Ombre
-
ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
► అంతా వీఐపీలే ► పత్తి గోదాంలో అడ్డా.. ► కేసు కాకుండా నేతల విఫలయత్నం ► కోర్టుకు వెళ్లొచ్చిన కొద్దిగంటలకే అరెస్టు వేములవాడ రూరల్ : మండలంలోని తిప్పాపురం గ్రామంలోని ఒక పత్తి గోదాంలో పేకాట ఆడుతున్న ఆరుగురుని సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. శ్రీలక్ష్మీబాలాజీ ట్రేడింగ్ కంపెనీకి చెందిన పత్తి గోదాంలో మంగళవారం కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడకు చేరుకున్నారు. పేకాట ఆడుతున్న వేములవాడ పట్టణానికి చెందిన కట్కం శ్రీనివాస్, తాటికొండ రాంబాబు, కట్కం శంకరయ్య, బుస్స కైలాసం, మోటూరి శ్రీనివాస్‌లతోపాటు ఫాజుల్‌నగర్ గ్రామానికి చెందిన బిక్కుమల్ల రమేశ్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.39,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వీరంతా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తూ, ప్రముఖులుగా చలామణి అవుతున్నవారే. విషయం తెలుసుకున్న పట్టణంలోని ప్రముఖ వ్యాపారులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. కేసు కాకుండా విడిపించాలని తీవ్రప్రయత్నాలు చేశారు. సీఐ శ్రీనివాస్ పైరవీలకు అవకాశం ఇవ్వకుండా కేసు నమోదు చేశారు. నాయకుల వత్తాసు పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన వారికి పట్టణానికి చెం దిన ప్రముఖ నాయకుడు, మాజీ ప్రజాప్రతినిధి వత్తాసు పలికాడు. అధికార పార్టీలో ఉన్న ఆ నాయకుడు పేకాటరాయుళ్లకు సమీప బంధువు కావడం, వారితో పలు వ్యాపార లావాదేవీలు ఉండడంతో కేసు నుంచి తప్పించాలని ప్రయత్నించాడు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయన పోలీసులతో చేసిన సంధి ప్రయత్నం విఫలం కావడంతో ‘కేసు నమోదు చేశారు కనుక రాత్రికి ఇంటికి పంపించాలని’ ఒత్తిడి తీసుకువచ్చాడు. పత్తి మిల్లే అడ్డాగా.. రోజంతా పత్తి వ్యాపారం నిర్వహిస్తున్న ఈ మిల్లు ప్రముఖ నాయకులకు పేకాట అడ్డాగా కూడా మారినట్లు ఆరోపణ లు వస్తున్నాయి. వేములవాడ, సిరిసిల్ల ప్రధాన రోడ్డు పక్కన గల శ్రీలక్ష్మీబాలాజీ ట్రేడింగ్ కంపెనీకి చెందిన పత్తిగోదాం పేకాట రాయుళ్లకు అడ్డాగా మారింది. ఉదయం వ్యాపారం పత్తి వ్యాపారం... సాయంత్రం వేళ ఇందులో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పేకాటలో పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోరుున ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. కోర్టుకు వెళ్లొచ్చిన కొన్ని గంటలకే...? పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన వారిలో కొందరు మంగళవారం పేకాట కేసులోనే కోర్టుకు వెళ్లొచ్చారు. కొద్ది గంటలకే మళ్లీ పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కడం విశే షం. కోర్టుకు వెళ్లి, అక్కడి నుంచి నేరుగా మళ్లీ పత్తి గోదాం కు చేరుకుని పేకాట ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి అరెస్టు చేయడం పట్టణంలో చర్చనీయాంశమైంది. ఈ పేకాటరాయుళ్లలో తండ్రీకొడుకులు సైతం ఉండటం కొసమెరుపు. -
మూడుముక్కలాట
