హైదరాబాద్ : ఉస్మానియాతో పాటు రాష్ట్రంలోని మరో నాలుగు వర్సిటీల్లో వివిధ పీజీ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఓయూసెట్–2018 నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ఓయూ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ వివ రాలు వెల్లడించారు. ఓయూతో పాటు పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ వర్సిటీల్లోని పీజీ కోర్సులకు ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈసారి కొత్తగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలోని ఎం.ఎ. తెలుగు లిటరేచర్, ఎం.ఎ. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఎం.ఎ. లింగ్విస్టిక్స్ కోర్సులకు కూడా ఓయూ సెట్ ద్వారా ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ నెల 21 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని, అపరాధ రుసుము లేకుండా మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.200ల అపరాధ రుసుముతో మే 26 వరకు, వేయి రూపాయల అపరాధ రుసుముతో జూన్ 1 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఒక్కో కోర్సుకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700లు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు రూ.575లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మొదటిసారిగా ప్రవేశ పరీక్షల్లో ఆన్‌లైన్ పద్ధతిని ప్రవేశపెడుతున్నామన్నారు. వి ద్యార్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. జూన్ 4 నుంచి 13 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వí ßæంచి వారం రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామన్నారు. జూలై చివరికల్లా రెండు పర్యా యాలు అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఓయూ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్లు ప్రొఫెసర్ సంపత్‌కుమార్, ప్రొఫెసర్ నిర్మలా బాబూరావు, డాక్టర్ గంగాధర్, డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment