outside lunch
-
పురుషులకే క్యాన్సర్ ముప్పు అధికం.. ఈ పరీక్షలు తప్పనిసరి.. లక్షణాలేంటంటే?
యువతలో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలలో స్నేహితులు, సరదాలు, ఎక్కువ. ఈ క్రమంలో సరదగా, టైమ్‌పాస్‌గా మొదలయ్యే స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్ వంటి దురలవాట్లు, బయటతిండి తినడం కూడా వాళ్లలోనే ఎక్కువ. బయటి ఆహారం అందంగా కనిపించడానికి వాటిల్లో నూనెలు, ఉప్పుకారాలు ఎక్కువగా వాడటమే కాకుండా కొన్ని ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్, కెమికల్స్, వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడుతుంటారు. ఇవి క్యాన్సర్ కారకాలు కావచ్చు. దురలవాట్లు, బయటి తిండి ఎక్కువగా తీసుకోవడం, వృత్తిపరమైన కారణాలు, ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవడం, వాతావరణ కాలుష్యానికి గురవ్వడం, నైట్‌డ్యూటీలు, ఏసీ రూముల్లో నిద్రలేకుండా పనిచేయడం, శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం ఇలా కారణాలు ఏమైతేనేం... మొత్తంగా చూస్తే పురుషులు స్త్రీలకంటే క్యాన్సర్‌కు ఎక్కువగా గురవుతారని మనం గమనించగలం. పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్ తప్పితే ఇంక ఏవి తీసుకున్నా స్త్రీలకంటే పురుషుల్లోనే ఎక్కువ. కారణాలు... ఉప్పు కారాలు, పచ్చళ్లు, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, ఇంకా దురలవాట్లు ఉండటం వంటి అంశాలు పొట్టకు సంబంధించిన క్యాన్సర్‌కు గురిచేస్తుంటాయి. అందుకే భారతదేశంలోని పురుషులు జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ల బారిన పడటం ఎక్కువ అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. మన దేశంలోని పురుషులు నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్ క్యాన్సర్లకు గురవడం చాలా ఎక్కువగా గమనిస్తుంటాం. అలవాట్లు, జీవనశైలి, ఆహారం ఆరోగ్యకరంగా లేకపోవడంతో పాటు పురుషుల్లో వారి వృత్తిపరమైన కారణాలూ ఉంటాయి. ఆస్బెస్టాస్ కంపెనీలో పనిచేసేవారు, అల్యూమినియమ్ కంపెనీల్లో పనిచేసేవారు, ఆల్కహాలిక్ బేవరేజెస్, పొగాకు ఉత్పత్తుల కంపెనీ, రేడియమ్ ఉత్పత్తులు, రేడియో న్యూక్లైడ్, చెక్కపొడి, గామారేడియేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారికి ఊపిరితిత్తులు – హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్... ఇతర వృత్తుల వారి కంటే ఎక్కువగా వచ్చే ముప్పు ఉంటుంది. ఎండకు ఎక్కువగా తిరగడం లేదా ఎండ అస్సలు తగలకుండా ఏసీ రూముల్లో అలా గంటల తరబడి కూర్చుని పనిచేయడం, నైట్‌డ్యూటీలు, పెస్టిసైడ్స్, కెమికల్స్‌కు మగవారే ఎక్కువగా గురవుతారు కాబట్టి వారికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. సాధారణంగా పురుషులు... అమ్మ లేదా భార్య ఏవి పెడితే అవి తింటూ ఉంటారు. వారు