► పచ్చని కుటుంబాల్లో పేకాట చిచ్చు ► అనుమతి రమ్మీకి..ఆడుతోంది తీన్‌పత్తా ► తనిఖీలకు పూనుకోని పోలీస్‌శాఖ బలవుతున్న మధ్యతరగతి ► ఆట కోసం ఇతర జిల్లాల నుంచి రాక.. ► జిల్లాలో రిక్రియేషన్ క్లబ్‌ల పేరిట దందా పచ్చని కుటుంబాల్లో పేకాట చిచ్చు పెడుతోంది. మూడు ముక్కలాట మధ్యతరగతి కుటుంబాలను ముక్కలు చేస్తోంది. ప్రభుత్వ ఉక్కుపాదంతో పేకాట క్లబ్‌లు కొన్నాళ్లు మూతపడగా.. కొందరు కోర్టుకు వెళ్లి రిక్రియేషన్ క్లబ్‌ల పేరిట మళ్లీ పేకాట దందాకు తెరలేపుతున్నారు. దీంతో ఇతర జిల్లాలనుంచి ఇక్కడికి పేకాడేందుకు తరలివస్తున్నారు. ఇతర జిల్లాల్లో అనుమతివ్వని పోలీస్‌శాఖ మన జిల్లాలో మాత్రం పేకాట నిర్వహణకు తలుపులు బార్లా తెరవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. - కరీంనగర్ క్రైం పేకాటలో చిత్తవుతున్నవారి బాధలు చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్... తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పేకాట స్థావరాలు, క్లబ్‌లు మూసేయించాలని డీజీపీకి ఆదేశాలు జారీచేశారు. దీంతో క్లబ్‌లు, పేకాట స్థావరాలపై ఉక్కుపాదం మోపాలని ఆయా జిల్లాల ఎస్పీలకు డీజీపీ అనురాగ్‌శర్మ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు పలు జిల్లాల్లో పోలీసులు వాటి ని మూసివేయించారు. దీనిపై పలువురు వీటిపై కోర్టుకు వెళ్లారు. ఈక్రమంలో జిల్లాలో కొన్ని పేకాట క్లబ్లకుఅనుమతి ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోటాపోటీజిల్లాలో పేకాట క్లబ్‌లకు అనుమతులు మంజూరయ్యాయని కొంతకాలంగా ప్రచారం చేసుకున్న జి ల్లాలోని ఓ రిక్రియేషన్ క్లబ్ అనేక మందిని సభ్యులు గా చేర్చుకున్నారు. సభ్యత్వం కోసం అక్షరాల రూ. లక్ష వసూలు చేశారని సమాచారం. సభ్యులుగా చేరి న వారికి మాత్రమే పేకాట ఆడడానికి అనుమతిస్తా రు. కొత్తగా ఏర్పాటుచేసిన క్లబ్లో పేకాట ఆడడానికి మాత్రమే వచ్చే వారికి కోసం ప్రత్యేకంగా రూ.20 వేల నుంచి రూ.40 వేలు వసూలు చేసి సభ్యులుగా తీసుకుంటున్నారని తెలిసింది. ఈ విషయం పేకాటరాయుళ్లకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపిస్తుండడంతో జిల్లాతోపాటు వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల నుంచి అనేకమంది పేకాడేందుకు జిల్లాకు తరలివస్తున్నారు. వీరి రాకతో సదరు క్లబ్ కళకళలాడుతోంది. వీరికే అనుమతులెందుకు? రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్‌లను ప్రభుత్వం మూసేయించడంతో కొందరు నిర్వాహకులు, ఇతరులు కోర్టులను ఆశ్రయించారు. ఈక్రమంలో కోర్టు పలు నిబంధనలు పెట్టింది. దీంతో పేకాట క్లబ్‌లను నిర్వహించడం తమతో కాదంటూ అనేకమంది మూసివేశారు. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లోనే మూతపడగా.. జిల్లాలో అనుమతి రావడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని పోలీస్‌శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ పేకాట క్లబ్‌లకు అనుమతులు రాకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో మాత్రం కొందరు పోలీసు అధికారుల మద్దతుతోనే అనుమతులు మంజూరు చేశారని ప్రచారం జరుగుతోంది. పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టి పలువురి ఆత్మహత్యకు కారణమైన పేకాట క్లబ్‌లను మూసివేయాలనే డిమాండ్‌తో మహిళా సంఘాలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. నిబంధనలు తోసిరాజని... నిబంధనలను అమలు