Parvathipuram Assembly Constituency
-
మన్యం ప్రజలు మీ వెంటే..
పార్వతీపురం మన్యం: మన్యంలో ‘ఫ్యాన్’ జోరు తగ్గలేదు. వైఎస్సార్సీపీకి తిరుగులేదు. గత ఫలితాలే కాదు.. రాబోవు ఎన్నికల్లోనూ జగనన్న ప్రభుత్వానికి ఇక్కడ ఢోకా లేదు. ఏ ఇంట తలుపు తట్టినా.. ఏ వీధి మలుపు తిరిగినా ఇదే మాట. ప్రతి ఒక్కరి నోటా.. వైఎస్సార్సీపీ సంక్షేమం పాట. గతంలో ప్రభుత్వ పథకమంటే తెలియని అమాయక గిరిజనం. పేర్లు వారివి.. పథకాలు మరొకరివి. నేడు జగన్ పుణ్యమాని వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడమే కాక, లబ్ధినీ ఇంటి వద్దే పొందగలుగుతున్నారు. పోడు పట్టాలు దక్కించుకుంటున్నారు. అందుకే నాటి కంటే.. నేడు ‘ఫ్యాన్’ మరింత స్పీడుగా తిరుగుతోంది. వైఎస్సార్సీపీ గాలి ప్రతీ ఊరు, వాడ, గూడలో జోరుగా వీస్తోంది. కంచుకోటగా.. కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గాలు పార్టీకి కంచుకోటగా మారాయి. 2014, 2019 ఎన్నికల్లో సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. పార్టీ తరఫున బరిలోకి దిగిన పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019 ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అలజంగి జోగారావు గెలుపొందారు. ఇంక స్థానిక సంస్థల్లోనూ అత్యధిక ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థులు సైతం తిరుగులేని ఆధిక్యం సాధించారు. వైఎస్సార్సీపీ అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలు గిరిజనుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. తిరుగులేదు.. సాలూరు నియోజకవర్గంలో పీడిక రాజన్నదొర వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. వైఎస్సార్సీపీ హయాంలో 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మొత్తం 1,46,839 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్సార్సీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొరకు 78,430 ఓట్లు రాగా.. తెలుగుదేశం పార్టీ అభ్యరి్థకి 58,401 ఓట్లు వచ్చాయి. 20,029 ఓట్ల మెజారిటీతో రాజన్నదొర గెలిచారు. 2014 ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ తరఫు న బరిలోకి దిగిన రాజన్నదొరకు 63,755 ఓట్లు వచ్చాయి. 47.8 శాతం ఓటింగ్‌తో ఆయన విజయం సాధించారు. పార్వతీపురం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో మొత్తం 1,37,154 ఓట్లు పోలవ్వగా.. వైఎస్సార్సీ పీ అభ్యర్థి అలజంగి జోగారావుకు 75,304 ఓట్లు వచ్చాయి. 24,199 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటమి చెందారు. కురుపాం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో 1,38,723 ఓట్లు పోలవ్వగా.. వైఎస్సార్సీపీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణికి 74,527 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 26,602 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై ఆమె ఘ న విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ 55,435 ఓట్లు సాధించారు.19,083 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పాలకొండ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి 55,337 ఓట్లు సాధించి విజయం సాధించారు. 1,620 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 18 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. స్థానిక సంస్థల్లోనూ సత్తా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. పార్వతీపురం నియోజకవర్గంలో 89 సర్పంచ్ స్థానాలుండగా.. వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు 76 చోట్ల గెలుపొందారు. ఎంపీటీసీలు 51కి 48, జెడ్పీటీసీలు మూడుకు మూడు స్థానాలు వైఎస్సార్‌సీపీవే. పార్వతీపురం పట్టణంలో 30 వార్డులుండగా.. ఇందులో 24 మంది వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్లే. కురుపాం నియోజకవర్గంలో ఐదుకు ఐదు.. జెడ్పీటీసీలు, ఎంపీపీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 137 పంచాయతీ సర్పంచ్ స్థానాలుండగా.. వందకుపైగా మద్దతుదారులు గెలిచారు. పాలకొండ నియోజకవర్గంలోనూ జగన్ పట్ల ఉన్న విధేయతను అక్కడి ప్రజలు చూపించారు. పాలకొండలో 20కి 17 మంది కౌన్సిలర్లు వైఎస్సార్పీ నుంచి గెలిచారు. జెడ్పీటీసీలు నాలుగుకు నాలుగూ విజయం దక్కించుకున్నారు. నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలనూ మద్దతుదారులే దక్కించుకున్నారు. సాలూరు నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీలు, ఎంపీపీ లు వైఎస్సార్పీవే. మున్సిపల్ చైర్మన్‌నూ గెలుచుకుంది. సర్పంచ్, కౌన్సిలర్ స్థానాలనూ అత్యధికంగా కైవసం చేసుకుని ఆధిక్యతను చాటింది. జగన్ ఆశయాలకు అనుగుణంగా.. ముఖ్యమంత్రి జగన్ ఆశయాలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు గిరిజన ప్రజలతో నిత్యం మమేకమయ్యారు. గత ఐదేళ్ల ప్రభుత్వంలో కురుపాం, సాలూరు ఎమ్మెల్యేలు గిరిజన శాఖకు మంత్రులుగానూ వ్యవహరించారు. దీనివల్ల గిరిజనుల జీవన స్థితిగతులు మరింతగా మారాయి. సంక్షేమ పథకా లు ప్రతి గడపకూ వెళ్లాయి. గతంలో నిరక్షరాస్యులై న గిరిజనులకు తమ పేరిట ఏ పథకాలు వచ్చేవో కూడా తెలియదు. ఇప్పుడు నేరుగా వలంటీర్ల ద్వారానే లబ్ధి పొందగలుగుతున్నారు. ఊరిలో ఉన్న సచివాలయం నుంచి అన్నిరకాల ప్రభుత్వ సేవలు పొందుతున్నారు. గిరి శిఖర గ్రామాలకు రహదారులనేకం మంజూరయ్యాయి. తాగునీరు అందుతోంది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు చేతికందాయి. జగనన్న లేఅవుట్ల కింద ఇళ్లు, ఇంటి పట్టాలను పొందారు. పింఛన్లు పొందుతున్నారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నిలబెట్టడంతో వారి జీవితాల్లో మార్పులు వచ్చాయి. అందుకే.. ఏ ప్రాంతానికి వెళ్లినా జగన్ పట్ల తమ విధేయతను చాటుతున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. తామంతా మరోసారి అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు. ఇవి చదవండి: అందరికీ మంచి జరగాలి.. సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు -
చంద్రబాబు, లోకేశ్‌ల.. ఎమ్మెల్సీ మంత్రం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని టీడీపీలో ఇప్పుడు నియోజక వర్గానికో కొల్ల అప్పలనాయుడు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ గొంప కృష్ణ, ఓ కిమిడి నాగార్జున, ఓ బొబ్బిలి చిరంజీవులు, ఓ ఆర్పీ భంజ్‌దేవ్, ఓ మీసాల గీత, ఓ తెంటు లక్ష్మునాయుడు, ఓ కేఏ నాయుడు, ఓ కావలి గ్రీష్మ, ఓ కర్రోతు బంగార్రాజు.. ఇలా ఊహూ అన్న ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్సీ చేసేస్తామని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ హామీలిచ్చేస్తున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే వెంకీ సినిమాలో కృష్ణ భగవాన్ ఉద్యోగాలిస్తామని హీరో రవితేజ బృందాన్ని బురిడీ కొట్టించిన సీన్ గుర్తొస్తుంది. ‘ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్‌యార్డా, ఏసియాడా, జింకా, బంకా (హెచ్‌పీసీఎల్)... ఏ కంపెనీలో ఉద్యోగం కావాలి? జీఎం కావాల్న? ఏజీఎం కావాల్న?’ అని ఊరించి డబ్బులు నొక్కేసి కృష్ణభగవాన్ లాఘవంగా జెల్ల కొట్టేసిన హాస్యభరిత సన్నివేశం ఇప్పుడీ టీడీపీ నాయకుల సీట్ల వ్యవహారంలో కనిపిస్తోంది. మాట ఇస్తే ఆరునూరైనా అమలుచేయడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి మనస్థత్వం కాదు వారిది!. చంద్రబాబు, లోకేశ్ హామీలిచ్చి ఎన్నికల్లో గట్టెక్కిన తర్వాత ఎలా ముంచేస్తారో కొల్ల అప్పలనాయుడి అనుభవమే నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా మద్దతు కూడగట్టాలని ప్రతి నియోజకవర్గంలో రెబెల్స్‌కు ఎమ్మెల్సీ ఆశ చూపిస్తున్నారు. లేదంటే నామినేటెడ్ పోస్టు.. అదీ లేదంటే సముచిత స్థానం కల్పిస్తామని భ్రమలు కల్పిస్తున్నారు. ఉన్నవెన్ని? వచ్చేవెన్ని? రాష్ట్ర శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. రెండేళ్లకోసారి మూడింట ఒకటో వంతు మంది పదవీ విరమణ చేస్తుంటే ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తుంటారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ బలం 43 కాగా టీడీపీకి ఉన్నవి ఎనిమిది మాత్రమే. మిగతావాటిలో పీడీఎఫ్ సభ్యులు ఇద్దరు, స్వతంత్ర సభ్యులు నలుగురు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే టీడీపీ ఇటీవల రాజ్యసభలో ఖాళీ అయిపోయినట్లుగానే భవిష్యత్తులో శాసనమండలి నుంచి కూడా పూర్తిగా ఖాళీ అయిపోయేట్లు ఉంది. ఇది చంద్రబాబుకు తెలియని విషయం కాదు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలనే ప్రయత్నాల్లో భాగంగా సొమ్ములు దండిగా ఉన్నవారికే టికెట్లు ఇస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడినవారికి మొండిచేయి చూపిస్తున్నారు. వారిని బుజ్జగించడానికి ‘ఎమ్మెల్సీ’ పదవులనే బిస్కెట్లు వేస్తున్నారు. మన రెండు జిల్లాల్లోనే పది మంది వరకూ ఇలాంటి ఆశాజీవులు ఉంటే... రాష్ట్రంలో ఇలా ఆశలపల్లకి ఎక్కిస్తున్నవారి సంఖ్య వందకు పైమాటే. చంద్రబాబు బూటకపు హామీలిచ్చి ప్రజలనే కాదు సొంత పార్టీ నాయకులనూ బురిడీ కొట్టిస్తున్నారడంలో సందేహం అక్కర్లేదు. కొల్ల అప్పలనాయుడిని బుజ్జగించి.. మరీ.. ఈయన పేరు కొల్ల