దగ్గరగా లేనప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు తేలికగా దొరికే జంక్‌ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఫలితంగా ఊబకాయం ముప్పు కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. నిర్ధారణ పరీక్షలు... పురుషుల్లో వయసు పైబడ్డాక సాధారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందుగానే తెలుసుకోడానికి పీఎస్ఏ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్) అనే రక్తపరీక్షను 50 ఏళ్లు పైబడ్డాక చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు... వీర్యంలో, అలాగే మూత్రంలో రక్తం కనిపించడం, నడుము, తుంటి, పక్కటెముకల నొప్పులు, మూత్రసంబంధ సమస్యల వంటి లక్షణాలతో కనిపించేసరికి... దశ ముదిరిపోయి ఎముకలకు కూడా పాకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పీఎస్ఏ పరీక్షలో యాంటిజెన్ పెరగడాన్ని గమనిస్తే ఇతర పరీక్షలు, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ (డీఆర్ఈ), ప్రోస్టేట్ బయాప్సీతో పాటు అవసరమైతే అల్ట్రాసౌండ్, బోన్‌స్కాన్, సీటీ స్కాన్, ఎమ్మారై, బయాప్సీ వంటి పరీక్షలు చేస్తారు. యాభై ఏళ్లు పైబడిన పురుషుల్లో లక్షణాలు ఉన్నా లేకున్నా పీఎస్ఏ, డీఆర్ఈ పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా మేరకు ఎంతకాలం తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకుంటే మంచిదో తెలుసుకోవాలి. పీఎస్ఏ పరీక్షల్లో మార్పులు ఎలా ఉంటున్నాయి, ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలనే విషయాల మీద అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరి. పురుషుల్లో ఈ కింది లక్షణాలను నిర్లక్ష్యం చేయడం తగదు. 1. తగ్గని దగ్గు; ఆ దగ్గుతో పాటు రక్తం పడటం. 2. ఆకలి తగ్గడం, బరువు తగ్గడం 3. అంతుపట్టని జ్వరం, స్పష్టమైన కారణం లేకుండా ఆకస్మికంగా బరువు తగ్గడం 4. మూత్రం ఆగి ఆగి రావడం, రక్తం కనిపించడం 5. మలవిసర్జనలో రక్తస్రావం 6. తీవ్రమైన అజీర్తి 7. గొంతునొప్పి, ఘనపదార్థాలు తీసుకోలేకపోవడం 8. నోటిలో మానని పుండ్లు 9. ఎముకల్లో నొప్పులు. పై లక్షణాలను ఇన్ఫెక్షన్స్ అనీ, పైల్స్ అనీ, రోగనిరోధక శక్తి తగ్గిందనీ, స్మోకింగ్ వల్ల కొద్దిగా దగ్గు వస్తూ ఉండటం మామూలేనంటూ నిర్లక్ష్యం చేయడం జరుగుతుంటుంది. కానీ వయసు కాస్త పైబడి, దురలవాట్లు ఉండి, లక్షణాలు కనిపిస్తే మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పురుషుల్లో ఎక్కువగా కనిపించే నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్, ప్రోస్టేట్ క్యాన్సర్లకు సంబంధించిన హెచ్చరికలు కావచ్చు. కాబట్టి ఆ మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, క్యాన్సర్లపై అవగాహన పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. -
ఇంటి కంటే రెస్టారెంట్ పదిలం