చేస్తున్నామంటూనే క్లబ్ నిర్వాహకులు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. రిక్రియేషన్ క్లబ్లో సభ్యులను మాత్రమే పేకాట ఆడుకోవడానికి అనుమతిస్తారు. రమ్మీ మాత్రమే ఆడాలి. క్లబ్లో రెండుసెంటర్లు ఏర్పాటు చే స్తున్నట్లు సమాచారం. ఒకటి నిబంధనల ప్రకారం సీసీ కెమెరాల కింద కొన్ని టేబుల్స్ నిర్వహిస్తుంటారు. ఇక్కడ రమ్మీ మాత్రమే ఆడుతారు. మరోటి క్లబ్ చివరలో రహస్యంగా ఏర్పాటుచేసిన సెంటర్లో రూ.5 వేలు, రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ తీన్‌పత్తా(మూడు ముక్కలాట) ఆడిస్తున్నారని తెలుస్తోంది. సెంటర్లో కొంతకాలం సీసీ కెమెరాల వద్ద ఆడిన వారిని.. సమస్యలు లేవని నిర్ధారించుకున్నాకనే రహస్య కేంద్రంలోకి అనుమతిస్తున్నారని సమాచారం. ఈ క్లబ్ నిర్వహణపై అనుమానం వ్యక్తం చేస్తున్న కొందరు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం. బయట సైతం కొన్నిచోట్ల మూడు ముక్కలాట జోరుగా సాగుతోంది. పోలీసులు దాడులు చేస్తున్నా... కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ ఆట కొనసాగిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలే సమిధలు పేకాటలో ఎక్కువగా బలవుతోంది మధ్యతరగతి ప్రజలే. మొదట వారికి కొంచెం లాభం వచ్చేట్లు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు. మరింతగా అప్పుచేసి ఆటలో పెడుతుండడంతో ఉన్నదంతా పోయి రోడ్డు మీద పడడంతోపాటు పలువురు తీరని అప్పులు చేస్తూ నష్టపోతున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చాలామంది బయటకు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకోవడమో... ఊరు విడిచి వెళ్లిపోవడమో చేస్తున్నట్లు సమాచారం. -
రూ. 100 కోట్లు చేతులు మారిన సొమ్ము
జిల్లా అంతటా జోరుగా కోడిపందేలు, పేకాట గోదావరి జిల్లాలను తలపించేలా భారీగా శిబిరాలు పోటెత్తిన పందెం రాయుళ్లు మచిలీపట్నం : సంక్రాంతి పండుగ మూడు రోజులు జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు భారీస్థాయిలో నిర్వహించారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను తలపిస్తూ ఈసారి జిల్లాలోనూ పందెం రాయుళ్లు పోటెత్తారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కోడిపందేల బరులు యథేచ్ఛగా కొనసాగాయి. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో యథేచ్ఛగా శిబిరాలు నిర్వహించారు. బరుల వద్దే బెల్టుషాపులనూ ఏర్పాటు చేశారు. పందెం రాయుళ్ల కోసం రెస్టారెంట్లను ఏర్పాటు చేసి బరుల వద్ద సకల సౌకర్యాలు కల్పించారు. కోడిపందేల పేరుతో ఏర్పాటు చేసిన బరుల్లో పెద్ద ఎత్తున పేకాట, జూదాలూ నిర్వహించారు. నేడూ కొనసాగనున్న పందేలు... భోగి రోజున ప్రారంభమైన ఈ బరులు ఆదివారం కొనసాగుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. జిల్లాలో పండుగ మూడు రోజుల పాటు కోడిపందేలు, పేకాట తదితరాల రూపంలో రూ.100 కోట్లకు పైగా చేతులు మారినట్లు అంచనా. గన్నవరం నియోజకవర్గంలోని అంపాపురంలో కోడిపందేలు, పేకాటను భారీస్థాయిలో నిర్వహించారు. సినీ నిర్మాతలు నల్లమలుపు బుజ్జి, ప్రసాద్ కోడిపందేలను తిలకించారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు, వత్సవాయిలో కోడిపందేలు కొనసాగాయి. పామర్రు నియోజకవర్గంలోని యలకుర్రు, కొమరవోలు, కనుమూరు, గూడపాడులో కోడిపందేలు, పేకాటజోరుగా సాగాయి. తిరువూరులోని కాకర్ల, ముష్టికుంట్ల, ఎ.