Parliament approved
-
ఇకపై సహజీవనం నేరమే.. ఆరు నెలల జైలు శిక్ష
జకార్తా: సహజీవనం, వివాహేతర సంబంధాలు వంటి వాటిని ఇకపై నేరంగా పేర్కొంటూ శిక్షలు ఖరారు చేస్తూ ఇండోనేసియా ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. ఆ మేరకు నవంబర్‌లో తుదిరూపునిచ్చిన వివాదాస్పద నేర శిక్షాస్మృతి సవరణ బిల్లును మంగళవారం ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సవరించిన నేర శిక్షాస్మృతి ప్రకారం వివాహేతర సంబంధం నెరిపితే నేరంగా భావించి ఏడాది జైలు శిక్ష విధిస్తారు. సహజీవనం చేస్తే ఆరునెలల శిక్ష వేస్తారు. వేరొకరితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సంతానం వీరిలో ఎవరైనా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తేనే ఆ వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు. పర్యాటకంలో భాగంగా ఇండోనేసియాకు వచ్చే విదేశీయులకూ ఇదే చట్టం వర్తిస్తుంది. అబార్షన్, దైవ దూషణలను ఇకపై నేరంగా పరిగణిస్తారు. దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను విమర్శించడాన్ని నిషేధించారు. తనపై విమర్శలను నేరుగా దేశాధ్యక్షుడే ఫిర్యాదుచేస్తే నిందితులపై మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కమ్యూనిజాన్ని వ్యాప్తిచేస్తే నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కాగా, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసేలా కొన్ని నిబంధలను తెచ్చారని మానవహక్కుల కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు. ఇదీ చదవండి: ఆహార సంక్షోభం దిశగా బ్రిటన్ -
చెక్కు బౌన్స్ కేసుల సత్వర పరిష్కారం
న్యూఢిల్లీ: చెక్కు బౌన్స్ కేసుల సత్వర విచారణకు వీలుకల్పిస్తున్న బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. నెగోషియబుల్ ఇన్స్ట్రమెంట్స్ (సవరణ) బిల్లు, 2018కి లోక్‌సభ ఈ నెల 23న ఆమోదముద్రవేయగా, గురువారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీనితో బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర లభించినట్లుయ్యింది. తక్షణం ఫిర్యాదుదారుకు 20 శాతం పరిహారం తాజా ఎన్ఐ యాక్ట్ చట్ట సవరణ (సెక్షన్ 143ఏ, సెక్షన్ 148) ప్రకారం– ఫిర్యాదుదారుకు మధ్యంతర పరిహారంగా చెక్కు మొత్తంలో కనీసం 20 శాతం చెల్లించాలని సెక్షన్ 138 కింద కేసును విచారిస్తున్న ఒక కోర్టు– చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఆదేశాలు జారీ చేయవచ్చు. విచారణ కోర్టు ఆదేశాలు వెలువరించిన 60 రోజుల లోపు చెక్కు జారీ చేసిన వ్యక్తి ఈ 20 శాతం మొత్తాన్ని ఫిర్యాదుదారుకు చెల్లించాలి. ఒకవేళ దీనిపై చెక్కు జారీ చేసిన వ్యక్తి అప్పీల్‌కు వెళ్లదలిస్తే, అదనంగా మరో 20 శాతాన్ని మధ్యంతర పరిహారంగా చెల్లించాలి. ఒకవేళ చెక్కు జారీచేసిన వ్యక్తి నిర్దోషిగా కేసు నుంచి బయటపడితే, పరిహారంగా చెల్లించిన మొత్తాన్ని అతనికి తిరిగి ఫిర్యాదుదారు వడ్డీతోసహా చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వవచ్చు. -
ఆర్థిక నేరగాళ్ల బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: బడా ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోకుండా అడ్డుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ‘పరారీ ఆర్థిక నేరగాళ్ల బిల్లు–2018’ను లోక్‌సభ గత గురువారమే ఆమోదించగా, రాజ్యసభ బుధవారం ఈ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ చట్టాలను తప్పించుకుని దేశాన్ని విడిచి పారిపోతున్న ఆర్థిక నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతోందనీ, దీనిని అడ్డుకోవాల్సి ఉందని అన్నారు. ప్రస్తుత చట్టాలతో ఆ పనిని సమర్థంగా చేయలేకపోతున్నామన్నారు. వంద కోట్ల రూపాయల కన్నా ఎక్కువ మొత్తంలో మోసం చేసిన వ్యాపారవేత్తలకే ఈ బిల్లులోని నిబంధనలు వర్తిస్తాయి. ‘నేరగాళ్లు పారిపోకుండా ఆపేందుకు సమర్థమైన, వేగవంతమైన, రాజ్యాంగబద్ధమైన విధానాన్ని ఈ బిల్లు ద్వారా తీసుకొచ్చాం’ అని గోయల్ తెలిపారు. ప్రస్తుత చట్టాల ప్రకారం నేరగాళ్లు కోర్టు ముందు హాజరుకానంత వరకు వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఇప్పటికే ఎన్నో చట్టాలు ఉన్నా ప్రభుత్వ సహకారంతోనే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి ఆర్థిక నేరగాళ్లు దేశాలు దాటి తప్పించుకుపోయారని విపక్షాలు ఆరోపించాయి. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌లపై కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన సభా హక్కుల నోటీసులు తన పరిశీలనలో ఉన్నాయని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. -
కట్టుతప్పితే కఠిన చర్యలే ఇక!