వీకెండ్ వచ్చిందంటే చాలు భార్యా పిల్లలతో కలిసి బయటకు వెళ్లి సరదా సరదాగా షాపింగ్ చేసి మల్టీప్లెక్స్‌లో మూవీ చూసి, తర్వాత రెస్టారెంట్లో ఇష్టమైన ఫుడ్ లాగిస్తేనే భారతీయులకు అదో తుత్తి. ఒకప్పడు బయట హోటల్స్‌కు వెళ్లాలంటే బర్త్‌డే, మ్యారేజ్‌డే ఇలా ఏదో ఒక ఫంక్షన్ ఉంటేనే వెళ్లేవారు. ఇప్పుడు భారతీయుల మైండ్ సెట్ మారింది. శని ఆదివారాలు ఎన్ని రకాల వినోదాలున్నా హోటల్‌కి వెళ్లి చేతులు కడగవలసిందే. ప్రతీ నెలలో కనీసం ఏడుసార్లు భారతీయ కుటుంబాలు రెస్టారెంట్లలో తినడానికే ఇష్టపడుతున్నారని నేషనల్ రెస్టారెంట్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) సర్వేలో తేలింది. దీని కోసం భారతీయులు నెలకి సగటున రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక స్విగ్గీలు, జోమాటో, యూబర్ ఈట్స్ వంటి యాప్‌లు వచ్చాక హోటల్ నుంచి ఇంటికి తెప్పించుకోవడాలు పెరిగిపోయాయి. అలా దేశ ప్రజలు నెలకి సగటున 6.6 సార్లు బయట తిండే తింటున్నారు. ఫుడ్ ట్రక్లు, ఫుడ్ పార్క్స్ , టేక్ ఎవేలు, హోమ్ డెలివరీలు అందుబాటులోకి వచ్చాక, ఆతిథ్య రంగం కొత్త దారి పట్టిందని, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తే ఇంటి భోజనమనే భావన వస్తే ఇంటి కన్నా రెస్టారెంట్లకి రావడానికే జనం ఇష్టపడుతున్నారని ఢిల్లీకి చెందిన రెస్టారెంట్ యజమాని అనురాగ్ కటియార్ వెల్లడించారు. నాలుగ్గోడల మధ్య మగ్గిపోతూ బయట నుంచి తెప్పించుకునే తిండి తినేకంటే, కాస్త ఆరుబయట గాలి పీల్చుకుంటూ రెస్టారెంట్లో యాంబియెన్స్‌ను ఎంజాయ్ చేస్తూ వేడివేడిగా తినడానికే 80 శాతం మంది భారతీయులు ఇష్టపడుతున్నారని ఎన్ఆర్ఏఐ సర్వేలో తేటతెల్లమైంది. ఎవరి టేస్ట్ వాళ్లదే రకరకాల ఘుమాయించే వంటకాలు,విభిన్న రుచులు, వైవిధ్యమైన డిషెస్ ఇప్పుడు ప్రతీచోటా దొరుకుతున్నాయి. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్టుగా ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్.. ఢిల్లీ వాసులకి స్థానికంగా దొరికే ఆహారం పట్ల మోజు లేదు. నార్త్ ఇండియన్ ఫుడ్ చూస్తేనే వారికి నోరూరుతుంది. బెంగుళూరులో దక్షిణాది వంటకాలపై అంతగా మోజు లేదు. నార్త్ ఇండియన్ మీల్స్, హైదరాబాదీ బిర్యానీలనే ఇష్టపడతారు. ఇక వెరైటీ రుచుల్ని ఆస్వాదించడంలో ముంబైకర్ల తీరే వేరు. దక్షిణాది రుచులకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు, దోసె, ఇడ్లీలను అత్యంత ఇష్టంగా లాగిస్తారు. ఇతర దేశాల వంటకాల్లో 33% మంది ఇటాలియన్ ఫుడ్ అంటే పడిచచ్చిపోతే, 29% మందికి చైనీస్ ఫుడ్ తింటేనే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి తప్ప ఎంతకని ఆ బయట తిండి తింటాం, ఇంట్లో చారు అన్నం తిన్నా అదే అమృతంలా అనిపిస్తుంది కదా అని 20శాతం మంది అభిప్రాయపడినట్టుగా సర్వేలో తేలింది. -
తీర్పుతోనైనా తెరపడేనా?
జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి తీర్పుతోనైనా విజయవాడలోని మల్టీఫ్లెక్స్ థియేటర్లు, మాల్స్‌లో దోపిడీకి తెరపడుతుందేమోనని ప్రజలు భావిస్తున్నారు. యథేచ్ఛగా సాగుతున్న సెలక్ట్ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని అధికారులను ఫోరం ఆదేశించింది. తినుబండారాలు, పానీయాలపై మార్కెట్ కంటే అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని 9 శాతం వడ్డీతో ఫిర్యాదుదారుడికి తిరిగి చెల్లించాలని çహుకుం జారీ చేసింది. సాక్షి, అమరావతి బ్యూరో : జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పు మేరకు అన్ని థియేటర్లు, మాల్స్, మల్టీప్లెక్స్‌లలో బయటి నుంచి తినుబండారాలు, నీరు, పానీయాలు అనుమతించాలని.. వినియోగదారులకు నీరు అందుబాటులో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే ఎవరైనా ఫిర్యాదు చేయడానికి అనువుగా అన్నిచోట్లా తూనికలు, కొలతల శాఖ అధికారుల ఫోన్ నంబర్లున్న బోర్డులుంచాలన్నారు. ధరల పట్టికను కూడా ప్రముఖంగా కన్పించేలా ఏర్పాటు చేయాలన్నారు. వీటన్నింటినీ అమలయ్యేలా చూడాల్సినబాధ్యత తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ తీసుకోవాలని స్పష్టం చేశారు. స్నాక్స్ పేరుతో దోపిడీ.... రోజువారీ సాధక బాధల నుంచి సగటు జీవికి ఊరట ఉపశయాన్ని ఇచ్చే ‘సినిమా’ ప్రియంగా మారింది. ప్రేక్షకులకు కార్పొరేట్ మల్టీఫ్లెక్స్ థియేటర్లోకి వెళ్లకముందే సినిమా చూపిస్తున్నాయి. పెద్ద హీరో సినిమాకు టికెట్లతో పాటు కాంబో ప్యాక్, అర్డనరీ ప్యాక్ కొనుగోలు తప్పని సరి చేస్తున్నాయి. అప్పటికే చేతిచమురు వదిలించుకున్నప్పటికీ ఇంటర్వెల్లో అసలు సినిమా మొదలవుతోంది. కేవలం స్నాక్స్‌కే రూ.800 నుంచి రూ.1000 వెచ్చించాల్సి వస్తోంది. పెద్ద హీరో సినిమాలయితే.. పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే మాత్రం అభిమానుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్లలోనే అభిమాన హీరోల సినిమాల రిలీజ్ అవుతుండడంతో అక్కడే వెళ్లి సినిమా చూడాల్సి వస్తోంది. . కేవలం పాప్ కార్న్ , కూల్ డ్రింక్ బాటిల్ చేతిలో పెట్టి రూ.600 వంతున వసూళ్లు చేస్తున్నారు. థియేటర్లలో టికెట్ రూ.150 వంతున వసూళ్లు చేస్తుండగా కాంబో పేరుతో స్నాక్స్ అంటూ మరో రూ.450 అదనంగా పెంచి టికెట్లు ఇస్తున్నారు. ఎవరు చెప్పినా.. విజయవాడ నగరంలో 5 మల్టీఫ్లెక్స్ థియేటర్లు ఉన్నాయి.. అందులో ఒక్కో మల్లీప్లెక్స్‌లో సగటున 6 స్కీన్స్ ఉన్నాయి.. ప్రతి చోట స్నాక్స్ పేరుతో అడ్డుగోలు దోపిడి చేస్తున్నారు. థియేటర్ వెలుపల కొనుగోలు చేసినా ఏ తినుబండార మూ లోనికి అనుమతించడం లేదు. థియేటర్ క్యాంటీన్లోనే కొనుగోలు చేయాలి. ఆఫ్ లీటర్ వాటర్ బాటిల్ రూ.50.. చిన్న పాప్‌కార్న్‌కు రూ.170 , కోల్డ్ కాఫీ రూ.150, పిజ్జా, కోక్ రూ.200 , స్వీట్స్ కేక్స్ రూ.80 ఇలా 28 రకాల పుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటీ రూ. 