో ఏడాది గడిచిపోయింది.. వయసు ఏడాది పెరిగింది తప్ప జీవితంలో మార్పులేం రాలేదు.. కాలం మారింది.. మారిందంటే వానాకాలం పోయి చలికాలం వచ్చిందని కాదు.. కాలాన్ని బట్టి మనుషులు బుద్ధులు మారినై అంటున్నా.. మనుషులు మారినారు.. అదిగో మళ్ళా మనుషులు మారడం అంటే ఆడోల్లు మగాళ్లుగ.. మగాళ్లు ఆడోళ్లలా మారడం కాదు.. మనిషి తీరు మారింది అంటున్నా.. మీ దేవుళ్ళు మాత్రం యుగయుగాలుగా ఒకేలా ఉంటున్నారు కానీ.. మావాళ్లేంది సిచ్యువేషన్ బట్టి మారిపోతున్నారు.. నువ్వు పుట్టించినప్పుడే పర్మినెంట్ చిప్ కదా పెట్టాలి.. మంచివాడికి ఒక చిప్.. అంటే వాడు చచ్చేవరకు మంచివాడిగా ఉండాలి.. వెధవలకు ఇంకో చిప్.. అలా పెడితే బాగుణ్ణు కదయ్యా.. మొబైల్ ఫోన్లలో ఆటో అప్డేట్ ఉన్నట్లు .. ఫోన్లో సెట్టింగ్స్ మారిపోతున్నట్లు ఫ్రెండ్స్.. చుట్టాలు.. బంధువులు కూడా అప్డేట్ ఐపోతున్నారు స్వామి.. అంటే వాళ్ళంతట వాళ్లే మారిపోతున్నారు.. నేనేమో ఇంకా వాళ్ళు ఎప్పట్లానే ఉన్నారేమో అని చూస్తుంటే ఫోన్లో యాప్స్ సపోర్ట్ చేయనట్లుగానే వాళ్ళు నా మైండ్ సెట్ కు సూటవకుండా ఫోన్ కు.. బ్లూ టూత్ కనెక్ట్ కాకుండా ఉంటున్నట్లు ఉండిపోతున్నారు.అంతా రివర్స్ లో ఉంటోంది ఏంది స్వామీఅదేంటో స్వామీ.. నేను నాలుగేళ్ళ క్రితం వరకూ నానా ఇబ్బందులో ఉండేవాణ్ణి.. ఆ సమయంలో కాస్త కలిగిన మా చుట్టాలంతా నావాళ్ళ మాదిరిగానే ఉండేవాళ్ళు. నా ఉద్యోగం పోయిందని సంతోషంతోనో.. వీడికి బాగా అయిందన్న ఆనందంతోనో తెలీదు కానీ ఎంతోమంది పలకరించారు. వాళ్ళ గొప్పతనం చాటుకోవడం కోసమేనేమో.. బియ్యం పంపిన బంధువులు.. వెయ్యి వేసిన చుట్టాలు ఉన్నారు.. కానీ ఆ వెయ్యి.. ఆ బియ్యం వాళ్ళ దాతృత్వాన్ని చెప్పుకోవడానికి.నా అసమర్థతను చాటడానికి వాడుకున్నారని తరువాత తెలిసింది. అదేంటో స్వామి.. విత్తనాల్లో కల్తీ.. ఆహారంలో కల్తీ.. నూనెకల్తీ.. టీపొడి కల్తీ విన్నాను కానీ ఈ ఏడాది ఏకంగా బంచువుల్లోనే కల్తీగాళ్లను చూసాను స్వామి.. వాళ్ళ ఇంటికి భోజనానికి పిలుస్తారు.. పోన్లే అభిమానంతో పిలిచారేమో అని వెళతానా.. కూర్చోబెట్టి వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటూ నా అసమర్థతను .. నా పేదరికాన్ని తరచూ గుర్తు చేస్తున్నారు.. అవమానంతో ముద్ద గొంతు దిగలేదయ్యా.. పోనీ బయటి బంధువులు ఎవరో ఇలా చేశారంటే ఒకే ఒకే.. అందరూ నావాళ్లు.. ఆత్మీయులు అని నమ్మినవాళ్ళే ఇలా చేస్తుంటే ఇక ఎవర్ని నమ్మాలయ్యా ..