Paddy grain
-
నోటికందే కూడు నీటిపాలు!
మెదక్/ సిరిసిల్ల/ వీర్నపల్లి/ రుద్రంగి/ నిర్మల్/ వాజేడు: ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చాయి. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నీటి పాలవగా.. కొన్నిచోట్ల కోతకు వచ్చిన వరిపంట పొలాల్లోనే నేలకొరిగింది. దీనితో అన్నదాతలు ఆందోళనలో పడిపోయారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి ఇన్నిరోజులైనా ఇంకా కొనుగోళ్లు ఊపందుకోలేదని.. వర్షాలతో తమ ధాన్యం తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసు్తన్నారు. ఇప్పటికే ఆరిపోయి తేమశాతం తగ్గిన వడ్లు కూడా వర్షానికి తడిశాయని, మళ్లీ ఆరబెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రతీ గింజ కొంటామని ప్రభుత్వం ప్రకటించిందని.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని మండిపడుతున్నారు.తడిసిపోయిన ధాన్యం..రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే 156 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు మాత్రం మొదలుకాలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం హఠాత్తుగా కురిసిన వర్షంతో రైతులు ఆగమాగమయ్యారు. వీర్నపల్లి, రుద్రంగి మండల కేంద్రాల్లో టార్పాలిన్లు లేకపోవడంతో వడ్లు తడిసిపోయాయి. రుద్రంగి మండలం పరిధిలో రైస్‌మిల్లర్లు ధాన్యం దింపుకోబోమని చెప్తున్నారని రైతులు వాపోతున్నారు.⇒ మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. దుబ్బాక, మెదక్, నర్సాపూర్, కొల్చారం, చిన్నశంకరంపేట, కౌడిపల్లి, చిలప్‌చెడ్, నిజాంపేట, హత్నూర మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వేలాది క్వింటాళ్ల ధాన్యం నీటిపాలైంది. వర్షాల నేపథ్యంలో కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు.⇒ నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో శుక్రవారం గంటకుపైగా వాన కురిసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపైకి వరద చేరింది. కుంటాల మండలంలో కోతకు వచ్చిన వరి నేలవాలింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి, జైపూర్ మండలాల్లో సుమారు 4000 ఎకరాలకుపైగా వరి నేలవాలింది. భీమిని, కన్నెపల్లి మండలాల్లో వందల ఎకరాల్లో పత్తి తడిసిపోయింది.పిడుగుపాటుకు ఇద్దరు మృతిరాష్ట్రంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో పత్తి ఏరుతుండగా పిడుగుపడి గడ్డం నాగమ్మ (26) అనే మహిళ మృతి చెందింది. ఇక ములుగు జిల్లా వాజేడు మండలం కృష్ణాపురంలో వ్యవసాయ భూమిలో ఎడ్లను మేపుతుండగా పిడుగుపాటుకు గురై సొనప నవీన్ (24) మృతి చెందాడు. -
తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం
-
50 వేల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: మూడు రోజులుగా ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన అకాల వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో వరి ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. మొక్కజొన్న నేల రాలింది. కూరగాయల పంటలూ దెబ్బతిన్నాయి. మామిడికి భారీ నష్టం జరిగింది. గత నెలలో అకాల వర్షాలకు 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తుది అంచనా వేసిన వ్యవసాయ శాఖ, ఆ మేరకు పరిహారం ప్రకటించింది. ఎకరానికి రూ.10 వేల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా నష్టపోయిన పంటలకు ప్రభు త్వం పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాల్లో ఇలా.. ఉమ్మడి వరంగల్‌లో శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహం కురిసిన వడగళ్లతో కూడిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలకు, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటల నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు.. నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు. జనగామ జిల్లాలో.. జనగామ, బచ్చన్నపేట, రఘునాథపల్లి మండలాల పరిధిలోని 21,559 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు, మామిడి, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం బురహన్మియాపేట్ గ్రామంలో కోతకొచ్చిన వరి గింజలు పూర్తిగా రాలిపోయాయి. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్, కారేపల్లి, చింతకాని, బోనకల్, గుండాల, కరకగూడెం, దుమ్ముగూడెం తదితర మండలాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి. నేలకొండపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో రోడ్లపైన, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, దండేపల్లి మండలాల్లో కోతకు వచ్చిన వరి నేల వాలింది. కల్లాల్లో ధాన్యం తడిసింది. కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వరి, జొన్నతో పాటు వివిధ పంటలు దెబ్బతిన్నాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. కోతకు వచ్చిన వరిచేలు నేలవాలగా.. ధాన్యం రాశులు తడిసిపోయాయి. మామిడితోటల్లోకాయలు నేలరాలాయి. ధాన్యం కొట్టుకుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. రహదారులు వడగళ్లతో నిండిపోయాయి. పెంకుటిళ్లు, వాహనాల అద్దాలు దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లాలోని పూర్యానాయక్ తండాకు చెందిన కేలోత్ రంగమ్మ (45) పిడుగుపాటుతో మృతి చెందింది. రోడ్డెక్కిన రైతులు వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆదివారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రం సమీపంలోని వేల్పుచర్ల స్టేజీ వద్ద సూర్యాపేట – జనగామ జాతీయ రహదారిపై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యలో రాస్తారోకో నిర్వహించారు. ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో కూడా రైతులు రోడ్డెక్కారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు వచి్చన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని అడ్డుకున్నారు. ‘పరిశీలన కాదు.. సాయం తీసుకురండి’అంటూ నిలదీశారు. ప్రభుత్వం ఆదుకుంటుంది: గంగుల వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో అకాలవర్షానికి నష్టపోయిన వరిపంటను అధికారులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. వడగళ్ల నష్టంపై జనగామ కలెక్టరేట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. పెద్దపహాడ్ గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం అంచనాకు చర్యలు తీస్కోండి – సీఎస్‌కు ముఖ్యమంత్రి ఆదేశం కరీంనగర్ జిల్లా చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలం సహా రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కలెక్టర్లతో మాట్లాడి పంటలకు వాటిల్లిన నష్టంపై నివేదికలు తెప్పించాలని సూచించారు. -
ధాన్యం సేకరణ అంతంత మాత్రమే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. అక్టోబర్ 1 నుంచి కొనుగోళ్లు మొదలైనా తొలి మూడు వారాల్లో నిర్దేశిత లక్ష్యంలో సేకరణ కేవలం 10 శాతమే పూర్తయినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో ఇప్పటిదాకా 53 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోళ్లు జరగ్గా, 2004లో ఇదే సమయానికి 35.83 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ నెలలో ఇంత తక్కువ స్థాయిలో కొనుగోళ్లు జరగడం ఇదే తొలిసారి అని కేంద్ర ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. నిజానికి దేశంలో వరిసాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే ఈసారి 5.5 శాతం తగ్గింది. 3.67 కోట్ల హెక్టార్లకు పరిమితం అయ్యింది. సాగు విస్తీర్ణాన్ని బట్టి చూస్తే ధాన్యం కొనుగోళ్లు దేశవ్యాప్తంగా 5.18 కోట్ల మెట్రిక్ టన్నులు ఉంటాయని కేంద్రం అంచనా వేసింది. ఈ నెల నుంచే సేకరణ ప్రారంభించింది. అయితే, పంజాబ్, హరియాణాలో మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో సేకరణ జరిగింది. పంజాబ్‌లో 1.50 కోట్ల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 18.94 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయ్యింది. అధిక తేమశాతంతో ఇబ్బందులు ప్రతికూల వాతావరణం కారణంగానే ధాన్యం సేకరణ మందగించిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ధాన్యంలో తేమశాతం పరిమితిని 17 శాతంగా నిర్ణయించగా, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఇది 22 శాతం వరకూ ఉంటోంది. దీంతో ఆశించినంత వేగంగా సేకరణ జరగడం లేదు. వరి అధికంగా పండించే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదు. ఆయా రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా మొదలయ్యాయి. ఫలితంగా పంటల సాగులో జాప్యం జరిగింది. -
వేగంగా వరి కొను‘గోల్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంట కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతోంది. అన్ని జిల్లాల్లో కలిపి 10.55 లక్షల మంది రైతుల నుంచి ఇప్పటివరకు సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ సేకరించింది. ఇప్పటికే ఏడు జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 6,950 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి 6,862 కేంద్రాలను తెరిచారు. వాటిలో కొనుగోళ్లు పూర్తయిన 3,382 కేంద్రాలను శుక్రవారం నాటికి మూసివేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,252 కొనుగోలు కేంద్రాలు మాత్రమే నడుస్తున్నాయి. చాలా జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తి.. కోతలు ముందుగా ప్రారంభమైన ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ దాదాపుగా ముగిసింది. ఆలస్యంగా కోతలు జరిగిన సిరిసిల్ల, నిర్మల్ జిల్లాలలోని పదేసి గ్రామాల్లో రైతుల కోరిక మేరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తున్నప్పటికీ త్వరలోనే మూసివేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట, మంచిర్యాల, వరంగల్, జనగాం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, మహబూబ్‌నగర్, మేడ్చల్ జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయిన గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. ప్రైవేటుగానూ అమ్మకాలు.. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికార యంత్రాంగం అంచనా వేసింది. వ్యక్తిగత అవసరాలు, మిల్లర్లు కొనుగోళ్లు, విత్తనాల ధాన్యం పోగా 1.04 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అనుకున్నారు. అయితే అక్టోబర్ రెండో వారంలో మొదలు కావలసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ఆ నెలాఖరుకు మొదలయ్యాయి. చాలా జిల్లాల్లో నవంబర్ నెలాఖరు వరకు కూడా కొనుగోళ్లు మొదలు కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వడ్ల కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య రాజకీయ దుమారం చెలరేగింది. ఈ పరిస్థితుల్లో ధాన్యం విక్రయించేందుకు రోజుల తరబడి వేచి చూడలేని రైతులు మిల్లర్లకు, ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయించారు. ఇప్పటికీ వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో నేరుగా మిల్లర్లకే ధాన్యం విక్రయిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. దీంతో కోటి మెట్రిక్ టన్నులకుపైగా కొనుగోలు కేంద్రాలకు వస్తుందనుకున్న ధాన్యం ఇప్పటివరకు 60 ఎల్ఎంటీ వరకే వచ్చింది. ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి అదనంగా మరో 30 లక్షల వరకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి గింజ వరకు సేకరిస్తాం తెలంగాణ రైతాంగంపై కక్ష కట్టిన కేంద్రం యాసంగి పంటను తీసుకోబోమని చెప్పడంతోపాటు వానాకాలం పంటను ఎంత సేకరిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వరకే సేకరిస్తామని గతంలో పేర్కొనగా ఇప్పటికే ఆ లక్ష్యం దాటింది. ఏడు జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. మిగతా జిల్లాల నుంచి ఇంకా 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వస్తుందని భావిస్తున్నాం. ఎంత ధాన్యం వచ్చినా ఈ వానాకాలం పంటను చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. – మంత్రి గంగుల కమలాకర్ -
TS: నమ్మలేక.. లేఖ అడుగుతున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత వానాకాలానికి సంబంధించి కేంద్రం నిర్దేశించిన మేరకంటే అధికంగా వచ్చే ధాన్యాన్ని సేకరించే విషయమై రాష్ట్రానికి కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని తెలంగాణ మంత్రులు, ఎంపీలు డిమాండ్ చేశారు. ఎంతైనా కొంటామని నోటి మాటలు చెబితే కుదరదని, అదే విషయాన్ని స్పష్టం చేస్తూ రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. ధాన్యం కొనుగోళ్ల విషయమై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి, నేతకాని వెంకటేశ్, పసునూరి దయాకర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే రాష్ట్రం పరిస్థితి ఏమిటి? మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రస్తుత వానాకాలానికి సంబంధించి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని కేంద్రం చెప్పింది. కేంద్రంతో ఎంఓయూ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ లక్ష్యాన్ని మరింత పెంచాలని కోరారు. కొనుగోళ్లు మొదలయ్యాక దీనిపై చర్చిద్దామని కేంద్రమంత్రి అన్నారు. ఇప్పటికే 55 లక్షల టన్నుల సేకరణ పూర్తవగా, మంగళవారానికి కేంద్ర లక్ష్యం మేరకు కొనుగోళ్లు పూర్తవుతాయి. అయితే కేంద్రాల్లో మరో 12 నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉంది. భూపాలపల్లి, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వరి కోతలు జరిగితే మరో 5 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అదనంగా కొనుగోళ్లు చేస్తామని కేంద్రం నోటిమాటలు చెబితే చెల్లుబాటు కాదు. ఎంత వస్తే అంత తీసుకుంటామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలి..’అని డిమాండ్ చేశారు. అదనంగా వచ్చే ధాన్యాన్ని రాష్ట్రం సేకరించాక కేంద్రం డబ్బులు ఇవ్వకుంటే రాష్ట్రం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంతో ఇప్పటికే అనేక చేదు అనుభవాలు ఉన్న దృష్ట్యా లిఖిత పూర్వక హామీ కోరుతున్నామని చె ప్పారు. ఈ అంశాన్ని రైతు ప్రయోజనాల కోణంలో చూడాలని కోరారు. కేంద్రమంత్రి కలిసే వరకు మంత్రులు వేచి చూస్తున్నారని స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అయోమయానికి గురి చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ప్రస్తుత వానాకాలం సేకరణపై తాము నిలదీస్తుంటే, ఆయన గత యాసంగి సేకరణపై మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా 10 లక్షల మెట్రిక్ టన్నుల «ధాన్యం మిల్లింగ్ చేస్తున్నా, ఎఫ్‌సీఐ మాత్రం నెలకు 5 లక్షల టన్నులు మాత్రమే తీసుకుంటోందని, దీనికి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా ధాన్యం సేకరణ పెరుగుతున్నా, కేంద్రం అదనంగా ఒక్క గోదామును ఎందుకు