అప్పలనాయుడు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సంతకవిటి మండలంలో తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు. ఎంపీపీగా మూడు పర్యాయాలు పనిచేశారు. మరో రెండుసార్లు తన అనుచరులనే ఎంపీపీ పదవిలో కూర్చోబెట్టారు. తన భార్యను కూడా జెడ్పీటీసీగా ఒక పర్యాయం గెలిపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన్ను వాడుకొనే ఉద్దేశంతో చంద్రబాబు తాయిలం వేశారు. శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్‌ను చేస్తానని ఆశచూపించారు. తీరా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా మొండిచేయి చూపించారు. చౌదరి ధనలక్ష్మిని చంద్రబాబు ఆ పదవిలో కూర్చోబెట్టారు. దీంతో మనస్తాపం చెందిన కొల్ల అప్పలనాయుడిని బుజ్జగించి... ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చారు. 2017 ఫిబ్రవరిలో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు అవకాశం ఇస్తారని ఆశించిన కొల్లకు జెల్ల కొట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన శత్రుచర్ల విజయరామరాజును అందలం ఎక్కించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కొల్ల తాను రెబెల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. నాడు శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి మంత్రిగానున్న పరిటాల సునీత, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు హుటాహుటిన కొల్ల స్వగ్రామం మామిడిపల్లి వెళ్లి మరీ బుజ్జగించారు. నామినేటెడ్ పదవి ఇస్తామని, సముచిత స్థానం కల్పిస్తామని హామీల వర్షం కురిపించారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్నా కొల్ల కల నెరవేరలేదు. ఇవి చదవండి: బాబు తన ప్లాన్ ప్రకారమే జనసేన 'కుర్చీ మడతెట్టేశాడు'! -
డబ్బు సంచులు తెచ్చినోళ్ళు ముందుకు రండి!
సీనియర్లు పక్కకు వెళ్ళిపోండి.. డబ్బు సంచులు తెచ్చినోళ్ళు ముందుకు రండి. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న రాజకీయం ఇదే. ఎన్నికలు ముంచుకొస్తుండటంతో చంద్రబాబు వక్రబుద్ధి మరోసారి బయటపెట్టుకుంటున్నారు. జిల్లా ఏదైనా, నియోజకవర్గం ఏదైనా డబ్బుతో వచ్చేవారికే టిక్కెట్ అని తేల్చి చెప్పేస్తున్నారు. పార్టీ పుట్టినప్పటినుంచీ ఉన్నవారిని, వారి వారసుల్ని కాదని కొత్తవారి కోసం వెతుకుతున్నారు. దీంతో ఉత్తరాంధ్రలోని ఓ జిల్లా సీనియర్లంతా చంద్రబాబుపై మండిపడుతున్నారు. ఆ జిల్లా ఏదో.. ఆ నేతలెవరో చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో పచ్చ జెండా ఎగురుతోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం తర్వాత ఫ్యాన్ స్పీడ్‌కు సైకిల్ అడ్రస్ గల్లంతయింది. జిల్లాలోని కొన్ని రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు టీడీపీ పుట్టినప్పటినుంచి ఆ పార్టీ జెండాను మోసాయి. మూడు కుటుంబాలు టీడీపీలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వెలిగారు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా వెనకబడ్డాయి. దీంతో సీనియర్ నేతల కుటుంబాలకు ఈసారి టిక్కెట్లు ఇచ్చేది లేదని పచ్చ పార్టీ బాస్ చంద్రబాబు తెగేసి చెబుతున్నారు. డబ్బు గుమ్మరించే వారిని తీసుకురండి అని చెబుతున్నారు. అటువంటి వారు కనిపిస్తే వారికే టిక్కెట్ అని హామీలిచ్చేస్తున్నారు. ఆక్..పాక్..కరివేపాక్..అంటూ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుతో సీనియర్ నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్.కోట నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత కోళ్ల అప్పలనాయుడు కోడలు లలితకుమారికి ఈసారి టిక్కెట్ లేదని చెప్పేశారు. టీడీపీ ఏర్పడకముందు ఇండిపెండెంట్‌గా గెలిచిన కోళ్ల అప్పలనాయుడు టీడీపీ వచ్చాక ఆ పార్టీ తరపున 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తర్వాత అప్పలనాయుడు కోడలు లలిత కుమారి రెండు సార్లు టిడిపి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎస్.కోట టీడీపీలో ఈ కుటుంబానిది తిరుగులేని నాయకత్వం. కానీ ఈ ఎన్నికల్లో లలిత కుమారికి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవలే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన NRI పారిశ్రామిక వేత్త గొంప కృష్ణకు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయ నేపధ్యం లేకపోయినా బాగా డబ్బున్న వ్యక్తి కావడం అనే కారణంతో కోళ్ల కుటుంబాన్ని పక్కన పెట్టి గొంప కృష్ణకు ఎస్.