
మునిసిపల్ ఓట్ల లెక్కింపు అంతా వీడియో చిత్రీకరణ: రమాకాంత్‌రెడ్డి
మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి. రమాకాంత్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి. రమాకాంత్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఓట్ల రహస్యాన్ని కాపాడుతూనే.. ఓటింగ్ యంత్రాల్లో మొత్తం పోలైన ఓట్ల సంఖ్యను ప్రతీ ఈవీఎం నుంచి రికార్డు చేసి, వాటిని సీడీ, డీవీడీల్లో భద్రపర్చాలని ఆదేశించారు. ఈ సీడీ, డీవీడీలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సం బంధిత అధికారులు తమ వద్ద ఉంచుకోవాలని ఆయన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.