online ticket bookings
-
టికెట్ బుక్ అవ్వకుండానే రూ.100 కట్! ఐఆర్సీటీసీ రిప్లై ఇదే..
పండగ సీజన్లో రైళ్లు కిక్కిరిసిపోవడం గమనిస్తాం. దాంతో చాలామంది ప్రయాణికులు ముందుగానే రైలు టికెట్ బుక్ చేసుకుంటూంటారు. అయితే చివరి నిమిషం వరకు టికెట్ బుక్ అవ్వకపోతే కొన్ని ఛార్జీల రూపంలో రైల్వే విభాగం కొంత డబ్బులు కట్ చేసుకుని మిగతా నగదును సంబంధిత ప్రయాణికుడి ఖాతాలో జమ చేస్తోంది. దీనిపై ప్రశ్నిస్తూ ఇటీవల ఎక్స్ వేదికగా వెలిసిన పోస్ట్ వైరల్‌గా మారింది.అన్సారీ అనే ప్రయాణికుడు చేసిన పోస్ట్ ప్రకారం..‘నేను ఢిల్లీ నుంచి ప్రయారాజ్ వెళ్లాలనుకున్నాను. అందుకోసం రైల్వే టికెట్ బుక్ చేయాలని నిర్ణయించుకున్నాను. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్‌ను బుక్ చేశాను. కానీ నా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఫైనల్ చార్ట్ కూడా ప్రిపేర్ అయింది. అయితే నేను ముందుగా చెల్లించిన టికెట్ ధరలో రూ.100 కట్ అయి మిగతా నా ఖాతాలో జమైంది. నాకు టికెట్ కన్ఫర్మ్ అవ్వకుండా రూ.100 ఎందుకు కట్ చేశారో చెప్పగలరా?’ అంటూ ఇండియన్ రైల్వే మినిస్ట్రీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌ను తన ఎక్స్ ఖాతాలో ట్యాగ్ చేశారు.Dear @RailMinIndia @AshwiniVaishnaw I booked a waitlisted ticket from Delhi to Prayagraj, but it didn’t get confirmed after the chart was prepared. Could you explain why 100 rupees were deducted from the refund instead of receiving the full amount#IRCTC #railway pic.twitter.com/L3UzYoq67P— SameerKhan (@SameerK95044261) October 29, 2024ప్రతి ప్యాసింజర్‌కు ఇదే నియమంఐఆర్సీటీసీ విభాగం తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ పోస్ట్‌పై స్పందించింది. ‘భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీ టికెట్‌కు సంబంధించి క్లర్కేజ్ ఛార్జీల కింద ప్రతి ప్యాసింజర్‌కు రూ.60 చొప్పున కట్ అవుతుంది. దీనిపై అదనంగా జీఎస్టీ ఉంటుంది’ అని తెలియజేసింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కాకుండా చాలామంది థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా టికెట్లు బుక్ చేస్తున్నారు. దాంతో టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే యాప్ కూడా అదనంగా ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.As per Indian Railway rules in case of waitlisted/RAC ticket clerkage charges Rs. 60/- along with GST per passenger shall be levied Please follow the given link: https://t.co/0Mek9yKVW3— IRCTC (@IRCTCofficial) October 29, 2024ఇదీ చదవండి: 60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..క్యాన్సిలేషన్ ఛార్జీలు ఇలా..> టికెట్ కన్ఫర్మ్ అయ్యాక ప్రయాణం వాయిదా వేయాలనుకుని టికెట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే మాత్రం వివిధ తరగతులకు విభిన్నంగా ఛార్జీలు వర్తిస్తాయి. అయితే ప్రయాణానికి 48 గంటల మందే క్యాన్సిల్ చేస్తే కింది ఛార్జీలు విధిస్తారు.ఏసీ ఫస్ట్/ ఎగ్జిక్యూటివ్: రూ.240 + GSTఫస్ట్ క్లాస్/ ఏసీ 2 టైర్: రూ.200 + GSTఏసీ చైర్ కార్/ ఏసీ 3 టైర్/ఏసీ 3 ఎకానమీ: రూ.180 + GSTస్లీపర్: రూ.120సెకండ్ క్లాస్: రూ.60> ట్రెయిన్ బయలుదేరే 48 నుంచి 12 గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేయాలంటే ఛార్జీలో 25 శాతం, జీఎస్టీ భరించాల్సిందే.> ప్రయాణానికి 12 నుంచి 4 గంటలలోపు అయితే ఛార్జీలో 50 శాతం, జీఎస్టీ విధిస్తారు. -