కోట టికెట్ ఇవ్వబోతున్నారనే చర్చ పార్టీలో సాగుతోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో పతివాడ నారాయణస్వామి 7 సార్లు టిడిపి తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఈయన అనుభవం అపారం. అయితే వృద్దాప్యం కారణంగా వారసులుకి అవకాశం కల్పించాలని ఆయన చంద్రబాబును కోరారు. కానీ ధనికులకే టికెట్ అనే కాన్సెప్ట్ తీసుకువచ్చిన చంద్రబాబు.. పతివాడ నారాయణస్వామి కుటుంబం విన్నపాన్ని విస్మరించారు. ఎయిర్పోర్ట్ వస్తున్న భోగాపురం పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా సంపాదించిన కర్రోతు బంగార్రాజుకు నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా ఇంజనీరింగ్ కాలేజీలు, సాఫ్ట్వేర్ కంపెనీల యజమాని అయిన లోకం మాధవి జనసేన తరపున టికెట్ రేసులోకి వచ్చారు. బంగార్రాజు కంటే ఈమె దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయని తెలియడంతో నెల్లిమర్ల సీటును టీడీపీ తరపున లోకం మాధవికి ఇస్తామని హింట్ ఇచ్చారు. దీంతో రియల్టర్ బంగార్రాజు ఖంగు తిన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో బొబ్బిలి చిరంజీవి మాస్టర్ టిడిపి తరపున మూడు సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయనను పక్కన పెడతారనే ప్రచారం సాగుతోంది. బోనెల విజయచంద్ర అనే వ్యాపారవేత్తను పార్వతీపురం రాజకీయ తెరమీదకు తీసుకుచ్చారు. ఇది ఎస్సీ నియోజకవర్గం అయినా చంద్రబాబు విడిచి పెట్టలేదు. డబ్బు బాగా ఖర్చు పెట్టగలవారికే టికెట్ అని తేల్చి చెప్పేశారు. విజయచంద్రకు రాజకీయ నేపధ్యం లేకపోయినా పార్వతీపురం టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని నియోజకవర్గం టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. బలమైన కేడర్, పార్టీతో లాంగ్ జర్నీ, ఆపద కాలంలో పార్టీని నిలబెట్టారు అనే సెంటిమెంట్, ఎమోషన్ ఏ మాత్రం లేకుండా డబ్బున్నోడు కనబడగానే సీనియర్లను పూచిక పుల్లల్లా తీసి పక్కన పడేస్తున్నారు పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు. చంద్రబాబు నైజం తెలుసుకుంటున్న జిల్లా సీనియర్లు ఆయనపై మండిపడుతున్నారు. -
అగ్నికి ఆజ్యంపోస్తున్న జనసేన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గిరిజన ముద్దుబిడ్డ పీడిక రాజన్నదొర కష్టం, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో సాలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకో టగా మారింది. నాలుగు దఫాలుగా తిరుగులేని విజయాలతో రాజన్నదొర సాలూరును తన అడ్డాగా మార్చుకున్నారు. మళ్లీ అక్కడ ఎలాగైనా టీడీపీ ఉనికి చాటుకోవడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏకంగా రాజన్నదొరపై పసలేని ఆరోపణలను ఇటీవల అరకు సభలో సంధించినా గిరిజనం నుంచి పెద్దగా స్పందన లేదు. గాలిలో దీపం మాదిరిగా పరిస్థితి తారుమారు అయినా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మాత్రం తారస్థాయిలోనే జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పొత్తులో భాగంగా జతకట్టిన జనసేన నాయకులు ఇప్పుడు ఆ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. శంబర జాతర సందర్భంగా సాలూరు, మక్కువ మండలాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఆ కుమ్ములాటకు అద్దంపట్టాయి. ‘వీళ్లు మారరురా’ అంటూ టీడీపీ కార్యకర్తలే నొచ్చుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆర్పీ భంజ్‌దేవ్, గుమ్మడి సంధ్యారాణి వర్గాల మధ్య అంతర్గత కుమ్ములాటల పంచాయితీ సాక్షా త్తూ చంద్రబాబు సమక్షంలోనే జరిగినా క్షేత్రస్థాయిలో ఏమీ మార్పు కనిపించట్లేదు. తమను టార్గెట్ చేసుకొని సంధ్యారాణి అనుచరులు పనిచేస్తున్నారని, పార్టీలో కలుపుకెళ్లే ప్రయత్నాలేవీ చేయట్లేదని భంజ్‌దేవ్ వర్గీయులు గళమెత్తుతున్నారు. వెనుకే ఉంటూ మోసం చేసే నాయకులను ముందుగానే దూరంపెట్టే పని సంధ్యారాణి చేస్తున్నారని ఆమె వర్గీయులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు, లేఖలతో మొదలైన యుద్ధం పోలీసు స్టేషన్లలో ఫిర్యాదుల వరకూ వెళ్లింది. ఇది ఇప్పుడు ఫ్లెక్సీల యుద్ధంతో తారస్థాయికి చేరింది. సంధ్యారాణి తీరుతో విసిగిపోయామని, ఆమెకు టికెట్ ఇస్తే ఏమాత్రం సహకరించబోమని భంజ్‌దేవ్ వర్గీయులు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. తెరపైకి తేజోవతి... సాలూరు టీడీపీ టికెట్ తనదేనని గుమ్మడి సంధ్యారాణి ధీమాగా చెబుతున్నప్పటికీ చంద్రబాబు ఇంకా స్పష్టంగా చెప్పకపోవడంతో ఆమె వర్గీయుల్లో సందేహం నెలకుంది. దీనికితోడు తేజోవతి రంగప్రవేశంతో ఇది మరింత పెరిగింది. ఇటీవల నూతన సంవత్సర వేడుకల్లో ఆమె భంజ్‌దేవ్ ఇంటి వద్ద ప్రత్యక్షమవ్వడం సంధ్యారాణి వర్గీయులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ పరిస్థితితో భంజ్‌దేవ్ వర్గీయులు నిరాశ వదిలేసి కొత్త ఉత్సాహంతో పార్టీలో క్రియాశీలకమయ్యారు. తేజోవతి సాలూరు గడ్డపై కాలుపెట్టడం వెనుక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చన్నాయుడి ప్రోత్సాహం ఉందని, ఆమెకు బొబ్బిలి నాయకుడు బేబీనాయన ఆశీస్సులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల బొబ్బిలిలో జరిగిన సభలోనే ఆమెకు టీడీపీ కండువా వేసి చంద్రబాబు పార్టీలోకి చేర్చుకోవడం వారి వాదనలకు బలం చేకూరుస్తోంది. అగ్నికి ఆజ్యంపోస్తున్న జనసేన తేజోవతికి మద్దతుగా ఉన్న భంజ్‌దేవ్ వర్గీయులను టార్గెట్ చేస్తూ ఇన్నాళ్లూ సంధ్యారాణి వర్గీయులు చేసినదాన్ని కన్నా అంతకుమించి జనసేన నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో సంధ్యారాణి, భంజ్‌దేవ్ వర్గాల మధ్య అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. తనను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టుచేసిన జనసేన కార్యకర్త త్రిపురనేని విజయ్ చౌదరిపై సాలూరు టౌన్ పోలీసుస్టేషన్లో భంజ్‌దేవ్ ఫిర్యాదు చేశారు. ఇలాంటి కేసులకు తాను భయపడనని సదరు జనసేన కార్యకర్త మరో వీడియో పోస్టు చేయడం గమనార్హం. ఫ్లెక్సీలతో యుద్ధం శంబర జాతర సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ సాలూరు, మామిడిపల్లి, శంబర ప్రాంతాల్లో తేజోవతి వర్గీయులు ఫ్లెక్సీలను పెట్టించారు. ఆ ఫ్లెక్సీల్లో తేజోవతి ముఖాన్ని ఎవరో చింపేశారు. కొన్నిచోట్ల ముఖం కనపడకుండా ఆమె ఫొటోపై సంధ్యారాణి ఫొటోలను అతికించారు. మరోవైపు శంబరలో పెట్టిన ఫ్లెక్సీలో సంధ్యారాణి ముఖం కనిపించకుండా పసుపు రాసేశారు. గెలిచే అవకాశం లేనిచోట నాయకుల కొట్లాటను చూసి జనం నవ్వుకుంటున్నారు. -
టీడీపీలో తమ్ముళ్ల కుమ్ములాట
సాక్షి, పార్వతిపురం మన్యం: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు బహిర్గతమవుతున్నాయి. తాజాగా సాలూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటకు దిగారు. ఫ్లెక్సీలు చించుకోవటంతో టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సాలూరు టౌన్లో సాలూరు మండలం మామిడిపల్లి గ్రామం ఇందుకు వేదికైంది. స్థానిక శంబర జాతరకు సందర్భంగా టీడీపీ నేత తేజోవతి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిని తెలుగుదేశంలోని కొందరు నేతలు చించేయడంతోపాటు మరోనేత సంధ్యారాణి ఫ్లెక్సీలు అతికించారు. దీంతో మామిడిపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రజలు ఆ ఫ్లెక్సీలను చూసి టీడీపీ రోజురోజుకు దిగజారిపోయిందని అనుకుంటున్నారు. టీడీపీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఫోటోలను ఒకరి వర్గం ఒకరు చించుకున్నారు. వాటి స్థానంలో తమ నాయకురాలు ఫొటో పెట్టిన నేపథ్యంలో టీడీపీలో వర్గ విభేదాలపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. దీనిపై స్థానికంగా పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. చదవండి: AP: ESMSపై కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమం -
సీనియర్లకు టీడీపీ అధినేత ఝలక్
అవసరానికి వాడుకోవడం.. అవసరం తీరాక మోహంచాటేయడం.. మాట విననివారికి వెన్నుపోటు పొడవడం వంటివి చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య!. ఓటర్లు, నాయకులు, సొంత బంధువులపైనా ఆయనది అదే ధోరణి!. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార దాహంతో రగిలిపోతున్నారు. దీనికోసం పార్టీకి దశాబ్దాల తరబడి సేవలందించిన సీనియర్ నాయకులను కాదని డబ్బున్నోళ్లకే సీట్లు కేటాయించేందుకు రెడీ అవుతుండడంతో ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేగుతోంది. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును కొన్ని వర్గాలవారు బహిరంగంగానే విమర్శిస్తుండగా, మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: వారంతా ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు... సుదీర్ఘ కాలంగా తెలుగుదేశంపార్టీలో విశేషమైన సేవలు అందించినవారు... అందులోనూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా! టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఆ పార్టీను, అధినేత చంద్రబాబును నమ్ముకునే ఇన్నాళ్లూ ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యం చెందినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబును ప్రజలు ఛీదరించుకున్నప్పటికీ ఆయన వెన్నంటే ఉంటూ నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చారు. తీరా 2014 ఎన్ని కలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నో