కట్టలేదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. మంత్రులకు టైమ్ ఇవ్వని పీయూష్ ► మూడురోజులుగా ఎదురుచూపులు ► నేటి మధ్యాహ్నం భేటీకి అవకాశం సాక్షి న్యూఢిల్లీ: ప్రస్తుత వానాకాలంలో అదనపు ధాన్యం కొనుగోళ్ల విషయమై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రుల బృందానికి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం కూడా సమయమివ్వలేదు. ఆయన అపాయింట్మెంట్ కోసం శనివారం నుంచి మంత్రులు వేచి చూస్తున్నారు. సోమవారం పార్లమెంట్లో ఏదో ఒక సమయంలో కలుస్తానని పీయూష్ సమాచారం ఇచ్చారు. దీంతో సోమవారం రోజంతా మంత్రులు ఎదురుచూసినా సమావేశం మాత్రం ఖరారు కాలేదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ కేకే టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు పార్లమెంట్ ఆవరణలో పీయూష్‌ను కలిసి మంత్రుల బృందానికి సమయమివ్వాలని కోరారు. బిజీ షెడ్యూల్ కారణంగా సోమవారం కుదరదని చెప్పిన ఆయన.. మంగళవారం అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రులతో ఏర్పాటు చేసిన భేటీకి ముందు రాష్ట్ర మంత్రులను కలిసేందుకు సమయమిస్తానని చెప్పినట్టు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మంత్రులు పీయూష్‌ను కలిసే అవకాశాలున్నాయి. -
TS: ఊరూరా వరి దరువు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, నెట్వర్క్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఊరూరా చావుడప్పు మోగించడంతో పాటు ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మల దహనం చేపట్టారు. పాడెలు మోస్తూ శవయాత్రలు నిర్వహించారు. ప్రధానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వరి ధాన్యం కొనుగోలు చేయాలని, వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు వంటి రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఆకులమైలారం ధర్నాలో సబిత, ఖమ్మం జిల్లాలో పువ్వాడ.. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలనే నినాదంతో ఢిల్లీ కేంద్రంగా రైతులు చేపట్టిన ఆందోళనను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్రలకు రైతులు బలికాకుండా, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు వరికి బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం.. మహబూబ్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో నియోజకవర్గంలోని 58 గ్రామాలతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు వేలాది మంది రైతులతో భారీ ర్యాలీ నిర్వహించారు. చావుడప్పు మోగించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ర్యాలీలో దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొని చావు డప్పు కొట్టారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల కేంద్రంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తల్లాడలో ధాన్యం మూటలు తలపై పెట్టుకుని భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ టీఆర్ఎస్, బీజేపీ మధ్య తోపులాట కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య తోపులాట జరిగింది. రెండు పార్టీలు ఆందోళనలు చేస్తున్న క్రమంలో ఇరువర్గాల మధ్య పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని ఆకులమైలారంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. జీహెచ్ఎంసీలోని బంజారాహిల్స్‌లో మేయర్ గద్వాల విజయలక్ష్మి నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. నల్లగొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్నా ► రైతు వ్యతిరేక బీజేపీకి గుణపాఠం చెప్పాలి. వరి ధాన్యం కొనుగోలు చేయకుండా రాజకీయ కుట్రలు చేస్తున్న పార్టీని గ్రామగ్రామానా నిలదీయాలి. బీజేపీ రైతుల ఉసురు పోసుకుని కార్పొరేట్ వర్గాలకు లాభం చేకూరుస్తూ బడా కంపెనీలకు కొమ్ము కాస్తోంది. – గజ్వేల్ ధర్నాలో హరీశ్ -
ధాన్యం కొనేది ఎప్పుడు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ఆందోళనలకు దిగారు. కొనుగోలు కేంద్రాలన్నీ ప్రారంభం కాకపోవడం, పరిమితంగా టోకెన్లు ఇస్తుండటం, వాటికోసం కూడా గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తుండటంతో నిరసనలు చేపట్టారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, త్రిపురారం, దామరచర్లలో ధాన్యం కొనుగోళ్ల టోకెన్ల కోసం రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, గరిడేపల్లిలో రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలకు దిగారు. నేరేడుచర్ల వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద టోకెన్ల క్యూలో తోపులాట జరిగింది. నేరేడుచర్ల, వేములపల్లి, పెన్‌పహాడ్, మఠంపల్లితోపాటు చాలా ప్రాంతాల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచే రైతులు క్యూలైన్లలో నిలబడ్డారు. పదిహేను రోజులు గడుస్తున్నా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి కోతలు ప్రారంభమై పదిహేను రోజులు అవుతున్నా కొనుగోళ్ల కోసం అధికారులు