హైదరాబాద్: ఓయూసెట్– 2017 నోటిఫికేషన్‌ను ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ అశోక్ శనివారం తెలిపారు. ఓయూతో పాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీజే, ఎంఎల్‌ఐసీ తదితర పీజీ కోర్సులతో పాటు పీజీ డిప్లమో, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షల ద్వారా సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.