కూట్లో బుగ్గిపోసే రకంనాతో గడిపి గడిపి కష్ఠాలు.. బాధలకు కూడా బోరొచ్చిందేమో.. నాక్కాస్త గ్యాపిచ్చాయి.. రాత్రి పగలు కష్టించాను.. చిన్నా పెద్ద .. ఏపని దొరికితే అది చేశాను.. చిన్న ఉద్యోగం.. పదిరూపాయలు ఆదాయం.. కాస్త నడుపునిండా బువ్వ.. ఇంట్లో భార్యాబిడ్డలతో కాసిన్ని స్మైలీ సన్నివేశాలు దొరికాయి. వాటిని ఫోన్లో స్టోర్ చేసేలోపే మళ్ళీ ఫేక్ పాత్రధారులు ఎదురయ్యారు. ఏంటీ ఏదో ఆఫర్ తగిలిందట కదా.. ఏదో అయిందట కదా అంటూ ఓ ఫంక్షన్లో సెటైర్లు.. కొందరు ఇలాగే రాత్రికిరాత్రి ఎదిగిపోతుంటారు అంటూ ఎత్తిపొడుపులు.. నేను నిద్రపోని రాత్రులు.. ముద్ద తినని పొద్దులు.. నడిచి నడిచి తిరిగిన నా కళ్ళు.. కునుకు లేక ఇంకిన నా కళ్ళు... ఇవన్నీ వీళ్లకు తెలుసా ? తెలీదు.. నేను ముద్దలేక ఏడుస్తుంటే సంబరంలో వీళ్ళీ.. నేను కడుపునిండా తింటుంటే కడుపు మంటతోనూ వీళ్ళే .. వద్దు స్వామి.. ఇలాంటి నకిలీలు నాకొద్దు.. వీళ్ళను నానుంచి తీసెయ్యి.. ఫోన్లనుంచి నంబర్లు తీసేసినట్లు నా మైండ్ నుంచి వెళ్ళాను తీసెయ్యి.. ఒరిజినల్ .. మనసున్నవాళ్లను నాకు దగ్గర చెయ్యి.. ఈ కొత్త ఏడాదిలో నాకు ఇంకేం వద్దు.. ఒరిజినల్ మనుషులను ఇవ్వు చాలు..-సిమ్మాదిరప్పన్న -
ఎన్నాళ్లయ్యింది నిన్ను చూసి
‘పక్కింట్లో సుజాత నాతో కాలేజ్కొచ్చేది ఇప్పుడు ఎక్కడుందో’ ‘డిగ్రీ లాస్ట్ ఎగ్జామ్‌లో చూశాను సంధ్యను. మళ్లీ కాంటాక్ట్ లేదు’ ‘పెళ్లయ్యాక రెండుమూడుసార్లు మాట్లాడింది మాలతి. చూసి ఎన్నాళ్లయ్యిందో’స్త్రీల మధ్య ఏర్పడే గాఢమైన స్నేహాలు ఎప్పుడో ఒకసారి తెగిపోవడమే జరుగుతుంది. ఫ్రెండ్షిప్ డే నాడు స్త్రీలు తమ ఆత్మీయ స్నేహితురాళ్లను తలుచుకోవడమే తప్ప కలుసుకునే వీలెక్కడ? కాని నాటి జ్ఞాపకాలు ఎంతో మధురమైనవి కదా.చిన్నప్పుడు ఆడపిల్లలు జట్టు కడతారు. అరుగుల మీద ఆటలాడతారు. స్కూల్ నుంచి రాగానే గబగబా స్నానాలు ముగించి కూడబలుక్కుని ట్యూషన్లకు నడుస్తారు. ఆదివారం వస్తే కలిసి పూలు కోసుకుంటారు. రేడియోలో ΄ాటలు... దూరదర్శన్‌లో చిత్రహార్లు ...స్నేహితురాలి కుటుంబంతో సినిమా కు వెళ్లడం లేదా తన కుటుంబంతో స్నేహితురాలిని తీసుకెళ్లడం... ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత కబుర్లు.. రహస్యాలు... వెంటబెట్టుకెళ్లి చేసే బట్టల సెలక్షన్లు... జామెట్రీ బాక్స్‌లో దాచిన చిరుతిండ్ల పంపకాలు... ఇవన్నీ గొప్ప ఆనందాలు... శాశ్వతం అనిపిస్తాయి. కాని కుదరదు. చాలామందికి ఆ స్నేహం అసంపూర్ణమే.వివాహం ఒక పునరావాసంపెళ్లయ్యాక స్త్రీ భర్త ఇంటికి చేరుతుంది. భర్తది అదే ఇల్లు. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా. కాని అమ్మాయికి పెళ్లికి ముందు ఒక ఇల్లు. పెళ్లి తర్వాత ఒక ఇల్లు. పుట్టింటి వాళ్లు తమ కూతురి స్నేహాలను ప్రోంత్సహిస్తారు. ఆమె స్నేహితురాళ్లను తమ ఇంటి ఆడపిల్లల్లా చూస్తారు. వారికి ఎప్పుడూ స్వాగతం ఉంటుంది. కాని పెళ్లి అమ్మాయిని ‘పరాయి ఇంటి’కి చేరుస్తుంది. ఆ పరాయి ఇంట్లోకి పెళ్లికూతురి స్నేహితురాలు స్వతంత్రించి వెళ్లలేదు. అందుకు భర్త అనుమతి అత్తామామల అనుమతి కావాలి. అది అంత సులభం కాదు.కుటుంబమే ముఖ్యంస్త్రీ ఇంటి పట్టున ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా కుటుంబం మొదటి ప్రాధాన్యం అవుతుంది. పిల్లలు పుట్టాక స్త్రీ అన్నీప్రాధాన్యాలనూ వెనక్కు నెట్టి పిల్లల బాధ్యత ప్రథమంగా తీసుకుంటుంది. ఆమెకు సమయం చిక్కదు. ఆమె తన స్నేహితురాళ్లతో ఫోన్ మాట్లాడటం ఒకోసారి అభ్యంతరకరం కూడా కావచ్చు. ‘ఎన్నో చెప్పుకోవాలని ఉంటుంది. కాని ఎప్పుడు చెప్పుకోవడం. ఎన్నోసార్లు కలవాలని ఉంటుంది. కాని ఎలా కలవడం?’అతడిలా ప్రయాణం కట్టడంభర్తకు విసుగు కలిగితే తన స్నేహితులను తీసుకొని అలా ఒక టూర్‌కు వెళతాడు. భార్య అలా తన స్నేహితురాళ్లతో వెళ్లలేదు. సామాజిక భద్రత సంగతి ఒక కారణమే అయినా అసలు అలాంటి వీలు కూడా ఉండదు చాలాసార్లు. తన స్నేహితులు వస్తే భార్యను పరిచయం చేసి వారికి టీలు కాఫీలు భోజనాలు భార్య చేత ఏర్పాటు చేయించే భర్త ‘నీ స్నేహితురాళ్లను నువ్వూ ఆహ్వానించుకోవచ్చు’ అని అనడం చాలా తక్కువగా జరుగుతుంది. విచిత్రమేమంటే మధ్య వయసు దాటాకే స్త్రీలు తమ పాత స్నేహితురాళ్లను కలిసే అనుమతి ΄÷ందుతారు. లేదా పిల్లల ద్వారా స్నేహాన్ని పునరుద్ధరించుకుంటారు.స్నేహం అవసరంప్రతి మనిషికీ స్నేహం అవసరం. భర్త, పిల్లలు, బంధువులు ఎందరు ఉన్నా ప్రతి స్త్రీకి తన చిన్ననాటి, కాలేజీ నాటి, ఊరి స్నేహితురాళ్లు తప్పక అవసరమే. వారితో పంచుకునే విషయాలు. వారి ద్వారా ΄పోందే ఓదార్పు, వారి నుంచి పోందే సలహాలు, వెళ్లబోసుకోవడాలు... ఇవన్నీ స్త్రీలు అలసిపోకుండా చూస్తాయి. కాని దురదృష్టవశాత్తు మన దేశంలో స్నేహమంటే పురుషుల స్నేహమే. స్నేహగాథలన్నీ వారివే. కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉండే స్త్రీ కూడా తన పాత స్నేహితురాలు కనిపిస్తే నవ్వే నవ్వు, కార్చే ఆనందబాష్పాలు పూర్తిగా ప్రత్యేకం. ఆ నవ్వు ఆనందబాష్పాలు వారికి దక్కాలని ఈ ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా కోరుకుందాం. -
ఫ్రెండ్షిప్ మురిసెన్
-
S.V. కృష్ణారెడ్డి బర్త్ డే స్పెషల్..