ఆన్లైన్ టికెట్లపై 1న ఉత్తర్వులిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆన్లైన్ సినిమా టికెట్ల విధానంపై స్టే కోరుతూ దాఖలైన అనుబంధ వ్యాజ్యాలపై జూలై 1వ తేదీన తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు వెల్లడించింది. సినిమా టికెట్ల విక్రయంపై ప్రభుత్వం తెచ్చిన సవరణ నిబంధనలను, తదనుగుణ జీవోలను కొట్టేయాలంటూ దాఖలైన ప్రధాన వ్యాజ్యాలపై జూలై 27న తుది విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో ఆన్లైన్ సినిమా టికెట్ల వ్యవస్థను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ)కు అనుసంధానిస్తూ ప్రభుత్వం నిబంధనలను సవరించిది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ బుక్ మై షో, మల్టీప్లెక్స్ థియేటర్ల అసోసియేషన్, విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. బుక్ మై షో తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం 2 శాతం సర్వీస్ చార్జి చెల్లించాలని ఆదేశించడమే ప్రధాన అభ్యంతరమని అన్నారు. సర్వీసు చార్జి, ఇతర కన్వీనియన్స్ చార్జీలు కలిపితే తాము అమ్మే టికెట్ ధర ఎక్కువ ఉంటుందన్నారు. ప్రభుత్వం సర్వీసు చార్జి మాత్రమే వసూలు చేస్తున్నందున, వినియోగదారులు ఏపీఎఫ్డీసీ పోర్టల్ ద్వారానే టికెట్ కొంటారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘మాకు అలా అనిపించడం లేదు. మీరు కన్వీనియన్స్ చార్జి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అది వసూలు చేయదు. దీంతో ప్రభుత్వం వద్ద తక్కువ రేటుకు టికెట్ దొరుకుతుంది. అది మీకు ఇబ్బంది. మీ సమస్యంతా కన్వీనియన్స్ ఫీజే’ అని వ్యాఖ్యానించింది. వ్యాపారాల్లో జోక్యం చేసుకోకుండా నియంత్రించండి మల్టీప్లెక్స్ థియేటర్ల అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ ఒప్పందంలో సంతకం చేస్తే తాము కొత్త సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇది ఆర్థిక భారమన్నారు. పన్నుల విషయంలో ప్రభుత్వానికి ఏ డాక్యుమెంట్ కావాలన్నా ఇస్తామని తెలిపారు. ఒప్పందాల ద్వారా తమ వ్యాపారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్నారు. ప్రభుత్వ విధానం వల్ల స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోలేమని విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ చెప్పారు. థియేటర్లలో ప్రభుత్వం కూర్చుంటుందని, తాము క్యాంటీన్, పార్కింగ్ నిర్వహణకే పరిమితం కావాలని అన్నారు. అనుబంధ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. దీంతో అనుబంధ వ్యాజ్యాల్లో జూలై 1న ఉత్తర్వులిస్తామని ధర్మాసనం తెలిపింది. పలు కీలక అంశాలు ఉన్నందున కొత్త విధానాన్ని 15–20 రోజుల పాటు ఎందుకు ఆపకూడదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ఏజీ స్పందిస్తూ, కొత్త విధానానికి అత్యధికులు ఆమోదం తెలిపారన్నారు. గత ఆరు నెలలుగా అందరితో చర్చించి, వారి సలహాలతో కొత్త విధానాన్ని తెచ్చామన్నారు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరంలేదని చెప్పారు. -
ఏపీఎఫ్డీసీ ద్వారా టికెట్లు విక్రయించుకోండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సినిమా టికెట్లను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) ద్వారా ఆన్లైన్లో విక్రయించుకునే ప్రక్రియ కొనసాగించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. కొంతకాలం తరువాత ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో చూసి తగిన విధంగా స్పందిస్తామని తెలిపింది. ఇదే సమయంలో తమ సొంత పోర్టల్ ద్వారా టికెట్లను విక్రయించుకునేందుకు అనుమతించాలన్న మల్టీప్లెక్స్ థియేటర్ల అభ్యర్థనకు హైకోర్టు నో చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీఎఫ్డీసీ ద్వారా టికెట్ల విక్రయం నిమిత్తం ప్రభుత్వం గత డిసెంబర్ 17న జారీచేసిన జీవో 142ను సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సుమిత్ నీమా వాదనలు వినిపిస్తూ.. ఏపీఎఫ్డీసీ ద్వారా మాత్రమే టికెట్లను విక్రయించాలని ప్రభుత్వం చెబుతోందన్నారు. తాము తమ సొంత పోర్టల్ ద్వారా టికెట్లు విక్రయిస్తున్నామని, సమాంతరంగా రెండు వ్యవస్థలు ఉండటం వల్ల ఇబ్బందేమీ ఉండదని చెప్పారు. దీనిపై ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వివరణ కోరింది. ఏపీఎఫ్డీసీ ద్వారా వాళ్లూ టికెట్లు అమ్ముకోవచ్చు ఏజీ వాదనలు వినిపిస్తూ.. ఏపీఎఫ్డీసీ ద్వారా టికెట్లను విక్రయించేందుకు బుక్‌మై షో, పేటీఎం వంటి సంస్థలు అంగీకరించాయని, అయితే మల్టీప్లెక్స్ థియేటర్లు మాత్రం ముందుకు రావడంలేదని చెప్పారు. టికెట్ విక్రయ కార్యకలాపాలను ఏపీఎఫ్‌డీసీలో విలీనంచేస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఆన్లైన్ టికెట్ విక్రయాల జీవో ఇచ్చామన్నారు. ఏపీఎఫ్డీసీ ద్వారా టికెట్ల విక్రయాన్ని కొనసాగించనివ్వాలని, దీనివల్ల పిటిషనర్ హక్కులకు భంగం వాటిల్లుతుంటే అప్పుడు జోక్యం చేసుకోవచ్చునని చెప్పారు. టికెట్ల విక్రయాల నుంచి తామెవరినీ తప్పించడం లేదని, ఏపీఎఫ్డీసీ ద్వారా విక్రయించాలని చెబుతున్నామని తెలిపారు. ఒక్కో టికెట్ విక్రయించినందుకు ప్రభుత్వానికి రూ.1.97 సర్వీసు చార్జీ కింద వస్తుందని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఇబ్బంది ఏముందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ న్యాయవాదిని ప్రశ్నించింది. తమకు తమ సొంత వ్యవస్థలు, విధానం ఉన్నాయని సుమిత్ నీమా చెప్పారు. తిరిగి ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ల విధానాన్ని ఆషామాషీగా తీసుకురాలేదని, చట్టం ద్వారా ఆ విధానాన్ని తీసుకొచ్చిందని పేర్కొంది. అందువల్ల ఏపీఎఫ్డీసీ ద్వారా ఆన్లైన్ టికెట్ల విక్రయాన్ని కొనసాగనివ్వాలంటూ ఉత్తర్వులిచ్చింది. తమ సొంత విధానంలో కూడా టికెట్ల విక్రయానికి అనుమతినివ్వాలన్న మల్టీప్లెక్స్ అసోసియేషన్ అభ్యర్థనను తోసిపుచ్చింది. తదుపరి విచారణను జూలై 12కి వాయిదా వేసింది. -
ప్రేక్షకులపై టికెట్ భారాన్ని, అధిక షోలను అరికడతాం: మంత్రి పేర్ని నాని
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ఆన్లైన్ పోర్టల్‌ను పారదర్శకంగా నిర్వహిస్తుందని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీ ఫిల్మ్ చాంబర్ వినతి మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఏపీ సినిమా నియంత్రణ సవరణ బిల్లును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బదులు మంత్రి నాని గురువారం శాసనమండలిలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన పలు సందేహాలకు బదులిచ్చారు. ప్రజల వినోదానికి ఇబ్బందులు లేకుండా చేయడానికే ఈ బిల్లు తెచ్చామన్నారు. దీనిపై ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన అన్ని వర్గాల వారితో పలుమార్లు చర్చలు జరిపామని గుర్తు చేశారు. అందరి ఆమోదంతోనే ఆన్లైన్ టికెట్ పద్ధతిని తెస్తున్నామన్నారు. రూ.వందల కోట్ల పెట్టుబడితో బ్లాక్‌బస్టర్ సినిమాలంటూ నిర్ణయించిన దాని కంటే అధిక ధరలకు టికెట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. వీరిలో కొందరు ప్రభుత్వానికి జీఎస్టీ కూడా సక్రమంగా చెల్లించడం లేదన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రాబట్టుకోవడానికి సినిమాటోగ్రఫీ చట్టానికి విరుద్ధంగా ఒకే రోజు అత్యధిక షోలు వేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటినీ నియంత్రిస్తూ.. ప్రేక్షకుడికి టికెట్ ధరల భారం లేకుండా కొత్త విధానానికి మొగ్గు చూపామన్నారు. నిర్ణీత సమయాల్లోనే సినిమా షోలు ప్రదర్శించేలా చూస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా రెండు వర్సిటీలు.. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు విశ్వవిద్యాలయం ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండు కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తోందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన రెండు సవరణ బిల్లులను శాసనమండలిలో గురువారం ఆయన ప్రవేశపెట్టారు. ప్రకాశం జిల్లాలో ఉన్న నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్‌ను ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీగా, కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)కి అనుబంధంగా విజయనగరంలో ఉన్న జేఎన్టీయూ కళాశాలను గురజాడ విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అడిగిన ప్రశ్నకు మంత్రి సురేష్ బదులిస్తూ నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీకి తిక్కన పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
ఆన్లైన్ ద్వారా విమాన టికెట్ల బుకింగ్స్
-
ఐఆర్సీటీసీ యూజర్ ఐడీ క్రియేట్ చేస్తున్నారా?
