oucet
-
ఓయూసెట్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : ఉస్మానియాతో పాటు రాష్ట్రంలోని మరో నాలుగు వర్సిటీల్లో వివిధ పీజీ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఓయూసెట్–2018 నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ఓయూ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ వివ రాలు వెల్లడించారు. ఓయూతో పాటు పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ వర్సిటీల్లోని పీజీ కోర్సులకు ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈసారి కొత్తగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలోని ఎం.ఎ. తెలుగు లిటరేచర్, ఎం.ఎ. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఎం.ఎ. లింగ్విస్టిక్స్ కోర్సులకు కూడా ఓయూ సెట్ ద్వారా ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 21 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని, అపరాధ రుసుము లేకుండా మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.200ల అపరాధ రుసుముతో మే 26 వరకు, వేయి రూపాయల అపరాధ రుసుముతో జూన్ 1 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఒక్కో కోర్సుకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700లు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు రూ.575లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మొదటిసారిగా ప్రవేశ పరీక్షల్లో ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెడుతున్నామన్నారు. వి ద్యార్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. జూన్ 4 నుంచి 13 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వí ßæంచి వారం రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామన్నారు. జూలై చివరికల్లా రెండు పర్యా యాలు అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఓయూ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్లు ప్రొఫెసర్ సంపత్‌కుమార్, ప్రొఫెసర్ నిర్మలా బాబూరావు, డాక్టర్ గంగాధర్, డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఓయూసెట్ వెరిఫికేషన్
హైదరాబాద్: ఓయూసెట్–2017 రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కానున్నట్లు ఓయూ పీజీ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. రెండో విడత వెబ్ ఆప్షన్స్‌లో సీటు పొందిన విద్యార్థులు తమ సర్టిఫికెట్లను ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో ఈ నెల 23, 24, 27, 28 తేదీల్లో వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వివరాలను www.osmania.ac.inలో చూడవచ్చు. -
రేపు ఓయూసెట్ రెండో జాబితా వెల్లడి
హైదరాబాద్ : ఓయూసెట్– 2017లో సీట్లు సాధించిన విద్యార్థుల రెండో జాబితా ను గురువారం(17న) వెల్లడించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. ఓయూతో పాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీల పరిధిలో వివిధ పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌లో ఆయా కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు http://www. osmania.ac.in/ వెబ్సైట్లో చూడవచ్చు. -
వెల్గొండ విద్యార్థికి 3వ ర్యాంకు..
బిజినేపల్లి (నాగర్‌కర్నూల్): మండలంలోని వెల్గొండ గ్రామానికి చెందిన జి.మల్లేష్‌గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓయూసెట్‌లో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. ఎంఈడీ చేసేందుకు నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థి మల్లేష్‌గౌడ్ 3వ ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులు, తోటి మిత్రులు అభినందనలు తెలిపారు. హన్వాడ: మండల కేంద్రానికి చెందిన విజయ్‌కుమార్‌కు రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించాడు. మండల ఎంట్రెన్స్ ఫలితాల్లో 76 ర్యాంకు సాధించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. -
జూన్ 5 నుంచి ఓయూ సెట్
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఓయూసెట్ 2017 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 5వ తేదీ నుంచి 13 వరకు రోజుకు మూడు పరీక్షల చొప్పున నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. దీని ద్వారా ఓయూతోపాటు పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ యూనివర్సిటీల పీజీ కోర్సులలో ప్రవేశాలు నిర్వహిస్తారు. హాల్‌టికెట్లను అభ్యర్థులు వచ్చే నెల 1 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. 30 నుంచి సెల్ట్ తరగతులు ఉస్మానియా వర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో ఈ నెల 30 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ జె.సావిత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌గా పిలిచే ఈ కోర్సుకు ఉదయం, సాయంత్రం వేర్వేరుగా తరగతులు నిర్వహిస్తామన్నారు. రెండు నెలల కాల వ్యవధి గల ఈ కోర్సుకు ఫీజు రూ.4000 గా నిర్ణయించినట్లు ఓయూ విద్యార్థులు, ఉద్యోగుల, అనుబంధ కళాశాలల విద్యార్థులకు ఫీజులో రాయితీ ఉంటుందని వివరించారు. ఇతర వివరాలకు 9652856107, 040-64575575, 27682354 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
15న ఓయూసెట్– 2017 నోటిఫికేషన్
హైదరాబాద్: ఓయూసెట్– 2017 నోటిఫికేషన్‌ను ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ అశోక్ శనివారం తెలిపారు. ఓయూతో పాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీజే, ఎంఎల్ఐసీ తదితర పీజీ కోర్సులతో పాటు పీజీ డిప్లమో, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షల ద్వారా సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. -
ఓయూసెట్‌కు తగ్గిన డిమాండ్!
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ కోర్సుల ప్రవేశార్హత పరీక్ష ఓయూసెట్ - 2016కు డిమాండ్ తగ్గింది. గురువారం (12న) దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసేనాటికి 78 వేల మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. గతేడాది లక్షకు పైగా దరఖాస్తులు రాగా ఈ ఏడాది 78 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవచని జాయింట్ డెరైక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు.