one day protest
-
ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ఒక్కరోజు దీక్ష
-
కిడ్నీ బాధితుల సమస్యపై పవన్ ఒకరోజు దీక్ష
-
రిసార్ట్స్‌లో పవన్ కల్యాణ్ దీక్ష
సాక్షి, హైదరాబాద్: ఉద్దానం కిడ్నీ బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒకరోజు దీక్ష చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రస్తుతం తాను బసచేసిన ఎచ్చెర్ల డాట్లా రిసార్ట్స్‌లోనే శుక్రవారం సాయంత్రం నుంచి ఆయన దీక్షలో కూర్చున్నారు. 24 గంటలపాటు ఈ దీక్ష కొనసాగనుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్ ప్రజల మధ్యే దీక్ష చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పవన్ దీక్షకు సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సంఘీభావ దీక్షలు జరుగుతాయని జనసేన పార్టీ నాయకులు మాదాసు గంగాధర్, అద్దేపల్లి శ్రీధర్‌లు తెలిపారు. ఉద్దానం బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యసేవలు అందించేదాకా జనసేన పోరాడుతూనేఉంటుందని వారు చెప్పారు. బౌన్సర్లు లేక ఆగిన యాత్ర: జన పోరాట యాత్ర పేరులో మే 20 నుంచి పవన్ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర అనూహ్య కారణాల వల్ల అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రభుత్వం భద్రత కల్పించడంలేదని ఆరోపిస్తోన్న పవన్.. ప్రైవేటు సెక్యూరిటీ(బౌన్సర్ల) సాయంతో యాత్రను కొనసాగిస్తున్నారు. పలు చోట్ల స్థానికులు, అభిమానులతో బౌన్సర్లు దురుసుగా ప్రవర్తించడం, ఒక దశలో దెబ్బలాటకు దిగడం, ఈ క్రమంలో బౌన్లర్లూ గాయపడటం, ఆస్పత్రిపాలుకావడం తెలిసిందే. ప్రైవేటు సెక్యూరిటీ లేని కారణంగా పవన్ యాత్ర గురు, శుక్రవారాల్లో వాయిదాపడింది. ఇక ఒక్క రోజు దీక్ష చేస్తుండటంతో శనివారం కూడా యాత్ర లేనట్లే. -
డల్లాస్‌లో వైఎస్సార్సీపీ నిరసన దీక్ష
డల్లాస్: ప్రత్యేకహోదాకి మద్దతుగా డల్లాస్‌లో వైఎస్సార్సీపీ అమెరికా విభాగం ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్షను నిర్వహించారు. ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు అరవింగ్లో ఉన్న గాంధీ ప్లాజా వద్ద దీక్ష చేపట్టారు. దీక్షలో అనేకమంది తెలుగువాళ్లు పాల్గొని మద్దతు తెలిపారు. దీక్ష విరమించిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టారు. వాతారణం అనుకూలించకపోయినప్పటికీ తీవ్రమైన చలిగాలుల్ని లెక్కచేయకుండా నిరసన దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విడదీసి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే ఇప్పుడు హోదాని అడ్డుకొని టీడీపీ, బీజేపీపార్టీలు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు అనేక కేసుల్లొ ఇరుక్కోవటం మూలానే కేంద్రంతో రాజీపడి హోదాని తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి చేస్తున్న అలుపెరగని పోరాటం కారణంగానే ప్రత్యేకహోదా ఉద్యమం సజీవంగా ఉందని, ప్రత్యేకహోదా సాధించే సత్తా ఒక్క జగన్ మోహన్‌రెడ్డికే ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ మోహన్‌రెడ్డి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టారని గుర్తుచేశారు. కేంద్రం వైఖరికి నిరసనగా తమ ఎంపీ పదవులకి రాజీనామాలు చేసారని, ఆ తరువాత 6 రోజులపాటు అమరణనిరాహార దీక్ష చేసిన ఎంపీలని అభినందించారు. ఎంపీల స్ఫూర్తితోనే ఒకరోజు నిరాహారదీక్ష చేస్తున్నట్లు నిర్వాకులు పేర్కొన్నారు. గతంలో కేజీబేసిని అంబానీకి కట్టబెట్టి చంద్రబాబు ఆంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేసారని, ఇప్పుడు పోలవరం ముడుపుల కోసం ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టాడని విమర్మించారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబుకి బుద్ధి చెప్పి ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న జగన్ మోహన్‌రెడ్డికి అండగా నిలవాలని ఏపీ ప్రజలకి ఎన్ఆర్ఐలు విజ్ఞప్తి చేశారు. నిరసన దీక్షలోపాల్గొన్న వారిలో... మణి అన్నపురెడ్డి, కృష్ణారెడ్డి కోడూరు, రామి రెడ్డి బూచిపూడి, రమణారెడ్డి పుట్లూరు, శివ రెడ్డి వెన్నం, శ్రీకాంత్ రెడ్డి జొన్నల, చందురెడ్డి చింతల ,ప్రసాదరెడ్డి చొప్పా, రవి అరిమండ, ఉమా మహేశ్వర్ రెడ్డి కుర్రి, భాస్కర్ రెడ్డి గండికోట, ఉమా మహేశ్వర్ పార్నపల్లి, అవినాష్ రెడ్డి వెల్లంపాటి, శ్రీనివాస్ రెడ్డి ఓబుల్‌రెడ్డి, చైతన్య రెడ్డి, సునీల్ దేవిరెడ్డి, జయసింహ రెడ్డి, మధు మల్లు, తిరుమల రెడ్డి కుంభుమ్, తేజ నందిపాటి, పాల్, కిరణ్ సాలగాల ,తిరుపతిరెడ్డి పేరం, మల్లికార్జున మురారి, హేమంత్, యశ్వన్త్, చైతన్య,జగదీష్, రవి కదిరి, శరత్ యర్రం, ఉదయ్, శ్రావణ్, మహేష్ కురువ తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
ఆందోళన బాటలో పెట్రోలియం డీలర్లు
ఆదివారం అర్ధరాత్రి నుంచి ఒకరోజు సమ్మె విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్ భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్న పెట్రోలు, డీజిల్ డీలర్లు పోరాటానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా బంకులన్నింటినీ బంద్ చేయాలని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ తీర్మానించింది. ఆరు మాసాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై నాలుగు శాతం వ్యాట్ విధించింది. దీన్ని ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం డీలర్లు వ్యతిరేకిస్తూ పలుమార్లు సీఎం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు. ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు శాతం వ్యాట్ విధించటం వల్ల లారీల యజమానులు పక్క రాష్ట్రాలకు వెళ్లి డీజిల్ కొనుగోలు చేస్తున్నారని ఆ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు. మన రాష్ట్రంలో వ్యాట్ వల్ల పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, కర్నాటకలకు వెళ్లి లారీ యజమానులు డీజిల్‌ను కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,400 బంకుల్లో డీజిల్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని తెలిపారు. ఏపీలో ఆరు మాసాలుగా 40 శాతం డీజిల్ అమ్మకాలు తగ్గిపోయి పక్క రాష్ట్రాలకు పెరిగాయని వివరించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి మొదటి హెచ్చరికగా రాష్ట్రంలో ఒకరోజు పెట్రోలు, డీజిల్ అమ్మకాలు బంద్ చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. సమస్య పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చుంచు నరసింహారావు హెచ్చరించారు.