కొండూరు మండలంలో రేపూడి, గంపలగూడెం మండలం తోటమూల ప్రాంతాల్లో కోడిపందేలు, పేకాట, గుండాటలు నిర్వహించారు. మచిలీపట్నం కేంద్రీయ విద్యాలయం వద్ద కోడిపందేలను మంత్రి కొల్లు రవీంద్ర వీక్షించారు. గాలిపటాలను ఎగురవేశారు. పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లులో యథేచ్ఛగా కోడిపందేలు, పేకాట జరిగాయి. కొల్లేటికోట, భుజబలపట్నం, భైరవపట్నం, కలిదిండి మండలం నాగన్నచెరువు తదితర ప్రాంతాల్లో భారీస్థాయిలో కోడిపందేలు నిర్వహించారు. మైలవరం మండలంలోని నాగులేరు, జి.కొండూరు మండలంలోని వెలగలేరు, ఇబ్రహీంపట్నంలో భారీస్థాయిలో బరులను ఏర్పాటు చేశారు. నూజివీడు నియోజకవర్గంలోని జనార్దనవరం, పోతిరెడ్డిపాలెం, జంగంగూడెం, ఈదర, శోభనాపురం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహించారు. పెడన నియోజకవర్గంలోని కొంకేపూడిలో కోడిపందేల కన్నా పేకాట శిబిరం జోరుగా కొనసాగింది. బంటుమిల్లి మండలం పెందుర్రులో భారీస్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. వెంకటాపురం, నడకుదురు, శ్రీకాకుళం, దిండి, సంగమేశ్వరం, సొర్లగొంది, జరుగువానిపాలెంలలో పేకాట, కోడిపందేల శిబిరాలను నిర్వహించారు. కృష్ణవరంలో ఘర్షణ... ఆగిరిపల్లి మండలం కృష్ణవరం కొమ్మూరు చెరువులో ఏర్పాటు చేసిన కోడిపందేల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. వీరబత్తిన జోషి అనే వ్యక్తి గాయాలపాలయ్యాడు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘర్షణ చెలరేగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బరిలో ఉన్న వారిని చెదరగొట్టారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
రూ. 300 కోట్లు కొక్కొరొకో
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి జిల్లాల్లో భోగి పండుగ రోజు మొదలైన కోడిపందేలు మకర సంక్రాంతి నాడు తారాస్థాయికి చేరుకుని కనుమరోజు రాత్రి పొద్దుపోయేవరకు జోరుగా సాగాయి. ఈ మూడు రోజులు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరాయంగా సాగిన పందేలలో సుమారుగా రూ.300 కోట్ల వరకు చేతులు మారాయని అంచనా. హైకోర్టు ఆదేశాలు, లోకాయుక్త ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలను దాటుకుని ప్రజా ప్రతినిధుల అండతో మొదలైన కోడిపందేలు ఎలాంటి ఆటంకాలూ లేకుండా జాతరల మాదిరిగా కొనసాగాయి. పందెం బరుల వద్దే పేకాట శిబిరాలు, మద్యం దుకాణాలు, బెల్టుషాపులు వెలిశాయి. కోడి పందేలు, పేకాటల్లో కోట్లల్లో డబ్బు చేతులు మారగా గుండాట, కోతాటల్లో లక్షల రూపాయలు చేతులు మారాయి. చేతులు మారిన రూ.300 కోట్లు ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఈ ఏడాది కోడిపందేలు జోరుగా సాగాయి. మూడు రోజుల్లో మొత్తంగా రూ.300 కోట్లు చేతులు మారినట్లు అంచనా. అందులో ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే సుమారుగా రూ.250 కోట్ల మేర పందేలు సాగినట్లు తెలుస్తోంది. ఎక్కువ బరులు ఏర్పాటైన చింతలపూడి నియోజకవర్గంలోనే సుమారు రూ.100 కోట్లకు పైబడి పందేలు, జూదాలు జరిగినట్టు సమాచారం. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పందేలకు అనుమతులివ్వక పోవడంతో సరిహద్దు ప్రాంతమైన చింతలపూడి నియోజకవర్గంపై ఆ ప్రభావం కనిపించింది. తెలంగాణకు చెందిన వేలాదిమంది కార్లు, బైకులపై ఈ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరులవైపు ప్రయాణం కట్టారు. తాడేపల్లిగూడెం పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన బరుల వద్ద రాయలసీమ ప్రాంతానికి చెందిన పందెంరాయుళ్లు అధిక సంఖ్యలో కనిపించారు. ఈ మూడురోజుల్లో జరిగిన పందేలలో సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి, సంగీత దర్శకుడు కోటి, నటుడు శివకృష్ణ, జబర్దస్త్ కార్యక్రమంలోని పలువురు నటులు పాల్గొన్నారు. మరో రోజు అనుమతికి యత్నాలు మూడు రోజులూ అనధికార అనుమతులతో జోరుగా పందేలు నిర్వహించిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ముక్కనుమ రోజైన ఆదివారం కూడా పందేలను నిర్వహించడానికి పోలీసు అధికారులతో సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఐతే పోలీసులు మాత్రం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. -
పేట్రేగిపోతున్న పేకాటరాయుళ్లు
* పల్లె పట్టణం తేడా లేకుండా కొనసాగుతున్న ఆట * వీరి కోసమే ప్రత్యేకంగా హోటళ్లు * బలవుతున్న కుటుంబాలు * నామమాత్రపు చర్యలకు పరిమితమవుతున్న పోలీసులు పరిగి: గ్రామాలు, పట్టణాలు అని తేడాలేకుండా పేకాట రాయుళ్లు విజృంభిస్తున్నారు. పేకాటకు బానిసలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. యువకులు, పేద, ధనిక తేడాలేకుండా అందరూ ఈ ఆట మత్తులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మండల పరిధిలోని సుల్తాన్పూర్, మల్లెమోనిగూడ, సయ్యద్‌పల్లి, రాఘవాపూర్ తదితర గ్రామాల్లో పేకాటరాయుళ్ల సంఖ్య అధికంగా ఉంది. గ్రామ శివారుల్లో పేకాట ఆడుతున్న వారి కోసమే కొన్ని హోటళ్లు వెలుస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువత.. పేకాట కుటుంబాలను చిద్రం చేయడమే కాకుండా కొందరి ప్రాణాలు కూడా బలిగొంటోంది. ఇటీవల పరిగిలో పేకాట ఆడేచోట తలెత్తిన వివాదంలో ఓ యువకుడు హత్యకు గురికాగా.. అదే కేసులో అనుమానితుడు ఆ వెంటనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి గొడవలు అనేకం చోటుచేసుకుంటునా బయటకు వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. దాబాలు, శివారుల్లోని చెట్లు, రచ్చబండలు, పాఠశాల వరండాలు పేకాట రాయుళ్లకు అడ్డాలుగా మారుతున్నాయి. నామమాత్రపు దాడులు గ్రామాల్లో పేకాటతో శాంతిభద్రతల సమస్య కూడా వచ్చి పడుతోంది. లక్షాధిపతులు బికారులుగా మారుతుండగా పేదలు భార్యల మెడల్లో ఉన్న పుస్తెలతాళ్లు అమ్ముకున్న సందర్భాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఇన్ని జరుగుతున్నా పేకాటను అరికట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినప్పుడు మాత్రం తూతూ మంత్రంగా పోలీసులు దాడులు జరిపి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలున్నాయి. పేకాట ఆడుతున్న వారిలో అధికులు బడానాయకులు, వ్యాపారస్తులు, ఉన్నతకుటుంబాలకు చెందిన వారుంటుండటంతో దాడులు చేసిన ప్రతిసారి పోలీసులపై కూడా తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో పోలీసులు కూడా పేకాట రాయుళ్లపై చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి పకడ్బందీ చర్యలు తీసుకుంటే తప్పా పేకాటకు స్వస్తి పలికే అవకాశం లేదని ప్రజలు చెబుతున్నారు. -
