OP
-
సులభంగా ఓపీ రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: డిజిటల్ వైద్య సేవలు అందించడంలో ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వండిజిటల్ విధానంతో అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలనూ సులభతరం చేస్తోంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఓపీ రిజిస్ట్రేషన్‌ను తేలికగా పూర్తి చేస్తోంది. ఈ విధానంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఏపీలోని 909 ప్రభుత్వాస్పత్రుల్లో స్కాన్ అండ్ షేర్ విధానంలో ఓపీ రిజిస్ట్రేషన్ అమలు చేస్తోంది. ఇలా గడిచిన 4 నెలల్లో 23.80 లక్షల ఓపీలు నమోదయ్యాయి.55.04 లక్షలతో యూపీ తొలి స్థానంలో, 24.67 లక్షలతో కర్ణాటక రెండో స్థానంలో ఉన్నాయి. వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే ఓపీ కౌంటర్లో వివరాలు నమోదు చేసుకోవాలి. రోగి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఇతర వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవి పూర్తయిన తర్వాత రోగి ఏ సమస్యతో వైద్య సేవలు పొందాలనుకుంటున్నారో తెలుసుకుని, ఆ విభాగానికి రిఫర్ చేస్తూ టోకెన్ ఇస్తారు. దీనికి 5–10 నిమిషాలు పడుతుంది. పెద్దాస్పత్రుల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంవల్ల రోగులు ఓపీ రిజిస్ట్రేషన్ కోసం చాలా సమయం క్యూలో వేచి ఉండాల్సి వస్తుంది. అదే క్యూఆర్ కోడ్‌తో త్వరగా అయిపోతుంది. రోగి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌కు వెళ్లి స్మార్ట్ ఫోన్ ద్వారా కోడ్ స్కాన్ చేసి, టోకెన్‌ను తీసుకుని డాక్టర్‌ను సంప్రదించవచ్చు. క్యూలో వేచి ఉండటం, ఇతర అగచాట్లు తప్పుతాయి. ఇలా చేసుకోవాలి.. ► స్మార్ట్ ఫోన్ నుంచి ఆస్పత్రిలో ప్రదర్శించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే యూఆర్ఎల్ కోడ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే..ఆభా,ఆరోగ్యసేతు, వంటి యాప్‌లు కనిపిస్తాయి ► ఆ యాప్‌లు ఫోన్లో లేకపోతే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి ► ఆయుష్మాన్ డిజిటల్ హెల్త్ అకౌంట్ (ఆభా) 14 అంకెల గుర్తింపు/ఆభాలో రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్/మెయిల్ ఐడీ ద్వారా యాప్‌లో రిజిస్టర్ అవ్వాలి ► యాప్‌లోకి లాగిన్ అయితే ఆభా వివరాలు వస్తాయి. వీటిని ఆస్పత్రితో షేర్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. షేర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఓ నంబర్ వస్తుంది. ఈ టోకెన్‌కు అరగంట వ్యాలిడిటీ ఉంటుంది. టోకెన్ నంబర్ వచ్చాక ఆస్పత్రిలోని కౌంటర్‌కు వెళ్లి ఆభా నంబర్, ఫోన్ నంబర్ చెప్పి, ఏ స్పెషాలిటీలో ఓపీ అవసరమో చెబితే సిబ్బంది ఓపీ స్లిప్ ఇస్తారు. దీన్ని తీసుకుని డాక్టర్‌ను సంప్రదించవచ్చు. -
వైద్య ఆరోగ్యశాఖలో ఆధార్ బయోమెట్రిక్ విధానం.. అదుర్స్..!
వికారాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు పొందాలంటే ఇక నుంచి ఆధార్ నంబర్ తప్పనిసరి. ఔట్ పేషెంట్లో వైద్య సేవలు పొందాలనుకునే రోగులు రిజిస్ట్రేషన్ కౌంటర్లో ఆధార్ నంబర్ చెప్పి బయోమెట్రిక్ యంత్రంలో వేలు పెడితే రోగి వివరాలు, చిరునామా ప్రత్యక్షమవుతాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ఓపీ రోగుల సంఖ్య ఇక నుంచి పక్కాగా నమోదు కానుంది. గతంలో రోజు వారి ఓపీ వివరాలను ఓ రిజిస్టర్లో రాసి, భాదితుడి ఆరోగ్య సమస్యలను బట్టి ఫలానా డాక్టర్‌ను కలవాలని ప్రిస్క్రిప్షన్ ఇచ్చేవారు. కొన్ని సార్లు అక్కడి సిబ్బంది ఓపీ సంఖ్యను ఎక్కువ చేసి చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మాన్యువల్‌గా తీసుకునే ఓపీ వివరాలను ప్రతీ రోజు ఉన్నతాధికురాలకు పంపించాలంటే సిబ్బందికి సైతం ఇబ్బందులు తలెత్తేవి. ఈ ఇబ్బందులను తొలగించడంతో పాటు, రోజు వారీగా ఓపీ సేవలు ఎంతమంది పొందుతున్నారనే విషయం తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీ చీటీ పొందాలంటే పేషెంట్ పేరు, ఊరు, ఆధార్ నెంబర్ తప్పకుండా చెప్పాల్సిందే. వెంటనే బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా పూర్తి వివరాలు నమోదు చేస్తుండటంతో ఓపీ సేవలపై నజర్ వేసేందుకు అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. ఈ బయోమెట్రిక్ విధానం ప్రారంభమై వారం రోజులే కావడంతో ఈ సమాచారం తెలియక చాలా మంది ఆధార్ కార్డు లేకుండానే ఓపీ సేవలకు వస్తున్నారు. ప్రస్తుతం ఆధార్ నెంబర్ చెప్పని వారి వివరాలు నమోదు చేసుకుని ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. రెండోసారి ఆస్పత్రికి వచ్చేటప్పుడు తప్పకుండా ఆధార్ నెంబర్ తీసుకురావాలని సిబ్బంది రోగులకు సూచిస్తున్నారు. -
ఓపీ చూసి.. మందులు రాసి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నా, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాల్సినంత తీవ్రత ఏమీలేదని వైద్యనిపుణు లు అంటున్నారు. సాధారణ జ్వరం, జలుబు, దగ్గు బాధితులకు మాదిరిగా ఓపీ(ఔట్ పేషెంట్) చూసి మందులు రాసి ఇంటికి పంపిస్తున్నారు. ఇళ్లల్లోనే ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడితే సరిపోతుం దని వైద్యులు చెబుతున్నారు. కానీ, కొందరు ప్రముఖులు, సినీనటులు మాత్రం ఆసుపత్రి ఐసోలేషన్ లో ఉండటానికి ఇష్టపడుతున్నారని అంటున్నారు. ఇదేస్థాయిలో సెకండ్‌వేవ్ ఉన్నప్పుడు?: ప్రస్తు తం తెలంగాణలో నమోదైన కేసులతో దాదాపు సమానంగా సెకండ్ వేవ్‌లో గతేడాది ఏప్రిల్‌లో 13న 3,052 కేసులున్నాయి. అప్పుడు యాక్టివ్ కేసు లు 24,131కాగా, 16,118 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. అంటే 67% మంది ఐసోలేషన్ లో ఉంటే, 33% మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. ఆసుపత్రిలో చేరిన ప్రతి నలుగురిలో ముగ్గురు ఆక్సిజన్, ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు క్రియా శీలక కేసులు 22 వేలకుపైగా ఉన్నా, అందులో 10% మంది మాత్రమే ఆసుపత్రిలో ఉన్నారు. మిగిలిన 90% మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అప్పట్లో రోజూ కోవిడ్ రోగుల కోసం 300 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా, ఇప్పుడు కేవలం 30 టన్నులు మాత్రమే అవసరమవుతుంది. సెకండ్ వేవ్‌లో దేశంలో 18 లక్షల క్రియాశీలక కేసులు రావడానికి 36 రోజులు పడితే, ప్రస్తుత థర్డ్‌వేవ్‌లో అన్ని కేసులు రావడానికి 18 రోజులు మాత్రమే పట్టింది. అంటే వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. ♦ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం డెల్టా తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్లో తీవ్రమైన కోవిడ్ వచ్చే అవకాశం 83 శాతం తక్కువ. ♦ డెల్టా కంటే ఒమిక్రాన్‌లో కరోనా వైరస్ లోడ్ గొంతులో 70 రెట్లు అధికం. గొంతులో ఒమిక్రాన్ పునరుత్పత్తి జరుగుతుండగా, డెల్టా వేరియంట్ తన సంతతిని ఊపిరితిత్తుల్లో పెంచుకునేది. అందువల్ల అప్పుడు కేసులు చాలా తీవ్రమయ్యేవి. ♦ ఊపిరితిత్తుల్లోకి వైరస్ చేరిక డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌లో పదిశాతం మాత్రమే ♦ యూకేలో ఒమిక్రాన్‌కు ముందు నమోదైన కరోనా కేసుల్లో రెండు శాతమే రీఇన్ఫెక్షన్ ఉండగా, ఇప్పుడు ఐదు రెట్లు పెరిగింది. ♦వ్యాక్సిన్ వేసుకున్నా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. వ్యాక్సిన్ అనంతర ఇన్ఫెక్షన్లు యూకేలో 84 శాతం ఉన్నాయి. వారంతా రెండుడోసులు తీసుకున్నవారే. ఢిల్లీలో 68 శాతం ఒమిక్రాన్ కేసులకు చెందినవారంతా రెండుడోసులు తీసుకున్నవారే. అందులో వారిలో 61 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవు. ♦ ఢిల్లీ ప్రభుత్వ విశ్లేషణ ప్రకారం... ఒమిక్రాన్‌తో చనిపోయినవారిలో 92 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోనివారే. వైరస్ వ్యాప్తిని టీకా ఆపలేకపోయినా... మరణాలను ఆపుతుంది. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ.. ఓకే!