న్యూఢిల్లీ: కార్పొరేట్ పరిపాలనా ప్రమాణాలను పటిష్టపరచడం, రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడం, దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం వంటి లక్ష్యాలుగా కేంద్రం రూపొందించిన కంపెనీల చట్టం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. వర్షకాల సమావేశాల్లో ఇదే బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించినందున చట్టరూపం దాల్చనుంది. గత యూపీఏ సర్కారు తీసుకొచ్చిన కంపెనీల చట్టం, 2013లో మోదీ సర్కారు దాదాపు 40కు పైగా సవరణలను ప్రతిపాదించింది. ఇదే చట్టంలో మోదీ సర్కారు లోగడ కూడా ఓ సారి సవరణలు చేయడం గమనార్హం. బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి సమాధానం ఇచ్చారు. తాజా సవరణలతో దేశంలో కార్పొరేట్ పరిపాలన మెరుగ్గా మారుతుందని, వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. ప్రక్రియలు, నిబంధనల అమలు సులభంగా మారుతుందన్నారు. కంపెనీలు తమ లాభాల్లోంచి నిర్ణీత మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించాలన్న నిబంధనలు (సీఎస్ఆర్) పాటించని కంపెనీలకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినట్లు చెప్పారు. -
జీఎస్టీ అమలుకు మేం రెడీనే!
తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం పార్లమెంటు ఆమోదం పొందిన పక్షంలో సత్వరం అమలు చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ చెప్పారు. కొద్ది నెలలుగా ఉద్యోగులు ఇందుకు సంబంధించిన శిక్షణ పొందుతున్నట్లుగా ఆయన వివరించారు. మోడల్ జీఎస్టీ చట్టంపై సోమవారమిక్కడ జరిగిన తొలి చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శర్మ ఈ విషయాలు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సమాఖ్య (ఎఫ్టీఏపీసీసీ).. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (సీబీఈసీ) హైదరాబాద్ జోన్ దీన్ని సంయుక్తంగా నిర్వహించాయి. జీఎస్టీ బిల్లు ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఆమోదం పొందగలదని ఆశిస్తున్నట్లు సీబీఈసీ ప్రత్యేక కార్యదర్శి రామ్ తీరథ్ పేర్కొన్నారు. వచ్చే నెలన్నర కాలంలో మిగతా ప్రాంతాల్లోనూ చర్చాకార్యక్రమాలు నిర్వహించి పరిశ్రమవర్గాల అభిప్రాయాలు తీసుకోనున్నట్లు తెలి పారు. తెలంగాణ రెవెన్యూ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా, సీబీఈసీ హైదరాబాద్ వైజాగ్ జోన్ చీఫ్ కమిషనర్ ఆర్ శకుంతల తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
అక్రమ రియల్టర్లకు గడ్డుకాలమే!