-
పల్లె కన్నీరు
అక్కినేని మృతితో వెంకటరాఘవపురంలో విషాదఛాయలు పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న గ్రామస్తులు కడసారి చూపుకోసం హైదరాబాద్ పయనం నందివాడ, న్యూస్‌లైన్ : ఏఎన్నార్ పుట్టినూరు రామాపురంలో సర్పంచి మొండ్రు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, పెరిగిన పల్లె వెంకటరాఘవపురంలో అక్కినేని పేరిట నిర్మించిన కళాక్షేత్రం వద్ద సర్పంచి మెరుగుమాల సత్యనారాయణమ్మ ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధవారం నివాళులర్పించారు. నటననే నమ్ముకున్న ఆయన వెండితెరపై నవరసాలను ఒలికించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకుని కృష్ణా జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. నాలుగో తరగతి వరకు గ్రామంలోనే.. ‘‘అక్కినేని నాలుగో తరగతి వరకు వెంకటరాఘవపురం గ్రామంలో చదువుకున్నారు. అప్పట్లో తల్లితో కలిసి వ్యవసాయం చేసేవారు.. ఆ తర్వాత నాటకాల్లో ఆడ పాత్రలు పోషిస్తూ గుడివాడకు మకాం మార్చారు. అప్పుడు ఆయన్ను ఘంటసాల బలరామయ్య మద్రాసు తీసుకుకెళ్లి సినిమాల్లో వేషాలు ఇప్పించారు...’’ అంటూ గ్రామస్తులు ఒకరికొకరు చెప్పుకొంటూ కని పించారు. అభివృద్ధి భలే చేశారు.. ‘‘సినిమాల్లోకి వెళ్లాక కూడా అక్కినేని అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి బాగోగులు పట్టించుకునేవారు. గ్రామంలో రోడ్లు, విద్యుత్ దీపాలు వంటి సౌకర్యాలు కల్పించారు. జన్మభూమి పథకం కింద గ్రామంలో రోడ్లు, డ్రెయిన్లు కూడా నిర్మించారు...’’ అంటూ కొందరు గ్రామానికి ఆయన చేసిన అభివృద్ధిని చర్చించుకున్నారు. బుడమేరుపై వారధి నిర్మాణం.. ‘‘అక్కినేని స్వగ్రామానికి పశ్చిమగోదావరి జిల్లా హద్దుగా ఉండేది. గ్రామం సరిహద్దులో ఉన్నా వెళ్లాలంటే బుడమేరు అడ్డుగా నిలిచింది. దీంతో బుడమేరు డ్రెయిన్‌పై వంతెనను నిర్మింపజేశారు..’’ అంటూ రామాపురం, కుదరవల్లి గ్రామాలకు చెందిన రైతులు చెప్పారు. దీనికి వారు అక్కినేని వారధిగా నామకరణం కూడా చేశారట. విద్యకు ప్రాధాన్యతనిచ్చేవారు.. ‘‘అక్కినేని కుటుంబంలో ఆయనకు మాత్రమే సంతకం చేయడం, చదవడం వచ్చు. అందుకే ఆయన ఎందరికో విద్యాదానం చేశారు. గుడివాడ భూషణగుళ్ల సమీపంలో కళాశాల భవన నిర్మాణానికి పర్వతనేని వెంకటరత్నం, వెంకట్రామయ్య శ్రీకారం చుట్టారు. వారు సినీహీరోగా వెలుగొందుతున్న అక్కినేని నాగేశ్వరరావు సాయం కోరారు. అప్పటికి పెద్దగా సంపాదించకపోయినా విద్యపై ఆమితమైన ఆపేక్షను కనబరుస్తూ కళాశాల నిర్మాణానికి రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. దాంతో కళాశాలకు ఆయన పేరే పెట్టారు..’’ అంటూ అక్కినేని నాగేశ్వరరావు కళాశాల సిబ్బంది గుర్తుచేసుకున్నారు. అక్కినేని కళాక్షేత్రం.. ‘‘స్వగ్రామానికి ఎన్నో సేవలందించినందుకు గుర్తుగా గ్రామస్తులు, అభిమానులు, స్నేహితులు వెంకటరాఘవపురంలో కళాకేంద్రాన్ని నిర్మించారు. అందుల్లో ఏఎన్నార్ మధురస్మృతులుగా పాత ఫొటోలను ఏర్పాటుచేశారు.. 2009లో డిసెంబర్ రెండున అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి చేతుల మీదుగా అక్కినేనితోపాటు ఆయన కుటుంబసభ్యులు వచ్చి కళాకేంద్రాన్ని ప్రారంభించారు...’’ ఇలా పట్టణ ప్రముఖులు ఏఎన్నార్ గొప్పతనాన్ని కీర్తించారు. హైదరాబాద్ బయలుదేరిన గ్రామస్తులు.... అక్కినేని పార్థివదేహాన్ని సందర్శించేందుకు రామాపురం, వెంకటరాఘవపురం గ్రామాలవారు రాజధాని వెళుతున్నట్లు రామాపురం సర్పంచి వెంకటేశ్వరరావు తెలిపారు. అక్కినేనికి గ్రామం తరఫు ఘన నివాళులు అర్పిస్తామని తెలిపారు.