ఏర్పాట్లు చేయలేదు. రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరాక అధికారులు మేల్కొన్నా.. తగిన స్థాయిలో చర్యలు చేపట్టలేదు. కొనుగోలు కేంద్రాలను తామే ప్రారంభిస్తామని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తుండటం, వారు వచ్చే వరకు ఆగాల్సి రావడం ఇబ్బందిగా మారిందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 762 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటే.. శుక్రవారం వరకు 83 కేంద్రాలనే తెరిచారు. నల్లగొండ జిల్లాలో 199 కేంద్రాలకుగాను 81, సూర్యాపేట జిల్లాలో 333 కేంద్రాలకుగాను రెండు, మూడింటిని మాత్రమే ప్రారంభించారు. యాదాద్రి జిల్లాలో 230 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఒక్కటి కూడా తెరవలేదు. మిల్లుల్లోనూ కొనుగోళ్లు లేక.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో మొత్తం 221 మిల్లులు ఉండగా.. ప్రస్తుతం 75 మిల్లుల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ధాన్యం అమ్మకునేందుకు పెద్ద సంఖ్యలో రైతులు వ్యవసాయ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. కానీ కొనుగోళ్లు చేయలేని పరిస్థితులు అధికారులు తక్కువ సంఖ్యలో టోకెన్లు ఇస్తున్నారు. అదికూడా ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తుండటంతో.. ఎక్కువ ధాన్యమున్న రైతుల కుటుంబ సభ్యులు కూడా క్యూలైన్లలో నిలబడుతున్నారు. రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు పడుతుండటంతో.. ధాన్యం ఎక్కడ పాడవుతుందోనని ఆందోళనలకు దిగుతున్నారు. ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తే చర్యలు మిర్యాలగూడ: సన్నరకం ధాన్యానికి మిల్లర్లు తక్కువ ధర చెల్లిస్తే చర్యలు తీసుకుంటామని నల్లగొండ ఎస్పీ రంగనా«థ్ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు మిల్లుల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ధాన్యానికి చెల్లించిన ధరల బిల్లులను పరిశీలించారు. మిల్లర్ల సమావేశంలో నిర్ణయించిన మేరకే సన్నరకాలకు ధర చెల్లించాలన్నారు. రైతులకు టోకెన్లు ఇచ్చేక్రమంలో వారి ఫోన్ నంబర్లు తీసుకోవాలని, రోజువారీగా మిల్లుల్లో ధాన్యానికి చెల్లిస్తున్న ధరలను రైతులకు ఫోన్ చేసి తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. 12 ఎకరాల వరికి ఒక్క టోకెనే ఇచ్చారు నేను 12 ఎకరాల్లో వరి వేశాను. ఒకేసారి నాటు వేయడం వల్ల ఒకేసారి కోతకు వచ్చింది. మూడు ట్రాక్టర్ల ధాన్యం ఉంటుంది. ఉదయం నుంచి క్యూలో ఉన్నా ఒక్క టోకెన్ మాత్రమే ఇచ్చారు. ఒక్క టోకెన్‌తో ధాన్యం మొత్తం ఎలా అమ్ముకోవాలి? ఇలాంటి విషయాలపై అధికారులు దృష్టిపెట్టాలి. –నాగుల్‌మీరా, రైతు, ఊట్లపల్లి, నల్లగొండ జిల్లా 25 రోజులుగా పడిగాపులే.. భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరకు చెందిన ఉప్పునూతల నర్సింహ ఏడున్నర ఎకరాల్లో వరి వేశాడు. దసరాకు ముందు ధాన్యాన్ని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌కు తీసుకువచ్చి కుప్పపోశాడు. ఇన్నిరోజులు గడిచినా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో ఆందోళనలో ఉన్నాడు. సన్నరకాలు కొనేలా ఆదేశాలిచ్చాం జిల్లాలోని మిల్లుల్లో గత సీజన్ సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యం అలాగే ఉండటంతో ఇప్పుడు కొనుగోలు చేయలేకపోతున్నారు. శుక్రవారం నుంచి సన్నరకాలు కొనుగోలు చేయాలని మిల్లర్లను ఆదేశించాం. రైతులు ఇబ్బంది పడకుండా టోకెన్లు అందజేస్తాం. రైతులు తమకు కేటాయించిన రోజున ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్లాలి. – వినయ్‌కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్, సూర్యాపేట -
ధాన్యం తరుగు తీయకుండా ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురానికి చెందిన రైతు కందుల రంగారావు గత యాసంగిలో కౌలుకు తీసుకున్న 12 ఎకరాలు, సొంతంగా తనకున్న మూడెకరాల్లో వరి సాగు చేశాడు. సమీపంలోని మేడేపల్లి సహకార సొసైటీలో ధాన్యం అమ్మాడు. కొనుగోలు కేంద్రంలో కాంటా వేస్తే ఈ ధాన్యం 400 క్వింటాళ్లు అయింది. ఈ ధాన్యాన్ని లారీలో కరీంనగర్ జిల్లాలోని రైస్‌మిల్లుకు తరలించారు. రెండు, మూడు నెలల వ్యవధిలో అతనితో పాటు అతని భార్య ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. అయితే రూ.40 వేలకు పైగా తక్కువ జమయ్యాయి. కొనుగోలు కేంద్రంలో లెక్క వేసిన దాని కన్నా 24 క్వింటాళ్ల తరుగు (క్వింటాల్‌కు 6 కేజీలు చొప్పున) తీయడమే ఇందుకు కారణం. కొనుగోలు కేంద్రంలో కాంటాకు, మిల్లుకు చేరిన తర్వాత వేబ్రిడ్జికి తూకంలో తేడా ఉండటం, కొనుగోలు కేంద్రంలో కాంటా వేసిన తర్వాత కొన్నిరోజుల పాటు ధాన్యం బస్తాల్లోనే ఎండటం వంటి కారణాలతో ఈ తరుగు వచ్చింది. రంగారావు ఒక్కరే కాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రైతు ఈ విధంగా తరుగు కారణంగా నష్టపోయాడు. అయితే తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో రైతులకు తరుగు బాధ తప్పనుంది. ఆరబెట్టని