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఔట్‌పేషెంట్ (ఓపీ) సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పచ్చజెండా ఊపారు. ఆ మేరకు జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు కరోనా నియంత్రణ రాష్ట్ర ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడొకరు తెలిపారు. కరోనా చికిత్స అందించే 8 ప్రభుత్వ ఆసుపత్రులు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను ప్రారంభించొచ్చని, ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవని ఆయన పేర్కొన్నారు. జిల్లా అధికారులతోనే తంటా! కరోనా నేపథ్యంలో ఔట్పేషెంట్ల తాకిడి వల్ల వైరస్ మరింత విస్తరిస్తుందని, అందువల్ల అత్యవసర కేసులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ గతంలో ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఔట్‌పేషెంట్ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. ప్రాణాపాయ కేసులను కూడా కొన్ని ఆసుపత్రులు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పిల్లలు, పెద్దలకు ఏదైనా జబ్బుచేస్తే పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. చిన్న పిల్లలకు జ్వరం వచ్చినా చూపించే పరిస్థితి లేకపోవడంతో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించి వైద్య ఆరోగ్యశాఖ ఓపీ సేవలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, జిల్లా అధికారులు, కొందరు కలెక్టర్లు ఈ ఆదేశాల అమలుకు భయపడుతున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఓపీ సేవలు ప్రారంభిస్తే జనం తాకిడి పెరుగుతుందని, దీంతో కరోనా విజృంభిస్తుందన్న భావనతో కొందరు కలెక్టర్లు ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే నిర్ణీత సమయం మేరకు కొన్ని నిబంధనలతో ఓపీ సేవలను అమలుచేయాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. వెనక్కి తగ్గుతున్న యాజమాన్యాలు వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఆదేశాలొచ్చినట్టు తెలిసినా, జిల్లా అధికారులు, జీహెచ్ఎంసీ అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఆసుపత్రులు తెరవలేకపోతున్నామని హైదరాబాద్‌కు చెందిన ఓ కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. మంత్రి ఈటల పచ్చజెండా ఊపినట్టు తాము మీడియాలో చూశామని, కానీ జిల్లా అధికారులు తమను ప్రోత్సహించడం లేదని ఖమ్మం జిల్లాకు చెందిన మరో డాక్టర్ అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే ప్రైవేటు క్లినిక్‌లు, నర్సింగ్ హోంలు నడిపే కొందరు డాక్టర్లు ఓపీ చూడడానికి ముందుకు రావడంలేదన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఓపీ పేషెంట్లలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే తమకు అంటుకుంటుందన్న భయం వారిలో నెలకొంది. జలుబు, జ్వరం, దగ్గుతో అత్యవసర కేసుల కింద ఆసుపత్రులకు ఎవరైనా వస్తే కొన్నిచోట్ల లోపలికి కూడా రానివ్వడం లేదని కొందరు రోగులు ఆరోపిస్తున్నారు. ‘గాంధీ ఆసుపత్రికి వెళ్లి కరోనా నెగెటివ్ ఉన్నట్టు సర్టిఫికెట్ తెప్పించుకుంటే అప్పుడు ఇతరత్రా వైద్యం చేస్తామని కొందరు డాక్టర్లు అంటున్నార’ని శ్రీగణేష్ అనే బాధితుడు తెలిపారు. ఏదేమైనా ఓపీ సేవలు ప్రారంభించకపోతే సాధారణ రోగులకు ఇబ్బందులు కలుగుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ తమ ఆదేశాలను అమలు చేయాలని జిల్లా అధికారులకు స్పష్టంగా చెప్పాలని పలు ఆసుపత్రి యాజమాన్యాలు కోరుతున్నాయి. -
స్వైన్‌ఫ్లూ..కరోనా..డెంగీ.. ఏదైనా ఒకే ఓపీ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో అతిముఖ్యమైన గాంధీ ఆస్పత్రిలో నిర్లక్ష్యపు వైద్యసేవల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా, స్వైన్‌ఫ్లూ, డెంగీ వంటి ప్రాణాంతక వైరస్ సంబంధిత వ్యాధులు తీవ్రంగా ప్రబలి, ప్రజలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో వైద్యులు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. రోగులకు భరోసానిచ్చేలా సేవలందించాలి. కానీ గాంధీలో అడుగడుగునా నిర్లక్ష్యం తాండవిస్తోంది. ముఖ్యంగా వైరస్ వ్యాధుల విషయంలో అప్రమత్తం కావాల్సి ఉండగా..అలాంటి చర్యలేవీ ఇక్కడ కన్పించడం లేదు. కరోనా అనుమానితులు, స్వైన్ ఫ్లూ,డెంగీ వంటి వ్యాధులతో చికిత్స కోసం వచ్చిన వారందరినీ ఒకే చోట ఉంచుతున్నారు. ఒకే ఓపీ ఉండడంతో వీరంతా సాధారణ రోగుల మధ్యనే లైన్లో ఉంటూ ఓపీ చీటీలు రాయించుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా, స్వైన్‌ఫ్లూ గాలి ద్వారా ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఈ విభాగాల ఓపీ సెపరేట్‌గా ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సాధారణ జ్వరం, జలుబు, తలనొప్పి వంటి చిన్నచిన్న సమస్యలతో వచ్చిన వారు ఆందోళనకు గురవుతున్నారు. ఫ్లూ వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోనని వారు భయపడుతున్నారు. సిబ్బంది కొరత గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులకు వస్తున్న రోగుల నిష్పత్తికి అనుగుణంగా ఆయా ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాలు, నిపుణులు, స్టాఫ్ నర్సులు, ఇతర పారా మెడికల్ స్టాఫ్ లేకపోవడంతో వైద్య సేవలకు విఘాతం కలుగుతోంది. అంతే కాదు సాధారణ రోగుల మధ్యే ప్రమాదకరమైన ఫ్లూ, కరోనా అనుమానితులు తిరుగుతుండటం, వారిని గుర్తించేందుకు ఆస్పత్రుల్లో ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏమీ లేకపోవడం, వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరించే ప్రమాదం ఉండటంతో గ్రేటర్ వాసుల్లో ఆందోళన వ్యక్త మవుతుంది . ప్రస్తుతం నగరంలో 15 రకాల వైరస్లు ఉన్నట్లు అంచనా. వీటికి తోడు తాజాగా కరోనా వైరస్ వచ్చి చేరుతుండటంతో గ్రేటర్ వాసుల్లో ఆందోళన మొదలైంది. ఈ బాధితులకు చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సహా గాంధీ ఆస్పత్రులను ప్రత్యేక నోడల్ కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ఉస్మానియాలోనూ వార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ..అక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేక పోవడంతో ఆయా బాధితులంతా చికిత్సల కోసం గాంధీ నోడల్ కేంద్రాన్నే ఆశ్రయిస్తున్నారు. వీరికి ఓపీలో ప్రత్యేక బ్లాక్ అంటూ ఏమీ లేదు . గాంధీ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వసంత్‌కుమార్ ఇదే అంశంపై సదరు అధికారులను ప్రశ్నించడం, వారు ఆయనపై క్రమశిక్షణా చర్యలకు పూనుకోవడం, ఆ తర్వాత ఆయన ఇదే ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, ఆస్పత్రిలోని అక్రమాలు...అధికారుల అవినీతి...వంటి అంశాలపై తీవ్రమైన ఆరోపణలు చేయడం, ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం, విజిలెన్స్ విచారణకు ఆదేశించడం తెలిసిందే. ఓపీలో ఫ్లూ, ఇతర రోగుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టలేదు. ఏరియా ఆస్పత్రుల్లో అంతంతే... నగరంలోని బోధనాసుపత్రులపై ఒత్తిడి తగ్గించేందుకే కాదు కుక్కకాటు, డెంగీ, మలేరియా జ్వర పీడితులకు సత్వర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం వనస్థలిపురం, మలక్‌పేట్, కొండాపూర్, గొల్కొండ, కింగ్‌కోఠి, నాంపల్లి, సూరజ్‌భాను ఏరియా ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. అన్ని రకాల వైద్య పరికరాలను సమకూర్చింది. వైద్యసేవలపై సరైన నిఘా లేకపోవడంతో వైద్య సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం పది తర్వాత ఆస్పత్రికి చేరుకోవడం, మధ్యాహ్నం 12.30 తర్వాత మాయమవుతున్నారు. ఆ తర్వాత వచ్చే రోగులను పట్టించుకునే నాధుడే లేకపోవడంతో వారంతా అత్యవసర పరిస్థితుల్లో గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అంతేకాదు నెలలు నిండిన గర్భిణులుకు సుఖ ప్రసవం కోసం ఆయా ఆస్పత్రుల్లో లేబర్రూమ్లతో పాటు పీడియాట్రిక్ వార్డులను కూడా ఏర్పాటు చేసినప్పటికీ..సాయంత్రం తర్వాత అక్కడ వైద్యులు అందుబాటులో ఉండక వారంతా సుల్తాన్ బజార్, పేట్లబురుజు, గాంధీ, నిలోఫర్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. పీహెచ్‌సీలు..బస్తీ దవాఖానాల్లోనూ.. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో వందకుపైగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా, వీటిలో 24 గంటలు పని చేసే ఆస్పత్రులు తొమ్మిది ఉన్నాయి. చందులాల్ బారాదరి, ముషీరాబాద్, మహారాజ్‌గంజ్, ఆర్‌హెచ్ అండ్ఎఫ్డబ్ల్యూటీసీ, వినాయక్‌నగర్, గా>ంధీఆస్పత్రి, బొల్లారం పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో గత ఐదేళ్ల నుంచి డాక్టరే లేరు.ఇక చార్మినార్, ఈద్‌బజార్, పంజేషా–1,2, హరాజ్‌పెంట, అఫ్జల్‌గంజ్, పాన్‌బజార్, బైబిల్‌హౌస్, బోయిన్పల్లి, పికెట్, తిరుమలగిరి, చింతల్‌బస్తీ, తిలక్‌నగర్, బేగంబజార్, అఫ్జల్‌సాగర్, సయ్యద్‌నగర్, ఆఘంపురా, శాంతినగర్, కుమ్మరివాడి, గగన్‌మహల్, కార్వాన్–1 పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు కాంట్రాక్ట్ వైద్యులే దిక్కయ్యారు. నిజానికి ప్రతి పదివేల మందికి ఒక వైద్యుడు అవసరం కాగా, నగరంలో 30 వేల మందికి ఒక్కరే ఉన్నారు. ఒక్కో వైద్యుడు రోజుకు 25–30 మందికి మాత్రమే వైద్యసేవలు అందించగలరు. కానీ పీహెచ్‌సీల్లో ఒక్కో వైద్యుడు 200 మందిని చూడాల్సి వస్తుంది. వీటితో పాటు కొత్తగా వందకుపైగా బస్తీ దావాఖానాలను ఏర్పాటు చేసింది. వీటిని కూడా వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఆయా ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందక పోవడంతో రోగులంతా గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులను ఆశ్రయిస్తుండటం, రోగుల నిష్పత్తికి తనగినన్ని వైద్య పరికరాలు, మందులు, వైద్య సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అంతేకాదు ఈ సాధారణ రోగుల మధ్య ప్రమాదకరమైన ఫ్లూ, కోరానా బాధితులు కూడా తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. -
వైద్యాలయంలో నీ దర్శనభాగ్యం దుర్లభమేనా
ఏడుకొండలపైనున్న ఆ శ్రీనివాసుడి దర్శనమైనా లభిస్తుందిగానీ.. మన పక్కనే ఉన్న ఉత్తరాంధ్ర వైద్యాలయం కేజీహెచ్‌లోని ఈ శ్రీనివాసుడి దర్శనభాగ్యం మాత్రం భక్తరోగులకు దుర్లభమే..ఇది ఏ ఒక్కరోజో కాదు.. ఎప్పుడు ఆ విభాగానికి వెళ్లినా ఆయనగారి జాడ కనిపించదు.. అలాగనీ ఆయన ఆస్పత్రి రారా.. ఉద్యోగం చేయరా అంటే.. రికార్డుల్లో చేస్తున్నట్లే ఉంటుంది.ఠంచనుగా విధులకు హాజరైనట్లు బయోమెట్రిక్ నమోదు చేసేసుకుంటారు. అంతే అక్కడి నుంచి ఆ ఛాయల్లోనే కనిపించరు.ఆయనే డాక్టర్ శ్రీనివాసరావు.. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం అధిపతి.ఆయనగారు ఎప్పుడొస్తారో.. ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలీదు. చాంబర్‌లోని ఆయన సీటు ఎప్పుడు చూసినా ఖాళీగానే కనిపిస్తుంది.ఆ విభాగంలో పని చేసే సిబ్బంది బహుశా అప్పుడప్పుడు మాత్రమే ఆయన్ను చూస్తుంటారేమో.. ఇక రోగుల సంగతి సరేసరి..