స్థిరాస్తి బిల్లుకు లోక్‌సభ ఆమోదం ♦ ఇప్పటికే రాజ్యసభ నుంచి గ్రీన్‌సిగ్నల్ ♦ నిబంధనల ఉల్లంఘనలకు జైలు శిక్ష న్యూఢిల్లీ: గృహనిర్మాణ రంగ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయని రియల్టర్లకు ఇక గడ్డు కాలమే. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో జాప్యాన్ని నివారించే దిశగా పలు కఠిన ప్రతిపాదనలున్న స్థిరాస్తి బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం లభించింది. అపీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలను ధిక్కరిస్తే.. ప్రమోటర్లకు గరిష్టంగా మూడేళ్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, కొనుగోలుదారులకు ఏడాది జైలుశిక్ష విధించే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. ఈ బిల్లును ఇప్పటికే రాజ్యసభ ఆమోదించడం తెలిసిందే. కొనుగోలుదారుల ప్రయోజనాల పరిరక్షణ, రియల్ రంగ లావాదేవీల్లో మరింత పారదర్శకత, రియల్టర్లలో మెరుగైన జవాబుదారీతనం లక్ష్యాలుగా బిల్లును రూపొందించారు. రాష్ట్రాల్లో ప్రత్యేకంగా నియంత్రణ సంస్థల ఏర్పాటుకుఅవకాశం కల్పించారు. ప్రాజెక్టుల్లో జాప్యాన్ని నివారించడంతో పాటు, గృహ, వాణిజ్య ప్రాజెక్టుల లావాదేవీలను ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(ఆర్ఈఆర్ఏ)లు నియంత్రిస్తాయి. పూర్తి వివరాలతో అన్ని రియల్ ప్రాజెక్టులను ఈ అథారిటీల వద్ద రిజిస్టర్ చేయాలి. గృహ, వాణిజ్య నిర్మాణాలకు సంబంధించి అప్పిలేట్ ట్రిబ్యునళ్లు 60 రోజుల్లోగా ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంటుంది. రియల్టర్లు వినియోగదారుల నుంచి సేకరించిన డబ్బులో 70 శాతాన్ని బ్యాంకుల్లో ప్రత్యేక ఎస్క్రూ ఖాతాల్లో జమ చేసి, నిర్మాణ అవసరాలకు ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రాజెక్టులను చెప్పిన సమయంలోగా పూర్తి చేయలేకపోయినా, లేదా వినియోగదారుడు ముందుగా అంగీకరించినట్లుగా డబ్బులు చెల్లించలేకపోయినా.. ఇరువురికీ ఒకే వడ్డీ రేటు వర్తించేలా ప్రతిపాదన తెచ్చారు. బిల్లు ప్రకారం.. 500 చదరపు మీటర్లలో నిర్మించిన ప్రాజెక్టులు లేదా కనీసం 8 ఫ్లాట్లు ఉన్న ప్రాజెక్టులను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. 2013లో యూపీఏ ప్రవేశపెట్టిన బిల్లులో ఇది 4 వేల చదరపు మీటరు. లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు బిల్లుపై జరిగిన చర్చకు బదులిస్తూ.. నిర్మాణ రంగ వర్గాలు ఈ బిల్లుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బిల్లును రాజ్యసభ స్థాయీ సంఘం క్షుణ్ణంగా అధ్యయనం చేసిందని తెలిపారు. బిల్లుకు విపక్షం ప్రతిపాదించిన సవరణలపై లోక్‌సభలో నిర్లక్ష్యం చూపిన ప్రభుత్వం.. రాజ్యసభలో మాత్రం వాటిని ఆమోదించడం ఆరోగ్యకర ప్రజాస్వామ్య విధానం కాదని కేసీ వేణుగోపాల్(కాంగ్రెస్)అన్నారు. కాగా 111 నదులను జలమార్గాలుగా అభివృద్ధి చేసేందుకు తెచ్చిన బిల్లును సవరణతో పార్లమెంటు ఆమోదించింది. డిసెంబర్లో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినప్పటికీ, సవరణతో ఆ సభ మళ్లీ పచ్చజెండా ఊపింది. 48 ఏళ్లనాటి శత్రువు ఆస్తుల చట్టానికి సవరణలతో రూపొందించిన బిల్లును రాజ్యసభ స్థాయీ సంఘానికి పంపించారు. -
నల్లధనం పై కొరడా..!