పండుగపూట పేకాట జోరు
* ఫలించని పోలీసుల హెచ్చరికలు * చేతులు మారిన కోట్ల రూపాయలు * జిల్లా వ్యాప్తంగా 286 కేసులు * దీపావళి రోజే రూ. 16 లక్షలు స్వాధీనం * చూసీచూడనట్లుగా వ్యవహరించిన పోలీసులు నిజామాబాద్ క్రైం : దీపావళి పండుగ సందర్భంగా పేకాట మూడు ముక్కలు ఆరు ఆటలుగా సాగింది. పండుగ సందర్భంగా పేకాటపై పోలీసులు నిషేధం విధించినా ఫలితం లేకుండా పోయింది. కేసులు నమోదు చేసి వారి పేర్లు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో పెడతామని పోలీసులు చేసిన హెచ్చరికలు పేకాటరాయుళ్లు పెడచెవిన పెట్టారు. పండుగ రోజు రాత్రే కోట్ల రూపాయలు చేతులు మారాయి. పోలీసుల కళ్లుగప్పి అనేక స్థావరాల్లో పేకాట ఆడారు. అయితే పోలీసులు చాలా స్థావరాలపై దాడులు చేసి అరెస్టులు చేశారు. జిల్లాలో దీపావళి రోజున 286 కేసుల్లో 1,492 మందిని అరెస్టు చేసి రూ. 16లక్షల 29వేల 235 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాక్షాత్తు పోలీస్ బాస్ నివాసం ఉండే జిల్లా కేంద్రంలోనే 350 మందిని అదుపులోకి తీసుకుని దాదాపు రూ. నాలుగు లక్షలు స్వాధీనం చేసుకోవటమే ఇందుకు నిదర్శనం. తెలిసి వదిలేశారా..? పేకాట ఇంత జోరుగా సాగినా పోలీసులు అంతగా స్పందించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహిరంగంగా పేకాటాడే వారిని మాత్రమే పోలీసులు అరెస్టు చేసి చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది పోలీసులు తమకు తెలిసిన పేకాట స్థావరాలపై దాడులు చేయకుండానే వారు ఇచ్చిన డబ్బులు పుచ్చుకుని చూసీచూడనట్లుగా వ్యవహరించారని సమాచారం. ఇలా కొంతమంది పోలీసు సిబ్బంది బడా పేకాటరాయుళ్ల నుంచి వేలాది రూపాయలు వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. వచ్చిన వాటాలో తమపై అధికారులకు సైతం వాటా ముట్టజెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోధన్ సబ్ డివిజన్లో 120 కేసుల్లో 631 మందిని పట్టుకుని రూ. 5 లక్షల 95 వేల 675 నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా అత్యధికంగా మాత్రం నిజామాబాద్ సబ్ డివిజన్లో రూ. 6లక్షల 20వేల 510 నగదును స్వాధీనం చేసుకోవటం గమనార్హం. పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఎంపీపీ జక్రాన్‌పల్లి : మండలంలోని పుప్పాలపల్లిలో పేకాట ఆడుతూ జక్రాన్‌పల్లి ఎంపీపీ రాజన్న, కాంగ్రెస్ నాయకుడు రమణారెడ్డితో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఏఎస్సై నర్సింలు శుక్రవారం తెలిపారు. గురువారం అర్ధరాత్రి పుప్పాలపల్లిలోని కాంగ్రెస్ నాయకుడు రమణారెడ్డి ఇంట్లో పేకాట ఆడుతూ ఎంపీపీ రాజన్న, రమణారెడ్డి, రేగుంట కిషన్, పోకల్కర్ కిషన్, వెంకటేశ్వర్లు, సాయన్న, మహేశ్, మోహన్, ఒడ్డెన్న పట్టుబడ్డారని ఏఎస్సై చెప్పారు. వీరి వద్ద నుంచి రూ. 77 వేల 280 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదేవిధంగా జక్రాన్‌పల్లిలో ఏడుగురు పేకాట రాయుళ్ల వద్ద నుంచి రూ. 15 వేల 300 రూపాయలు, బాలానగర్ క్యాంపులో ఏడుగురిని అరెస్టు చేసి రూ. 5790 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. -
దాడులు చేసినా దొరకరు!