వారాలకు వారాలు అక్కడికి రావడం.. ఎదురు చూడటం తప్ప.. ఆయన దర్శనం మాత్రం దక్కదు. జూనియర్ డాక్టర్లు, ఇతర సిబ్బంది ఆ విభాగాన్ని నడిపిస్తున్నారన్న వాదన ఉంది. యథారాజా.. తథా ప్రజ అన్నట్లు దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం నరకం చూపిస్తోంది.గంటల తరబడి పడిగాపులు కాసే నిరుపేద రోగులపై కనీస దయ లేకుండా సమయ పాలనకు తిలోదకాలిస్తూ.. వచ్చినప్పుడే వైద్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కేజీహెచ్ విభాగాల పనితీరుపై వరుస కథనాలు ఇస్తున్న సాక్షి.. బుధవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో క్షేత్ర పరిశీలన జరిపినప్పుడు రోగుల కష్టాలు.. ఆ విభాగం పెద్దల నిర్వాకం కళ్లకు కట్టాయి. విశాఖ సిటీ: కేజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం రోగులకు నరకం చూపిస్తోంది. గంటల తరబడి పడిగాపులు కాసే నిరుపేద రోగుల పట్ల కనికరం లేకుండాపోతోంది. సమయ పాలనకు తిలోదకాలిస్తూ.. వచ్చినప్పుడే వైద్యం అన్నట్లుగా వైద్యుల తీరు ఉంటోంది. హెచ్‌వోడీ బాటలోనే దిగువ స్థాయి సిబ్బందీ కూడా నడుస్తుండడంతో రోగుల పాట్లు చెప్పనలవి కావు. నాలుగు రోజులుగా కేజీహెచ్ విభాగాల పనితీరుపై వరుస కథనాలు సాక్షి అందిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో రోగుల పరిస్థితి, వైద్యుల వ్యవహార శైలిపై సాక్షి గ్రౌండ్ రిపోర్టు. హెచ్‌వోడీ ఎక్కడ? ‘వీళ్లెప్పుడూ ఇంతేనయ్యా.. 9 అంటారు.. 11 అంటారు.. 12.30 వరకూ కనిపించరు. మళ్లీ శనివారం రమ్మంటారు’ అంటూ పలువురు గ్యాస్ట్రో ఎంట్రాలజీ రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓపీ ఉన్న ప్రతి బుధవారం వైద్యులు ఏనాడు 11 గంటలకు రాలేదని, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉదయం 12.30 గంటలు దాటినా రావడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఇదీ.. గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓపీ విభాగం పరిస్థితికి అద్ధం పడుతోంది. దూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే రోగులకు ఇక్కడ వైద్యుల తీరు ప్రాణసంకటంగా మారుతోంది. ముఖ్యంగా గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ హెడ్(హెచ్‌వోడీ) డాక్టర్ శ్రీనివాసరావు సంగతైతే సరేసరి.. ఎప్పుడు ఆస్పత్రికి వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో..? అసలు వస్తున్నారో లేదో కూడా తెలీని పరిస్థితి. సాధారణంగా.. వైద్యులు ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి వచ్చే సమయంలోను, సాయంత్రం 4 గంటలకు తిరిగి వెళ్లే సమయంలోను బయోమెట్రిక్ వేయాలి. అయితే డాక్టర్ శ్రీనివాసరావు ఇటు ఓపీలో కాని అటు వార్డులో కాని ఎక్కడా కనిపించరు. విచారిస్తే డాక్టర్ ఇప్పటి వరకూ ఇక్కడే ఉన్నారని, సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లారని వార్డులోని సిబ్బంది సర్ది చెబుతుంటారు. అక్కడికి వెళ్లి చూస్తే కనిపించరు. తిరిగి ఓపీ దగ్గరికి వచ్చి ఏ సమయానికి తిరిగి వస్తారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా సదరు సిబ్బంది నీళ్లు నములుతుంటారు. కేజీహెచ్ వద్దు.. కార్పొరేట్ ముద్దు ఠంచనుగా బయోమెట్రిక్ పంచ్ కొట్టే హెచ్‌వోడీ శ్రీనివాసరావు.. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారని ఆరా తీస్తే.. కార్పొరేట్ ఆస్పత్రులకు కన్సల్టెంట్‌గా వెళ్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. కేజీహెచ్ పరిసరాల్లో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో కన్సల్టెంట్‌గా పని చేయడంపైనే ప్రధాన దృష్టి సారిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేజీహెచ్‌లో జీతం తీసుకుంటూ.. కనీసం గంట సేపైనా విధులు నిర్వర్తించకపోవడంపై పలువురు వైద్యులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిపోండి! హెచ్‌వోడీ పర్యవేక్షణ లేకపోవడంతో ఇక్కడ ఆడిందే ఆటగా సాగుతోంది. గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమస్యలతో వస్తున్న రోగులను అక్కయ్యపాలెంలో ఉన్న హెచ్‌వోడీ శ్రీనివాసరావు ఆస్పత్రికి వెళ్తే.. మంచి వైద్యం అందుతుందని ఓపీ సిబ్బంది చెబుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేక దూర ప్రాంతాల నుంచి కేజీహెచ్‌కు వైద్యం కోసం వస్తుంటే.. తీరా ఇక్కడికి వచ్చాక.. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిపోమంటున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతలు పీజీలకు.. కేజీహెచ్ నుంచి నేరుగా కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లిపోతున్న డా.శ్రీనివాసరావు.. తాను చెయ్యాల్సిన పనుల్ని సైతం పీజీ విద్యార్థులకు అప్పగించేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కొన్ని ముఖ్యమైన పరీక్షలకు తప్పనిసరిగా హెచ్‌వోడీ ఉండాల్సిన అవసరం ఉన్నా.. వాటికి సైతం హాజరు కాకుండా.. ఆ పరీక్షలు కూడా పీజీలే చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదీ గ్యాస్ట్రో ఓపీ తీరు గ్యాస్ట్రోఎంట్రాలజీ ఓపీ సోమవారం, బుధవారం, శనివారం ఉంటుంది. ఇతర విభాగలతో కలిసి ఓపీ ఉన్న సోమవారం, శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. బుధవారం రోజున మాత్రం ఒక్క గ్యాస్ట్రోఎంట్రాలజీ ఓపీ మాత్రమే ఉంటుంది. గతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఓపీ ఉండేది. వైద్యుల సౌలభ్యం కోసం ఈ సమయాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు మార్చారు. -
ఓపీ.. బీపీ!
