parigi mla
-
పరిగి ఎమ్మేల్యే అనుచరుల దౌర్జన్యం
-
సీబీఐకి ఫిర్యాదు చేస్తా
టీఆర్ఎస్ నేత హరీశ్వర్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.రామ్మోహన్‌రెడ్డి ఖర్చు విషయంలో జిల్లా యంత్రాంగం లెక్కలు తారుమారు చేసి ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, దీనిపై సీబీఐతో విచారణకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఆర్ నిబంధనలకు మించి డబ్బులు ఖర్చు చేశారని, కానీ ఖర్చును అంచనావేసే అధికారులు తప్పుడు నివేదికలు సమర్పించారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో వాహనాలకు సంబంధించి అద్దె వివరాలు పేర్కొన్న అధికారులు.. డ్రైవరు భత్యం, డీజిల్ ఖర్చు తదితర వివరాలు పేర్కొనలేదన్నారు. అదేవిధంగా ప్రచార క్రమంలో పెద్దఎత్తున టీషర్టులు పంచారని, నియోజకవర్గ అభివృద్ధిపై వేలసంఖ్యలో రెండు రకాల పుస్తకాలు అత్యంత ఖర్చుతో అచ్చు వేయించారని, కానీ ఈ వివరాలు అభ్యర్థి ఖర్చుల జాబితాలో చేరలేదన్నారు. జిల్లా ఎన్నికల అధికారికి సమాచార హక్కు చట్టం ద్వారా రామ్మోహన్‌రెడ్డి ఎన్నికల ఖర్చుపై అర్జీ పెడితే.. ఇరవై రోజుల తర్వాత తనకు వివరాలిచ్చారని, అయితే ఎన్నికల ఖర్చులో పరిశీలకుడు సమర్పించిన వివరాలు.. ఆర్టీఐ ద్వారా అందిన వివరాలకు పొంతన లేకుండా ఉందన్నారు. ఈ వివరాలన్నింటినీ ఈసీ దృష్టికి తీసుకెళ్లామని, నిశితంగా పరిశీలించిన వారు పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారన్నారు. అధికారులు తప్పుడు నివేదికలు సమర్పించేందుకే కాలయాపన చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. అధికారుల్లో మార్పురాకుంటే కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు ఫిర్యాదు చేస్తానని, ఇప్పటికే సీవీసీకి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు హరీశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
'ఖర్చు' పై రచ్చ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి (టీఆర్ఆర్) ఎన్నికల ఖర్చు వ్యవహారంపై నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికల సమయంలో టీఆర్ఆర్ చేసిన ఖర్చును తక్కువ చేసి చూపించారనే అభియోగంతో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి వాదనకు దిగారు. ఇందుకు సంబంధించి ఆయన సేకరించిన ఆధారాలతో ఏకంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వివరాల ఆధారంగా పరిశీలనకు దిగిన ఎన్నికల సంఘం.. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా వివరాలు సమర్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. నివేదికపై తాత్సారం.. ఎన్నికల వేళ టీఆర్ఆర్ ఖర్చుపై ఇదివరకు జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో యంత్రాంగం పరిశీలన చేసి నివేదిక సమర్పించింది. అయితే ఇందులో లెక్కలు తారుమారు చేశారని హరీశ్వర్ పేర్కొంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా టీఆర్ఆర్ ఖర్చు వివరాలకోసం సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీఐ ద్వారా అధికారులిచ్చిన వివరాలు, ఎన్నికల సంఘం వివరాలకు పొంతన లేకపోవడాన్ని పసిగట్టిన హరీశ్వర్‌రెడ్డి.. వాదనను తీవ్రతరం చేశారు. అధికారులను నిలదీయంతో సదరు అధికారులు డైలమాలో పడ్డారు. ఈ క్రమంలో తాను సేకరించిన ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం అధికారులు నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అయితే నివేదిక ఇప్పటికే ఇవ్వాల్సి ఉండగా.. జిల్లా యంత్రాంగం మాత్రం నివేదిక సమర్పణపై తాత్సారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. -
జూరాలతో రైతాంగానికి మేలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూగర్భజలాలపై ఆధారపడిన జిల్లా రైతాంగానికి ‘పాలమూరు-రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల’ పథకంతో మేలు చేకూరనుందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పది లక్షల ఎకరాలను స్థిరీకరించే ఈ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వ హయాంలోనే అంకురార్పణ జరిగిందని, సమగ్ర సర్వే కూడా పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే జిల్లాలోని 18 మండలాలకు సాగు, తాగు నీరు అందుతుందని స్పష్టం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో టీఆర్ఆర్ మాట్లాడారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు సర్వే పనులకు గత ప్రభుత్వం రూ.6.91 కోట్లు కేటాయించిందని, వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని కేసీఆర్ సర్కారు ప్రకటించడం జిల్లా రైతాంగానికి శుభపరిణామం అని అన్నారు. గండేడ్‌లో నిర్మించే 45టీఎంసీల జలాల సామర్థ్యం గల రిజర్వాయర్‌ను ప్రతిపాదిస్తున్నారని, తద్వారా పరిగి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. బీడువారిన పొలాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్ధేశంతో దివంగత నేత వైఎస్ రాజ శేఖరరెడ్డి జూరాల-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాలనే యోచన చేశారని, అందులో భాగంగానే కిరణ్ సర్కారు ప్రాజెక్టు ప్రాథమిక సర్వేకు నిధులు విడుదల చేసిందని తెలిపారు. దాదాపు రూ.10వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదిస్తున్న ఈ పథకం అమలుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ప్రక టించారని గుర్తు చేశారు.