paster
-
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న పాస్టర్ అరెస్ట్
-
ప్రభుత్వం నిర్ణయంపై మంత్రి అంజాద్ బాషా హర్షం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంపుపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మన రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని తెలిపారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలో అర్చకులు, పాస్టర్లు, మౌజన్లు, ఇమామ్‌లకు గౌరవ స్థానం ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పాస్టర్లకు కూడా వేతనాలు పెంచారని ఆయన తెలిపారు. ‘‘పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం వీరి సమస్యలను పట్టించుకోలేదు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్. ప్రణాళిక ప్రకారం పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం. కరోనా మహమ్మారిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు సైతం మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని’’ మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కరోనా వ్యాక్సిన్ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోదని వివరించారు. ప్రజల్లో అభద్రతా భావం కలిగించేలా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై కేసు నమోదు: సీఐడీ ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి -
వారికి గౌరవ వేతనం పెంచిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేటగిరి-1 అర్చకులకు రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచగా, కేటగిరి-2 అర్చకులకు రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచారు. ఇమామ్‌లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి 10 వేలకు, మౌజంలకు గౌరవ వేతనం రూ.3 వేల నుంచి 5 వేలకు పెంచారు. పాస్టర్లకు రూ.5 వేలు నెలవారీ గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ( చదవండి: ఏపీ: ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో గణనీయ పురోగతి ) -
ఎవరికైనా చెబితే.. నరకానికి పోతావ్!
‘‘ఇక్కడ జరుగుతున్న విషయాన్ని నువ్వు ఎవరికైనా చెబితే నరకానికి పోతావ్’’ అంటూ.. ఆమెకు నిత్యం నరకం చూపించాడు ఆ మతబోధకుడు. అనారోగ్యంతో ఉన్న ఆమెను స్వస్థతపరుస్తాను.. తన వద్దే ఉంచండంటూ.. ఆమె తల్లిదండ్రులను నమ్మబలికిన ఆ కామ పాస్టర్ ఆరు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.చివరికి ఆ పాస్టర్ వికృత చేష్టలకు విసుగుచెందిన ఆ బాలిక ఎట్టకేలకు తల్లిదండ్రులకు చెప్పడం.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పోలీసులు ఆ పాస్టర్‌ను, అతడికి సహకరించిన మహిళను అదుపులోకి తీసుకోవడం వంటి సంఘటనలు కాకినాడ నగరంలో చకచకా జరిగిపోయాయి. తూర్పుగోదావరి, కాకినాడ రూరల్: నగరంలోని పర్లోవపేటకు చెందిన 15 ఏళ్ల బాలికపై హౌస్ ఆఫ్ సాల్వేషన్ పేరుతో చర్చి నడుపుతున్న 54 ఏళ్ల పాస్టర్ తాతపూడి జాషువా నిహార్ ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరునెలలుగా అత్యాచారం చర్చికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను నేర్పిస్తానంటూ పర్లోవపేట నుంచి బాలికను రామారావుపేటలోను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఈ కార్యక్రమం దాదాపు ఆరు నెలలుగా జరుగుతోందని బాలిక తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. ‘‘ఎవరికైనా చెబితే నువ్వు నాశనమై నరకానికి పోతావంటూ’’ పాస్టర్ బాలికను బెదిరించి తరచూ అత్యాచారానికి పాల్పడేవాడని బాలిక పోలీసులకు వివరించింది. దీనిపై పోలీసులు పాస్టర్ తాతపూడి జాషువా నిహార్‌పై పోక్సో యాక్ట్, కిడ్నాప్, రేప్ కేసులు నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్టు టూటౌన్ సీఐ ఉమర్ తెలిపారు. ఈ కేసును డీఎస్పీ రవివర్మ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా చర్చి పాస్టర్కు, బాలిక తండ్రికి మధ్య నెలరోజులుగా గొడవలు జరుగుతున్నాయని, చర్చి జరుగుతున్న సమయంలో పాస్టర్‌పై బాలిక తండ్రి దాడికి యత్నించగా కొందరు విశ్వాసులు అడ్డుకున్నారని స్థానికులు చెబుతున్నారు. తనపై చర్చి పాస్టర్‌తో పాటు మరికొందరు కావాలని కక్షపూరితంగా దాడి చేసి గాయపరిచారని, దీంతో తాను జూలై 21న పోర్టు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానని బాలిక తండ్రి వివరిస్తున్నారు. ఏడాదిగా జాషువా నిహార్ చర్చికి వెళుతున్నామని, అతడు పిల్లలను ఆసరాగా చేసుకొని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్నారు. పాస్టర్, ఓ మహిళ అరెస్టు బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న జాషువా నిహార్‌ను అతనికి సహకరిస్తున్న ఓ మహిళను కూడా టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ రవివర్మ ఆదివారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. బాలిక అనారోగ్యంగా ఉండడంతో ఆమె తల్లి ప్రార్థనా మందిరానికి తీసుకు వచ్చేదని, తొందరగా కోలుకునేందుకు అవసరమైన ప్రార్థనలు చేస్తానని పాస్టర్ జాషువా నిహార్ బాలిక తల్లిని నమ్మబలకడంతో ఆమె బాలికను పాస్టర్ ఇంటికి సువార్త కోసం పంపేదని వివరించారు. ఇదే అదనుగా పాస్టర్ నిహార్ బాలికపై అత్యాచారం చేసేవాడన్నారు. ఈనెల ఏడోతేదీన బాలిక తనపై జరుగుతున్న అత్యాచారాన్ని బయట పెట్టిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి పాస్టర్‌ను అరెస్టు చేశామన్నారు. బాలికను తీసుకెళ్లేందుకు ఉపయోగించిన కారును కూడా సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ సంఘటనలో పాస్టర్కు సహకరించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిపై చర్యలు చేపడతామని డీఎస్పీ రవివర్మ స్పష్టం చేశారు. -
స్వచ్చంద సంస్థలో బాలికలపై లైంగిక వేదింపులు
-
పాస్టర్ హత్యకేసులో ఉత్కంఠ!
తెనాలిరూరల్: ఇటీవల హత్యకు గురైన తెనాలి మండలం కొలకలూరుకు చెందిన దళిత పాస్టర్ ఉన్నం సుబ్బారావు అలియాస్ దానియేలు హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పాస్టర్‌ది అనుమానాస్పద మృతిగా పోలీసులు తొలుత భావించారు. గ్రామస్థులు హత్యే అని అనుమానాలు వ్యక్తం చేయడం, పాస్టర్ పోలీసులకు చెప్పుకున్నట్టు ఆయన బ్యాంకు అకౌంట్ల నుంచి సుమారు ఐదు లక్షల వరకు సొమ్ము డ్రా చేసి ఉండడంతో హత్య చేసి ఉంటారని నిర్థారించుకున్నారు. గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ భర్త ఆరుబాక రాజేష్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కోవడంతో కేసు దర్యాప్తుపై ఆది నుంచి అనుమానాలు వ్యక్తమవుతుండడం, దర్యాప్తు అధికారిని సైతం మార్చమని డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. కొలకలూరు గ్రామ దళితవాడలో తీవ్ర సంచలనం రేకెత్తించిన పాస్టర్ హత్య ఏప్రిల్ 24వ తేదీన జరుగగా, మే ఒకటో తేదీ వరకు నిందితులు బహిరంగంగా తిరుగుతూనే వచ్చారు. ఏప్రిల్ 30వ తేదీన తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్‌కు రాజేష్, మరో అనుమానితుడు నాని తమ తమ కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి, అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారంటూ వినతిపత్రం అందజేశారు. దీనిపై పోలీసుల కు ఉన్నత స్థాయి అధికారుల నుంచి మందలింపులు రావడంతో, స్పందించి చర్యలు ప్రారంభించారు. అదే రోజు అర్ధరాత్రి దాటాక రాజేష్‌తో పాటు సుద్దపల్లి పృద్వీ, కొలకలూరు నానిలను అదుపులోకి తీసుకున్నారు. రాజేష్‌కు సన్నిహితుడిగా పేరొందిన గ్రామానికి చెందిన ఉన్నం జాన్‌బాబును బుధవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అలాగే జాన్‌బాబు కుమారుడు గోపి, మరో యువకుడు పి. పవన్‌కుమార్‌లను గురువారం అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాస్టర్ హత్య కేసులో పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల సంఖ్య ఆరుకు చేరింది. హత్యలో జాన్‌బాబు పాత్ర ఉండి ఉంటుందన్న అనుమానాలు హత్య జరిగిన రోజు కొందరు గ్రామస్థులు పోలీసుల వద్ద వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన అనంతరం జాన్‌బాబును అదుపులోకి తీసుకున్నారు. పాస్టర్ సుబ్బారావు ఇంటి వెనుక ఇంట్లో నివసించే కొలకలూరి దయాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పాస్టర్ మృతదేహాన్ని తొలుత తామే గుర్తించామని దయాకర కుటుంబ సభ్యులు హత్య జరిగిన రోజు పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత దయాకర్ తండ్రి ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్సపొంది బుధవారమే డిశ్చార్జి అయ్యారు. దయాకర్‌కు హత్యకు సంబంధించి కీలక సమాచారం తెలిసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
మావోయిస్టుల చేతిలో పాస్టర్ హతం
చింతూరు: పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నారంటూ ఓ చర్చి పాస్టర్‌ను మావోయిస్టులు శుక్రవారం అర్థరాత్రి హతమార్చారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం లచ్చిగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని చర్చిలో పాస్టర్‌గా వ్యవహరిస్తున్న వుయికా మారయ్య(35) పదహారేళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ నుంచి వలసవచ్చి చింతూరు మండలంలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం అర్థరాత్రి సాయుధ మావోయిస్టులు లచ్చిగూడెంలోని తన ఇంటికి వెళ్లి నిద్రపోతున్న తన భర్తను లేపి చేతులు వెనక్కి కట్టేసి కర్రలతో తీవ్రంగా కొట్టారని మృతుడి భార్య మంగమ్మ తెలిపింది. తనతోపాటు గ్రామస్తులు ఎంత అడ్డుపడినా తమను పక్కకు నెట్టేసి తన భర్తను వారివెంట గ్రామం పొలిమేర్ల వరకు తీసుకువెళ్లి గొంతుకోసి హతమార్చి మృతదేహాన్ని రహదారిపై పడేశారని ఆమె రోదిస్తూ చెప్పారు. ఇంటి ఆవరణలో ఉన్న ద్విచక్ర వాహనాన్ని కూడా మావోయిస్టులు తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు. ఇన్ఫార్మర్గా ఉన్నందునే... పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తుండడంతో మారయ్యను పలుమార్లు హెచ్చరించినా పధ్థతి మార్చుకోలేదని, అందుకే ప్రజాకోర్టులో అతన్ని శిక్షించినట్లు సంఘటనా స్థలంలో మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో విడిడిపెట్టి వెళ్లిన లేఖలో ప్రస్తావించారు. చింతూరు మండలానికి చెందిన మరి కొంతమంది పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, వారు తమ పధ్థతి మార్చుకోకపోతే ఇదే గతి పడుతుందని ఆ లేఖలో హెచ్చరించారు. హత్య చేసిన అనంతరం వంకగూడెం గ్రామానికి చెందిన కణితి రాజు అనే గిరిజనుడిని మావోయిస్టులు తమవెంట తీసుకెళ్లి అనంతరం విడిచిపెట్టారు. ఉనికిని చాటుకునేందుకే... మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని, వారికి తగిన గుణపాఠం చెబుతామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ చింతూరులో విలేకర్లకు తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి అమర వీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో మారయ్యను హతమార్చడం తూర్పు ఏజన్సీలో కలకలం రేగింది. వారోత్సవాలు ముగిసేలోపు ఎలాంటి ఘటనలకు పాల్పడుతారోనని ఆదివాసీ గూడేల్లో ఆందోళన నెలకొంది. -
పోలీసుల అదుపులో కీచక మత ప్రబోధకుడు
విజయనగరం: మహిళలను మోసం చేసిన కేసులో మత ప్రబోధకుడు దయాసాగర్ ను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. దయాసాగర్ ని కొత్తవలసలో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుని పై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని డీఎస్పీ శ్రీనివాస్ చెప్పారు . ఇప్పటి వరకు రెండు కేసులు నమోదు చేశామని, ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా తమను సంప్రదించవచ్చని డీఎస్పీ అన్నారు. -
చికిత్స పొందుతూ పాస్టర్ సంజీవులు మృతి