సాక్షి, సిటీబ్యూరో: కీళ్లనొప్పులతో బాధపడుతూ చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రి ఓపీకి వెళ్లిన బాధితులకు బీపీ తప్పడం లేదు. క్లీనికల్ ఎగ్జామ్, వైద్య పరీక్షల పేరుతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. అసలే విపరీతమైన కీళ్లనొప్పులతో బాధపడుతున్న రోగులకు ఓపీ టోకెన్లు, ఇతర పరీక్షల పేరుతో గంటల తరబడి నిలబెడుతుండడంతో నొప్పులు భరించలేక అక్కడే కుప్పకూలుతున్నారు. ఒకప్పుడు బొక్కల దవాఖానాగా గుర్తింపు పొందిన నిమ్స్ రమటాలజీ(కీళ్లనొప్పులు) విభాగానికి రోజుకు సగటున 300మంది వస్తుంటారు. ఒకప్పుడు ఎముకలకు సంబంధించిన వ్యాధులు, కీళ్ల నొప్పుల చికిత్సల్లో దేశంలోనే ఓ వెలుగు వెలిగిన ఆస్పత్రి ప్రస్తుతం తన ఉనికినే కోల్పోతోంది. అంతర్గత కుమ్ములాటలతో ఇప్పటికే సీనియర్ వైద్యులంతా ఆస్పత్రిని వీడిపోవడం, ప్రస్తుత రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల కనీస సేవలు అందించలేని దుస్థితినెలకొంది. ఆస్పత్రిని వీడుతున్న వైద్యులు... నిజానికి నిమ్స్ ఆర్థోపెడిక్ చికిత్సలకు పెట్టింది పేరు. అరుదైన చికిత్సలు, పరిశోధనలతో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. సాధారణ పౌరులే కాదు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఇలా ఎవరికి ఏ సమస్య వచ్చినా చికిత్స కోసం ఇక్కడికే వచ్చేవారు. అంతర్గత రాజకీయాలతో ఇప్పటికే అనేక మంది వైద్యులు ఆస్పత్రిని వీడారు. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ శేషగిరిరావు, న్యూరో సర్జన్ డాక్టర్ సుభాష్‌కౌల్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ అజిత్‌కుమార్‌లు ఇటీవల పదవి విరమణ చేశారు. అంతర్గత విబేధాలతో ప్రముఖ హెమటాలజిస్టు డాక్టర్ నరేందర్ ఇటీవల ఆస్పత్రిని వీడిపోయారు. గతంలో న్యూరోసర్జన్ డాక్టర్ మానసపాణిగ్రహి సహా మరో న్యూరోసర్జన్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ వీబీఎన్ ప్రసాద్ ఇష్టం లేకపోయినా ఆస్పత్రిని వీడిపోయినవారే. హృద్రోగ చికిత్సల్లో విశేష అనుభవంతో పాటు మంచి గుర్తింపు ఉన్న డాక్టర్ శేషగిరిరావు వెళ్లిపోవడంతో అప్పటివరకు ఆయన కోసం వచ్చిన వీఐపీ నగదు చెల్లింపు(పెయింగ్)రోగులంతా ఆయన్ను వెతుక్కుంటూ వెళ్లిపోయారు. అదే విధంగా న్యూరోసర్జరీ విభాగంలో డాక్టర్ సుభాష్ కౌల్ రోగులది అదే పరిస్థితి. డాక్టర్ నరేంద్ర ఆస్పత్రిని వీడడంతో హెమటాలజీ విభాగానికి వచ్చే రోగులకు కనీస వైద్యసేవలు అందకుండా పోయాయి. మధుమేహ చికిత్సల్లో మంచి గుర్తింపు పొందిన డాక్టర్ పీవీరావు పదవీ విరమణ పొందిన తర్వాత ఆ విభాగం జీవచ్ఛవంలా మారిపోయింది. సీనియర్లు లేని లోటును పూడ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. మెరుగైన వైద్య సేవలు పొందవచ్చేనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి ఆస్పత్రికి చేరుకుంటున్న రోగులకు కనీస వైద్యసేవలు కూడా అందకపోవడంతో వారంతా విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు బాటపట్టాల్సి వస్తోంది. ఆస్పత్రికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పెయింగ్ రోగుల సంఖ్య గణనీయంగా తగ్గడానికి ఇదే కారణం. 55శాతం నుంచి 20శాతానికి... నాలుగేళ్ల క్రితం పెయింగ్ రోగులు 55 శాతం ఉంటే, ఆరోగ్యశ్రీ బాధితులు 45శాతం మంది ఉండేవారు. ప్రస్తుతం పెయింగ్ రోగుల శాతం పడిపోయింది. 80శాతం మంది ఆరోగ్యశ్రీ రోగులు ఉంటే, 20శాతం మంది మాత్రమే పెయింగ్ రోగులు వస్తున్నారు. ఫలితంగా రోజూవారీ ఆదాయం భారీగా పడిపోయింది. దీనికి తోడు ఈఎస్ఐ, సీజీహెచ్ఎస్, ఆర్టీసీ, ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ల వద్ద బకాయిలు కోట్లల్లో పేరుకుపోయాయి. పేరుకుపోయిన బకాయిలపై ప్రతి 15రోజులకోసారి సమీక్ష నిర్వహించి, వాటిని రాబట్టుకోవాల్సిన యాజమాన్యం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో వేతనాల చెల్లింపు, ఇతర నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేతనాల చెల్లింపులు, ఇతర ఖర్చుల కోసం నెలకు సుమారు రూ.12 కోట్లు అవసరం కాగా, రూ.9 కోట్లకు మించి రావడం లేదు. ఈ ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ఓపీ, వైద్య పరీక్షల చార్జీలను పెంచాల్సి వచ్చిందంటే ఆస్పత్రి ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
నిమ్స్‌లో రేపు ఓపీ బంద్
హైదరాబాద్: గుడ్‌ఫ్రైడే సందర్భంగా నిమ్స్ ఆసుపత్రిలో శుక్రవారం ఔట్ పేషెంట్ విభాగం (ఓపీ) సేవలు అందుబాటులో ఉండవని, తిరిగి శనివారం తెరుస్తామని యాజమాన్యం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
పెద్దాసుపత్రి నాడి దొరకదంతే!
‘ఓపి’కుంటేనే చికిత్స – ఒక్క రోజులే అన్నీ అంటే కష్టం – డాక్టర్ పరీక్షించేది ఒక రోజు – వైద్య పరీక్షలు మరోరోజు.. చికిత్స ఇంకోరోజు – చుక్కలు చూస్తున్న రోగులు – అదష్టం ఉంటే సరి.. లేదంటే? – పెద్దాసుపత్రిలో వైద్యం దైవాధీనం – కోడుమూరు మండలానికి చెందిన ఎల్లమ్మ కడుపునొప్పితో బాధపడుతూ గత శనివారం సర్జరీ విభాగానికి వెళ్లింది. వైద్యులు పరీక్షించి ఆమెకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ రాశారు. స్కానింగ్ వద్ద ఆమెను సెప్టెంబర్ 4న రావాలని చెప్పి పంపించారు. అప్పటి దాకా డాక్టర్ రాసిచ్చిన మందులు వాడాలని సూచించారు. – కష్ణగిరి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన మద్దయ్య జ్వరంతో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు చికిత్స కోసం వచ్చాడు. వైద్యులు అతన్ని పరీక్షించి రక్తపరీక్షలు రాశారు. పరీక్షలు చేయించుకుని వచ్చే సరికి వైద్యులు ఓపీ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ రిపోర్ట్ ఎవరికి చూపించాలో తెలియక ఆయన వెనుదిరిగి వెళ్లిపోయాడు. – కోసిగి ప్రాంతానికి చెందిన మారెప్ప కొంత కాలంగా నడుం నొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అతను పెద్దాసుపత్రికి వస్తే పరీక్షించిన వైద్యులు ఎంఆర్ఐ పరీక్ష రాశారు. అక్కడికి వెళితే.. పరీక్ష చేసేందుకు రెండు వారాల తర్వాత రావాలని గడువు విధించారు. – కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అస్తవ్యస్తంగా మారిన ఓపీ విధానానికి ఇవి ఉదాహరణలు మాత్రమే.. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతిరోజూ 2,500 మందికి పైగా రోగులు ఓపీ చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో సగానికి పైగా సాధారణ వ్యాధులతో వచ్చే వారే. వీరందరికీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో చికిత్స అందిస్తే సరిపోతుంది. కానీ అక్కడ వైద్యులు లేక, ఉన్నా నమ్మకం లేక పెద్దాసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. మరికొన్ని గ్రామీణ ఆసుపత్రుల్లోని వైద్యులు సాధారణ వ్యాధులకూ చికిత్స చేయకుండా పెద్దాసుపత్రికి రెఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇలా వచ్చిన రోగులు గంటల తరబడి క్యూలో నిలబడలేక సొమ్మసిల్లిపోతున్నారు. చికిత్స కోసం ఎవరిని అడగాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక బిక్కమొహం వేస్తున్నారు. ఓపీ టికెట్ కావాలంటే ఓపికుండాల్సిందే.. ఆసుపత్రిలో ఓపీ టికెట్ ఇచ్చేందుకు ప్రధాన ద్వారం వద్దే స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అత్యవసర వైద్యం కోసం ఒకటి, ఎక్స్‌రే, ఎంఆర్ఐ పరీక్షల కోసం రుసుము వసూలు చేసేందుకు మరో కౌంటర్ ఉంది. వీటితో పాటు స్త్రీవ్యాధులు, గర్భిణిలకు చికిత్స, చిన్నపిల్లల వ్యాధులకు మాతాశిశు భవనం వద్ద ప్రత్యేకంగా ఓపీ కౌంటర్ నిర్వహిస్తున్నారు. అయితే వందలాదిగా వచ్చే రోగులకు ఈ కౌంటర్లలో అందే సేవలు సరిపోవడం లేదు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఓపీ టికెట్లు ఇస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఆసుపత్రికి వచ్చేలోపు సమయం మీరిపోతుంది. ఫలితంగా వీరు ఓపీ టికెట్ తీసుకుని వైద్యుని వద్దకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి అదనంగా మరిన్ని ఓపీ టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు. వైద్య పరీక్షలు చేయించుకోవడానికీ ‘పరీక్షే’.. ఆసుపత్రిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు రోగులకు పరీక్షే. ఓపీ చికిత్సకు వచ్చిన రోగులకు వైద్యులు పలు రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు రాస్తారు. రక్త, మల, మూత్ర పరీక్షలు కొన్ని అదే రోజు రిపోర్ట్ ఇస్తారు. కానీ రిపోర్ట్ తీసుకుని వచ్చేలోగా వైద్యులు ఓపీ విభాగంలో ఉండటం లేదు. ఇక ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకుని వచ్చినా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. దీంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆ రిపోర్ట్లు పట్టుకుని ఆసుపత్రిలో వైద్యుల కోసం తిరిగే వారు నిత్యం కనిపిస్తారు. రోగులను వెనక్కి పంపొద్దని ఆదేశాలు ఓపీ చికిత్సకు వచ్చే రోగులు ఇతర ఓపీ దినాల్లో వచ్చినా వారిని వెనక్కి పంపకుండా చికిత్స చేయాలని ఆదేశాలు ఇస్తున్నాం. ఇందుకు సంబంధించి సర్కులర్‌ను బుధవారం జారీ చేస్తాం. దీనివల్ల ఓపీకి వచ్చే రోగులు రిపోర్ట్లు తీసుకువచ్చి వెనక్కి వెళ్లకుండా చికిత్స చేయించుకునే అవకాశం కలుగుతుంది. దీన్ని వెంటనే అమల్లోకి తీసుకొస్తాం. – డాక్టర్ జె.వీరాస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
కోఠిలో గర్భిణుల బైఠాయింపు
హైదరాబాద్: సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఓపీని గురువారం సిబ్బంది ఆలస్యంగా తెరవడం రోగులను గందరగోళపరి చింది. ఆసుపత్రిని వేరే చోటుకు తరలించేందుకే ఓపీని తెరవలేదని భావించిన గర్భిణులు తమ బంధువులతో కలసి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో గర్భిణులు వైద్య పరీక్షల నిమిత్తం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రికి వచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభించాల్సిన ఓపీ ఎంతకీ తెరవకపోవడంతో చికిత్సకు వచ్చినవారు కలవరపడ్డారు. అక్కడి నుంచి ప్రసూతి ఆసుపత్రిని తరలించారని ఇక వైద్యసేవలు అందవని కొందరు చెప్పడంతో వందలాది మంది రోగులు ఆగ్రహంతో కోఠి ఉమెన్స్ కళాశాల రోడ్డుపై బైఠాయించారు. దీంతో కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తా నుండి ఇసామియాబజార్, చాదర్‌ఘాట్, ఇటువైపు సుల్తాన్‌బజార్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్‌చౌరస్తా, బ్యాంక్‌స్ట్రీట్, ఉస్మానియా మెడికల్ కళాశాల రోడ్డు వరకు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుల్తాన్‌బజార్ పోలీసులు ఆందోళన చేస్తున్నవారికి నచ్చజెప్పారు. ఆసుపత్రి వర్గాలు కూడా అప్రమత్తమై ఓపీని తొమ్మిది గంటలకు తెరవడంతో పరిస్థితి సద్దుమణిగింది. రోగులు, ఆసుపత్రి సిబ్బంది మధ్య సమాచారం కొరవడడం వల్లే గందరగోళానికి దారితీసినట్లు తెలుస్తోంది. -
‘మాతా శిశు మరణాలను నివారిద్దాం’
కాకినాడ క్రైం : మాతా శిశు మరణాలపై వైద్యాధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి వాటిని నిరోధించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సి. పద్మావతి ఆదేశించారు. ఆమె తన ఛాంబర్లో గురువారం వివిధ అంశాలపై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ గర్భిణుల్లో పౌష్టికాహార లోపంవల్ల ప్రాణాపాయ పరిస్థితులు సంభవిస్తున్నందున వారిలో దానిపై అవగాహన కల్పించాలన్నారు.రెండు నెలల్లో 22 శిశు మరణాలు గత ఏప్రిల్, మే నెలల్లో జిల్లాలో 22 శిశు, ఆరు మాతృ మరణాలు సంభవించినట్టు డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి తెలిపారు. చిన్నారులు కూడా పలువురు మరణించారని, ఆ రిపోర్టును ఈ నెల 24వ తేదీన కలెక్టర్ నిర్వహించే సమీక్షా సమావేశానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 54 యువ క్లినిక్‌లు బాలల ఆరోగ్య పరిరక్షణ కోసం జిల్లాలో 54 యువ క్లినిక్‌లు నిర్వహిస్తున్నామన్నారు. జవహర్ బాల ఆరోగ్య రక్ష (జేబార్) ప్రోగ్రాం ఆఫీసర్, ఎస్పీహెచ్ఓలు యువ క్లినిక్‌లను పర్యవేక్షించాలన్నారు. స్క్రీనింగ్ అంశాలు, ఓపీ, కౌన్సిలర్ల పనితీరు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. వైద్యపరికరాల మరమ్మతుల యూనిట్ జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన వైద్య పరికరాల మరమ్మతుల కోసం జిల్లా స్థాయిలో వైద్యపరికరాల మరమ్మతుల యూనిట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరి వివరాలు తనకు అందజేయాలని ఎస్పీహెచ్ఓ, సీనియర్ అసిస్టెంట్లకు డీఎంహెచ్ఓ సూచించారు. 104 వాహనాల పనితీరు, మందుల స్టాకు, అందిస్తున్న సేవలు, వ్యాధులు తదితర అంశాలపై వైద్యాధికారులతో డీఎంహెచ్ఓ సుదీర్ఘంగా చర్చించారు. ఎన్ఆర్హెచ్ఎం డీపీఎం డాక్టర్ మల్లిక్, జేబార్ పీఓ డాక్టర్ అనిత, పీఓ డీటీటీ సత్యనారాయణ, ఎస్పీహెచ్ఓలు పాల్గొన్నారు. -
ఎస్బీఐ పీఓ కొలువులకు దారిదీ
దేశంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొలువుల జాతరకు తెరతీసింది.. భారీ స్థాయిలో ప్రొబేషనరీ ఆఫీసర్ల (పీఓ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.. చక్కని కెరీర్.. ఆకర్షణీయమైన వేతనం.. ప్రతిభకు గుర్తింపు.. వెరసి మంచి భవిష్యత్‌కు సోపానంగా నిలుస్తోంది ఎస్బీఐ-పీఓ.. పోస్టుల సంఖ్య భారీగా ఉండడంతో పోటీ పడే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చు.. ఈ నేపథ్యంలో ఏ విధంగా సన్నద్ధం కావాలి, ఏం చదవాలి, ఎటువంటి మెళకువలు పాటించాలి తదితర అంశాలపై విశ్లేషణ.. ఎంపిక విధానం: ఫేజ్-1, ఫేజ్-2 అనే రెండు ప్రక్రియల ద్వారా. ఫేజ్-1: ఇది రాత పరీక్ష. దీన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల కలయికగా మొత్తం 250మార్కులకు నిర్వహిస్తారు. ఇందు లో మొదటగా ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ పరీక్ష. తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. దీన్ని ఆఫ్‌లైన్‌గా పేపర్/పెన్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. సమాధానాలు గుర్తించడానికి రెండు గంటల సమయం కేటాయిస్తారు. ఇందులో ఉండే నాలుగు విభాగాలు.. విభాగం మార్కులు ఇంగ్లిష్ 50 జనరల్ అవేర్నెస్, మార్కెటింగ్, కంప్యూటర్ 50 డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 50 రీజనింగ్ (హై లెవల్) 50 మొత్తం 200 డిస్క్రిప్టివ్ పేపర్ 50 మార్కులకు ఉంటుంది. దీని కోసం గంట సమయం కేటాయించారు. ఇది ప్రధానంగా అభ్యర్థిలోని ఆంగ్ల భాష నైపుణ్యం, రైటింగ్ స్కిల్స్‌ను పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం. ఇందులో కాంప్రెహెన్షన్, లెటర్ రైటింగ్, ఎస్సే, షార్ట్ ప్రిసెస్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ పేపర్లో నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల డిస్క్రిప్టివ్ పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు. ఫేజ్-2: ఈ విభాగంలో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ దశలు ఉంటాయి. ఈ రెండు దశలకు కలిపి 50 మార్కులు ఉంటాయి. ఇందులో గ్రూప్ డిస్కషన్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు కేటాయించారు. చివరగా ఫేజ్-1, ఫేజ్-2లో సాధించిన మెరిట్ ఆధారంగా నియామకాన్ని ఖరారు చేస్తారు. ఈ క్రమంలో ఫేజ్-1 రాత పరీక్షకు 75 శాతం వెయిటేజీ, ఫేజ్-2కు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. పరిమితంగానే: ఎస్బీఐ పీఓ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు కొన్ని పరిమితులు విధించింది. దీని ప్రకారం గరిష్ట వయోపరిమితికి లో బడి జనరల్ అభ్యర్థులు 4 సార్లు, ఓబీసీ/ఓబీసీ-పీడబ్ల్యూడీ 7సార్లు, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లైనా ఈ పరీక్ష రాసుకోవచ్చు. శిక్షణ-కెరీర్: పీఓకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో సంబంధిత విధులపై సమగ్ర శిక్షణనిస్తారు. ప్రొబేషన్ పూర్తయిన తర్వాత నిర్వహించే పరీక్షల్లో నిర్దేశించిన ప్రమాణాలు సాధించిన అభ్యర్థులకు ఆఫీసర్ మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్-2 హోదానిస్తారు. అలాకాకుండా కేవలం అర్హత మాత్రమే సాధించి, నిర్దేశించిన ప్రమాణాలను అందుకోలేని అభ్యర్థులకు ఆఫీసర్ జూనియర్ మేనేజ్మెంట్ స్కేల్ గ్రేడ్-1 హోదానిస్తారు. అదే సమయంలో అర్హత సాధించని అభ్యర్థులను సర్వీస్ నుంచి తొలగిస్తారు. ఆకర్షణీయమైన పదోన్నతి విధానం ఎస్బీఐలో ఉంది. పనితీరు, ప్రతిభ ఆధారంగా స్వల్ప కాలంలోనే టాప్ మేనేజ్మెంట్ గ్రేడ్‌కు చేరుకోవచ్చు. ఈ క్రమంలో మేనేజర్ హోదా తర్వాత దశల వారీగా.. సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్.. వంటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. వేతనాలు-ప్రోత్సాహకాలు: ఎస్బీఐ పీవో బేసిక్ రూ. 16,900తో ఆరంభమవుతుంది. అంటే.. వేరే బ్యాంకుల్లో నాలుగేళ్ల తర్వాత లభించే జీతం ఎస్బీఐలో కెరీర్ ప్రారంభంలోనే పొందొచ్చు. గరిష్ట వార్షిక వేతనం రూ.8,40,000. మిగతా బ్యాంకుల కంటే ఎస్బీఐలో ప్రోత్సాహకాలు అధికంగా ఉంటాయి. తక్కువ వడ్డీకి వివిధ రకాల రుణాలను పొందొచ్చు. విదేశాల్లోనూ బ్యాంక్ శాఖలు ఉన్న కారణంగా అక్కడ కూడా పని చేసే అవకాశం లభిస్తుంది. ఇంగ్లిష్: అత్యంత కీలక విభాగం ఇంగ్లిష్. ఎందుకంటే ఆబ్జెక్టివ్‌తోపాటు డిస్క్రిప్టివ్ పేపర్లో కూడా ఈ విభాగం నుంచే ప్రశ్నలు ఎదురవుతాయి. ఇందులో రీడింగ్ కాంప్రెహెన్షన్, క్లోజ్ టెస్ట్, కామన్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో మెరుగైన స్కోర్ సాధించాలంటే ప్రధానంగా గ్రామర్ మీద దృష్టి సారించాలి. వొకాబ్యులరీ మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి రోజూ ఇంగ్లిష్ పేపర్ చదవడం, టీవీ వార్తలు వినడం చేయాలి. దీంతో ఏ పదాన్ని సందర్భానుసారంగా ఏవిధంగా ఉపయోగించాలో అవగాహన వస్తుంది. అంతేకాకుండా ప్రతి రోజూ 15 నుంచి 20 కొత్త పదాలు నేర్చుకోవాలి. గ్రామర్, రీడింగ్ కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, రూట్‌వర్డ్స్‌ను బాగా సాధన చేయాలి. జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటివాటిల్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అందువల్ల వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. యాంటోనిమ్స్, సినానిమ్స్ నేర్చుకోవాలి. ప్రాథమిక గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాక్టివ్, పాసివ్ వాయిస్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్ తదితర అంశాలను సాధన చేయాలి. జనరల్ అవేర్నెస్: జనరల్ అవేర్నెస్, మార్కెటింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మూడు విభాగాలు ఉండడంతో దీని ప్రాముఖ్యం పెరిగింది. జనరల్ అవేర్‌నెస్‌లో స్వల్ప సమయంలో ఎక్కువ ప్రశ్నలకు ఎటువంటి తార్కికత అవసరం లేకుండానే సమాధానాలను గుర్తించవచ్చు. ఈ విభాగం కోసం జాతీయ-అంతర్జాతీయంగా రాజకీయంగా, ఆర్థికంగా గత 7 నుంచి 8 నెలలుగా చోటు చేసుకున్న సంఘటనలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. వాటితోపాటు ప్రభుత్వ పథకాలు, వివిధ అవార్డులు, బడ్జెట్, అంతర్జాతీయ సదస్సులు, క్రీడలు-విజేతలు, ముఖ్య వ్యక్తులు, ర చయితలు.. ఇలా విభిన్న అంశాలకు సంబంధించిన సమకాలీన అంశాలపై పట్టు పెంచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో బ్యాంకింగ్ రంగం విషయానికొస్తే.. బ్యాంకింగ్ రంగ విధాన నిర్ణయాలు, బ్యాంకింగ్ సాధనాలు, నియామకాలు, ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ, ఫైనాన్షియల్ టర్మ్స్, అకౌంటింగ్ టర్మ్స్, వివిధ కమిటీల గురించి తెలుసుకోవాలి. ఈ విభాగం ప్రిపరేషన్‌ను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి. ఇందుకోసం ప్రతి రోజూ తెలుగు, ఆంగ్ల దినపత్రికలు, బిజినెస్ డైలీస్, చదవడం, బిజినెస్ చానల్స్ చూడడం ప్రయోజనకరం.