100 నుంచి రూ.300 పైనే నిర్ణయించి విక్రయాలు చేస్తున్నారు. ప్రతి స్నాక్స్‌పై జీఎస్టీ బాదుడు అధనమే. గతంలో సెలక్ట్ చానల్ దోపిడికి జిల్లా కలెక్టర్ లక్ష్మీ కాంతం కళ్లెం వేస్తానంటూ హడాహుడి చేసినా ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. కొన్ని మల్టీప్లెక్స్‌లలోకి బయట నుంచి వాటర్ బాటిల్ తీసుకెళ్లేందుకు అనుమతి మాత్రమే ఇప్పించగలిగాడు. రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు పలుమార్లు కాళ్లు నొప్పుట్టేలా తనిఖీలు చేసినా ధరలు మాత్రం యథా«తథంగా ఉన్నాయంటే వారి అసమర్థతా ?. అధికారుల నిర్లక్ష్యమా..? అనేది నగరంలో చర్చగా మారింది.. పార్కింగ్ పేరుతో దోపిడీ... మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ పేరుతో దోపిడి చేస్తున్నారు. పార్కింగ్ వసతి ఉన్న చోట్ల సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రుసుము వసూలు చేయకూడదు.. అయినా నిర్వహకులు యథేచ్చగా వాహనదారులు నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.. మాల్స్‌లో ద్విచక్రవాహనానకి రూ.20, కారు అయితే రూ.40 వంతున నిబంధనలకు విరుద్దంగా వసూళ్లు చేస్తూ పక్కా దోపిడికి పాల్పడుతున్నా పట్టించుకోనే వారు కరువయ్యారు. -
పస్క జాతరలో పల్లెజనం
చెట్లకిందే వంటా-వార్పు వరుణుడు కరుణించాలని ప్రత్యేక పూజలు మెదక్ రూరల్: పల్లెలు పస్కజాతరకు పయనమయ్యాయి.యేటా శ్రావణ మాసంలో గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామ శివార్లలోని పొలాల్లోకి కుటుంబమంతా కలిసి వెళ్లి అక్కడే వంటలు చేసుకొని గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా వరుణుడు కరుణించి వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధి పండాలని, అనారోగ్యాలు దరిచేరకుండా చూడాలని గ్రామదేవతలను కోరుకుంటారు. ఈ యేడాది కూడా మెదక్ మండలంలోని హవేళి ఘణాపూర్, చౌట్లపల్లితోపాటు పలు గ్రామాల ప్రజలు ఆదివారం పస్క జాతర పండగ జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ప్రజలు ఈ పండగను జరుపుకుంటారు. వరుణ దేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురియాలని, పంటలు బాగా పండాలంటూ గ్రామశివార్లలోని చెట్ల కింద వంటా-వార్పు చేసుకుంటారు. ఈ సందర్భంగా చిలకమ్మ అనే దేవతకు పరమాన్నం నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే గ్రామశివారులోని గ్రామదేతలకు నైవేద్యం పెట్టి పూజలు నిర్వహిస్తారు. ఇంటిల్లిపాది కలిసి వన భోజనం చేసి సరదాగా గడుపుతారు. అలాగే అనారోగ్యాలు దరిచేరకూడదని, పిల్లా పాపలతో చల్లంగా ఉండేలా దీవించాలని గ్రామదేవతలను కోరుకుంటారు. కొన్ని గ్రామాల్లో శ్రావణమాసంలో మూడుసార్లు పస్కజాతర జరుపుకుంటారు. పంటకు పట్టిన పురుగును సాగదోలేందుకు చెన్లలో గల పంటకు పట్టిన పురుగును సాగదోలేందుకు, రోగాలు దరిదాపుల్లోకి రాకుండా ఉండేందుకు ఊరు ఊరంతా చెట్ల కిందికి వెళ్లి దేవునికి మొక్కి పరమాన్నం నైవేద్యంగా పెట్టి కుటుంబ సమేతంగా ఉల్లాసంగా పస్క పండగను చేసుకుంటాం. - బరంచ భూమయ్య, హవేళిఘణాపూర్ పంటలు బాగా పండేందుకే పస్క పండగ వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని పస్క పండగ చేసుకుంటాం. పంటకు పట్టిన పురుగును తరిమేందుకు శ్రావణంలో సంక్రమించే వ్యాధులను తరిమేందుకు దేవుణ్ని కోరుకుంటూ నైవేద్యం పెట్టి, వంటలు చేసుకొని కుటుంబంతో చెట్లకింద సంతోషంగా గడుపుతాం. - మూగ వెంకటి, హవేళిఘణాపూర్