దశాబ్దాలుగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వారి కష్టాన్ని గుర్తించకుండా వారి దగ్గర డబ్బు సంచులు లేవనే నెపంతో ఇప్పుడు వారిని పక్కనపెట్టేసి కోట్లకు పడగలెత్తిన ప్రవాస భారతీయులను, పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు నాయకులు ఎవరైనా సరే అవసరానికి వాడుకొని కరివేపాకులా పక్కనపడేస్తారన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది. బీసీ జపం చేసే చంద్రబాబు ఆచరణలోకి వచ్చేసరికి గెలుపుగుర్రాల పేరుతో ధనబలం ఉన్న వారివైపే మొగ్గు చూపిస్తున్నారని జిల్లాలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరి నాయకత్వానికి తిలోదకాలు! ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఎస్.కోట, నెల్లిమర్ల, పార్వతీపురం నియోజకవర్గాల్లో టీడీపీ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే నాయకులు కోళ్ల అప్పలనాయుడి కోడలు కోళ్ల లలితకుమారి, పతివాడ నారాయణస్వామినాయుడు, బొబ్బిలి చిరంజీవులు. ఈ ముగ్గురు నాయకులు టీడీపీలో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్నావారే. కానీ ప్రస్తుతం వారి ముగ్గురి పరిస్థితి త్రిశంకుస్వర్గంలా మారింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్ దక్కే అవకాశాలు దాదాపుగా లేవనే చర్చలు సాగుతున్నాయి. ఆ ముగ్గురు సీనియర్ నాయకులు జిల్లాలోని ప్రధాన సామాజిక వర్గాలైన కొప్పలవెలమ, తూర్పుకాపు, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం. 45 ఏళ్ల సీనియార్టీకి చిక్కులు ఎస్.కోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుటుంబానికి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. ఆమె మామ కోళ్ల అప్పలనాయులు ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అందులో ఆరు సార్లు టీడీపీ నుంచే కావడం గమనార్హం. ఒకసారి మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన కోడలు లలిత కుమారి రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఐదేళ్లూ ప్రతిపక్షంలో సైతం టీడీపీ అండగా ఉన్నారు. అయితే, ఆమె దగ్గర ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి రూ.కోట్లలో డబ్బులు లేవని, ఉన్నా ఖర్చు చేయరనే ఒకేఒక్క సందేహంతో చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఆమెను పక్కనపెట్టేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలే రాజకీయ తెరంగేట్రం చేసిన ప్రవాస భారతీయుడు గొంప కృష్ణకు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడం అందుకు ఊతమిస్తోంది. వేపాడ మండలానికి చెందిన ఆయనకు రాజకీయ నేపథ్యం లేకున్నా డబ్బులు బాగానే ఉన్నాయని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. పార్టీలో తనకు జరిగిన అవమానంపై లలితకుమారి కొన్నాళ్లుగా అగ్గి మీద గుగ్గిలం మాదిరిగా రగిలిపోయినా చంద్రబాబు ఏమి మంత్రం వేశారో కానీ తర్వాత చల్లబడిపోయారు. లోకేశ్‌తో డీల్... చిరంజీవులుకు ఎసరు! పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టిక్కెట్ బోనెల విజయచంద్రకేనని చంద్రబాబు విస్పష్టంగా చెప్పేశారు. ప్రవాస భారతీయుడైన ఆయనకు ఏమాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా కేవలం ధనబలం ఉందన్న కారణంతోనే టిక్కెట్ ఇస్తున్నారనే విమర్శలు ఆ పార్టీలోనే వస్తున్నాయి. నేరుగా నారా లోకేశ్‌తో డీల్ కుదుర్చుకొని వచ్చి ఇంతవరకు ఆ పార్టీ బాధ్యతలు చూసుకున్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు టిక్కెట్‌కు ఎసరు పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పతివాడకు తీవ్ర పరాభవం... నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ వింత ఆచారానికి తెరతీసింది. నలభై సంవత్సరాలుగా టీడీపీలో ఎనలేని సేవలు అందిస్తూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపొందిన పతివాడ నారాయణస్వామినాయుడిది ఒక రికార్డు. ప్రోటెం స్పీకర్‌గా, చక్కెర, వాణిజ్యశాఖా మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం ఆయనను, ఆయన వారసులను కనీసం పట్టించుకోవడం లేదు. వారిని పక్కనబెట్టి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కర్రోతు బంగార్రాజును ఏడాది కిందట టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా చంద్రబాబు నియమించారు. కానీ ఇప్పుడు టీడీపీ–జనసేన పొత్తులో భాగంగా నెల్లిమర్ల టీడీపీ టిక్కెట్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవికి కేటాయించడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో బంగార్రాజు వర్గం కంగుతింది. విజయనగరానికి