ధాన్యంతోనే తంటా గత పదేళ్లుగా వ్యవసాయ రంగంలో సాంకేతిక మార్పులొచ్చాయి. హార్వెస్టర్ల (వరి కోత మిషన్)తో రైతులకు శ్రమ, కూలీల బాధ తప్పింది. ఈ మిషన్ల ద్వారా కోసిన వరి ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తరలిస్తుండటంతో తేమ శాతంతో నష్టపోవాల్సి వస్తోంది. అయితే ఆరబెట్టని ధాన్యాన్ని రైతులు అమ్మకానికి తెస్తుండటంతో కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు కొర్రీలు పెట్టి కమీషన్లు ఇస్తేనే.. కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఫిర్యాదులు కూడా ప్రభుత్వానికి అందాయి. మరోవైపు ఇలా కొనుగోలు చేసిన ధాన్యమే కాకుండా, తేమ ప్రమాణాలు పాటించిన ధాన్యానికి కూడా కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుల వరకు తరుగు పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన తర్వాత అమ్మకానికి రోజులు తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. కాంటాలు వేసిన తర్వాత బస్తాలను మిల్లులకు తరలించేందుకు లారీలు సకాలంలో రావడం లేదు. ఎలాగో మిల్లులకు చేరినా అక్కడ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటోంది. ఈలోగా ధాన్యం ఎండిపోతుండటం, మిల్లుకు ధాన్యం చేరే వరకు రైతుదే బాధ్యత కావడంతో ప్రతి ఏటా రైతులు తరుగు కారణంగా నష్టపోతున్నారు. బస్తాకు ఇక 40 కేజీలు నికరం ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, జీసీసీ, హాకా, వ్యవసాయ మార్కెట్లలో కొనుగోలు చేసే ధాన్యం మిల్లులకు చేరే వరకు రైతులదే బాధ్యత అనే నిబంధన గత యాసంగి సీజన్ వరకు ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో బస్తా 41 కేజీల ధాన్యం తూకం వేస్తారు. గన్నీ బ్యాగు బరువు, ఇతర తరుగు కలిపి కేజీ మినహాయించి 40 కేజీలకు రైతుకు ధర చెల్లించాలి. అయితే కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు చేరే వరకు రైతే బాధ్యత వహించాలనే పేరిట ఈ 40 కేజీల్లోనూ 2 నుంచి 10 కేజీల వరకు తరుగు పేరుతో తీస్తున్నారు. దీంతో రైతులు క్వింటాళ్ల కొద్దీ ధాన్యాన్ని నష్టపోతున్నారు. అయితే ఈ వానాకాలం నుంచి ఇలా తరుగు తీయవద్దని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రాల్లో ఎన్ని క్వింటాళ్లు కొనుగోలు చేస్తే ఇక నుంచి అన్ని క్వింటాళ్లకు గన్నీ బ్యాగు బరువు, ఇతర తరుగు కేజీ వరకు మాత్రమే మినహాయించి ధర చెల్లించాలి. అంటే ఇకపై నికరంగా బస్తాకు 40 కేజీల ధాన్యానికి ధర చెల్లిస్తారన్న మాట. అలాగే కొనుగోలు కేంద్రంలో అమ్మకంతోనే రైతుల బాధ్యత ముగియనుంది. నాణ్యత ప్రమాణాలు పాటించాలి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు నాణ్యత ప్రమాణాలను అనుసరించి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ సూచనల మేరకు తేమ, ఇతరత్రా ప్రమాణాలు పాటించి కొనుగోలు చేయాలి. అంటే రైతులు ఆరబెట్టిన నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావలసి ఉంటుంది. ఈ మేరకు ముందస్తుగా వ్యవసాయ, సంబంధిత శాఖలు రైతులకు అవగాహన కల్పించాలి. ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురావడంతో పాటు తేమ శాతం తక్కువ ఉండేలా చూసుకునేందుకు రైతులకు అవసరమైన సూచనలు చేయాలి. రైతుల ప్రమాణాలు పాటించేలా చూస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాలకు ప్రభుత్వం సూచించింది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేస్తే.. ఆ తరుగుకు సంబంధించి నిర్వాహకులే ఆ నష్టాన్ని రైతులకు చెల్లించాలని స్పష్టం చేసింది. గ్రేడ్– ఎ రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940ల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. -
ఈ ధాన్యం ఎవరిది?
వనపర్తి క్రైం: వనపర్తి జిల్లా కేంద్రంలోని కేదార్నాథ్ రైస్ మిల్లులో భారీ మొత్తంలో వరి ధాన్యం బస్తాలు అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. వనపర్తి తహసీల్దార్ రాజేందర్‌గౌడ్, పౌరసరఫరాల శాఖ డీఎం అశ్విన్‌కుమార్ గురువారం వనపర్తి పట్టణంలోని కేదార్నాథ్ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. వీరి పరిశీలనలో పెద్ద మొత్తంలో వరి ధాన్యం బస్తాల నిల్వలు గుర్తించారు. అలాగే 200 క్వింటాళ్లకు పైగా బియ్యం అక్రమంగా ఉన్నట్టు కనుగొన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని మిల్లుకు సీల్ వేశారు. ఆరా తీస్తున్న అధికారులు ఈ మిల్లుకు గత ఖరీఫ్ సీజన్లో 21వేల బస్తాల వరి ధాన్యం అప్పగించారు. కాగా ఈ మిల్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా 300 బస్తాల (150 క్వింటాళ్ల) బియ్యం మాత్రమే అప్పగించాల్సి ఉంది. అయితే మిల్లులో భారీగా నిల్వ ఉన్న వరి ధాన్యం, 150 క్వింటాళ్ల బియ్యం ఎక్కడిదని అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో అక్రమ దందాకు పాల్పడిన వారే ఇక్కడ నిల్వ చేశారా.. లేదా మిల్లు యాజమాన్యమే నిల్వ చేసిందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. లెక్కల్లో చూపని దాదాపు లక్ష వరి బస్తాల ధాన్యం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై డీఎస్ఓ రేవతిని వివరణ కోరగా కేదార్నాథ్ మిల్లు 150 క్వింటాళ్ల బియ్యం అప్పగించాల్సి ఉందన్నారు. అయితే ఇంత భారీగా ఉన్న వరి ధాన్యం నిల్వలు ఎవరివో విచారణ చేస్తున్నామన్నారు. అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
చరిత్రలో లేనంతగా ఖరీఫ్ దిగుబడులు
సిద్దిపేట జోన్: చరిత్రలో ఎప్పుడూ చూడనంత వరి పంట ఈ ఏడాది ఖరీఫ్‌లో రానుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 80 లక్షల టన్నుల వరి ధాన్యం రాష్ట్రంలో పండబోతుందని, ఉమ్మడి ఏపీలో వచ్చిన పంట దిగుబడులు ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే పండుతోందన్నారు.ఆదివారం సిద్దిపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మందపల్లి, మిట్టపల్లి మార్గంలో రూ.17.5 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం జిల్లా కలెక్టరేట్లో 2017–18 రబీ సీజన్ మార్కెటింగ్ కమీషన్ రూ.1.85 కోట్లను మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ పండనంత పంట ఈ ఏడాది పండుతోందని, దీనంతటికీ ప్రభుత్వ కార్యక్రమాలు వ్యవసాయానికి భరోసాగా నిలిచాయన్నారు. -
వడ్లగింజలో బియ్యపుగింజ
అక్షర తూణీరం ‘‘స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావ స్తోంది. అయినా మనలో దేశభక్తి మొలకెత్తలేదు. ఇది ఎప్పటికి పెరిగి పెద్దదై ఫలించేను?’’ అం టూ ఒక పెద్దాయన వాపోయాడు. ఇలాంటి నిట్టూర్పులు విన్నప్పుడు నిస్పృహ కలుగుతుం ది. జరుగుతున్న వాటిని ప్రత్యక్షంగా కంటున్నపు డూ, వింటు న్నపుడూ మరీ దిగులేస్తుంది. నిన్న మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాలు చూశాం. నిర్వహణకి నిమిషానికి పదివేలకు పైగా ఖర్చవుతుందంటారు. నిమిషం కాదు కదా, ఒక్కక్షణం కూడా సద్వినియోగం కాలే దు. భారతరత్న అబ్దుల్ కలాం మరణానికి సంతాప సూచకంగా సభ వాయిదా పడింది. ఆ ఒక్కరోజు మాత్రమే సద్వినియోగమయిం దనిపించింది. నిండు సభలో పెద్దలుగా పేరు బడ్డవారు అలా ఎందుకు అరుచుకుంటున్నా రో, కరుచుకుం టున్నారో ప్రజలకు అర్థం కాదు. చాలా రికామిగా ఉన్న సీనియర్ సిటిజ నులు పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారాలు చూ స్తూ బీపీలు పెంచుకుంటున్నారు. మధ్యత రం, యువతరం ఇలాంటి ప్రసారాలు చూడడం, ఇలాంటివి చదవడం ఎన్నడో మానేశారు. ప్రశాంతంగా ఉన్నారు. ఒకప్పుడు ఎన్.టి.ఆర్. ఉన్నట్టుండి ‘కేంద్రం మిథ్య’ అని ఒక మాట లోకం మీదకు విసిరితే అందరూ కలవరపడ్డారు. అలా అనకూడదన్నారు. అపరాధమన్నారు. ఇప్పుడు సామాన్యుడికెలా అనిపిస్తోంది? అందరూ కలసి అల్లరి చేస్తున్నారు. ఆడుకుంటున్నారు. అసలు సమస్యల్ని కలసిక ట్టుగా కూడబలుక్కుని మరీ దాటవేస్తున్నారన్నది సామాన్యుడి అభిప్రా యం. ‘‘మనకి డిక్టేటరే తగు’’ అని కోట్లాది మంది తమలో తాము నిత్యం తీర్మానించుకుంటున్నారు. ఇది శుభసూచకం కాదు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడానికి మాత్రమే పార్లమెంటు క్షేత్రంగా మిగిలింది. ప్రజాస భలు అవతరించి ఇన్నేళ్లు గడిచినా ఇప్పటి వరకూ ‘స్పీకర్’కి సరైన అధికార స్వరం రాలేదు. సందర్భం వచ్చినపుడు ఒక రోజో, పది రోజులో సభ నుం చి సస్పెండ్ చేయడం కాదు, శాశ్వతంగా సభ్యత్వాన్ని రద్దు చేయగల అధి కారం స్పీకర్‌కి ఉండాలి. సభా నిర్వహణకి సంబంధించి అనేక సవరణలు చేసుకోవాలి. అడ్డుకున్న వారిని సభలోంచి బయటకు పంపడం కాదు, వారిని సభలోనే ఉంచి వారి సీట్లల్లో సమున్నతంగా నిలబెట్టా లి. వారు దేశప్రజలకు ఎత్తుగా కనిపించాలి. సభను ఎలాంటి లావాదేవీలు జరగకుండా చేసినందుకుగాను, సభ్యులందరికీ మూడు నెలల గౌరవ వేతనాన్ని కత్తిరించి, నిర్వహణ ఖర్చుని కొంతైనా పూడ్చాలి. ఇలాంటి సంస్క రణలను చేస్తే సరే, లేదంటే మరో మంచి మా ర్గం ఉంది. అది పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారా లను నిలిపివేయడం. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మర్నాడు కావలసినవారు చక్కని పార్లమెంటరీ భాషలో సమాచారాన్ని పత్రికల ద్వారా తెలుసుకుంటారు. ఇది ఆసేతు హిమాచలం జెండా పండుగ జరుపుకునే మహోజ్వల ఘట్టం. గౌరవ సభ్యులు దేశమాత సాక్షిగా ఒక్కక్షణం ఆలోచించండి. ఆశ తో నమ్మకంతో ఎన్నుకున్న ప్రజల కోసం ఏమి చేశాం, ఏమి సాధించాం, ఏమి శోధించామని ఒక్కసారి ప్రశ్నించుకోండి. అప్పటికీ మీకు నిద్ర, ఆకలి మామూలుగానే ఉంటే మీరు మీ ఓటర్ల రుణం తీర్చుకున్నట్టే. సమున్నతంగా ఎగిరే జెండా మన జాతి గౌరవాన్ని సదా కాపాడు గాక! దేశాభిమానాన్ని రగుల్చు గాక! భారతదేశం వర్థిల్లు గాక! జైహింద్. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రబీ సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు రైతుల నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. మార్కెటింగ్, డీఆర్డీఏ, పౌరసరఫరాలశాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లపై మంగళవారం జేసీ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గతేడాది రైతుల వద్ద నుంచి 33 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రోజూ ధాన్యం రైస్‌మిల్లులకు తరలించడానికి పౌర సరఫరాల శాఖ, ఐకేపీ ద్వారా 125 లారీలు, డీటీసీ ద్వారా 75 లారీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలని, దిగుమతి చేసుకోని మిల్లర్లపై రూల్ 6 ఏ ద్వారా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ల సమాచారం కోసం డీఎస్వో కార్యాలయంలో కంట్రోల్ రూం(08732-226852) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టెలిఫోన్ కాల్స్ వివరాలు రిజిష్టర్‌లో నమోదు చేస్తామన్నారు. కంట్రోల్ రూంలో ఉద్యోగులు అందుబాటులో లేనట్లు ఫిర్యాదు వస్తే చర్య తీసుకోవాలని డీఎస్వోకు చెప్పారు.ఈ టోల్‌ఫ్రీ నంబర్ ఈ నెల 28 నుంచి జూన్ 5 వరకు పనిచేస్తుందని తెలిపారు. జిల్లాలో మూడు లక్షల గోనే సంచులు అందుబాటులో ఉంచామని చెప్పారు. లక్సెట్టిపేట, మంచిర్యాల, భైంసా, నిర్మల్, ఖానాపూర్, సారంగాపూర్ మార్కెట్‌యార్డుల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డీఎస్వో వసంత్‌రావు దేశ్‌పాండే, డీఎం ఆనంద్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏడీ శ్రీనివాస్, డీఆర్డీఏ ఏపీఎం చరణ్‌దాస్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కాంతయ్య, అధికారులు పాల్గొన్నారు. -
వర్షార్పణం
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : చెడగొట్టు వానతో చేతికొచ్చిన పంట చేజారింది. అకాల వర్షాలు రైతన్నకు గుండెకోత మిగిల్చాయి. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతను నిలువునా ముంచాయి. రైతులకు సుమారు రూ.4 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆకాశంలో ఇప్పటికీ మబ్బులు ఆవరించి ఉండడంతో కర్షకునికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తం గా సుమారు 3 వేల ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాల్లోని 5 వేల క్వింటాళ్లకు పైగా వరి ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడం, ధాన్యం రవాణాలో నిర్లక్ష్యం వెరసీ రైతులు శాపంగా మారింది. జిల్లా వ్యాప్తంగా గురువారం 14.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. జన్నారంలో 70 మి.మీ., ఆసిఫాబాద్‌లో 44 మి. మీ., ఖానాపూర్‌లో 43 మి.మీ., కడెంలో 38 మి.మీ., సిర్పూర్-యులో 46 మి.మీ. వర్షపాతం కురిసింది. నేలకొరిగిన పైరు.. తడిసిన ధాన్యం.. దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్, మేదరిపేట్, నాగసముద్రం, చింతపెల్లిలో 19 ఐకేపీ, సహకార కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు తీసుకొచ్చారు. తూకం వేసినవి, విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలపై కప్పేందుకు సరిపడా టార్పాలిన్లు లేకపోవడంతో బస్తాలు తడిసిపోయాయి. దీనికితోడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంలో జాప్యం కారణంగా బస్తాలు కేంద్రాల్లోనే నిల్వ ఉంచడంతో తడిసి ముద్దయ్యాయి. సుమారు 10 వేల బస్తాలు వర్షం కారణంతో తడిశాయి. 4 వేల క్వింటాళ్లకు పైగా ధాన్యానికి నష్టం చేకూరింది. జన్నారం మండలం ఇందన్పల్లి, కమన్పల్లి, రేణుగూడ, తపాలాపూర్‌లో విక్రయించేందుకు తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా ఉంచగా, వర్షం నీరు మడుగులుగా వచ్చి ధాన్యం కిందికి రావడంతో ధాన్యం తడిసింది. కొత్తూర్పల్లి, రేళ్లగూడ, కవ్వాల్, బాదన్పల్లిలో 50 ఎకరాల వరి పంట నేలకొరిగింది. లక్సెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్, హన్మంత్‌పల్లి, చందారం, వెంకట్రావ్‌పేటలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు, కుప్పలు వర్షం కారణంగా తడిసిపోయాయి. టార్పాలిన్లు సరిపడా లేకపోవడం, ఇక్కడ కూడా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించలేదు. దీంతో వంద బస్తాల ధాన్యం, పలు ధాన్యం కుప్పలు వర్షానికి తడిసిపోయాయి. మంచిర్యాల మండలం ముల్కల, కర్నమామిడి, పర్దాన్పల్లిలో అకాల వర్షం కారణంగా 2వేల ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. చెన్నూర్, కోటపల్లిలో వందల ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. చెన్నూర్ మండలంలోని పొక్కూరు, హస్నాద్, కొమ్మెర గ్రామాల్లో కొనుగోల కేంద్రాల్లో టార్పాలిన్లు లేకపోవడంతో 20 క్వింటాళ్ల వరి ధాన్యం తడిసిపోయింది. చెన్నూర్ మండలం అంగరాజ్పల్లి, కిష్టంపేట, కమ్మర్‌పల్లిలో మామిడి నేల రాలింది. ఖానాపూర్‌లో వందల ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. మార్కెట్ యార్డులో కుప్పలుగా పోసిన ధాన్యం తడిసిపోయింది. నీళ్ల మడుగులు రావడంతో నష్టం చేకూరింది. దహెగాం మండలంలో 300 ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. మొక్కజొన్న 30 ఎకరాలు, మిరప 30 ఎకరాల నష్టం చేకూరింది. నిర్మల్, దిలావర్పూర్, మామడ, సారంగాపూర్, కుంటాల మండలాల్లో అకాల వర్షాల కారణంగా పసుపు, వరి, మొక్కజొన్న పంట దెబ్బతిన్నాయి. ఇంద్రవెల్లిలో జొన్న పంట దెబ్బతింది.