దాచిపెట్టిన విదేశీ ఆస్తులపై మార్కెట్ విలువ ప్రకారం పన్ను, జరిమానా - నోటిఫై చేసిన నిబంధనలను వెల్లడించిన సీబీడీటీ - ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన నల్లధనం చట్టం - విదేశీ ఆస్తులు, ఆదాయాల వెల్లడికి సెప్టెంబర్ 30 వరకూ ప్రత్యేక విండో.. - మార్కెట్ విలువలో 60 శాతం పన్ను, జరిమానా... - ఈ గడువు దాటితే 120 శాతం కట్టాల్సిందే... న్యూఢిల్లీ: విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం కేసుల్లో ఇక కేంద్రం కొరడా ఝులిపించనుంది. పార్లమెంటు ఆమోదం పొందిన నల్లధనం(ప్రభుత్వానికి వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తులు), పన్నుల విధింపు చట్టం-2015లోని నిబంధనలను కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) శుక్రవారం వెల్లడించింది. సీబీడీటీ నోటిఫైచేసిన ఈ కొత్త చట్టం ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం విదేశాల్లో అక్రమంగా దాచిపెట్టిన ఆస్తుల(ఆభరణాలు, షేర్లు, కళాఖండాలు వంటివి) విలువను ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం లెక్కించి.. పన్ను, జరిమానాలను విధించడం జరుగుతుందని సీబీడీటీ తెలిపింది. అంతేకాకుండా విదేశాల్లో అక్రమంగా కలిగిఉన్న విదేశీ బ్యాంకు ఖాతా విలువను కూడా దాన్ని ప్రారంభించిన నాటి నుంచి జమ అవుతూవచ్చిన డిపాజిట్ల మొత్తం ఆధారంగా లెక్కించి.. పన్ను, జరిమానాలను విధించేలా చట్టంలో నిబంధనలను పొందుపరిచారు. నల్లధనం కేసుల్లో గుర్తించిన ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ అప్పట్లో కొనుగోలు చేసిన విలువ కంటే తక్కువగా ఉన్న పక్షంలో... వాటి వాస్తవ కొనుగోలు విలువనే పరిగణనలోకి తీసుకొని పన్నులు, జరిమానాలను విధించే అధికారం సీబీడీటీకి ఉంటుంది. నిబంధనల్లో ఇతర ముఖ్యాంశాలివీ... - బయటికి వెల్లడించని విదేశీ ఆస్తులు కలిగిఉన్న వ్యక్తులెవరైనా వాటి వివరాలను వెల్లడించేందుకు సెప్టెంబర్ 30 వరకూ ప్రభుత్వం ఒక ప్రత్యేక సదుపాయాన్ని(వన్‌టైమ్ కాంప్లియన్స్ విండో) ఏర్పాటు చేసింది. అంటే 90 రోజుల గడువు ఇచ్చినట్లు లెక్క. ఈ లోగా నిర్దేశిత ఫార్మాట్లో రూపాయల్లో తమ విదేశీ ఆస్తుల వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. - ఇలా వెల్లడించిన మొత్తం ఆస్తుల విలువలో 60 శాతాన్ని పన్ను, జరిమానా రూపంలో చెల్లిస్తే సరిపోతుంది. ఈ చెల్లింపులకు డిసెంబర్ 31 వరకూ గడువు ఉంటుంది. - కాంప్లియన్స్ విండో గడువు ముగింపు తేదీ తర్వాత వివరాలను వెల్లడించినట్లయితే మొత్తం విలువలో 120 శాతాన్ని పన్ను, జరిమానాల రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిందే. - స్థిరాస్తులకు సంబంధించి సరైన మార్కెట్ విలువ అనేది వాటి కొనుగోలు ధర కంటే ఎక్కువగా లేదా లెక్కింపు(వేల్యుయేషన్) రోజున ఓపెన్ మార్కెట్లో వచ్చే రేటు ప్రకారం నిర్ణయిస్తారు. - బంగారం, వజ్రాలు ఇతర విలువైన రాళ్లు, ఆభరణాలు, పురాతత్వ(ఆర్కియలాజికల్) కలెక్షన్లు, శిల్పాలు, పెయింటింగ్స్ ఇతరత్రా కళాఖండాలకు కూడా ఇదే వేల్యుయేషన్ విధానం వర్తిస్తుంది. - షేర్లు, సెక్యూరిటీల మార్కెట్ విలువను కొనుగోలు ధర కంటే ఎక్కువగా లేదా లెక్కింపు తేదీన కనిష్ట, గరిష్ట ధరల సగటు ఆధారంగా ఉండాలి. - ఈ నిబంధనలతో పాటు దాచిపెట్టిన విదేశీ ఆస్తులను ప్రకటించే వ్యక్తులు వివరాలను దాఖలు చేసేందుకు 7 రకాల ఫారాలను ప్రవేశపెట్టారు. - విదేశీ ఆస్తులున్న ప్రదేశం, సరైన మార్కెట్ విలువ, ఎప్పుడు కొనుగోలు చేశారు అనే వివరాలను సంబంధిత వ్యక్తులు తెలియజేయాల్సి ఉంటుంది. - విలువ లెక్కింపు రోజున విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని దేశీ కరెన్సీలోకి మార్చడానికి ఆర్బీఐ రిఫరెన్స్ రేటును పరిగణనలోకి తీసుకుంటారు. - బయటకు వెల్లడించని విదేశీ ఆస్తులున్న వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు అదేవిధంగా వాళ్లు, కమిషనర్(అప్పీల్స్), అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించేందుకు తగిన ఫార్మాట్ కూడా ఉంది. - కాంప్లియన్స్ విండోను ఉపయోగించుకోవాలనుకునే వారి కోసం ఆదాయ పన్ను శాఖ న్యూఢిల్లీలో ప్రత్యేక ఆఫీసు ఏర్పాటు చేసింది. దీనికి వచ్చే దరఖాస్తులను పరిశీలించేందుకు, ప్రాసెస్ చేసేందుకు సీనియర్ కమిషనర్ స్థాయి అధికారిని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నియమించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అవసరాన్ని బట్టి మరింత మంది అధికారులను నియమించే అవకాశం ఉన్నట్లు వివరించాయి. -
అక్రమ వలసదారులకు వరం
అమెరికా నుంచి పంపేయకుండా తాత్కాలిక ఉపశమనం పార్లమెంటును పక్కకుబెట్టి మరీ.. కీలక సంస్కరణలకు ఒబామా శ్రీకారం యూఎస్‌లో అక్రమంగా ఉంటున్న భారతీయులకు ఉపశమనం వాషింగ్టన్: అమెరికాలో అక్రమంగా ఉంటున్న 50 లక్షల మందికి పైగా ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఊరట కలిగే నిర్ణయాన్ని శుక్రవారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. అస్తవ్యస్థంగా ఉన్న అమెరికా వల స విధానాన్ని సరిదిద్దే చర్యల్లో భాగంగా ఈ కీలక సంస్కరణను ఆయన ఏకపక్షంగా చేపట్టారు. తన కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించడం ద్వారా పార్లమెంటు ఆమోదం లేకుండానే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు వైట్‌హౌస్‌లో ఆయన ప్రసంగించిన వీడియోను మీడియాకు విడుదల చేశారు. ‘మీరు అమెరికాలో ఐదేళ్ల కంటే ఎక్కువకాలం ఉండి ఉంటే, మీకు అమెరికా పౌరసత్వం లేదా చట్టబద్ధమైన నివాస హోదా గల బిడ్డలు ఉంటే.. మీకు నేరనేపథ్యం లేదని పోలీసు తనిఖీలో తేలితే.. మీరు మీ వంతు పన్నులు చెల్లించడానికి సుముఖత చూపితే.. అప్పుడు దేశం నుంచి గెంటివేతకు గురవుతారన్న భయం లేకుండా దేశంలో తాత్కాలికంగా ఉండేందుకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు’ అని ఒబామా అక్రమ వలసదారులకు సూచించారు. దీని ప్రకా రం, పైన చెప్పిన అర్హతలు ఉన్న అక్రమ వలసదారులుమరోమూడేళ్లపాటుఅమెరికాలో తాత్కాలికంగా ఉండేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. శాశ్వత హోదా కాదు: ఎలాంటి ఇమిగ్రేషన్ పత్రాలూ లేకుండా అమెరికాలో జీవిస్తున్న లక్షల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి గెంటేయకుండా వారికి ఈ నిర్ణయం ద్వారా తా త్కాలిక రక్షణ లభించనుంది. గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాది భారతీయులకు కూడా ఉపశమనం లభిస్తుంది. అక్రమ వలసదారులకు ఫ్రీపాస్ ఇస్తున్నారన్న ప్రతిపక్ష కన్సర్వేటివ్‌ల విమర్శలపై స్పందిస్తూ.. తాను శాశ్వత నివాస హోదా ఇవ్వడంలేదని స్పష్టం చేశారు. సరిహద్దు రక్షణను మరింత కట్టుదిట్టం చేసి, దేశంలోకి చొరబాట్లను అడ్డుకుంటామని ఒబామా వివరించారు. ‘ఎలాంటి పత్రాలూ లేకుండా ఇక్కడ జీవిస్తున్న దాదాపు 1.1 కోట్ల మంది వలసదారులను ఉన్నట్టుండి స్వదేశాలకు గెంటేయడం మన దేశ సహజ గుణానికి విరుద్ధం. అది అసాధ్యం కూడా’ అన్నారు. తన నిర్ణయం కామన్‌సెన్స్‌తో కూడుకున్నదని, దీని ద్వారా చట్టాన్ని గౌరవించాలనుకునే అనేకమంది అక్రమ వలసదారులు చట్టబద్ధత పొందుతారని పేర్కొన్నారు. అమెరికా అభివృద్ధిలో పాలుపంచుకునేందుకుమంచి నైపుణ్యత కలిగిన ఉద్యోగులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఇది సదవకాశమన్నారు.