P. Ramakanth reddy
-
మునిసిపల్ ఓట్ల లెక్కింపు అంతా వీడియో చిత్రీకరణ: రమాకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి. రమాకాంత్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఓట్ల రహస్యాన్ని కాపాడుతూనే.. ఓటింగ్ యంత్రాల్లో మొత్తం పోలైన ఓట్ల సంఖ్యను ప్రతీ ఈవీఎం నుంచి రికార్డు చేసి, వాటిని సీడీ, డీవీడీల్లో భద్రపర్చాలని ఆదేశించారు. ఈ సీడీ, డీవీడీలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సం బంధిత అధికారులు తమ వద్ద ఉంచుకోవాలని ఆయన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నెల జీతం అదనంగా ఇప్పించండి
భన్వర్‌లాల్‌ను కోరిన పోలీసు అధికారుల సంఘం సాక్షి, హైదరాబాద్: వరుసగా వచ్చిన ఎన్నికల బందోబస్తు కోసం గడిచిన కొన్ని రోజలుగా నిర్విరామంగా శ్రమిస్తున్న పోలీసులకు ఒక నెల జీతం అదనంగా ఇప్పించాలని కోరుతూ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం.. ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్‌కు గురువారం వినతిపత్రం అందించింది. సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల విధులను సమర్థంగా నిర్వహిస్తున్న పోలీసులకు 45 రోజుల టీఏను సైతం తక్షణం మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి పి.రమాకాంత్‌రెడ్డిని సైతం కలిసిన అధికారుల సంఘం ఒంగోలు జిల్లాలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. -
ఏప్రిల్ 6న పంచాయతీ పోరు!
-
ఏప్రిల్ 6న పంచాయతీ పోరు!
* రేపు నోటిఫికేషన్? * జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్ల గెజిట్లు సిద్ధం * శనివారానికల్లా జిల్లా పరిషత్, మండల పరిషత్ కోటా ఖరారు! * రాష్ట్రం యూనిట్‌గా జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ చైర్పర్సన్ల రిజర్వేషన్లు * జిల్లా యూనిట్‌గా జెడ్పీటీసీ, మండలం యూనిట్‌గా ఎంపీటీసీ.. సాక్షి, హైదరాబాద్: పంచాయతీ పిడుగు పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్ 6వ తేదీన పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 9వ తేదీ ఆదివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు, జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ చైర్పర్సన్ల ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్/నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ తదితర అధికారులతో సమావేశమయ్యూరు. రిజర్వేషన్లను ఎప్పటిలోగా అందిస్తారో తెలపాలని కోరారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారని, ఏడెనిమిది జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ గెజిట్ నోటిఫికేషన్లు అందగానే జెడ్పీ, మండల రిజర్వేషన్లు ఖరారు చేసి శనివారం రిజర్వేషన్ల జాబితా అందిస్తామని వారు హామీ ఇచ్చారు. రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో ఉంటాయని కూడా చెప్పారు. పంచాయతీరాజ్ అధికారులు ఇచ్చే రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో.. 10వ తరగతి, ఇంటర్ పరీక్షల దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 6 (ఆదివారం) అనువైన తేదీగా ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు తెలిసింది. పరీక్షల ఇబ్బందుల దృష్ట్యానే మున్సిపల్ ఎన్నికలను సైతం మార్చి 30న (ఆదివారం) నిర్వహిస్తున్న విషయం విదితమే. పంచాయతీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్లు (ఈవీఎంలు) ఉపయోగించేందుకు అవకాశం లేదు. అందువల్ల బ్యాలెట్ పేపర్లనే వినియోగించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు చాలా అధిక సంఖ్యలో ఈవీఎంలు అవసరమవుతారుు. అంత భారీ సంఖ్యలో ఈవీఎంలు ప్రస్తుతం అందుబాటులో లేవు. పైగా మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలనే వినియోగిస్తున్నందున సాంకేతిక కారణాల దృష్ట్యా కూడా వీటిని పంచాయతీ ఎన్నికల్లో ఉపయోగించే వీల్లేదని సమాచారం. మరోవైపు బ్యాలెట్ బాక్సుల కొరతను దృష్టిలో ఉంచుకుని పొరుగు రాష్ట్రాల నుంచి వీటిని తెప్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదీ పంచాయతీ రిజర్వేషన్ల విధానం.. * జెడ్పీ చైర్పర్సన్లు, మండల పరిషత్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్‌గా నిర్ణయిస్తారు. * రాజ్యాంగం ప్రకారం జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. తాజా జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు 18.88%, ఎస్టీలకు 9.15% రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. ఇక బీసీలకు జనాభాతో సంబంధం లేకుండా 34% రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు పంచాయతీరాజ్ వర్గాలు వివరించాయి. ఇక అన్నింటిలోనూ తొలిసారిగా మహిళలకు 50% సీట్లు రిజర్వ్ చేయనున్నారు. * తాజా జనాభా లెక్కల ప్రకారం మొత్తం రిజర్వేషన్ల శాతాన్ని 62.03 శాతంగా నిర్ణయించారు. అంతకుముందు ఇది 60.5 శాతమే. హా జెడ్పీ చైర్పర్సన్లలో ఎస్టీలకు రెండు, ఎస్సీలకు నాలుగు, బీసీలకు ఏడు, అన్రిజర్వ్డ్ కింద తొమ్మిది స్థానాలుగా నిర్ణయించినట్లు సమాచారం. అన్ రిజర్వ్డ్ స్థానాల్లో మహిళలకు (50% కింద) నాలుగు స్థానాలు రిజర్వ్ కానున్నాయి. * మండల పరిషత్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్‌గా నిర్ణయించినా, ఏ మండలం ఎవరికి రిజర్వ్ అవుతుందన్న విషయాన్ని పంచాయతీరాజ్ కమిషనర్ నిర్ణయించకుండా.. ఆయా జిల్లాల జనాభా లెక్కల ఆధారంగా సంఖ్యను మాత్రమే ఖరారు చేసి జిల్లాలకు పంపిస్తారు. ఆయా జిల్లాలకు కేటాయించిన సంఖ్యతో ఆయా జిల్లాలోని జనాభా ఆధారంగా కలెక్టర్లు మండల రిజర్వేషన్లు ఖరారు చేస్తారని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ఎంపీటీసీల రిజర్వేషన్లు మండల యూనిట్‌గా ఆయూ జిల్లాల కలెక్టర్లు ప్రకటిస్తారు. ‘పీసా’ చట్టం కింద 49 ఎంపీపీలు ఎస్టీలకే: ‘పీసా’(పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియా) చట్టం ప్రకారం ఏజెన్సీలోని మండల పరిషత్‌ల చైర్పర్సన్ స్థానాలను పూర్తిగా ఎస్టీలకు రిజర్వ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మధ్య కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1096 మండల పరిషత్‌లు ఉన్నారుు. వీటిలో 49 మండల పరిషత్‌లు ఏజెన్సీ (షెడ్యూల్డ్) ప్రాంతంలో ఉన్నారుు. వీటిని ఎస్టీలకు రిజర్వ్ చేయగా మిగిలే 1047 నాన్ షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతాలుగా గుర్తించి రిజర్వేషన్లు ఖరారు చేశారు. వీటిలోనూ తిరిగి ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటుంది. ఈ విధంగా ఎస్టీలకు (49+73) మొత్తం 122, ఎస్సీలకు 202, బీసీలకు 356 స్థానాలు రిజర్వ్ కాగా మిగిలిన 416 అన్ రిజర్వ్డ్ స్థానాలు. (వీటిలోనూ మహిళలకు 50% రిజర్వేషన్ ఉంటుంది) నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో రిజర్వేషన్ల శాతం... ఎస్టీలు 6.99%; ఎస్సీలు 19.32%; బీసీలు 34% ఓటర్ల జాబితాలు ప్రకటించండి ఎన్నికల సంఘం: ఈ నెల 10వ తేదీ నాటికి తాజా ఓటర్ల జాబితాలను ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు, జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారులను ఆదేశించింది. ఈ మేరకు కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తాజాగా ప్రచురించిన ఫోటోలున్న ఓటర్ల జాబితాను వినియోగించుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ఓటర్ల జాబితా ప్రచురించాలని ఆదేశించారు. మున్సిపోల్స్‌కు ముందు మద్యం బంద్: ఉత్తర్వులు జారీ మున్సిపల్ ఎన్నికలకు 48 గంటల ముందు మద్యం దుకాణాలను మూసేయాలని ఆదేశిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సమీర్‌శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు జరిగే 146 మున్సిపాలిటీలు, పది మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ నిబంధనలు వర్తింప చేయాలని పేర్కొన్నారు. ఇలావుండగా ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి చెందిన గుర్తింపు చిహ్నాలు వాడడానికి వీల్లేదని తెలిపారు. వాహనాలపైనే కాకుండా ఇంటిపైన, ఆస్తులకు సంబంధించిన వాటిలో పార్టీలతో ప్రమేయం కానీ, వాటి చిహ్నాలు కానీ ఉంచరాదని స్పష్టం చేశారు. కేవలం ఓటు హక్కు వినియోగించుకోవడం మినహా మరే విధంగానూ తమ విధానాన్ని బయట పెట్టడానికి వీల్లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థికి ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరిస్తే మూడు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తారని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు చూశాకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రతి కానీ, తమ న్యాయవాది నివేదిక కానీ వచ్చాక ఒక నిర్ణయానికి వస్తామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్ల జాబితాను ఇవ్వాల్సి ఉందని ఆయన తెలిపారు. - రమాకాంత్‌రెడ్డి -
జైరాంపై చర్య తీసుకోవాలి: వైఎస్సార్సీపీ
ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినతి సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ సీమాంధ్రకు హామీలు గుప్పించిన కేంద్ర మంత్రి జైరాం రమేష్ పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి.రమాకాంతరెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీ సీజీసీ సభ్యుడు జూపూడి ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, అధికార ప్రతినిధులు గట్టు రామచంద్రరావు, బి.జనక్‌ప్రసాద్ మంగళవారం ఎన్నికల కమిషనర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. మునిసిపల్ ఎన్నికల నియమావళి 3వ తేదీ 10గంటల నుంచే అమలులోకి వచ్చిందని, అయితే జైరాం రమేష్ విశాఖపట్నంలో మధ్యాహ్నం మూడు గంటలకు విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ఏమేమి చేయబోయేది ప్రకటించారని వారు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. సీమాంధ్రకు ప్రత్యేకహోదా కల్పిస్తామని రాజ్యసభలో ప్రధాని ప్రకటించినందున వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్ల గ్రాంటు లభిస్తుందని చెప్పారని, ప్రణాళికా సంఘం పేర్కొనక ముందే జైరాంరమేష్ ప్రకటించడం ఆశ్చర్యకరమని వారు పేర్కొన్నారు. ‘అపాయింటెడ్ డే’ నుంచి ఆరు నెలలోపు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించే విషయాన్ని పరిశీలిస్తామని చట్టంలో పేర్కొంటే అంతకు ముందే జైరాం వీటిని అంతర్జాతీయ విమానాశ్రయాలుగా చేస్తామని ఎలా ప్రకటిస్తారని తమ ఫిర్యాదు లో ప్రస్తావించారు. ‘అపాయింటెడ్ డే’ నుంచి ఆరునెలలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘ఐఓసీ’, ‘హెచ్‌పీసీఎల్’ ఆయిల్ కంపెనీలు, నూనెశుద్ధి కర్మాగారాన్ని నిర్మించే విషయాన్ని పరిశీలిస్తామని చట్టంలో పేర్కొంటే, సాధ్యాసాధ్యాల పరిశీలన ఏదీ లేకుండానే రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారని పేర్కొన్నారు. 