కంప్యూటర్ విభాగానికి సంబంధించి ఈ-కామర్స్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ టెక్నాలజీస్, ఇన్పుట్, అవుట్‌పుట్ డివెజైస్, ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ జనరేషన్లు, హార్డ్‌వేర్, ఎంఎస్ ఆఫీస్ ప్రాథమిక విభాగాలైన ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మార్కెటింగ్ విభాగంలో ముందుగా.. మార్కెటింగ్ పరిభాషను అవగాహన చేసుకోవాలి. తద్వారా సులువుగా ప్రిపరేషన్ సాగించవచ్చు. ఈ క్రమంలో సెల్లింగ్, మార్కెటింగ్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్, బ్రాండింగ్, కో-బ్రాండింగ్ వంటి అంశాల మధ్య తేడాను తెలుసుకోవాలి. మార్కెటింగ్‌లో కీలమైన 7పీస్ (7Ps of marketing Product, Prices, Promotion, Place, Packaging, Positioning, People), సీఆర్ఎం (Customer relationship management CRM) కాన్సెప్ట్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. డేటా అనాలిసిస్: అభ్యర్థిలోని విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగం డేటా అనాలిసిస్. ఇందులో పై చార్ట్, బార్‌గ్రాఫ్స్, టేబుల్స్, లైన్ గ్రాఫ్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సింప్లిఫికేషన్, రేషియో, ప్రిపోజిషన్‌స, పర్సంటేజెస్, యావరేజెస్ వంటి ప్రక్రియలతో ముడిపడిన ప్రశ్నలు కూడా అడుగుతారు. సులభమైన భాషలో చెప్పాలంటే ఈ విభాగంలో అడిగే ప్రశ్నలన్నీ కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం వంటి ప్రక్రియలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ ప్రక్రియల్లో పట్టుసాధించాలంటే.. వీటికి మూల స్తంభాలుగా నిలిచే 20 వరకు టేబుల్స్, 30 వరకు స్క్వేర్స్ నేర్చుకోవాలి. వేగంగా, కచ్చితత్వంతో సమాధానాన్ని గుర్తించే విధంగా షార్ట్‌కట్ మెథడ్స్ నేర్చుకోవాలి. రీజనింగ్: అత్యంత క్లిష్టమైన విభాగం రీజనింగ్. ఇందులో ప్రశ్నలను సాధించాలంటే విశ్లేషణ సామర్థ్యంతోపాటు తార్కికత (లాజిక్) కూడా అవసరం. రీజనింగ్‌కు సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఇన్పుట్-అవుట్‌పుట్ నుంచి 5 ప్రశ్నలు, కోడింగ్- డీకోడింగ్ నుంచి 5 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ నుంచి 15 ప్రశ్నలు, డౌజజీటఝ నుంచి 5 ప్రశ్నలు, పజిల్ /సీటింగ్ ఆరేంజ్మెంట్ నుంచి 10 ప్రశ్నలు, డేటా సఫిషియన్సీ నుంచి 5 ప్రశ్నలు, డెరైక్షన్-ఇతర ప్రాబ్లమ్స్ నుంచి 5 ప్రశ్నలు వచ్చాయి. మిగిలిన ప్రశ్నలతో పోలిస్తే రీజనింగ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఇచ్చిన ప్రశ్నను అవగాహన చేసుకోవడం ద్వారా సులువుగానే సమాధానం గుర్తించవచ్చు. ఇందుకు దోహదపడే అంశాలు ఏకాగ్రత, సమయస్ఫూర్తి, తార్కిక వివేచన. ఆయా అంశాలకు సంబంధించి భిన్నమైన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. అంతేకాకుండా వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలను ఊహించుకుని ప్రాక్టీస్ చేయడం ప్రయోజనకరం. డిస్క్రిప్టివ్ టెస్ట్: ఎస్సే రైటింగ్‌లో మూడు అంశాలిస్తారు. ఇవి మూడు భిన్న నేపథ్యాల్లోంచి ఉంటాయి. అందులో ఏదో ఒక దాన్ని అభ్యర్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో మొదటి టాపిక్ సాధారణంగా చుట్టూ జరుగుతున్న సంఘటనల ఆధారితంగా ఉంటుంది. ఉదాహరణకు సోషల్ మీడియా, ప్రజలను చైతన్య పరచడంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర వంటివి. రెండో ఎస్సే పండుగలు, సంప్రదాయాలు, ఉత్సవాలకు సంబంధించిన అంశంపై ఇస్తారు. బ్యాంకింగ్ రంగంపై మూడో టాపిక్ ఉంటుంది. ఉదాహరణకు బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుత ధోరణులు, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజివ్, రోల్ ఆఫ్ ఐఆర్డీఏ వంటివి. లెటర్ రైటింగ్‌లో పర్సనల్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్ అని రెండు రకాలు ఉంటాయి. ప్రభావవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే లెటర్ రైటింగ్‌లో మంచి స్కోర్ సాధించవచ్చు. లెటర్స్ రాసేటప్పుడు వాటికి సంబంధించి పాటించాల్సిన ప్రాథమిక అంశాలను (Address, Salutation, Subject, Reference, closing letter with thankవంటివి) ప్రిసెస్ రైటింగ్‌ను ప్రభావవంతంగా చేయాలంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, కంజెక్షన్ విభాగాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉదాహరణకు “Ramesh is a well known person in the colony. He is always ready to give practical help to the people who are in trouble.” Can be abridged as “Ramesh is a good Samaritan” నోటిఫికేషన్ సమాచారం: ఖాళీలు: 1837 (జనరల్: 758, ఓబీసీ: 405, ఎస్టీ: 439, ఎస్సీ: 235) అర్హత: ఏదైగా డిగ్రీ. నిబంధనల మేరకు చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: ఏప్రిల్ 1, 2014 నాటికి 21 నుంచి 30 ఏళ్లు. దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2014. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 28, 2014. వివరాలకు: www.statebankofindia.com www.sbi.co.in. టిప్స్ పరీక్షను మొదట జనరల్ అవేర్నెస్తో ప్రారంభించడం మంచిది. ఎందుకంటే ఇందులో సమాధానం ఇవ్వడానికి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంగ్లిష్ విభాగాన్ని ఎంచుకోవాలి. ఇందులోని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, క్లోజ్ టెస్ట్, జంబుల్డ్ సెంటెన్సెస్ వంటి ప్రశ్నలను ముందుగా ప్రయత్నించాలి. ఎందుకంటే వీటికి 40 మార్కులు కేటాయించారు. రీడింగ్ కాంప్రెహెన్షన్ను చివరగా సాధించండి. బాగా ప్రాక్టీస్ చేయడమే బ్యాంక్ పరీక్షల సక్సెస్ కీ. ప్రాక్టీస్‌తోనే స్పీడ్ పెరుగుతుంది. దాంతో తక్కువ సమయంలో ఎక్కువ సమాధానాలు రాయొచ్చు. 200 ప్రశ్నలు 120 నిమిషాలు అంటే.. ఒక ప్రశ్నకు 36 సెకన్లలో సమాధానం గుర్తించాలి. కాబట్టి స్పీడ్‌మ్యాథ్స్ రావాలి (వంద వరకు స్క్వేర్స్, 30 వరకు క్యూబ్స్ నేర్చుకోవాలి). పదోతరగతి వరకు మ్యాథ్స్‌పై పట్టుండాలి. సమయ పాలన కోసం మాక్ పరీక్షలు రాయాలి. కొన్ని ప్రశ్నలకు ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా సమాధానం వేగంగా రాబట్టొచ్చు. డిస్క్రిప్టివ్ పరీక్ష కోసం ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. రిఫరెన్స్ బుక్స్ ఇంగ్లిష్: ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్-టాటా మెక్‌గ్రాహిల్ లేదా పియర్సన్ పబ్లికేషన్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: చాంద్ పబ్లికేషన్స్ ఆర్ఎస్ అగర్వాల్ లేదా త్రిష పబ్లికేషన్స్ రీజనింగ్: ఆర్ఎస్ అగర్వాల్ లేదా త్రిష పబ్లికేషన్స్. బీఎస్సీ పబ్లికేషన్స్ ఎస్బీఐ పాత ప్రశ్నపత్రాలు. బ్యాంకింగ్ సర్వీసెస్ క్రానికల్, సీఎస్ఆర్..మ్యాగజైన్లు ఆబ్జెక్టివ్ మార్కెటింగ్-అరిహంత్ పబ్లికేషన్స్ ఆబ్జెక్టివ్ కంప్యూటర్ అవేర్నెస్-అరిహంత్ పబ్లికేషన్స్, కిరణ్ ప్రకాశణ్