* విజయవాడ క్లబ్‌పై పోలీసుల దాడులు * ఎవరూ దొరక్కపోవడంతో వెనుదిరిగిన వైనం * మూడుసార్లు దాడులు చేసిన ఇదే పరిస్థితి *ఇంటి దొంగలే సమాచారం ఇస్తున్నారంటూ ఆరోపణలు సాక్షి, గుంటూరు: నగరంలోని ఓ క్లబ్‌తోపాటు తాడేపల్లిలో ఉన్న విజయవాడ క్లబ్లో పేకాట ఆడుతున్నట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతూ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. జిల్లాకు నూతన ఎస్పీలు వచ్చిన ప్రతిసారీ హడావుడి చేయడంతో తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి ఎవరూ దొరకలేదంటూ చేతులు దులుపుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆకస్మాత్తుగా దాడులు చేయాల్సి వచ్చినప్పుడు వెంటనే క్లబ్‌ల నిర్వాహకులకు సమాచారం అందించి వారిని అప్రమత్తం చేయడం పరిపాటిగా మారింది. విజయవాడ క్లబ్‌పై ఇప్పటికీ మూడుసార్లు పోలీసులు దాడులు చేసినప్పటికీ ఇంతవరకు ఎవ్వరూ దొరక్కపోవడం గమనార్హం. స్థానికులు మాత్రం ప్రతి రోజూ ఇక్కడ విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి వచ్చే బడా బాబులు పేకాట ఆడుతున్నారనే విషయం అందరికి తెలిసేందనని అంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, క్లబ్‌ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లతో ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మంగళగిరి శివారులో ఉన్న హ్యాపీ క్లబ్లో కూడా ఇదే తంతు జరిగేది. ఇప్పట్లో ఎస్పీల ఆదేశాల మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు ముందుగానే క్లబ్ నిర్వాహకులకు సమాచారం అందించి ఎవరూ దొరకలేదంటూ రెండుసార్లు చేతులు దులుపుకున్న విషయం అందరికి తెలిసిందే. అప్పటి అర్బన్ ఎస్పీ ఆకే రవికృష్ణ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సొంత టీమ్‌ను పంపి మంగళగిరి శివారులో ఉన్న హ్యాపీ క్లబ్‌పై దాడులు నిర్వహించగా 350 మంది పేకాటరాయుళ్లు భారీ స్థాయిలో డబ్బుతో సహ పోలీసుల చేతికి చిక్కారు. ఆ తరువాత ఈ క్లబ్‌ను మూసివేశారు. జిల్లా స్థాయి అధికారులు తమ సొంత టీమ్‌లు, అవసరమైతే తామే స్వయంగా దాడులు నిర్వహిస్తే జిల్లాలో ఉన్న క్లబ్‌ల భాగోతం బయట పడుతుందని పలువురు చెబుతున్నారు.