4వ తేదీన గుంటూరులో జరిగిన సమావేశంలో కూడా జైరాం రమేష్ మళ్లీ ఇవే అంశాలు వెల్లడించారని వారు కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఇంటికి పోయేవారా.. రాజధానిని నిర్ణయించేది? సీమాంధ్రుల రాజధాని ఎక్కడో నిర్ణయించేది నాలుగు రోజుల్లో ఇంటికిపోయే వారా అని వైఎస్సార్ కాంగ్రెస్ నేత జూపూడి ప్రభాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాజధాని ఎక్కడ ఉండబోతోంది, ఎలా కట్టబోతున్నాం.. సచివాలయం ఫలానాచోట, హైకోర్టు బెంచీ ఫలానాచోట ఉండొచ్చు అని రకరకాలుగా చెబుతున్నారు. అలా మాట్లాడ్డానికి ఆయనెవరు?’’ అని నిలదీశారు. హైదరాబాద్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాజధానిని వికేంద్రీకరించాలని అనుకుంటున్నామన్న మంత్రి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘రాజధాని అంటే అన్ని కీలక అంగాలు ఒకచోట ఉండాలా.. లేదా? దేహానికి సంబంధించిన కిడ్నీలు ఒకచోట, లివర్ మరోచోట, గుండె ఇంకొకచోట ఉండేలా విడగొడితే మనుగడ సాధ్యమవుతుందా?’’ అని జూపూడి ప్రశ్నించారు. -
మున్సిపోల్స్‌పై ఈసీ కసరత్తు
నేడు ఉన్నతాధికారులతో రమాకాంత్‌రెడ్డి సమీక్ష.. రేపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలు సజావుగా, సాఫీగా నిర్వహించడానికి వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేపట్టింది. ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమావేశమై శాంతిభద్రతలు, ఆర్థికాంశాలు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది తదితర అంశాలపై చర్చించేందుకు సమాయత్తమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి బుధవారం డీజీపీ బి.ప్రసాదరావు, ఆర్థిక, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు అజయ్ కల్లం, సమీర్‌శర్మ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్ జనార్దన్‌రెడ్డి, ఇతర అధికారులతో భేటీ అవుతున్నారు. నామినేషన్లు, ప్రచారం, ఎన్నికల వ్యయం, మద్యం, నిఘా ఏర్పాట్లు, నియమావళి పకడ్బందీగా అమలు వంటి అంశాలపై చర్చిస్తారు. ఇదిలాఉండగా హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో రమాకాంతరెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఓటర్ల జాబితాల ప్రచురణ, పోలింగ్ కేంద్రాలు, మున్సిపల్ కార్పొరేషన్లలో రిటర్నింగ్ అధికారులు, మున్సిపాలిటీలకు ఎన్నికల అధికారుల నియామకం, ఈవీఎంల లభ్యత, ఎన్నికల మెటీరియల్ పంపిణీ తోపాటు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులు, పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ తదితర అంశాలను చర్చిస్తారు. ఓటు వేసేందుకు 21 రకాల గుర్తింపు కార్డులు మున్సిపల్ ఎన్నికల్లో 21 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించినా ఓటు వేయడానికి వీలు కల్పించనున్నారు. ఓటరు గుర్తింపుకార్డు లేనివారు పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులకు యాజమాన్యాలిచ్చిన గుర్తింపుకార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్లు, ఫొటోతో కూడిన పింఛన్ కార్డులు, స్వాతంత్య్ర సమరయోధుల కార్డులు, ఫొటో ఉన్న ఏటీఎం కార్డులు, బార్ కౌన్సిల్ ఇచ్చిన గుర్తింపుకార్డులు, ఉపాధి హామీ పథకం గుర్తింపుకార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, స్మార్ట్‌కార్డుల్లో ఏదో ఒకటి చూపించవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.