సాక్షి న్యూఢిల్లీ: ఆన్లైన్లో రైల్వే టికెట్ బుకింగ్ విషయంలో వినియోగదారులకు ఊరట. రైల్వే టికెట్ల బుకింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐర్సీటిసి) త్వరలోనే చర్యలు చేపట్టనుంది. ముఖ్యంగా ఐఆర్సీటీసీ వెబ్సైట్లో కస్టమర్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి నిబంధనలను మరింత కఠినం చేయనుంది. దీనికి సంబంధించిన నిర్ణయాలను ప్రకటించనుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఏజెంట్‌గా పొందిన గుర్తింపుపై కాకుండా బినామీ పేర్లతో నకిలీ ఐడీలనుసృష్టించి, తద్వారా తత్కాల్ సహా, ఆన్లైన్లో టికెట్ విక్రయాల్లో అక్రమ దందాకు చెక్ చేపట్టేందుకు రైల్వేశాఖ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐఆర్సీటీసీలో యూజర్ ఐడీ క్రియేట్ చేసుకునేందుకు ఉద్దేశించిన నిబంధలను పటిష్టం చేయనుంది. వెబ్సైట్లో యూజర్ల నమోదుకు మరిన్ని గుర్తింపులను కోరనుంది. ఐఆర్సీటీసీ వినియోగదారుని ఐడి,పాస్వర్డ్, మొబైల్ నంబర్‌తోపాటు ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు వంటి ఇతర ముఖ్యమైన ఐడీలను కూడా వినియోగదారుని కోరనుంది. బినామీ పేర్లతో నకిలీ ఐడీలతో ఏజెంట్లు పెద్ద ఎత్తున అక్రమ దందాకు పాల్పడుతున్న వైనం తెలిసిందే. వేలాది నకిలీ యూజర్ ఐడిల ద్వారా ఇ-టికెట్లను బ్లాక్ చేసి, వాటిని అధిక ధరకు విక్రయిస్తూ కోట్లాది రూపాయలను దండుకుంటున్న ఏజెంట్ల ఆటకట్టించేందుకు అధికారులు దృష్టి సారించారు. -
రైలు ప్రయాణికులకు శుభవార్త
ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే మీకో శుభవార్త. ఇప్పటికే ఐఆర్సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటున్నవారికి సర్‌చార్జి ఏమీ పడట్లేదు. తొలుత మార్చి నెలాఖరు వరకే ఉన్న ఈ అవకాశాన్ని ఇప్పుడు జూన్ 30 వరకు పొడిగించారు. దీన్ని కనీసం జూన్ నెలాఖరు వరకు పొడిగించాలని తమకు సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి సూచనలు వచ్చినట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. గత నవంబర్‌లో పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత ఆన్లైన్, డిజిటల్ బుకింగ్‌ను ప్రోత్సహించేందుకు రైలు టికెట్లపై సర్చార్జిని ప్రభుత్వం ఎత్తేసింది. దాంతో కేవలం టికెట్ ధర తప్ప, అదనంగా ఎలాంటి వడ్డింపులు లేకుండా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ అవకాశం ఇప్పుడు మరో మరో మూడు నెలల పాటు అమలులో ఉంటుందన్న మాట. నవంబర్ 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు సర్వీసు చార్జి, దాని మీద సర్వీసు టాక్స్ రూపంలో రైల్వేశాఖ రూ. 184 కోట్ల ఆదాయం కోల్పోయింది. ఈ విషయాన్ని రైల్వే ప్రతినిధులు తెలిపారు.