చెందిన ఆమె, ఆమె భర్త మిరాకిల్ ఇంజినీరింగ్ కాలేజీ, మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలకు అధిపతులు. కోట్లాది రూపాయల సంపద ఉన్న వారి ముందు పతివాడ 40 ఏళ్ల అనుభవం, కర్రోతు బంగార్రాజు సామాజిక బలం చంద్రబాబుకు కనిపించకుండాపోయాయనే చర్చ సాగుతోంది. ఎక్కువ కాలం విదేశాల్లోనే ఉన్న మాధవి జనసేన పార్టీ తరఫున నెల్లిమర్ల టిక్కెట్ తనకే వస్తుందన్న ధీమాలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోవైపు గంటా శ్రీనివాసరావు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఐదేళ్లకోసారి నియోజకవర్గం మార్చేసే ఆయన ఈసారి నెల్లిమర్ల నుంచి టీడీపీ టిక్కెట్‌తో బరిలోకి దిగుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. ధన బలం ఉన్న లోకం మాధవి, గంటా శ్రీనివాసరావుల పేరు తప్ప పతివాడ కుటుంబం పేరు ఎక్కడా టీడీపీ–జనసేనలో వినిపించలేదు. కనిపించట్లేదు! -
సంబరంలా పార్వతీపురం సాధికార యాత్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం/ పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన సామాజిక సాధికార యాత్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన సాధికారతకు సూచికగా ఓ సంబరంలా సాగింది. జిల్లాలోని సీతానగరం మండలం లచ్చయ్యపేటలో ఆరంభమైన బస్సు యాత్ర పార్వతీపురం పట్టణంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రవేశించింది. మోటారు బైకు ర్యాలీతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు యాత్రలో పాల్గొన్నారు. మహిళల కోలాటం, తప్పిటగుళ్ల కళాకారుల ప్రదర్శనలు, తీన్మార్ వాయిద్యాల నడుమ యాత్ర ముందుకు సాగింది. జై జగన్ నినాదాలతో పార్వతీపురం పట్టణం హోరెత్తింది. పార్వతీపురం బస్టాండ్ వద్ద జరిగిన సభలో రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటాపాట అందరినీ అలరించింది. సభకు తరలివచ్చిన జనంతో పార్వతీపురం పట్టణంలోని అంతర్రాష్ట్ర రహదారి కిక్కిరిసిపోయింది. ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు మంత్రులు, నేతలు ప్రసంగించారు. రాజ్యాంగం ఆశయాలు ఇన్నాళ్లకు సాకారమయ్యాయి: మంత్రి ధర్మాన భారత రాజ్యాంగ ఆశయాలను స్వాతంత్య్రం వచ్చి న ఇన్నాళ్లకు దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ సాకారం చేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. సామాజిక సాధికార సభలో ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రకారం అర్హత ప్రాతిపదికన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నారన్నారు. దీనివల్ల పేదవారు సైతం పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవడానికి, ఉచిత వైద్యం పొందడానికి, సొంత ఇంటిలో ఉండటానికి, స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం లభించిందన్నారు. ధనిక వర్గాలకే పరిమితమైన ఆంగ్ల విద్యను అందరికీ అందిస్తున్న ఘనత సీఎం జగన్‌దేనని చెప్పారు. జగన్‌తోనే బడుగులకు మేలు: మంత్రి రాజన్నదొర రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్‌తోనే మేలు జరిగిందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. ఎస్సీల కోసం టీడీపీ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తే, సీఎం జగన్ రూ.61 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. పోడు, బంజరు భూములను గిరిజనులకు పంపిణీ చేసిన ఘనత జగన్‌దేనన్నారు. దశాబ్దాల సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఈ ప్రాంతంలో దశాబ్దాల కాలంనాటి సమస్యలను సీఎం జగన్ ప్రత్యక శ్రద్ధతో పరిష్కరిస్తున్నారని ఎమ్మెల్యే అలజంగి జోగారావు చెప్పారు. అరి్టకల్ 11, 17, 1 5(సి)ని పూర్తిగా అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ రిజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన్నఅప్పలనాయుడు, కంబాల జోగులు, పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పార్టీ విజయనగరం, పారీ్వతీపురం మన్యం జిల్లాల అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, నవరత్నాల కమిటీ ఉపాధ్యక్షుడు నారాయణమూర్తి పాల్గొన్నారు. -
పార్వతీపురం టీడీపీలో కల్లోలం
తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరింత తీవ్రమయ్యాయి. ఇటీవల ప్రాజెక్టుల పరిశీలన పేరిట ఈ ప్రాంతానికి వచ్చిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన తరువాత ఇవి మరింత ముదిరి పాకాన పడ్డాయి. చివరకు ఎక్కడ వరకు వెళ్లాయంటే...పార్వతీపురం ఇన్చార్జిగా విజయచంద్ర నియామకంపై ఆ పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఈ నియామకంతో పార్టీ మరింత పతనం కావడం ఖాయమని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతుండడం విశేషం. పార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మూడు ముక్కలాట కొనసాగుతుంది. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జిగా బోనెల విజయచంద్రను అధిష్టానం నియమించింది. ఈయనకు అండగా ఉండాలన్న విషయం స్వయానా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్వతీపురంలో ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో చెప్పినా ఆయనను వ్యతిరేకించే వర్గాలు మూడు ఏర్పడ్డాయని నియోజకవర్గం అంతా గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానిక తెలుగుదేశం పార్టీ పరిస్థితి, కష్ట కాలంలో పార్టీని గుప్పిట్లో పెట్టుకుని కేడర్ చేజారిపోకుండా చుట్టూ రక్షణ కవచంలా కాపాడిన నాయకులను పక్కనపెట్టి, ఇప్పుడు తెలియని అభ్యర్థిని తెచ్చి ఇతనే మొనగాడు అంటే తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అధినేత మాటను ధిక్కరించలేక తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. విశాఖలో ఉంటూ ఎప్పుడు పార్వతీపురం ముఖం చూడని ఎవరికీ తెలియని బోనెల విజయచంద్రను పార్టీ ఇన్చార్జిగా నియమించడంపై పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందేమోనన్న ఆందోళన క్యాడర్లో స్పష్టంగా కనిపిస్తుంది. బోనెలపైనా విమర్శలు మాదిగ జాతి ముసుగులో మా జాతిని మోసం చేసి సంపాదించిన డబ్బులతో రాజ్యాధికారం కోసం బోనెల విజయచంద్ర ఆరాట పడుతున్నాడని ఇన్ఫాం ఇంటర్నేషనల్ అధ్యక్షుడు గెడ్డం బాపిరాజు నాలుగు రోజుల కిందట మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఎన్నో అక్రమాలకు పాల్పడిన విజయచంద్ర చరిత్ర తెలుసుకోకుండా పార్వతీపురం టీడీపీ ఇన్చార్జిగా ఎలా నియమించారని ప్రశ్నించారు. 2014లో ఏర్పడిన ఐఎఫ్ఎం (ఇంటలెక్చువల్ ఫారం ఫర్ మాదిగాస్) అనే సంస్థ మాదిగ జాతి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. 2018లో ఆ సంస్థ చేసిన కార్యక్రమాలు చూసే ఇన్ఫాంలోకి వచ్చిన బోనెల విజయచంద్ర ఈ సంస్థలో ఉన్న కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ మేధావులను పక్కదారి పట్టించారన్నారు. ఇదే సంస్థ పేరు మీద కార్యవర్గ సభ్యులు ఎవరూ లేకుండా వైజాగ్‌లోని గీతం యూనివర్సిటీలో కెనరా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారన్నారు. దేశం టీవీలో విజయచంద్ర డైరెక్టర్‌గా జాయిన్ అయ్యి రూ.నాలుగు కోట్లు వసూలు చేసి సంస్థకి ఇవ్వలేదని, ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియక దేశం టీవీ నడుపుతున్న శ్రీనివాసరావు చనిపోయారన్నారు. నలుగురితో కలిసి ఉండని బోనెల విజయచంద్రకు టీడీపీ ఇన్చార్జిగా ఎలా నియమించిందో అర్థం కావడం లేదని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఇప్పటికే బలిజిపేట, సీతానగరం మండలాల్లో కొత్త ఇన్చార్జిలపై తీవ్ర అసంతృపి్త్ వ్యక్తం అవుతుంది. పార్వతీపురంలో సైతం పచ్చ జెండాకు రంగు వెలిసిపోతుంది. రెపరెపలాడుతున్న పచ్చజెండాలు ఇవన్నీ ఒక్కసారి మూగబోయాయి. అసలే పార్టీ సరిగా లేని పరిస్థితుల్లో కొత్త ఇన్చార్జి నియామకంతో చేజేతులా పార్టీ నాశనం అవుతుందన్న భయం కార్యకర్తలకు పట్టుకుంది. అధినేతపై సొంత పార్టీ వారే బహిరంగ విమర్శలు తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పార్టీకి భవిష్యత్తు ఉండదన్నారు ఆ పార్టీ అరుకు పార్లమెంటరీ ఎస్సీ అధికార ప్రతినిది గర్భాపు ఉదయభాను. ఆయన చంద్రబాబుపై బహిరంగ విమర్శలు చేశారు. పార్టీ కోసం గత ఐదు సంవత్సరాలుగా పని చేస్తూ పార్టీ ఉనికి చాటుతూ పార్టీ కోసం శ్రమిస్తూ అన్ని విధాలా పని చేస్తున్నప్పటికీ మాలాంటి నాయకులకు గౌరవం దక్కడం లేదన్నారు. ఇటీవల ఏ సర్వే ప్రకారం పార్వతీపురం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిని నియమించావు.. సర్వేలో అన్నింటిలో కూడా నేను ముందంజలో ఉంటుండగా ఆ సర్వేలను కాదని ఏ లాలూచీతో విజయచంద్రను నియమించావని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయిన రోజుల్లో 2019లో పార్టీని ఎవరూ పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినపుడు నేను మీ వెనుక ఉన్నానని భరోసా కల్పిస్తూ సర్పంచ్ అభ్యర్థులకు, ఎంపీటీసీ అభ్యర్థులకు నాకు చేతనైన ఆర్థిక సాయాన్ని చేసి నేనున్నానంటూ భరోసా కల్పించానన్నారు. అప్పటి నుంచి ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తే... నాకు కనీసం ఎటువంటి సమాచారం లేకుండా, కనీసం పట్టించుకోకుండా వేరే వ్యక్తిని ఎలా నియమించావని ప్రశ్నించారు. -
సాలూరు బహిరంగ సభలో వైఎస్ జగన్